Thursday, 30 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

యుద్ధ ప్రాతిపదికన రోడ్లు పూర్తి చేయాలివి.ఎం.ఆర్.డి.ఎ. సమీక్షలో గంటా సూచన

భీమిలి నియోజకవర్గంలో వి.ఎం.ఆర్.డి.ఎ. రోడ్ల పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. వి.ఎం.ఆర్.డి.ఎ. చైర్మన్ ప్రణవ్ గోపాల్, సీయూపీ శిల్ప లతో గురువారం సమావేశమైన ఆయన రూ. 170 కోట్ల అంచనాతో మొదలుపెట్టిన 7 రోడ్లను భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తయ్యే నాటికి సిద్ధం చేయాలని చెప్పారు. తంగుడుబిల్లి హౌసింగ్ ప్రాజెక్టు రోడ్ల నాణ్యత లోపం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ప్రాజెక్టు సందర్శించినప్పుడు ఏడాది కూడా పూర్తి కాకుండానే రోడ్లు దెబ్బ తిన్నాయని గుర్తించినట్టు తెలిపారు. దీనిపై ప్రణవ్ స్పందిస్తూ వాటిని స్వయంగా సందర్శిస్తానని.. ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. అలాగే విశాఖలో ఈట్ స్ట్రీట్.. స్మార్ట్ స్ట్రీట్ వంటి ప్రాజెక్టులను ప్రోత్సహించాలని గంటా సూచించారు. సమావేశంలో గంటా రవితేజ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

జగన్ రెడ్డికి మంత్రి మండిపల్లిని విమర్శించే నైతికత లేదు

-రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య. ఒంటిమిట్ట,అక్టోబర్ 09(పున్నమి ప్రతినిధి ) అవినీతి సామ్రాట్ జగన్ రెడ్డికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని విమర్శించే నైతికత లేదని రాష్ట్ర కల్లుగీత కార్పోరేషన్ మాజీ డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య అన్నారు.గురువారం ఒంటిమిట్ట హరిత హోటల్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ హయాంలో జరిగిన 3500 కోట్ల అవినీతి లిక్కర్ స్కామ్ లో అంతిమ లబ్ధిదారుడు జగన్ రెడ్డి యే అంటూ సిట్ కు ఆధారాలు లభ్యం కావడంతో తనని ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని భయంతో నకిలీ మద్యం సమస్య వైయస్సార్ పార్టీ రాష్ట్రంలో ప్రవేశపెట్టిందన్నారు. 11 సిబిఐ కేసుల్లో ఆరు ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ రెడ్డి గడిచిన 11 సంవత్సరాలుగా బెయిల్ పై ఉంటూ ముఖ్యమంత్రి పదవి కూడా వెలగపెట్టి 3500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ లో అడ్డంగా చుట్టుకుని తనను ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే భయంతో ఈరోజు నిజాయితీపరుడు మంచికి మారుపేరైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పై తప్పుడు ఆరోపణలు చేస్తూ తన బ్లూ మీడియాలో బురదజల్లే ప్రయత్నం జగన్ రెడ్డి చేస్తున్నాడని వెంకట నరసయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 71 రోజుల తదనంతరం బెయిల్ పై మిధున్ రెడ్డి తణుకు కోర్టు క్లీన్ చిట్టి ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నాడని, అంతిమ లబ్ధిదారుడిగా జగన్ రెడ్డి పాత్ర బహిర్గతం అవుతుందని అప్పుడు వీళ్లిద్దరూ రాజమండ్రి సెంట్రల్ జైలు లెక్కపెట్టక తప్పదని ఆయన జోస్యం చెప్పారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కుటుంబాలు గత ఐదు సంవత్సరాల జగన్ రెడ్డి పాలనలో ల్యాండ్, సాండ్ మైన్ ,వైన్, కుంభకోణాలు చేసి అక్రమంగా సంపాదించిన వేల కోట్ల రూపాయలు బహిర్గతం చేయడంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషిస్తున్నారనే అక్కసుతో ఈరోజు మంత్రిపైది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మొలకలచెరువు మద్యం తయారీ కేంద్రం వైయస్సార్ పార్టీ నాయకుల పేరుతో ఉన్న ఆ విషయాన్ని బహిర్గతం చేయకుండా సంబంధంలేని మంత్రి మండిపల్లి పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న జై చంద్ర రెడ్డిని సురేంద్ర నాయుడుని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. జైల్లో ఉన్న చెవిరెడ్డిని గాని బెయిల్ పైనున్న మిథున్ రెడ్డిని కానీ సస్పెండ్ చేసే దమ్ము ధైర్యం జగన్ రెడ్డి కుండా జగన్ రెడ్డి కుందా అంటూ ప్రశ్నించారు. తాము చేస్తున్న అక్రమాలకు అడ్డం వస్తున్నాడని, వెలికితీస్తున్నాడని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పై తీవ్రమైన తప్పుడు ఆరోపణలతో చేస్తూ ప్రచారం చేస్తున్నారని ఇది జగన్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిర్దర్శనమన్నారు. రాయలసీమలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏ నాయకుడు అడ్డుపడినీ విధంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అడ్డుపడుతున్నాడని అతని అడ్డు తొలగించుకోవాలనే ఏకైక లక్ష్యంతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ టార్గెట్గా నీచ రాజకీయాలను వైఎస్ఆర్ పార్టీ ప్రజలకు తీసుకెళ్తుంది అని ఆయన ధ్వజమెత్తడం జరిగింది. వేలకోట్ల కుంభకోణంలో ఇప్పటికే ఇరుక్కుని 17 కేసులు పెట్టించుకున్న జగన్ రెడ్డి మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి ఏమాత్రం లేదని ఈ ఆరోపణ మరక మంత్రి మండిపల్లికి అంటుకోదని ఈ జగన్ రెడ్డి సత్యం గ్రహించాలని ఇకనైనా తప్పుడు ఆరోపణలు మానుకోవాలని ఆయన హితువు పలికారు. ఈ కార్యక్రమంలో మామిళ్ళ ఈశ్వరయ్య,టిడిపి పార్లమెంట్ కార్యనిర్వాహ కార్యదర్శి మోదుగుల నరసింహులు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పామూరు సుబ్రహ్మణ్యం, సింగిల్ విండో మాజీ నందిమండలం సుధాకర్ రాజు, మాజీ ఎంపిటిసి మాబూ సుభాన్, సీనియర్ నాయకులు మామిళ్ళ రామకృష్ణయ్య, రేవిళ్ళ బాలమున్నయ్య, పత్తి కృష్ణయ్య,యువ నాయకుడు వినోద్ రెడ్డి, కృష్ణారెడ్డి రఘునాథ్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, బిసి నాయకుడు మౌలాలి, నడింపల్లి దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి

బక్క చిక్కుతున్న విద్యార్థులు బరువెక్కిన అధికారులు..

– గుడ్డు పరిమాణం ఎంత ఉంటుందో తెలియని అధికారులు – దళారులతో కుమ్మక్కై పౌష్టికాహార బిల్లులు మాయం.. కామారెడ్డి జిల్లాలో ప్రశ్నార్థకమవుతున్న గుడ్డు, పౌష్టికాహారం సరఫరా కామారెడ్డి, 10 అక్టోబర్, పున్నమి ప్రతినిధి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మిడ్ డే మీల్స్ పథకంలో పూర్తి పారదర్శకతను తీసుకు రావడానికి పాఠశాల విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు కేవలం విద్యార్థుల హాజరు డేటాను మాత్రమే యాప్‌లో నమోదు చేస్తుండగా, ఇకపై ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం, రాగి జావ పిండి వంటి సరుకుల వివరాలను కూడా ప్రతీ రోజు విధిగా మిడ్ డే మీల్స్ యాప్‌లో అప్‌డేట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 17 లక్షల మంది పేద విద్యార్థులకు ఈ పథకం ద్వారా భోజ నం అందుతోంది. ఇందులో 8వ తరగతి వరకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండగా, 9, 10 తరగతు లకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోం ది. ఈ నెల నుంచే బిల్లులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయించే ప్రక్రియ ప్రారంభించిన విద్యాశాఖ, తాజాగా సరుకుల విషయంలోనూ ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కొత్త విధానంతో అక్రమాలకు చెక్…. గతంలో ప్రతీ నెలాఖరున మాత్రమే పాఠశాలల్లో నిల్వ ఉన్న బియ్యం వివరాలను హెడ్ మాస్టర్లు లెక్కించేవారు. కొందరు ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు భోజనం చేయకపోయినా లేదా గుడ్డు తినకపోయినా తిన్నట్టుగా లెక్కలు రాసే అక్రమాల కు పాల్పడేవారు.తాజా అప్‌డేట్‌తో ఈ అక్రమాల కు చెక్ పడనుంది. యాప్‌లో ఎంతమంది తిన్నా రు, ఎన్ని కిలోల బియ్యం వాడారు, ఎంతమంది రాగి జావ తీసుకున్నారు, ఎంత పౌడర్ ఉపయో గించారు అనే వివరాలను ఎప్పటికప్పుడు నమో దు చేయాలి.దీని ద్వారా పాఠశాల పాయింట్ల వద్ద బియ్యం, రాగి జావ పిండి ఎంత నిల్వ ఉందనేది ఉన్నతాధికారులకు సులభంగా తెలుస్తుంది. తని ఖీలకు వెళ్లినా లెక్కలు సరిచూడాల్సిన అవసరం లేకుండానే యాప్‌లో డేటా లభ్యమవుతుంది. ఈ ట్రాకింగ్ విధానం వల్ల అక్రమాలు జరిగే అవకాశం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. త్వరలో నే మిడ్ డే మీల్స్ చెల్లింపులను గ్రీన్ ఛానల్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కామారెడ్డిలో ‘మీల్స్’ కష్టాలు: పెండింగ్‌ బిల్లులు, నాణ్యత లోపం! మరోవైపు, కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశా లల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో మాత్రం నాణ్యతా లోపాలు, సరుకుల కొరత అంశాలు తరచూ వెలుగులోకి వస్తున్నా యి.పౌష్టికాహారంపై ప్రశ్నార్థకం: కామారెడ్డి జిల్లాలో ని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గుడ్లు సక్రమంగా అందించడం లేదనే ఫిర్యాదులు, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందడం లేదనే ఆందోళన లు వ్యక్తమవుతున్నాయి. కలుషితాహార ఘటనలు గతంలో…. కామారెడ్డి జిల్లాలోని కొన్ని గురుకులాల్లో, పాఠశా లల్లో భోజనం కలుషితమై విద్యార్థులు అస్వస్థ తకు గురైన ఘటనలు, బియ్యంలో పురుగులు వచ్చిన సంఘటనలు నమోదయ్యాయి.ఈ సంఘ టనల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేసి నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించిన ప్పటికీ, సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదన్న విమర్శలు ఉన్నాయి. నిర్వాహకుల సమ్మె, బిల్లుల పెండింగ్….. మధ్యాహ్న భోజనాన్ని వండి వడ్డించే నిర్వాహకుల కు ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు చెల్లించక పోవడం, భోజనం నాణ్యతపై ప్రభావం చూపుతోం ది. ఏడు నెలల వరకు బిల్లులు, వేతనాలు పెండిం గ్‌లో ఉండడంతో, నిత్యావసర వస్తువులను అప్పు లకు తెచ్చి వంట చేయాల్సి వస్తోందని, దీంతో నాణ్యత విషయంలో రాజీ పడక తప్పడం లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లు లు పెండింగ్ కారణంగా గతంలో నిర్వాహకులు సమ్మెకు దిగిన సంఘటనలు జిల్లాలో చోటు చేసు కున్నాయి.మొత్తం మీద, ఒకవైపు రాష్ట్ర విద్యా శాఖ సాంకేతికతను ఉపయోగించి పథకంలో పారదర్శకత పెంచాలని చూస్తున్నా, క్షేత్ర స్థాయిలో కామారెడ్డి వంటి జిల్లాల్లో మాత్రం నిధుల కొరత, నాణ్యత లోపం వంటి కారణాల వల్ల పేద విద్యార్థు లకు అందించాల్సిన పౌష్టికాహారం లక్ష్యం ప్రశ్నార్థకంగా మారుతోంది.

తిరుపతి

శ్రీకాళహస్తిలో పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమము

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయంలో భాగంగా శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నందు పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 64 వ వారం శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమము ను పవన్ కళ్యాణ్ ఆశయాల కృషి కోసం పనిచేసే జనసేన నాయకులు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు పేట చంద్రశేఖర్,పేట చిరంజీవి,మనీ,ప్రభాకర్,మునిచంద్ర,దినేష్,రాజా, తేజ,సాయి,గోపి,వీర మహిళలు బత్తెమ్మ,పద్మ, శకుంతలమ్మ,తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

జనసేన నాయకులను అభినందించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి

గిరిజనుల అభివృద్ధి కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్య సాధన అనే దిశగా జనసేన పర్యటన లో భాగంగా తొట్టంబేడు మండలం పొయ్య పంచాయతీలోని ఎస్టీ కాలనీలో సందర్శించినప్పుడు అక్కడ ఉన్న గిరిజనులు చెప్పినటువంటి సమస్యలపై గురువారం ఎమ్మెల్యే ని కలవడం జరిగింది.జనసేన నాయకులు ఇచ్చినటువంటి సమస్యలను చూసి ఎమ్మెల్యే స్పందించి,వెంటనే అధికారులుతో మాట్లాడడం జరిగింది.ఎమ్మెల్యే సుధీర్ రెడ్డే స్వయం గిరిజన కాలనీ మొత్తాన్ని పరిశీలించి అక్కడికక్కడే వాళ్ల సమస్య ను పరిష్కరిస్తానని,అలాగే గిరిజనుల పిల్లలందరిని బడివైపు వెళ్లే దిశగా నేను కృషి చేస్తానన్నారు.అంతే కాకుండా మీలాంటి జనసేన యువత సమస్యలు గుర్తించి తీసుకురావడం చాలా గొప్ప విషయమని అభినందించారు.ఎక్కడ ఏ సమస్య ఉన్న ఏ సమయమైన పర్వాలేదు తన దృష్టికి తీసుకొని వస్తే పర్వాలేదు నా లక్ష్యం సమస్యలను పరిష్కరించడమే అని భరోసా ఇవ్వడం జరిగింది.

ఆదిలాబాదు

ఘనంగా సమాచార హక్కు చట్టం వారోత్సవాలు

ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పట్టణంలో సహ రక్షణ చట్టం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం 05అక్టోబర్ నుండి 12అక్టోబర్ వరకు సహ చట్టం వారోత్సవాలు నిర్వహించాలని ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సమాచార హక్కు చట్టం వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సహా రక్షణ చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షులు డా,, కమలాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సహా చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత జవాబుదారితనం సహ చట్టం ఉద్దేశమన్నారు. సమాచారం పొందడం ప్రతి ఒక్కరి రాజ్యాంగ బద్దమైన హక్కు అని తెలిపారు. సహా చట్టం సెక్షన్లు, దరఖాస్తు విధానం గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భూమన్న, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

జిల్లా ఫారెస్ట్ అధికారులతో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

గురువారం శ్రీకాళహస్తి FRO కార్యాలయం నందు జిల్లా ఫారెస్ట్ అధికారులతో కలిసి నియోజకవర్గంలోని అడవుల సంరక్షణ మరియు పచ్చదనాన్ని పెంపొందించడానికి చేపట్టిన చర్యల గురించి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చర్చించారు.అలాగే శ్రీకాళహస్తి మండలం సింహాచలం కండ్రిగ రైతుల సమస్య పరిష్కారానికి సంబంధించి కూడా ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులతో ఎమ్మెల్యే చర్చించడం జరిగింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మైపాడ్ గేటు వద్ద షాపుల ప్రారంభ కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన తాత్కాలికంగా వాయిదా — కొత్త తేదీ త్వరలో ప్రకటించబడనుంది

నెల్లూరు మైపాడ్ గేటు వద్ద ఏర్పాటు చేయబడిన షాపుల ప్రారంభ కార్యక్రమానికి రావాల్సిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన వాయిదా పడింది. ఈ విషయమై పార్టీ నాయకులు, కార్యకర్తలకు తెలియజేయబడింది. కార్యక్రమాన్ని త్వరలోనే కొత్త తేదీతో నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి

తిరుపతి

లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డుకు ఎంపికైన కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం

శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం లోని దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో పని చేస్తున్న ఉపాధ్యాయులు,రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కయ్యూరు బాల సుబ్రహ్మణ్యం జీవిత సాఫల్య పురస్కారం కు ఎంపికయ్యారు.విద్య,కళలు మరియు సాహిత్యం మొదలగు రంగాల్లో వారు అందిస్తున్న విశిష్ట సేవల కు గాను ఈ అవార్డు కి కయ్యూరి బాల సుబ్రహ్మణ్యం ను ఎంపిక చేసినట్టు వే ఫౌండేషన్ అధ్యక్షుడు పైడి అంకయ్య సమాచారం అందించారు.ఈ నెల12 వ తేది తిరుపతి మహతి కళాక్షేత్రం లో జరిగే వే ఫౌండేషన్ 12 వార్షికోత్సవం సందర్భంగా ఆయన కు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు ఇవ్వనున్నట్లు వారు తెలిపారు.

తెలంగాణ

నల్గొండ జిల్లాలో పర్యటించిన: ఎన్నికల సాధారణ పరిశీలకు రాలు

నకిరేకల్ : అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) ఎంపిటిసి, జడ్పిటిసి, గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కొర్ర లక్ష్మి నల్గొండ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జడ్పిటిసి, నామినేషన్ కేంద్రాల్లో ఏర్పాట్లను తనిఖీ చేశారు. హెల్ప్ డెస్క్ లో రిటర్నింగ్ అధికారి ఛాంబర్, నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేసిన టేబుల్లు, ఇతర సౌకర్యాలను ఆమె పరిశీలించారు. అనంతరం కనగల్ ఎంపీడీవో కార్యాలయంలో మొదటి విడత ఎం పి టి సి, జెడ్పిటిసి నామినేషన్ల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను తనిఖీ చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.