Thursday, 30 April 2026

Blog

చిత్తూరు

లాడ్జిలను ఆకస్మికంగా తనిఖీలు చేసిన సీఐ

చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ దూడి ఆదేశాల మేరకు అర్బన్ సీఐ మురళీ మోహన్ ఆధ్వర్యంలో ఎస్ఐ లోకేష్ రెడ్డితో కలిసి పలమనేరులోని పలు లాడ్జిల్లో గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మురళీ మోహన్ మాట్లాడుతూ రాత్రి వేళల్లో లాడ్జిలులో బస చేసిన వ్యక్తల వివారాలను పరిశీలించి, కోత్త వ్యక్తులను ప్రశ్నిస్తూ వివరాలపై ఆరా తీశారు. అదేవిధంగా రాత్రి వేళలో బస చేసిన ప్రయాణికులను తనిఖీ చేసి అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరించి నేర నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటుమన్నారు. లాడ్జీల్లో బస చేసే వ్యక్తుల నుంచి ఆధార్ కార్డులు, ఇతర వివరాల కోసం సరైన రిజిస్టర్ నిర్వహించాలని నిర్వహకులకు సీఐ సూచించారు. చట్ట విరుద్ధంగా ఎవరికీ గదులు ఇవ్వరాదని, లాడ్జి పరిసరాలు స్పష్టంగా కన్పించేలా తప్పనిసరిగా సి.సి.కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లాడ్జిల్లో బస చేసిన సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. లాడ్జిల్లో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావిచ్చినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

నాగర్‌కర్నూల్

ప్రతి గర్భిణికి మాతృత సంరక్షణ సేవలు అందించడం తప్పనిసరి

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా అక్టోబర్ 9 జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు బిజినపల్లి మండల పరిధిలోని లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం నాడు గర్భిణీలకు ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పథకం ద్వారా ప్రత్యేకంగా మాతృత సంరక్షణ సేవలు అందించినట్లు లట్టుపల్లి వైద్యాధికారి డాక్టర్ టి.ప్రసన్న తెలిపారు.ఆమె మాట్లాడుతూ ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని క్షేత్రస్థాయిలో మహిళా ఆరోగ్య కార్యకర్తలు,ఆశా కార్యకర్తలు నమోదు చేసుకున్న ప్రతి గర్భిణీకి మాతృత సంరక్షణ సేవలు అందించడం తప్పనిసరి అనీ అన్నారు.మాతా శిశు మరణాలు అరికట్టుటలో ప్రతి ఒక్కరూ తోడ్పాటు కావాలని ఆమె సూచించారు.ప్రతి గర్భిణీ తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేటట్లు వారి కుటుంబ సభ్యులకు ప్రోత్సహించి ప్రసవాలు జరిగేటట్లు చూడాలని అన్నారు. నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ప్రత్యేకంగా స్త్రీ వైద్యుల నిపుణుల యొక్క సేవలు 24 గంటలు ఉన్నాయని, సాధారణ ప్రసవం కాకపోతే వెంటనే అత్యవసర సిజేరియన్ కూడా చేయుటకు అందుబాటు సేవలు ఉన్నాయని,ప్రతి గర్భిణీ వినియోగించుకోవాలి తెలిపారు. పుట్టిన నవజాత శిశువులకు ప్రత్యేకంగా చిన్నపిల్లల వైద్య నిపుణులు, ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉన్నాయని, వైద్యుల సేవలు కూడా వినియోగించుకోవాలని సూచించారు. గిరిజన తండాలు గ్రామాలనుండి ఆసుపత్రి కి వెళ్ళుటకు 102 లేదా 108 అంబులెన్స్ ఆరోగ్య సేవలు ప్రతి గర్భిణికి వినియోగించాల ఆశా కార్యకర్తలు ప్రత్యేకంగా సూచించాలని తెలిపారు. వివిధ గ్రామాలు, గిరిజన తండాల నుండి వచ్చిన గర్భవతులకు తెలంగాణ డయాగ్నస్టిక్ ల్యాబ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 27 మంది గర్భవతులకు సాధారణ, ల్యాబ్, ప్రత్యేక పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ మేఘనా రెడ్డి,ల్యాబ్ టెక్నీషియన్ చంద్రశేఖర్, ఫార్మసిస్ట్ శ్రీనివాసులు, దివ్య ,పర్యవేక్షకులు బాలమని, నర్సింగ్ ఆఫీసర్ స్వరూప, ఆరోగ్య కార్యకర్తలు సుమిత్ర బోజ్జమ్మ ,వరలక్ష్మి, అబ్దుల్ సలీం, గర్భవతులు,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

బొజ్జల సుధీర్ రెడ్డి ని సన్మానించిన గ్రీన్ అంబాసిడర్లు

అసెంబ్లీ సమావేశాల సమయంలో గ్రీన్ అంబాసిడర్ల సమస్యలపై శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది.వారు సూచించిన అంశాలను పరిగణలోకి తీసుకొని గ్రీన్ అంబాసిడర్ల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది.అందులో భాగంగా వారి జీతాలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ని శ్రీకాళహస్తి నియోజకవర్గ గ్రీన్ అంబాసిడర్లు సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.

నాగర్‌కర్నూల్

ఐక్య పోరాటాలతోనే ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా అక్టోబర్ 9 ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావాలంటే ఉపాధ్యాయ సంఘాలు సమైక్య పోరాటానికి సిద్ధం కావాలని అప్పుడే పెండింగ్ బిల్లులు, ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధించబడతాయని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్. టి. యు) జిల్లా అధ్యక్షులు ఎస్మురళి, ప్రధాన కార్యదర్శి కొత్త శ్రీధర్ రావులు అన్నారు. గురువారం వెల్దండ మండలం కొట్ర, వెల్దండ, గుండాల, చేదురుపల్లి, దేశి గాని తండ, అగ్రహారం తండ, చారగొండ మండలంలోని శాంతి గూడ, చారగొండ, జూపల్లి ఉన్నత ,ప్రాధమిక పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయ సంఘ సభ్యత నమోదు చేయించినట్లు మండల అధ్యక్ష కార్యదర్శులు చెన్నకేశవులు, మల్లేష్, నాయకులు అమరేందర్ రావు, పత్యనాయక్, అశోక్, మధుసూదన్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలలో వారు మాట్లాడుతూ ఏకీకృత సర్వీసు రూల్స్ సాధించబడితే ఎంఈఓ, జేఎల్, డిప్యూటీ డిఈఓ ల పదోన్నతులకు మార్గం ఏర్పడుతుందని, ఇంకా ఐదు పెండింగ్ డీ ఏ లు చెల్లించి, పి ఆర్ సి ని ప్రకటించాలని, సి.పి.ఎస్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉపయోగపడని శిక్షణలతో ఉపాధ్యాయుల బోధనకు ఆటంకం కలిగించవద్దని అధికారులను కోరినారు.

తిరుపతి

శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలు కోలా విశాలాక్షి కి ఘన సన్మానం

శ్రీకాళహస్తి ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమితులైన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ సతీమణి కోలా వైశాలి కి బిజెపి తొట్టంబేడు మండల అధ్యక్షులు వేడం కృష్ణయ్య ఆధ్వర్యంలో ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కొండేటి గోపాల్,జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి,సీనియర్లు కూనాటి నాగరాజు,మండల అధ్యక్షులు భగీర్తి వెంకటేష్,మండల ఉపాధ్యక్షులు కందాటి మునిరాజా,రాజనాల,పాపయ్య,చొక్కాని రవిచంద్ర,ఢిల్లీ బాబు,పుచ్చకాయల రమేష్ యాదవ్,కిషోర్ రెడ్డి,సజ్జాహరీష్,కుమార్,బిందు రాయల్,అనిల్ తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లను మర్యాదపూర్వకంగా కలిసిన ముక్కా రూపానంద రెడ్డి

రైల్వే కోడూరు నియోజకవర్గ సమస్యలపై సీఎం సానుకూల స్పందన – తక్షణ చర్యలకు హామీ మంగంపేట, చిట్వేల్‌లో ఏపీఎండీసీ విద్యా సంస్థల ఏర్పాటుకు మంత్రి నారా లోకేష్ అంగీకారం రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల అభివృద్ధి, రోడ్ల విస్తరణ, పౌర అవసరాల సాధన, డ్రైనేజ్ వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. రైల్వే కోడూరు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరంగా తెలియజేసిన రూపానంద రెడ్డి, సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి, తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తానని హామీ ఇచ్చారు. రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధి పథంలో ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తదనంతరం, ఐటి మరియు విద్యాశాఖల మంత్రివర్యులు నారా లోకేష్ ని కూడా విజయవాడ ఉండవల్లి నివాసంలో ముక్కా రూపానంద రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఓబులవారిపల్లి మండలం, మంగంపేటలో ఏపీఎండీసీ స్కూల్‌కు అదనపు భవనం, ఇంటర్ కాలేజీ మరియు చిట్వేల్ మండలంలో కొత్త ఏపీఎండీసీ స్కూల్ ఏర్పాటు చేయాలని రూపానంద రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించి, “ఈ ప్రతిపాదనలు తప్పకుండా ఆమోదిస్తాను” అని హామీ ఇచ్చారు. అలాగే, విద్యా, ఉపాధి రంగాల అభివృద్ధి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ, గ్రామీణ విద్యారంగ బలోపేతం వంటి అంశాలపై కూడా మంత్రితో సమగ్రంగా చర్చించుకున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు ఇచ్చిన హామీలతో ప్రజల్లో నూతన ఉత్సాహం నెలకొంది. అభివృద్ధి పథంలో రైల్వే కోడూరు ముందుకు తీసుకెళ్లే దిశగా రూపానంద రెడ్డి చేస్తున్న కృషిని స్థానిక ప్రజలు ప్రశంసిస్తున్నారు.

అన్నమయ్య

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లను మర్యాదపూర్వకంగా కలిసిన ముక్కా రూపానంద రెడ్డి

రైల్వే కోడూరు నియోజకవర్గ సమస్యలపై సీఎం సానుకూల స్పందన – తక్షణ చర్యలకు హామీ మంగంపేట, చిట్వేల్‌లో ఏపీఎండీసీ విద్యా సంస్థల ఏర్పాటుకు మంత్రి నారా లోకేష్ అంగీకారం రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల అభివృద్ధి, రోడ్ల విస్తరణ, పౌర అవసరాల సాధన, డ్రైనేజ్ వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. రైల్వే కోడూరు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరంగా తెలియజేసిన రూపానంద రెడ్డి, సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి, తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తానని హామీ ఇచ్చారు. రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధి పథంలో ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తదనంతరం, ఐటి మరియు విద్యాశాఖల మంత్రివర్యులు నారా లోకేష్ ని కూడా విజయవాడ ఉండవల్లి నివాసంలో ముక్కా రూపానంద రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఓబులవారిపల్లి మండలం, మంగంపేటలో ఏపీఎండీసీ స్కూల్‌కు అదనపు భవనం, ఇంటర్ కాలేజీ మరియు చిట్వేల్ మండలంలో కొత్త ఏపీఎండీసీ స్కూల్ ఏర్పాటు చేయాలని రూపానంద రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించి, “ఈ ప్రతిపాదనలు తప్పకుండా ఆమోదిస్తాను” అని హామీ ఇచ్చారు. అలాగే, విద్యా, ఉపాధి రంగాల అభివృద్ధి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ, గ్రామీణ విద్యారంగ బలోపేతం వంటి అంశాలపై కూడా మంత్రితో సమగ్రంగా చర్చించుకున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు ఇచ్చిన హామీలతో ప్రజల్లో నూతన ఉత్సాహం నెలకొంది. అభివృద్ధి పథంలో రైల్వే కోడూరు ముందుకు తీసుకెళ్లే దిశగా రూపానంద రెడ్డి చేస్తున్న కృషిని స్థానిక ప్రజలు ప్రశంసిస్తున్నారు.

విశాఖపట్నం

అనాధలకు,నిరాశ్రయులకు నిత్యవసరాలు పంపిణీ – ముఖ్యఅతిథిగా పాల్గొన్న పోలీస్ కమిషనర్ బాగ్చి

ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం సందర్భంగా నగరంలోని టి ఎస్ ఆర్ కాంప్లెక్స్ లో ఉన్న మానసిక రోగులు ఒంటరి మహిళల పునరావాస కేంద్రంలో నిరాశ్రయులకు కే ఎస్ ఆర్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ శంకర్ బ్రత బాగ్చి పాల్గొన్నారు. కె ఎస్ ఆర్ బ్యాడ్మింటన్ అకాడమీ వ్యవస్థాపకులు కలిదిండి సుందర రామరాజు తన సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా బియ్యం,పప్పు దినుసులు, నిత్యవసరాలు, పళ్ళు,వస్త్రాలు మొదలైనవి అందజేశారు.వీటిని పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపద్బాందు సేవా ట్రస్ట్ అధ్యక్షులు జిఎస్ఎన్ రాజు నాలుగు బియ్యం బస్తాలు వితరణ చేశారు. సేవా దృక్పథంతో చేస్తున్న ఈ బృహత్తర కార్యక్రమాన్ని వివిధ కార్యక్రమాలలో దాతలుగా ఉంటున్న సుందర రామ రాజు, జి ఎస్ ఎన్ రాజు తదితరులను నగర సిపి బాగ్చి అభినందించారు. సాయం చేసే చేతులను భగవంతుడు ఆశీర్వదిస్తాడన్నారు. నగరంలో రోడ్ల పక్కన అనాదలు, మానసిక రోగులు, బెగ్గర్స్ లేకుండా చూస్తూ వారిని పునరావాస కేంద్రానికి తరలించాలని పోలీస్ లకు సిపి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, స్వరూప్, దేవిశ్రీ, మనోహర్,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్ గా కేఎస్ విశ్వనాథన్

రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్ గా కేఎస్ విశ్వనాథన్ ను ప్రభుత్వం నియమించింది. గతంలో ఈ పోస్టులో పనిచేసిన హిమాన్షశుక్లాను నెల్లూరు జిల్లా కలెక్టర్ గా బదిలీ చేయడంతో.. ఆయన స్థానంలో తాత్కాలికంగా ప్రఖరైజైన్ కు బాధ్యతలు అప్పగించింది. కీలకమైన సమాచారశాఖ డైరెక్టర్ గా మరో యువ అధికారికి ప్రభుత్వం అవకాశం కల్పించింది .

ఖమ్మం

ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులని పరిశీలించిన బీజేపీ బృందం

ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఖమ్మం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి అని బీజేపీ ప్రతి నిధి బృందం తెలిపింది. గురువారం పనుల పురోగతిని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యురాలు శ్రీమతి మంద సరస్వతి లు ప్రత్యక్షంగా పరిశీలించారు. స్టేషన్ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణ పనులను ఆయన రైల్వే అధికారులతో కలిసి సమీక్షించి, అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థను ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దుతున్నాం. ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రూ.25.41 కోట్ల నిధులు కేటాయించబడి, పనులు దశలవారీగా వేగంగా సాగుతున్నాయి. ఈ స్టేషన్ ద్వారా రోజూ 83 రైళ్లు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయన్నారు. సూపర్‌ఫాస్ట్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్రధాన నగరాలకు వెళ్లే పలు రైళ్లు ఇక్కడ ఆగుతుండటంతో ఖమ్మం రైల్వే స్టేషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది అని బీజేపీ నేతలు తెలిపారు. స్టేషన్ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రధాన భవనం ముఖద్వారం పునర్నిర్మాణం, ఆకర్షణీయమైన ప్రధాన ప్రవేశ ద్వారం నిర్మాణం, 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం, రెండు ఎస్కలేటర్లు, రెండు లిఫ్టులు ఏర్పాటు, ఆధునిక వేటింగ్ హాల్స్, శుభ్రమైన వాష్‌రూములు, డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు, విస్తృత పార్కింగ్ సదుపాయాలు వంటి పనులు జరుగుతున్నాయి. అదనంగా ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ కంట్రోల్ రూమ్ వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రయాణికుల రక్షణ కోసం సిఆర్పిఎఫ్ పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణం కూడా కొనసాగుతోంది. బీజేపీ ప్రభుత్వం ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ఖమ్మం రైల్వే స్టేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఒక మోడల్ స్టేషన్‌గా నిలుస్తుంది. ఇది ఖమ్మం ప్రజలకు గర్వకారణంగా మారుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ మాజీ అభ్యర్థి నున్న రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్లు, ఆచంటి కోటేశ్వరరావు, జిల్లా సెక్రటరీ తొండెపు సైదేశ్వరరావు, జిల్లా నాయకులు వేల్పుల సుధాకర్, మార్తి ప్రసాద్, ఈదుల భద్రం, గడిల నరేష్, ఆర్.వి.ఎస్. యాదవ్, దుద్దుకూరి కార్తీక్, పసుమర్తి సతీష్, డి.కొండ శ్యామ్, శాసనాల సాయిరాం, మండల నాయకులు పాలెపు రాము, కడుదుల ప్రభాకర్, నాగవల్లి రామచంద్రం, గుత్తా వంశీ, భూక్య బాలాజీ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.