Thursday, 30 April 2026

Blog

అన్నమయ్య

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లను మర్యాదపూర్వకంగా కలిసిన ముక్కా రూపానంద రెడ్డి

రైల్వే కోడూరు నియోజకవర్గ సమస్యలపై సీఎం సానుకూల స్పందన – తక్షణ చర్యలకు హామీ మంగంపేట, చిట్వేల్‌లో ఏపీఎండీసీ విద్యా సంస్థల ఏర్పాటుకు మంత్రి నారా లోకేష్ అంగీకారం రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల అభివృద్ధి, రోడ్ల విస్తరణ, పౌర అవసరాల సాధన, డ్రైనేజ్ వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. రైల్వే కోడూరు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరంగా తెలియజేసిన రూపానంద రెడ్డి, సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి, తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తానని హామీ ఇచ్చారు. రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధి పథంలో ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తదనంతరం, ఐటి మరియు విద్యాశాఖల మంత్రివర్యులు నారా లోకేష్ ని కూడా విజయవాడ ఉండవల్లి నివాసంలో ముక్కా రూపానంద రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఓబులవారిపల్లి మండలం, మంగంపేటలో ఏపీఎండీసీ స్కూల్‌కు అదనపు భవనం, ఇంటర్ కాలేజీ మరియు చిట్వేల్ మండలంలో కొత్త ఏపీఎండీసీ స్కూల్ ఏర్పాటు చేయాలని రూపానంద రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించి, “ఈ ప్రతిపాదనలు తప్పకుండా ఆమోదిస్తాను” అని హామీ ఇచ్చారు. అలాగే, విద్యా, ఉపాధి రంగాల అభివృద్ధి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ, గ్రామీణ విద్యారంగ బలోపేతం వంటి అంశాలపై కూడా మంత్రితో సమగ్రంగా చర్చించుకున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు ఇచ్చిన హామీలతో ప్రజల్లో నూతన ఉత్సాహం నెలకొంది. అభివృద్ధి పథంలో రైల్వే కోడూరు ముందుకు తీసుకెళ్లే దిశగా రూపానంద రెడ్డి చేస్తున్న కృషిని స్థానిక ప్రజలు ప్రశంసిస్తున్నారు.

విశాఖపట్నం

అనాధలకు,నిరాశ్రయులకు నిత్యవసరాలు పంపిణీ – ముఖ్యఅతిథిగా పాల్గొన్న పోలీస్ కమిషనర్ బాగ్చి

ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం సందర్భంగా నగరంలోని టి ఎస్ ఆర్ కాంప్లెక్స్ లో ఉన్న మానసిక రోగులు ఒంటరి మహిళల పునరావాస కేంద్రంలో నిరాశ్రయులకు కే ఎస్ ఆర్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ శంకర్ బ్రత బాగ్చి పాల్గొన్నారు. కె ఎస్ ఆర్ బ్యాడ్మింటన్ అకాడమీ వ్యవస్థాపకులు కలిదిండి సుందర రామరాజు తన సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా బియ్యం,పప్పు దినుసులు, నిత్యవసరాలు, పళ్ళు,వస్త్రాలు మొదలైనవి అందజేశారు.వీటిని పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపద్బాందు సేవా ట్రస్ట్ అధ్యక్షులు జిఎస్ఎన్ రాజు నాలుగు బియ్యం బస్తాలు వితరణ చేశారు. సేవా దృక్పథంతో చేస్తున్న ఈ బృహత్తర కార్యక్రమాన్ని వివిధ కార్యక్రమాలలో దాతలుగా ఉంటున్న సుందర రామ రాజు, జి ఎస్ ఎన్ రాజు తదితరులను నగర సిపి బాగ్చి అభినందించారు. సాయం చేసే చేతులను భగవంతుడు ఆశీర్వదిస్తాడన్నారు. నగరంలో రోడ్ల పక్కన అనాదలు, మానసిక రోగులు, బెగ్గర్స్ లేకుండా చూస్తూ వారిని పునరావాస కేంద్రానికి తరలించాలని పోలీస్ లకు సిపి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, స్వరూప్, దేవిశ్రీ, మనోహర్,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్ గా కేఎస్ విశ్వనాథన్

రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్ గా కేఎస్ విశ్వనాథన్ ను ప్రభుత్వం నియమించింది. గతంలో ఈ పోస్టులో పనిచేసిన హిమాన్షశుక్లాను నెల్లూరు జిల్లా కలెక్టర్ గా బదిలీ చేయడంతో.. ఆయన స్థానంలో తాత్కాలికంగా ప్రఖరైజైన్ కు బాధ్యతలు అప్పగించింది. కీలకమైన సమాచారశాఖ డైరెక్టర్ గా మరో యువ అధికారికి ప్రభుత్వం అవకాశం కల్పించింది .

ఖమ్మం

ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులని పరిశీలించిన బీజేపీ బృందం

ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఖమ్మం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి అని బీజేపీ ప్రతి నిధి బృందం తెలిపింది. గురువారం పనుల పురోగతిని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యురాలు శ్రీమతి మంద సరస్వతి లు ప్రత్యక్షంగా పరిశీలించారు. స్టేషన్ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణ పనులను ఆయన రైల్వే అధికారులతో కలిసి సమీక్షించి, అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థను ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దుతున్నాం. ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రూ.25.41 కోట్ల నిధులు కేటాయించబడి, పనులు దశలవారీగా వేగంగా సాగుతున్నాయి. ఈ స్టేషన్ ద్వారా రోజూ 83 రైళ్లు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయన్నారు. సూపర్‌ఫాస్ట్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్రధాన నగరాలకు వెళ్లే పలు రైళ్లు ఇక్కడ ఆగుతుండటంతో ఖమ్మం రైల్వే స్టేషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది అని బీజేపీ నేతలు తెలిపారు. స్టేషన్ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రధాన భవనం ముఖద్వారం పునర్నిర్మాణం, ఆకర్షణీయమైన ప్రధాన ప్రవేశ ద్వారం నిర్మాణం, 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం, రెండు ఎస్కలేటర్లు, రెండు లిఫ్టులు ఏర్పాటు, ఆధునిక వేటింగ్ హాల్స్, శుభ్రమైన వాష్‌రూములు, డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు, విస్తృత పార్కింగ్ సదుపాయాలు వంటి పనులు జరుగుతున్నాయి. అదనంగా ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ కంట్రోల్ రూమ్ వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రయాణికుల రక్షణ కోసం సిఆర్పిఎఫ్ పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణం కూడా కొనసాగుతోంది. బీజేపీ ప్రభుత్వం ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ఖమ్మం రైల్వే స్టేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఒక మోడల్ స్టేషన్‌గా నిలుస్తుంది. ఇది ఖమ్మం ప్రజలకు గర్వకారణంగా మారుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ మాజీ అభ్యర్థి నున్న రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్లు, ఆచంటి కోటేశ్వరరావు, జిల్లా సెక్రటరీ తొండెపు సైదేశ్వరరావు, జిల్లా నాయకులు వేల్పుల సుధాకర్, మార్తి ప్రసాద్, ఈదుల భద్రం, గడిల నరేష్, ఆర్.వి.ఎస్. యాదవ్, దుద్దుకూరి కార్తీక్, పసుమర్తి సతీష్, డి.కొండ శ్యామ్, శాసనాల సాయిరాం, మండల నాయకులు పాలెపు రాము, కడుదుల ప్రభాకర్, నాగవల్లి రామచంద్రం, గుత్తా వంశీ, భూక్య బాలాజీ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బాణాసంచా తయారీ యూనిట్లు, హోల్ సేల్ విక్రయ కేంద్రాలలో తనిఖీలు చేసి నివేదిక సమర్పించండి : కలక్టర్ మహేష్ కుమార్

అమలాపురం, అక్టోబర్ 9 (తూర్పు ఉదయం విలేఖరి) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న బాణాసంచా తయారీ యూనిట్లు, హోల్ సేల్ విక్రయ కేంద్రాలకు లైసెన్సులు అనుమతులు భద్రత రక్షణ ప్రమాణాలు అంశాలలో మూడు రోజు లపాటు పర్యవేక్షణ బృందా లు వెళ్లి తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్ట ర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులు ఆదేశించారు గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆర్డీవోలు డీఎస్పీలు తాసిల్దార్లు అగ్ని మాపక విపత్తుల స్పందన అధికారులు లేబర్ డిపార్ట్మెంట్ కారులతో బృందాలు ఏర్పాటు చేసి బాణాసంచా తయారీ యూనిట్లు, హోల్ సేల్ దుకాణాలను సందర్శించి మూడు అన్ని అంశాలలో భద్రత రక్షణ అనుమతులు గుర్తింపు పొందిన కార్మికులు పనిచే స్తున్నది లేనిది పరిశీ లన చేయాలని ఆదేశించా రు. బుధవారం జిల్లాలో జరిగిన అవాంఛ నీయ సంఘటనలు పునరావతం కాకుండా నేటి నుండి ఈ మూడు రోజులపాటు తనిఖీలు నిమిత్తం తయారీ యూనిట్లను హోల్ సేల్ వ్యాపారాలను నిలుపుదల చేయాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా బాణా సంచా తయారీ యూనిట్లు 18 వరకు ఉన్నాయని, అదేవిధంగా హోల్సేల్ డీలర్లు 19 మంది వరకు ఉన్నారని ఆయన తెలిపారు జిల్లా ఫైర్ ఆఫీసర్ నోడల్ అధికారిగా వ్యవ హరిస్తారని వీరి ఆధ్వ ర్యంలో నియమింపబడ్డ తనిఖీ బృందాలు 18 తయారీ యూనిట్ లను 19 హోల్సేల్ కేంద్రాలను వెలసి 37 యూని ట్లను క్షుణ్ణంగా సేఫ్టీ నామ్స్ పాటించినది అదే విధంగా లైసెన్సులు అను మతులు పొందినది లేనిది క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి పాయింటు నమోదు చేస్తూ తయారీ యూనిట్లకు విడిగా హోల్సేల్ యూనిట్ల కు వేరే విధంగా రూపొందిం చిన ప్రొఫార్మాలో వివరాలు నింపి శనివారం సాయంత్రా నికి కలెక్టరేట్కు అందించాల న్నారు. ఆవాసాలకు దూరం గా నిబంధనల మేరకు తయారీ యూనిట్లు నిర్వ హిస్తున్నది లేనిది క్షుణ్ణంగా పర్యవేక్షించాలని మైనర్ ఉల్లంఘనలకు పాల్పడిన వెంటనే సీజ్ చేయాలని ఆదేశించారు. బాణాసంచా తయారీలో ప్రామాణికంగా వాడే రసాయనాలు కాకుం డా హాని కరమైన, పెద్ద శబ్దా లు కాలుష్యాలు యాపించే మెటీరియల్ వినియోగిస్తున్న అంశాలపై జిల్లా కాలు ష్య నియంత్రణ మండలి అధికా రులు పర్య వేక్షించి నిబంధనలు ఉల్లంఘించి నట్లయితే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు అదేవిధంగా బాణాసంచా తయారీలో నిర్దేశిత నిష్పత్తిలో రసాయనాలను వాడుతున్నది లేనిది పరిశీలించాలన్నారు. ప్రతి యూనిట్ ప్రామాణిక కండిషన్స్ భద్రతా రక్షణ చర్యలు కొరకు తీసుకుం టున్న చర్యలను నిశితంగా పరిశీలించి నివేదిక సమ ర్పించాలన్నారు. ప్రతి యూనిట్ వద్ద అగ్నిమాపక నిబంధనల ప్రకారం ప్రవేశం బయట మార్గాలు ఉన్నా యో లేదో పరిశీలించి మాక్ డ్రిల్ మాదిరిగా నిర్వాహ కులకు కార్మికులకు భద్రతా ప్రమాణాలు పట్ల అవగా హన కల్పించా లన్నారు ప్రతి యూనిట్లో శిక్షణ పొందిన కార్మికులు ఇతర కార్మికుల వివరాలను భీమా పట్టింపు కై ఒక ఏడాదిలో ఎంత మంది కార్మికులు పనిచే స్తున్నది వారందరూ వివ రాలు ఈ శ్రమ పోర్టల్ లో నమోదు చేయాలని ఆదే శించారు. స్కిల్లింగ్ వర్కర్స్ సర్టిఫికెట్లను పరిశీలించాల న్నారు. ప్రతి యూనిట్లో శిక శిక్షణ పొందిన డిజిగ్నేటెడ్ పర్సన్ ఉన్నది లేనిది పరిశీ లించి ఎన్ఫోర్స్ చేయాలన్నా రు. ఈనెల 20వ తారీఖున దీపావళి పండుగ పుర స్కరించుకొని ఎంతమంది వర్తకులు షాపులు నిర్వ హిస్తారో వారం రోజులు ముందుగానే తెలుసుకొని షాపుల నిర్వహణ కొరకు స్థలాలను ఎంపిక చేసి విక్రయాల కొరకు తాత్కా లిక లైసెన్సులను అంద జేయాలన్నారు. విక్రయ సమూహాల వద్ద భద్రతా చార్యులను అగ్రిమాపక పోలీస్ సిబ్బంది గత అను భవాలను దృష్టిలో ఉంచు కొని భద్రత రక్షణ పట్ల నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. బాణా సంచా తయారీ యూనిట్ల వద్ద 10-15 కేజీల సామాగ్రి తయారైన వెంటనే వేరే చోటకు తరలించి భద్రపరిచే చర్యలను తీసు కునేలా అవ గాహన కల్పించాలన్నారు. నూటికి నూరు శాతం భద్రతా ప్రమా ణాలను తప్ప నిసరిగా పాటించేలా చర్య లు తీసుకోవాలన్నారు. బాణాసంచా విక్రయ దుకాణాల మధ్య దూరం 3 మీటర్లు ఉండాలని ఎదు రుగా ఎటువంటి దుకా ణాలు నిర్వహించరాదని ఎల్ షేప్ మాదిరిగా దుకా ణాలు నిర్వహించాలన్నా రు ప్రజా భద్రత దృష్ట్యా ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడిన ఉపేక్షించరాదని ఆయన అధికారులకు సూ చించారుప్రతి బాణాసంచా తయారీ కేంద్రంలో అనుమ తి & లైసెన్స్ ఉండాలన్నారు 18 ఏళ్లకు దిగువ ఉన్న పిల్లలను తయారీ పనుల్లో నిర్మూలించాలన్నారు.గోదాముల్లో కనీస భద్రతా ప్రమాణాలు ఇసుక, నీరు, అగ్ని నియంత్రణ పరికరాలుఏర్పాటు చేయాల న్నారు.విద్యుత్ సరఫరా విస్తరణ తగ్గించాలనీ , రసాయనాల నిల్వ, వాడకానికి కఠిన నియంత్రణలు అమలు చేయాలన్నారు. కార్మికులకు బీమా సౌకర్యంతో పాటుగా అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు సిబ్బంది శిక్షణ పొందింది లేనిది పర్యవేక్షిం చాలన్నారు రెవెన్యూ, పోలీస్, ఫైర్ శాఖ అధికారులు తయారీ, నిల్వ కేంద్రాలను తనిఖీలు నిర్వ హించాల న్నారు.లైసెన్సు వివరాలు, రెన్యూవల్ సమాచారం పరిశీలించాల న్నారు.రసాయనాల నిల్వ, అగ్నిప్రమాద చర్యలు, కార్మి కుల భద్రతా ప్రమాణాలు గమనిం చాలన్నారు.నివాస గృహాల్లో అక్రమంగా నిల్వ ఏర్పాటుచేస్తే కఠిన చర్యలు తీసుకోవాల న్నారు.షాపుల్లో & తయారీ కేంద్రాల్లో బాణా సంచా సామాగ్రి,, అగ్ని ని యంత్రణ పరికరాలు తనిఖీ చేయాల న్నారు.ప్రమాద నివారణ పరికరాలకు నిర్వహణ & తనిఖీలు చేయాలన్నారు. రసాయ నాల వాడకానికి గరిష్ట పరిమితి పాటించేలా చూడాలని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించాలన్నారు ఈ చర్యలు తనిఖీలు దీపావళి సమయంలో ప్రమాదాల నివారణకు కీలకంగా నిలుస్తాయ న్నారు. అన్ని శాఖల అధికారులు, నిర్లక్ష్యం లేకుండా సమగ్రంగా తని ఖీలు చేయాలన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సీనియర్ జర్నలిస్ట్ అడపాకు జర్నలిస్టులు ఘన నివాళి

అమలాపురం, అక్టోబరు 09 (పున్నమి ప్రతినిధి) : సీనియర్ జర్నలిస్ట్ అడపా అప్పారావు మృతి పట్ల అమలాపురం జర్నలిస్టులు ప్రగాఢ సంతాపం తెలిపారు. గడియార స్తంభం సెంటర్ లో అప్పారావు చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అప్పారావు చిత్ర పటం వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం ప్రకటించారు. సీనియర్ జర్నలిస్ట్ అప్పారావు మృతి ఉభయ గోదావరి జిల్లాల్లోని జర్నలిస్టు లోకానికి తీరని లోటని సీనియర్ జర్నలిస్ట్ టికె విశ్వనాథ్ అన్నారు. రాజకీయ నాయకులకు విలువైన సలహా సూచనలు ఇచ్చిన వ్యక్తి అప్పారావు అని కొనియాడారు. జర్నలిస్టులు అందరితో స్నేహ సంబంధాలు కల్గి అందరి శ్రేయస్సును కోరే అప్పారావు మృతి బాధాకరమని జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు కొర్లపాటి ప్రదీప్ కుమార్ అన్నారు. అప్పారావు నివాళులు అర్పించిన వారిలో సీనియర్ జర్నలిస్టులు సుంకర ప్రసాద్, కాకిలేటి సూరిబాబు, నిమ్మకాయల సతీష్, ఉండ్రు ప్రసాద్, మద్ధింశెట్టి త్రిమూర్తులు, మహ్మద్ బషీర్, అరిగెల రుద్రా శ్రీనివాస్, పిండి శేషు, దొమ్మేటి వెంకట్, ఎం. వెంకటేష్, విజయ్, భాస్కర్, అరిగెల వసంత్, విజయ్, ఆసు భరత్, పరమట భీమా మహేష్, రాము, పెద్దిరెడ్డి రాము, అజహర్ తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

భారతదేశ మొట్ట మొదటి ముస్లీం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ 125వ వర్ధంతి మరియు మాన్యశ్రీ కాన్షీరామ్ 19 వ వర్ధంతి

భారతదేశ మొట్ట మొదటి ముస్లీం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ 125 వ వర్ధంతి మరియు బహుజనుల ఆశాజ్యోతి మహిళల పక్షపాతి, అలుపెరుగని పోరాట యోధుడు మాన్యశ్రీ కాన్షీరామ్ 19 వ వర్ధంతి సందర్భంగా యస్సీ యస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక ప్రధాన కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావుపూలే భార్య సావిత్రిబాయి పూలే తో పాటు దళిత బాలికలకు,మహిళలకు విద్యను అందించడంలో ప్రధాన పాత్ర పోషించిన భారతదేశ మొట్ట మొదటి ముస్లీం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ సేవలు చిరస్మరణీయం అని ఆమె అన్నారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ మాట్లాడుతూ *కులాన్ని నిర్మూలిద్దాం బహుజన సమాజాన్ని నిర్మిద్దాం నినాదంతో దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టి బహుజనుల గొంతుకైన పోరాట యోధులు మాన్యశ్రీ కాన్షీరామ్ అని ఆమె అన్నారు. రాజ్యాధికారం కోసం కృషి చేసి దళిత మహిళను ముఖ్యమంత్రి ని చేసిన మహనీయులు బహుజనుల ఆశాజ్యోతి కాన్షీరామ్ అని ఆమె అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వదిలి వెళ్ళిన బాధ్యతలను కాన్షీరామ్ తన భుజాన వేసుకొని బహుజన రాజ్యాధికారం కోసం అంబేద్కర్ చెప్పిన మాస్టర్ కీ* రుచిని బహుజనులకు చూపించినది మాత్రం కాన్షీరామ్ అని ఆమె అన్నారు. బహుజనులపై దాడులు,అత్యాచారాలు, వివక్షత పోవాలంటే మనం రాజ్యాధికారం చేపట్టాలని చెప్పిన బహుజన మేధావి మాన్యశ్రీ కాన్షీరామ్ అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పాలెం రాధ, కటికె భాను, ఈరమ్మ , ఆకుతోట పద్మావతి ,ఖాసీంబి, రేవతి , షేకున్ బీ, కొమ్ము పెద్దక్క, ఖాజాబీ రంగమ్మ , లక్ష్మీ, కళావతి, అమీనా తదితరులు పాల్గొన్నారు

E-పేపర్

నంద్యాల 4 వ వార్డు లో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

నంద్యాల పట్టణంలోని 4వ వార్డు నందు 4 వ వార్డు టిడిపి ఇంచార్జ్ షేక్ మజీద్ ఏర్పాటుచేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ హాజరై తన చేతులా మీదుగా పంపిణి చేశారు ఈ సందర్బంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం లాగా ఎవరి ఫోటో వేయకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ అధికారిక ముద్రణ మాత్రమే వేసి స్మార్ట్ కార్డును పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ స్మార్ట్ కార్డ్ వల్ల రేషన్ సమాచారం మన మొబైల్ లోనే చూసుకోవచ్చు నెలనెలా రేషన్ పంపిణీ ఏ విధంగా తీసుకున్నామో ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవచ్చు అని ప్రజలకు తెలియజేయడం జరిగిందని ప్రజలు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ రంగ ప్రసాద్ సుబ్బ లక్ష్మయ్య పబ్బతి వేణు పల్లె వెంకటసుబ్బయ్య బింగుమల్లె శ్యాంసుందర్ గుప్తా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ఉస్మాన్ సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ లక్ష్మీ వరప్రసాదరావు సచివాలయ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.