Thursday, 30 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గొల్లపల్లిలో 8వ పోషణ మాసోత్సవం

అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలంలోని గొల్లపల్లి పంచాయతీలో పోషణ మాసోత్సవ కార్యక్రమాన్ని ఐసిడిఎస్ ఆత్మకూరు ప్రాజెక్టు సిడిపిఓ పి. సునీలత ఆదేశాల మేరకు చేజర్ల సెక్టార్ సూపర్వైజర్ ఎం.పద్మ సూచనలు సలహాలు మేరకు నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు మాట్లాడుతూ గర్భవతులు బాలింతలు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారం ఎలా తయారు చేసుకోవాలో తెలిపారు. అలాగే చక్కెర, నూనె లేని ఆహారం తీసుకోవాలని ఆకుకూరలు, మునగాకు యొక్క ప్రాముఖ్యతను వారికి వివరించారు.ఈ కార్యక్రమంలో గర్భవతులు, బాలింతలు, పిల్లలు, అంగన్వాడీ కార్యకర్తలు బి.విజయ కుమారి, పి.పద్మ, పోలమ్మ,తిరుపతమ్మ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

తిరుపతి

అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాం : ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తిలో అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో 8వ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమాలను ప్రణాళికల ప్రకారం నిర్వహించాలని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా అంగన్వాడీ లతో కలిసి స్థూలకాయం దాని నివారణ,చెక్కర,నూనెలవినియోగం,ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం,బాల్య దశ సంరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది.

E-పేపర్

11వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలబాలికల దివ్య ఖుర్ఆన్ కంఠస్థ ప్రతిభా పోటీల కోసం మీ పిల్లలను సమాయత్తం చేయండి యునైటెడ్ ఫోరం ఫర్ ఖుర్ఆన్ స్టడీస్ ఏపి

గత పదేళ్లుగా యునైటెడ్ ఫోరం ఫర్ ఖుర్ఆన్ స్టడీస్ ఆధ్వర్యంలో ఆ. ప్ర రాష్ట్రంలో పన్నెండు సంవత్సరాల లోపు బాలబాలికలకు ఖుర్ఆన్ కంఠస్థ పోటీలు క్వార్టర్ ఫైనల్, సెమిఫైనల్, ఫైనల్ గా నిర్వహించి 3-5, 6-8, 9-12 ఏండ్లుగా బాలబాలికలకు గ్రూపుకు ప్రధమ ఇరవై వేలు, ద్వితియ పదిహెనువేలు, తృప్తితో పదివేల నగదు బహుమతి మోమోంటో, ప్రశంసా పత్రంతో సత్కరించ బడును. దరాఖాస్తు అక్టోబర్ 26 చివరి తేదిగాను నంద్యాలలో క్వార్టర్ ఫైనల్ 28, డిసెంబర్లో జరుగునని జిల్లా ఇంఛార్జి హాఫీజ్ ముహమ్మద్ షోహెబ్ జమాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జమాఆతె ఇస్లామీ హింద్ నంద్యాల అధ్యక్షులు ముఖ్య అతిథిగా హాజరై కరపత్రాలు విడుదల చేసి నంద్యాలలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సమావేశంలో సీ‌. యం. జూలియా, సాజిద్, మహాబూబ్ పాల్గొన్నారు. వివరాలకు 9703838759 సంప్రదించగలరు.

Blog

సాంస్కృతిక, కళా రంగాలను విశేషంగా ప్రోత్సహించిన జయ చంద్రారెడ్డి మృతికి కళారాధన నివాళి

నంద్యాల సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ గా సేవలు అందించిన నరాల జయ చంద్రారెడ్డి బుధవారం హైదరాబాదులో మృతికి కళారాధన నంద్యాల సాంస్కృతిక సంస్థ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా కళారాధన అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదనరావు,డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నంద్యాల సిటీ కేబుల్ కు అనేక సంవత్సరాలు మేనేజింగ్ డైరెక్టర్ గా జయ చంద్రా రెడ్డి నంద్యాల పట్టణంలో కేబుల్ టీవీ ప్రసారాలు విస్తృత కావడంలో విశేషంగా సేవలు అందించారని గుర్తు చేశారు. దసరా ,సంక్రాంతి పండుగల సందర్భంలో కేబుల్ టీవీ ఆధ్వర్యంలో, కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘం సహకారంతో కళారాధన నిర్వహణలో అనేక సంవత్సరాలు ముగ్గులు, దసరా శక్తి వేషాలు, మహిళలకు ప్రత్యేకమైన శిరోజాలంకరణ, మెహందీ, పుష్పాలంకరణ, వంటల పోటీలు, యువతకు శాస్త్రీయ ఆధునిక నృత్య పోటీలు నిర్వహించి సాంస్కృతిక కళారంగానికి విశేష సేవలు అందించారని కొనియాడారు దసరా శక్తి వేషాలను నంద్యాలలో పునరుద్ధరించి అనేక సంవత్సరాలు నిర్వహించారని, ఇటీవల దసరాకు ముందు కూడా హైదరాబాదులో అనారోగ్యంతో ఉన్న సమయంలో కూడా దసరా శక్తి వేషాల పోటీల గురించి ఆసక్తి కనపరిచారని తెలిపారు వ్యక్తిగతంగా కూడా మంచి అనుబంధం ఉన్న వ్యక్తి మృతి తీవ్ర విచారాన్ని కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కళారాధన తరపున ప్రార్థిస్తున్నామని అన్నారు.

Blog

సాంస్కృతిక, కళా రంగాలను విశేషంగా ప్రోత్సహించిన జయ చంద్రారెడ్డి మృతికి కళారాధన నివాళి

నంద్యాల సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ గా సేవలు అందించిన నరాల జయ చంద్రారెడ్డి బుధవారం హైదరాబాదులో మృతికి కళారాధన నంద్యాల సాంస్కృతిక సంస్థ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా కళారాధన అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదనరావు,డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నంద్యాల సిటీ కేబుల్ కు అనేక సంవత్సరాలు మేనేజింగ్ డైరెక్టర్ గా జయ చంద్రా రెడ్డి నంద్యాల పట్టణంలో కేబుల్ టీవీ ప్రసారాలు విస్తృత కావడంలో విశేషంగా సేవలు అందించారని గుర్తు చేశారు. దసరా ,సంక్రాంతి పండుగల సందర్భంలో కేబుల్ టీవీ ఆధ్వర్యంలో, కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘం సహకారంతో కళారాధన నిర్వహణలో అనేక సంవత్సరాలు ముగ్గులు, దసరా శక్తి వేషాలు, మహిళలకు ప్రత్యేకమైన శిరోజాలంకరణ, మెహందీ, పుష్పాలంకరణ, వంటల పోటీలు, యువతకు శాస్త్రీయ ఆధునిక నృత్య పోటీలు నిర్వహించి సాంస్కృతిక కళారంగానికి విశేష సేవలు అందించారని కొనియాడారు దసరా శక్తి వేషాలను నంద్యాలలో పునరుద్ధరించి అనేక సంవత్సరాలు నిర్వహించారని, ఇటీవల దసరాకు ముందు కూడా హైదరాబాదులో అనారోగ్యంతో ఉన్న సమయంలో కూడా దసరా శక్తి వేషాల పోటీల గురించి ఆసక్తి కనపరిచారని తెలిపారు వ్యక్తిగతంగా కూడా మంచి అనుబంధం ఉన్న వ్యక్తి మృతి తీవ్ర విచారాన్ని కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కళారాధన తరపున ప్రార్థిస్తున్నామని అన్నారు.

జనగాం

పాఠశాలకు నాలుగు లక్షల యాబై వేల విలువ గల వసతులు కల్పించిన దాత: ముక్తవరం

పాఠశాలకు రూ.4,50,000 విలువ గల మౌలిక వసతులు కల్పించిన దాత: ముక్తవరం కరంచంద్ ముక్తి ——————————————— జనగామ, అక్టోబర్ 09,పున్నమి న్యూస్: మహబూబాబాద్ జిల్లాకు చెందిన ముక్తవరం కరంచంద్ ముక్తి తన అమ్మమ్మ ఊరు అయినా బచ్చన్నపేట మండలం పోచన్నపేట పాఠశాలలో 4,50,000/- రూపాయలతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు A హరి శంకర్ గారి ఆధ్వర్యంలో పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం జరిగింది…… ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి శ్రీ ఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తన అమ్మమ్మగారి ఊరు పై ఉన్నటువంటి మమకారంతో పాఠశాలకు మాలిక వసతులు కల్పించినందుకు కరంచంద్ కు అభినందనలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ బాలమణి కరంచంద్ కుటుంబ సభ్యులు అయిన , వసుమతి , M. ఛత్రపతి శివాజీ , ఝాన్సీ , హైందవి మరియు పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు ఝాన్సీ లక్ష్మి బాయి, రత్నదేవి, సంధ్యారాణి, శ్రీరాం గిరీష్, A.N. బాలారెడ్డి,యాదగిరి, అంజయ్య,రాజేందర్ రెడ్డి, రమాదేవి, కరుణాకర్, శిరీష,వివేక్ పాల్గొన్నారు.

ఖమ్మం

మూల పోచారం గిరిజన ఆశ్రమ పాఠశాల దుస్థితి

*మూల పోచారం గిరిజన ఆశ్రమ పాఠశాల దుస్థితి* ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి అక్టోబర్ 09 *పేరుకే మెనూ పాటించని హెచ్ఎం మరియు వార్డెన్* విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం సమర్ధవంతంగా నిర్వహిస్తున్నటువంటి భోజనం మెనూ లో లోపాలు పిల్లలకు అందవలసిన కనీస సౌకర్యాలు అందించడం లేదు ఉదయం పెట్టవలసిన టిఫిన్ సక్రమంగా పెట్టడం లేదు బొండాలు టిఫిన్ పెట్ట లేదు, మధ్యాన్నం పెరుగు పెట్ట లేదు, పిల్లలు అయ్యో రామ అంటూ బ్రతుకు తున్నారు భోజనం విషయంలో నాసిరకం గా కూరగాయలు సాలిసాలని భోజనం ఉడికి ఉడకని అన్నం పిల్లలకు పెట్టడం జరుగుతుంది *పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి* వాళ్లకు జరుగుతున్న అన్యాయం గురించి ఎవరికి చెప్పాలో తెలియని అయోమయ స్థితిలో విద్యార్థుల పరిస్థితి ఎవరికి చెప్తే ఎవరూ వాళ్ళని దండిస్తారని భయం భయంగా రోజులు గడుపుతున్నారు *పాఠశాలల్లో ఉన్నటువంటి టాయిలెట్ పరిస్థితి* విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిన టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉంది అందులో వాటర్ లీకేజీ సరైన బకెట్లు మగ్గు లాంటివి పిల్లలకి అందుబాటులో లేదు *పాఠశాలల్లో భోజనం చేసే ప్రదేశం* విద్యార్థులు భోజనం చేయటానికి ప్రత్యేకమైన గదులు అంటూ ఏమీ లేదు వారు ఎక్కడపడితే అక్కడ భోజనం చేయవలసి వస్తుంది. చెత్తచెదరాల మధ్యన కూర్చొని భోజనం చేసే పరిస్థితి ఏర్పడింది వారిని చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది ఇట్టి విషయమై వార్డెన్ వివరణ అడగ్గా వారికి ప్రత్యేకమైన గదులు అంటూ ఏమీ లేదు ఉన్న ప్రదేశంలోనే భోజనం చేయవలసి ఉంటుంది అని జవాబు ఇవ్వడం జరిగింది *పాఠశాలల్లో పరిసరాల ప్రభావం* విద్యార్థులు నిత్యం పాఠశాలల్లోనే ఉండవలసి ఉంటుంది హాస్టల్ పాఠశాల అంతా ఒకేచోట ఉండడం అలాగే ఆ పాఠశాల పరిసరాల ప్రాంతం అపరిశుభ్రంగా ఉంది ఎక్కడ చూసినా చెత్తాచెదారం కుప్పలుగా పడి ఉన్నాయి అలాగే గడ్డి కూడా ఎక్కువగా ఉంది అసలు జిల్లా అధికారులు ఇట్టి పాఠశాలను పరిశీలిస్తున్నారా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి *పాఠశాలల్లో విద్య అభ్యసించే ఉపాధ్యాయుల ఘనత* పాఠశాలల్లో విద్యను అభ్యసించే ఉపాధ్యాయులు ఏ ఒక్కరు కూడా రాత్రి సమయంలో పిల్లలతో పాటు ఉండడం లేదు ఉండవలసినటువంటి హెచ్ఎం మరియు వార్డెన్ అందుబాటులో పిల్లలకి రాత్రి సమయంలో ఉండడం లేదు వార్డెన్ ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి రాత్రి 8 గంటల లోపు వెళ్లిపోవడం జరుగుతుంది పిల్లలు ఒక్కరే రాత్రిపూట భయం భయంగా బిక్కుబిక్కుమంటూ నిద్ర పోవాల్సి వస్తుంది వారికి రాత్రి సమయంలో జరగరాని ఏమైనా సమస్య ఏర్పడితే ఎక్కడికి వెళ్లాలో కూడా దిక్కుతోచని పరిస్థితిలో వారి యొక్క బాల్య జీవితాన్ని గడపవలసి వస్తుంది మరి ఇటువంటి హెచ్ఎం మరియు వార్డెన్ పై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఉన్నతాధికారులు అనేది అర్థం కావడం లేదు *పాఠశాల హెచ్ఎం మరియు హాస్టల్ వార్డెన్ గా విధులు* హెచ్ఎం మరియు వార్డెన్ పిల్లలకి అందుబాటులో హాస్టల్లో ఉండవలసి ఉంటుంది కానీ ఈ హాస్టల్ వార్డెన్ మాత్రం మూల పోచారం నుండి ఏన్కూర్ కేంద్రంలో ఉంటున్నారు ఏన్కూరు నుండి మూలపోచారం హాస్టల్ కి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో నివాసం ఉంటున్నారు మరి ఇలాంటి హాస్టల్ వార్డెన్ పై ఉన్నతాధికారుల చర్యలు ఉండవా ఏన్కూర్ మండలం మూలపోచారం ఆశ్రమ గిరిజన పాఠశాలలో ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో కుప్పగా పేరుకుపోయే ఉన్నాయి వాటిని పరిశుభ్రం చేసేవారే కరువయ్యారు అదే ప్రదేశంలో పిల్లలు ఆ చెత్తచెదారంలోనే భోజనం చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోయే లా ఉంది అదే హాస్టల్ వార్డెన్ మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన పిల్లలు అలాంటి పరిస్థితులలో భోజనం చేస్తారా వారికి కనపడటం లేదా అపరిశుభ్రత కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్న అపరిశుభ్రత పట్టించుకోని హాస్టల్ వార్డెన్ ప్రస్తుతము పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపాల్ వార్డెన్ గా చార్జ్ తీసుకోవడం జరిగింది తీసుకున్న కానుండి పిల్లల పరిస్థితి గోరంగా అతి ఘోరంగా ఉంది ఇట్టి విషయమై విద్యార్థులను వివరణ కోరగా మా హాస్టల్ కి సంబంధించిన హెచ్ఎం ఉదయం 8 గంటలకి పాఠశాలకి వస్తారు రాత్రి 8 గంటల సమయంలో వెళ్ళిపోతారు రాత్రి వేళల్లో మా వద్ద ఏ ఒక్కరు కూడా ఉండి మా మంచి చెడులను చూసుకునే వారే కరువయ్యారు రాత్రి సమయంలో మేము భయం భయంగా నిద్ర పోవాల్సి వస్తుంది మా మంచి చెడు చూసేవారు లేరు పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయులు అంతా బయట ఖమ్మం దూర ప్రాంతం నుండి వచ్చే వారే ఇక్కడ ఏ ఒక్కరు కూడా ఉండడం లేదు దీని గురించి పట్టించుకునే అధికారుల కరువయ్యారు పాఠశాలలో భోజనము వండేవారు లేకపోవడం వల్ల బయట ప్రవేట్ వ్యక్తులను పెట్టి పాఠశాలలో వంట చేపించడం జరిగింది కానీ అట్టి భోజనాన్ని పిల్లలకు పెట్టే క్రమంలో పిల్లల చేతులతోనే భోజనము పెట్టించడం జరుగుతుంది ఇదేంటనీ హాస్టల్ వార్డెన్ నీ వివరణ కోరగా మా పరిస్థితి బాగోలేదు ఏం చేయమంటారు ఏదో ఒకటి నడిపిస్తున్నాను కదా కొన్ని పాఠశాలలో చూస్తే భోజనం కూడా పెట్టించేవారు లేరు నేను ఈ మాత్రమైనా చేస్తున్నానని ధీమాగా జవాబు ఇవ్వడం జరిగింది అట్టి పాఠశాలకు సంబంధించి టాయిలెట్స్ లు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి పాఠశాలకు సంబంధించిన భోజన మెనూ ప్రకారం నిర్వహించడం లేదని విద్యార్థులు తెలియజేయడం జరిగింది ప్రస్తుతము పాఠశాల తెరవబడి నాలుగు రోజులు గడుస్తున్న కానీ అట్టి పాఠశాలలో మొత్తం 150 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతము 40 మంది ఉన్నారు మరి మిగిలిన వారు ఎందుకు రావట్లేదు అనేది ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది ఏది ఏమైనా గానీ ప్రస్తుతము ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ పనితీరు ఏమీ బాగోలేదు అని విద్యార్థులు తెలిపినటువంటి సమాచారం మూల పోచారం ఆశ్రమ గిరిజన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ నిరుపేద కుటుంబానికి చెందిన వారే వారి పట్ల నిర్లక్ష్యం విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం పెట్టవలసిన వారి యొక్క ఆహార విషయంలో నిర్లక్ష్యం నాసిరకం కూరగాయలు సాలి సాలని విధంగా భోజనము పెట్టడం జరుగుతుంది మరి ఇలాంటి హెచ్ఎం మరియు వార్డెన్లపై జిల్లా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అర్థం కాని దుస్థితి ఒకవైపు హెచ్ఎం గా ఉంటూ మరోవైపు హాస్టల్ వార్డెన్ గా విధులు నిర్వర్తిస్తూ ఒకే వ్యక్తి రెండు విధులను నిర్వర్తిస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకే వ్యక్తి రెండు విధులను సమర్థవంతంగా నిర్వహించగలడా అనేది కూడా ఉన్నతాధికారులు పరిశీలనలో తీసుకోవాలి ఒకే వ్యక్తి రెండు విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు కావున వారిని ఏదో ఒక పదవిలో కొనసాగేటట్టు చూసి పిల్లలకు అందవలసిన పోషకాహారం సమర్థవంతంగా అందే విధంగా జిల్లా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుకుంటున్నారు

విశాఖపట్నం

తల్లిబిడ్డ ఆరోగ్యానికి పోషకాహారం అవసరం – ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్యానికి ప్రభుత్వం అందిస్తున్న పోషక పదార్థాలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సూచించారు. ఆనందపురం మండల కార్యాలయంలో గురువారం నిర్వహించిన 8వ రాష్ట్రీయ పోషక మాసం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గర్భిణీలకు అవసరమైన పోషకాలను శాస్త్రీయంగా ఎంపిక చేసి ప్రభుత్వం అందజేస్తోందని తెలిపారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని గర్భిణీలు పూర్తిగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఆరోగ్య సిబ్బంది ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలని సూచించారు. కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకన్నా ఇలాంటి ఆరోగ్యకార్యక్రమాల్లో పాల్గొనడం ఎక్కువ సంతృప్తిని ఇస్తుందని అన్నారు. అనంతరం ప్రభుత్వం తరపున గర్భిణీలకు సీమంతం నిర్వహించి, ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంచే అందిస్తున్న చిరుధాన్యాల హల్వా, చిక్కి వంటి పదార్థాల నాణ్యతను పరిశీలించి రుచి చూశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీఓ శ్రీదేవి, ఎమ్మార్వో శ్రీనుబాబు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు తాట్రాజు అప్పారావు, కార్పొరేటర్లు పి.వి. నరసింహం, లొడగల అప్పారావు, కూటమి నేతలు చిక్కాల విజయ్ బాబు, బి.ఆర్.బి. నాయుడు, తమ్మిన అప్పలరాజు, శాఖారి శ్రీనివాస్, రెడ్డి బాబు, కర్రి శ్రీనివాసరావు, కె. శ్రీకాంత్ రాజు, బమ్మిడి ఉమ, ఎర్ర రాజు, మహంతి శివాజీ, అప్పలరాము, గండ్రెడ్డి రమేష్, సోమునాయుడు, పాండ్రంగి అప్పలరాజు, బమ్మిడి తారక్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

రూ.1.12 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం జీవీఎంసీ 1, 2 వార్డుల్లో రూ.1.12 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రోడ్లు, డ్రెయిన్లు వంటి సౌకర్యాల కోసం 1వ వార్డులో రూ.27 లక్షలు, 2వ వార్డులో రూ.85 లక్షలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి దిశగా పయనిస్తోందని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గాడు చిన్ని కుమారి లక్ష్మి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, భీమిలి అధ్యక్షుడు సరగడ అప్పారావు, గాడు అప్పలనాయుడు, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

స్థానిక సంస్థల్లో BC రిజర్వేషన్ల అమలు జీవోపై హైకోర్టు

పున్నమి: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9తో పాటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై కూడా హైకోర్టు స్టే విధించింది. బీసీ రిజర్వేష్లపై సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇచ్చింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టులో రెండ్రోజుల పాటు వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీసీ కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని, స్వాతంత్ర్యం తర్వాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలోనే జరిగిందని అన్నారు. ఇంటింటికెళ్లి సర్వే చేశారని, ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత న్యాయస్థానాల జోక్యం ఉండబోదని వాదించారు. ఈ అంశాన్ని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.