Thursday, 30 April 2026

Blog

ఖమ్మం

బీజేపీ జిల్లా కార్యవర్గం లో సత్తుపల్లి నేతలు

ఖమ్మం పున్నమి ప్రత్యేక ప్రతి నిధి ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యవర్గం ని ఇటీవల ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ప్రకటించారు. కార్యవర్గం లో సత్తుపల్లి నియోజకవర్గం కి చెందిన సత్తుపల్లి, వేంసూరు మండలాలకి చెందిన నాయకులని జిల్లా కార్యవర్గం లోకి తీసుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షులు గా సుదర్శన్ మిశ్ర (సత్తుపల్లి ) వీరం రాజు (వేంసురు) ప్రధాన కార్యదర్శి గా నాయుడు రాఘవ రావు (సత్తుపల్లి) కార్యదర్శి గా సురేంద్ర రెడ్డి (వేంసురు) జిల్లా కమిటీ కి ఎన్నిక ఐయ్యారు. వీరి ఎన్నిక పట్ల సత్తుపల్లి, వేంసురు మండల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ఖమ్మం

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం కష్టపడుతున్న బీజేపీ శ్రేణులు

ఖమ్మం పున్నమి ప్రతి నిధి. ఖమ్మం జిల్లా లో జరగనున్న స్థానిక సంస్థ ల ఎన్నికల్లో విజయం సాధించాలి అనే దృఢ సంకల్పం తో బీజేపీ ఖమ్మం జిల్లా శ్రేణులు కష్ట పడుతున్నారు. జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసు దేవా రావు ల ఆధ్వర్యంలో నూతన కమిటీ లో ఎన్నికఅయినా సభ్యులు గెలుపు భాద్యతలు భుజన వేసుకో ని అహర్నిశలు శ్రామిస్తున్నారు. మొత్తం 5 నియోజకవర్గల్లో స్థానిక సంస్థ ల ఎన్నికల సన్నాహక సమావేశాలు పూర్తి చేసుకున్న బీజేపీ నేతలు గెలుపు గుర్రాల్ల అన్వేషణ లో ఉన్నారు. ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల కన్వీనర్ గా భాద్యతలు తీసుకున్న ఈవి రమేష్ 5 నియోజకవర్గల్లో కార్యకర్తలని నాయకులు ని సమనవ్యయం చేసుకొని జిల్లా లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ని గెలిపిస్తాం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.కేంద్ర ప్రభుత్వము గ్రామాలకి ఇస్తున్న పధకాలని పెద్ద ఎతతున్న ప్రజల్లోకి తీసుకోని వెళ్తాము అని ప్రజలని ఓటు అడిగే హక్కు బీజేపీ కే ఉందని బీజేపీ నాయకులు అంటున్నారు.

రంగారెడ్డి

సుప్రీంకోర్టు సీజేఐపై దాడి గర్హనీయం నిందితుడిని కఠినంగా శిక్షించాలి తుర్కయంజాల్ అఖిలపక్ష నేతల డిమాండ్

పున్నమి: ప్రతినిధి దూపం అంజనేయులు: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై దాడిని అఖిలపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. తుర్కయంజాల్ అంబేద్కర్ చౌరస్తాలో సాగర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి, నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు సీజేఐపై జరిగిన దాడి యావత్ భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. దేశంలోనే అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిపై దాడి జరగడం హేయమైన చర్య అని అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మంపేరుతో దాడులకు పాల్పడటం ఘోరమన్నారు. సీజేఐ దళితుడు కాబట్టే ఆయనపై దాడి చేశారని మండిపడ్డారు.నిందితుడు రాకేష్ కిష్పో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకులు ఓరుగంటి యాదయ్య, సీపీఎం జిల్లా నాయకుడు డి.కిషన్, బీజేపీ నేత బచ్చిగళ్ల రమేష్, బీఎస్పీ నేతలు వద్దిగళ్ల బాబు, పట్నం రమేష్, మేతరి కుమార్, సీపీఎం నాయకులు ఆశీర్వాదం, సత్యనారాయణ, జ్యోతిబసు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కొమ్మని దర్శన్, గోపాల్, వినోద్, సాయి, భగత్ తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ (NACS) ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది

భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ (NACS) తరఫున సైబర్ సెక్యూరిటీ మరియు ఎథికల్ హ్యాకింగ్‌లలో ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాలకు అర్హులైన అభ్యర్థుల నుండి రాష్ట్ర స్థాయిలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.nacsindia.org ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం 78931 41797 నంబర్‌ను సంప్రదించగలరు.

అన్నమయ్య

పెంచలకోనలో వధూవరులకు ఆశీర్వాదాలు : ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి హాజరు

నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోనలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రత్తిన ప్రవీణ్‌కుమార్–రేవతి వివాహ రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం కే.కందులవారిపల్లి గ్రామానికి చెందిన రత్తిన సిద్ధేశ్వర–రమాదేవి దంపతుల కుమారుడు ప్రవీణ్‌కుమార్ వివాహ రిసెప్షన్‌కు ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్‌, రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్‌, అలాగే రైల్వే కోడూరు నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జ్‌, కడప అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి గారి కుమారుడు యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ మాట్లాడుతూ, “ప్రవీణ్–రేవతి దాంపత్య జీవితం సుఖశాంతులతో, సిరిసంపదలతో కళకళలాడాలని” ఆశీర్వదించారు. అదే విధంగా ముక్కా సాయి వికాస్ రెడ్డి కూడా వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరై వేడుకను మరింత వైభవంగా మార్చారు.

పశ్చిమ గోదావరి

రాచర్లలో మహానాగ సినిమా షూటింగ్ ప్రారంభం

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పరిధిలోగల పెంటపాడు మండలం రాచర్ల గ్రామంలో భీమవరం టాకీస్ 118 వ చిత్రంగా మహా నాగ సినిమా షూటింగ్ షెడ్యూల్ ఖరారు అయ్యింది బుధవారం సినిమా షూటింగ్ ను ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని క్లాప్ కొట్టి షూటింగ్ ను ఘనంగా ప్రారంభించారు యాంత్రిక ప్రపంచంలో దైవస్మరణ మరిచి దైనందిన జీవితంలో పరుగులు తీస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మహానాగ సినిమా ద్వారా దైవ భక్తిని మరోసారి చాటనున్నారని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. రాచర్ల గ్రామంలో శ్రీ కృష్ణాశ్రమం మరియు శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించి పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో మహానాగ సినిమా షూటింగ్ సన్నివేశాలు చిత్రీకరించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో వస్తున్న చిత్రాలకు భిన్నంగా భగవంతుని ప్రజలందరూ కొలిచే విధంగా మహానాగ సినిమా ద్వారా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రజలందరూ ఆదరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఎమ్మెల్యే బొలిశెట్టి కి కృతజ్ఞతలు తెలియజేశారు చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటివరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద తమిళ సినిమాలు ఎక్కువగా ఉన్నాయని మన తెలుగు సినిమాలు సరిగా లేవని స్వామి దయతో మహా నాగ సినిమాను 18 రోజులపాటు రాచర్ల గ్రామంలో పచ్చటి వాతావరణంతో పల్లెటూరి నేపథ్యంలో సినిమా షూటింగ్ చేస్తున్నామని అన్నారు ఆగస్టు 15వ తేదీ 15 సినిమాలు ఒకేసారి మొదలు పెట్టమని ఇది గిన్నిస్ రికార్డు వైపు వెళుతుందని అందులో ఒకటిగా మహానాగ సినిమా ఉందని అన్నారు గతంలో వాసవి మహత్యం సినిమా తీసిన డైరెక్టర్ ఉదయ భాస్కర్ ఈ సినిమాకు డైరెక్టర్ గా పని చేస్తున్నారని స్క్రిప్ట్ అంబికా కృష్ణ అందించారని నటీనటులు హీరోగా రమాకాంత్ హీరోయిన్ గా శ్రావణి ఉన్నారని సీనియర్ నటులు సుమన్ తోపాటు జబర్దస్త్ అప్పారావు ఇంకా 20 మంది నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు సినీ నిర్మాత అంబికా కృష్ణ పాలూరి వెంకటేశ్వరరావు కూటమి నాయకులు రాచర్ల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

పశ్చిమ గోదావరి

ఏపీ నిట్ లో ఈ నెల 10, 11వ తేదీల్లో అలరించనున్న టెక్రియా 2కె25 కార్యక్రమాలు

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం…. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (ఏపీ నిట్)లో ఈ నెల 10, 11వ తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించనున్న టెక్రియా 2కె245 కార్యక్రమాలు అలరించనున్నాయి. దీనిలో భాగంగా బుధవారం రాత్రి ప్రాంగణంలోని గ్రంధాలయం వద్ద ఏర్పాటుచేసిన కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో వైజ్ఞానిక స్పృహను పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు వినూత్న ఆలోచనలు చేస్తూ సమాజహిత పరిశోధనలపై దృష్టిసారించాలని వివరించారు. డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అసోసియేట్ డీన్ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు. ముందుగా విద్యార్థులు నృత్యాలు చేయడంతోపాటు తమ ఆటపాటలతో చూపరులను మైమరిపించారు. ఈ కార్యక్రమంలో డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ కే.హిమబిందు, అసోసియేట్ డీన్ డాక్టర్ శీనివాసన్, ఆచార్యులు డాక్టర్ టి.రమేష్ తదితరులు పాల్గొన్నారు. టెక్రియా కార్యక్రమాలు.. ఈ నెల 10,11న నిర్వహించనున్న టెక్రియా కార్యక్రమాల వివరాలిలా ఉన్నాయి. రోబోటిక్స్, ఆటోమేషన్, అల్టిమేట్ డ్రోన్, డ్రోన్ చాలెంజ్,సెరెనిటీ రూమ్, ఇంజనీర్స్ డ్రైవ్ వే, రిథమ్ రియాల్టీ, షేర్ లాక్డ్, షార్ట్ ఫిలిం, గైరో మేజ్ ఛాలెంజ్, డిస్ ఎక్స్ట్రీమ్, టెక్ ఎక్స్పో, ఎరిస్, మెటీరియల్ మైండ్స్ పోస్టర్ షో కేస్, కాస్ ఏ థాన్, డ్రోన్ వర్క్ షాప్, హోవర్ నోవ, నేచర్ హంట్, బింగో బ్లోసమ్, కెరీర్ గ్యాలరీ, షూట్ ద వరల్డ్, టిక్ ఆర్కేడ్, విజనరీ, ఎఫ్ 1 ద రేస్, స్టార్ట్ అప్ ఎస్కేప్ రూమ్, ఇన్నోవేషన్ ఎక్సహిబిట్, సాయంత్రం సాంస్కృత కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు.

పశ్చిమ గోదావరి

పేద విద్యార్థికి ఆర్థిక సాయం చేసిన వడ్డీ రఘురాం నాయుడు

పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం ఒక పేద విద్యార్థి చదువుకోడానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం (ఆక్వా) వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం ఆర్థిక సహాయం చేశారు ఆ అమ్మాయికి చదువు నిమిత్తం భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా నేను ఉన్నానని భరోసా ఇచ్చి సహాయం చేస్తానని మాట ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థి వడ్డీ రఘురాం నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెడ్డి సొసైటీ సభ్యులు పెంటపాడు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

జాతీయ హిందీ లాంగ్వేజ్ సలహా కమిటీ సభ్యుడు సాధిక్ కు ఘన సత్కారం

పున్నమి న్యూస్(కోనసీమ), సీనియర్ జర్నలిస్ట్ రమణ:జాతీయ హిందీ లాంగ్వేజ్ సలహా కమిటీ సభ్యుడిగా నియమితులైన బీజేపీ సీనియర్ నాయకులు, మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సంషు సాద్విక్ ను బుధవారం పి.గన్నవరం లో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా, రాష్ట్ర అధికార ప్రతినిధులు నల్లా పవన్, పెద్దిరెడ్డి రవికిరణ్ లు పాల్గొని మాట్లాడుతూ సాద్విక్ పార్టీకి విశేష సేవలందించారు అన్నారు. ఈ సందర్భంగా అతనికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి.గన్నవరం మండల అధ్యక్షులు తిక్క సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు సలాది వీరబాబు, చీకరమెల్లి శ్రీనివాసరావు, ఇంచార్జి ఇళ్ల సత్యనారాయణ, తమనంపూడి రామకృష్ణారెడ్డి, మాలే శ్రీనివాస్ నగేష్, గనిశెట్టి వెంకటేశ్వరరావు, చొల్లంగి త్రినాధ్, చిట్టినీడి రంగసాయి, కముజు శ్రీనివాసు, గండ్రోతు వీర గోవిందరావు, నందం శ్రీలక్ష్మి, యనమదల రాజ్యలక్ష్మి, మోకా ఆదిలక్ష్మి, కొండేటి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టపాసుల గోదాములు, తయారీ కేంద్రాలపై తనిఖీలు చేపట్టండి*

*టపాసుల గోదాములు, తయారీ కేంద్రాలపై తనిఖీలు చేపట్టండి* *48 గంటల్లోపు నివేదిక ఇవ్వాలని అగ్నిమాపకశాఖ అధికారులకు ఆదేశం* *నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు* *జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్ల* *నెల్లూరు:* రానున్న దీపావళి పండుగ నేపథ్యంలో టపాసుల తయారీ కేంద్రాలు, గోదాములను వెంటనే తనిఖీ చేసి, 48 గంటల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని అగ్నిమాపకశాఖ అధికారులను జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్ల బుధవారం ఆదేశించారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా అమలులో ఉన్నాయో లేదో సమగ్రంగా పరిశీలించాలని జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి శ్రీనివాసులురెడ్డికి కలెక్టర్‌ ఆదేశించారు.జిల్లాలో బాణాసంచా తయారీ, విక్రయ కేంద్రాలు, గోదాముల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.తయారీ కేంద్రాల సమీపంలో పాఠశాలలు లేదా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలు లేకుండా చూసుకోవాలని, కేవలం లైసెన్సు పొందినవారే బాణాసంచా తయారీ, నిల్వలు నిర్వహించాలన్నారు. నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే టపాసులు కాల్చేటప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.