Thursday, 30 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

జాతీయ హిందీ లాంగ్వేజ్ సలహా కమిటీ సభ్యుడు సాధిక్ కు ఘన సత్కారం

పున్నమి న్యూస్(కోనసీమ), సీనియర్ జర్నలిస్ట్ రమణ:జాతీయ హిందీ లాంగ్వేజ్ సలహా కమిటీ సభ్యుడిగా నియమితులైన బీజేపీ సీనియర్ నాయకులు, మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సంషు సాద్విక్ ను బుధవారం పి.గన్నవరం లో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా, రాష్ట్ర అధికార ప్రతినిధులు నల్లా పవన్, పెద్దిరెడ్డి రవికిరణ్ లు పాల్గొని మాట్లాడుతూ సాద్విక్ పార్టీకి విశేష సేవలందించారు అన్నారు. ఈ సందర్భంగా అతనికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి.గన్నవరం మండల అధ్యక్షులు తిక్క సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు సలాది వీరబాబు, చీకరమెల్లి శ్రీనివాసరావు, ఇంచార్జి ఇళ్ల సత్యనారాయణ, తమనంపూడి రామకృష్ణారెడ్డి, మాలే శ్రీనివాస్ నగేష్, గనిశెట్టి వెంకటేశ్వరరావు, చొల్లంగి త్రినాధ్, చిట్టినీడి రంగసాయి, కముజు శ్రీనివాసు, గండ్రోతు వీర గోవిందరావు, నందం శ్రీలక్ష్మి, యనమదల రాజ్యలక్ష్మి, మోకా ఆదిలక్ష్మి, కొండేటి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టపాసుల గోదాములు, తయారీ కేంద్రాలపై తనిఖీలు చేపట్టండి*

*టపాసుల గోదాములు, తయారీ కేంద్రాలపై తనిఖీలు చేపట్టండి* *48 గంటల్లోపు నివేదిక ఇవ్వాలని అగ్నిమాపకశాఖ అధికారులకు ఆదేశం* *నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు* *జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్ల* *నెల్లూరు:* రానున్న దీపావళి పండుగ నేపథ్యంలో టపాసుల తయారీ కేంద్రాలు, గోదాములను వెంటనే తనిఖీ చేసి, 48 గంటల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని అగ్నిమాపకశాఖ అధికారులను జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్ల బుధవారం ఆదేశించారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా అమలులో ఉన్నాయో లేదో సమగ్రంగా పరిశీలించాలని జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి శ్రీనివాసులురెడ్డికి కలెక్టర్‌ ఆదేశించారు.జిల్లాలో బాణాసంచా తయారీ, విక్రయ కేంద్రాలు, గోదాముల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.తయారీ కేంద్రాల సమీపంలో పాఠశాలలు లేదా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలు లేకుండా చూసుకోవాలని, కేవలం లైసెన్సు పొందినవారే బాణాసంచా తయారీ, నిల్వలు నిర్వహించాలన్నారు. నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే టపాసులు కాల్చేటప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్థి చేస్తాం* *పరిశ్రమల స్థాపనతోపాటు టూరిజంనీ అభివృద్థి చేస్తాం

*నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్థి చేస్తాం* *పరిశ్రమల స్థాపనతోపాటు టూరిజంనీ అభివృద్థి చేస్తాం* *విజయవాడ ఉత్సవ్‌ నిర్వహణపై వైసీపీ దుష్ప్రచారం సరికాదు* *4వ డివిజన్‌లో రూ.24 లక్షల వ్యయంతో తాగునీటి సరఫరా పైపులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌* తమ కూటమి ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరాన్ని పారిశ్రామికంగానే కాకుండా టూరిజంగా కూడా అభివృద్థి చేస్తామని తూర్పు నియోకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. నగరంలోని కనకదుర్గమ్మ గుడిని అభివృద్థి చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిదేనని పేర్కొన్నారు. బుధవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్‌ ఎల్‌ఐసీ కాలనీలో నెల్సన్‌ మండేలా పార్కు పరిసర ప్రాంతాల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన అక్కడి వారిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం డివిజన్‌లోని రూ.24 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన తాగునీటి సరఫరా పైపులు అమర్చే పనులకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ విజయవాడలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చి లక్షలాది మంది భక్తులకు ఏ చిన్న అసౌకర్యం కలుగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2014 వ సంవత్సరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కనకదుర్గమ్మ గుడిపై ప్రత్యేక శ్రద్ద పెట్టి అభివృద్థి చేశారని గుర్తుచేశారు. 2019వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి దుర్గమ్మ గుడిని ఏ విధమైన అభివృద్థి చేశారో ప్రజలే పోల్చి చూసుకోవాలని కోరారు. జగన్‌మోహన్‌రెడ్డి దుర్గమ్మ గుడికి వచ్చిన ప్రతిసారి కొండరాళ్ళు విరిగిపడేవని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం దసరా ఉత్సవాలతో పాటుగా విజయవాడ పేరును ప్రపంచవ్యాప్తంగా వినిపించేలా ‘విజయవాడ ఉత్సవ్‌’ను ఎంతో వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. వేలాది మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారని, రోజుకు రెండు లక్షల ఆదాయం భక్తుల నుంచి కానుకల ద్వారా ఆలయానికి వస్తోందన్నారు. దసరా ఉత్సవాలపై ప్రజలను మభ్యపెట్టాలని వైఎస్సార్‌సీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడం సరికాదని అన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్‌ ప్రత్యేక శ్రద్ధతో 24 గంటలు దృష్టి పెట్టి దసరా ఉత్సవాలను, ‘విజయవాడ ఉత్సవ్‌’ను చక్కగా నిర్వహించారని వివరించారు. ఎంపీ కేశినేని శివనాథ్‌పై వైఎస్సార్‌సీపీ నాయకులు అవాకులు, చవాకులు పేలడం సరికాదన్నారు. విజయవాడను టూరిజం పరంగా అభివృద్థి చేయడానికి తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుటుందన్నారు. దసరా ఉత్సవాలతో పాటుగా ‘విజయవాడ ఉత్సవ్‌’ను నిర్వహించామని, గాంధీ హిల్‌ను కూడా టూరిజంగా అభివృద్థి చేస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు చెబుతున్న విషయాల్లోని అవాస్తవాలను ప్రజలందరూ గ్రహించాలని కోరారు. నగర పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపన ద్వారా ఇక్కడి యువతకు వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని, నగరాన్ని టూరిజంగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్థి పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. రోడ్ల నిర్మాణంతో పాటుగా డ్రైనేజీ సౌకర్యాలను కూడా కల్పిస్తున్నామన్నారు. ఆ అభివృద్థిలో భాగంగానే ఇప్పుడు 4వ డివిజన్‌లో రూ.24 లక్షల అంచనా వ్యయంతో తాగునీటి సరఫరా పైపులను అమర్చే పనులను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో వటపట్ల గోపాలకృష్ణ, నందిపాటి దేవానంద్, గద్దె రమేష్, యలమంచలి రాజేష్, దోమకొండ రవి, కొర్రపాటి సురేంధ్ర, యర్నేన్ని వేదవ్యాస్, పి.మహేంద్ర, మల్లిఖార్జునరావు, శేషగిరిరావు, దాసరి గాబ్రియేలు, ధూళిపాళ్ల రమేష్, చలసాని రమణ, షేక్ షరీఫ్, కార్పోరేషన్ ఏఈ దీక్షీత్‌ తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసేందుకు డేరంగుల ఈశ్వర్

పున్నమి: రంగారెడ్డి జిల్లా, యాచారం మండల కేంద్రంలోని డిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం వడ్డెర కుల పెద్దల సమక్షంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు రాష్ట్ర సీనియర్ నాయకుడు వరికుప్పల శ్రీశైలం, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దండగల వెంకటరమణ, రాష్ట్ర సీనియర్ నాయకుడు డేరంగుల సత్తయ్యలు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మనకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామంటూ అందరం ఐక్యమత్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. జడ్పిటిసి అభ్యర్థిగా ఈశ్వర్ ను గెలిపించుకోవాలని వారు కోరారు. అనంతరం విహెచిఎస్ మండల అధ్యక్షుడు డేరంగుల ఈశ్వర్ మాట్లాడుతూ.. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలో యాచారం మండల జడ్పిటిసిగా అభ్యర్థిగా మీ అందరి సహకారంతో పోటీ చేయబోతున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమం లో గండికోట వెంకటేష్, డేరంగుల శంకర్, డేరంగుల పాండు, నాన్కంపేట కృష్ణ, గణేష్, డి.శ్రీను హరికృష్ణ, శ్రీశైలం, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

_*విజ్ఞాన్ కాలేజీలో జీఎస్టీ 2.0 పై అవగాహన*

_*విజ్ఞాన్ కాలేజీలో జీఎస్టీ 2.0 పై అవగాహన*_ పొదలకూరు పున్నమి ప్రతినిధి: పట్టణంలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో జిఎస్టి సూపర్ సేవింగ్స్ పై బుధవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై ఎకనామిక్స్,కామర్స్, తెలుగు అధ్యాపకులు రాజేంద్ర ప్రసాద్, దేవళ్ళ.కృష్ణ, ఏ.చంద్రశేఖర్ విద్యార్థులకు వివరించారు. అనంతరం వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుబ్బారావు, జీ.ఎన్ రెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ 2.0 లో భాగంగా సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై విద్యార్థులు పూర్తి అవగాహన కలిగివుండాలన్నారు. ప్రస్తుతం తగ్గించిన జీఎస్టీపై అవగాహన కల్పించారు. జీఎస్టీ 2.0 రావడం వలన పేద ప్రజలకు, సన్నకారు రైతులకు, చిరు వ్యాపారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా జీఎస్టీలో వచ్చిన మార్పుల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకడమిక్ డీన్ సీ.హెచ్ .కృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలం నూతక్కివారి కండ్రిక పంచాయతీ గాలిపాలెం గ్రామానికి చెందిన మర్రి తిరుపతి కుమారుడు మర్రి శీనయ్య (26) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. తెలుగుగంగ కాలువ రెగ్యులేటర్ వద్ద మోటార్ రిపేర్ చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. శీనయ్య మోటార్ రిపేరు పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందినవాడు. అతని ఆకస్మిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

తిరుపతి

నకిలీ మద్యానికి బాట వేసిందే వైసీపీ ప్రభుత్వం.

నకిలీ మద్యానికి బాట వేసిందే వైసీపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సలహా మండలి డైరెక్టర్. యం.సుబ్బయ్య. గతంలో 2019 నుంచి 2024 దాకా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడుముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పాడింది దాదాపు ఈ రాష్ట్రంలో 40 వేల మద్యం బెల్టు షాపులకు అనుమతి ఇచ్చి విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని అమ్మి ఆరోజు ప్రజల ప్రాణాలు బలి తీసుకుంది అమాయకమైన ఎంతోమంది ప్రజలు అమ్మిన కల్తీ మద్యాన్ని తాగి అనాధన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అలాంటి పార్టీ మీ వైసీపీ పార్టీ అదే మా తెలుగుదేశం పార్టీలో తప్పు ఎవరు చేసినా వెంటనే తగిన శిక్ష వేస్తారని మొన్నటి తంబళ్లపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి.జై చంద్ర రెడ్డి గారిని నకిలీ మద్యం అన్నాడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబునాయుడు గారు దృష్టికి వచ్చిన వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది మరి క్రమశిక్షణీమారుపేరు వినయ విధేయత కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి మరి ఆనాడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రథమ ముద్దాయిగా అవినాష్ రెడ్డి ఉన్నాడని తెలిసిన ఆరోజు నిండు శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి నా తమ్ముడు నా ఎడంకన్ను అని ఒక అత్యా నేరం మోపబడిన అవినాష్ రెడ్డిని పొగడలేదా మరి మీరు గొప్ప మేం గొప్ప ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వినయ విధేయత కలిగి ఉంటాది తప్పులు చేసిన వారిని మందలించి తెలుగుదేశంపార్టీ నుంచి తొలగించి తగిన బుద్ధి చెబుతారు అలాంటి పార్టీ మా తెలుగుదేశం పార్టీ మరి మీ వైసీపీ పార్టీ లాగా తప్పులు చేసే వారిని భుజాల మీదకి ఎక్కించుకొని వేడుకగా తిరగలేదు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సలహా మండల డైరెక్టర్ సుబ్బయ్య మాట్లాడటం జరిగినది.

అన్నమయ్య

చిట్వేల్ పట్టణంలో సర్వసభ్య సమావేశం – అధికారులకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కఠిన హెచ్చరిక

చిట్వేల్, అక్టోబర్ 8(పున్నమి ప్రతినిధి) చిట్వేల్ పట్టణం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం మరియు మండల మీటింగ్ లో ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ , యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఘనంగా, విజయవంతంగా జరిగింది. సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అధికారులను ఉద్దేశించి “మూడు నెలల్లో పనితీరు చూపించాలి, ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించబడదు” అని స్పష్టంగా హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రాధాన్యం కావాలని, ఐదు మండలాల అధికారులకు ఆయన కఠినమైన సందేశం ఇచ్చారు. -ప్రజల కోసం కృషి – అభివృద్ధే లక్ష్యం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి రాష్ట్రాభివృద్ధికి ఎంతో ముఖ్యం అని, మౌలిక సదుపాయాల మెరుగుదల, విద్యుత్ సరఫరా, తాగునీటి సమస్యల పరిష్కారం దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. రైతుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన “అన్నదాత సుఖీభవ” పథకం ద్వారా వ్యవసాయ రంగంలో సానుకూల మార్పులు వస్తున్నాయని వివరించారు. అలాగే ఇళ్ల పంపిణీ పథకం సమర్థవంతంగా అమలవుతుందని, అర్హులైన లబ్ధిదారులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -విద్యకు ప్రాధాన్యం – పిల్లల భవిష్యత్తు కాపాడాలి విద్యా రంగంపై కూడా ఎమ్మెల్యే శ్రీధర్ ప్రాధాన్యం ఇచ్చారు. గ్రామాల్లో పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. పిల్లలలో విద్యాపట్ల ఆసక్తి పెంచడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. -ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ సమావేశం అనంతరం ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడిన ఎమ్మెల్యే, స్థానిక సమస్యలను తెలుసుకొని తక్షణ చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. “ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తాము” అని యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పెనగలూరు మండలానికి చెందిన పలు శాఖాధికారులు, ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ సర్పంచులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సంక్షేపంగా, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, విద్య, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత – అన్నీ ఒకే వేదికపై చర్చించబడిన ఈ సర్వసభ్య సమావేశం రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలకు దిశానిర్దేశం చేసేలా నిలిచింది.

తిరుపతి

తాడేపల్లిలో శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన డీఎస్సీ 2025 అభ్యర్ధులు

తాడేపల్లిలో శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన డీఎస్సీ 2025 అభ్యర్ధులు డీఎస్సీ 2025లో తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్ధులు తాడేపల్లిలో మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. మెగా డీఎస్సీ పేరుతో తమను కూటమి ప్రభుత్వం దగా చేసిందని వారు వాపోయారు. మెరిట్‌ను విస్మరించి రాజ్యాంగ విరుద్దంగా ప్రభుత్వం వ్యవహరించిందని, తమకు న్యాయం చేయాలని వారంతా వైయస్‌ జగన్‌ను కోరారు.

తెలంగాణ

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన : జిల్లా కలెక్టర్

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) తిప్పర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. అనంతరం రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ తిప్పర్తి ధాన్యం కొనుగోలు కేంద్రానికి గత సంవత్సరం 75 వేల మెట్రిక్ టన్నుల కొన్న చరిత్ర ఉందని,రైతులు నాణ్యతతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తేవాలని, ధాన్యంలో తేమ ఎక్కువగా లేకుండా, 17% మిం చకుండా తీసుకొని రావాలని, ధాన్యం అమ్మిన రైతులకు 72 గంటల్లో చెల్లింపులు చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రెండు డ్రయర్లను ఏర్పాటు చేయగా, ఒకటి తిప్పర్తిలో, మరొకటి మిర్యాలగూడలో ఏర్పాటు చేయడం జరిగిందని డ్రయర్ల పై రైతులకు అవగాహన కల్పించాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆమె ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో 100 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకున్నదని తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.