Thursday, 30 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మాదకద్రవ్యాలతో భవిష్యత్‌ నాశనం : పొదలకూరు సీ.ఐ శివరామకృష్ణారెడ్డి*

*మాదకద్రవ్యాలతో భవిష్యత్‌ నాశనం : పొదలకూరు సీ.ఐ శివరామకృష్ణారెడ్డి* _*మాద్యక ద్రవ్యాలు, ఈవ్ టీచింగ్, పై విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో అవగాహన* పొదలకూరు పున్నమి ప్రతినిధి :మాదకద్రవ్యాల అలవాటుతో భవిష్యత్‌ నాశనమ వుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి, ఎస్.ఐ హనీఫ్ అన్నారు.బుధవారం పట్టణం లోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో మాదకద్రవ్యాల నివారణ, ఈవ్ టీచింగ్- ర్యాగింగ్ పై పొదలకూరు ఎస్. ఐ హనీఫ్ తో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీ.ఐ శివరామకృష్ణ రెడ్డి ,ఎస్.ఐ హనీఫ్ మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్‌ నాశనమవుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో గొప్పవాళ్ళను చేయాలనే ఆశతో ఉంటే కొంత మంది యువత డ్రగ్స్‌కు అలవాటుపడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. డ్రగ్స్‌ సరఫరా చేసేవారి ఆట కట్టించడానికి పోలీస్‌ సిబ్బంది సిద్ధంగా ఉన్నామని 112 లేదా సమీపంలో పోలీస్‌ వారికి తెలియజేయాలని సూచించారు.ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ అనేవి నేరమని, ఎవరైనా తోటి విద్యార్థులపై ర్యాగింగ్ కు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలుంటాయని భవిష్యత్తు కోల్పోతారని తెలిపారు.సమస్యలు ఎదురైనప్పుడు యువత ధైర్యంతో ఎదుర్కొవాలే తప్ప ఆత్మహత్య అనేది సమస్యలకు పరిష్కారం కాదన్నారు. కళాశాలలు , ఆలయాలు, ప్రధాన కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిది అన్నారు.గ్రామాల్లో ప్రవేశ ద్వారం ,ఆలయాల వద్ద గ్రామాని కి వెలుపలకు వెళ్లే మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను నియంత్రించగల్గుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జూనియర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్స్ ఏ.సుబ్బారావు, జి .ఎన్ .రెడ్డి, అకడమిక్ డీన్ చల్లా వెంకటకృష్ణ, జూనియర్ కాలేజ్ , వైస్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, అధ్యాపక బృందం, పోలీసు సిబ్బంది సౌమ్య,మోహన్,రవితేజ, రసూల్ పాల్గొన్నారు.ఇది

నిర్మల్

🔸దేగాం గ్రామంలో దత్త మందిర్ హుండీ లెక్కింపు – రూ.20,025 వసూలు

(పున్నమి ప్రతినిధి తేదీ 8 .10. 2025 నిర్మల్ జిల్లా)దేగాం గ్రామంలోని శ్రీ దత్త మందిర్లో ఈరోజు బాబు మహారాజ్ సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తుల నిత్య సేవలతో కూడిన ఈ హుండీ లెక్కింపులో మొత్తం రూ.20,025 వసూలైనట్లు నిర్వాహకులు తెలిపారు. వసూలైన మొత్తాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో బాబు మహారాజ్ గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బాహురావు పటేల్ (దేగాం), ఆనందరావు పటేల్ (దేగాం), బాబురావు పటేల్ (మాంజిరి), దిగంబర్ పటేల్ (పాంగ్రి), బాలాజీ పాటిల్ (వాలేగాం) తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి భావంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

జోగులాంబ గద్వాల

తెలంగాణ సరిహద్దులో చెక్ పోస్ట్ ఏర్పాటు.

అలంపూర్ : అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి ) తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తుండడంతో జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సరిహద్దు చెక్ పోస్టు ఏర్పాటు చేసి వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఎస్సై కిరణ్ కుమార్ మరియు సిబ్బంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్న వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా నగదు, మద్యం, ఓటర్లను ప్రలోభ పెట్టి వస్తువుల తరలింపు పై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు చేస్తున్నారు. అలాగే వాహనదారులకు ఎన్నికల కమిషన్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. వాహనదారులు 50 వేల రూపాయలకు పైబడి తమ వెంట తీసుకుని వెళ్లరాదు. అధిక మొత్తంలో డబ్బులు తమ వెంట తీసుకుని వెళుతున్నట్లయితే సంబంధిత పత్రాలు ఉంచుకోవాలి. ఓటర్లలను ప్రలోభ పెట్టే సరైన ధృవ పత్రాలు లేని నగదు మద్యం వస్తువులను సీజ్ చేయడం జరుగుతుందని ఎస్సె తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావడంతో పోలీసులు అప్రమత్తంతో తనిఖీలు చేస్తున్నారు.

నిర్మల్

ఆన్లైన్ ఫ్రాడ్ పై అప్రమత్తత – డాక్టర్ M. శంకర్

(పున్నమి ప్రతినిధి తేదీ 8 .10. 2025 నిర్మల్ జిల్లా)భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆన్‌లైన్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ రంగ నిపుణుడు డాక్టర్ M. శంకర్ ప్రధాన అతిథిగా పాల్గొని, విద్యార్థులు మరియు సిబ్బందికి సైబర్ భద్రతపై విలువైన సూచనలు అందించారు. డాక్టర్ శంకర్ మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయని, పని పేరుతో మోసాలు, ట్రేడింగ్/ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లు, ఫిషింగ్, విషింగ్, సిమ్ స్వాప్, నకిలీ షాపింగ్ వెబ్‌సైట్లు వంటి పద్ధతుల ద్వారా ప్రజల నుంచి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని వివరించారు. అమాయక ప్రజల అత్యాశను, భయాన్ని వాడుకుని మోసగాళ్లు లక్ష్యాలను చేరుకుంటున్నారని చెప్పారు. “అధిక లాభాల ఆశ వద్దు, అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకండి, OTP లేదా PIN వంటి వ్యక్తిగత వివరాలను ఎవరికీ ఇవ్వవద్దు” అని సూచించారు. మోసపోయినవారు వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరూ డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించుకోవడం, సురక్షితమైన ఆన్‌లైన్ అలవాట్లు అలవరచుకోవడం అత్యవసరమని అన్నారు. చివరగా ఆయన “ప్రతి వ్యక్తి అప్రమత్తంగా ఉంటేనే సైబర్ మోసాల నుంచి రక్షించుకోగలరు — మీ అప్రమత్తతే మీ ఆస్తికి రక్ష” అని సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పవన్ పాండే, ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ యు రవికుమార్ డాక్టర్ పీజీ రెడ్డి, జి సుధాకర్, డాక్టర్ జే ఓం ప్రకాష్, సురేందర్, డాక్టర్, సంతోష్, డాక్టర్,నహీదా, దివ్య, డాక్టర్ కల్పన రాజయ్య, కిషన్ మరియు విద్యార్థులు, నాన్ టీచింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు

యాదాద్రి భువనగిరి

*స్థానిక సంస్థల ఎన్నికల్లో కుమ్మర్లకు ప్రాతినిధ్యం కల్పించాలి*

పున్నమి,యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో 4 శాతం జనాభా కలిగి 20 లక్షల మంది ఉన్న కుమ్మర్లకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం గౌరవాధ్యక్షులు చేతరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్.ఆర్ లాడ్జిలో కుమ్మరి సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుమ్మరి సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు చేతరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. 75 సంవత్సరాల స్వాతంత్ర్యంలో చట్ట సభల్లో అడుగు పెట్టని కుమ్మర్లకు అన్ని రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. కుమ్మర్లకు సామాజిక న్యాయం కల్పించనట్లయితే అన్ని సీట్లలో కుమ్మర అభ్యర్థులను నిలబెట్టి గెలుపు ఓటములను తారుమారు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు గంగధారి రాములు, అరూరి నర్సింహ్మ,బేతాళ బాల నర్సింహ్మ, మారుపాక వెంకటేశ్,నానంచర్ల నర్సింహ్మ, అన్నారం రమేష్,తీగుళ్ల యెహోవదాస్, ఎలగందుల బాలరాజు,ఎల్లయ్య,కుమార్, పాండు, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు లో కీలక పరిణామాలు..!!

బీసీ రిజర్వేషన్ల అంశం పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం గా.. అదే విధంగా అనుకూలంగా దాఖలైన పిటీషన్ల పైన విచారణ జరిగింది._ _బీసీ బిల్లు అసెంబ్లీలో పాస్ అవ్వటం.. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. స్థానిక సంస్థల షెడ్యూల్ సైతం ఈ రిజర్వేషన్లతోనే నిర్వహించేలా సిద్దం అయినట్లు వివరించిన పిటీషనర్.. రిజర్వేషన్లు 50 శాతం దాటటానికి అవకాశం లేదని వాదనలు వినిపించారు. దీంతో.. హైకోర్టు ఈ వాదనల తరువాత తదుపరి విచారణ కోసం వాయిదా వేసింది._ _బీసీ రిజర్వేషన్ల అంశం పై హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలుత ఈ కేసు లో దాఖలైన పిటీషన్ల పై కోర్టు ప్రారంభమైన వెంటనే విచారణకు స్వీకరించినా… వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రిజర్వేషన్లపై ప్రస్తుత ఏంటని న్యాయస్థానం ప్రశ్నించింది. సుప్ రీంకోర్టులో జరిగిన విచారణపైనా హైకోర్టు ధర్మాసనం ఆరా తీసింది. అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి విచారిస్తామని పేర్కొన్న ధర్మాసనం..కాసేపటి క్రితం విచారణకు స్వీకరించింది._ _కాగా, బీసీ రిజర్వేషన్లపై 28 ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇంప్లీడ్ పిటీషన్ల పైన ముందుగా వాదనలు జరిగాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయిన అంశాన్ని న్యాయ వాదులు కోర్టుకు వివరించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టుకు నివేదించారు._ _షెడ్యూల్ విడుదల అయినా.. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదనే సుప్రీం ఆదేశాలను పిటీషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్ల బిల్లు పాసయిందా అంటూ కోర్టు విచారణ సమయంలో ప్రశ్నించింది. అసెంబ్లీలో పాస్ అయిందని.. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాదులు సమాధానం ఇచ్చారు. రాష్ట్రపతి ఆమోదం అవసరమా అంటూ కోర్టు ప్రశ్నించింది. రిజర్వేషన్లపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు._ _అయితే సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ల పెంపు నిర్ణయం జరగలేదని పిటీషన్ తరపు లాయర్ వాదించారు. ట్రిపుల్ టెస్ట్ గురించి ప్రధానంగా తన వాదనల్లో ప్రస్తావించారు. ఈ వాదనల తరువాత హైకోర్టు తదుపరి విచారణ కోసం మధ్నాహ్నం కు వాయిదా వేసింది. దీంతో.. హైకోర్టు తీసుకునే నిర్ణయం మేరకు రిజర్వేషన్లు.. స్థానిక సంస్థల నిర్వహణ అంశం పైన స్పష్టత రానుంది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఇకపై PIN ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు

మీ ఫోన్‌ లేదా డివైస్‌ను ప్రతి సారి PIN ఎంటర్ చేసి అన్‌లాక్ చేయాల్సిన అవసరం ఇక లేదంటే ఎంత సౌకర్యంగా ఉంటుందో కదా! ఇప్పుడు మీరు Face Unlock, Fingerprint లేదా Trust Settings వంటివి ఉపయోగించి PIN అవసరం లేకుండా సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో మీరు ఈ ఎంపికను ఆన్ చేసి, వేగంగా, సురక్షితంగా మీ డివైస్‌ను ఉపయోగించండి.

ఆంధ్రప్రదేశ్

మత్స్యకార సమస్యలు త్వరితరగతిని పూర్తి చేయండి

• డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు • తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు కాకినాడ : పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం సముద్ర తీర ప్రాంతంలో నివసిస్తున్న మత్యకారులకు గత ఆరు నెలలుగా మత్స సంపద లేక అప్పుల ఉబులో కూరుకుపోయారని, వారికి జీవన ఉపాధి కల్పించాలని తెలుగు జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు కోరారు. ఈ సందర్భంగా ఆయన కాకినాడ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశంలో మాట్లాడుతూ యానం, ముమ్మిడివరం నియోజకవర్గాలలో ప్రతి మత్స్యకార కుటుంబాలకు ఏ విధంగా గౌరవ వేతనం ఇస్తున్నారో అదే విధంగా కాకినాడ జిల్లాలో ఉన్న మత్స్యకార కుటుంబాలకు గౌరవ వేతనం ఇవ్వాలని ఆయన ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ని అభ్యర్థించారు. మత్స్యకారులు సరైన వసతులు లేక తీర ప్రాంతంలో ఉంటున్న ఏరియాలో సముద్రం కోతతో కొన్ని వందల ఇల్లు జలమయం అయ్యాయని, వారందరికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పునరావాసం కల్పించి కొత్త ఇల్లు కట్టి ఇవ్వాలని ఆయన కోరారు. సముద్రానికి ముందుకు రాకుండా తక్షణమే అడ్డుగట్టు వేయాలని, లేనిచో గ్రామాలు జలమయం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. మత్స్యకార గ్రామాలు కరప మండలం ఉప్పలంక నుండి తొండంగి మండలం అద్దరిపేట వరకు సుమారు 67 గ్రామాలు ఉన్నాయని, ఈనాడు వాళ్ల పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉందన్నారు. మత్స్య సంపద లేక అల్లాడిపోతున్నారని, వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా తీరప్రాంతాలైన కరప మండలం ఉప్పలంక నుండి తొండంగి మండలం అద్దరిపేట వరకు ప్రతి మత్స్యకారుల కుటుంబానికి రూ.11,500లు గౌరవ వేతనం ఇవ్వాలని, యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ మరియు కాకినాడ జిల్లాలో ఉన్న యువకులకు ప్రైవేట్ కంపెనీలో 20 శాతం ఉద్యోగాలు కల్పించాలని ఆయన కోరారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని విషయాలలో ఒక మాట ఇచ్చారంటే ఆ పని పూర్తి చేస్తారని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక్కరే అని పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు కొనియాడారు. రేపు ఉప్పాడ వస్తున్న సందర్భంగా ఆయనను కలిసి మత్స్యకారుల యొక్క సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేస్తానని వెంకటేశ్వరరావు తెలిపారు. Video: https://youtu.be/kgL5XeNkWdw?si=m8CPNE3TgiRlUgAo

తెలంగాణ

స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగలకు 18% రిజర్వేషన్ కల్పించాలి*

*టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు ఎస్సీ,ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి వినతి పత్రం అందచేసిన ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ గారు .* ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారికి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగలకు 18 % శాతం రిజర్వేషన్ అమలు చేసి దానికి అనుగుణంగా సీట్లను కేటాయించాలని ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్.ఎస్.ఏ సంపత్ కుమార్ గారు వినతి పత్రం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంపత్ కుమార్ గారితో పాటు విద్యాశాఖ కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేష్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కొండేటి మల్లయ్య, మామిడి గోపి, తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

తాల్లూరి పల్లవి కి అభినందనలు తెలిపిన బీజేపీ నేతలు

ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (AIPA)ఆల్ ఇండియా టాపర్ గా ఎంపిక అయిన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం లోగల అరేంపుల గ్రామానికి చెందిన తాల్లూరి పల్లవి ని మంగళవారం నాడు బీజేపీ నేతలు కలసి అభినందనలు తెలియ జేశారు. అరేంపు ల లోని ఆమె స్వగృహం నందు బీజేపీ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు జాతోతూ మధు నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో నిజమా బాద్  రూరల్  బీజేపీ  శాసన సభ్యులు ధనపాల్ సూర్య నారాయణ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవారావు, జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు పాలేరు బీజేపీ అసెంబ్లీ ఇంచార్జి, కంటేస్టెడ్ అభ్యర్థి నున్న రవికుమార్ తో పాటు పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.