Thursday, 30 April 2026

Blog

ఎన్ టి ఆర్ జిల్లా

పరిపూర్ణ బాలల ఆశ్రమంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా

నెల్లూరు, అక్టోబర్‌ 2: పరిపూర్ణ బాలల ఆశ్రమంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆశ్రమంలోని చిన్నారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, స్థానిక ప్రజలు కలిసి బాపూజీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకుడు శ్రీ __________ గారు మాట్లాడుతూ, “మహాత్మా గాంధీ గారి ఆలోచనలు, అహింసా సిద్ధాంతం నేటికీ సమాజానికి మార్గదర్శకం. ఆయన చూపిన సత్యం, సేవా మార్గం ప్రతి చిన్నారి జీవితంలో ఆచరణీయంగా ఉండాలి” అని అన్నారు. పిల్లలు గాంధీ గారి జీవిత చరిత్రపై చిన్న నాటికలు, పాటలు, ప్రసంగాలు ప్రదర్శించారు. గాంధీ గారి బొమ్మల ప్రదర్శన, శుభ్రతా కార్యక్రమం కూడా నిర్వహించబడింది. చిన్నారులు “స్వచ్ఛతే సేవ” నినాదాలతో పరిసరాలను శుభ్రపరిచారు. చివరగా పాల్గొన్న వారికి స్వీట్లు పంచి, “మన దేశం శాంతి, సేవ, స్వచ్ఛతతో ముందుకు సాగాలంటే గాంధీజీ బోధనలు పాటించడం అత్యవసరం” అని నిర్వాహకులు పిలుపునిచ్చారు. 🌿 “సత్యం – అహింస – సేవ – గాంధీ గారి త్రిమంత్రాలు మనందరికీ ప్రేరణ” 🌿 — పున్నమి తెలుగు డైలీ Video: https://youtube.com/shorts/Z0Iy6xXhmZ4?si=EeYEX80LTr4fdE_a

హెల్త్ టిప్స్

📱 మొబైల్ ఫోన్ వాడకం వల్ల ఆరోగ్యంపై ప్రభావాలు

🔹 పరిచయం ఇప్పటి ఆధునిక యుగంలో మొబైల్ ఫోన్ మన జీవితంలో భాగమైపోయింది. సమాచార మార్పిడి, వినోదం, విద్య, ఉద్యోగం — అన్నింటికీ ఇది అవసరమైంది. కానీ అదే సమయంలో, మొబైల్‌ అధిక వాడకం శారీరకంగా, మానసికంగా, సామాజికంగా అనేక ప్రతికూల ప్రభావాలను చూపుతోంది. 🔹 1. శారీరక ఆరోగ్యంపై ప్రభావం 👁️ కంటి సమస్యలు: స్క్రీన్‌ ఎదుట ఎక్కువ సమయం గడపడం వల్ల డిజిటల్ ఐ స్ట్రెయిన్, మసక చూపు, కళ్ల ఎండు సమస్యలు వస్తాయి. మొబైల్ స్క్రీన్‌ల నుండి వచ్చే నీలి కాంతి (Blue Light) కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. 💪 మెడ, వెన్నునొప్పి: ఫోన్‌ చూస్తూ గంటల కొద్దీ వంగి కూర్చోవడం వల్ల టెక్స్ట్ నెక్ అనే సమస్య ఏర్పడుతుంది. దీని వల్ల వెన్ను, భుజం, మెడ కండరాలు బలహీనపడతాయి. 😴 నిద్రలేమి: రాత్రి పడుకునే ముందు ఫోన్‌ వాడకం నిద్ర హార్మోన్‌ “మెలటోనిన్‌” ఉత్పత్తిని తగ్గిస్తుంది. దాంతో నిద్రలేమి, అలసట సమస్యలు వస్తాయి. 📶 కిరణాల ప్రభావం: మొబైల్‌ ఫోన్‌లు విడుదల చేసే రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్‌ దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా అనే అంశంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. 🔹 2. మానసిక ఆరోగ్యంపై ప్రభావం 😰 ఆందోళన, ఒత్తిడి: సోషల్ మీడియా, నోటిఫికేషన్‌లు నిరంతరం రావడం వల్ల మనసు అస్థిరమవుతుంది. ఇతరుల జీవితాలతో పోల్చుకోవడం వల్ల డిప్రెషన్‌, ఫోమో (Fear of Missing Out) వంటి సమస్యలు వస్తాయి. 📉 దృష్టి లోపం, వ్యసనం: మొబైల్‌కు బానిస కావడం వల్ల దృష్టి కేంద్రీకరణ తగ్గుతుంది. ఎప్పటికప్పుడు ఫోన్‌ చెక్‌ చేయడం అలవాటు అవుతుంది. 💬 సామాజిక దూరం: ఫోన్‌ మీద ఆధారపడటం వల్ల ప్రత్యక్ష సంభాషణలు తగ్గి, ఒంటరితనం పెరుగుతుంది. 🔹 3. సామాజిక ప్రవర్తనపై ప్రభావం మొబైల్‌ అధిక వాడకం యువతలో విద్యాపరంగా, కుటుంబ సంబంధాల్లో ప్రతికూల ప్రభావం చూపుతోంది. చిన్న వయస్సులోనే ఫోన్‌ వాడే పిల్లల్లో మాట్లాడే సామర్థ్యం, దృష్టి వ్యవధి తగ్గిపోతుంది. 🔹 4. నివారణ చర్యలు 20-20-20 నియమం పాటించండి: ప్రతి 20 నిమిషాలకొకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్లపాటు చూడండి. నిద్రకు ముందు ఫోన్‌ వాడకండి. బ్లూ లైట్‌ ఫిల్టర్‌ వాడండి, సరైన కూర్చునే భంగిమలో ఉండండి. నోటిఫికేషన్‌లు తగ్గించండి, వారానికి ఒకరోజు డిజిటల్ డీటాక్స్‌ డే పాటించండి. ఆటలు, వ్యాయామం, మిత్రులతో ప్రత్యక్షంగా సంభాషణ కొనసాగించండి. 🔹 ముగింపు మొబైల్‌ ఫోన్‌ ఒక అద్భుత ఆవిష్కారం. కానీ దాని అధిక వాడకం ఆరోగ్యానికి హానికరం. టెక్నాలజీ మనిషికి సేవ చేయాలి — మనిషి దానికి బానిస కావకూడదు! జాగ్రత్తగా, పరిమితంగా వాడితేనే ఫోన్‌ మన మిత్రుడిగా ఉంటుంది; లేనిపక్షంలో మన ఆరోగ్యానికి శత్రువుగా మారుతుంది. 📰 – పున్నమి తెలుగు డైలీ (Health Awareness Article – Digital Lifestyle Edition)

కామారెడ్డి

అన్నారంలో దివంగత కాంగ్రెస్ కార్యకర్త గంగయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి

కామారెడ్డి జిల్లా, 8 అక్టోబర్ పున్నమి ప్రతినిధి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త, హోటల్ గంగయ్య కొద్ది రోజుల క్రితం అనారోగ్యం తో బాధపడుతూ, మరణించిన విషయం తెలిసిం దే. ఈనేపథ్యంలో,మాజీ జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి శనివారం అన్నారం గ్రామంలోని గంగయ్య కుటుంబాన్ని పరామర్శించారు.గంగయ్య కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పిన మోహన్ రెడ్డి, గంగయ్య మరణం పార్టీకి, గ్రామానికి తీరని లోటు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల గంగయ్య కు ఉన్న నిబద్ధత, ఆయన చేసిన సేవలను కొని యాడారు. గంగయ్య మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ పరామర్శ కార్యక్రమంలో మోహన్ రెడ్డితో పాటు సల్మాన్, రగోత్తం, ఖాసీం, చిన్న గంగ రెడ్డి, దయానంద్, ఎల్లం, దివంగత గంగయ్య కుటుంబ సభ్యులు, పలువురు కాంగ్రెస్ నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఖమ్మం

సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న ‘బినామీ’ విలేకరి

పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా అక్టోబర్ 08 ఏజెన్సీ చట్టానికి తూట్లు, ప్రభుత్వ స్థలాల కబ్జా, బెల్ట్ దందా – అధికారులు మౌనం! ఏన్కూర్ మండల కేంద్రంలో చట్టానికి సవాల్: పాత్రికేయ ముసుగులో చీకటి సామ్రాజ్యంపై చర్యలెప్పుడు చట్టం దృష్టిలో అందరూ సమానులే అన్న సూక్తికి ఏన్కూర్ మండల కేంద్రంలో విలువ లేకుండా పోతోంది. ఇక్కడ ఒక విలేకరి తన పాత్రికేయ గుర్తింపును అడ్డం పెట్టుకొని, చట్టాలను ఉల్లంఘిస్తూ ఒక చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ స్థలాల ఆక్రమణ, ఏజెన్సీ ప్రాంత భూ బదలాయింపు చట్టం (1/70 చట్టం) ఉల్లంఘన మరియు అక్రమ బెల్ట్ షాపుల నిర్వహణ వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నప్పటికీ, ఈ వ్యక్తిపై ఏ అధికారి కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. *చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. బినామీ వ్యాపారాలు* సదరు వ్యక్తి కేవలం విలేకరి కార్డును చూపించి, అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. పేరుకు విలేకరి అయినప్పటికీ, ప్రజా సమస్యలపై ఏనాడూ కలం పట్టిన దాఖలాలు లేవని, అతని దృష్టి కేవలం అక్రమ వ్యాపారాల విస్తరణపైనే ఉందని తెలుస్తోంది. *1/70 చట్టం ఉల్లంఘన:* గిరిజనుల హక్కులను పరిరక్షించే ఏజెన్సీ చట్టాన్ని (1/70) బేఖాతరు చేస్తూ, ఏన్కూర్ ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ వెంచర్లను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గిరిజనేతరులు ఏజెన్సీ భూములను కొనుగోలు చేయడం, అమ్మడం చట్ట విరుద్ధం అయినప్పటికీ, రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపాడు. *ఎక్సైజ్ దందా:* స్థానిక బార్ షాపుల యజమానులకు ‘తొత్తుగా’ వ్యవహరిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో యథేచ్ఛగా బెల్ట్ షాపుల నిర్వహణకు సహకరిస్తున్నాడు. ఎక్సైజ్ శాఖ అధికారులకు నెలవారీ మామూళ్లు ఇచ్చి, అక్రమ మద్యం వ్యాపారాన్ని మూడు పూవులు ఆరు కాయలుగా నడిపిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా, ఇతను బార్ షాపులకు సూపర్‌వైజర్‌గా కూడా పనిచేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. *ప్రభుత్వ స్థలాల కబ్జా:* ప్రభుత్వ జూనియర్ కళాశాల రహదారిని ఆక్రమిస్తూ, అనుమతి లేకుండా అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టడం స్థానిక ప్రజల ఆగ్రహానికి కారణమైంది. ప్రైవేట్ చిట్టి పాటలు వంటి ఇతర చీకటి వ్యాపారాలను కూడా నిర్వహిస్తూ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. *అధికారుల మౌనం..* ప్రజా పాలకుల అండదండలు అక్రమ వెంచర్లు, బెల్ట్ షాపులు, ప్రభుత్వ భూముల కబ్జా వంటి విషయాలు అధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ, ఈ వ్యక్తిపై చర్యలు తీసుకోవడానికి ఏ అధికారి సాహసించడం లేదు. “నా దగ్గర డబ్బు ఉంది, అంగ బలం ఉంది” అంటూ అధికారులను బెదిరించడం వల్లే వారు వెనకడుగు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాక, అధికార పార్టీలో ఉన్న కొందరు నాయకులు సైతం ఇతని మోచేతి నీళ్లకు అలవాటు పడి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. విలేకరికి ఒక రూలు, సామాన్యుడికి ఒక రూలు ఉంటుందా అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. *ప్రజల డిమాండ్:* వెంటనే అధికారులు స్పందించి, ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ వెంచర్లకు అడ్డుకట్ట వేయాలని, అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. అంతేకాకుండా, అక్రమ నిర్మాణానికి కరెంట్ మీటర్ ఇచ్చిన అధికారులపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో చట్టంపై ఉన్న అపోహను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. నిజమైన పాత్రికేయ విలువలను మంటగలుపుతూ, అక్రమ వ్యాపారాలకు పాల్పడుతున్న ఈ బినామీ విలేకరిపై ఉన్నతాధికారులు ఎప్పుడు దృష్టి సారించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

కామారెడ్డి

రాజకీయ ‘రంగుల మార్పు’ స్వార్థమే ధ్యేయంగా నాయకుల కదలిక

కామారెడ్డి 8 అక్టోబర్ పున్నమి ప్రతినిధి : కామారెడ్డి జిల్లా పాటు మండలాలు, గ్రామాల్లో గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో కొందరు నాయకుల వ్యవహారశైలి ప్రజల్లో చర్చనీయాంశం గా మారింది. ఒక పార్టీలో ఉంటూ, తమ స్వలాభా న్ని మాత్రమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని రకర కాల కార్యకలాపాలు నిర్వహించడం, ఆ తర్వాత అకస్మాత్తుగా ‘ఊసరవెల్లి’ మాదిరిగా రంగులు మారుస్తూ వేరే పార్టీలలో చేరి పెత్తనం చెలాయించ డానికి ప్రయత్నించడం వంటివి గమనించాల్సిన అంశాలు.కొన్ని వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఇలాంటి నాయకులు తమ ప్రస్తుత పార్టీలో ఉన్నంతవరకు కేవలం వ్యక్తిగత, ఆర్థిక ప్రయోజనాల కోసం మాత్రమే కృషి చేస్తున్నా రనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల సమస్య లు, పార్టీ సిద్ధాంతాల కంటే తమ ఆధిపత్యం నిలుపుకోవడం, కాంట్రాక్టులు లేదా పదవు లను దక్కించుకోవడంపైనే వీరి దృష్టి అధికంగా ఉంటోం దనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా, తమకు అనుకూలంగా పరిస్థితులు మారగానే, లేదంటే తమ స్వార్థ ప్రయోజనాలకు గండి పడుతోందని భావించిన వెంటనే, ఈ నాయకులు ఏమాత్రం సంకోచం లేకుండా పార్టీ మారిపోతున్నారు. ఈ ‘పలాయనవాదం’ వెనుక సిద్ధాంతపరమైన కారణా లు లేవని, కేవలం అవకాశవాదం మాత్రమే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా పార్టీలు మారుతున్న వ్యక్తులు కొత్త చోట తమ పాత ధోరణినే కొనసాగించి, తక్కువ కాలం లోనే పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నా రనే ఫిర్యాదులు ఉన్నాయి. తమ రాజకీయ భవిష్యత్తు కోసం, పార్టీ పట్ల నిబద్ధత కంటే వ్యక్తిగ త ‘లాబీయింగ్’ కే ప్రాధాన్యత ఇస్తున్న ఈ నాయకు ల తీరుపై పార్టీ కార్యకర్తల్లో, సాధారణ ప్రజల్లో నిరాశ వ్యక్తమవుతోంది. నిజమైన ప్రజాసేవ లక్ష్యం గా కాకుండా, అధికారాన్ని, స్వార్థ ప్రయోజ నాలను పొందే సాధనంగా మాత్రమే పార్టీలను చూస్తున్న ఈ నాయకుల వలసలు, రాజకీయాల విశ్వసనీ యతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని చెప్పవచ్చు.

జాతీయ అంతర్జాతీయ

సమ్మక్క సారక్కా యూనివర్సిటీ లోగో ఆవిష్కరణ

పున్నమి ప్రత్యేక ప్రతి నిధి డిల్లీ ఢిల్లీలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేందర్ ప్రదన్ తో కలిసి తెలంగాణలోని సమ్మక్క సారక్క కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయం లోగోను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆవిష్కరణ చేశారు. ఈ సం దర్భముగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంజూరు చేసిన ఈ విశ్వవిద్యాలయం నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని ఈ యూనివర్సిటీ నిర్మాణం కోసం రూ.800 కోట్లు కేంద్రం కేటాయించడం జరిగింది అని గిరిజన విద్య, సంస్కృతి, సంప్రదాయాల పట్ల మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం.అని అన్నారు దేశంలో తొలిసారిగా గిరిజన భాషలను ఉపయోగించి విశ్వవిద్యాలయం లోగోను రూపొందించడం విశేషం అని అన్నారు గిరిజన సమాజాల అభ్యున్నతికి, సంక్షేమానికి అనునిత్యం పాటుపడుతున్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కి తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ శ్రీ వై. ఎల్. శ్రీనివాస్ , ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

ఖమ్మం

నూతన కమిటీ ని సన్మానించిన బీజేపీ ఏం ఎల్ ఏ ధన్ పాల్ సూర్య నారాయణ.

ఖమ్మం పున్నమి ప్రతి నిధి భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా నూతన కార్యవర్గం ని ఇటీవల బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం నాడు ఖమ్మం జిల్లా పర్యటన కి వచ్చిన ఆ పార్టీ నిజామా బాద్ రూరల్ శాసన సభ్యులు ధనపాల్ సూర్య నారాయణ నూతన కమిటీ సభ్యులకి సన్మానం చేశారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు. నాయుడు రాఘవ రావు, సుదర్శన్ మిశ్రా, దొంగల సత్య నారాయణ, సురేష్, రాజేష్, గుత్త వంశీ, గుత్త వెంకటెస్వర్లు, ధనియాకుల వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు

Blog

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పై లాయర్ రాకేష్ కిషోర్ బూట్ విసిరి దాడికి పూనుకోవడం హేయమైన చర్య. ఈ దుశ్చర్యను ఖండించిన నంద్యాల ముస్లిం జేఏసి

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పై లాయర్ రాకేష్ కిషోర్ బూట్ విసిరి దాడికి పూనుకోవడం హేయమైన చర్య. ఈ దుశ్చర్యను ఖండించిన నంద్యాల ముస్లిం జేఏసి* నిన్ను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సాక్షి గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పై మత చాందస న్యాయవాది వివక్ష కోల్పోయి బూటుతో దాడి చేయడం న్యాయవ్యవస్థ పై దాడి అని, కేంద్రంలోని బీజేపి ప్రభుత్వ అలసత్వం, మతతత్వం దేశవ్యాప్తంగా ఇలాంటి దుశ్చర్యలకు నాంది కావడం విచారకరం అని సీజే గవాయ్ పై దాడిని నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండించింది. కమిటి కో కన్వీనర్ మస్తాన్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో జేఎసి గౌరవ అధ్యక్షులు అబ్దుల్ సమద్ (జమాఆతె ఇస్లామి), బాబా ఫకృద్దీన్ (ఇన్సాఫ్), ఎజాజ్ హుసేన్ (ఎస్డిపిఐ) మాట్లాడుతూ భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై దాడీని ప్రజాస్వామ్య లౌకిక ప్రియులు ముక్త కంఠంతో ఖండించాలని కోరారు. ఇలాంటి చర్యలు మన దేశ ప్రతిష్టను దిగజార్చుతున్నాయని , ఈ దూకుడుకు దేశం మీద గౌరవం లేని వ్యవస్థలో పోషించబడే వ్యక్తులే కారణం అన్నారు. అత్యున్నత వ్యవస్థ అధిపతులైనా దేశాధ్యక్షులు, ప్రధాన న్యాయమూర్తి ఎస్.సి లని వారి స్థాయి దిగజార్చే ప్రయత్నం సర్వ సాధారణం అయిపోయింది, అదే ఓ ముస్లిం చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అని జేఎసి నాయకులు దేశ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసారు. ఇలాంటి మత చాందస్తం ప్రమాదకరమైనది ఇలాంటి సంఘటనలు దేశ ప్రేమికులకు, మేధావులకు ఆందోళన కలిగిస్తున్నాయని ముస్లిం జేఎసి ప్రధాన న్యాయమూర్తి పై జరిగిన దాడి సంఘటనను తీవ్రంగా ఖండించింది.

ఖమ్మం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ నవీన్ యాదవ్‌కి ఇవ్వాలని వీరాభిమాని నరేష్ జదవ్ విజ్ఞప్తి

జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి యువ నాయకుడు నవీన్ యాదవ్‌కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఏన్కూరు మండలం నవీన్ యాదవ్ వీరాభిమాని నరేష్ జదవ్ పార్టీ అధిష్ఠానాన్ని కోరారు.నవీన్ యాదవ్ పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటారని ఆయన పేర్కొన్నారు. బడుగు, బలహీన, మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్న నవీన్ యాదవ్ ప్రజల మన్ననలు పొందారని తెలిపారు.యువతలో చైతన్యం నింపగల, ప్రజలకు చేరువైన నాయకుడిగా నవీన్ యాదవ్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడితే పార్టీకి బలం చేకూరుతుందని నరేష్ జదవ్ అభిప్రాయపడ్డారు. ఆయన నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్

ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ పర్యటన జరుగుతుందనే వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం

విశాఖ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె రాజు సంయుక్త పత్రికా సమావేశం నిర్వహించారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ—ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటన చేపడుతున్నారని తెలిపారు.జగన్ పర్యటనకు 65 వేల మంది వస్తారని చెప్పి, పోలీసులు అనుమతి నిరాకరించడం సరికాదన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి అనుమతి అవసరం లేదని, ప్రభుత్వం కుట్రపూరితంగా హెలికాప్టర్ అనుమతిని కూడా ఆలస్యం చేస్తోందని విమర్శించారు.జగన్ భద్రతను ఇవ్వకుంటే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే భద్రత కల్పిస్తారని, మెడికల్ కాలేజీలను అడ్డుకునే “తాగుబోతులు, తిరుగుబోతులు, పొగరబోతులు” కి సమాధానం చెప్పేందుకు జగన్ వస్తున్నారని చెప్పారు. కె.కె రాజు మాట్లాడుతూ—జగన్ పర్యటనకు ముందే పర్మిషన్ ఇవ్వగా, నాలుగు రోజుల తర్వాత ప్రభుత్వం వెనక్కు తీసుకోవడం ప్రజల్లో జగన్ పట్ల ఉన్న ఆదరణను భరించలేకే అని వ్యాఖ్యానించారు.కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్రపై వివక్షత చూపుతోందని, భూముల దారాదత్తం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ వంటి అంశాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు.ఎన్ని అడ్డంకులు సృష్టించినా అక్టోబర్ 9న జగన్ నర్సీపట్నం వస్తారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సమన్వయకర్తలు మళ్లి విజయప్రసాద్, మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.