Thursday, 30 April 2026

Blog

నిర్మల్

ఘనంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల భైంసా లో ఆదివాసి పోరాట యోధుడు కొమురం భీం వర్ధంతి వేడుకలు

నిర్మల్గో జిల్లా గోపాల్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భైంసాలో ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడు కొమురం భీమ్ వర్ధంతి డిపార్ట్మెంట్ అఫ్ హిస్టరీ ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీ రఘునాథ్ మాట్లాడుతూ, కొమురం భీమ్ ఆదివాసీ హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన మహానీయుడని కొనియాడారు. నేటి కార్యక్రమా వక్త డాక్టర్.పీజీ రెడ్డీ గారు మాట్లాడుతూ కొమురం భీమ్ గారు మహోన్నత మహనీయుడని.జల్, జంగల్, జమీన్” కోసం గెరిల్లా పోరాటాలు నిర్వహించి, ఆదివాసీ హక్కుల సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా త్యాగం చేశారని కొమురం భీమ్ తన పోరాటంతో ఆదివాసీ సమాజానికి దారి చూపి, “అడవి సూర్యుడు”గా నిలిచారని అయన జీవితం అందరికి ఆదర్శమని కొనియాడారు ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు డా. భీమ్రావు, డా.యు. రవికుమార్, డా. శంకర్, గుంత సుధాకర్, ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్తలు ఆరె రాజు, డా. ఓం ప్రకాష్, డా.సంతోష్ కుమార్, డా. కల్పన, డా.నహీదా, దివ్య, రామ్మోహన్, సురేందర్, కిషన్, రాజయ్య, శ్రావణ్య, అర్షియ, వహీద్, ఇర్ఫాన్‌లతో పాటు మరియు విద్యార్థులు ఇతరులు పాల్గొన్నారు.

ఖమ్మం

_బీసీ బిల్లుపై ముఖ్య నేతలతో సీఎం రేవంత్ కీలక మీటింగ్.._*

పున్నమి Daily న్యూస్ ప్రతినిథి: T.Ravinder ఖమ్మం *_బీసీ బిల్లుపై ముఖ్య నేతలతో సీఎం రేవంత్ కీలక మీటింగ్.._* _బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశంపై అడుగడుగునా జాగ్రత్తలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు, హైకోర్టులోను కేసు గెలిచేందుకు తన సర్వశక్తులు ఒడ్డుతోంది._ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం గంటగంటకు పరిస్థితిని అంచనా వేస్తూ ముందుకు వెళుతుంది. *_సీఎం కీలక మీటింగ్_* _అక్టోబర్ 8న హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసు విచారణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన చర్యలు తదితర అనుబంధ అంశాలను చర్చించేందుకు ఏకైక ఎజెండాతో అక్టోబర్ 7న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు._ _అక్టోబర్ 6న సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింగ్వి, సిద్ధార్థ దవే లు వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టులో కూడా బీసీ రిజర్వేషన్ల కేసులో అక్టోబర్ 8న వాదనలు వినిపించాల్సిందిగా అభిషేక్ సింగ్వీని సీఎం రేవంత్ కోరారు._ _సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు హైకోర్టులో అక్టోబర్ 8న కేసు విచారణ నేపథ్యంలో స్వయంగా హాజరై వాదనలు వినిపించాలని అభిషేక్ సింగ్విని సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రుల బృందం ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో రేపు హైకోర్టులో ప్రభుత్వం తరపున అభిషేక్ సింగ్వీ వాదనలు వినిపించనున్నారు._

యాదాద్రి భువనగిరి

మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బిసి సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో “నిరసన”

మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బిసి సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో “నిరసన” యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి, అధ్యక్షత వహించి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లను అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో శాసనసభలో చట్టం చేసి, కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు 42% తో జరుగనున్నాయని, బీసీలంతా అనుకుంటున్న సమయంలో, కొందరు రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు.. బీసీల 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకోవలనే, దురుద్దేశంతో హైకోర్టు కోసం సుప్రీంకోర్టుకు వెళ్లడం, బీసీల 42 శాతం రిజర్వేషన్లను ఆపివేయాలనుకునే ఆలోచనను వెంటనే మానుకోవాలని, రాష్ట్ర గవర్నర్ దగ్గర ఉన్న రిజర్వేషన్ గారు సంతకం చేయాలని సంక్షేమ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు సాబన్ కార్ వెంకటేష్ , ఆలేరు నియోజకవర్గం అధ్యక్షులు పేరపు రాములు, వలిగొండ మండలం అధ్యక్షులు సాయిని యాదగిరి, విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షులు డిఎన్ చారి, జిల్లా మనమయ సంఘం అధ్యక్షులు ఉపేంద్ర చారి, సత్యనారాయణ, రమేష్, తదితర బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో హరి ఓమ్ కు ఘనంగా నివాళులు

ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో హరి ఓమ్ కు ఘనంగా నివాళులు యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి ఈరోజు భారత జాతీయ విద్యార్థి సంఘం ఎన్ ఎస్ యు ఐ భువనగిరి అసెంబ్లీ అధ్యక్షులు గొల్లపల్లి వినయ్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి మసూద్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రగతి నగర్ పద్మజ హాస్పిటల్ వద్ద ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రాయోబరేలి లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాహుల్ గాంధీ గారి వీరాభిమాని అయిన హరి ఓమ్ ను కొందరు మతోన్మాదులు మూక హత్య చేయడాన్ని నిరసిస్తూ హరి ఓమ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ పాల్గొని నివాళులర్పించి మాట్లాడుతూ దళిత యువకుడైన హరియోంను మూకదాడిలో చంపి హత్య చేసిన కేసులో NSUI దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి న్యాయం కోసం పోరాడుతుంది. యోగి ఆదిత్యనాథ్ పాలనలో బహుజనుల హత్యలను ఇక సహించబోము. రాయ్‌బరేలిలో హరియోమ్ మూక హత్య మానవాళిని సిగ్గుపడేలా చేసింది. తన ప్రాణాలను కాపాడుకోవడానికి రాహుల్ గాంధీ పేరును వాడుకుంటున్నప్పుడు, చెడ్డ వ్యక్తులు “మేము బాబా నుండి వచ్చాము” అని అంటున్నారు. ఇది యోగి రాజ్ యొక్క నిజమైన ముఖం. న్యాయం చేయడానికి బదులుగా, యుపి పోలీసులు నిందితులపై ‘ఉద్దేశపూర్వకంగా హత్య’ నేరాన్ని మోపారు, తద్వారా హంతకులు కొన్ని రోజుల్లో బయటకు వస్తారు. ఈ జాతి ఆధారిత హింస మరియు ద్వేషపూరిత నమూనాలను మేము అమలు చేయనివ్వము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హరియోమ్ కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు షఫిక్ అహ్మద్ పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పడిగెల ప్రదీప్ పిట్టల బాలరాజ్ మహమ్మద్ జలీల్ అలీమ్ శరత్ రాఘవ వరుణ్ కాసిఫ్ దిలీప్ శివ కిరణ్ రిజ్వాన్ అభినవ్ కార్తీక్ వరుణ్ తేజ్ మణికంఠ సుభాష్ మల్లికార్జున్ చింటూ సాయి తేజ తదితరులు పాల్గొన్నారు…

తూర్పు గోదావరి

భరత్ నీలా సూట్ కేసులు గురించి ఆలోచించను కార్మికులు బాగుండాలని చూస్తా – ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హాట్ కామెంట్స్..

గడిచిన ఆరు సంవత్సరాలుగా పేపరుమిల్లు కార్మికుల నిరీక్షణకు మంచి అగ్రిమెంట్ లభించి, వారి జీవితాల్లో వెలుగులు వచ్చాయని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. ఇది కూటమి ప్రభుత్వ విజయమని గర్వంగా చెబుతున్నామన్నారు. పేపర్ మిల్లు కార్మికులకు నూతన వేతన ఒప్పందం కుదిరిన నేపథ్యంలో పేపర్ మిల్లు యూనియన్ నాయకులు, కార్మికులు మంగళవారం ఉదయం స్థానిక తిలక్ రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ని కల్సి ధన్యవాదములు తెలియజేసారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం కార్మికుల శ్రేయస్సు కంటే వారి స్వలాభమే చూసుకున్నారని, ప్యాకేజిపై ఉన్న శ్రద్ధ కార్మికుల వేతన ఒప్పందంపై చూపించలేదని వ్యాఖ్యానించారు. తరచూ కార్మికులు తమకు జరుగుతున్న అన్యాయంపై వివరించినపుడు తెలుగుదేశం పార్టీని, టీఎన్టియుసిని నమ్మాలని, తప్పకుండ తాము అధికారంలోకి వచ్చాక మంచి అగ్రిమెంట్ చేసి, న్యాయం చేస్తామని చెప్పామని ఎమ్మెల్యే వాసు గుర్తుచేసారు. తమపై విశ్వాసం ఉంచి తమను గెలిపించి, వైసిపి వాళ్ళను ఇంట్లో కూర్చోబెట్టారని ఆయన అన్నారు. ఇచ్చిన హామీ మేరకు కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కార్మికులకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని, పరంపరంలో నష్టపోయినవారికి న్యాయం చేశామని, కార్మికులకు అన్యాయం చేసినవారిపై కేసులు కట్టించామని ఆయన అన్నారు. ఇంత చేస్తున్నా సరే, ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదని, వైసిపి విమర్శలకు జవాబు ఇవ్వకుండా, పనిచేసి చూపించి నోరు మూయించామని ఎమ్మెల్యే వాసు అన్నారు. పర్మినెంట్ కార్మికుల మొదలుకుని కాంట్రాక్ట్ కార్మికుల వరకు అందరికీ న్యాయం జరిగేవిధంగా మంచి అగ్రిమెంట్ చేయించగలిగామని ఎమ్మెల్యే వాసు అన్నారు. తాము చేసిన ప్రయత్నానికి ఎంపీ పురందేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, అధికారులు, కూటమి నాయకులు, కార్మికులు అందరూ సహకరించారని అలాగే మేనేజిమెంట్ దిగిరాకపోయేసరికి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినప్పుడు అధికారులతో కమిటీ వేసి సమస్య పరిష్కారం అయ్యేలా చేశామని ఆయన వివరించారు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ 15ఈనెలల కాలంలో పేపరు మిల్లు గేటు దగ్గర ఆందోళనలు జరుగుతుంటే, మాజీ ఎంపీ భరత్ అక్కడకు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ‘నీవు సూట్ కేసులు గురించి ఆలోచించావు .. నేను కార్మికుల బాగుండాలని చూసా. కార్మికులకు ఏమిచేయాలో తెలుసుకు కాబట్టే నిన్ను ఇంట్లో కూర్చోబెట్టారు. కూటమిని గెలిపించారు… నీ అసమర్ధత వలన అగ్రిమెంట్ చేయలేదని ఒప్పుకోవాలి’ అని భరత్ నుద్దేశించి ఎమ్మెల్యే వాసు వ్యాఖ్యానించారు. ఆఖరికి అగ్రిమెంట్ అవుతుంటే, వైసిపి వాళ్ళు మోకాలడ్డారని ఆయన విమర్శించారు. నేను లేని రాజమహేంద్రవరం ఏమైపోతుందోనని భరత్ ఊహించుకున్నప్పటికీ ఇప్పుడు రాజమహేంద్రవరం చాలా బాగుందని ఆయన చురకలంటించారు. మిల్లులో 4000మంది కార్మికులుంటే అందులో తన ఓటర్లు ఎంతమంది ఉంటారన్నది భేరీజు వేసుకుకోండా అందరికీ న్యాయం చేయాలని చూశానని ఎమ్మెల్య్ వాసు అన్నారు. అగ్రిమెంట్ ఆలస్యం కారణంగా కార్మికులు కడుపుమంటతో కేకలు వేస్తుంటే, నిస్సహాయతకు మదన పడ్డానని ఆయన గుర్తుచేసుకున్నారు. మొత్తానికి బాగా నలిగిపోయినప్పటికీ కార్మికులందరికీ న్యాయం చేయగలిగామన్నారు. కోట్లు దోచుకున్నవాళ్ళు వాళ్లకి ఇచ్చాం, వీళ్లకు ఇచ్చాం అంటూ నిస్సిగ్గుగా తప్పు ఒప్పుకోకుండా తిరుగుతున్నారని, అయితే అన్నిరోజులు ఒకలా ఉండవని ఆయన అన్నారు. యాజమాన్యం మొండి వైఖరితో ఉన్నప్పటికీ కార్మికులే తమకు ముఖ్యమని వ్యవహరించామని, అదేవిధంగా పరిశ్రమలు ఉండాలని ఆలోచన చేశామని, ఎక్కడా ప్యాకేజి కోసం చూడలేదని ఎమ్మెల్యే వాసు స్పషం చేసారు. కార్మికులకు అన్నివేళలా మా కుటుంబం అండగా ఉంటుందని పునరుద్ఘాటించారు. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెల్పిన కార్మిక నాయకులు… కార్మిక నాయకులు మాట్లాడుతూ 5సంవత్సరాలకు పైగా ఎన్నికలు, అగ్రిమెంట్ లేకపోవడంతో కూటమి ప్రభుత్వ దృష్టికి తెచ్చామని ఎమ్మెల్యే వాసు ఎంపీ పురందేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్ తదితరులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడలో జరిగిన అగ్రిమెంట్ లో కార్మికులకు 5800జీతం, కాంట్రాక్ట్ కార్మికులకు 55రూపాయలు జీతం పెంచారని తెలిపారు. ఎన్నాళ్ళనుంచో చూస్తున్న అగ్రిమెంట్ చేసి 4000కార్మిక కుటుంబాల్లో వెలుగులు నింపినందుకు కూటమి ప్రభుత్వానికి కార్మికుల తరపున ధన్యవాదాలు తెలిపారు. గత ఐదేళ్లుగా కార్మికులు చాలా బాధలు పడ్డారని, కూటమి ప్రభుత్వం వచ్చి న్యాయం చేసిందని, ముఖ్యంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నాయకత్వంలో ముందుండి నడిపించడం వలన మంచి అగ్రిమెంట్ చేసుకోగలిగామని అన్నారు. ఏలూరులో కాపీ ఇచ్చారని, 11యూనియన్లు సంతకాలు పెట్టాయని తెలిపారు. మీడియా సమావేశంలో టిడిపి నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, వర్రే శ్రీనివాసరావు, నక్కా చిట్టిబాబు, ఉప్పులూరి జానకి రామయ్య, కొయ్యల రమణ, బుడ్డిగ రవి, దుత్తరపు గంగాధర్, అధిక సంఖ్యలో పేపర్ మిల్లు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

అన్నమయ్య

తాడిపత్రి పట్టణంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా

తాడిపత్రి, అక్టోబర్ 07: (పున్నమి ప్రతినిధి) మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆదేశాల మేరకు తాడిపత్రి పట్టణంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడపత్రి ఎల్లనూరు రోడ్ వాల్మీకి సర్కిల్ వద్ద వాల్మీకి మహర్షికి ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమం వాల్మీకి సేవాదళ్ పార్లమెంట్ అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా జిల్లా ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. ఆదినారాయణ మాదిగ, పెద్దపప్పూరు మండల సిపిఐ కార్యదర్శి చింతా పురుషోత్తం, వ్యవసాయ కార్మిక సంఘం తాలూకా అధ్యక్షుడు నారాయణరెడ్డి హాజరయ్యారు.చాగల్లు గ్రామం నుండి దాదాపు 15 వాహనాల్లో 100 మంది వాల్మీకి సంఘం, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, చేనేత కార్మికులు భారీ ర్యాలీగా పెద్దపప్పూరు మండల కేంద్రంలో ప్రవేశించారు. “వాల్మీకుల ఐక్యత వర్ధిల్లాలి… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి” అనే నినాదాలతో ఈ ర్యాలీ అంబేద్కర్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, పోలీస్ స్టేషన్, పెట్రోల్ బంక్ వరకు సాగి, అనంతరం తాడిపత్రి పట్టణంలోని వాల్మీకి మహర్షి విగ్రహం వద్ద ముగిసింది.అక్కడ విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ— వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించి సమాజానికి శాశ్వత విలువలు నేర్పారని, ఆయన అందరికీ దేవుడని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి. ఆదినారాయణ పేర్కొన్నారు.వాల్మీకి మహర్షి ఐక్యతకు ప్రతీక అని, ప్రతి సంవత్సరం మరింత ఘనంగా జయంతి జరుపుకోవాలని వాల్మీకి సంఘం పార్లమెంటు అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య పిలుపునిచ్చారు.భార్యభర్తల బంధాలు, అన్నదమ్ముల విలువలు రామాయణం ద్వారా సమాజానికి అందించిన మహానుభావుడు వాల్మీకి అని సిపిఐ మండల కార్యదర్శి చింతా పురుషోత్తం అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో బోడయ్యపల్లి, ఆది తాడిపత్రి, చిన్న పెద్దపప్పూరు ప్రాంతాల నుండి పలువురు వాల్మీకి సంఘ సభ్యులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, చేనేత కార్మికులు పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు.

తిరుపతి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన కోట మండల వైసీపీ శ్రేణులు.*

* కోట .విద్యానగర్ (తిరుపతి జిల్లా) పున్నమి ప్రతినిధి సూరిబాబు *కోట మండలానికి చెందిన సీనియర్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా నియమితులైన నేపథ్యంలో తొలిసారిగా తన స్వగ్రామమైన అల్లంపాడుకు రావడంతో ఘన స్వాగతం లభించింది. వైసీపీ నాయకులు దువ్వూరు సాయిరెడ్డి, పాదర్తి రాధాకృష్ష్ణారెడ్డి, చిల్లకూరు సాయిప్రసాద్ రెడ్డిల ఆధ్వర్యంలో స్వాగత ఏర్పాట్లు చేశారు. కోట మండలం విద్యానగర్ నుండి కోట పట్టణం మీదుగా అల్లంపాడు వరకు 100 బైక్ లు, 50 కార్లతో భారీ ర్యాలీతో నిర్వహించారు. మార్గమధ్యలో గాంధీ, అంబేద్కర్, పొట్టి శ్రీ రాములు వైయస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.* *కోట పట్టణంలోకి శ్యాంప్రసాద్ రెడ్డి ఎంట్రీతో సందడి వాతావరణం కనిపించింది. మహిళలు హరతులు పట్టి టెంకాయలు కొట్టి స్వాగతం పలికారు. దారి పొడవునా బాణాసంచా కాల్చుతూ పూల వర్షం కురిపిస్తూ తీన్మార్ బ్యాండ్ శబ్ధాలతో.. గజమాలలు వేసి తమ అభిమానం చాటుకున్నారు. ఘనంగా సత్కరించిన వందలాది వైసీపీ శ్రేణులు, పేర్నాటి సైన్యం నడుమ ప్రజలకు అభివాదం చేస్తూ ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ అధినాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2019-2024 సంవత్సరకాలం పేద బడుగు బలహీన వర్గాలకు స్వర్ణయుగంలా సాగిందని గుర్తుచేసారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలం నుండి వైయస్సార్ సీపీ నాయకులను నామరూపం లేకుండా చేయాలని దురుద్దేశ్యంతో పాలన సాగిస్తోందని అన్నారు. చేయని తప్పులకు, తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని అన్నారు. తామంతా సమిష్టిగా వైసీపీ శ్రేణులకు అండగా ఉంటామని ధైర్యాన్నిచ్చారు.* *పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతున్నంత సేపు.. ‘జోహార్ వైయస్సార్!, జై జగన్.. జై జై జగన్.!, శ్యామన్న నాయకత్వం వర్ధిల్లాలి!’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వైసీపీ ప్రభుత్వంలో పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా, ఆయన సతీమణి హేమా సుష్మిత రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ గా పనిచేసారు. ఆ సమయంలో శ్యాంప్రసాద్ రెడ్డి కోట మండలానికి వచ్చిన సందర్భాల్లో ఆయన కాన్వాయ్ వెంట భారీ వాహనశ్రేణి ఉండేది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత తరుణంలో తాజాగా మంగళవారం శ్యాంప్రసాద్ రెడ్డి 100 బైక్ లు, 50 కార్లు, వందలాది అభిమానులు వెంట రాగా భారీ ర్యాలీతో కోట మండలంలోకి ప్రవేశించడంతో శ్యాంప్రసాద్ రెడ్డి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని పలువురు చర్చించుకున్నారు.* *ఈ కార్యక్రమంలో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, దువ్వూరు వెంకటరమణారెడ్డి, దువ్వూరు సాయికృష్ణారెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి, సునీల్ రెడ్డి, పాముల సురేంద్ర, ఇన్నమాల వెంకటాద్రి, నర్రమాల రమణయ్య, షేక్ బాష, షేక్ మొయిన్ బాష, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు, యువకులు పాల్గొన్నారు.* END

ఖమ్మం

ఎంబీబీఎస్ సిట్ సాధించిన నిరుపేద విద్యార్థినిలకు చేయూత…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఇటీవల దేశ వ్యాప్తంగా నిట్ పరీక్ష ఫలితాల్లో తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన గొడ్ల సంధ్యరాణి అదే విదంగా ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామానికి చెందిన మేడి నాగేశ్వరి అనే నిరుపేద విద్యార్థినిలు ఎంబీబీఎస్ సీటు సాధించారు,ఇంత వరకు బాగానే ఉన్నా ఎంబీబీఎస్ చెయ్యడానికి ఆ విద్యార్థినిలకు ఫీజ్ చెల్లించే పరిస్థితి లేకపోవడంతో అపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు, ఈ తరుణంలో కొత్తగూడెం అమృత హాస్పిటల్ ప్రముఖ డాక్టర్ ఇరుకు బాబూరావు దృష్టికి తీసుకొని వెళ్లగా ఈరోజు డాక్టర్ బాబూరావు సతీమణి డాక్టర్ జయ శ్రీ చేతుల మీదగా గొడ్ల సంధ్యరాణి కి 15 వేల రూపాయలు,మేడి నాగేశ్వరి కి 10 వేల రూపాయలు ఆర్ధిక సహాయన్ని అందించి విద్యార్థినిలకు శుభాకాంక్షలు తెలియజేశారు, ఇంకా రానున్న రోజుల్లో మరింత సహాయం చేస్తానాని భరోసా ఇచ్చారు ,డాక్టర్ జయ శ్రీ మాట్లాడుతూ మంచిగా చదువుకొని తల్లిదండ్రులు పేరు తెస్తూ రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం పొంది నిరుపేదలకు వైద్య,ఆర్ధిక పరంగా సహాయం చెయ్యాలని విద్యార్థినిలను ఆశీర్వదించారు..వీరి వెంట తంబర్ల పుల్లారావు, కొమ్మిగిరి వినోద్, విద్యార్థిని తల్లిదండ్రులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు..

గూడూరు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన కోట మండల వైసీపీ శ్రేణులు.

కోట మండలానికి చెందిన సీనియర్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా నియమితులైన నేపథ్యంలో తొలిసారిగా తన స్వగ్రామమైన అల్లంపాడుకు రావడంతో ఘన స్వాగతం లభించింది. వైసీపీ నాయకులు దువ్వూరు సాయిరెడ్డి, పాదర్తి రాధాకృష్ష్ణారెడ్డి, చిల్లకూరు సాయిప్రసాద్ రెడ్డిల ఆధ్వర్యంలో స్వాగత ఏర్పాట్లు చేశారు. కోట మండలం విద్యానగర్ నుండి కోట పట్టణం మీదుగా అల్లంపాడు వరకు 100 బైక్ లు, 50 కార్లతో భారీ ర్యాలీతో నిర్వహించారు. మార్గమధ్యలో గాంధీ, అంబేద్కర్, పొట్టి శ్రీ రాములు వైయస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కోట పట్టణంలోకి శ్యాంప్రసాద్ రెడ్డి ఎంట్రీతో సందడి వాతావరణం కనిపించింది. మహిళలు హరతులు పట్టి టెంకాయలు కొట్టి స్వాగతం పలికారు. దారి పొడవునా బాణాసంచా కాల్చుతూ పూల వర్షం కురిపిస్తూ తీన్మార్ బ్యాండ్ శబ్ధాలతో.. గజమాలలు వేసి తమ అభిమానం చాటుకున్నారు. ఘనంగా సత్కరించిన వందలాది వైసీపీ శ్రేణులు, పేర్నాటి సైన్యం నడుమ ప్రజలకు అభివాదం చేస్తూ ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ అధినాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2019-2024 సంవత్సరకాలం పేద బడుగు బలహీన వర్గాలకు స్వర్ణయుగంలా సాగిందని గుర్తుచేసారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలం నుండి వైయస్సార్ సీపీ నాయకులను నామరూపం లేకుండా చేయాలని దురుద్దేశ్యంతో పాలన సాగిస్తోందని అన్నారు. చేయని తప్పులకు, తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని అన్నారు. తామంతా సమిష్టిగా వైసీపీ శ్రేణులకు అండగా ఉంటామని ధైర్యాన్నిచ్చారు. పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతున్నంత సేపు.. ‘జోహార్ వైయస్సార్!, జై జగన్.. జై జై జగన్.!, శ్యామన్న నాయకత్వం వర్ధిల్లాలి!’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వైసీపీ ప్రభుత్వంలో పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా, ఆయన సతీమణి హేమా సుష్మిత రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ గా పనిచేసారు. ఆ సమయంలో శ్యాంప్రసాద్ రెడ్డి కోట మండలానికి వచ్చిన సందర్భాల్లో ఆయన కాన్వాయ్ వెంట భారీ వాహనశ్రేణి ఉండేది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత తరుణంలో తాజాగా మంగళవారం శ్యాంప్రసాద్ రెడ్డి 100 బైక్ లు, 50 కార్లు, వందలాది అభిమానులు వెంట రాగా భారీ ర్యాలీతో కోట మండలంలోకి ప్రవేశించడంతో శ్యాంప్రసాద్ రెడ్డి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని పలువురు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, దువ్వూరు వెంకటరమణారెడ్డి, దువ్వూరు సాయికృష్ణారెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి, సునీల్ రెడ్డి, పాముల సురేంద్ర, ఇన్నమాల వెంకటాద్రి, నర్రమాల రమణయ్య, షేక్ బాష, షేక్ మొయిన్ బాష, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు, యువకులు పాల్గొన్నారు.

కామారెడ్డి

వీధి కుక్కల స్వైర విహారం: స్థానికుల్లో ఆందోళన

కామారెడ్డి, 7 అక్టోబర్, పున్నమి ప్రతినిధి : వీధి కుక్కల విహారం స్థానికుల్లో ఆందోళన కలిగి స్తుందని అంటున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో గ్రామ కూడలిలో వీధి కుక్కల సమూహం రోడ్లపై స్వైర విహారం చేస్తూ ఉండటం స్థానికులను, రాకపోకలు సాగించేవారిని ఆందోళ నకు గురిచేస్తోంది.పగటిపూట ఇవి గుంపులు గుంపులుగా తిరుగుతూ, అటుగా వెళ్లే ప్రజల ను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.నేటి దృశ్యం లో, దాదాపు పదికి పైగా కుక్కలు ప్రధాన కూడలి లో గుమిగూడి ఉన్నట్లు స్పష్టంగా కనిపి స్తోంది. వీటిలో కొన్ని నలుపు, గోధుమ రంగులో ఉండగా, మరికొన్ని తెలుపు, నలుపు మచ్చలతో ఉన్నాయి. సాధారణంగా, ఈ కుక్కల సమూహాలు చిన్న పిల్లలపై, ద్విచక్ర వాహనదారులపై అకస్మాత్తు గా దాడి చేసే ప్రమాదం ఉందంటున్నారు.స్థానికులు, కుక్కలు ఎక్కువగా తిరగడం వల్ల మేము పిల్లలను ఒంటరిగా బయటికి పంపాలంటే భయ పడుతు న్నాం అని స్థానిక నివాసి ఒకరు తెలిపారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ కుక్కలు అధికంగా కనిపిస్తున్నాయి వాటిని చూస్తే భయం దోళనకు గురౌతున్నామని అంటున్నారు. సంబం ధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని, ఈ కుక్కల బెడదను నివారించాలని కోరుకుంటున్నా రు., అని వారు విజ్ఞప్తి చేశారు.అధికారులు ఈ వీధి కుక్కల సమస్యపై అధికారులు తక్షణమే దృష్టి సారించి, వాటిని నియంత్రించడానికి చర్యలు చేప ట్టాలని అన్నారు. తద్వారా స్థానిక ప్రజలకు సురక్షి తమైన వాతావరణం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.