Thursday, 30 April 2026

Blog

హైదరాబాద్

మల్లికార్జున ఖర్గే ని పరామార్సించిన తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పున్నమి ప్రతి నిధి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు ఉదయం బెంగుళూరు లో పరామర్శించారు. ఖర్గే త్వరగా కోలుకోవాలని ఈ సం ధర్భముగా మంత్రి ఆకాంక్షిo చారు.

అన్నమయ్య

వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా

చిట్వేల్, అక్టోబర్ 07 : (పున్నమి ప్రతినిధి) రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం. భాస్కర్ రెడ్డి అధ్యక్షత వహించారు. తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ వేడుకల్లో ముందుగా కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.తరువాత జరిగిన సభలో ప్రిన్సిపాల్ డాక్టర్ యం. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ “మహనీయుడు వాల్మీకి మహర్షి రామాయణం అనే అద్భుత కావ్యం రచించిన సాహితీ విగ్రహం. దొంగతనం జీవితం నుండి పరివర్తన పొంది మహర్షిగా మారిన ఆయన జీవన గాథ అందరికీ స్ఫూర్తిదాయకం. కష్టసుఖాలను తట్టుకుని సమాజం కొరకు జీవించడమే నిజమైన మహనీయత్వం” అని పేర్కొన్నారు.తెలుగు ఉపన్యాసకుడు శ్రీ దాసరి మోషే మాట్లాడుతూ “వాల్మీకి మహర్షి జీవితం విద్యార్థులకు ఒక మార్గదర్శకం. దొంగ నుండి మహర్షి అయ్యిన ఆయన కధ మనందరికీ జీవనపాఠం. నేటి కాలంలో మనం కూడా తప్పులు చేస్తూ ఉంటాం. కానీ ఆ తప్పుల నుండి నేర్చుకుని పరిపక్వత సాధించాలి. వాల్మీకి ఆదర్శంగా తీసుకుని ప్రతి విద్యార్థి సమాజంలో మంచి మార్పు తీసుకురావాలి” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేష్, ఐక్యూ ఏ సి కో ఆర్డినేటర్ శ్రీ జి. దయానందం, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.వాల్మీకి మహర్షి జీవితం స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలని ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేశారు.

పశ్చిమ గోదావరి

రాష్ట్రపతి తర్వాత సర్పంచ్ లకే చెక్ పవర్ :ఎమ్మెల్యే బొలిశెట్టి

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, అక్టోబర్ 7, (పున్నమి ప్రతినిధి): రాష్ట్రపతి తర్వాత సర్పంచ్ లకు చెక్ పవర్ ఉందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం మండల పరిషత్ సమావేశ మందిరంలో తాడేపల్లిగూడెం, నల్లజర్ల మండలాలకు చెందిన సర్పంచులు, కార్యదర్శులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్నుకున్న ప్రజలకు సర్పంచులు జవాబుదారీగా వ్యవహరించాలన్నారు. జడ్పిటిసి ఆంజనేయులు మాట్లాడారు. ఎంపీడీవో చంద్రశేఖర్, ఈవోఆర్డీ వెంకటేష్ పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

వైభవంగా రామాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు….

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 7 నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామ స్వామి దేవాలయంలో ఆశ్వయుజ మాసం పౌర్ణమి సందర్భంగా మంగళవారం నాడు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు 8మంది దంపతులతో సామూహికంగా భక్తులచే శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వ్రతాలు చేయడంతో భక్తులకు కోరిన కోరికలు మరియు వారికి దారిద్ర్యం తొలగి,అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు సిద్ధస్తాయని,విశేషంగా పుణ్య ఫలితం భక్తులకు అందుతుందని రామాలయం ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ అన్నారు. ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజు వ్రతాలు భక్తులచే నిర్వహిస్తున్నారననీ అన్నారు.భగవంతుని అనుగ్రహం సూక్ష్మ మార్గంలో పొందుటకు, దోష నివారణ జరుగుటకు తమకు తోచిన విధంగా తమ శక్త్యానుసారం , పూజలు,వ్రతాలు నిర్వహించడంతో భగవంతుని ప్రసన్నం చేసుకొని వారి ఆపదలు తొలగి, కోరికలు నెరవేర్చే విధంగా స్వామి అనుగ్రహిస్తాడనీ ఆయన తెలిపారు.ఆలయ ఆవరణలోని శివాలయంలో పరమశివుని భక్తులు దర్శించుకున్నారు. రామాలయ అన్నప్రసాద కమిటీ వారికి సామూహికంగా అన్నప్రసాదాన్ని భక్తులకు అందజేశారు.నిత్య విష్ణుసహస్రనామ పారాయణ కమిటీ సభ్యులు,సాయి భక్తులు స్వామి వారిని కీర్తిస్తూ కీర్తనలు భజనలు చేశారు.భక్తులకు వేద ఆశీర్వచనం,తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.రామాలయ అన్నప్రసాద కమిటీ వారిచే ఏర్పాటు చేసిన సామూహిక భోజనాలలో 325మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ కార్యక్రమంలో అన్న ప్రసాద కమిటీ సభ్యులు కందడై జయలక్ష్మి,కందడై శ్రీనివాస చార్యులు, కరుణశ్రీ ,అర్థం రవీందర్, టి.మల్లేష్, నందకిశోర్, రమాదేవి,రత్నమాల,శారద, నారాయణ,శివ, గొల్ల రాములు,పుల్లయ్య, బాలస్వామి,చారి, నరసింహ గౌడ్, సాయిభక్తులు,నిత్య విష్ణు సహస్ర పారాయణం కమిటీ సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

సిద్దాశ్రమంలో 201వ పవిత్ర శక్తి హోమం(నరసన్నపేట – అక్టోబర్ – పున్నమి ప్రతినిధి)

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఇందిరానగర్ కోలనీ వద్దగల సిద్దాశ్రమంలో 201వ పవిత్ర శక్తి హోమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ శక్తి హోమం అనేది హిందూమతంలో అగ్నిని ఉపయోగించి చేసే ఒక పవిత్ర యాగమని, దీని ద్వారా దేవతా శక్తిని ఆరాధించడం జరుగుతుందని, ఈ హోమం చేయడం వల్ల ప్రతికూల శక్తుల నుంచి రక్షణ, శత్రువులపై విజయం, శారీరక శుద్ధీకరణ, ఆరోగ్యం, విజయం కలుగుతాయన్నారు. ప్రతికూల శక్తుల నుండి రక్షణ, దుష్ట శక్తుల పీడ, మంత్ర విద్యల ప్రభావాల నుండి విముక్తి లభిస్తుందని, శత్రువులపై విజయం సాధించడంలో సహాయపడుతుందని, శారీరక, మానసిక శుద్ధీకరణ, హోమం చేయడం వల్ల శరీరం శుద్ధి చెంది, శక్తిని, ఆరోగ్యాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతుందన్నారు. అనంతరం సిద్ధాశ్రమ నిర్మాణ, నిర్వహణలో ప్రధాన భూమిక నిర్వహించి, భక్తి, జ్ఞాన దిశగా సన్మార్గాన్ని చూపి, ఎన్నో క్షేత్ర, ధర్మ మార్గదర్శి అయిన కీర్తి శేషులు మణికంఠ గురుస్వామి (ఉర్లాం మురళీమోహన్ రావు) సంస్కరణ సభను నిర్వహించి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు, స్థానిక భక్తులు, సిద్ధాశ్రమం శిష్య బృందం తదితరులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కుతున్న జనం

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 7 నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ప్రశాంత్ నగర్ లో గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ తాగునీరు కోసం తండ్లాట అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదంటూ ఆందోళనకు దిగిన ప్రశాంత్ నగర్ గ్రామస్తులు మన్ననూరు వద్ద శ్రీశైలం – హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహిస్తున్న గ్రామస్తులు. భారీగా నిలిచిపోయిన వాహనాలు ట్రాఫిక్ జామ్ నీళ్ల కోసం ధర్నాకు దిగిన వారిని అడ్డుకుంటున్న పోలీసులు పండుగ పూట సైతం నీళ్లు లేక అవస్థలు పడ్డామంటున్న మహిళలు తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామంటున్న గ్రామస్తులు ఓట్ల కోసం ఇంటింటికి తిరుగుతారు ఇప్పుడు ఎవరు రావట్లేదు అంటున్న గ్రామ ప్రజలు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ప్రజలు పోలీసులతో వాగ్వాదానికి దిగిన మహిళలు మాకు తాగునీటి సమస్య మీరు పరిష్కరిస్తారా అంటూ పోలీసులను నిలదీస్తున్న మహిళలు

ఆంధ్రప్రదేశ్

ఆకలితో ఉన్నవారికి, ఆహారం అందించడం అత్యంత పవిత్రమైన కార్యం. – ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన. వేణుగోపాల్ బి.జి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ (శ్రీకాకుళం – అక్టోబర్ – పున్నమి ప్రతినిధి)

ఆహారాన్ని దానం చేయడం చాలా గొప్ప పుణ్య కార్యమని, దానాలలో మహాదానం, అన్నదానమని, ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి, బిహెచ్ఆర్సి ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు కొంక్యాన.వేణుగోపాల్ అన్నారు. బి.జి.ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బరాటం.శ్రీనివాస్ చక్రవర్తి ఆధ్వర్యంలో శివతేజ, నగరంలో మంగళవారం అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఇందులో భాగముగా అభాగ్యులకు ఆహారాన్ని అందించి కొంక్యాన.వేణు గోపాల్ మాట్లాడుతూ భూదానం, గోదానం వంటి ఇతర దానాల కన్నా అన్నదానం ముఖ్యమైనదని, ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం అత్యంత పవిత్రమైనదన్నారు. నగరానికి చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఉర్లం.శివతేజ పట్నాయక్ నిరంతరం అన్నప్రసాదాన్ని అందిస్తున్నారని, ఆయన తండ్రి ఉర్లం.నవజీవన రావు మాస్టార్, తల్లి ధనలక్ష్మి అడుగుజాడల్లో నడుస్తూ, సేవలు కొనసాగిస్తున్నారని, శివతేజ నానమ్మ సావిత్రమ్మ వర్ధంతి సందర్భంగా నగరంలో నైట్ షెల్టర్ తోపాటు, డే అండ్ నైట్, సూర్యమహాల్, అరసవల్లి, పాతబస్ స్టాండ్ కూడలిలో నిస్సహాయులకు ఈ రోజు అన్నప్రసాదాన్ని అందించారన్నారు. బి.జి.ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, విద్యావేత్త, కళాశాలల డైరెక్టర్ బరాటం.శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ అన్నవితరణ సేవలు చేయడం ద్వారా మోక్షం లభిస్తుందని, ఇది ఆధ్యాత్మికంగా గొప్ప ఫలితాలనిస్తుందని, అన్నదానం అనేది ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని అందించడం ద్వారా చేసే ఒక పవిత్రమైన గొప్ప పుణ్యకార్యమని తెలిపారు. వేడుకలకు ఆహారాన్ని వృధా చేస్తున్నారని, ఆహారం అంధక ఎంతో మంది ఆహారం కోసం ఎదురు చూస్తున్నారని, పేదల కోసం కొంత సమయంతోపాటు, సంపాదనలో కొంత భాగాన్ని సామాజిక సేవలకు వినియోగించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ అన్నప్రసాద వితరణలో నైట్ షెల్టర్ నిర్వాహకురాలు వైశ్యరాజు. వెంకట లక్ష్మి, నేటి దాత ఉర్లం. నవజీవన రావు మాస్టర్, కుమారులు, సేవకులు ఉర్లం. శివతేజ పట్నాయక్, సంధ్యారాణి, రవితేజ్, కళ్యాణి, కుటుంబ సభ్యులు, బాడీ బిల్డర్ అసోసియేషన్ కార్యదర్శి విజయ్ కుమార్, వైసిపి ఎస్సి సెల్ జిల్లా జెనెరల్ సెక్రటరీ నల్లబరికి. శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

బల్లెం వేణుమాధవ్ కు ఘన సత్కారం

హైదరాబాద్ : ప్రపంచ శాంతి ప్రియుడు నెల్సన్ మండేలా జ్ఞాపకార్థం గాంధీ జయంతి శుభ సందర్భంగా వీరి ఇరువురు పేరున భారత మాత ముద్దు బిడ్డ అబ్దుల్ కలాం పేరిట ప్రముఖులకు నేషనల్ అవార్డుల కార్యక్రమంలో సినీ హీరో, ఆల్ రౌండర్ స్టార్, దర్శక నిర్మాత, తెలుగు సినీ రచయితల సంఘం ఉపాధ్యక్షులు బల్లెం వేణుమాధవ్ కు ఘన సత్కారం జరిగింది. ఈ కార్యక్రమం అక్టోబర్ 5వ తేదీ ఆదివారం సాయంత్రం కూకట్‌పల్లిలోని భారత వికాస్ కళా పరిషత్ హాల్ రామాలయం వీధిలో జరిగింది. శేరిలింగంపల్లి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ రవి యాదవ్, సినీ దర్శక నిర్మాత లయన్ సాయివెంకట్ లు ముఖ్య అతిథులుగా హాజరై 20 శాఖల సినీ ప్రపంచ రికార్డు నెలకొల్పిన బల్లెం వేణు మాధవ్ బహుముఖ ప్రజ్ఞకు ప్రశంసగా ఘన సత్కారం చేసి “ఆల్ అబౌట్ గణేశ” అనే భారీ పుస్తకంతో పాటు, ఒక జ్ఞాపికను అందించి శాలువ కప్పి స్వర్ణ పతకం వేసి అభినందించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు దర్శక నిర్మాత టి.రాము బల్లెం వేణుమాధవ్ ని పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముందు “సిపాయే రాజైతే” నాటకాన్ని ప్రదర్శించారు. ఇదే వేదిక మీద బల్లెం వేణు మాధవ్, సాయి వెంకట్ ల చేతుల మీదుగా “బాహునిధి” చిత్ర లోగో ఆవిష్కరణ జరిగింది. “శాంతి”, “నన్ను ప్రేమించవా”, “కలలు కనకే చెలియా”, “కౌసల్య ఆంటీ”, “అయ్యప్ప సాక్షి”, “ప్రేమ గులాబి” తనకు పేరు తెచ్చిన సినిమాలు అని బల్లెం వేణుమాధవ్ అన్నారు. మనీష్ గౌర్ హాలీవుడ్ ఫిలిమ్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కృతజ్ఞతా ప్రసంగాన్ని చేస్తూ అంతరించి పోతున్న నాటకాన్ని బ్రతికిస్తున్న టి.రాము కృషిని అభినందిస్తున్నానని బల్లెం వేణుమాధవ్ అన్నారు. డా. జి.డి.నాయుడు, దర్శక నిర్మాత టి.రాము, ఎడిటర్ వేణులు ప్రసంగించారు. పలువురు సినీ ప్రముఖులు సత్కారం అందుకున్న బల్లెం వేణుమాధవ్ కు తమ అభినందనలు తెలిపారు.

నాగర్‌కర్నూల్

కనీస వేతనం 26,000 చెల్లించాలి… సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 7 నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు కనీస వేతనం 26,000 చెల్లించాలని ఉద్యోగ భద్రత ఈఎస్ఐపిఎఫ్ తదితర సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య డిమాండ్ చేశారు. ఈ రోజు కోడేరు మండల కేంద్రంలో జరిగిన ఆశ వర్కర్స్ యూనియన్ సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ నూతన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి రెండు సంవత్సరాలు కావస్తున్న ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించకపోగా ఆశ కార్యకర్తలపై నిర్బంధాలు పెరిగాయని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారని ఆయన అన్నారు.. పైగా ఆశ వర్కర్లు పనిచేయడం లేదని ప్రభుత్వం చెప్పడం సరైన మాట కాదని ఆశ వర్కర్లు పనిచేస్తున్నారు కాబట్టే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ ఆశ వర్కర్లను గుర్తించిందని అలాంటి సంస్థ గుర్తించిన ప్రభుత్వ మాత్రం పనిచేయడం లేదని చెప్పడం సరి అయిన పద్ధతి కాదని ఆయన అన్నారు.. మరొకవైపు ప్రక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం చెల్లిస్తూ 1,50,000 గ్రాటిటి అమలు చేస్తూ 180 రోజుల ప్రసూతి సెలవులు ప్రకటించిన అక్కడి ప్రభుత్వం మరి తెలంగాణ ప్రభుత్వం ఆశాల సమస్యలు ఎందుకు పరిష్కారం చేయదని ఆయన ప్రశ్నించారు.. లక్షల కొద్ది రూపాయల జీతాలతో మరొకరు అతి తక్కువ వేతనాలతో కార్మికులు పనిచేస్తున్నారని ఇలాంటి అసమానతలు కొనసాగుతున్న ముఖ్యమంత్రి మాత్రం సమాజంలో అసమానతలు పోవాలని చెప్పడం హాస్యాస్పదమని ఆయన అన్నారు.. అందులో భాగంగా ఆశ వర్కర్లకి ఇవ్వాల్సిన లెప్రసి ఎలక్షన్స్ డ్యూటీ డబ్బులు ఆరు నెలల కరోనా రిస్క్ అలవెన్స్ ఇదేమి చెల్లించకుండా పెండింగ్లో ఉంచుకున్నారని ఆయన అన్నారు.. ఇప్పటికైనా తెలంగాణ నూతన ప్రజా ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దశరథం ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కళావతి జిల్లా కమిటీ సభ్యులు రత్నమాల నాయకురాలు నీలమ్మ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ ఆశ వర్కర్స్ యూనియన్ ఆశ వర్కర్స్ రాణి జ్యోతి సుకన్య పల్లవి జయమ్మ వరలక్ష్మి శశికళ కృష్ణవేణి అంచలమ్మ మంగమ్మ సంతోషి రాములమ్మ కమల రాధా సునీత ఎల్లమ్మ కల్పన తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి 10 వేల రూపాయల ఆర్ధికసాయం(పొందూరు – అక్టోబర్ – పున్నమి ప్రతినిధి)

పొందూరు మండలం, బురిడీకంచారం గ్రామానికి చెందిన గండి.రమణ గత 15 సంవత్సరాలుగ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. వారంలో 3 రోజులు డయాలిసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండగా, వారానికి సుమారు 20 వేల రూపాయిలు ఖర్చు అవుతుంది. తండ్రి వ్యవసాయ దినసరి కూలీ కాగా, తల్లి మరణించారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా డయాలిసిస్ చేసుకునే స్థితిలో లేరని, చావు బ్రతుకులతో కొట్టుమిట్టాడుతూ దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారన్న విషయం తెలుసుకున్న సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు, అతని ఆర్థిక, కుటుంబ పరిస్థితి తెలుసుకొని, దాతలు, మిత్రుల సహకారంతో ఈ రోజు 10 వేల రూపాయలను బాధితునికి డయాలసిస్ అనంతరం వైద్యశాల ప్రాంగణంలో అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు హఠకేసం మాట్లాడుతూ నిస్సహాయ స్థితుల్లో ఉన్న ఈ కుటుంబాన్ని దాతలుగాని, స్వచ్ఛంద సంస్థలు గాని ముందుకు వచ్చి సహాయమందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు, సేవకులు ఉర్లం. శివతేజ పట్నాయక్, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.