Thursday, 30 April 2026

Blog

తిరుపతి

తొట్టంబేడు మండలంలో భూకబ్జాలు పట్టించుకోని అధికారులు

*చెరువు ఆక్రమించి దర్జాగా బోరు ఏర్పాటు చేసి.. తొట్టంబేడు మండలం, ఎంజీఎం హాస్పిటల్, రిలయన్స్ పెట్రోల్ బంక్ వెనుక మైనార్టీ కి చెందిన ఓ నేత భారీ భూ కబ్జా…!* *👆 ప్రభుత్వ భూములను చెరువులను కాపాడడంలో రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారు.. ప్రభుత్వ భూములు చెరువుల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చెయ్యకపోవడమే భూకబ్జాలకు కారణం…!*

తిరుపతి

శ్రీకాళహస్తి ఆలయ అధికారుల తీరు మారలేదు బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు

*శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారుల తీరు మారలేదు అని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి , శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆన్నారు . ఆలయం సమీపంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన స్టేట్లను వారు పరిశీలించారు.* ఆలయ ఒకటవ, రెండవ , మూడవ  గేట్లు నుండి ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు నాలుగో గేట్ నుండి బయటకు వస్తే చెప్పులు లేకుండా ఎండలో తారు రోడ్డు మీద కాళ్ళు కాలుతూ తట్టుకోలేక పరిగెడుతున్నారని వాట్సాప్ పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించారు మంచిదే కానీ  కాంట్రాక్టర్లకు కొమ్ము కాసే విధంగా  దానికోసం మొదట కార్పెట్ ఏర్పాటు చేశారు. రోడ్డుపైన కూల్  పెయింట్ వేశారు. మళ్లీ కొబ్బరి మట్టలతో పందిళ్ళు ఏర్పాటు చేశారు. చివరగా రేకుల షెడ్లను ఏర్పాటు చేశారు. ఆలయ నిధులు ఈ విధంగా దుర్వినియోగం చేయడం సరైన పద్ధతి కాదు. ఎట్టకేలకు రేకుల షెడ్డు ఏర్పాటు చేయడం మంచిదే. అయితే భక్తుల కోసం ఏర్పాటు చేసిన షెడ్ లలో కార్లు ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసి . వెళ్ళిపోతున్నారు. లక్షలాది రూపాయలు కార్ పార్కింగ్ ద్వారా వసూలు చేస్తున్న కాంట్రాక్టర్లు దీనిపైన సరైన సూచనలు చేయకపోవడం. ఆలయ అధికారులు దీనిపైన సమగ్రమైన బోర్డులు ఏర్పాటు చేయకపోవడం తో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ  షెడ్ల వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన విధంగా మారిపోయాయి. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసినా  భక్తులకు వేతనం తప్పడం లేదు. నీడలో ఏమో వాహనాలు మళ్లీ ఎండలో భక్తులు అనే పరిస్థితి ఏర్పడింది. అధికారుల మొద్దు నిద్ర వీడి  ఏసీ గదుల నుండి బయటకు వచ్చి భక్తులు వేతలను  గమనించి భక్తుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లలో వాహనాలు పార్కింగ్ చేయకుండా చేయాలి.

ఆంధ్రప్రదేశ్

విశాఖ స్టీల్ ఆర్టీసీ డిపో ని యధావిధిగా కొనసాగించాలని వినతి

విశాఖపట్నం, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) విశాఖ జిల్లా కలెక్టర్ ఎం ఎస్ నరేందర ప్రసాద్ ని విశాఖ పార్లమెంటరీ టిఎన్టియుసి అధికార ప్రతినిధి బలిరెడ్డి సత్యనారాయణ మంగళవారం కలిసి కోరారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు, అసంఘటిత కార్మికులు ఉక్కునగరంలో ఉన్న ఉద్యోగుల కుటుంబ సభ్యులు విద్యార్థులు సిటీకి వెళ్లడానికి అదేవిధంగా అగనంపూడి , వడ్లపూడి, పెదగంట్యాడ, గంగవరం ఉక్కు నిర్వాసితులు పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రయోజనంగా ఉన్న కూర్మన్నపాలెం విశాఖ స్టీల్ ఆర్టీసీ డిపో ని స్టీల్ ప్లాంట్ ఇచ్చిన 8 ఎకరాల్లో స్థలములో డిపో ని స్థాపించి 33 సంవత్సరాలు ఒక రూపాయి లీజుపై ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు లీజు అయిపోయినది తొలగించాలని లేకపోతే లీజు కొనసాగించుటకు 138 కోట్ల రూపాయలు కట్టాలని స్టీల్ యాజమాన్యం డిమాండ్ చేస్తున్నదనీ, స్టీల్ ప్లాంట్ ఇచ్చిన స్థలము 8 ఎకరాలకి ప్రత్యామ్యంగా అగనంపూడి స్టీల్ ప్లాంట్ గోడకి ప్రక్కన ఉన్న 8 ఎకరాలు స్థలము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి, గతంలో గంగవరం పోర్టుకు స్టీల్ ప్లాంట్ వద్ద 1500 వందల ఎకరాలు తీసుకొని ప్రత్యమానంగా రాష్ట్ర ప్రభుత్వం కే కోటపాడు, మాకవరపాలెం, రేపాక ప్రాంతాల్లో 1500 ఎకరాలు స్థలము స్టీల్ ప్లాంట్ కు కి ఇవ్వడం జరిగినది, ఎంతో అభివృద్ధి చెందుతున్న గాజువాక నియోజకవర్గంలో విశాఖ స్టీల్ ఆర్టీసీ డిపో ని ఉంచవలసిన అవసరం ఎంతో ఉందని. కావున ఆర్టీసీ డిపో ని యధావిదంగా కొనసాగించుటకు తగు చర్యలు తీసుకోవాలని వినత పత్రము అందజేయడం జరిగినది. విశాఖ జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని తెలిపారు.

జోగులాంబ గద్వాల

వి కేర్ కోల్డ్ స్టోరేజీపై ఐటీ అధికారులు

అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా సమీపం లోని 44 జాతీయ రహదారి ప్రక్కన ఉన్న వికేర్ సీడ్స్ వ్యవసాయ ప్రైవేట్ ప్రాసెసింగ్ కేంద్రంలో ఐటీ సోదాలు.. రాష్ట్రంలోని పప్పు దినుసులు, హోల్సేల్, వ్యాపారుల ఇళ్లల్లో ఐటీ దాడుల నేపథ్యంలో ఉండవల్లి సమీపంలోని వి.కేర్ సీడ్స్ కంపెనీలో పప్పు దినుసులపై పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లుగా ఐటీ అధికారులు సోదాలు. సంస్థ యజమానులు సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ శాఖ అధికారులు కోల్డ్ స్టోరేజ్, సమీపంలో ఉన్న ఇతర వాహనాల్లో సోదాలు చేశారు. ఈ కంపెనీ రైతుల పేరుతో పంటలను కొనుగోలు చేసి స్టోరేజ్లో దాయడంతో పాటు రైతుల పేరుతోనే క్రయవిక్రయాలు చేస్తూ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ తతంగం కొన్నేళ్లుగా సాగుతుండగా ఏపీ ఐటీ అధికారులు నిఘా ఉంచి తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.

కుమురం భీమ్ ఆసిఫాబాద్

సిర్పూర్ (T) సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ముందు తల్లిదండ్రుల ధర్నా

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ( టి ) మండల కేంద్రం లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్ ను మూడు నెలల క్రితం వర్షాల ప్రభావం ఎక్కువ ఉందని ప్రిన్సిపల్ విద్యార్థుల తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పది రోజుల సెలవులతో ఇంటికి పంపించడం జరిగింది. పది రోజుల తర్వాత బిల్డింగ్ కూలిపోయేలా ఉంది అని పిల్లల చదువు ఆగిపోకూడదు అంటూ ఒక నెలలో మీ పిల్లలకు భవనం ఏర్పాటు చేస్తాము అనీ చెప్పి పిల్లలను వేరే వేరే జిల్లాలలో ఆరు చోట్ల మై గ్రేడ్ జరిగింది. ఒక నెల నుండి మూడు నెలలు గడిచిన ఇప్పటివరకు ఆ విద్యార్థుల పట్ల ఎలాంటి భవనము ఏర్పాటు చేయలేదు మై గ్రేడ్ హాస్టల్లో తగిన సదుపాయాలు లేక బాత్రూంలకు డోర్లు లేవు అక్కడ శానీటైజర్ సిబ్బంది కరువైనారు పిల్లలకు ఇచ్చే అల్పాహారాలు ఇవ్వడం లేదు వాళ్లకు సమయానికి భోజనం సౌకర్యం కూడా లేదు పొద్దున తినాల్సిన తిండి 11 గంటలకి తీనే పరిస్థితి ఏర్పడింది మై గ్రేడ్ చేశారు హాస్టల్లోకి ఒక్కొక్క తాత్కాలిక టీచర్ ఉండడం వలన విద్యార్థులకు విద్యాబోధన మూడు నెలల నుండి కరువైంది మూడు నెలలు గడిచిన విద్యార్థుల పట్ల ఎలాంటి న్యాయం జరగకపోవడంతో సోమవారం మధ్యాహ్నం విద్యార్థులు వారి తల్లిదండ్రులు సిర్పూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల యందు ధర్నా చేపట్టారు సుమారు నాలుగు గంటల పైన ధర్నా చేయడంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి.మా పిల్లలకు న్యాయం జరగాలి అని తల్లిదండ్రులు నినాదం చేపట్టారు. ఒకవేళ అధికారులకు పిల్లలకు న్యాయం సమకూర్చమని ఒక్క మాట చెప్పిన కానీ మేము తల్లిదండ్రులము తలోక వేయి రూపాయలు చందా వేసుకొని తాత్కాలిక షెడ్లు సిర్పూర్ హాస్టల్లోనే వేసి సమస్యలు పరిష్కరించుకుంటామని అన్నారు. మా పిల్లలంతా ఒకే చోట ఉండాలి అది కూడా సిర్పూర్ హాస్టల్ లోనే ఉండాలి బయట హాస్టల్లో సరైన సదుపాయాలు లేవు మా పిల్లలకు చదువు కరువైంది అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సిర్పూర్ ఎమ్మార్వో వచ్చి పొంతనలేని కారణాలు చెబుతూ మూడు నెలల నుండి జరిగిన కాలయాపనకు మద్దతుగా తతస్తు ఫలికారు. ధర్నా నాలుగు గంటలకు పైగా మించిపోగా పిల్లల తల్లిదండ్రులను సిర్పూర్ టి ఎస్సై సురేష్ కుమార్ అరెస్టు చేశారు. దీంతో విద్యార్థులు రోడ్డుపై నుండి కదలక మాకు న్యాయం జరిగే వరకూ ఇక్కడ నుండి మేము వెళ్ళేది ప్రసక్తే లేదని రోడ్డుపైనే కూర్చున్నారు చివరికి ఈ మూడు రోజులలో పరిష్కారం కాకపోతే హైదరాబాదులోని గురుకులాల సెక్రటరీ కార్యాలయం మరియు ప్రజా భవన్ ముట్టడిస్తామని హెచ్చరించి ఆందోళన విరమించారు.

నిర్మల్

గోపాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల బైంసాలో కొమరం భీమ్ వర్ధంతి ఘనంగా జరిపారు

(పున్నమి ప్రతినిధి తేదీ 7 .10. 2025 నిర్మల్ జిల్లా)ఈ సందర్భంగా కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ శ్రీ రఘునాథ్ మాట్లాడుతూ ఆదివాసి హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన వీరుడని జంగల్ జమీన్ కోసం ఎన్నో గెరిల్లా పోరాటాలను చేసి హక్కుల సాధనకు తన ప్రాణాలను సైతం పనంగా పెట్టినవారిని అన్నారు. తన పోరాటంతో అడవి బిడ్డల దారి చూపి అడవి సూర్యుడు అయ్యాడని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ డా భీమ్రావు డా పి జి రెడ్డి యు రవికుమార్ డా శంకర్ గుంత సుధాకర్ ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తలు ఆరె రాజు డా ఓం ప్రకాష్ సంతోష్ కుమార్ కల్పనా నహీదా దివ్య రామ్మోహన్ సురేందర్ కిషన్ రాజయ్య శ్రావణ్య అర్షియ వహీద్ ఇర్ఫాన్లు ఇతరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎండియూ ఆపరేటర్స్ సమస్యల వినతి- ఎండియూ ఆపరేటర్స్ ను రోడ్డున పడేయటం బాధాకరం. – ఎండియూ ఆపరేటర్స్ రాష్ట్ర అధ్యక్షులు రౌతు.సూర్యనారాయణ (శ్రీకాకుళం నగరం – అక్టోబర్ పున్నమి ప్రతినిధి)

ఎండియూ ఆపరేటర్స్ ను రోడ్డున పడేయటం బాధాకరమని, ఎండియూ ఆపరేటర్స్ అధ్యక్షులు రౌతు.సూర్యనారాయణ అన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జూన్ నెల నుండి ఎండియు వ్యవస్థ రద్దు చేస్తూ మా వెహికల్ సంబంధించి క్లియరెన్స్ ఇస్తామని తెలియజేస్తూ ప్రకటించడం జరిగిందని, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఎండియు వ్యవస్థను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9260 కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయని, ఇప్పటికీ ఐదు మాసాలు కావస్తున్నా, మా వెహికల్ యొక్క క్లియరెన్స్ చేయడం జరగలేదని, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మొబైల్ క్యాంటీన్ గా ఉన్న మా వెహికల్స్ను గూడ్స్ క్యారియర్ గా మార్చి పెనాల్టీ మినహాయించి ఫిట్నెస్ చేయించుకునే విధంగా అవకాశం కల్పిస్తామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సర్కులర్ రిలీజ్ చేసినప్పటికీ, ఎటువంటి కార్యచరణ నిర్వహించడం జరగలేదని, 5 నెలలుగా మా వెహికల్స్ ని ఏ పనికి ఉపయోగించుకోకుండా మాకు ఉపాధి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. మా యందు దయవుంచి ఉపాధి కోల్పోయిన ఎండియు ఆపరేటర్స్ నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే మా వెహికల్ యొక్క క్లియరెన్స్ చేస్తూ ఎటువంటి పెనాల్టీ లేకుండా వెహికల్ ఫిట్నెస్ చేయించుకున్న విధంగా సర్కులర్ రిలీజ్ చేస్తూ, మా వెహికల్స్ ని మేము వినియోగించుకునే విధంగా చేయాలని వినతి పత్రాన్ని రాష్ట్ర ఆహార కమీషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డిని కోరగా, సానుకూలంగా స్పందించిన ఆయన, ప్రభుత్వంతో మాట్లాడి మీ సమస్యకు పరిస్కారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎండియూ ఆపరేటర్స్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

లలిత క్రాకర్స్ ప్రారంభించిన ప్రముఖులు – నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలి. – మాజీ శ్రీకాకుళం మున్సిపల్ చైర్ పెర్సన్ ఎంవి. పద్మావతి. (శ్రీకాకుళం రూరల్ – అక్టోబర్ పున్నమి ప్రతినిధి)

సీపన్నాయుడు పేట సర్వీస్ రోడ్, ఎన్.హెచ్.-16, విజయ ఆదిత్య పార్క్ ప్రక్కన, శ్రీకాకుళంలో నూతనంగా లలిత క్రాకర్స్ ప్రారంభించిన వక్తలు,ప్రముఖులు. ముఖ్య అతిధులుగా మాజీ శ్రీకాకుళం మున్సిపల్ చైర్ పెర్సన్ ఎంవి. పద్మావతి, వైసిపి యువ నాయకులు ధర్మాన. రామ్ మనోహర్ నాయుడు, పాల్గొని నూతన లలిత క్రాకర్స్ ను ప్రారంభించి మాట్లాడుతూ వివాహాది శుభకార్యములకు, వేడుకలకు వేదిక లలిత క్రాకర్స్ అని, అన్ని రకముల క్రాకర్స్ హోల్ సేల్ ధరలకే లభిస్తున్నాయని, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే సరసమైన ధరలకు విక్రయిస్తున్నారన్నారు. సనపల కృష్ణంరాజు ఆధ్వర్యంలో ప్రజలకు సహకారమందిస్తున్నారని ఈ అవకాశాన్ని నగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా తెలిపారు. అనంతరం ప్రముఖులకు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమలను అందించి సత్కరించారు. సనపల కృష్ణంరాజు మంగళవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అన్ని రకాల క్రాకర్స్ అందుబాటులో ఉన్నాయని, పేద ప్రజలకు సరసమైన ధరలకు రోజులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సనపల కృష్ణంరాజు ప్రోప్రైటర్, రాయపల్లి శివప్రసాద్ (బుజ్జి), గంటల సురేష్ (స్వామి), నగర ప్రముఖులు, వక్తలు, సేవకులు ఉర్లం. శివతేజ పట్నాయక్ స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

కలిగిరి మండలంలో రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా….!!

కలిగిరి, అక్టోబర్ 07 :(పున్నమి న్యూస్):/// నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా. మండలంలో అనేకచోట్ల ఎటువంటి అనుమతులు లేకుండా భారీగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు. కలిగిరి పట్టణంలోని పెద్ద చెరువు నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఒక జెసిబి 20 ట్రాక్టర్లతో ఇదేచ్ఛగా భారీ ఎత్తున మట్టిని తరలిస్తున్నారు. మరోవైపు రావులకొల్లు చెరువు నుంచి భారీ యంత్రాలతో గత నెల రోజుల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా కలిగిరి నుంచి వలేటివారిపాలెం రోడ్డు నిర్మాణానికి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులకు ఈ అక్రమ దందాపై సమాచారం అందించిన స్పందించడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అందుబాటులో లేనప్పుడు అక్రమ గ్రావెల్ మాఫియాదారులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఈ అక్రమ గ్రావెల్ దందాపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

కూటమి ప్రభుత్వం మీద వెంకయ్య నాయుడు ఘాటు విమర్శలు

పున్నమి ప్రతి నిధి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పై భారత మాజీ ఉప రాష్ట్ర పతి ముప్పు వరపు వెంకయ్య నాయుడు ఘాటు వ్యాఖ్యలుచేశారు. మహిళలకు ఉచిత బస్సు వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. విద్య, వైద్యంపై ఖర్చు చేయాలి కానీ,ఉచితాలు అలవాటు చేయకూడదన్నారు విద్యతో పేదవాడు సంపన్నుడయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. వైద్యం ప్రతి మనిషికి అవసరమైందని ఆర్థిక పరిస్థితిని శ్వేతపత్రం రూపంలో ప్రజలకు తెలపాలన్నారు ఐదేళ్లలో అప్పులు ఎంత చేస్తున్నారు,ఎంత తిరిగి చెల్లిస్తున్నారన్నది ప్రకటించాలన్నారు అసెంబ్లీలో బూతుల సాంప్రదాయానికి తెర వేయాలన్నారు. సభలో లేనివారి పట్ల అమర్యాదగా వ్యవహరించకూడదన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.