Thursday, 30 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

జన్మదినం సందర్బంగా మొక్కలు నాటిన లయన్ జె.వెంకుబాబు (ఆమదాలవలస టౌన్ – అక్టోబర్ – పున్నమి ప్రతినిధి)

ఆమదాలవలస శ్రీ పాలపోలమ్మ గుడి ప్రాంగణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమదాలవలస పర్యావరణము, పరిరక్షణలో భాగంగా క్లబ్ సభ్యులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంనకు ముఖ్య అతిధిగా జిల్లా ఇన్విరాన్మెంట్ చైర్మన్ లయన్ పొన్నాడ.రవికుమార్ పాల్గొని మాట్లాడుతూ మన ఊరు -మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాలు మేరకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించాలని, ప్రతీ ఒక్కరూ ఒక మొక్కని నాటి పరిరక్షణ చేయాలనీ పిలుపునిచ్చారు. క్లబ్ అధ్యక్షులు జె. వెంకుబాబు మాట్లాడుతూ నా జన్మదినం సందర్బంగా ఇలాంటి మంచి కార్యక్రమం చెయ్యడం చాలా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా విచ్చేసిన జిల్లా చైర్మన్ లయన్ పొన్నాడ.రవికుమార్ కు అభినందనలన్నారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యక్షులు గుడ్ల బాబు, సభ్యులు ఊన్న రమేష్, పి. సురేష్, డాక్టర్ కార్తీక్, టి. సంతోష్, రత్నాకర్ బి. నాగశ్వర రావు, జె.ఆసిస్, బి. బాల, పి. రమణ, వేణు, టైలర్ అసోసియేషన్ నాగు, నాగేశ్వర రావు, వెంకట రమణ, బాలకృష్ణ, సత్యం,తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

నూతన వార్డు అధ్యక్షునికి ఘన సత్కారం

గాజువాక అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) విశాఖ గాజువాక 87 వార్డు కణితి గాంధీ బొమ్మ వద్ద కళింగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా వార్డు వైఎస్ఆర్సిపి అధ్యక్షులుగా నియమితులైన బొడ్డ గోవింద్ కు సాలువాతో పూల బొకేతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ వార్డ్ లోని వైయస్సార్ పార్టీ బలోపేతం దిశగా కృషి చేస్తానని రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో వైసీపీ జెండా ఎగరావేసే విధంగా పనిచేస్తానని ఆయన అన్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని అత్యున్నత స్థాయి కి చేరాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నామని పార్టీను ముందు కు నడిపి పార్టీ బలోపేతం చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో ప్రగడ శ్రీనివాస్, ముద్దపు దామోదర్, దుగ్గపు దానప్పలు, గోనప సన్యాసినాయుడు, బొడ్డ సన్యాసిరావు,బడగల రాము, ప్రగడ శంకర్రావు , బొడ్డ వెంకట సూరి,కె.వి నారాయణ, పూడి శ్రీనివాస్,గున్న రామారావు, దాకా వర కృష్ణ, ప్రగడ అప్పలనాయుడు, జల్లు రమణ, బడ్డ తాత , మార్పు ప్రకాష్ , బొడ్డ సంజీవ్,తదితరులు పాల్గొన్నారు

కుమురం భీమ్ ఆసిఫాబాద్

నన్ను గెలిపిస్తే మీ సమస్యలు పరిష్కరిస్తా కె కిషోర్

కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం డోర్పలి స్వగ్రామమైన యువ న్యాయవాది కే కిషోర్, ప్రజలతో సమావేశమై గ్రామసమస్యలు చర్చించారు.వారు మాట్లాడుతూ రోడ్డు, విద్య, వైద్యం సనస్యలపై గ్రామప్రజలు గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, నాయకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్డు ఆర్ &బి రోడ్డునుండి డోర్పల్లి వరకు రోడ్డు అద్వానంగా ఉందని గుంతలు పడి ఉందని, వాగు కు వంతెన లేక ఆత్యావసర సమయంలో ఆసుపత్రికి వెళ్లాలన్న ప్రాణాలు పోవాల్సిందేనని,ప్రయాణం చేయాలంటే నరకాయతన పడుతున్నామని, ద్విచక్ర వాహన దారులు, ఆటో లు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేవుడా మిరే రక్ష అంటూ బిక్కు బిక్కు మంటూ ఎడ్ల బడ్లతో దాటుతు వెళ్తామని, సమస్యలు పరిస్కారం చేయని నాయకులు, ప్రజా ప్రతి నిధులు ఇప్పుడు ఎలక్షన్ లలో గ్రామాల్లోకి ఎలా వస్తారని వారి ప్రలోబాలకు, హామీలను నమ్మకండి, గ్రామాలకు వచ్చే నాయకులను నిలదీయండి, అన్నారు. మీ సమస్యేసలు పూర్తిగా తెలుసనీ సమస్యలు పరిస్కారం అధికారులతో మాట్లాడి పరిస్కారం చేపిస్తానని నాకు ఒక్క అవకాశం కల్పించి జడ్పీటీసీ గా గెల్పించాలని కోరారు.

కుమురం భీమ్ ఆసిఫాబాద్

నన్ను గెలిపిస్తే మీ సమస్యలు పరిష్కరిస్తా కె కిషోర్

కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం డోర్పలి స్వగ్రామమైన యువ న్యాయవాది కే కిషోర్, ప్రజలతో సమావేశమై గ్రామసమస్యలు చర్చించారు.వారు మాట్లాడుతూ రోడ్డు, విద్య, వైద్యం సనస్యలపై గ్రామప్రజలు గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, నాయకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్డు ఆర్ &బి రోడ్డునుండి డోర్పల్లి వరకు రోడ్డు అద్వానంగా ఉందని గుంతలు పడి ఉందని, వాగు కు వంతెన లేక ఆత్యావసర సమయంలో ఆసుపత్రికి వెళ్లాలన్న ప్రాణాలు పోవాల్సిందేనని,ప్రయాణం చేయాలంటే నరకాయతన పడుతున్నామని, ద్విచక్ర వాహన దారులు, ఆటో లు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేవుడా మిరే రక్ష అంటూ బిక్కు బిక్కు మంటూ ఎడ్ల బడ్లతో దాటుతు వెళ్తామని, సమస్యలు పరిస్కారం చేయని నాయకులు, ప్రజా ప్రతి నిధులు ఇప్పుడు ఎలక్షన్ లలో గ్రామాల్లోకి ఎలా వస్తారని వారి ప్రలోబాలకు, హామీలను నమ్మకండి, గ్రామాలకు వచ్చే నాయకులను నిలదీయండి, అన్నారు. మీ సమస్యేసలు పూర్తిగా తెలుసనీ సమస్యలు పరిస్కారం అధికారులతో మాట్లాడి పరిస్కారం చేపిస్తానని నాకు ఒక్క అవకాశం కల్పించి జడ్పీటీసీ గా గెల్పించాలని కోరారు.

విశాఖపట్నం

*క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది – మొల్లి పెంటి రాజు*

గాజువాక అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) గాజువాక నియోజకవర్గం, పెదగంట్యాడ, *75* వ వార్డ్ నందు WHEELS OF FIRE స్కేటింగ్ క్లబ్ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా, *డైరెక్టర్* – *ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్*, విశాఖ జిల్లా తెలుగుయువత ప్రధానకార్యదర్శి *మొల్లి పెంటిరాజు* పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ మరియు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లాస్థాయి పోటీలలో పెదగంట్యాడ ప్రాంతానికి చెందిన విద్యార్థిని, విద్యార్థులు పతాక విజేతలగా నిలిచారు. ఈ ప్రతిభావంతులైన స్కేటర్లు వారి కోచ్ *సంగం మురళి* @ WHEELS OF FIRE స్కేటింగ్ క్లబ్ మార్గదర్శకత్వం కారణంగా, రాష్ట్ర పోటీలలో, విశాఖపట్నం జిల్లాకు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికయ్యారు. నవంబర్ నెలలో కాకినాడలో జరిగే *రాష్ట్ర స్థాయి పోటీలకు* వీరు ఎంపికయ్యారు. క్రీడాకారులు శుభాకాంక్షలు తెలుపుతూ, వారికి తగిన ప్రోత్సాహకాలు అందిస్తానని, వీరు రాష్ట్ర స్థాయిలో కూడా పతకాలు సాధించాలని ఈ సందర్భంగా కోరారు. *విశాఖపట్నం జిల్లా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ పతాక విజేతలు:* 1. *6-8 పురుష క్వాడ్:* అండిబోయిన హిమాన్ష్ (1 స్వర్ణం & 1 రజతం) 2. *10-12 మహిళా క్వాడ్:* జెంజి లక్ష్మీ సాయి లౌక్య (3 రజతాలు) 3. *10-12 మహిళా ఇన్‌లైన్:* కాసిన సూర్య నందన (1 కాంస్య) 4. *12-15 మహిళా ఇన్‌లైన్:* అండిబోయిన హేమ వర్షిణి (1 రజతం & 1 కాంస్య) 5. *15-18 మహిళా క్వాడ్:* పోలిశెట్టి శ్రుతి సంయుక్త (2 కాంస్యాలు) *స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా పోటీల పతక విజేతలు:* 1. *17 ఏళ్లలోపు:* పోలిశెట్టి శ్రుతి సంయుక్త (2 రజతాలు) 2. *14 ఏళ్లలోపు:* అండిబోయిన హేమ వర్షిణి (1 రజతం & 1 కాంస్య పతకం) ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, కోచ్ లు, క్రీడాకారులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

*గో బ్యాక్ అదానీ , అంబుజా*

గాజువాక అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) విశాఖ గాజువాక లో అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మానానికి వ్యతిరేకంగా స్థానిక గ్రామాల ప్రజల నిరసన సిమెంట్ ఫాక్టరీ కి వ్యతిరేకంగా పెదగంట్యాడ లో ఆందోళనకు దిగిన గ్రామస్తులు… తప్పుడు నివేదికలతో అనుమతులు తీసుకొని వచ్చి ఇక్కడ మా ఆరోగ్యాన్ని మా ప్రాణాలకు హాని కల్పిస్తే ఊరుకునేది లేదంటూ స్థానిక గ్రామస్తులు ఈ 8వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ లో సిమెంట్ ఫాక్టరీని అడ్డుకుంటాం అంటున్న స్థానిక గ్రామాల ప్రజలు.

విశాఖపట్నం

*కిడ్జీ ప్లే స్కూల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా*…

గాజువాక అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని ఎమ్మెల్యే,టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.ఈ మేరకు జీవీఎంసీ 65 వ వార్డు కాకతీయ రోడ్ లో నూతనంగా నెలకొల్పిన కిడ్జీ పాఠశాల గాజువాక బ్రాంచ్ ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా పాఠశాలలో కూడా మార్పులు ఎంతైనా అవసరమని,పిల్లలను ఆదర్శవంతులుగా తీర్చిదిద్దడంలో పాఠశాలల యాజమాన్యాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.పిల్లల్లో మేధాశక్తిని పెంపొందించేలా విద్యాబుద్ధులు నేర్పాలని కోరారు.ఆధునిక పరిజ్ఞానం అనేది పౌరులను తీర్చిదిద్దడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.ఒక మంచి లక్ష్యంతో పాఠశాలను నెలకొల్పడం పట్ల నిర్వాహకులను అభినందించారు.ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠశాల ఆవరణ ఉండటం వలన పిల్లలకు నాణ్యమైన విద్యతోపాటు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని అన్నారు.కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి,బిజెపి కన్వీనర్ కరణంరెడ్డి నర్సింగరావు,కార్పొరేటర్లు బొడ్డు నరసింహ పాత్రుడు,పల్లా శ్రీనివాస్,తిప్పల వంశీ రెడ్డి,గుడివాడ లతీష్,మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ,గాజువాక సీఐ పార్థసారథి, స్టీల్ ప్లాంట్ సీఐ కేశవరావు, గాజువాక ఎస్. ఐ సూర్యకాల, జనసేన నాయకులు తిప్పల రమణారెడ్డి, పోలరౌతు వెంకటరమణ,టిడిపి వార్డు అధ్యక్షుడు రట్టి వాసు,బైపిల్లి గాంధీ,కోరుకొండ మంగమ్మ,శ్రీలక్ష్మి,రాజు వెంకటేశ్వరరావు,పాఠశాల ప్రతినిధులు సురేష్,నీలిమ తదితరులు పాల్గొన్నారు

జనగాం

రైతుల పక్షాన ఉండేది కేవలం ప్రజా ప్రభుత్వం మాత్రమే:బంక శివరాజ్ జనగామ మార్కెట్ చైర్మన్

రైతుల పక్షాన ఉండేది కేవలం ప్రజా ప్రభుత్వం మాత్రమే ————————————————————– జనగామ, అక్టోబర్06,పున్నమి న్యూస్: జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఈ సీజన్లో ఐకెపి సెంటర్లు రెండు నిర్వహించాలని గౌరవ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ను కోరిన జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ జనగామలో రైతులకు మేము నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతి రైతుకు అండగా ఉంటున్నాము అని అన్నారు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ ధరలు తక్కువ ఉన్నందున ప్రైవేటు వ్యాపారస్తులు రైతులకు తక్కువ ధరలో కొనుగోలు చేయడం జరుగుతుంది అని అన్నారు . కావున రైతులకు ఇబ్బందులు రాకుండా ఈ ప్రజా ప్రభుత్వం లో రైతులకు మద్దతు ధర పొందాలని ఉద్దేశంతో తొందరలో రెండు ఐకెపి సెంటర్లు(కొనుగోలు కేంద్రం లు) నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ని కోరడం జరిగిందని అన్నారు.జిల్లా కలెక్టర్ వెంటనే సానుకులంగా స్పందించి జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు లో రెండు ఐకెపి సెంటర్లు ఏర్పాటు చేయుటకు సంబంధిత అధికారులకు చర్యలు చేపట్ట వలసింది గా ఆదేశించారు, కావున తొందర్లో రైతులకు మద్దతు ధరలతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీ బెన్సీ లోమ్,DRDO PD వసంత, ఏఎంసీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జీవన్ కుమార్,సూపర్వైజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఇరుకైన రహదారి పై పెరుగుతున్న ప్రమాదాలు -ముత్తుకూరు ప్రజల ఆవేదన

ముత్తుకూరు, (అక్టోబర్ 07పున్నమి ప్రతినిధి):-ముత్తుకూరు ప్రధాన రహదారి రోజురోజుకీ ప్రమాదాలకు నిలయమవుతోంది. ఇరుకైన రహదారిపై వాహనాల రద్దీ పెరుగుతుండగా, ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల సమయాల్లో రహదారి బిక్కుబిక్కుమంటూ మారుతోంది. విద్యార్థులు, మహిళలు, వృద్ధులు వాహనాల మధ్య నడవడం ప్రాణహానికే సమానమవుతోంది. ద్విచక్ర వాహనాలపై యువత అడ్డదిడ్డంగా తిరుగుతుండగా, భారీ లారీలు, ట్రాక్టర్ల రాకపోకలతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ — “ఇక్కడ ప్రతిరోజూ ప్రాణాలు పణంగా పెట్టి రోడ్డు దాటాల్సి వస్తోంది. పలుమార్లు ప్రమాదాలు జరిగినా అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు,” అని వాపోతున్నారు.ప్రజలు డిమాండ్ చేస్తూ —భారీ వాహనాలను ఊర్లో కాకుండా దారి మళ్లించాలి.ఆక్రమణలను తొలగించాలి.పాఠశాలల సమీపంలో ‘నో పార్కింగ్’ బోర్డులు ఏర్పాటు చేయాలి.ట్రాఫిక్ పోలీసులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలి అని కోరుతున్నారు. ముత్తుకూరు రహదారి ప్రజల రవాణా మార్గమే కాదు — వారి జీవనాధారం కూడా.ఈ నిర్లక్ష్యం కొనసాగితే రహదారి పేరు “ప్రజల ప్రాణాలకు నిలయంగా” మారిపోతుందనే ఆందోళనను ముత్తుకూరు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

విశాఖ జిల్లా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో విజేతల దుమ్ము

విశాఖపట్నం జిల్లా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ మరియు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) జిల్లా స్థాయి పోటీలు ఘనంగా ముగిశాయి. పతక విజేతలను ప్రకటించగా, యువ స్కేటర్ల ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది. విశాఖ జిల్లా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ పతక విజేతలు: 10-12 ఆడ క్వాడ్: జెంజీ లక్ష్మి సాయి లౌక్యా – 3 సిల్వర్ పతకాలు 10-12 ఆడ ఇన్లైన్: కాసినా సూర్య నందనా – 1 కాంస్య పతకం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) జిల్లా పోటీలు: 17 సంవత్సరాలలోపు విభాగం: పోలిసెట్టి శ్రీతి సమ్యూఖ్త – 2 సిల్వర్ పతకాలు ఈ ప్రతిభావంతులైన స్కేటర్లు రాష్ట్ర స్థాయి పోటీలకు విశాఖపట్నం జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరి విజయాలకు వీల్స్ ఆఫ్ ఫైర్ స్కేటింగ్ క్లబ్ కోచ్ సంగం మురళి మార్గదర్శకత్వం కారణమని నిర్వాహకులు తెలిపారు. కాకినాడలో జరగబోయే స్టేట్ లెవల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే స్కేటర్లకు శుభాకాంక్షలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.