Thursday, 30 April 2026

Blog

యాదాద్రి భువనగిరి

చీఫ్ జస్టిస్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ కఠినంగా శిక్షించాలి

చీఫ్ జస్టిస్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ. కఠినంగా శిక్షించాలి బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ BR గవాయ్ గారిపై దాడికి యత్నించడాన్ని ఖండిస్తూ, దాడికి పాల్పడ్డవాన్ని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది …ఈ సందర్భంగా దళిత గిరిజన ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉన్న నాలుగు పిల్లర్లలో ఒకటైన న్యాయ వ్యవస్థకు ప్రదాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టీస్ గావాయ్ పై దాడి ప్రయత్నం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈఘటన భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో చీకటిరోజాని, ఇట్టి సంఘనతను ప్రతీ ప్రజాస్వామికవాది తీవ్రంగా ఖండించాలని అన్నారు.దాడికి పాల్పడ్డ వ్యక్తిని దేశద్రోహిగా , తీవ్రవాదిగా పరిగణించాలని మరొకసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరారు. భారత రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలకు, కులాలకు సమాన హక్కులు ఉన్నాయని కానీ కొందరు మానవత్వాన్ని, మానవ విలువలను కాలరాస్తూ మతోన్మాదులుగా మారి ఇలాంటి ఉగ్ర చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇలాంటివారి పట్ల చట్టం కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య బండారు రవివర్ధన్ సిర్పంగా శివలింగం దుబ్బా రామకృష్ణ మాదిగ ఇటుకల దేవేందర్ మాదిగ Dtf సత్తయ్య సార్ దిరవత్ రాజేష్ నాయక్ నగరం శంకర్ , పడిగల ప్రదీప్, సుక్క స్వామి, బండారు శివశంకర్, కోళ్ల జాంగిర్, అందే నరేష్, డాకురి ప్రకాష్, గ్యాస్ చిన్న, దర్గయి దేవేందర్, దేవరకొండ మహేష్, జాలిగం హరి శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు..

యాదాద్రి భువనగిరి

బీసీల 42% రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తూ

బీసీల 42% రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తూ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా సబ్బండ బిసి కుల సంఘాల సమావేశం పాల్గొన్న పోత్నక్ ప్రమోద్ కుమార్ ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో హౌసింగ్ బోర్డ్ కమ్యూనిటీ హాల్ లో సబ్బండ బీసీ కులాల రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర ముదిరాజ్ సంఘం నాయకులు పిట్టల బాలరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ముఖ్యఅతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ గారు పాల్గొని మాట్లాడుతూ పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఇతన ఇస్సా ఉత్ననా బాగా దారి ఇతిన ఈస ఉ తన బాగా దారి ఎంత జనాభా ఉందో అంత రిజర్వేషన్లు కల్పించాలని శ్రీ రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి గార్ల నేతృత్వంలో రాష్ట్రంలో నిర్వహించిన చట్టబద్ధతగా కుల గణన చేసి కుల గణాన ప్రకారం 56% ఉన్న బీసీలకు 42% రాజ్యాంగపరంగా విద్యా ఉద్యోగ రాజకీయలలో రిజర్వేషన్లను కల్పించాలని చిత్తశుద్ధితో చేస్తున్న కృషిని యాదాద్రి భువనగిరి జిల్లా బీసీ కుల సంఘాల మందరం అభినందిస్తూ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ 42 శాతం రిజర్వేషన్లను ఈనెల 8వ తేదీన జరిగే హైకోర్టులో తుది తీర్పులో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఫలితం దక్కాలని ఆకాంక్షిస్తూ బీసీల నోటి బుక్కను అడ్డుకోవద్దని అందరూ సహకరించాలని బిఆర్ఎస్ బిజెపి పార్టీలను వివిధ ఉన్నత వర్గాల ప్రజలను కోరుకుంటూ 42 శాతం రిజర్వేషన్లు జరిగే విధంగా అమలు అయ్యే విధంగా స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగే విధంగా సహకరించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు మాటూరి బాలేశ్వర్ దాసరపు నరసింహ శాలివాహన సంఘం కోడిమాముల కృష్ణ చిన్నగారి బలరాం విశ్వబ్రాహ్మణ నాయకులు దేవరకొండ నరసింహ చారి పద్మశాలి సంఘం శ్యామల రవీందర్ నరేష్ వడిచర్ల కృష్ణ యాదవ్ యాదగిరి యాదవ్ ఒర్రె నరసింహ యాదవ్ రజక సంఘం నాయకులు సిరికొండ శివకుమార్ ముదికొండ వెంకటేష్ గౌడ సంఘం నుండి ఆర్జీపురం ఆంజనేయులు గౌడ్ నరేష్ గౌడ్ వడ్డెర సంఘం నుండి దేవరంగుల కవిత వడ్డరి యాదగిరి వంజరి కుల సంఘం నుండి సాల్వేరు ఉపేందర్ కాలియా నాగరాజ్ మరియు హౌసింగ్ బోర్డ్ సీనియర్ సిటిజన్ నాయకులు పాలడుగు శేఖర్ మెత్తింటి భాస్కర్ జిట్ట యాదిరెడ్డి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

కాకినాడ

ఆరాచకాన్ని ప్రోత్సాహిస్తున్న జనసేన నాయకులు… స్వంత పార్టీ నాయకుల చేతుల్లోనే పరాభవం ఎదుర్కొంటున్న వీరమహిళలు.. కోపల్లి కోఠారి సత్య పై ఎస్పీ కి పిర్యాదు..

కాకినాడ జిల్లా, కాకినాడ: న్యాయం కోసం కృషి చేసే వారే నేటి పరిస్థితుల్లో నిందితులుగా మారుతున్నారు. ప్రజా సమస్యలు ఎత్తిచూపి, బాధితులకు అండగా నిలుస్తే “ఆరాచకం” అంటూ విమర్శల వర్షం కురుస్తోంది. ఇటువంటి పరిస్థితులను ఇప్పుడు కాకినాడలోని జనసేన పార్టీకి చెందిన వీరమహిళలు ఎదుర్కొంటున్నారు. జనసేన పార్టీ 19వ డివిజన్ ఇన్‌చార్జ్ బొట్టు లీలా ఆవేదన వ్యక్తం చేస్తూ తాము పవన్ కళ్యాణ్ సిద్దాంతాలకు కట్టుబడి, ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుంటే,తమ స్వంత పార్టీ నాయకులే అడ్డుపడుతున్నారని ఇది నిరాశకు గురిచేస్తోందని ఆమె ఆక్రోధన వ్యక్తం చేసారు ఇటీవల జరిగిన కోపల్లి కోఠారి సత్య – కారం సత్యవతి వ్యవహారం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిందని తెలిపారు. బ్యాంకు తనఖాలో ఉన్న ఇంటిని అద్దెకు ఇచ్చి, నాలుగు లక్షల నగదు తీసుకున్నప్పటికీ, మోసపూరిత ఒప్పందంతో బాధితురాలు కారం సుబ్బలక్ష్మి ని తప్పు పట్టే ప్రయత్నం చేసిన ఘటనలో బాధితురాలు న్యాయం కోసం జనసేన వీరమహిళలను ఆశ్రయించిందని పేర్కొన్నారు. బాధిత రాలు దళిత గిరిజన మహిళ కావడం తో వీరమహిళలు ముందుకు వచ్చి పోలీసు కేసులు నమోదు చేయించగా, అటు కొందరు స్వంత పార్టీ నాయకులు మోసగాళ్లు పక్షాన నిలుస్తూ వీరమహిళలను మానసికంగా వేధిస్తున్నారని బొట్టు లీలా ఆరోపిస్తున్నారు. ఎస్పీని కలిసి పిర్యాదు చేయడంతో పోలీసు శాఖ స్పందించి చర్యలు ప్రారంభించిందని, ఎస్పీ హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.జనసేన పార్టీ స్థాపన నుంచే పవన్ కళ్యాణ్ “న్యాయం, ప్రజాస్వామ్యం, బాధితుల పక్షాన నిలబడటం” అనే సూత్రాలను ప్రధానంగా ఉంచారు. కానీ ఇప్పుడు అదే సూత్రాలను ఆచరిస్తున్న క్షేత్రస్థాయి మహిళా నాయకులు, కార్యకర్తలు స్వంత పార్టీలోనే అణచివేతకు గురవుతున్నారనే వాస్తవం ఆందోళన కలిగిస్తోందని బొట్టు లీలా తెలిపారు. జనసేన అధినేత ప్రజా న్యాయం కోసం నిరంతరం పోరాడుతుంటే, స్థానిక నాయకులు మాత్రం వ్యక్తిగత స్వార్ధం, పదవీ ప్రాధాన్యత, వర్గీయత ఆధారంగా వ్యవహరిస్తున్నారనే విషయం సుష్పష్టం అవుతుందని అన్నారు. ఇది పార్టీ అంతర్గత బలహీనతలతో పాటు పారదర్శక వ్యవస్థ లోపం ను బయటపెడుతోందని పేర్కొన్నారు. జనసేన మహిళా విభాగం గత ఎన్నికల్లో పార్టీకి మంచి బలాన్ని అందించిందని వీరమహిళల త్యాగం, కృషి, సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, పార్టీకి వారు “కూరలో కరివేపాకు”లా కాకుండా, అడుగడుగునా కట్టుబాటు చూపిన శక్తి వనరులు అనే విషయాన్ని కాకినాడ నాయకులు విష్మరించడం దురదృష్టం అన్నారు. ఇప్పుడు అదే వీరమహిళలు పరాభవం ఎదుర్కొంటున్నాయి అంటే, అది పార్టీ భవిష్యత్తుకు హెచ్చరికగా మారుతుందని, పార్టీ లోపల సంస్థాగత సమీక్ష, అంతర్గత నియంత్రణ వ్యవస్థ, మహిళా రక్షణ కమిటీలు లాంటి చర్యలు లేకుండా ఉంటే, ఇలాంటి సంఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందన్న విషయాన్ని పార్టీ అధిష్టనం గుర్తించి తక్షణమే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసారు. ఇది కేవలం ఒక మహిళా కార్యకర్త బాధ మాత్రమే కాదని పార్టీ విలువలపై నమ్మకం కోల్పోయే దిశలో తీసుకెళ్లే సంకేతమన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్దాంతాలను ఆచరించే వీరమహిళలు, స్థానిక నాయకుల అన్యాయానికి ఎదురు నిలుస్తున్నందుకే ఇబ్బందులు పడుతున్నారని, పార్టీకి అంకితభావంతో పనిచేసిన ఈ మహిళలు ఇప్పుడు పార్టీ లోపలే పరాయి బలహీనులు గా మారడం, జనసేన భవిష్యత్తుకు సవాల్‌గా మారుతోందని, న్యాయం కోరేవారిని మద్దతు ఇవ్వకుండా, వారిని నిరుత్సాహపరిస్తే — జనసేన ఆత్మ, ఆవేశం రెండూ దెబ్బతింటాయని హేచ్చరించారు. .భవిష్యత్ ప్రశ్నర్ధకంగా మారుతుందని పదవులు అనుభవిస్తున్న వలస పక్షులు అందిన కాడికి మూట గట్టుకుని ఎగిరి పోతాయానే నగ్న సత్యం ఆవిష్కరణ అవుతుందని వీరమహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బోడపాటి మరియ, పలువురు గిరిజన యువకులు, మహిళలు పాల్గొన్నారు.

హైదరాబాద్

రాయదుర్గంలో ఎకరం ధర రూ. 177 కోట్లు*

పున్నమి ప్రతినిధి: *రాయదుర్గంలో ఎకరం ధర రూ. 177 కోట్లు – వేలంలో టీజీఐఐసీపై కాసుల వర్షం* *టీజీఐఐసీ వేలంలో రికార్డు ధర – 18 ఎకరాల భూమిని వేలం వేసిన టీజీఐఐసీ – రూ. 177 కోట్లకు ఎకరం చొప్పున 7.67 ఎకరాల భూమిని దక్కించుకున్న ఎంఎస్ఎన్ రియాల్టీ* రాయదుర్గం నాలెడ్జ్ సిటీ ప్రభుత్వ భూముల వేలానికి ఊహించని స్పందన లభించింది. రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో ఎకరం ధర రూ.177 కోట్లు పలికి రికార్డు నెలకొల్పింది. ఈ ప్రాంతంలో ఉన్న 18 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని టీజీఐఐసీ వేలం వేసింది. దీంట్లో పాల్గొన్న ఎంఎస్‌ఎన్‌ రియాలిటీ సంస్థ అత్యధిక ధరతో 7.6 ఎకరాల భూమిని వేలంలో సొంతం చేసుకుంది. ఒక్క ఎకరానికి రూ.177 కోట్ల చొప్పున మొత్తం రూ.1357 కోట్లకు చేజిక్కించుకుంది. మరో 11 ఎకరాలకు వేలం ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసి) నిర్వహించిన రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూముల వేలం పాటలో ఎకరా భూమికి ఏకంగా రూ. 177 కోట్లు చెల్లించి ఎంఎస్ఎన్ రియాల్టీ ఈ భూములను సొంతం చేసుకుంది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ (సర్వే నంబరు 83/1)లోని మొత్తం 18.67 ఎకరాల్లో భాగంగా ఉన్న 7.67 ఎకరాలను ప్రభుత్వం టీఎస్‌ఐఐసీ ద్వారా వేలం వేసింది. హోరా హోరీగా పోటీ : రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, టీజీఐఐసీ ఈ వేలం కోసం ఎకరాకు రూ. 101 కోట్లుగా ప్రారంభ ధరను నిర్ణయించింది. ఈ వేలంలో ఎంఎస్ఎన్, హెటెరో, మేఘా, బ్రిగేడ్ గ్రూప్, సత్వ, ప్రెస్టీజ్ వంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థలు హోరా హోరీగా పోటీ పడ్డాయి. ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ ఈ వేలంలో ఎంఎస్ఎన్ రియాల్టీ ఒక్క ఎకరా భూమిని రూ. 177 కోట్లకు దక్కించుకోవడం ద్వారా రికార్డు సృష్టించింది. ఈ ధరతో మొత్తం 7.67 ఎకరాలను ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ ఏకంగా రూ.1,357 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఈ రికార్డు స్థాయి ధర, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ బలాన్ని, ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి కీలక ప్రాంతాలకు సమీపంలో ఉన్న రాయదుర్గం ఏరియా ప్రాముఖ్యతను మరోసారి చాటి చెప్పింది. అత్యంత ఖరీదైన ప్రాంతంగా నాలెడ్జ్​ సిటీ : మొత్తం 18 ఎకరాల ప్రభుత్వ భూమికి టీజీఐఐసీ వేలం నిర్వహిస్తోంది. మరో 11 ఎకరాల భూమికి వేలం కొనసాగుతోంది. 2017లో ఇదే ప్రాంతంలో ఎకరం ధర రూ. 42.59 కోట్లు పలికింది. ఎనిమిదేళ్లలోనే వ్యవధిలోనే రాయదుర్గంలో ఎకరం ధర రూ. 177 కోట్లు పలికింది. 2022లో నియోపోలీస్, కోకాపేట్​లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో వేలం వేసిన భూమికి రూ. 100 కోట్ల ధర లభించింది. కోకాపేట, నియోపోలీస్ భూములతో పోలిస్తే ఇప్పుడు రాయదుర్గంలో 75 శాతం ధర ఎక్కువగా ఉంది. 7.67 ఎకరాలు, 11 ఎకరాలను రెండు భాగాలుగా చేసి టీజీఐఐసీ వేలం వేస్తోంది.చదరపు గజానికి రికార్డు ధర : తెలంగాణ హౌజింగ్ బోర్డు ప్లాట్ల విక్రయాల్లో మరోసారి రికార్డు స్థాయి ధర లభించింది. కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్​లో చదరపు గజం రూ.1.14 లక్షలు పలికింది. తెలంగాణ హౌజింగ్ బోర్డు 18 ఓపెన్ ప్లాట్లు, 4 ఫ్లాట్లను బహిరంగ వేలం వేసింది. దీనిలో 27 మంది బిడ్డర్లు పోటాపోటీగా పాల్గొన్నారు.

జాతీయ అంతర్జాతీయ

*బంగారం ధరలకు రెక్కలు*

పున్నమి ప్రతినిధి: *రూ.1.30 లక్షలు దాటిన 10 గ్రాముల పసిడి ధర* *ఇవాళ ఒక్కరోజే రూ.9,700 పెరిగిన 10 గ్రాముల బంగారం ధర* దేశంలో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ఇవాళ (సోమవారం) ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర రూ.9,700కు పైగా పెరిగింది. దీనితో ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1.30 లక్షలు దాటింది. మరోవైపు వెండి ధరలు కూడా ఆల్టైమ్ రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇవాళ కిలో వెండి ధర ఏకంగా రూ.7,400 పెరిగి రూ.1,57,400కు చేరింది. అమెరికా షట్డౌన్ కావడం సహా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందనే అంచనాలే ఇందుకు కారణం. వీటికి తోడు అంతర్జాతీయ రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, ట్రంప్ టారిఫ్లు, కేంద్రీయ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు కలగలిసి బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. *నగరాల వారీగా నేటి బంగారం ధరలు:* ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1.30 లక్షలు. హైదరాబాద్లో 10 గ్రాముల (24 క్యారెట్స్) స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,26,674గా ఉంది. 10 గ్రాముల (22 క్యారెట్స్) బంగారం ధర రూ.1,16,117. విజయవాడలో 10 గ్రాముల (24 క్యారెట్స్) స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,26,674గా ఉంది. 10 గ్రాముల (22 క్యారెట్స్) బంగారం ధర రూ.1,16,117. విశాఖపట్నంలో 10 గ్రాముల (24 క్యారెట్స్) స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,26,674గా ఉంది. 10 గ్రాముల (22 క్యారెట్స్) బంగారం ధర రూ.1,16,117. ముంబయిలో 10 గ్రాముల (24 క్యారెట్స్) స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,20,770గా ఉంది. 10 గ్రాముల (22 క్యారెట్స్) బంగారం ధర రూ.1,10,770. వీటికి తోడు కొనుగోలుదారులు జీఎస్టీ, మేకింగ్ ఛార్జెస్ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. *అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు:* ఇంటర్నేషనల్ మార్కెట్లో సోమవారం ఔన్స్ బంగారం ధర 3,900 డాలర్లు దాటింది. యూఎస్లో స్పాట్ గోల్డ్ ధర ఆల్టైమ్ రికార్డ్ హై 3,924.39 డాలర్లకు పెరిగి, తరువాత 3,922 డాలర్ల వద్ద స్థిరపడింది. మొత్తంగా చూసుకుంటే, గత కొన్ని నెలలో బంగారం ధర 50 శాతం మేర పెరిగింది. అంతేకాదు ఇకపై కూడా పసిడి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఔన్స్ బంగారం ధర ప్రస్తుత స్థాయి నుంచి ఏకంగా 4,800 డాలర్లకు పెరిగే అవకాశం ఉందంటున్నారు. అంటే బంగారం ధర 26 శాతానికిపైగా పెరిగే ఛాన్స్ ఉందని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. *తగ్గుతున్న గోల్డ్ బిజినెస్:* బంగారం ధరలు ప్రతిరోజు రికార్డు స్థాయిలో పెరుగుతుండడంతో సామాన్యులు బంగారం కొనేందుకు వెనుకాడుతున్నారని, ఫలితంగా క్రయవిక్రయాలు బాగా తగ్గున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. పసిడి రేట్లు పెరుగుతుండడంతో మహిళలు ఇతర ఆభరణాల వైపు మళ్లుతున్నారని వారు చెబుతున్నారు. *రిస్క్ ఉంది – జర జాగ్రత్త:* ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. చాలా మంది వివాహాది శుభకార్యాల కోసం షాపింగ్ చేస్తున్నారు. అయితే బులియన్ మార్కెట్లో ఒడిదొడుకులు చాలా సహజం. అందుకే పెరుగుతున్న ధరలు మార్కెట్లో భయాన్ని కూడా సృష్టిస్తున్నాయి. ఇప్పుడు అధిక ధరకు బంగారం కొన్నవారు, రేట్లు తగ్గిన తర్వాత ఇబ్బందిపడే అవకాశం ఉందని మరికొందరు నిపుణులు చెబుతున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వి.ఎస్‌.యూ విద్యార్థి శ్రీ ఎం. పృథ్విరాజ్‌కు రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ NSS ఉత్తమ వాలంటీర్ అవార్డు…

అక్టోబర్ 6: విక్రమసింహాపురి విశ్వవిద్యాలయం (వి.ఎస్‌.యూ), నెల్లూరు బయోటెక్నాలజీ విభాగానికి చెందిన యన్ ఎస్ ఎస్ వాలంటీర్ శ్రీ ఎం. పృథ్విరాజ్ సామాజిక సేవలో చేసిన విశిష్ట కృషికి గాను యన్ ఎస్ ఎస్ జాతీయ ఉత్తమ వాలంటీర్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును ఇవాళ న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయనకు ప్రదానం చేశారు. ఈ వేడుకలో కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడాశాఖ ఉన్నతాధికారులు, వివిధ రాష్ట్రాల యన్ ఎస్ ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. వి.ఎస్‌.యూ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ, “మా విశ్వవిద్యాలయానికి ఇది గర్వకారణం. విద్యార్థులు విద్యతో పాటు సామాజిక సేవలో అంకితభావాన్ని చూపడం విశేషం. పృథ్విరాజ్ సాధించిన ఈ జాతీయ అవార్డు ఇతర యువతకు ప్రేరణగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు. వి.ఎస్‌.యూ రిజిస్ట్రార్ డా. కే. సునీత మాట్లాడుతూ, “పృథ్విరాజ్ సాధించిన ఈ జాతీయ స్థాయి గౌరవం వి.ఎస్‌.యూ ప్రతిష్ఠను పెంచింది. విద్యార్థులు విద్యా ప్రగతితో పాటు సామాజిక బాధ్యతల పట్ల చూపుతున్న నిబద్ధత విశ్వవిద్యాలయానికి గర్వకారణం. పృథ్విరాజ్ వంటి యువతే సమాజానికి ఆదర్శం” అని అభినందించారు. కాలేజ్ ప్రిన్సిపాల్ డా. సిహెచ్. విజయ మాట్లాడుతూ, “మా కళాశాల విద్యార్థి పృథ్విరాజ్ జాతీయ స్థాయిలో యన్ ఎస్ ఎస్ ఉత్తమ వాలంటీర్ అవార్డును అందుకోవడం గర్వకారణం. ఈ విజయంతో మా కళాశాల ప్రతిష్ఠ మరింత పెరిగింది. విద్యార్థులు విద్యతో పాటు సామాజిక సేవలోనూ అగ్రగాములు కావాలని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాము” అని తెలిపారు. యన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. ఉదయ శంకర్ అల్లం మాట్లాడుతూ, “పృథ్విరాజ్ పర్యావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, అవగాహన కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన కృషి యన్ ఎస్ ఎస్ యూనిట్ల ప్రతిష్ఠను జాతీయ స్థాయికి తీసుకెళ్లింది” అని ప్రశంసించారు. జాతీయ అవార్డును స్వీకరించిన అనంతరం శ్రీ ఎం. పృథ్విరాజ్ మాట్లాడుతూ, “ఈ అవార్డు నాకు మాత్రమే కాకుండా మా వి.ఎస్‌.యూ యన్ ఎస్ ఎస్ యూనిట్ మొత్తానికి దక్కిన గౌరవం. సమాజ సేవలో మరింత కృషి చేస్తూ, గ్రామీణాభివృద్ధి మరియు యువత శ్రేయస్సు కోసం పనిచేస్తాను” అని తెలిపారు.ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అధికారులు, భోధన, భోధనేత్రర సిబ్బంది యన్ ఎస్ ఎస్ వాలంటీర్లు మరియు యన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ లు అతనికి అభినందనలు తెలిపారు.

జాతీయ అంతర్జాతీయ

విజయ్ దేవరకొండ కారుకు తప్పిన ప్రమాదం.

అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండల సమీపంలో 44వ జాతీయ రహదారిపై బొలెరో ఒక్కసారిగా కుడివైపు టర్న్ చేయడంతో వెనకాలే వస్తున్న విజయ్ Lexus మోడల్ కారు దాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్ దేవరకొండకు ఎలాంటి గాయాలు కాలేదు. కారు స్వల్పంగా దెబ్బతింది. దీంతో విజయ్ దేవరకొండ, అతడి స్నేహితులు వేరే వాహనంలో వెళ్లిపోయారు. పుట్టపర్తికి నిన్న వెళ్లి ఈరోజు హైదరాబాదుకి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విజయ్ దేవరకొండ డ్రైవర్, అందె శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఉండవల్లి ఎస్సై శేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పశ్చిమ గోదావరి

అంగన్వాడీ చిన్నారులకు బేబీ కుర్చీలు బహూకరించిన మానవతా…

పశ్చిమగోదావరి జిల్లా, పెంటపాడు, అక్టోబర్ 6 (పున్నమి ప్రతినిధి): పెంటపాడు మండలం కూనాగారపేట లోని అంగన్వాడీ పిల్లలపై మానవతా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ తాడేపల్లి మోహన్ రావు ఆధ్వర్యంలో మానవతా సేవా సంస్థ ధాత్రుత్వం చాటుకుంది.సోమవారం పెంటపాడు గ్రామం కూనాగర పేటలో గల అంగన్వాడి పాఠశాలలోని బాల బాలికల సౌకర్యార్థం10 కుర్చీలను మానవతా అందజేయడం జరిగినది.వాటితో పాటు విద్యార్థులకు రాత పలకలు, స్వీట్లు,పెన్సిళ్లు, బిస్కెట్లు, ఫ్రూటీ ప్యాకెట్లు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ తాడేపల్లి మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మానవత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్,పూర్వపు ఆంధ్రా బ్యాంక్ సీనియర్ మేనేజర్, వ్యక్తిత్వ వికాస నిపుణులు తాడేపల్లి మోహన్ రావు మాట్లాడుతూ మానవత సంస్థ రాష్ట్రవ్యాప్తంగా165 మండలాలలో అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ప్రజలలో మమేకమై కష్టకాలంలో ఉన్న వ్యక్తులకు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతున్న సేవా సంస్థ మానవత అని అన్నారు. “ఉత్తమ సమాజ నిర్మాణమే” మానవతాధ్యేయంగా ముందుకు సాగుతున్న మానవత, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టడం, రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల్లో, పాఠశాలలలో విద్యార్థులకు నైతిక విలువల బోధన, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించడం, అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ఆర్థికంగా ఆదుకోవటం వంటి అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ప్రజలలో మమేకమై ముందుకు సాగుతున్న స్వచ్ఛంద సేవా సంస్థ అని, బ్రతికి ఉన్న మనుషులకే కాక చనిపోయినప్పుడు కూడా వారి పార్థివ దేహాలకు సేవలు అందిస్తున్న ఏకైక సంస్థ మానవతా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా కార్యవర్గ సభ్యులు తారాడి పాల్,విప్పర్తి వినాయకుడు,మీసాల సత్యనారాయణ,ఆర్.వి.టి. రాజ్ కుమార్,నల్లమిల్లి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.స్థానిక పెద్దలు టి.సంజయ ఖాన్,తానేటి కుమార్ రాజా,లింగాల బెన్నీ,అంగన్వాడి టీచర్ లింగాల గౌరి,తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

కోలా విశాలాక్షి ని సన్మానించి బలిజ సంఘం నేతలు

శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు సభ్యులుగా కూటమి ప్రభుత్వం బలిజ కులస్తులకు కేటాయించడం చాలా సంతోషదాయకమని బలిజ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమింపబడిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ సతీమణి కోలా విశాలాక్షి ని సన్మానించారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి బలిజ సంఘం నాయకులు పాల్గొన్నారు.

అన్నమయ్య

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ – ప్రజల కష్టానికి భారీ ఊరట

…..ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్కా సాయి వికాస్ రెడ్డి చేతుల మీదుగా వేలాది కుటుంబాలకు విలువైన చెక్కులు అందజేశారు చిట్వేలు, అక్టోబర్ 6 ( పున్నమి ప్రతినిధి): శివ చిట్వేల్ మండలంలో సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్కా సాయి వికాస్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. నాగవరం గ్రామానికి చెందిన అల్లిశెట్టి మల్లికార్జునకు రూ.51,310, పెద్దూరు గ్రామానికి చెందిన బుంగటవల రామచంద్రయ్యకు రూ.65,918, చాపరపల్లి గ్రామానికి చెందిన కోట భాను ప్రకాష్ కుటుంబానికి రూ.1,09,660, చిట్వేల్ పట్టణానికి చెందిన తుమ్మలపల్లి జయరామయ్య కుటుంబానికి రూ.2,53,528, చిట్యాల గ్రామానికి చెందిన రోల్ల మౌర్య రాయలకు రూ.21,741 చెక్కులు అందజేయబడ్డాయి. ఎంఎల్ఏ అరవ శ్రీధర్ తెలిపారు, “ప్రజల కష్టసమయంలో ప్రభుత్వం అండగా ఉంది. ప్రతి అర్హుడికి సహాయం చేరేలా కృషి చేస్తున్నాం.” ముక్కా సాయి వికాస్ రెడ్డి పేర్కొన్నారు, “సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక, మానసిక భరోసా కల్పిస్తోంది.” ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రాజుగుంట సర్పంచ్ గుత్తి నరసింహ, జనసేన నాయకులు మాదాసు నరసింహ, ఉప్పలపాటి శివ, కె.కందులవారి పల్లి ఏదోటి రాజశేఖర్ (నైస్), కొనిశెట్టి సుబ్బరాయుడు, దొండ్లవాగు మధు, తుమ్మచెట్లపల్లి వెంకటేశ్వర్లు నాయుడు, తుపాకుల పెంచలయ్య, మద్దూరి మన్మధ, షేక్ రియాజ్, మాదాసు శివ, కావేరి అవినాష్, పెద్దం గారి సాయి, రోళ్ళ మోహన్, వెంకటసుబ్బయ్య, నాగేంద్ర, పవన్ రాజు తదితర ఎన్డీఏ కార్యకర్తలు చురుకైన పాల్గొనడం ప్రత్యేకంగా నిలిచింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.