Friday, 1 May 2026

Blog

జోగులాంబ గద్వాల

*సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి సీజెఐ గావాయ్ గారి పై దాడి యత్ననాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం!*

ఐజ పున్నమి న్యూస్: *రాజ్యాంగ బద్ద మైన న్యాయ వా దా వృత్తి లో ఉన్నా. *ఒక లాయర్ గౌరవ అత్యున్నత న్యాయ వ్యవస్థ కు* *ప్రధాన న్యాయ మూర్తి గా ఉన్న సీజె ఐ గావాయ్ గారి పై..చెప్పు తో దాడికి యత్నించడం! సిగ్గు చేటు!* *దేశం లో..దర్మం పేరుతో.. అధర్మంగా దాడులు చెయ్యడం ఏమిటీ?* *ఈ దేశం లో…సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తికే…. రక్షణ లేదంటే….*. *అణగారిన వర్గాల పై వివక్షా…ఎంత దారుణంగా ఉందొ అర్థం చేసుకోవొచ్చు!* *తక్షణమే… కేంద్ర ప్రభుత్వం ఈ విషయం పై కఠిన మైన చర్యలు తీసుకోవాలి!* *న్యాయ మూర్తి పై చెప్పు తో దాడికి పాల్పడిన* *ఆ లాయర్ ను న్యాయవాది వృత్తి నుండి శాశ్వితంగా తొలగించాలి.* *అతడి పై దేశ ద్రోహం కేసు లు పెట్టాలి!* *సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి గారి పై దాడి..అంటే, దేశ న్యాయ వ్యవస్థ పై….* *ఈ దేశ రాజ్యాంగం పై దాడి చేసినట్లే.* *ఈ సంఘటన.. దేశం లోని షెడ్యూల్డ్ కులాల మనోబావాలను ఎంతో గాయ పరుస్తుంది*. *కావున తక్షణమే బీజేపీ ప్రభుత్వం… చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు వి రాజు మాదిగ దండోరా సీనియర్ నాయకులు.*

ఖమ్మం

మీకు తోచిన సహాయం చేయండి గాయత్రి హెల్పింగ్ హాండ్స్ మీ కొలిశెట్టి నరేష్

ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కేసుపల్లి గ్రామానికి చెందిన బోజడ్ల పుల్లయ్య వెంట్రావమ్మ కుమారుడు అనుకోని ప్రమాదంలో బ్రెయిన్ స్టాక్ తో సంకల్ప హాస్పిటల్ లో కోమలో ఉన్నాడు చాలా నిరుపేద కుటుంబం మీకు తోచిన సహాయం చేయండి ఆ తల్లి కన్నీరు అర్ధనాథాలు చూసి నాకు తోచిన సహాయం పదివేల రూపాయలు చేశాను మీరు కూడా 50₹ 100₹ 200₹ మీకు తోచిన సహాయం చేయండి దాతలు అందరి ముందుకు వస్తే ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము దయచేసి ఈ పోస్ట్ చూసి వదిలేయకుండా మీకు తోచిన సహాయం చేయండి 8919130173 సాయి ఫోన్ పే గూగుల్ పే నెంబర్ గాయత్రి హెల్పింగ్ హాండ్స్ మీ కొలిశెట్టి నరేష్ ఫోన్ పే గూగుల్ పే నెంబర్ 9550301954 నా నెంబర్ కి చేసిన పరవాలేదు ఆ కుటుంబానికి మన ఫౌండేషన్ ద్వారా అందజేస్తాము

హైదరాబాద్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

పున్నమి: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ నవంబర్ 11వ తేదీ పోలింగ్, 14వ తేదీ కౌంటింగ్

E-పేపర్

విజయవాడ రూరల్: ఎనికేపాడులో భారీ అగ్నిప్రమాదం*

విజయవాడ: అక్టోబర్ 6 పున్నమి ప్రతినిధి సురేష్ విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో ఈ రోజు తెల్లవారుజామున పానాసోనిక్ ఎలక్ట్రానిక్ వస్తువుల గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు తీవ్రంగా ఎగిసిపడటంతో గోదాంలో నిల్వ ఉన్న విలువైన వస్తువులు పూర్తిగా కాలిపోయాయి.ప్రాథమిక అంచనా ప్రకారం, ఈ అగ్నిప్రమాదంలో సుమారు ఐదు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది కి సమాచారం అందిన వెంటనే, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో, మొత్తం ఏడు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించాయి. సుమారు గంటలపాటు శ్రమించిన తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని గోదాం సిబ్బంది, పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల్లో ఆందోళన: భారీగా ఎగసిపడిన మంటలు, దట్టమైన పొగ కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఉదయం వేళ ఈ ఘటన జరగడంతో ప్రాణనష్టం తప్పినప్పటికీ, భారీ ఆస్తి నష్టం సంభవించింది.

సినిమా

“కేజీఎఫ్’ను దాటేసిన ‘కాంతార చాప్టర్ 1” నాలుగో రోజు దిమ్మతిరిగే కలెక్షన్స్!

‘కాంతార చాప్టర్ 1’ సినిమా భారతీయ సినిమా పరిశ్రమలో మరో రికార్డ్ సృష్టిస్తోంది. ఇది రిలీజ్ అయిన నాలుగో రోజే భారీ కలెక్షన్స్ సాధించి, బ్లాక్‌బస్టర్ హిట్‌గా మారింది. ముందు రోజులలో ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం, కేజీఎఫ్ సినిమాను కూడా దాటేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కథ, దర్శకుడు, యాక్షన్ సీన్స్, సంగీతం ప్రేక్షకులని మక్కువ కట్టించాయి. సోషల్ మీడియాలో సినిమా గురించి చర్చలు, రివ్యూలు వైరల్‌గా మారడంతో, టికెట్ వాహికలు నిరంతరం పెరుగుతున్నాయి. ఇండియాలో మాత్రమే కాదు, అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ‘కాంతార చాప్టర్ 1’ మంచి కలెక్షన్స్ రాబడుతోంది. నిర్మాతలు, సినీ పరిశ్రమ ప్రత్యేకంగా ఈ విజయాన్ని ఘనంగా అభినందిస్తున్నారు. ఇది నిజంగా తెలుగు సినిమా కోసం గర్వకారణం.

కామారెడ్డి

ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్: పలువురుని పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే

కామారెడ్డి, 05 అక్టోబర్ ,పున్నమి ప్రతినిధి : ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు ఎల్లారెడ్డి నియోజకవర్గం, ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఎల్లారెడ్డి నియో జకవర్గం, రామారెడ్డి మండలంలో బీఆర్‌ఎస్‌ కు చెందిన కీలక నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మదన్మోహన్ సమక్షంలో రామారెడ్డి మండల బీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పేస్ సోసైటీ డైరెక్టర్ రాజేందర్, గిద్ద గ్రామానికి చెందిన మాజీ వార్డ్ మెంబర్స్ నర్సవ్వ, రాజవ్వ, రమేష్ రెడ్డి, సీనియర్ నాయకులు లింబరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తో పాటు మొత్తం 30 మంది నాయకులు బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరిన నాయకులు మాట్లాడుతూ, ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయక త్వంలో రామారెడ్డి మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమా లు తమను ఆకర్షించాయని తెలిపారు. ప్రజల కోసం నిజమైన సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరామని పేర్కొన్నారు.ఈ కీలక చేరికలు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని మరింత పెంచగా, ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు ఆందోళన కలిగించే అంశంగా మారాయి.ఈ చేరికల కార్యక్ర మంలో మండల అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, రామారె డ్డి మాజీ సర్పంచ్ రంగు రవీందర్, ఏఎంసీ డైరెక్టర్ రవుఫ్, మండల ఉపాధ్యక్షులు ల్యాగల ప్రసాద్, కాంగ్రెస్ మండల బీసీ సెల్ అధ్యక్షులు జేసీబీ శేఖర్, సీని యర్ నాయకులు అరవింద్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

టిఫిన్ సెంటర్ హోటల్ రెస్టారెంట్ …..ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల పై కొరవడిన నిఘా.

పట్టించుకోని ఆహార భద్రత అధికారులు… * ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న హోటల్స్ యజమానులు * కనీసం ఆరోగ్య భద్రత పాటించని వర్కర్లు తినే పదార్థాలు బాగోలేదని కస్టమర్ హోటల్స్ యజమానులను అడిగితే వారి పైన దాడులకు దిగుతున్న యజమాన్య బృందం * హోటల్స్ లలో తలకు మించిన ధరలు అడిగేవారే కరువయ్యారు * కస్టమర్ కు సంబంధించి కనీస సౌకర్యాలు అయిన టాయిలెట్స్ అనేది ఏ హోటల్స్ లో చూసినా ఎక్కడ కనిపించడం లేదు అలాంటి హోటల్స్ యొక్క పర్మిషన్లు రద్దు చేయాలని కస్టమర్ డిమాండ్ రైల్వేటేషన్ పక్కనున్నటువంటి ఆనంద విహార్ హోటల్స్ లో అపరిశుభ్రంగా ఉన్నటువంటి ప్లేట్స్ లలో టిఫిన్ పెట్టడం జరుగుతుంది ప్లేట్స్ శుభ్రంగా లేదు అని ఆనంద విహార్ క్యాషియర్ ని నిలదీసి అడగ్గా వెంటనే కస్టమర్ చేతిలో ఉన్న ప్లేట్లు లాక్కొని వంటగది రూంలో తీసుకువెళ్లి వేరే ప్లేట్లల్లో టిఫిన్ పెట్టి ఇవ్వడం జరిగింది ఆనంద విహార్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ నిర్వహించి వెంటనే ఆ హోటల్ లైసెన్స్ ను రద్దు చేయాలని కస్టమర్స్ కోరుకుంటున్నారు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న టిఫిన్ సెంటర్ హోటల్ మరియు పాస్ట్ ఫుడ్ సెంటర్ల పై అధికారుల నిఘా కరువైందని పలువురు ఆరోపిస్తున్నారు. పలురకాల మాంసాహార ఐటమ్స్‌తో ఆహార ప్రియులను నట్టేట ముంచుతున్నాయి. ఇష్టానుసారంగా నాణ్యతలేని ఆహార పదార్థాలు విక్రయిస్తూ ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు. మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచి విక్రయిస్తుంటే ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోందని పలువురు మండిపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఆహార పదార్థాల బిజినెస్ ఊపందుకుంటుంది. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు అనుభవం టిఫిన్ సెంటర్ హోటల్ రెస్టారెంట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల యజమానులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ నూనె, కల్తీ ఆహారాన్ని విక్రయస్తూ ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఆహార పదార్థాల విక్రయించే హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పలు దుకాణాలకు, ఆహార భద్రత అధికారుల నుంచి పలు అనుమతులు పొందాలి. అయితే ఈ అనుమతులకు విరుద్ధంగా కొందరు ఇష్టారాజ్యంగా ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకొని సంపాదనే ధ్యేయంగా నాణ్యతలేని పదార్థాలు విక్రయిస్తూ ప్రజారోగ్యాన్ని పక్కనపెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సెంటర్ల పై చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వెలువెత్తు తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి హోటల్స్ రెస్టారెంట్ టిఫిన్ సెంటర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్

నూతన వరుడుని ఆశీర్వదించిన వైసిపి నాయకులు

రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి కోడూరు టౌన్. ఎస్ ఎస్ కన్వర్షన్ నందు మార్కెట్ వీధికి చెందిన షేకషమీం కుమారుని వల్లిమా కు హాజరై నూతన వరుడికి ఆశీర్వాదం శుభాకాంక్షలు తెలియజేసిన కోడూరు పట్టణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ రమేష్ బాబు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర. వైసిపి యూతపవన్ సాయి గార్లు

ఆంధ్రప్రదేశ్

ఏపీలో కుల ధృవీకరణ పత్రాలు ఇకపై వాట్సాప్ లోనే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రజలకు సులభతరం చేసేందుకు మరో నూతన నిర్ణయం తీసుకుంది. ఇకపై కుల ధృవీకరణ పత్రాలు (Caste Certificates) కూడా వాట్సాప్ ద్వారా పొందే అవకాశం కల్పించనుంది. “మన మిత్ర” వాట్సాప్ గవర్నెన్స్‌ లో భాగంగా ఈ సేవను త్వరలో ప్రారంభించనున్నారు. ప్రజలు ఇకమీదట మీ సేవా కేంద్రాలకు వెళ్లకుండా, వాట్సాప్‌లోనే నేరుగా తమ కుల ధృవీకరణ పత్రాలను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ప్రస్తుతం ఈ సదుపాయం అమలుకు సంబంధించిన క్షేత్రస్థాయి పనులు జరుగుతున్నాయి. అమలులోకి వచ్చిన తర్వాత ప్రజలకు మరింత సౌలభ్యం కలగనుంది.

ఆంధ్రప్రదేశ్

కె జి హెచ్ లో గిరిజన బాలికలను పరామర్శించిన నేతలు

రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి.. పార్వతీపురం మణ్యం జిల్లా కురపాం గిరిజన బాలికలు పచ్చకామెర్ల బారిన పడటం దురదృష్టకరమని, ఇద్దరు పిల్లలు చనిపోవడం విచారకరమని సిపిఐ జాతీయ కార్యదర్శి మాజీ శాసనసభ్యుడు కె రామకృష్ణ అన్నారు. సోమవారం సిపిఐ నాయకులతో కలిసి కె జి హెచ్ లో చికిత్స పొందుతున్న పిల్లల ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.పిల్లలు చనిపోయారని మంత్రి ప్రకటించలేదని,చనిపోయిన బాలికల కుటుంబాలకు రూ. 10 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని,బాత్ రూమ్స్, పరిసరాలు బాగోలేని కారణంగా పిల్లలు అశ్వస్థత కు గురయ్యారని అర్థం అవుతుందని,గిరిజన పిల్లలకు ఇలా జరగడం గుణపాఠంగా తీసుకోవాలని భవిష్యత్తు లో ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.చంద్రబాబు విద్యా వ్యవస్థను గాలికి వదిలేస్తున్నారని,మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటుకు ఇస్తున్నారని,విద్య, వైద్య రంగాలను ప్రైవేటు వారికి అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తుందని,చంద్రబాబు మైండ్ సెట్ మార్చుకోవాలని,ఇంకొన్ని సంవత్సరాలు చంద్రబాబు సీఎం గా ఉంటే ప్రభుత్వమే ప్రైవేట్ అయిపోతుందని అన్నారు.హాస్టల్స్ లో సౌకర్యాలు లేకపోవడం వలనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని,రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్టల్స్ లో సౌకర్యాలు మెరుగుపర్చాలని కోరుతున్నాంమని తెలిపారు.ఆసుపత్రిలో చేరిన పిల్లల కుటుంబాలకు రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.రామకృష్ణ గారితో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎ విమల, ఎం పైడిరాజు, కె జి సీహెచ్ ఏఐటీయూసీ నాయకులు జె డి నాయుడు, కె సత్యనారాయణ, పి చంద్రశేఖర్, ఎన్ నాగభూషణం, సి ఎన్ క్షేత్రపాల్, ఆర్ శ్రీనివాసరావు,ఎ ఐ ఎస్ ఎఫ్, ఎ ఐ వై ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.