Friday, 1 May 2026

Blog

అన్నమయ్య

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ – ప్రజల కష్టానికి భారీ ఊరట

…..ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్కా సాయి వికాస్ రెడ్డి చేతుల మీదుగా వేలాది కుటుంబాలకు విలువైన చెక్కులు అందజేశారు చిట్వేలు, అక్టోబర్ 6 ( పున్నమి ప్రతినిధి): శివ చిట్వేల్ మండలంలో సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్కా సాయి వికాస్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. నాగవరం గ్రామానికి చెందిన అల్లిశెట్టి మల్లికార్జునకు రూ.51,310, పెద్దూరు గ్రామానికి చెందిన బుంగటవల రామచంద్రయ్యకు రూ.65,918, చాపరపల్లి గ్రామానికి చెందిన కోట భాను ప్రకాష్ కుటుంబానికి రూ.1,09,660, చిట్వేల్ పట్టణానికి చెందిన తుమ్మలపల్లి జయరామయ్య కుటుంబానికి రూ.2,53,528, చిట్యాల గ్రామానికి చెందిన రోల్ల మౌర్య రాయలకు రూ.21,741 చెక్కులు అందజేయబడ్డాయి. ఎంఎల్ఏ అరవ శ్రీధర్ తెలిపారు, “ప్రజల కష్టసమయంలో ప్రభుత్వం అండగా ఉంది. ప్రతి అర్హుడికి సహాయం చేరేలా కృషి చేస్తున్నాం.” ముక్కా సాయి వికాస్ రెడ్డి పేర్కొన్నారు, “సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక, మానసిక భరోసా కల్పిస్తోంది.” ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రాజుగుంట సర్పంచ్ గుత్తి నరసింహ, జనసేన నాయకులు మాదాసు నరసింహ, ఉప్పలపాటి శివ, కె.కందులవారి పల్లి ఏదోటి రాజశేఖర్ (నైస్), కొనిశెట్టి సుబ్బరాయుడు, దొండ్లవాగు మధు, తుమ్మచెట్లపల్లి వెంకటేశ్వర్లు నాయుడు, తుపాకుల పెంచలయ్య, మద్దూరి మన్మధ, షేక్ రియాజ్, మాదాసు శివ, కావేరి అవినాష్, పెద్దం గారి సాయి, రోళ్ళ మోహన్, వెంకటసుబ్బయ్య, నాగేంద్ర, పవన్ రాజు తదితర ఎన్డీఏ కార్యకర్తలు చురుకైన పాల్గొనడం ప్రత్యేకంగా నిలిచింది.

పశ్చిమ గోదావరి

వైభవపేతం గా జరిగిన వాసవి మాత రథోత్సవం

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, అక్టోబర్ 6 (పున్నమి ప్రతినిధి): తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో గల వాసవి మాత 58వ శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాలు వైభవ వేదంగా జరిగాయి. సోమవారం వాసవి మాతను రాష్ట్రంలోని పురవీధులలో తిరిగే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏకైక వెండి రథం పై అమ్మవారి రథోత్సవ కార్యక్రమం వైభవపీతంగా జరిగింది. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన 175 మంది కళాకారులతో, వివిధ వాయిద్య బృందాలతో, సాంప్రదాయం ఉట్టి పడే రీతిగా వీర హనుమాన్, కాళీమాత, వానరమూక, కేరళ వాయిద్య బృందం, బెంగళూరు కళాకారులతో ఊరేగింపు వైభవోపేతంగా జరిగింది. ముందుగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గుమ్మడికాయ తో దిష్టి తీసి కొబ్బరికాయలు కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్య వైశ్యులు 58 సంవత్సరాలుగా చేస్తున్న ఈ పూజా కార్యక్రమాలు, గత తొమ్మిది సంవత్సరాలుగా వెండి రథోత్సవం నిర్వహించడం చాలా శుభ పరిణామం అని ఆర్యవైశ్యులతో పాటు పట్టణ ప్రజలు అందరూ సుపిష్టంగా ఉండాలని ఆకాంక్షించారు. గౌరవాధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరూ ఐక్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని పట్టణ ప్రజలందరూ స్వాగతిస్తున్నారని, గత కొంతకాలంగా ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని తెలియజేశారు. శ్రీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొర్లబర్ రాము మాట్లాడుతూ మా పెద్దలు మాకు అందించిన గౌరవ మర్యాదలు మా తరువాతి తరాలకు కూడా అందించే రీతిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. రథోత్సవ కమిటీ చైర్మన్ నారాయణ రాంబాబు మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుండి 175 మంది కళాకారులతో ఈ రథోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని కార్యదర్శి నున్న సుందర్రావు, కోశాధికారి బొగవిల్లి రమేష్, ఆలయ కార్యదర్శులు ఆలపాటి చిన్న, సత్యనారాయణ, అధిష్టానం, ప్రత్యేక ఆహ్వానితులు, వాసవి క్లబ్ సభ్యులు డైరెక్టర్లు, వనిత క్లబ్, మహిళా సంఘం సభ్యుల సహాయ సహకారాలతో రథోత్సవం పట్టణంలోని ప్రధాన రహదారులకుండా వైభవపెత్తంగా బాణాసంచా నడుమ నిర్వహించారని నిర్వాహకులు తెలియజేశారు. 108 కళాశాలతో అమ్మవారి ఆడపడుచులు పెద్ద సంఖ్యలో రావడం కలశాలు చేతభూని పురవీధుల గుండా వాసవి మాత నామాలతో రథోత్సవంలో పాల్గొన్నారు.

ఖమ్మం

బీజేపీ ఖమ్మం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక..

పున్నమి ప్రతినిధి  భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా నూతన కార్యవర్గం ని జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు సోమవారం నాడు ప్రకటించారు. 20 మంది తో జిల్లా కార్యవర్గ ము ని ప్రకటించగా అందులో కేవలం ఇద్దరు మాత్రమే మహిళలు ఉండటం విశేషం. ఓకే నియోజకవర్గం కి ఇద్దరు ఉపాధ్యక్షులు ని నియమించడం, సీనియర్ లని ప్రక్కనపెట్టి కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇవ్వడం పొంగులేటి సుధాకర్ రెడ్డి మద్దత్తు ఉన్న వారికి జిల్లా కార్యవర్గం లో స్థానం ఇచ్చారనే వాదన కి భలం చేకూర్చే విధంగా నూతన జిల్లా కార్యవర్గం ఉందని బీజేపీ సీనియర్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే కార్యవర్గం తో ఎన్నికల్లో పోటీ చేస్తే ఏ ఒక్క ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించద ని కనీసం నామ మాత్రపు పోటీ కూడా ఇవ్వలేదనే వాదాన కూడా వినిపిస్తుంది.

పశ్చిమ గోదావరి

ప్రైవేట్ సంభాషణను బహిర్గతం చేయడం అనైతికం పోలీసులను ఆశ్రయిస్తా : వైసిపి నాయకుడు గుండుబోగుల నాగు

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, అక్టోబర్ 06 (పున్నమి ప్రతినిధి): ప్రైవేటు సంభాషణను బహిర్గతం చేయడం అనైతికమని, దీనిపై పోలీసులను ఆశ్రయిస్తానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండుబోగుల నాగు అన్నారు. స్థానిక జువ్వలపాలెం లోని ఆయన నివాసంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత రెండున్నర దశాబ్దాలుగా సన్నిహిత పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి తనకు ఫోన్ చేసి మాట్లాడించడంతో తాను మాట్లాడటం జరిగిందన్నారు. ఎంతో నమ్మకంతో ప్రైవేట్ సంభాషణ గా మాట్లాడిన మాటలను బయటకు వైరల్ చేయడం చాలా బాధ కలిగించిందన్నారు. నమ్మకంతో మాట్లాడించి ఆ మాటలను ఇలా బయట పెట్టడం అనైతిక చర్య అని నాగు పేర్కొన్నారు. గత నాలుగు దశాబ్దాలకు పైగా తాడేపల్లిగూడెం రాజకీయాలలో కొనసాగుతున్న తాను ఒకవేళ ఏదైనా విషయం చెప్పాలంటే బహిరంగంగానే మీడియాను పిలిచి మరి చెబుతానని స్పష్టం చేశారు. అంతేగాని ఇలా రహస్యంగా మాట్లాడవలసిన అవసరం లేదన్నారు. తనను కావాలని అప్రతిష్ట పాలు చేయడానికి రాజకీయంగా దెబ్బ తీయటానికి ఉద్దేశపూర్వకంగానే ఇది జరిగినట్లు తాను భావిస్తున్నాను అన్నారు. దీని వెనుక రాజకీయ కోణంలో కుట్ర దాగి ఉంటుందని అనుమానం వ్యక్తం అవుతుంది అన్నారు. ఇక ఎవరితోనూ ఫోన్లో ప్రైవేటుగా మాట్లాడకూడదని విషయం స్పష్టమవుతుందన్నారు. ఈ కారణంగానే పట్టణ పోలీసు అధికారి కి తాను ఫోనులో విషయం తెలియజేయగా ఆయన విషయాలు ఫోన్ లో చెప్పమని కోరిన తాను స్వయంగా వచ్చి చెబుతానని అన్నాను తప్ప ఫోన్లో చెప్పలేదు అన్నారు. జరిగిన దానిపై పోలీసులను ఆశ్రయించి ఏ విధంగా ముందుకు వెళ్లాలని దానిపై ఆలోచన చేస్తానన్నారు ఇలా ప్రైవేటు సంభాషణలను బహిర్గతం చేయడం చాలా దారుణమని ఖండించారు. ఎంతో నమ్మబలికి ఓపెన్ గా మాట్లాడించడం ఆ తర్వాత ఆ మాటలను ఇలా బహిర్గతం చేయడం నైతికత కాదన్నారు. ఇది ఒక వ్యక్తి ప్రైవసీ కి భంగం కలిగించడమే అన్నారు. తన పరువు ప్రతిష్టకు భంగం కలిగించిన ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకునేందుకు చట్టపరమైన అవకాశాలు ఉపయోగించుకుని ముందుకు వెళ్లడం జరుగుతుందని వైసిపి సీనియర్ నాయకులు గుండుబోగుల నాగు తెలియజేశారు.

ఎన్ టి ఆర్ జిల్లా

ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో భారీగా కల్తీ మద్యం తయారీ స్థావరం బయటపడడం కలకలం సృష్టించింది.

ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో భారీగా కల్తీ మద్యం తయారీ స్థావరం బయటపడడం కలకలం సృష్టించింది. ప్రాంతం: ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం. గుర్తింపు: అద్దేపల్లి జనార్ధనరావుకు చెందిన గోడౌన్‌లో కల్తీ మద్యం నిల్వలు మరియు తయారీ సామగ్రిని ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. స్వాధీనం: భారీ మొత్తంలో నకిలీ మద్యం బాటిళ్లు. నకిలీ మద్యం బాటిళ్లకు లేబుల్స్, సీలింగ్ చేసే మెషీన్లు. కీలక సమాచారం: ఈ కల్తీ మద్యం కేసులో ఇప్పటికే అద్దేపల్లి జనార్ధనరావు సోదరుడు జగన్మోహన్ రావు, అనుచరుడు కట్టా రాజును అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకే ఈ గోడౌన్‌లో తనిఖీలు చేశారు. రాకెట్ మూలాలు: అన్నమయ్య జిల్లాలో ఇటీవల వెలుగులోకి వచ్చిన కల్తీ మద్యం తయారీ కేసుతో దీనికి సంబంధాలు ఉన్నట్లు, పక్క జిల్లాలకు కూడా ఈ మద్యం సరఫరా అయినట్లు తెలుస్తోంది

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పంది దాడిలో మహిళకు తీవ్ర గాయాలు

అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలం ఆదూరుపల్లిలో బహిర్భూమికి వెళ్లిన దేవరాల పెంచలమ్మ అనే మహిళపై పందులు దాడి చేశాయి.పందుల దాడిలో ఆమె కాలు,ముఖం తీవ్రంగా గాయపడ్డాయి.రక్తస్రావం ఎక్కువగా కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే పొదలకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.వైద్యులు ఆరుకుట్లు వేసి చికిత్స అందిస్తున్నారు.గ్రామంలో తరచుగా పందులు తిరుగుతున్నాయని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. పందుల పెంపకం దారునిపై పోలీసులకు ఫిర్యాదు – పంచాయతీ కార్యదర్శి రఫీ చేజర్ల మండలం ఆదురుపల్లి గ్రామంలో పందుల పెంపకందారుడు ఎస్.దయాకర్‌పై పంచాయతీ సెక్రటరీ రఫీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏడు సంవత్సరాలుగా దయాకర్ బయట నుంచి పందులను తెచ్చి గ్రామంలో మేపడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోలేదని తెలిపారు. బస్టాండ్లో పందులను వదిలేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, పందులు ప్రజలపై దాడులు చేస్తున్నాయని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

తూర్పు గోదావరి

నాటు సారా తయారీ, రవాణా, అమ్మకాలపై ఫిర్యాదు కోసం కాల్ సెంటర్ – 14405 -జిల్లా కలెక్టర్ కిర్తీ చేకూరి.

తూర్పు గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎవరైనా నాటు సారా తయారు చేసినా, రవాణా చేసినా, అమ్మకాలు జరిపినా వెంటనే కాల్ సెంటర్ 14405 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎక్సైజ్ శాఖ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్న సమీక్ష సమావేశంలో ఆమె – ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, అందువల్ల ప్రజలు ధైర్యంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేసారు. నాటు సారా నిర్మూలన – ప్రజారోగ్యం కోసం ప్రభుత్వ మిషన్ పని చేస్తోందని జిల్లా కలెక్టర్ పేర్కొంటూ, నాటు సారా సేవించడం వల్ల వ్యక్తి ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలుగుతుందని, ముఖ్యంగా శరీరంలోని ప్రధాన అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు. నాటు సారాను నిర్మూలించేందుకు ప్రభుత్వం “నవోదయం 2.0” అనే కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టిందని, దీని లక్ష్యం ప్రజారోగ్య పరిరక్షణతో పాటు ఆర్థిక, సామాజిక శ్రేయస్సు ను కాపాడడమేనని ఆమె తెలిపారు. జిల్లాలో 19 మండల స్థాయి కమిటీలను , 240 గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. నాటు సారా తయారీ, నిల్వ, రవాణా లేదా విక్రయాలపై ఎవరైనా సమాచారం అందించిన యెడల 14405 నంబరుకు కాల్ చేయవచ్చని, ఆ ఫిర్యాదుల ఆధారంగా ఎక్సైజ్ శాఖ ద్వారా తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నవోదయం 2.0 కార్యక్రమం కింద జిల్లాలో ఇప్పటివరకు 313 అవగాహన సమావేశాలు నిర్వహించినట్లు, 63 దత్తత అధికారులు నియమించినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య తెలిపారు. మండల, గ్రామ స్థాయి కమిటీలు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, నాటు సారా నిర్మూలన దిశగా కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్, అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు, జిల్లా ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య, ఆర్డీవోలు కృష్ణ నాయక్, రాణి సుస్మిత, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్. వి. వి. ఎస్. మూర్తి, డిఎస్‌వో వి. పార్వతి, డిఎంహెచ్‌వో కె. వెంకటేశ్వరరావు, డి ఐ పీఆర్వో కే లక్ష్మీ నారాయణ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ బి. శశాంక, ట్రైబల్ ఆఫీసర్ కే ఎన్ జ్యోతి, ఎక్సైజ్ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తూర్పుపల్లి జాతీయ ఉపాధి హామీలో అవకతవకలు

అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి) మండలంలోని తూర్పుపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనికి వెళ్లే వారి కంటే పనికి రాని వారి పేర్లు రాసుకుంటూ ఎక్కడో ఉన్న వారి పేర్లు రాస్తూ అధిక లాభార్జన చేస్తున్నాడని సీనియర్ మేట్ లోకేష్ పై ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సోమవారం సంబంధిత ఏపీవో ని కలిసి ఉపాధి హామీ పనులలో తీవ్ర జాప్యం జరుగుతుందని, దీనిని పరిశీలించి విచారణ చేసి అతనిపై తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.మేము పనికి వెళితే మాకు తక్కువ వేతనం వేస్తున్నారని పనికి రాని వాళ్ల పేర్లకు ఎక్కువ రాసుకుంటూ వారికి ఎక్కువ వేతనం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని సోమవారం చేజర్ల గ్రీవెన్స్ లో అర్జీ ఇవ్వడం జరిగినది.అనంతరం స్థానిక ఎంపీడీవో తో కలిసి వినతి పత్రం అందజేస్తూ తూర్పుపల్లిలో ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న పనితీరును క్లుప్తంగా వివరించడం జరిగినది.అలాగే మాకు 8 వారాలకు పనికి వెళితే మూడు వారాలు మాత్రమే మాకు కూలీలు పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామంలో పనికి రానివారు పేర్లు ఎలా రాస్తారని ప్రశ్నించారు. ఇదేమిటని సీనియర్ మేట్ ని అడిగితే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అంటూ మమ్మల్ని దూషిస్తున్నాడని, నానా బూతులు తిడుతున్నాడని వారు విన్నవించారు.ఎంపీడీవో సానుకూలంగా స్పందించి వీటన్నిటిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

తిరుపతి

ఘనంగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతుల 30వ వివాహ వార్షికోత్సవం

శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు వారి సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి తమ 30వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు శ్రీ అర్ధనారీశ్వర స్వామి వారి అభిషేక సేవలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు దంపతులు తమ చేతుల మీదుగా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ శ్రీకాళహస్తి నియోజక వర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మాజీ ఎమ్మెల్యే దంపతులకు దుశ్శాలువతో ఘనంగా సన్మానించి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

E-పేపర్

సోమవారం నల్లజర్ల మండలం మరెళ్లమూడి లో శ్రీ విజయ దుర్గమ్మ గుడిలో ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమం పాల్గొన్న జనసేన నాయకులు

గొపాలపురం నియోజకవర్గం పున్నమి న్యూస్✍️రెడ్డిసత్యసుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083 ఈరోజు నల్లజర్ల మండలం చీపురుగూడెం గ్రామంలో అనారోగ్యంతో భాద పడుతున్న ఆ గ్రామ జనసేన అధ్యక్షులు గుండాబత్తుల వరుణ్ కుమార్ గారి వారి అమ్మ గారిని పరామర్శించిన గోపాలపురం నియోజకవర్గం జనసేన పార్టి ఇంచార్జ్ శ్రీ దొడ్డిగర్ల సువర్ణ రాజు గారు. తదుపరి ప్రకాశరావు పాలెం లో వ్యక్తిగత కారణాలతో ఒక వ్యక్తి పలగాని శంకర్ ను కత్తితో దాడి చేసిన విషయం తెలుసుకుని చీపురుగూడెం జనసైనికుడు పలగాని శంకర్‌ ను పరామర్శించి పోలీస్ కేసు విషయాలు తదినంతర జరిగిన పరిణామాలు తెలుసుకుని ఈ విషయంలో పార్టి తరుపున అండగా ఉండి ఆవ్యక్తికి శిక్ష పడేలా చూస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమము లో కృష్ణ పాలెం గ్రామ సర్పంచ్ దుర్గా ప్రసాద్‌ గారు, దేవరపల్లి గ్రామ జనసేన నాయుకులు దుగ్గిన లీలా గంగాధర్ గారు,ఐటి కోర్డనేటర్‌ ఉన్నమట్ల సత్య కిరణ్ గారు, ప్రకాష్ రావు పాలెం గ్రామ జనసేన అధ్యక్షులు రాచ మళ్ళ నాగరాజు గారు, జనసేన మండల కార్యదర్శి కొత్తపల్లి హరిబాబు గారు, తలంశెట్టి శ్రీను వాసు గారు, శీతయ్య గారు, గంగా రావు గారు, కృష్ణ గారు, సాయి గారు, ప్రదీప్‌ గారు, వంశీ కృష్ణ గారు, రాజేష్ గారు తదితరులు పాల్గొన్నారు. End

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.