Sunday, 3 May 2026

Blog

తూర్పు గోదావరి

భరత్ నీలా సూట్ కేసులు గురించి ఆలోచించను కార్మికులు బాగుండాలని చూస్తా – ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హాట్ కామెంట్స్..

గడిచిన ఆరు సంవత్సరాలుగా పేపరుమిల్లు కార్మికుల నిరీక్షణకు మంచి అగ్రిమెంట్ లభించి, వారి జీవితాల్లో వెలుగులు వచ్చాయని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. ఇది కూటమి ప్రభుత్వ విజయమని గర్వంగా చెబుతున్నామన్నారు. పేపర్ మిల్లు కార్మికులకు నూతన వేతన ఒప్పందం కుదిరిన నేపథ్యంలో పేపర్ మిల్లు యూనియన్ నాయకులు, కార్మికులు మంగళవారం ఉదయం స్థానిక తిలక్ రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ని కల్సి ధన్యవాదములు తెలియజేసారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం కార్మికుల శ్రేయస్సు కంటే వారి స్వలాభమే చూసుకున్నారని, ప్యాకేజిపై ఉన్న శ్రద్ధ కార్మికుల వేతన ఒప్పందంపై చూపించలేదని వ్యాఖ్యానించారు. తరచూ కార్మికులు తమకు జరుగుతున్న అన్యాయంపై వివరించినపుడు తెలుగుదేశం పార్టీని, టీఎన్టియుసిని నమ్మాలని, తప్పకుండ తాము అధికారంలోకి వచ్చాక మంచి అగ్రిమెంట్ చేసి, న్యాయం చేస్తామని చెప్పామని ఎమ్మెల్యే వాసు గుర్తుచేసారు. తమపై విశ్వాసం ఉంచి తమను గెలిపించి, వైసిపి వాళ్ళను ఇంట్లో కూర్చోబెట్టారని ఆయన అన్నారు. ఇచ్చిన హామీ మేరకు కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కార్మికులకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని, పరంపరంలో నష్టపోయినవారికి న్యాయం చేశామని, కార్మికులకు అన్యాయం చేసినవారిపై కేసులు కట్టించామని ఆయన అన్నారు. ఇంత చేస్తున్నా సరే, ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదని, వైసిపి విమర్శలకు జవాబు ఇవ్వకుండా, పనిచేసి చూపించి నోరు మూయించామని ఎమ్మెల్యే వాసు అన్నారు. పర్మినెంట్ కార్మికుల మొదలుకుని కాంట్రాక్ట్ కార్మికుల వరకు అందరికీ న్యాయం జరిగేవిధంగా మంచి అగ్రిమెంట్ చేయించగలిగామని ఎమ్మెల్యే వాసు అన్నారు. తాము చేసిన ప్రయత్నానికి ఎంపీ పురందేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, అధికారులు, కూటమి నాయకులు, కార్మికులు అందరూ సహకరించారని అలాగే మేనేజిమెంట్ దిగిరాకపోయేసరికి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినప్పుడు అధికారులతో కమిటీ వేసి సమస్య పరిష్కారం అయ్యేలా చేశామని ఆయన వివరించారు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ 15ఈనెలల కాలంలో పేపరు మిల్లు గేటు దగ్గర ఆందోళనలు జరుగుతుంటే, మాజీ ఎంపీ భరత్ అక్కడకు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ‘నీవు సూట్ కేసులు గురించి ఆలోచించావు .. నేను కార్మికుల బాగుండాలని చూసా. కార్మికులకు ఏమిచేయాలో తెలుసుకు కాబట్టే నిన్ను ఇంట్లో కూర్చోబెట్టారు. కూటమిని గెలిపించారు… నీ అసమర్ధత వలన అగ్రిమెంట్ చేయలేదని ఒప్పుకోవాలి’ అని భరత్ నుద్దేశించి ఎమ్మెల్యే వాసు వ్యాఖ్యానించారు. ఆఖరికి అగ్రిమెంట్ అవుతుంటే, వైసిపి వాళ్ళు మోకాలడ్డారని ఆయన విమర్శించారు. నేను లేని రాజమహేంద్రవరం ఏమైపోతుందోనని భరత్ ఊహించుకున్నప్పటికీ ఇప్పుడు రాజమహేంద్రవరం చాలా బాగుందని ఆయన చురకలంటించారు. మిల్లులో 4000మంది కార్మికులుంటే అందులో తన ఓటర్లు ఎంతమంది ఉంటారన్నది భేరీజు వేసుకుకోండా అందరికీ న్యాయం చేయాలని చూశానని ఎమ్మెల్య్ వాసు అన్నారు. అగ్రిమెంట్ ఆలస్యం కారణంగా కార్మికులు కడుపుమంటతో కేకలు వేస్తుంటే, నిస్సహాయతకు మదన పడ్డానని ఆయన గుర్తుచేసుకున్నారు. మొత్తానికి బాగా నలిగిపోయినప్పటికీ కార్మికులందరికీ న్యాయం చేయగలిగామన్నారు. కోట్లు దోచుకున్నవాళ్ళు వాళ్లకి ఇచ్చాం, వీళ్లకు ఇచ్చాం అంటూ నిస్సిగ్గుగా తప్పు ఒప్పుకోకుండా తిరుగుతున్నారని, అయితే అన్నిరోజులు ఒకలా ఉండవని ఆయన అన్నారు. యాజమాన్యం మొండి వైఖరితో ఉన్నప్పటికీ కార్మికులే తమకు ముఖ్యమని వ్యవహరించామని, అదేవిధంగా పరిశ్రమలు ఉండాలని ఆలోచన చేశామని, ఎక్కడా ప్యాకేజి కోసం చూడలేదని ఎమ్మెల్యే వాసు స్పషం చేసారు. కార్మికులకు అన్నివేళలా మా కుటుంబం అండగా ఉంటుందని పునరుద్ఘాటించారు. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెల్పిన కార్మిక నాయకులు… కార్మిక నాయకులు మాట్లాడుతూ 5సంవత్సరాలకు పైగా ఎన్నికలు, అగ్రిమెంట్ లేకపోవడంతో కూటమి ప్రభుత్వ దృష్టికి తెచ్చామని ఎమ్మెల్యే వాసు ఎంపీ పురందేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్ తదితరులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడలో జరిగిన అగ్రిమెంట్ లో కార్మికులకు 5800జీతం, కాంట్రాక్ట్ కార్మికులకు 55రూపాయలు జీతం పెంచారని తెలిపారు. ఎన్నాళ్ళనుంచో చూస్తున్న అగ్రిమెంట్ చేసి 4000కార్మిక కుటుంబాల్లో వెలుగులు నింపినందుకు కూటమి ప్రభుత్వానికి కార్మికుల తరపున ధన్యవాదాలు తెలిపారు. గత ఐదేళ్లుగా కార్మికులు చాలా బాధలు పడ్డారని, కూటమి ప్రభుత్వం వచ్చి న్యాయం చేసిందని, ముఖ్యంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నాయకత్వంలో ముందుండి నడిపించడం వలన మంచి అగ్రిమెంట్ చేసుకోగలిగామని అన్నారు. ఏలూరులో కాపీ ఇచ్చారని, 11యూనియన్లు సంతకాలు పెట్టాయని తెలిపారు. మీడియా సమావేశంలో టిడిపి నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, వర్రే శ్రీనివాసరావు, నక్కా చిట్టిబాబు, ఉప్పులూరి జానకి రామయ్య, కొయ్యల రమణ, బుడ్డిగ రవి, దుత్తరపు గంగాధర్, అధిక సంఖ్యలో పేపర్ మిల్లు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

అన్నమయ్య

తాడిపత్రి పట్టణంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా

తాడిపత్రి, అక్టోబర్ 07: (పున్నమి ప్రతినిధి) మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆదేశాల మేరకు తాడిపత్రి పట్టణంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడపత్రి ఎల్లనూరు రోడ్ వాల్మీకి సర్కిల్ వద్ద వాల్మీకి మహర్షికి ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమం వాల్మీకి సేవాదళ్ పార్లమెంట్ అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా జిల్లా ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. ఆదినారాయణ మాదిగ, పెద్దపప్పూరు మండల సిపిఐ కార్యదర్శి చింతా పురుషోత్తం, వ్యవసాయ కార్మిక సంఘం తాలూకా అధ్యక్షుడు నారాయణరెడ్డి హాజరయ్యారు.చాగల్లు గ్రామం నుండి దాదాపు 15 వాహనాల్లో 100 మంది వాల్మీకి సంఘం, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, చేనేత కార్మికులు భారీ ర్యాలీగా పెద్దపప్పూరు మండల కేంద్రంలో ప్రవేశించారు. “వాల్మీకుల ఐక్యత వర్ధిల్లాలి… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి” అనే నినాదాలతో ఈ ర్యాలీ అంబేద్కర్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, పోలీస్ స్టేషన్, పెట్రోల్ బంక్ వరకు సాగి, అనంతరం తాడిపత్రి పట్టణంలోని వాల్మీకి మహర్షి విగ్రహం వద్ద ముగిసింది.అక్కడ విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ— వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించి సమాజానికి శాశ్వత విలువలు నేర్పారని, ఆయన అందరికీ దేవుడని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి. ఆదినారాయణ పేర్కొన్నారు.వాల్మీకి మహర్షి ఐక్యతకు ప్రతీక అని, ప్రతి సంవత్సరం మరింత ఘనంగా జయంతి జరుపుకోవాలని వాల్మీకి సంఘం పార్లమెంటు అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య పిలుపునిచ్చారు.భార్యభర్తల బంధాలు, అన్నదమ్ముల విలువలు రామాయణం ద్వారా సమాజానికి అందించిన మహానుభావుడు వాల్మీకి అని సిపిఐ మండల కార్యదర్శి చింతా పురుషోత్తం అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో బోడయ్యపల్లి, ఆది తాడిపత్రి, చిన్న పెద్దపప్పూరు ప్రాంతాల నుండి పలువురు వాల్మీకి సంఘ సభ్యులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, చేనేత కార్మికులు పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు.

తిరుపతి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన కోట మండల వైసీపీ శ్రేణులు.*

* కోట .విద్యానగర్ (తిరుపతి జిల్లా) పున్నమి ప్రతినిధి సూరిబాబు *కోట మండలానికి చెందిన సీనియర్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా నియమితులైన నేపథ్యంలో తొలిసారిగా తన స్వగ్రామమైన అల్లంపాడుకు రావడంతో ఘన స్వాగతం లభించింది. వైసీపీ నాయకులు దువ్వూరు సాయిరెడ్డి, పాదర్తి రాధాకృష్ష్ణారెడ్డి, చిల్లకూరు సాయిప్రసాద్ రెడ్డిల ఆధ్వర్యంలో స్వాగత ఏర్పాట్లు చేశారు. కోట మండలం విద్యానగర్ నుండి కోట పట్టణం మీదుగా అల్లంపాడు వరకు 100 బైక్ లు, 50 కార్లతో భారీ ర్యాలీతో నిర్వహించారు. మార్గమధ్యలో గాంధీ, అంబేద్కర్, పొట్టి శ్రీ రాములు వైయస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.* *కోట పట్టణంలోకి శ్యాంప్రసాద్ రెడ్డి ఎంట్రీతో సందడి వాతావరణం కనిపించింది. మహిళలు హరతులు పట్టి టెంకాయలు కొట్టి స్వాగతం పలికారు. దారి పొడవునా బాణాసంచా కాల్చుతూ పూల వర్షం కురిపిస్తూ తీన్మార్ బ్యాండ్ శబ్ధాలతో.. గజమాలలు వేసి తమ అభిమానం చాటుకున్నారు. ఘనంగా సత్కరించిన వందలాది వైసీపీ శ్రేణులు, పేర్నాటి సైన్యం నడుమ ప్రజలకు అభివాదం చేస్తూ ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ అధినాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2019-2024 సంవత్సరకాలం పేద బడుగు బలహీన వర్గాలకు స్వర్ణయుగంలా సాగిందని గుర్తుచేసారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలం నుండి వైయస్సార్ సీపీ నాయకులను నామరూపం లేకుండా చేయాలని దురుద్దేశ్యంతో పాలన సాగిస్తోందని అన్నారు. చేయని తప్పులకు, తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని అన్నారు. తామంతా సమిష్టిగా వైసీపీ శ్రేణులకు అండగా ఉంటామని ధైర్యాన్నిచ్చారు.* *పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతున్నంత సేపు.. ‘జోహార్ వైయస్సార్!, జై జగన్.. జై జై జగన్.!, శ్యామన్న నాయకత్వం వర్ధిల్లాలి!’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వైసీపీ ప్రభుత్వంలో పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా, ఆయన సతీమణి హేమా సుష్మిత రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ గా పనిచేసారు. ఆ సమయంలో శ్యాంప్రసాద్ రెడ్డి కోట మండలానికి వచ్చిన సందర్భాల్లో ఆయన కాన్వాయ్ వెంట భారీ వాహనశ్రేణి ఉండేది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత తరుణంలో తాజాగా మంగళవారం శ్యాంప్రసాద్ రెడ్డి 100 బైక్ లు, 50 కార్లు, వందలాది అభిమానులు వెంట రాగా భారీ ర్యాలీతో కోట మండలంలోకి ప్రవేశించడంతో శ్యాంప్రసాద్ రెడ్డి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని పలువురు చర్చించుకున్నారు.* *ఈ కార్యక్రమంలో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, దువ్వూరు వెంకటరమణారెడ్డి, దువ్వూరు సాయికృష్ణారెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి, సునీల్ రెడ్డి, పాముల సురేంద్ర, ఇన్నమాల వెంకటాద్రి, నర్రమాల రమణయ్య, షేక్ బాష, షేక్ మొయిన్ బాష, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు, యువకులు పాల్గొన్నారు.* END

ఖమ్మం

ఎంబీబీఎస్ సిట్ సాధించిన నిరుపేద విద్యార్థినిలకు చేయూత…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఇటీవల దేశ వ్యాప్తంగా నిట్ పరీక్ష ఫలితాల్లో తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన గొడ్ల సంధ్యరాణి అదే విదంగా ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామానికి చెందిన మేడి నాగేశ్వరి అనే నిరుపేద విద్యార్థినిలు ఎంబీబీఎస్ సీటు సాధించారు,ఇంత వరకు బాగానే ఉన్నా ఎంబీబీఎస్ చెయ్యడానికి ఆ విద్యార్థినిలకు ఫీజ్ చెల్లించే పరిస్థితి లేకపోవడంతో అపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు, ఈ తరుణంలో కొత్తగూడెం అమృత హాస్పిటల్ ప్రముఖ డాక్టర్ ఇరుకు బాబూరావు దృష్టికి తీసుకొని వెళ్లగా ఈరోజు డాక్టర్ బాబూరావు సతీమణి డాక్టర్ జయ శ్రీ చేతుల మీదగా గొడ్ల సంధ్యరాణి కి 15 వేల రూపాయలు,మేడి నాగేశ్వరి కి 10 వేల రూపాయలు ఆర్ధిక సహాయన్ని అందించి విద్యార్థినిలకు శుభాకాంక్షలు తెలియజేశారు, ఇంకా రానున్న రోజుల్లో మరింత సహాయం చేస్తానాని భరోసా ఇచ్చారు ,డాక్టర్ జయ శ్రీ మాట్లాడుతూ మంచిగా చదువుకొని తల్లిదండ్రులు పేరు తెస్తూ రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం పొంది నిరుపేదలకు వైద్య,ఆర్ధిక పరంగా సహాయం చెయ్యాలని విద్యార్థినిలను ఆశీర్వదించారు..వీరి వెంట తంబర్ల పుల్లారావు, కొమ్మిగిరి వినోద్, విద్యార్థిని తల్లిదండ్రులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు..

గూడూరు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన కోట మండల వైసీపీ శ్రేణులు.

కోట మండలానికి చెందిన సీనియర్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా నియమితులైన నేపథ్యంలో తొలిసారిగా తన స్వగ్రామమైన అల్లంపాడుకు రావడంతో ఘన స్వాగతం లభించింది. వైసీపీ నాయకులు దువ్వూరు సాయిరెడ్డి, పాదర్తి రాధాకృష్ష్ణారెడ్డి, చిల్లకూరు సాయిప్రసాద్ రెడ్డిల ఆధ్వర్యంలో స్వాగత ఏర్పాట్లు చేశారు. కోట మండలం విద్యానగర్ నుండి కోట పట్టణం మీదుగా అల్లంపాడు వరకు 100 బైక్ లు, 50 కార్లతో భారీ ర్యాలీతో నిర్వహించారు. మార్గమధ్యలో గాంధీ, అంబేద్కర్, పొట్టి శ్రీ రాములు వైయస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కోట పట్టణంలోకి శ్యాంప్రసాద్ రెడ్డి ఎంట్రీతో సందడి వాతావరణం కనిపించింది. మహిళలు హరతులు పట్టి టెంకాయలు కొట్టి స్వాగతం పలికారు. దారి పొడవునా బాణాసంచా కాల్చుతూ పూల వర్షం కురిపిస్తూ తీన్మార్ బ్యాండ్ శబ్ధాలతో.. గజమాలలు వేసి తమ అభిమానం చాటుకున్నారు. ఘనంగా సత్కరించిన వందలాది వైసీపీ శ్రేణులు, పేర్నాటి సైన్యం నడుమ ప్రజలకు అభివాదం చేస్తూ ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ అధినాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2019-2024 సంవత్సరకాలం పేద బడుగు బలహీన వర్గాలకు స్వర్ణయుగంలా సాగిందని గుర్తుచేసారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలం నుండి వైయస్సార్ సీపీ నాయకులను నామరూపం లేకుండా చేయాలని దురుద్దేశ్యంతో పాలన సాగిస్తోందని అన్నారు. చేయని తప్పులకు, తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని అన్నారు. తామంతా సమిష్టిగా వైసీపీ శ్రేణులకు అండగా ఉంటామని ధైర్యాన్నిచ్చారు. పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతున్నంత సేపు.. ‘జోహార్ వైయస్సార్!, జై జగన్.. జై జై జగన్.!, శ్యామన్న నాయకత్వం వర్ధిల్లాలి!’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వైసీపీ ప్రభుత్వంలో పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా, ఆయన సతీమణి హేమా సుష్మిత రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ గా పనిచేసారు. ఆ సమయంలో శ్యాంప్రసాద్ రెడ్డి కోట మండలానికి వచ్చిన సందర్భాల్లో ఆయన కాన్వాయ్ వెంట భారీ వాహనశ్రేణి ఉండేది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత తరుణంలో తాజాగా మంగళవారం శ్యాంప్రసాద్ రెడ్డి 100 బైక్ లు, 50 కార్లు, వందలాది అభిమానులు వెంట రాగా భారీ ర్యాలీతో కోట మండలంలోకి ప్రవేశించడంతో శ్యాంప్రసాద్ రెడ్డి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని పలువురు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, దువ్వూరు వెంకటరమణారెడ్డి, దువ్వూరు సాయికృష్ణారెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి, సునీల్ రెడ్డి, పాముల సురేంద్ర, ఇన్నమాల వెంకటాద్రి, నర్రమాల రమణయ్య, షేక్ బాష, షేక్ మొయిన్ బాష, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు, యువకులు పాల్గొన్నారు.

కామారెడ్డి

వీధి కుక్కల స్వైర విహారం: స్థానికుల్లో ఆందోళన

కామారెడ్డి, 7 అక్టోబర్, పున్నమి ప్రతినిధి : వీధి కుక్కల విహారం స్థానికుల్లో ఆందోళన కలిగి స్తుందని అంటున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో గ్రామ కూడలిలో వీధి కుక్కల సమూహం రోడ్లపై స్వైర విహారం చేస్తూ ఉండటం స్థానికులను, రాకపోకలు సాగించేవారిని ఆందోళ నకు గురిచేస్తోంది.పగటిపూట ఇవి గుంపులు గుంపులుగా తిరుగుతూ, అటుగా వెళ్లే ప్రజల ను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.నేటి దృశ్యం లో, దాదాపు పదికి పైగా కుక్కలు ప్రధాన కూడలి లో గుమిగూడి ఉన్నట్లు స్పష్టంగా కనిపి స్తోంది. వీటిలో కొన్ని నలుపు, గోధుమ రంగులో ఉండగా, మరికొన్ని తెలుపు, నలుపు మచ్చలతో ఉన్నాయి. సాధారణంగా, ఈ కుక్కల సమూహాలు చిన్న పిల్లలపై, ద్విచక్ర వాహనదారులపై అకస్మాత్తు గా దాడి చేసే ప్రమాదం ఉందంటున్నారు.స్థానికులు, కుక్కలు ఎక్కువగా తిరగడం వల్ల మేము పిల్లలను ఒంటరిగా బయటికి పంపాలంటే భయ పడుతు న్నాం అని స్థానిక నివాసి ఒకరు తెలిపారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ కుక్కలు అధికంగా కనిపిస్తున్నాయి వాటిని చూస్తే భయం దోళనకు గురౌతున్నామని అంటున్నారు. సంబం ధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని, ఈ కుక్కల బెడదను నివారించాలని కోరుకుంటున్నా రు., అని వారు విజ్ఞప్తి చేశారు.అధికారులు ఈ వీధి కుక్కల సమస్యపై అధికారులు తక్షణమే దృష్టి సారించి, వాటిని నియంత్రించడానికి చర్యలు చేప ట్టాలని అన్నారు. తద్వారా స్థానిక ప్రజలకు సురక్షి తమైన వాతావరణం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

తిరుపతి

తొట్టంబేడు మండలంలో భూకబ్జాలు పట్టించుకోని అధికారులు

*చెరువు ఆక్రమించి దర్జాగా బోరు ఏర్పాటు చేసి.. తొట్టంబేడు మండలం, ఎంజీఎం హాస్పిటల్, రిలయన్స్ పెట్రోల్ బంక్ వెనుక మైనార్టీ కి చెందిన ఓ నేత భారీ భూ కబ్జా…!* *👆 ప్రభుత్వ భూములను చెరువులను కాపాడడంలో రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారు.. ప్రభుత్వ భూములు చెరువుల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చెయ్యకపోవడమే భూకబ్జాలకు కారణం…!*

తిరుపతి

శ్రీకాళహస్తి ఆలయ అధికారుల తీరు మారలేదు బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు

*శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారుల తీరు మారలేదు అని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి , శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆన్నారు . ఆలయం సమీపంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన స్టేట్లను వారు పరిశీలించారు.* ఆలయ ఒకటవ, రెండవ , మూడవ  గేట్లు నుండి ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు నాలుగో గేట్ నుండి బయటకు వస్తే చెప్పులు లేకుండా ఎండలో తారు రోడ్డు మీద కాళ్ళు కాలుతూ తట్టుకోలేక పరిగెడుతున్నారని వాట్సాప్ పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించారు మంచిదే కానీ  కాంట్రాక్టర్లకు కొమ్ము కాసే విధంగా  దానికోసం మొదట కార్పెట్ ఏర్పాటు చేశారు. రోడ్డుపైన కూల్  పెయింట్ వేశారు. మళ్లీ కొబ్బరి మట్టలతో పందిళ్ళు ఏర్పాటు చేశారు. చివరగా రేకుల షెడ్లను ఏర్పాటు చేశారు. ఆలయ నిధులు ఈ విధంగా దుర్వినియోగం చేయడం సరైన పద్ధతి కాదు. ఎట్టకేలకు రేకుల షెడ్డు ఏర్పాటు చేయడం మంచిదే. అయితే భక్తుల కోసం ఏర్పాటు చేసిన షెడ్ లలో కార్లు ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసి . వెళ్ళిపోతున్నారు. లక్షలాది రూపాయలు కార్ పార్కింగ్ ద్వారా వసూలు చేస్తున్న కాంట్రాక్టర్లు దీనిపైన సరైన సూచనలు చేయకపోవడం. ఆలయ అధికారులు దీనిపైన సమగ్రమైన బోర్డులు ఏర్పాటు చేయకపోవడం తో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ  షెడ్ల వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన విధంగా మారిపోయాయి. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసినా  భక్తులకు వేతనం తప్పడం లేదు. నీడలో ఏమో వాహనాలు మళ్లీ ఎండలో భక్తులు అనే పరిస్థితి ఏర్పడింది. అధికారుల మొద్దు నిద్ర వీడి  ఏసీ గదుల నుండి బయటకు వచ్చి భక్తులు వేతలను  గమనించి భక్తుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లలో వాహనాలు పార్కింగ్ చేయకుండా చేయాలి.

ఆంధ్రప్రదేశ్

విశాఖ స్టీల్ ఆర్టీసీ డిపో ని యధావిధిగా కొనసాగించాలని వినతి

విశాఖపట్నం, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) విశాఖ జిల్లా కలెక్టర్ ఎం ఎస్ నరేందర ప్రసాద్ ని విశాఖ పార్లమెంటరీ టిఎన్టియుసి అధికార ప్రతినిధి బలిరెడ్డి సత్యనారాయణ మంగళవారం కలిసి కోరారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు, అసంఘటిత కార్మికులు ఉక్కునగరంలో ఉన్న ఉద్యోగుల కుటుంబ సభ్యులు విద్యార్థులు సిటీకి వెళ్లడానికి అదేవిధంగా అగనంపూడి , వడ్లపూడి, పెదగంట్యాడ, గంగవరం ఉక్కు నిర్వాసితులు పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రయోజనంగా ఉన్న కూర్మన్నపాలెం విశాఖ స్టీల్ ఆర్టీసీ డిపో ని స్టీల్ ప్లాంట్ ఇచ్చిన 8 ఎకరాల్లో స్థలములో డిపో ని స్థాపించి 33 సంవత్సరాలు ఒక రూపాయి లీజుపై ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు లీజు అయిపోయినది తొలగించాలని లేకపోతే లీజు కొనసాగించుటకు 138 కోట్ల రూపాయలు కట్టాలని స్టీల్ యాజమాన్యం డిమాండ్ చేస్తున్నదనీ, స్టీల్ ప్లాంట్ ఇచ్చిన స్థలము 8 ఎకరాలకి ప్రత్యామ్యంగా అగనంపూడి స్టీల్ ప్లాంట్ గోడకి ప్రక్కన ఉన్న 8 ఎకరాలు స్థలము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి, గతంలో గంగవరం పోర్టుకు స్టీల్ ప్లాంట్ వద్ద 1500 వందల ఎకరాలు తీసుకొని ప్రత్యమానంగా రాష్ట్ర ప్రభుత్వం కే కోటపాడు, మాకవరపాలెం, రేపాక ప్రాంతాల్లో 1500 ఎకరాలు స్థలము స్టీల్ ప్లాంట్ కు కి ఇవ్వడం జరిగినది, ఎంతో అభివృద్ధి చెందుతున్న గాజువాక నియోజకవర్గంలో విశాఖ స్టీల్ ఆర్టీసీ డిపో ని ఉంచవలసిన అవసరం ఎంతో ఉందని. కావున ఆర్టీసీ డిపో ని యధావిదంగా కొనసాగించుటకు తగు చర్యలు తీసుకోవాలని వినత పత్రము అందజేయడం జరిగినది. విశాఖ జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని తెలిపారు.

జోగులాంబ గద్వాల

వి కేర్ కోల్డ్ స్టోరేజీపై ఐటీ అధికారులు

అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా సమీపం లోని 44 జాతీయ రహదారి ప్రక్కన ఉన్న వికేర్ సీడ్స్ వ్యవసాయ ప్రైవేట్ ప్రాసెసింగ్ కేంద్రంలో ఐటీ సోదాలు.. రాష్ట్రంలోని పప్పు దినుసులు, హోల్సేల్, వ్యాపారుల ఇళ్లల్లో ఐటీ దాడుల నేపథ్యంలో ఉండవల్లి సమీపంలోని వి.కేర్ సీడ్స్ కంపెనీలో పప్పు దినుసులపై పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లుగా ఐటీ అధికారులు సోదాలు. సంస్థ యజమానులు సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ శాఖ అధికారులు కోల్డ్ స్టోరేజ్, సమీపంలో ఉన్న ఇతర వాహనాల్లో సోదాలు చేశారు. ఈ కంపెనీ రైతుల పేరుతో పంటలను కొనుగోలు చేసి స్టోరేజ్లో దాయడంతో పాటు రైతుల పేరుతోనే క్రయవిక్రయాలు చేస్తూ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ తతంగం కొన్నేళ్లుగా సాగుతుండగా ఏపీ ఐటీ అధికారులు నిఘా ఉంచి తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.