Friday, 1 May 2026

Blog

తెలంగాణ

*బీసీ రిజర్వేషన్లు.. సుప్రీం సంచలన తీర్పు*

పున్నమి తెలంగాణ: బీసీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. తెలంగాణ హైకోర్టులో కేసు విచారణలో ఉండగా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారు..? అని ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా..? అని అడిగింది. రాష్ట్ర హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నఈ పిటిషన్‌‌ని విచారించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం కొట్టివేసింది. అయితే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు, జీవో 9 సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానంలో ఇవాళ (సోమవారం) విచారణ జరిగింది. ఈ విచారణకు స్వయంగా తెలంగాణ మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి హాజరయ్యారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తాడి రాంబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు

కోనసీమ జిల్లా, పి. గన్నవరం నియోజకవర్గం, మామిడికుదురు మండలంలో డా. బి. ఆర్. అంబేద్కర్ బాటను అనుసరించి, కాన్షిరాం సిద్ధాంతాన్ని గౌరవిస్తూ, “ఓట్ హమారా, రాజ్ తుమ్ హర్” అనే నినాదంతో బహుజన రాజ్యాధికార సాధనలో నిష్టతో పనిచేస్తున్న యువ నాయకుడు తాడి రాంబాబు గారు ఈ రోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. బహుజన సమాజ్ పార్టీ గన్నవరం నియోజకవర్గ అధ్యక్షుడిగా ఆయన సమాజానికి సేవలందిస్తూ, ప్రతి కార్యాచరణలో ముందంజలో ఉంటారు. తాడి రాంబాబు గారి నాయకత్వంలో పంచాయతీ సదస్సులు, రక్తదాన శిబిరాలు, గ్రామాభివృద్ధి కార్యక్రమాలు, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలు వంటి అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఆయన ప్రతీ చర్యలో సమాజంలోని వంచిత, బలహీన వర్గాల ప్రజల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా భావిస్తూ, వారి సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనడంలో విశేష కృషి చేశారు. జన్మదిన సందర్భంగా పి. గన్నవరం నియోజకవర్గంలోని స్నేహితులు, గ్రామస్థులు, పార్టీ కార్యకర్తలు తాడి రాంబాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కృషి, సమర్పణ, ప్రజల పట్ల అంకితభావం మరిన్ని శతాబ్దాల పాటు స్ఫూర్తిగా నిలిచేలా ఉండాలని ఆకాంక్షించారు. ప్రత్యేకంగా అప్పనపల్లి గెడ్డంవారిపేట నుంచి గెడ్డంవారిపేట జై భీమ్ యూత్, గెడ్డం లెనిన్ బాబు మరియు గెడ్డంవారిపేట గ్రామస్తులు తాడి రాంబాబు గారికి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించడంతో పాటు సమాజ సేవలో మరింత స్ఫూర్తిగా కొనసాగాలని ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తాడి రాంబాబు గారి నాయకత్వం, ప్రజల పట్ల అంకితభావం, సమాజం కోసం చేస్తున్న సేవలు పలు తరం యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని, ఆయన సేవల ద్వారా సమాజంలో సానుకూల మార్పులు మరింత పెరుగుతాయని అందరూ విశ్వసిస్తున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం తో పాటు, భవిష్యత్తులో మరిన్ని విజయాలు, సమాజ సేవలో శక్తివంతమైన పాత్ర కొనసాగించాలని ఆకాంక్షించబడింది.

అన్నమయ్య

వృద్ధ దంపతుల సమస్య పరిష్కరించిన కన్జ్యూమర్ ఫోరం నేత ఈశ్వరి

అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్ధ దంపతుల సమస్యకు పరిష్కారం లభించింది. మదనపల్లె నుంచి తన కొడుకుని చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన దంపతులను సిబ్బంది రెండు రోజులుగా అడ్మిట్ చేయకపోవడంతో, వారు ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అన్నమయ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వరి కి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఈశ్వరి వెంటనే ఆసుపత్రికి చేరుకుని సిబ్బందితో మాట్లాడి రోగిని అడ్మిట్ చేసేలా చర్యలు తీసుకున్నారు. తక్షణ స్పందనతో వృద్ధ దంపతులు ఈశ్వరి కు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఎదురైతే, వెంటనే తెలియజేయాలని, తాను తక్షణమే స్పందిస్తానని వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వరి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

20 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

సిద్ధవటం మండలంలోని మాధవరం-1 గ్రామ పంచాయతీ మహబూబ్ నగర్ గ్రామంలోని ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 20 బస్తాల అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకుని ఒకరిని అరెస్ట్ చేసినట్లు సిద్దవటం ఎస్సై మహమ్మద్ రఫీ ఆదివారం తెలిపారు.ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ రేషన్ బియ్యం నిల్వ ఉంచారనే సమాచారం రావడంతో రెవిన్యూ,పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో పట్టుబడిన 681కేజీల రేషన్ బియ్యాన్ని సీజ్ చేయడం జరిగిందన్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి అక్రమంగా రేషన్ తరలిస్తున్న సిద్దవటం గ్రామానికి చెందిన మురళి అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

ప్రజా ఫిర్యాదులపై కలెక్టర్‌ సమీక్షఅలసత్వం చూపితే కఠిన చర్యలు తప్పవు : కలెక్టర్‌ హెచ్చరిక

విశాఖపట్నం, అక్టోబర్‌ 6:జిల్లా కలెక్టర్‌ ఈరోజు కలెక్టరేట్‌ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో వచ్చిన దరఖాస్తులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. ప్రజా ఫిర్యాదుల వ్యవస్థలో వచ్చిన దరఖాస్తులు తిరిగి తెరుచుకోకుండా (రీఓపెన్‌ కాకుండా) చూడాలని సూచించారు. సూచనలు సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల పలు దరఖాస్తులు తిరిగి తెరుచుకుంటున్నాయని తెలిపారు. ముఖ్యంగా పట్టణ ప్రణాళిక శాఖలో ఎక్కువ దరఖాస్తులు తిరిగి తెరుచుకుంటున్నాయి అని వ్యాఖ్యానించారు. ఇకపై తానే స్వయంగా విభాగ కార్యాలయాలకు వెళ్లి పరిశీలన చేస్తానని హెచ్చరించారు. చాలా దరఖాస్తులు గడువు మించినా పరిష్కరించకపోవడం, కొంతమంది అధికారులు ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులను కూడా చూడకపోవడం పట్ల కలెక్టర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు. సమీక్షా సమావేశానికి ఆలస్యంగా వచ్చిన అధికారులు, హాజరుకాని అధికారులపై గమనికలు జారీ చేయాలని ఉప కలెక్టర్‌ (డిఆర్ఓ) కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాల నుండి వచ్చిన దరఖాస్తులను ప్రత్యేక దృష్టితో పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని సూచించారు. కలెక్టర్‌ అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంలో బాధ్యతతో, చిత్తశుద్ధితో వ్యవహరించాలని సూచించారు.

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

శ్రీజ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని సోమవారం మాజీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ముందుగా వారికి శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి,దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరూ తారక శ్రీనివాసులు తదితరులు దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికారు.అనంతరం ప్రత్యేక రాహు-కేతు పూజ,దర్శనం పూర్తయిన తరువాత వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.అలాగే శ్రీకాళహస్తికి ప్రఖ్యాతి గాంచిన కలంకారి కండువాను,స్వామి అమ్మవార్ల కలంకారి చిత్రపటాన్ని మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

ఖమ్మం

స్థానిక ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరాలి నెల్లూరి

T.Ravinder పున్నమి ప్రతినిధి ఖమ్మం :స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి తన బలాన్ని నిరూపించి ప్రతి గ్రామంలో కాషాయ జెండా ఎగరేయాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో మండల జిల్లా నాయకులకు నిర్వహించిన అవగాహన సదస్సు లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.వచ్చే ఎన్నికల్లో వార్డు సభ్యుల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు బిజెపి అధిపత్యం సాధించాలని కార్యకర్తలే పార్టీకి బలమని పార్టీ బలోపేతానికి బూత్ స్థాయిలో కమిటీలను తక్షణం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి మండలంలో గ్రామంలో బూత్ వారీగా కార్యకర్తలను సమన్వయం చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ సర్పంచ్ స్థానాలకు బిజెపి పోటీ చేస్తుందని ప్రకటించారు. .కార్యక్రమానికి ముందు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇవి రమేష్ కన్వీనర్ గా నిర్వహించిన ఈ సమావేశంలో బిజెపి నేతలు గంట్యాల విద్యాసాగర్, వక్కలంక సుబ్రహ్మణ్యం ,సన్నె ఉదయ ప్రతాప్ ,మందడపు సుబ్బారావు, నున్న రవికుమార్ ,పుల్లారావు యాదవ్ ,డాక్టర్ శీలం పాపారావు ,నంబూరి రామలింగేశ్వర రావు, రేఖ సత్యనారాయణ యాదవ్, అల్లిక అంజయ్య యాదవ్ ,వీరవెల్లి రాజేష్ గుప్తా, వేల్పుల సుధాకర్ ,తొడుపునూరి రవీందర్ ,రుద్ర గాని మాధవ్, ,బోయినపల్లి సురేష్ ,బెనర్జీ ,మహేందర్ సింగ్ ,జ్యోతుల యుగంధర్, సుదర్శన్ మిశ్రా ,నల్లగట్టు ప్రవీణ్ కుమార్ ,ఇందూరి మహేష్ ,రవి రాథోడ్, దర్యాసింగ్ ,,కుంచం కృష్ణారావు ,ఆపతి రామారావు ,నరేష్ యాదవ్, మరియు జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఘనంగా ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలు…

ఐ. పోలవరం మండలం ఐ పోలవరం గ్రామంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవం జరిగింది.ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు బాధితులైన ప్రజలకు స్వచ్ఛందంగా ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా అందించిన సేవలు అమోఘమని ముఖ్యఅతిథిగా విచ్చేసిన భూపతిరాజు సుభద్ర రాజు (చంటిబాబు) గారు ప్రశంసించారు. మరో ముఖ్య అతిథి సాగిరాజు సూరిబాబు రాజుగారు మాట్లాడుతూ సమాజంలో అన్ని రంగాల్లో దేశభక్తి నిర్మాణం చేస్తూ దేశ సేవలో నిమగ్నమైంది అని అన్నారు. 1925లో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్, 2025 విజయదశమి కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందని ముఖ్య వక్త విశ్వహిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ప్రాంత సత్సంగ ప్రముఖ్ శ్రీ రాళ్లపల్లి పాపాయ శర్మ తెలిపారు. శతజయంతి ఉత్సవాల్లో భాగంగా రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో గృహ సంపర్కం, హిందూ సమ్మేళనాలు, సద్భావన సమావేశాలు, ప్రతిష్టతవ్యక్తుల సమావేశాలు,శాఖలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశం-పాకిస్తాన్, చైనా యుద్ధ సమయాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సైనికులకు సహకరించారని, ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా నిలిచిందని, సమాజంలో అన్ని రకాల బేధ భావాలను రూపుమాపి సమరసతో కూడిన ఆచరణ, పర్యావరణ అనుకూలమైన జీవన విధానం, విలువలు పునాదిగా కలిగిన కుటుంబ వ్యవస్థ ,స్వదేశీ జీవనశైలి మరియు పౌరవిధులను ఆచరించే సమాజాన్ని నిర్మాణం చేయాలని సంకల్పం చేయటం మన కర్తవ్యం.ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు అన్ని రంగాల్లో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూపతి రాజు చంటిబాబుగారు, సాగిరాజు సూరిబాబు రాజు, సాగిరాజు బాపిరాజు,ముమ్మిడివరం ఖండ సంఘ్ చాలక్ పెన్మెత్స గోపాల కృష్ణంరాజు, ఆర్ఎస్ఎస్ జిల్లా గ్రామీణ వికాస్ సంయోజక్ సలాది శ్రీనివాసరావు,బొంతు కనకారావు, పేరా బత్తుల రామకృష్ణరావు, ఏలూరి రాంబాబు, గొలకోటి వెంకటరెడ్డి గారు,సాన బోయిన రాంబాబు, సఖిరెడ్డి శ్రీనివాస్, మామిడాల వీర వెంకట సత్యనారాయణ మరియు ఐ పోలవరం ఉప మండలం ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, ఐ పోలవరం,కేశనకుర్రు,కేశనకుర్రు పాలెం,తిల్లకుప్ప,టి కొత్తపల్లి గ్రామాల ప్రముఖులు, స్థానిక గ్రామ పెద్దలు,రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులు తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అనపర్తి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా జుత్తుగ సూర్యకుమారి మరియు డైరెక్టర్లు ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమo*

*అనపర్తి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కార్యాలయoలో ఛైర్మన్ గా శ్రీమతి జుత్తుగ సూర్యకుమారి మరియు డైరెక్టర్లు ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమలో పాల్గొన్ని, సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.* *అనపర్తి నియోజకవర్గ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ* * ఛైర్మన్ : ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి* *ఛైర్మన్ : జుత్తుగ సూర్యకుమారి* *వైస్ ఛైర్మన్ – కోనాల వెంకటరెడ్డి* *డైరక్టర్లు* *1) యామాల చిన్నమ్మ* *2)సిరసపల్లి లక్ష్మి* *3)ఒంటిమి గౌతమి* *4)పెండెం అప్పన్న* *5)గంగుమళ్ళ వెంకట తలుపులమ్మ దేవి* *6)తేతలి సూర్యనారాయణరెడ్డి* *7)నడింపల్లి సూర్యకుమారి* *8)తేనెల కృష్ణవేణి* *9)భోగాది వెంకటరమణ* *10)నల్లమిల్లి రామకృష్ణ ప్రసాదరెడ్డి* *11)మద్దిపూడి సత్యనారాయణ* 12)పంచికట్ల నాగరాజు 13)ఇందల వీరబాబు* *14)పాలచర్ల వెంకట శివ ప్రసాద్ చౌదరి, PACS ప్రెసిడెంట్ బిక్కవోలు* *అనపర్తి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్,పాలకవర్గ సభ్యులను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి.* ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.

కుమురం భీమ్ ఆసిఫాబాద్

నిన్న ఆసిఫాబాద్ పట్టణ బందుకు పిలుపునివ్వడంతో

ఈరోజు ఆసిఫాబాద్ పట్టణం సంపూర్ణ బంధు కొనసాగుతోంది. గణేష్ మరియు దేవి నవరాత్రుల్లో హిందూ బంధువులపై పోలీసులు విధించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరుతూ హిందూ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ పట్టణం బందుకు పిలుపునివ్వడంతో ఆసిఫాబాద్ పట్టణ లో షాపులు సంపూర్ణంగా బంధు పాటిస్తున్నాయి

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.