Friday, 1 May 2026

Blog

E-పేపర్

*గన్నవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం*

(అక్టోబర్ 6) గన్నవరం పున్నమి ప్రతినిధి సురేష్ కృష్ణాజిల్లా, గన్నవరం జాతీయ రహదారిపై, రావ్ ఫిన్ రియల్ ఎస్టేట్ మెయిన్ గేట్ ఎదురుగా రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల 30 నిమిషాల సమయంలో నాయుడుపేట ఏరియా నుండి విజయవాడ వైపు ధాన్యం లోడుతో వస్తున్న ఏపీ 16 టి యు 9946 నెంబర్ గల లారీకి వెనుక టైరు పంచర్ అవ్వడంతో లారీ డ్రైవర్ లారీని రోడ్డు పక్కన నిలిపారు. అదే సమయానికి ద్రాక్షారామం ఏరియా నుండి విజయవాడ వైపు భవాని దీక్ష పరులు ప్రయాణించే ఏపీ 31 టిహెచ్ 8348 నెంబర్ గల మినీ బస్సు పంచర్ పడి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ వెనక నిలబడి వచ్చే వాహనాలకు లైట్ చూపిస్తూ సిగ్నల్ ఇస్తున్న లారీ క్లీనర్ కు గాయాలయ్యాయి. అదేవిధంగా మినీ బస్సులో ఉన్న భవాని దీక్ష పరులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, ప్రమాద పరిస్థితిని నియంత్రించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

జీఎస్టీ2.o పై అవగాహన కార్యక్రమం… బొబ్బేపల్లి. సురేష్ నాయుడు.

వెంకటాచలం (పున్నమి,అక్టోబర్ 05):-జీఎస్టీ 2.0 సవరణ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన బొబ్బేపల్లిసర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి గ్రామంలో జీఎస్టీ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మన ప్రధాని నరేంద్ర మోడీ జీఎస్టీ 2.0 సవరణ ద్వారా 47% పేద మధ్యతరగతి కుటుంబాలు వినియోగించుకునేటువంటి నిత్యవసరాలపై 96 రకాల వస్తువులపై జిఎస్టి తగ్గింపు ఆనందించాల్సినటువంటి విషయం ఈ జీఎస్టీ 2.0 ఒక మధ్యతరగతి కుటుంబం ఐదువేల నుంచి 20వేల వరకు కూడా మిగులు అయ్యే పరిస్థితి నిజంగా ఈ విషయం ప్రజలలో పూర్తిస్థాయిలో అవగాహన తీసుకుని వచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ జిఎస్టి 2.0 సూపర్ సక్సెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గ్రామాలలో చిన్నచిన్న వ్యాపారస్తులలో అవగాహన తీసుకొచ్చే విధంగా ప్రజలకి ఎంత శాతం మిగిలింది అనేటువంటి విషయాన్ని కూడా వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది*ఈ కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్ సందూరి శ్రీహరి చల్లా చెంచయ్య పొట్లూరు సుబ్రహ్మణ్యం, బద్వేలు ఏడుకొండలు, బోలా అశోక్ కావలి మస్తాన్ సుమన్ తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

సౌదీ అరేబియాలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

భారత రాయబార కార్యాలయం తరఫున ఫస్ట్ సెక్రటరీ ఇన్ఫర్మేషన్, కల్చర్ ఎడ్యుకేషన్, విపుల్ బావా, కౌన్సెలర్ కమ్యూనిటీ వెల్ఫేర్ వై సాబీర్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి, రియాద్ ప్రాంతంలో సౌదీ అరేబియా తెలుగు సంఘం నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. రాయబార కార్యాలయ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా ఆన్‌లైన్‌ ద్వారా ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ ఎన్‌ఆర్‌టీ సొసైటీ ద్వారా సంఘం చేస్తున్న సేవలను కొనియాడారు. ముఖ్యంగా ఎడారిలో చిక్కుకున్న తెలుగు వారిని రక్షించడం, ఆపదలో ఉన్న మహిళలకు తోడ్పాటు అందించడం, సౌదీలో మరణించిన వారి మృతదేహాలను కుటుంబ సభ్యుల ఆఖరి చూపుల కోసం స్వదేశానికి పంపడం వంటి సేవలను ప్రస్తావిస్తూ భారత రాయబార కార్యాలయం ఆల్ ఇండియా స్టీరింగ్ కమిటీ సభ్యులందరూ హాజరై సంఘం సేవలను కొనియాడారు. కమిటీ చైర్మన్ శ్రీ జైగమ్ ఖాన్ మాట్లాడుతూ, ఈ సంఘం గత నాలుగేళ్లుగా దేశం కానీ దేశంలో చనిపోయిన వారి మృతదేహాలను స్వదేశానికి పంపడంలోనూ, సామాజిక సేవల్లోనూ ఇతర సంఘాలకు మార్గదర్శకంగా నిలిచిందని అభినందించారు.వేడుకకు సౌదీ అరేబియా నలుమూలల నుండి అభా, తాయిఫ్, జిజాన్ వంటి ప్రాంతాల నుండి వైద్యులు, ఇంజినీర్లు పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖోబర్, జుబైల్ పారిశ్రామిక నగరాల నుండి కూడా తెలుగు ప్రజలు విస్తృతంగా విచ్చేశారు. ధమ్మాంలోని తెలుగు సంఘం కుటుంబాల సమేతంగా పాల్గొన్నారు. సభ్యుల నిరంతర కృషి ఫలితంగా 2,000 మందికి పైగా తెలుగు ప్రజలు తెలుగు భాష దినోత్సవానికి హాజరై, సంప్రదాయ దుస్తులలో, తెలుగు వంటకాలతో తెలుగుదనం ఉట్టిపడుతూ చిన్నారుల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గోంగూరా, పూతరేకులు, మామిడి చారు, ఆవకాయ, రాజుగారి పులావ్ వంటి రుచికర వంటకాలతో తెలుగు సంప్రదాయ రుచులను అందించారు.వేదిక అలంకరణల నుండి కార్యక్రమ ముగింపు వరకు ప్రతి అంశం అద్భుతంగా సాగింది. చిన్నారుల నృత్యాలు, యువతీయువకుల ఉత్సాహభరిత ప్రదర్శనలు, “భారత వధూవరులు” అనే వివాహ సంప్రదాయాల ప్రదర్శన, “మిస్ తెలుగమ్మాయి” వంటి ప్రత్యేక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.సందర్భంగా మాట్లాడిన వివిధ రాష్ట్రాల ప్రవాసీ భారతీయ ప్రముఖులు, హైదరాబాద్ నగర ప్రవాసీ ప్రముఖులందరు కూడా సాటా సెంట్రల్ తెలుగు భాష అభిమానంతో తోటి తెలుగువారితో పాటు భారతీయులకు అందిస్తున్న ఆపన్న హస్తం గురించి ప్రస్తావిస్తూ ప్రశంసించారు. సాటా సెంట్రల్ నిరంతర సేవానిరతిని కొనియాడారు.సంఘ అధ్యక్షులు ఆనందరాజు, సుచరిత గారు ప్రసంగిస్తూ, తెలుగు భాష దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క మహిళా సభ్యురాలికి ధన్యవాదాలు తెలిపారు.వారి సహకారం లేకపోతే ఈ స్థాయి వైభవం సాధ్యపడేది కాదని స్పష్టం చేశారు. కుల మతాలకు, వాణిజ్య వ్యాపారాలకు అతీతంగా శాత సెంట్రల్ సామాజిక సేవే పరమార్ధంగా ముందుకు సాగుతుందని తెలిపారు.ఈ వేడుకను ఘనవిజయం చేసిన సంఘ ప్రధాన సభ్యులు: ముజ్జమిల్ షేక్, రంజిత్ చిత్తులూరి, యెర్రన్న దుగ్గపు, షేక్ జాని బాషా, చొల్లంగి సత్తి బాబు, యాకూబ్ ఖాన్, పోకూరి ఆనంద్, వెంకటరావు, నాగార్జున, నరేంద్ర, ముసైబ్, వంశీ, వినయ్, షౌకత్, నజీముద్దీన్, గోవింద్, చంద్ర, అక్షిత, భారతి, గీత, మాధవి, లక్ష్మి కాకుమాని, ఉష దుగ్గపు, మానస, శిల్ప, సింధూర, గుండుబొగుల రమ్య, గోదా శ్రీ, గీత శ్రీనివాస్, లక్ష్మి మాధవి, శ్రీదేవి మల్లికార్జున, మాధవి బాలు, అర్చన శ్రీపాద, కవిత కఱ్ఱి, ప్రియాంక, చేతన, పావని శర్మ, రజని, ముబీనా, మానస కనిగిరి, సంధ్య బబ్బూరి తదితరులు తెలుగు వారందరికీ ధన్యవాదాలు తెలియచేసారు.

తిరుపతి

గిరిజనులు ప్రచారాలకేనా నామినేటెడ్ పదవులకు అనర్హులా..ఇదెక్కడి న్యాయం:ఎస్టీ నేత సుబ్బయ్య

శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో 22,000 మంది గిరిజన ఓటర్లు ఉన్నారని,2019 నుండి 2024 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి వైసిపి నాయకులతో పోరాడి,జైళ్లకు వెళ్లి,దెబ్బలు తిని కుటుంబాలు కూడా వదిలేసి ఈరోజు బొజ్జల సుధీర్ రెడ్డి విజయానికి కృషి చేశాము.కానీ నేడు యానాధులకు ఒక్క నామినేటెడ్ పదవి కూడా వరించలేదని సుబ్బయ్య అన్నారు.శ్రీకాళహస్తి దేవస్థానంలో పాలకమండలి పదవి ఎవరికి దక్కలేదు మరియు శ్రీకాళహస్తి పట్టణ కో-ఆపరేటివ్ బ్యాంక్ మెంబర్లలో గిరిజనులకు చోటు లేదు మరియు మార్కెట్ యార్డ్ కమిటీలలో మెంబర్లలో ఎస్టీలకి చోటు లేదు మరి గిరిజనులు దేనికి పనికిరారా ఎలక్షన్ ప్రచారాలకు మాత్రమే పనికొస్తారా పదవులకు కాదా. .అని గిరిజన నేత సుబ్బయ్య తన నిరసన గళాన్ని వినిపించారు.

జోగులాంబ గద్వాల

గుడిసెలోకి దూసుకెళ్లిన డిసిఎం – తప్పిన పెను ప్రమాదం

అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) లేబర్ నివాసముంటున్న గుడిసెలోకి అర్ధరాత్రి ఒక్క సరిగా డీసీఎం దూసుకెళ్ళింది. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల పరిధిలో చోటుచేసుకుంది. కడప జిల్లా ఒంటిమిట్ట నుండి హైదరాబాద్ కు వెళ్తున్న డీసీఎం వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి 44వ జాతీయ రహదారి పక్కన కాటన్ మిల్ దగ్గర నివసిస్తున్న గుడిసెల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో గుడిసెలో నిద్రిస్తున్న భార్యాభర్తలు భాగ్యమతి, వీరా సింగ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని 108 అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

తిరుపతి

శ్రీకాళహస్తిలో యువత జనసేన పార్టీలో చేరికలు

జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు పార్టీ అధ్యక్షులు ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై,శ్రీకాళహస్తిలో సుమారు 100 మంది యువకులు జనసేన పార్టీలోకి చేరారు.వీరుకి జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టేసాయి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో కొనతనేరి గ్రామం నుండి జనసేన నాయకులు బాలాజీ నేతృత్వంలో 60 మంది,తొట్టంబేడు నుండి బాబు నేతృత్వంలో 50 మంది యువకులు జనసేన పార్టీలో చేరారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టేసాయి మాట్లాడుతూ ఈ యువత చేరికలు శ్రీకాళహస్తిలో జనసేన పార్టీకి మరింత బలాన్ని పెంచుతుంది.పవన్ కళ్యాణ్ దృష్టి ఎక్కువగా యువతపై ఉంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు,స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

విద్య విజ్ఞానం

నేడు ఆకాశం లో అద్భుతం.

పున్నమి ప్రతి నిధి నేడు, రేపు ఆకాశం లో అద్భుతం జరగనుంది. చంద్రుడు భూమి అతి చేరువ లోకి రానుండటం తో సుపర్ మూన్ గా కనిపించబోతున్నాడు. సాధారణముగా పౌర్ణమి రోజు కంటే అతి పెద్దగా ప్రకాశవంత ముగా కనిపించ బోతున్నాడు.దీంతో 14 శాతం పెద్దగా 30శాతం ప్రకాశ వంతముగా కనిపించనున్నాడు. ఇది సంవత్సరం లో చివరి ట్రైమాసికం చివరి రోజుల్లో లో కనిపించేసూపర్ మూన్ కావడం తో హార్వెస్ట్ మూన్ అంటారు.

ఆంధ్రప్రదేశ్

మద్యం పై దశల వారీగా ఉద్యమం సిపిఎం

దేవరాపల్లి, మద్యం బెల్టుషాపుల పై దశలవారీగా ఉద్యమం చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి బిటి దోర పేర్కొన్నారు ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో సిపిఎం విస్తృత స్థాయి సమావేశం యం,ఎర్రు నాయుడు అద్యక్షతన జరిగింది అనంతరం వారు మాట్లాడారు ప్రభుత్వ నిబంధన లకు విరుద్ధంగా మద్యం వ్యాపారులు బరి తెగింపుకు పూను కుంటున్నారని తెలిపారు మండలంలోని ప్రతి గ్రామాలోను విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపులు నిర్వహణ చేస్తు పేదలు కష్టాన్ని దోసు కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు,ప్రభుత్వ కేటాయించిన లైసెన్స్ షాపులకు,అనుబంధంగా గ్రామాల్లో మద్యం దుకాల యజమానులు చిన్న చిన్న గ్రామాల్లోను కిల్లి కోట్టులోను పాన్ షాపులు దాబాల్లోను టి కోట్టుల్లో సైతం విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని ఇది అత్యంత దుర్మార్గ మన్నారు చిన్న పిల్లలు మహిళలు నిత్యం తిరుతున్న రోడ్లు పక్కన బెల్ట్ షాపులు నిర్వహించడం చట్టాన్ని విశ్మరించడ మేనని తెలిపారు గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించడం వల్ల ప్రభుత్వం కేటాయించిన యం ఆర్పి ధరల కంటే బెల్ట్ షాపులో ఒక బాటిల్ దగ్గర అదనంగా 50 నుండి 100 రూపాయలు అదనంగా వసూళ్లు చేస్తున్నారని తెలిపారు.గ్రామాల్లో మద్యం విక్రయించ డానికి అనధికారిక వేలం పాటలు లక్షల్లో నిర్వహించి బెల్టు షాపులు యజమానులు సొమ్ము చేసు కుంటున్నారని తెలిపారు అక్రమ అమ్మ కాలు జరగడంతో సామాన్యులు నిరు పేదలు కూలీలు జేబులు ఖాళీ అవు తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామాల్లో దర్జాగా మద్యం విక్రయాలు నిర్వహించడం వల్ల మద్యం పట్ల ఎక్కువ శాతం యువత మద్యానికి బానిసలు అవుతున్నారని తెలిపారు నిభందనులు ప్రకారం గ్రామానికి కనీసం 200 మీటర్లు దూరంలో మద్యం షాపులు పెట్టాలని కాని ఇది ఎక్కడ అమలు కావడం లెదన్నారు బడి గుడి ఆర్ టి సి కాంప్లెక్స్ వంటి ప్రదేశాల్లో పెట్ట రాదని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం షాపులు నిర్వహించినప్పుడు కనీసం కీలోమీటారు దూరంలో షాపులు నిర్వాహన జరిగేదని ప్రస్తుతం నిబంధనలకు పాతర వేసారని,తెలిపారు గ్రామాల్లో అయితే,తెల్లవారుజాము నుంచే మద్యం బెల్ట్ షాపులు తెరిసి ఉంచుతున్నారని తెలిపారు, బెల్ట్ షాపులు వద్ద పదుల సంఖ్యలో మందు బాబులు బార్లు తీరుతున్నారని అన్నారు.ఎంతో మంది పేద కుటుంబాలు వీటి ప్రభావంతో రోడ్డున పడు తున్నారని తెలిపారు మరి కొన్ని గ్రామాల్లో మద్యం వ్యాపారం వలన మహిళలు మైనర్ బాలికలపై హత్యచారాలు పెరిగి పోతున్నాయని దీన్ని నివారించ వలసిన ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకొకుండా నిమ్మకు నీరుత్తెనట్లు వ్యహరిస్తున్నారనివిమర్శించారు ఇప్పటికైనా అక్రమ బెల్టు షాపులపై చర్యలు తీవాలని లైసెన్సులు లేని దాబాల్లో మద్యం అమ్మకాలుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు లేదంటే దశలవారీగా పెద్ద ఎత్తున అందోన చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బి నాగేశ్వరరావు డి,శంకర్ సిహెచ్ దేముడు జె ఈశ్వరరావు వి దోంగబాబుతో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి

ఖమ్మం

ముగిసిన దసరా సెలవులు.. నేటి నుండి పునః ప్రారంభం అయినా విద్యా సంస్థలు

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దసరా సెలవులు నిన్నటి తో ముగిసాయి.దీంతో సోమవారం నుండి ఖమ్మం నగరము తో పాటుగా జిల్లా లోని అన్ని ప్రభుత్వ మరియు ప్రవేటు విద్యాసంస్థలు ప్రారంభం ఐయ్యాయి. సుమారు 15 రోజులు పాటు సెలవులు ఎంజాయ్ చేసిన విద్యార్థిని, విద్యార్థులు కాలేజీలకి, పాఠశాల లకి వెళ్లారు.

భద్రాద్రి కొత్తగూడెం

విద్యానగర్ కాలనీ ఎస్బిఐ బ్యాంక్ లో యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఏ.జి.యం. సత్యనారాయణ చేతులమీదుగా పది లక్షలు చెక్ అందించారు*

* *ప్రజలందరూ కూడా ముందు జాగ్రత్త తో ఇన్సూరెన్స్ చేయించుకోండి ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ చందూలాల్* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ ఎస్బిఐ బ్యాంక్ నందు విద్యానగర్ కాలనీ కి చెందిన దేశభోయిన శ్రీనివాస్ స్కూల్ బస్ క్లీనర్ గా పనిచేస్తున్నారు మూడు నెలల క్రిందట విద్యానగర్ కాలనీ ఎస్బిఐ బ్యాంక్ లో ఎస్బిఐ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 500రూపాయలు చేశారు (ఒక సంవత్సరం ఇన్సూరెన్స్ 500 కట్టాలి) అనుకోకుండా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది ఈ యొక్క ఇన్సూరెన్స్ కి శ్రీనివాస్ భార్య రాజకుమారి నామిని గా ఉంది,రాజకుమారి బ్యాంక్ మేనేజర్ నీ సంప్రదించగా ఇన్సూరెన్స్ కవరేజ్ ఏజియం సత్యనారాయణ చేతుల మీదిగా పది లక్షల చెక్ రాజకుమారి కి అందించారు ఈ కార్యక్రమములో ఏ.జి.యం సత్యనారాయణ బ్యాంక్ మేనేజర్ చందులాల్ మాట్లాడుతూ ఎస్బిఐ బ్యాంక్ నందు అత్యుత్తమ ఇన్సూరెన్స్ కవరేజులు అందిస్తుంది ప్రజలు ఆదరించండి ఏ టైమ్ లో ఏమి జరుగుతుంది తెలియదు ముందు జాగ్రత్త తో చేయించుకుంటే మీ కుటుంబానికి ఉపయోగపడతాయని బ్యాంక్ నందు ఇన్సూరెన్స్, పాలసీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు *ఈ కార్యక్రమములో ఫీల్డ్ ఆఫీసర్ తిరుమలేశ్,క్యాష్ ఆఫీసర్ ఇందిరా,అసోసియేట్ కోటేశ్వరి,మరియు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.