Friday, 1 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 వేలు పెళ్లి కానుక అందజేత…!

ఉదయగిరి అక్టోబర్ 5 :(పున్నమి న్యూస్):/// ఉదయగిరి మండలం కొండాయపాలెం పంచాయతీ, మాసాయిపేట గ్రామంలో షేక్ పీర్ అహ్మద్ – షరీఫా దంపతుల కుమార్తె షేక్ సాజిన్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున నవ వధువుకు పెళ్లి కానుకగా రూ. 10 వేల రూపాయలను అందజేశారు.ఈ సహాయాన్ని ట్రస్ట్ ప్రతినిధులు వధువు కుటుంబానికి వ్యక్తిగతంగా అందజేశారు. శాసనసభ్యుడు కాకర్ల సురేష్ సేవా మనసుకు కృతజ్ఞతగా, వధువు కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థులు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున స్థానిక ప్రజలకు సహాయం చేయడం, సమాజంలో అవసరమైన వర్గాలను ఆదుకోవడం లక్ష్యంగా పలు సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయని ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు జల్సా యాదవ్, హరీష్, గంగాధర్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

10th సర్టిఫికెట్ లో పుట్టిన తేదీ మార్చాలంటే మార్పులు చేయాలంటే

🔹 10వ తరగతి సర్టిఫికేట్‌లో పుట్టిన తేదీ (Date of Birth) మార్చాలంటే చేయాల్సిన చర్యలు ఇలా ఉన్నాయి: 1️⃣ ప్రూఫ్ సిద్ధం చేసుకోండి: పుట్టిన సర్టిఫికేట్ (Birth Certificate) ఆధార్ కార్డు పాస్‌పోర్ట్ (ఉంటే) తల్లిదండ్రుల అఫిడవిట్ (Notary ద్వారా ప్రమాణ పత్రం) 2️⃣ స్కూల్ ద్వారా దరఖాస్తు చేయండి: మీరు చదివిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి లేఖ రాయాలి. DOB లో తప్పు ఉందని వివరించి, సరైన తేదీని పత్రాల ఆధారంగా చూపాలి. 3️⃣ అఫిడవిట్ (Affidavit): నోటరీ ద్వారా ఒక అఫిడవిట్ చేయించుకోవాలి. అందులో తప్పు తేదీ, సరైన తేదీ వివరాలు ఉండాలి. 4️⃣ ఎడ్యుకేషన్ బోర్డ్ (SSC Board)‌కి అప్లై చేయాలి: పాఠశాల ద్వారా డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ (DGE) కార్యాలయానికి దరఖాస్తు పంపించాలి. అవసరమైన పత్రాలు (పుట్టిన సర్టిఫికేట్, అఫిడవిట్, పాఠశాల లేఖ మొదలైనవి) జత చేయాలి. 5️⃣ ఫీజు చెల్లించాలి: DOB సరిచేయడానికి తగిన ఫీజు (బోర్డ్ నిర్ణయించినంత) చెల్లించాలి. 6️⃣ వెరిఫికేషన్ తర్వాత సర్టిఫికేట్ జారీ: బోర్డ్ పరిశీలన అనంతరం, సరైన ఆధారాలు ఉంటే, కొత్తగా సరిచేసిన DOB సర్టిఫికేట్ జారీ చేస్తారు. 📌 ముఖ్య గమనిక: పుట్టిన తేదీ మార్పు సాధ్యమవ్వాలంటే తప్పనిసరిగా అధికారిక పుట్టిన సర్టిఫికేట్ ఉండాలి. చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత మార్పులు చేయడం కష్టమవుతుంది. తప్పు చిన్న వయసులో గుర్తిస్తే, వెంటనే చర్యలు తీసుకోవడం ఉత్తమం. మీరు ఏ రాష్ట్రం బోర్డు (ఉదా: AP, TS, CBSE, ICSE) లో సర్టిఫికేట్ పొందారో చెబితే, ఆ బోర్డుకు సరిపోయే ఖచ్చితమైన దరఖాస్తు విధానం చెబుతాను. మీరు ఏ బోర్డు సర్టిఫికేట్ మార్చాలనుకుంటున్నారు?

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ప్రతి ఒక్కరూ స్వదేశీ యాప్ లను ను ఇన్స్టాల్ చేసుకోండి

ప్రతి ఒక్కరూ స్వదేశీ యాప్ లను ను ఇన్స్టాల్ చేసుకోండి 🇺🇸 అమెరికా యాప్‌లు vs 🇮🇳 భారత ప్రత్యామ్నాయాలు 🔹 Chrome → Ulaa అమెరికా గూగుల్ క్రోమ్‌కు భారత జోహో రూపొందించిన ఉలా బ్రౌజర్ ప్రత్యామ్నాయం. 🔹 Gmail → Zoho Mail జీమెయిల్‌కు బదులుగా భారత జోహో మెయిల్. 🔹 Google Drive → Zoho WorkDrive గూగుల్ డ్రైవ్ స్థానంలో జోహో వర్క్‌డ్రైవ్. 🔹 PowerPoint → Zoho Show పవర్‌పాయింట్‌కు బదులుగా జోహో షో. 🔹 MS Word → Zoho Writer వర్డ్ స్థానంలో జోహో రైటర్. 🔹 MS Excel → Zoho Sheet ఎక్సెల్‌కు భారత ప్రత్యామ్నాయం జోహో షీట్స్. 🔹 Google Meet → Zoho Meeting గూగుల్ మీట్ స్థానంలో జోహో మీటింగ్. 🔹 Google Forms → Zoho Forms ఫారమ్‌లకు ప్రత్యామ్నాయం జోహో ఫార్మ్స్. 🔹 Google Calendar → Zoho Calendar కాలెండర్ స్థానంలో జోహో కాలెండర్. 🔹 WhatsApp → Arattai వాట్సాప్‌కు భారతీయ మెసేజింగ్ యాప్ అరట్టై. 🔹 Windows → BOSS (Bharat Operating System Solutions) విండోస్‌కు బదులుగా భారతీయ ఆపరేటింగ్ సిస్టమ్ బాస్. 🔹 Playstore → Indus Appstore ప్లే స్టోర్ స్థానంలో భారతీయ ఇండస్ యాప్‌స్టోర్. 🟢 జోహో సంస్థ భారతదేశానికి గర్వకారణం — ప్రపంచ స్థాయి సాఫ్ట్‌వేర్‌లను స్వదేశీగా తయారు చేస్తోంది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అనపర్తి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ (AMC) ఛైర్మన్ గా శ్రీమతి జుత్తుగ సూర్యకుమారి మరియు డైరెక్టర్లు ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమo*

* *అనపర్తి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కార్యాలయoలో AMC ఛైర్మన్ గా శ్రీమతి జుత్తుగ సూర్యకుమారి మరియు డైరెక్టర్లు ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమలో పాల్గొన్ని, సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.* *అనపర్తి నియోజకవర్గ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ* *గౌరవ ఛైర్మన్ : MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి* *ఛైర్మన్ : జుత్తుగ సూర్యకుమారి* *వైస్ ఛైర్మన్ – కోనాల వెంకటరెడ్డి* *డైరక్టర్లు* *1) యామాల చిన్నమ్మ* *2)సిరసపల్లి లక్ష్మి* *3)ఒంటిమి గౌతమి* *4)పెండెం అప్పన్న* *5)గంగుమళ్ళ వెంకట తలుపులమ్మ దేవి* *6)తేతలి సూర్యనారాయణరెడ్డి* *7)నడింపల్లి సూర్యకుమారి* *8)తేనెల కృష్ణవేణి* *9)భోగాది వెంకటరమణ* *10)నల్లమిల్లి రామకృష్ణ ప్రసాదరెడ్డి* *11)మద్దిపూడి సత్యనారాయణ* *12)పంచికట్ల నాగరాజు* *13)ఇందల వీరబాబు* *14)పాలచర్ల వెంకట శివ ప్రసాద్ చౌదరి, PACS ప్రెసిడెంట్ బిక్కవోలు* *అనపర్తి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్,పాలకవర్గ సభ్యులను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి.* ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.

కాకినాడ

జగపతినగరం గ్రామం బాలరాజ్ నగర్ కాలనీ లో జనసైనికుడు నాగబోయిన శివ గారి నూతన గృహప్రవేశం కార్యక్రమానికి హాజరైన జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్. ఈ కార్యక్రమం లో మాజీ సొసైటీ చైర్మన్ చదలవాడ బాబీ,ఎల్లపు దొరబాబు, గంధం ప్రభాకర్,చిక్కాల కల్కి భగవాన్,సూరిబాబు, మాదారపు వీరబాబు,బోండా నందిబాబు,బోండా రమణ, ముద్రగడ పెద్దకపు,తదితరులు పాల్గొన్నారు

కాకినాడ జిల్లా కిర్లంపూడి : జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామం బాలరాజ్ నగర్ కాలనీ లో జనసైనికుడు నాగబోయిన శివ గారి నూతన గృహప్రవేశం కార్యక్రమానికి హాజరైన జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్. ఈ కార్యక్రమం లో మాజీ సొసైటీ చైర్మన్ చదలవాడ బాబీ,ఎల్లపు దొరబాబు, గంధం ప్రభాకర్,చిక్కాల కల్కి భగవాన్,సూరిబాబు, మాదారపు వీరబాబు,బోండా నందిబాబు,బోండా రమణ, ముద్రగడ పెద్దకపు,తదితరులు పాల్గొన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సూపర్ GST – సూపర్ సేవింగ్స్” అవగాహన సదస్సులో పాల్గోన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి*

*” *అనపర్తి తిలక్ రెడ్డి వర్తక సంఘం కళ్యాణ మండపoలో జిల్లా వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన”సూపర్ GST – సూపర్ సేవింగ్స్” అవగాహన సదస్సులో పాల్గొన్ని, “సూపర్ GST – సూపర్ సేవింగ్స్” కర పత్రాలను ఆవిష్కరించిన అనపర్తి శాసనసభ్యులు,నెక్స్ట్ జనరేషన్ GST ప్రచార్ అభియాన్ కమిటీ ఆంధ్రప్రదేశ్ కో-కన్వీనర్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర.* ఈ సందర్బంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… మన దేశం అగ్రదేశంగా ఎదుగుతున్న నేపథ్యంలో కొన్ని అగ్ర దేశాలలో నెలకొన్న అసూయతో భారత్ ని ఒంటరి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నరేంద్ర మోడీ గారి సమర్థతతో భారత్ విశ్వ గురు స్థానాన్ని ఆక్రమించడం జరుగుతుంది. నాలుగు రోజుల క్రితం జరిగిన వీటో సభకు 176 దేశాలు హాజరైతే అందులో 146 దేశాల మద్దతుని సాధించడం ద్వారా భారతదేశo ప్రపంచ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంతటి గుర్తింపు పొందిందో మనందరం గ్రహించవలసిన అవసరం ఉంది. ఆ సమావేశంలో ఒకటి రెండు దేశాలు పగతో రగిలిపోయినప్పటికీ చైనా గాని, రష్యా గాని భారత్ కు బలమైన మద్దతు ఇవ్వడం ద్వారా భారతదేశాన్ని ఒక అగ్ర దేశంగా తీర్చిదిద్దిన వైనాన్ని మనందరం చూస్తూ ఉన్నాం.ఆర్థిక రంగంలో నాలుగో స్థానానికి ఎదిగాం. రక్షణ రంగంలో బలమైన శక్తిగా మన దేశాన్ని తీర్చిదిద్దం ద్వారా నరేంద్ర మోడీ గారి సమర్థ నాయకత్వానికి ఒక నిదర్శనంగా మనం చెప్పవచ్చు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఏదైతే ప్రతిపక్షాలకు సంబంధించిన రాష్ట్రాలు వారి జీఎస్టీ మండలి మద్దతు తెలియ చెప్పాలని ఒక ఆలోచనతో జిఎస్టి మండల సమావేశానికి తమ వ్యతిరేకత తెలియ చెప్పాడానికి వచ్చినప్పటికీ అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన విధానం చూసి వారు కూడా ఏకగ్రీవంగా జిఎస్టి మండలి లో ఈ సంవత్సరం ఆమోదం తెలపడం అనేది ఇవాళ నరేంద్ర మోడీ గారి సమర్థ నాయకత్వంకి నిదర్శనం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రతిపక్ష ఆర్ధిక శాఖ మంత్రులను ఎoతగానో కృషి చేసి వారిని ఒప్పించడం జరిగింది. ఇవాళ ఒక పక్క రక్షణ రంగం,ఒక పక్క ఆర్థిక రంగం బలోపేతంగా ఉండడమే కాకుండా ఇవాళ సంక్షేమాన్ని సామాన్య ప్రజానికానికి అందిస్తూ, మరో పక్క అభివృద్ధిని అందిస్తూ, మరో పక్క సేవారంగంలో ఈ విధమైన సంస్కరణను తీసుకురావడంతో ఒక సుపరిపాలనని అందిస్తూ నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల కాలం ఒక అమృత కాలమని అనడానికి ఇవాళ జీఎస్టీ తగ్గింపు సంస్కరణలలో ఏ విధమైన మార్పులు తీసుకువస్తున్నాయో దేశ ప్రజానికానికి అందరికీ తెలియజేస్తూన్నాను. ముఖ్యంగా క్యాన్సర్ కు ఉపయోగించే పరికరాలు గాని,ఇతర వైద్య సేవలు గాని వాటన్నిoటికీ సంబంధించి 18% ఉన్న జీఎస్టీను జీరో % కు తగ్గించడం ద్వారా పెద్ద ఎత్తున రోగులకు ఉపశమనం కలిగించే చర్యలను నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అదేవిధంగా అనేక రకమైన మెడికల్ కిట్స్ ఉన్నాయి ఆ మెడికల్ కిట్స్ అన్నింటిపై 12% ఉన్న జీఎస్టీని 5% తీసుకురావడం ద్వారా పెద్ద ఎత్తున ఇవాళ ఉపయోగకరంగా ఉండేలా చేయడం జరిగింది.అదేవిధంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి ఏదైతే భారతదేశం వ్యవసాయం ప్రాధాన్యత కలిగిన దేశం. ముందు దానికి ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి ఏదైతే పనిముట్లు గాని, ఇతర వాటికి వాడతా ఉన్నామో దానికి సంబంధించిన జిఎస్టిని 18% నుంచి 5 % కు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గృహ ఉపకారణలు ఏదైతే విద్యుత్ పరికరాలు ఉన్నాయి వాటి పైన కూడా 25% ఉన్న టాక్స్ ఇవాళ 18% కు తీసుకురావడం జరిగింది. అనేక వస్తువులు ఇవాళ ముఖ్యంగా సామాజిక ప్రజానీకానికి నిత్యవసర వస్తువులు అదే విధంగా ఆరోగ్య రంగానికి సంబంధించి పూర్తిగా తొలగింపుతో పాటు ఇవాళ ఖరీదైన కార్ల విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున తగ్గే పరిస్థితి వచ్చింది. ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దాదాపుగా 50 వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని నష్టపోతున్న కానీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అంటే వ్యాపారం కాదు సేవ అనే దృక్పథంతో ఒక సేవ భావంతో ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చాలని ఒక సత్సంకల్పంతో ఎంత పెద్ద ఎత్తున ఈ సంస్కరణకు పూనుకోవడం జరిగింది.ముఖ్యంగా ఈరోజు వర్తకులకు, కూటమి నాయకులకు అవాగాహన కలిపించడం కోసం వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించడం జరిగిందన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సమావేశలో జిల్లా వాణిజ్య శాఖ అధికారులు, అనపర్తి నియోజకవర్గం వర్తకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

కూటమి వైఫల్యాలపై వైయస్సార్సీపీ సమరశంఖం

ఉత్తరాంధ్ర నుంచి ప్రభుత్వంపై పోరుబాటకు వైయస్సార్సీపీ సిద్ధమైంది. ఈ నెల 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని మాజీ సీఎం వై.ఎస్. జగన్ సందర్శించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. విశాఖలో జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్షా సమావేశంలో రీజినల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ కూటమి వైఫల్యాలను తీవ్రంగా విమర్శించారు. కూటమి పాలనలో ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతోందని, విలువైన భూములను కార్పొరేటర్లకు కట్టబెడుతున్నారని, విశాఖ అభివృద్ధి పణంగా పెట్టి అమరావతి కోసం అప్పులు తెస్తున్నారని వారు ఆరోపించారు. వైయస్సార్సీపీ నిర్ణయం — మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేదాకా ఉద్యమం ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్రం, ఒడిశా ప్రభుత్వాలతో చర్చలు జరపాలని డిమాండ్

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పొరపాటున డబ్బు పంపించారా? వెంటనే ఇలా చేయండి!

పొరపాటున డబ్బు పంపించారా? వెంటనే ఇలా చేయండి! 1. వెంటనే ట్రాన్జాక్షన్ స్క్రీన్‌షాట్ తీయండి. 2. పంపిన యాప్ గుర్తించండి (Google Pay / PhonePe / Paytm / BHIM). 3. Google Pay అయితే 18004190157 కి కాల్ చేయండి. 4. PhonePe అయితే 08068727374 కి సంప్రదించండి. 5. Paytm అయితే 01204456456 కి ఫోన్ చేయండి. 6. BHIM అయితే 18001201740 ని కాల్ చేయండి. 7. స్క్రీన్‌షాట్, ట్రాన్జాక్షన్ వివరాలు స్పష్టంగా చెప్పండి. 8. అవసరమైతే NPCI వెబ్సైట్‌లో కంప్లైంట్ నమోదు చేయండి.

తెలంగాణ

*5-17 ఏళ్లలోపు పిల్లలకు ఉచితంగా ఏడాదిపాటు ఆధార్ అప్డేషన్*

ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ సేవను 5 నుంచి 17 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు ఏడాదిపాటు ఉచితంగా అందించను న్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం 5 ఏళ్ల లోపు పిల్లలు ఫొటోగ్రాఫ్, పేరు, పుట్టినతేదీ, లింగం, చిరునామా, జనన ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి ఆధార్ లో పేరు నమోదుచేసుకోవచ్చు. అయిదేళ్ల వయసులో బయోమెట్రిక్స్ సరిగా ఏర్పడి ఉండవన్న కారణంతో వేలిముద్రలు, కనుపాపల గుర్తులు తీసుకోరు. పిల్లలు అయిదేళ్లు నిండిన తర్వాత ఒకసారి, 15 ఇలాంటి ఏళ్లకు చేరుకున్న తర్వాత మరోసారి తప్పనిసరిగా బయోమెట్రిక్స్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఏడాదిపాటు 5-17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలందరికీ ఈ సేవలను ఉచితంగా అందించాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత రూ.125 వసూలుచేస్తారు. బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోవడంవల్ల పాఠశాలల ప్రవేశాలు, ప్రవేశ పరీక్షల రిజిస్ట్రేషన్, స్కాలర్షిప్ ప్రయోజనాలు, వివిధ పథకాల ద్వారా అందే డీబీటీలు పొంద డానికి వీలవుతుందని పేర్కొంది. అందువల్ల తల్లిదండ్రులు వెంటనే ఈ వయసు పిల్లల ఆధార్ అప్డేట్ చేసుకోగలరు

E-పేపర్

*గన్నవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం*

(అక్టోబర్ 6) గన్నవరం పున్నమి ప్రతినిధి సురేష్ కృష్ణాజిల్లా, గన్నవరం జాతీయ రహదారిపై, రావ్ ఫిన్ రియల్ ఎస్టేట్ మెయిన్ గేట్ ఎదురుగా రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల 30 నిమిషాల సమయంలో నాయుడుపేట ఏరియా నుండి విజయవాడ వైపు ధాన్యం లోడుతో వస్తున్న ఏపీ 16 టి యు 9946 నెంబర్ గల లారీకి వెనుక టైరు పంచర్ అవ్వడంతో లారీ డ్రైవర్ లారీని రోడ్డు పక్కన నిలిపారు. అదే సమయానికి ద్రాక్షారామం ఏరియా నుండి విజయవాడ వైపు భవాని దీక్ష పరులు ప్రయాణించే ఏపీ 31 టిహెచ్ 8348 నెంబర్ గల మినీ బస్సు పంచర్ పడి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ వెనక నిలబడి వచ్చే వాహనాలకు లైట్ చూపిస్తూ సిగ్నల్ ఇస్తున్న లారీ క్లీనర్ కు గాయాలయ్యాయి. అదేవిధంగా మినీ బస్సులో ఉన్న భవాని దీక్ష పరులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, ప్రమాద పరిస్థితిని నియంత్రించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.