Friday, 1 May 2026

Blog

అన్నమయ్య

జన్మదినo సందర్భంగా నిత్యవసర సరుకుల పంపిణీ చేసిన దాతలు

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు స్థానిక ఇమామ్ సాబ్ వీధిలో నివాసముంటున్న అంజనమ్మ నిరుపేద మహిళలకు ఈరోజు జన్మదినo జరుపుకుంటున్న నెట్టూరు నాగ శేషు ప్రీతిల కుమార్తె జాశ్విత జన్మదినo సందర్భంగా నిరుపేదైన మహిళ అంజనమ్మకు ఈరోజు బోలా శంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగినది. భోలాశంకర్ సేవా సమితి అధ్యక్షులు మండల నాగేంద్ర మాట్లాడుతూ రైల్వే కోడూరు మండలంలో ఎవరు ఏ సమస్యలు తెలిపిన మా దృష్టికి తీసుకువచ్చిన తక్షణం ఆ సమస్యలు పరిష్కరించే విధంగా చూస్తానని అంతేకాకుండా ఎవరికైనా పుట్టినరోజు గాని పెళ్లిరోజు గాని శుభకార్యక్రమాల కైనా మీ సహాయ సహకారాలు అందించాలి అనుకుంటే పేదలకు మా బోలా శంకర్ సేవా సమితికి తెలియజేస్తే వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలపడం జరిగినది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జాస్వితకు బోలాశంకర్ సేవా సమితి సభ్యులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. అంతేకాకుండా పాపకు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో బోలా శంకర్ సేవా సమితి సభ్యులు ,చెన్నం శెట్టి రమేష్ సభ్యులు , బైసాని కిరణ్ కుమార్,ఉత్తరాది శివకుమార్, ఆంజనేయులు, పిన్నపోలు చంద్రశేఖర్, రత్తయ్య, పూల శెట్టి రాజేశ్వరి, నాగరాజా, మహంకాళి సుబ్రహ్మణ్యం, పెనుగొండ సుబ్బరాయుడు, మందల ప్రశాంత్ మొదలగువారు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

కేజీహేచ్ లో విద్యార్థినులను పరామర్శించిన హోం మంత్రి అనిత

విశాఖపట్నం,అక్టోబర్ 06:- పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏకలవ్య బాలికల గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను హోంమంత్రి అనిత పరామర్శించారు. బాధితులతో ఆమె మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో హోం మంత్రి అనిత మాట్లాడారు.బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారని, వైద్యు నిపుణులతో ఓ కమిటీ వేశామని తెలిపారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు.పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఇద్దరు గిరిజనులు డిప్యూటీ సీఎంలు అయ్యారని, కనీసం ఒక్కసారైనా ఆశ్రమ పాఠశాలలను సందర్శించారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో మంత్రులమంతా నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పరిశీలిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు.జగన్ హయాంలో కల్తీ మద్యంతో ఎంతోమంది ప్రాణాలను తీశారని అన్నారు. వైసీపీ హయాంలో జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యంతో పలువురు ప్రాణాలు కోల్ఫోయారని గుర్తుచేశారు. ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ మోహన్ రెడ్డికి లేదని మంత్రి అనిత ధ్వజమెత్తారు.

క్రైమ్

కన్నాపురం నుండి పోలవరం వెళ్లే జంగారెడ్డిగూడెం బస్సు నుండి జారి పడిన మహిళ

ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం బుట్టాయగూడెం మండలం రాజానగరం పంచాయతీ పాత రాజానగరం గ్రామానికి చెందిన గిరిజన మహిళ వెట్టి జయమ్మ కన్నాపురం నుండి పోలవరం వెళ్లే జంగారెడ్డిగూడెం బస్సు నుండి లక్ష్మీపురం వద్ద ఉన్న బ్రిడ్జి దగ్గర ప్రమాదవాసాత్తు డోర్ వద్ద నుండి క్రిందకి పడి బస్సు వెనుక టైర్లు కుడి మోచేతి మీదనుండి ఎక్కి వెళ్లడం వలన ఆమె చెయ్యి పూర్తిగా పాడైపోయింది. స్థానికులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురయ్యి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.ఉచిత బస్సు ప్రయాణం వలన ఒక బస్సులో పరిమితికి మించి ఆడవారిని ఎక్కించుకోవడం వలన ఇలా జరిగింది అని తోటి ప్రయాణికులు తెలియజేసారు. ఇరుకైన రోడ్డులో బస్సు డ్రైవర్ అతివేగం తో బస్సు నడపడం వల్ల సడన్ బ్రేక్ వేయడం వలన ప్రయాణికులు ఈ రోడ్డు మార్గం లో బస్సులు ఎక్కడానికి బయపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్

కించుమండకు రోడ్డు సౌకర్యం కల్పించాలి

దేవరాపల్లి గర్సింగి పంచాయతీ కించు మండకు రోడ్డు సౌకర్యం కల్పించాలని పి జి ఆర్ ఎస్ లో గిరిజనులు వినతి.పత్రం సమర్పించారు,విరిగి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కా‌ర్యదర్శి బిటి దోర పాల్గోని మాట్లాడారు,తర తరాలుగా గిరిజనులు కించుమండ గ్రామంలో జీవ స్తున్నారని తెలిపారు ప్రభుత్వ వీరిని గుర్తించి మంచి నీళ్ళు కరంటు ఇందిరమ్మ ఇల్లులు మంజూరు చేసిందని పేర్కొన్నారు వీరికి రోడ్డు సౌకర్యం కల్పించాలని అనేక సార్లు అందోన చేసి అధికారులు ద్రుష్టికి తీసుకు వెళ్లిన ప్రభుత్వ పెడచేవిన పెడుతుందని తెలిపారు చిన్న పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి సౌకర్యం లేక బందువులు పడుతూ ఇంటి దగ్గర చదివించు కోవలసిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు ముసలి వారు గర్భిణీ స్ర్తిలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు గర్సింగి స్ర్తిలకు డోలి కట్టి మోసుకు రావడం తప్పడం లెదన్నారు,ఆదివాసిలు బాహ్య ప్రపంచానికి ఆమడ దూరంలో మగ్గి పోతున్నారని తెలిపారు ఈసంవత్సరం వర్షాలు ఎక్కువగా పడటంతో అనా రోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పది కుటంంబాలు ఉన్న ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాటల్లో అర్థం లెదన్నారు ఇప్పటి కైనా గిరిజనులు కష్టాలను అర్దం చేసుకోని వెంటనే ప్రభుత్వ రోడ్డు సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేసారు ఈకార్యక్రమంలో చెరుకు రాజు, కంచర గంగరాజు, కంచరి శ్రీను, గంగరాజు, కాగలదేముడు, రాంకుమార్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

జాతీయ అంతర్జాతీయ

సనై తకైచి జపాన్‌ చరిత్రలో తొలిసారిగా మహిళ ప్రధానమంత్రి కానున్నారు.

జపాన్ చరిత్రలో తొలిసారిగా మహిళ ప్రధానమంత్రి అవుతున్న వార్త వెలువడింది. లిబరల్ డెమొక్రాటిక్ పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా షిగెరు ఇషిబా ఇటీవల ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత పార్టీ అధ్యక్షురాలిగా సనై తకైచి ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్షురాలిగా తకైచి కొనసాగటం వలన ప్రధాని పదవిని చేపట్టేందుకు మార్గం సుగమమైంది. తద్వారా జపాన్‌కు తొలి మహిళా ప్రధానమంత్రి గా తకైచి అరుదైన ఘనతను సాధించనున్నారు. ఈ సంఘటన జపాన్ రాజకీయాల్లో మహిళల పాత్రకు కొత్త చరిత్ర సృష్టిస్తోంది. తకైచి నాయకత్వంలో ప్రభుత్వం కొత్త దిశలో పయనిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

నిర్మల్

సోయాబీన్ పంట కోసం కొనుగోలు కేంద్రాలు తక్షణం ప్రారంభించాలి : మాజీ ఎమ్మెల్సీ పోతన్న యాదవ్ డిమాండ్

(పున్నమి ప్రతినిధి తేదీ 6 .10. 2025 నిర్మల్ జిల్లా)ముధోల్, రైతులు ఎంతో శ్రమించి పండించిన సోయాబీన్ పంటలను న్యాయమైన ధరలతో విక్రయించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని ముధోల్ మాజీ ఎమ్మెల్సీ పోతన్న యాదవ్ కోరారు. ప్రస్తుతం మార్కెట్లో సోయా పంటకు ప్రభుత్వం మధ్యధర రూ.5300 ప్రకటించినప్పటికీ, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారుల దయపై ఆధారపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు నేరుగా లాభం చేకూరుతుందనీ, లేకపోతే మధ్యవర్తులు వారి కష్టానికి వడ్డీలా లాభాలు దోచుకుంటారని హెచ్చరించారు. ఇక, ప్రైవేట్ వ్యక్తులు తక్కువ ధరలకు పంటను సేకరించే పరిస్థితులను ప్రభుత్వం నివారించాలి అని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఇటీవలి భారీవర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం ప్రకటించి రైతులకు ఉపశమనం కల్పించాలి అని డిమాండ్ చేశారు. “సోయాబీన్ పంట రైతుల ప్రధాన ఆదారమైన పంట. కాలం చెల్లిపోకముందే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి. లేకపోతే రైతులు నష్టాల బారిన పడతారు” అని హెచ్చరిస్తూ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు.

హైదరాబాద్

సుప్రీం కోర్టు తీర్పు ని స్వాగతిస్తున్నాం. తెలంగాణ ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క

పున్నమి ప్రతినిధి బీసీ రిజర్వేషన్ విషయం లో నేడు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ని స్వాగతిస్తున్నాం అని తెలంగాణ ఉప ముఖ్య మంత్రి మల్లు బట్టి విక్ర మార్క అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ లని అమలు చేసి తీరుతుంది అని హై కోర్టు తీర్పు కూడా ప్రభుత్వం కి అనుకూలముగా వస్తుంది అని ఆశీస్తున్నట్లు బట్టి విక్రమార్క అన్నారు.

హైదరాబాద్

బీసీ రిజర్వేషన్ విషయం లో సుప్రీం కోర్టు సంచలన తీర్పు

పున్నమి ప్రతి నిధి అక్టోబర్ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 42%బీసీ రిజర్వేషన్ లని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ మీద సుప్రీం కోర్టు విచారణ జరిపింది. రిజర్వేషన్ ల విషయం లో తెలంగాణ ప్రభుత్వం కి సుప్రీం కోర్టు ఊరట కలిగించినది. ఈ విషయం మీద హైకోర్టు లో విచారణ జరుగుతుండగా సుప్రీం కోర్టు కి ఎందుకు వచ్చారని పిటిషనర్ లని సుప్రీం కోర్టు ప్రశ్నించినది.

నిర్మల్

అకాల వర్షలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ గారు అన్నారు.*

(పున్నమి ప్రతినిధి తేదీ 6 .10. 2025 నిర్మల్ జిల్లా) ముధోల్ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా పలు గ్రామాల్లో పత్తి, మిర్చి, సోయాబీన్ వంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఈ సమయంలో ప్రభుత్వ సహాయం అత్యవసరమని గుర్తించిన స్థానిక శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ గారు స్వయంగా ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి బాధలను తెలుసుకున్న ఎమ్మెల్యే మాట్లాడుతూ: “ప్రతి రైతు కన్నీటిని తుడవడం నా బాధ్యత. అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. వెంటనే పంట నష్ట ఆकलన చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని భరోసా ఇచ్చారు. అదే విధంగా, పరిహారం మంజూరు అయ్యే వరకు బ్యాంకుల ద్వారా రుణ మోరటోరియం కల్పించాలన్న డిమాండ్‌ను కూడా సంబంధిత శాఖలకు తెలియజేస్తానని పేర్కొన్నారు. రైతులు సంక్షోభంలో ఉన్నప్పుడు రాజకీయాలు పక్కనపెట్టి అందరూ కలిసి నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక ప్రజలు ఎమ్మెల్యే సందర్శనతో ధైర్యం పొందుతూ తమ గోడులను వినిపించారు.

హైదరాబాద్

*ఆయుధ విరమణపై మల్లోజుల కీలక ప్రకటన*

పున్నమి హైదరాబాద్, అక్టోబర్ 6: సాయుధ పోరాట విరమణపై మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ మేరకు పార్టీ క్యాడర్‌కు లేఖ రాశారు. ఇందులో పార్టీ అధికార ప్రతినిధి జగన్‌కు కౌంటర్ ఇచ్చారు మల్లోజుల. పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఆయుధాలు వీడాలని పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బతికున్నప్పుడే తీసుకున్న నిర్ణయం అంటూ లేఖలో వెల్లడించారు. పార్టీ చేసిన కొన్ని తప్పుల వల్ల తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. ఉద్యమం ఓటమి పాలు కాకుండా కాపాడలేకపోయామంటూ క్షమాపణలు చెప్పారు. పార్టీ క్యాడర్‌ను కాపాడుకొని అనవసర త్యాగాలకు పుల్ స్టాప్ పెట్టాలని మల్లోజుల పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ ఇప్పటి వరకు కొనసాగించిన పంధా పూర్తిగా తప్పిదమే అని అంగీకరించారు. తప్పుల నుంచి గుణ పాఠాలు నేర్చుకోవడం అంటే టీకా లాంటిదని సూచించారు. వర్తమాన ఫాసిస్టు పరిస్థితులలో మావోల లక్ష్యాన్ని నెరవేర్చలేమన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని క్యాడర్‌కు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల పిలుపునిచ్చారు..

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.