Friday, 1 May 2026

Blog

కామారెడ్డి

భక్తజన సంద్రోహం.. రామారెడ్డిలో దుర్గామాత శోభాయాత్ర – అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

కామారెడ్డి, 05 అక్టోబర్ పున్నమి ప్రతినిధి : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో గాంధీ సమైక్య యువజన దుర్గ మండలి ఆధ్వర్యం లో దుర్గామాత శోభాయాత్రను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు, గ్రామ స్తులు తండోపతండాలుగా తరలివచ్చి, రామారెడ్డి ప్రధాన వీధులన్నీ భక్త జన సంద్రోహంతో నిండిపో యాయి.అష్టాదశ శక్తి మాతల ఊరేగింపు శోభా యాత్రలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో అష్టాదశ శక్తి మాతల (18 శక్తి స్వరూపాల) విగ్రహా లను అలంకరించి ప్రత్యేక వాహనంలో ఊరేగిం చారు. ఈ రథయాత్రను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మండలి సభ్యులు, మహిళలు, భక్తులు, గ్రామస్తులు ఈ శోభాయా త్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు శోభాయాత్రలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జగిత్యాల జయ కృష్ణ డ్యాన్స్ బృందం వారు ప్రదర్శించిన నృత్యాలు, కార్యక్రమానికి మరింత శోభను తీసుకొచ్చాయి. వారి ప్రదర్శనలను తిలకించేందుకు గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ శోభాయాత్రలో భక్తులు అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించా రు. ఈ శోభాయాత్ర విజయవంతం కావడానికి గాంధీ యువజన సమైక్యం మండలి సభ్యులు ఎంతగానో కృషి చేశారు.

హైదరాబాద్

*దసరా రిటర్న్ రష్* -హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ జాం.. – జనం పడిగాపులు

**పున్నమి స్టాప్ రిపోర్టర్: యామల రామమూర్తి** **హైదరాబాద్:** దసరా పండుగ సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్లిన నగరవాసులు తిరిగి హైదరాబాద్‌కు చేరుకోవడంతో ప్రధాన రహదారులపై, ముఖ్యంగా **హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారి (NH-65)**పై ఆదివారం తీవ్ర రద్దీ నెలకొంది. సెలవులు ముగియడం, సోమవారం కార్యాలయాలు ప్రారంభమవుతుండటంతో, అందరూ ఒకేసారి రిటర్న్ జర్నీకి బయలుదేరారు. దీంతో హైవేపై అనేక చోట్ల వాహనాలు బారులు తీరాయి. **హైవేపై కిక్కిరిసిన వాహనాలు.. టోల్ ప్లాజాల వద్ద తీవ్ర ఇబ్బందులు** * **రద్దీ తీవ్రత:** విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే రహదారిపై కార్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. వాహనాల రాకపోకలు చాలా **నిదానంగా** సాగుతున్నాయి. * **జామ్ పాయింట్స్:** ముఖ్యంగా **చిట్యాల, చౌటుప్పల్, మరియు పంతంగి టోల్ ప్లాజాల** వద్ద రద్దీ తీవ్రంగా ఉంది. టోల్ చెల్లింపుల కోసం వాహనదారులు సుదీర్ఘ సమయం వేచి ఉండాల్సి వచ్చింది. చౌటుప్పల్ వంటి కీలక పాయింట్లలో ట్రాఫిక్ దాదాపు స్తంభించిపోయింది. * **ప్రయాణికుల అవస్థలు:** ఆర్టీసీ బస్సులు మరియు ప్రైవేట్ వాహనాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌ల కారణంగా గంటల తరబడి ప్రయాణం ఆలస్యం కావడంతో, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. **బస్టాండ్లలో బస్సుల కోసం పడిగాపులు** హైవేపై రద్దీ ఒకవైపు ఉంటే, గ్రామాల్లోని బస్టాండ్‌ల వద్ద పరిస్థితి మరోలా ఉంది. * **ఎన్టీఆర్ జిల్లా నందిగామ బస్టాండ్** వంటి ప్రధాన స్టాప్‌ పాయింట్ల వద్ద ప్రయాణికులు బస్సులు, ఇతర రవాణా కోసం గంటల తరబడి **పడిగాపులు** కాస్తున్నారు. నగరానికి చేరుకునేందుకు అధిక ధరలు చెల్లించి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. * **సెలవుల ప్రభావం:** ఉద్యోగులకు దసరా సెలవులతో పాటు వీకెండ్ (శని, ఆదివారాలు) కలసి రావడంతో, అందరూ ఒక్కరోజే నగరానికి తిరిగి రావడానికి ప్రయత్నించారు. రేపు (సోమవారం) ఉదయమే ఆఫీసులకు వెళ్లాలనే ఒత్తిడితో ఈ రిటర్న్ రష్ ఏర్పడింది. **పోలీసుల పర్యవేక్షణ** పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు, చౌటుప్పల్, పంతంగి ప్రాంతాలలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. అదనపు టోల్ గేట్లను తెరిపించి, ఫాస్ట్‌ట్యాగ్ లేని వాహనాలను కూడా వేగంగా పంపించేందుకు ప్రయత్నించారు. అయితే, భారీగా వాహనాలు తరలిరావడంతో, రాత్రి వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా, దసరా పండుగ సంతోషం ముగిసినప్పటికీ, రిటర్న్ జర్నీ మాత్రం ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలను మిగిల్చింది.

ఆంధ్రప్రదేశ్

దంత సమస్యలకు చక్కటి పరిష్కారం ఆయుష్ డెంటల్ _ 9వ వార్షికోత్సవం సందర్భంగా ఉచితంగా ప్రజలకు వైద్య సేవలు

అమలాపురం, అక్టోబర్ 5 (పున్నమి ప్రతినిధి) : ఆయుష్ డెంటల్ కేర్ 9 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 3వ తేది నుండి 15వ తేది వరకు ఉచిత డెంటల్ చెకప్, ఒ.పి, డెంటల్ ఎక్సరే తదితర ట్రీట్ మెంట్ లపై 30% డిస్కౌంట్ కలదని ఆస్పత్రి మేనేజర్ శ్యామ్ తెలిపారు. అవసరం అయిన వారికి మందులతో పాటు మౌత్ వాష్, పేస్టు ఏదైన ట్రీట్ మెంట్ చేయించుకున్న వారికి ఉచితంగా పళ్ళ క్లీనింగ్ చేయబడునని ఆసుపత్రి మేనేజర్ శ్యామ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డాక్టర్ సజన్ ఆనంద్ మాట్లాడుతూ వేల మందికి చిరునవ్వును అందిస్తూ అనేక మందికి ఇంప్లాంట్స్ పద్ధతి ద్వారా పిక్సిడ్ పళ్లు కట్టుట, యాక్సిడెంట్ లో విరిగిన దవడ ఎముకను అతి సులువుగా సర్జరీ ద్వారా సరిచేయుట ఆనందంగా ఉందని అన్నారు. అత్యాదునిక పరికరముతో పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విదంగా అన్ని దంత సమస్యలకు చక్కటి పరిష్కారం చూపించడమే కాకుండా ఇ హెచ్ ఎస్ డెంటల్ హస్పటల్స్ విభాగంలో ఏపీ లోనే టాప్ – 3 హాస్పిటల్ లో ఒకటిగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఆసుపత్రి 9వ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు సత్యం ఫౌండేషన్ అధ్యక్షులు వాసంశెట్టి సత్యం కేక్ కటింగ్ చేసి ఆసుపత్రి సిబ్బందికి డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి చినబాబు, విజయానంద్ , వైద్యులు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

కుస్తీ పోటీల్లో పేరూరు హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ… రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

అమలాపురం, అక్టోబరు 05 (పున్నమి ప్రతినిధి) : క్రీడా మైదానంలో జరిగిన ఎస్ జి ఎఫ్ఐ కుస్తీ పోటీల్లో అండర్ 17 విభాగం ఫ్రీ స్టైల్ అండ్ గ్రీకో రోమన్ పోటీల్లో అమలాపురం రూరల్ మండలం పేరూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు దాసరి సాయికుమార్, ఆకుమర్తి సుదీప్ లు విశేష ప్రతిభ కనబరిచారు. 10వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థులు పోటీల్లో తమ సత్తా చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు పెచ్చెట్టి రామకృష్ణ తెలిపారు. ఈ విజేతలను గ్రామ సర్పంచ్ దాసరి అరుణా డేవిడ్, ప్రధానోపాధ్యాయురాలు ఎన్ విజయ కుమారి, ఎస్ఎంసీ చైర్మన్ కెవివి సత్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు రామకృష్ణ, కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

తిరుపతి

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొన్న కోల ఆనంద్.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతీ శిశు మందిర్ పాఠశాల నందు విజయదశమి ఉత్సవాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొనడం జరిగినది.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 1925 నుంచి దేశ సేవ,అభివృద్ధి,నాగరికతలని, సంప్రదాయాలను కాపాడుకోవడం లో వంద సంవత్సరాలుగా విశేష కృషి చేస్తూ ఎంతో మంది,నిస్వార్ధ పరులను దేశ సేవకులు గా మలుస్తూ,రాష్ట్రపతి,ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రులను,ముఖ్యమంత్రిలను, అనేక మంది నాయకులను దేశానికి అందించిన ఘనత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దని తెలియజేశారు.దేశంలో ఏ విపత్తు జరిగిన సంఘము ముందు ఉంటుందని అలాంటి దానిలో మేము భాగస్వామి అయినందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్

ఘనంగా ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలు.

పున్నమి: హైదరాబాద్: ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో, ప్రశాంత్ నగర్, ఉప్పల్ బ్యాంకు కాలనీ కమ్యూనిటీ హాల్ లో విజయదశమి ఉత్సవ సందర్బంగా ఫలుక్నామా జూనియర్ కాలేజి లెక్చరర్ బెల్లంకొండ అరుంధతి అతిథిగా హాజరై ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఆర్ ఎస్ ఎస్ దేశ సేవలను కొనియాడారు. ముఖ్య వక్త లింగంపల్లి వీరన్న గారు ఆర్ ఎస్ ఎస్ శాఖ విశిష్టత వివరించి నేటి యువత ఆర్ ఎస్ ఎస్ శాఖకు నిత్యం రావాలని అందువల్ల వారి వ్యక్తిత్వ వికాసం మరియు దేశ వికాసం అవుతుంది అని అన్నారు. ఆర్ ఎస్ ఎస్ శతాబ్ది కార్యక్రమంలో భాగంగా సమాజంలో పంచ పరివర్తన్ తిసుకురావడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరమపూజనీయ డా॥ కేశవరావ్ బలీరామ్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని 1925లో విజయదశమి పర్వదినాన స్థాపించారు. సమరసతతో కూడిన సంఘటిత భారతదేశ నిర్మాణంలో నిమగ్నమైన సంఘం, ఈ విజయ దశమికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొంది. యువత ప్రతి ఒక్కరూ స్ఫూర్తి దాయకంగా పయనించాలని సూచించారు. ఈ శుభతరుణంలో ఏర్పాటు చేసిన విజయదశమి ఉత్సవానికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి

భారీ వర్షాలు ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పర్యటన

కామారెడ్డి, 05 అక్టోబర్, పున్నమి ప్రతినిధి : కామారెడ్డి పట్టణంలో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, జిల్లా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తక్షణమే అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు.ఈ సంద ర్భంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదివారం ఉద యం ముంపునకు గురయ్యే అవకాశమున్న జీఆర్ కాలనీలో స్వయంగా పర్యటించారు.మున్సిపల్ కమిషనర్ సిహెచ్ రాజేందర్ రెడ్డి, సానిటరీ ఇన్స్పె క్టర్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఆయన వెంట ఉన్నారు.నదీ ప్రవాహంపై పరిశీలన భారీ వర్షాల కారణంగా జీఆర్ కాలనీ బ్రిడ్జి వద్ద ప్రవహిస్తున్న నీటి ఉధృతిని కలెక్టర్ దగ్గరుండి పరిశీలించారు. గతంలో భారీ వర్షాల వల్ల ఆయా ప్రాంతాల్లో కలిగిన ఇబ్బందులు, నష్టాలను దృష్టిలో ఉంచుకు ని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. కాలనీ వాసులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా నిరంతరం పరిస్థితులను సమీక్షించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించా రు. జీఆర్ కాలనీతో పాటు కామారెడ్డి పట్టణంలోని అన్ని లోతట్టు ప్రాంతాలలోనూ అధికారులు విస్తృ తంగా పర్యటిస్తూ, వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందు లు కలగకుండా తగిన తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాలు జారీ చేశారు. .

కామారెడ్డి

వాడి పాల్వంచ దగ్గర వాగు ఉధృతి రాకపోకలు నిలిపోయాయి

*పున్నమి ప్రతినిధి కామారెడ్డి- అక్టోబర్ 5* ఈరోజు ఉదయం 9-30 నుండి కురిసిన భారీ వర్షం కారణంగా చెరువులు, కుంటలు, నిండిపోయి కాలువలన్నీ, వాగులన్నీ విపరీతంగా పారుతున్నాయి. వర్షం నీరు వాగులల్లో ఉధృతంగా పారుతున్నందున వాడి గ్రామం దగ్గర గల వాడు ఉధృతంగా పారుతున్నందున పాల్వంచ చౌరస్తా నుండీ వాడి మీదుగా ఫరీద్ పేట, అంబర్ పేట, బీబీపేటకు నిలూచిపోయి ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాడి, ఫరీద్ పేట మధ్యలో గల వాగు దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటుగా వచ్చే వాహనాలను, బస్సులను తిరిగి పాల్వంచ చౌరస్తాకు పంపుతున్నారు. ఈ బందోబస్తును పాల్వంచ చౌరస్తా దగ్గరనే ఏర్పాటు చేస్తే ఈ వాగు వరకు వచ్చి ఇబ్బందులు పడే పరిస్థితి ఉండదని ప్రజలు తమ బాధలను వ్యక్తం చేస్తున్నారు. గ్రామ కార్యదర్శి, పోలీసు యంత్రాంగం ముందస్తుగా పాల్వంచ చౌరస్తా వద్దనే వాహనాలను దారి మల్లించాలని కోరుతున్నారు.

కామారెడ్డి

ప్రాణాలకు తెగించి… ఆపదలో అండగా నిలిచిన 108 సిబ్బంది! – వరదల్లో పురిటి నొప్పులతో తల్లడిల్లిన గర్భిణీకి పునర్జన్మ!

కామారెడ్డి, 05 అక్టోబర్, పున్నమి ప్రతినిధి. : కామారెడ్డి జిల్లాలో వర్షాకాలం వరదల కారణంగా నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్న క్లిష్ట పరిస్థితుల్లో, ఓ నిండు గర్భిణీకి 108 సిబ్బంది ప్రాణాలకు తెగించి పునర్జన్మ ఇచ్చారు. వరదల్లో చిక్కుకుని, పురిటి నొప్పులతో తల్లడిల్లుతున్న ఆ గర్భిణీని సురక్షితంగా వాగు దాటించి, జిల్లా ప్రభు త్వ ఆసుపత్రికి తరలించడంలో వారు చూపిన తెగువ, మానవత్వం ప్రశంసనీయం.అసలేం జరిగిం ది? భారీ వర్షాల కారణంగా వాగులు ఉప్పొంగడం తో, గ్రామానికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సరిగ్గా అదే సమయంలో, ఆ గ్రామానికి చెందిన ఓ నిండు గర్భిణీకి పురిటి నొప్పు లు అధికమయ్యాయి. ఆసుపత్రికి తరలించ డానికి ఎటువంటి మార్గం లేక, కుటుంబ సభ్యులు, గ్రామ స్థులు ఆందోళన చెందారు. పరిస్థితి చేయి దాటి పోయే ప్రమాదం ఉండడంతో, వెంటనే 108 అంబు లెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది..దారిలో వాగు ఉద్ధృ తంగా ప్రవహిస్తున్నప్పటికీ ఏ మాత్రం వెనుకాడ లేదు.గర్భిణీ పరిస్థితిని అర్థం చేసుకున్నవారు, వారి ప్రాణాలను పణంగా పెట్టి వాగు దాటడానికి నిర్ణయించుకున్నారు. అత్యంత సాహసోపేతంగా, స్థానికుల సహాయంతో ఆ గర్భిణీని సురక్షితంగా వాగు అవతలి ఒడ్డుకు చేర్చారు.పునర్జన్మ ప్రసాదిం చిన సిబ్బంది, వాగు దాటించిన వెంటనే, సిద్ధంగా ఉన్న 108 అంబులెన్స్‌లో ఆమెను ఎక్కించి, వేగంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమయానికి ఆసుపత్రికి చేర్చడం వలన, ఆమెకు మెరుగైన వైద్యం అంది, తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్న ట్లు సమాచారం.ఈ క్లిష్ట సమయంలో, తమ డ్యూటీకి మాత్రమే పరిమితం కాకుండా, ఒక నిండు ప్రాణాన్ని కాపాడడానికి 108 సిబ్బంది చూపిన తెగువ, ధైర్యం అందరి హృదయాలను హత్తుకుంది. వారు ఆపదలో ఉన్న ఆ గర్భిణీకి పునర్జన్మ ప్రసాదించారని స్థానికులు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటన, విపత్కర పరిస్థితుల్లో నిస్వార్థంగా సేవలందించే 108 సిబ్బంది మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది.

తిరుపతి

“మాలలకు ఆలయంలోకి ప్రవేశంలేదు “

“మాలలకు ఆలయంలోకి ప్రవేశం లేదు” -దళితులపై వివక్ష -ఆలయంలోకి రాకుండా అడ్డగింత – గుడికి తాళం దేశం అభివృద్ధిలో ముందుకు సాగుతున్నా…తరాల నుంచి పాతుకుపోయిన అంటరానితనం రోగం వదలడంలేదు. ఇప్పటికీ కొన్ని చోట్ల దళితుల ఆలయ ప్రవేశాలను అడ్డుకుంటున్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉల్లంఘిస్తూ వివక్ష చూపిస్తున్నారు.దొరవారిసత్రం మండలం పాళెం పాడు గ్రామంలోని కోరిందమ్మ గ్రామదేవతకి ఆదివారం గ్రామంలోని దళితులు పొంగళ్లు పెట్టేందుకు ఆలయానికి వెళ్లారు. ఆ ఆలయ పూజారి దళితులకు గుడిలోకి ప్రవేశం లేదని ఆలయానికి తాళం వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో దళితులు ఆలయం ముందు నిరసన చేశారు.దొరవారిసత్రం మండలం పాలేం పాడు గ్రామానికి చెందిన దళితులను కోరిందమ్మ ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు.ఆధునిక యుగంలోనూ అంటరానితనం ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది. దళితులపై వేధింపులు నేటికి కొనసాగుతున్నాయి. దొరవారిసత్రం మండలం పాళెంపాడు గ్రామంలో ఆదివారం ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. దళితులకు ఆలయంలో ప్రవేశం లేదని, అగ్రకులస్తులు గుడికి తాళం వేశారు. దొరవారి సత్రంమండలం పాలెంపాడు గ్రామంలోని కోరిందమ్మ గ్రామ దేవతకి పొంగళ్లు సమర్పించేందుకు దళితులు ఆలయానికి వచ్చారు. అయితే వారిని ఆలయంలోకి వెళ్లనివ్వకుండా అగ్రకులస్తులు గుడిలోకి రానివ్వకుండా గుడి పూజారి చేత అలాలు వేయించి . తమను గుడిలోకి వెళ్లనివ్వకుండా తాళం వేశారని దళితులు ఆరోపించారు. ఆలయంలోకి రాకుండా చేశారని దళితులు అక్కడే ఆవేదన వ్యక్తం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.