Friday, 1 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

“మాలలకు ఆలయంలోకి ప్రవేశంలేదు “

“మాలలకు ఆలయంలోకి ప్రవేశం లేదు” -దళితులపై వివక్ష -ఆలయంలోకి రాకుండా అడ్డగింత – గుడికి తాళం దేశం అభివృద్ధిలో ముందుకు సాగుతున్నా…తరాల నుంచి పాతుకుపోయిన అంటరానితనం రోగం వదలడంలేదు. ఇప్పటికీ కొన్ని చోట్ల దళితుల ఆలయ ప్రవేశాలను అడ్డుకుంటున్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉల్లంఘిస్తూ వివక్ష చూపిస్తున్నారు.దొరవారిసత్రం మండలం పాళెం పాడు గ్రామంలోని కోరిందమ్మ గ్రామదేవతకి ఆదివారం గ్రామంలోని దళితులు పొంగళ్లు పెట్టేందుకు ఆలయానికి వెళ్లారు. ఆ ఆలయ పూజారి దళితులకు గుడిలోకి ప్రవేశం లేదని ఆలయానికి తాళం వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో దళితులు ఆలయం ముందు నిరసన చేశారు.దొరవారిసత్రం మండలం పాలేం పాడు గ్రామానికి చెందిన దళితులను కోరిందమ్మ ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు.ఆధునిక యుగంలోనూ అంటరానితనం ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది. దళితులపై వేధింపులు నేటికి కొనసాగుతున్నాయి. దొరవారిసత్రం మండలం పాళెంపాడు గ్రామంలో ఆదివారం ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. దళితులకు ఆలయంలో ప్రవేశం లేదని, అగ్రకులస్తులు గుడికి తాళం వేశారు. దొరవారి సత్రంమండలం పాలెంపాడు గ్రామంలోని కోరిందమ్మ గ్రామ దేవతకి పొంగళ్లు సమర్పించేందుకు దళితులు ఆలయానికి వచ్చారు. అయితే వారిని ఆలయంలోకి వెళ్లనివ్వకుండా అగ్రకులస్తులు గుడిలోకి రానివ్వకుండా గుడి పూజారి చేత అలాలు వేయించి . తమను గుడిలోకి వెళ్లనివ్వకుండా తాళం వేశారని దళితులు ఆరోపించారు. ఆలయంలోకి రాకుండా చేశారని దళితులు అక్కడే ఆవేదన వ్యక్తం చేశారు.

తిరుపతి

చలాన్ల విషయంలో కఠినంగా మారనున్న రూల్స్.. నిర్లక్ష్యం చేస్తే లైసెన్స్ రద్దు

చలాన్ల విషయంలో కఠినంగా మారనున్న రూల్స్.. నిర్లక్ష్యం చేస్తే లైసెన్స్ రద్దు కేంద్ర రవాణా శాఖ ముసాయిదా ప్రకటన విడుదల చలాన్లు కట్టకుండా వదిలేస్తే లైసెన్స్ రద్దవుతుంది జాగ్రత్త 45 రోజులు దాటితే వెహికల్ సీజ్ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనం నడుపుతున్నారా.. మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడినా పట్టించుకోవడంలేదా.. అయితే, మీరు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది. పెండింగ్ చలాన్లు ఎన్ని ఉన్నా పోలీసులు ఆపినప్పుడు కడదాంలే అనుకుంటే ఇకపై కుదరదు. చలాన్ పడిన 45 రోజుల్లోగా చెల్లించలేదంటే అంతే.. ఐదు చలాన్లకు మించి పెండింగ్ లో ఉంటే లైసెన్స్ రద్దయినట్లు మీ మొబైల్ కు మెసేజ్ వస్తుంది. డ్రైవింగ్‌ లైసెన్సు రెన్యువల్‌ కాకపోవచ్చు కూడా.. మీ వాహనాన్ని ట్రాఫిక్ సిబ్బంది సీజ్ చేసే అవకాశం ఉంది. పెండింగ్ చలాన్ల విషయంలో కేంద్రం కఠిన చర్యలను ప్రతిపాదిస్తూ సెంట్రల్‌ మోటారు వెహికిల్స్‌ రూల్స్‌-1989లో కేంద్ర రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డ్రాఫ్ట్‌ రూల్స్‌ నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. చలాన్ల జారీ, చెల్లింపు, అప్పీల్‌ చేయడం వంటి అంశాలను డిజిటల్‌ మానిటరింగ్, ఆటోమేషన్‌ ఆధారంగా వేగవంతం చేయాలని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారుకు సంబంధిత అధికారులు మూడురోజుల్లోగా ఎలక్ట్రానిక్‌ రూపంలో నోటీసు జారీ చేయాలని, ఫిజికల్‌ రూపంలో 15 రోజుల్లోగా నోటీసు పంపాలని స్పష్టం చేసింది. కొత్త రూల్స్ ఇవే.. మోటారు వెహికిల్‌ యాక్టు కింద ఒక వాహనంపై 5 లేదా అంతకంటే ఎక్కువ చలాన్లు జారీ అయితే డ్రైవింగ్‌ లైసెన్సును సస్పెండ్‌ చేయొచ్చు. చలాన్ చెల్లించడానికి ప్రస్తుతం ఉన్న 90 రోజుల గడువు 45 రోజులకు తగ్గింపు. ఈ గడువు దాటితే సదరు వాహనాన్ని అమ్మడం కుదరదు. డ్రైవింగ్ లైసెన్సులో మార్పులకు కానీ రెన్యువల్ కు కానీ వీలుండదు. చలాన్‌ కట్టకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. వాహనం ఎవరు నడిపినా రూల్స్ అతిక్రమిస్తే వాహన యజమాని పేరుపైనే చలాన్ జారీ అవుతోంది. ఇకపై, వాహనం నడిపిన వ్యక్తిని బాధ్యుడిగా చేయనున్నారు.

ఖమ్మం

తోట మాణిక్యమ్మకు నివాళులర్పించిన మంత్రి తుమ్మల

ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి ఏన్కూర్: మండల పరిధిలోని నాచారం గ్రామానికి చెందిన తోట మాణిక్యమ్మ ఇటీవల మృతి చెందడం జరిగింది. ఆదివారం మాణిక్యం దిశ దిన కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ నాగేశ్వరరావు మాణిక్యమ్మ చిత్రపటానికి పూలమాలవేసి మంత్రి తుమ్మల నివాళులర్పించారు. మాణిక్యమ్మ భర్త, తోట వెంకటేశ్వరరావు గతంలో మృతి చెందడం జరిగింది దివంగత తోట వెంకటేశ్వరరావు కుటుంబంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు మంచి సంబంధాలు ఉన్నాయి. తోట వెంకటేశ్వరరావు, మాణిక్యమ్మ దంపతులు ఇద్దరు మృతి చెందటం తనను ఎంతో కలిచివేసిందని మంత్రి తుమ్మల అన్నారు. అనంతరం మాణిక్యమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, గుత్తా వెంకటేశ్వరరావు, మేడ ధర్మారావు, శోభన్ నాయక్, తదితరులు ఉన్నారు.

ఖమ్మం

నీటి కరవుతో బి.ఎన్. తండా అవస్థలు

పున్నమి ఖమ్మం జిల్లా ప్రతినిధి ఏన్కూరు మండలం బి.ఎన్. తండా గ్రామంలో వారం రోజులుగా నీటి కరవు తీవ్రంగా వేధిస్తోంది. తాగునీరు రాకపోవడంతో గ్రామస్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్య గురించి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి కూడా మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారని వాపోయారు. తమ సమస్యను పరిష్కరించాలని వారు అధికారులను వేడుకుంటున్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

తిరువూరు పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు రహదారుల దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు…

తిరువూరు పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు ​రహదారుల దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు.. పున్నమి ప్రతినిధి గోపీ పామర్తి తిరువూరు. ​తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు పట్టణం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ముఖ్యంగా రోజువారీ కూలీలు, ప్రతిరోజూ పనుల నిమిత్తం పట్టణానికి ప్రయాణించడానికి పడుతున్న ఇబ్బందులను మీ వార్త స్పష్టంగా తెలియజేస్తోంది. ​రహదారుల పరిస్థితి: పట్టణం నుండి ఏ గ్రామానికి వెళ్లాలన్నా రహదారులన్నీ గుంటలు పడి, వరద నీరు నిలిచిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ​ప్రజల భయాందోళన: ఈ రోడ్ల పరిస్థితి ‘మృత్యు ద్వారాలు’ లాగా ఉండి, సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ​ప్రజల ఈ నరక యాతనను అధికారులు గుర్తించి, వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. తిరువూరు పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు కోరుకుంటున్నట్లుగా, రహదారుల మరమ్మత్తులు వెంటనే చేపట్టి, సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Blog

_బియ్యం షాపులో పనిచేస్తూ 2025-DSC లో ర్యాంక్ కొట్టి, టీచర్ అయ్యాడు._* *[కంటతడి పెట్టించే రాంబాబు సక్సెస్ స్టోరీ చదివి తీరాల్సిందే…!!!]*

*అతని కుటుంబం మొత్తాన్ని కరోనా పొట్టనపెట్టుకుంది.* *44 ఏళ్లు వచ్చినా ఎవరూ అతనిని పెళ్లిచేసుకోలేదు* *పగబట్టిన పేదరికంతో పోరాటం చేశాడు… అనుకున్నది సాధించాడు.* *తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయ కూలీలు. పిల్లలను చదివించే స్థోమత లేదు. చందాలు పోగేసుకుని చదువు కన్నాడు. పేదరికం జయించడానికి ఉద్యోగం సాధించాలని నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు. ప్రతి డీఎస్సీ పరీక్షల్లోనూ ఏదో ప్రమాదం ముంచుకొచ్చేది. ఉద్యోగం వచ్చినట్టే వచ్చి చేజారిపోయేది. కరోనా మహమ్మారి వచ్చి తండ్రిని, అక్కను, అన్నయ్యను తీసుకెళ్లి పోయింది. ఒంటరివాడైపోయాడు. నలభై నాలుగేళ్ళు వచ్చినా పిల్లని ఇస్తానన్న వాళ్ళు ఎవరూ లేరు. ఆశలన్నీ ఆవిరైపోయాయి. బియ్యం షాపులో కూలీగా పని చేసేవాడు. ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం 2025-డీఎస్సీ ప్రకటించింది. ఇతనికి చివరి అవకాశం మిగిలింది.* *ప్రయత్నించాలా..? మానేయాలా…? అనే మీమాంస. ఏదైతే అయిందని కొద్ది రోజులు పని మానేసి చదువుపై దృష్టి పెట్టాడు. కోచింగ్ సెంటర్ కు వెళ్లే ఆర్థిక స్థోమత లేదు. తెలిసిన వారి దగ్గర పుస్తకాలు తీసుకుని చదువుతూనే ఉన్నాడు. అది ఏ స్థాయిలో అంటే ఇతనిపై పగబట్టిన పేదరికం కూడా జాలిపడేలా చదివాడు. చివరికి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు.* *డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన బొమ్మాలి రాంబాబు ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువు సాధించారు. అది ఎలాగో పరిశీలిద్దాం…* *ఆయన తల్లిదండ్రులు సంగయ్య, సుజనమ్మలు సుమారు 50 సంవత్సరాల క్రితం బొబ్బిలి నుంచి ఉపాధి కోసం మండపేట వచ్చారు. అయితే మండపేట పట్టణంలో ఇంటి అద్దెలు భరించలేక సమీపంలో ఏడిద గ్రామం చేరుకున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. సుమారు 40 ఏళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇల్లు లేని వారికి కట్టించిన కాలనీ ఇల్లు(పెంకుటిల్లు) ఇచ్చారు. ఇప్పటికీ పెంకులూడిపోయిన ఆ ఇల్లే అతనికి ఆధారం.* *వీరికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. అయితే వీరిని చదివించడం సాధ్యం కాదని పెద్దబ్బాయిని బొబ్బిలిలోని వాళ్ళ బంధువులకు ఇచ్చేశారు. ఇద్దరు అబ్బాయిలను కూలి పనులకు తీసుకెళ్లకుండా చదివించడం మొదలుపెట్టారు. అలా పదో తరగతి రాంబాబు, రమేష్ సోదరులు పూర్తి చేశారు. రాంబాబుకు రమేష్ అన్నయ్య కాదు స్నేహితుడు కూడా అని చెప్పాలి. వీరు వలస రావడం వల్ల వీరికి ఇక్కడ బంధువులంటూ ఎవరూ ఉండేవారు కాదు. అలాగే స్నేహితులు కూడా లేకపోవడంతో… అన్నయ్య లోనే స్నేహితులను చూసుకునేవాడు. ఇంటర్మీడియట్ మండపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివేందుకు MPC గ్రూప్ కు దరఖాస్తు చేశారు. అయితే ఆ తండ్రి ఎంపీసీ గ్రూప్ కి ఖర్చు ఎక్కువవుతుంది చదివించలేను, సిఇసి తీసుకోమని చెప్పాడు. అయితే మండపేట కాలేజీలో ఆ సీట్లు పూర్తయి పోయాయి. దీంతో కడియం మండలం మురమండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సీఈసీ లో చేరారు. ఏడిద నుండి సైకిల్ పై మురమండ వెళ్ళి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత మండపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కళాశాలలో BA డిగ్రీలో ఉత్తీర్ణత సాధించారు. అలాగే శ్రీకాకుళంలో ఆంధ్రా యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే అంబేద్కర్ యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు.* *అనంతరం రాంబాబు బీ.ఈడీ.కి ఎంట్రన్స్ పరీక్ష రాశారు. మచిలీపట్నం నేషనల్ కళాశాలలో సీటు వచ్చింది. కానీ, చదువుకోవడానికి మాత్రం డబ్బులు లేవు. ఏడిది రథం వీధిలో ఉండే రాజు మాస్టర్ కి ఈ కుర్రాడి పరిస్థితి తెలుసుకుని ప్రోత్సహించారు. బీ.ఈడీ. అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పి, కొంత ఆర్థిక సాయం కూడా చేశారు. అలాగే ఆ పక్క గ్రామం కొత్తపేట ఎలిమెంటరీ స్కూల్లో పనిచేసే ప్రసాద్ మాస్టారుకు పరిచయం చేశారు. అక్కడ ఆ మాస్టర్ తో పాటు దుళ్ల గ్రామానికి చెందిన కంటిపూడి సత్యనారాయణ మాస్టారులు ఇతనిని దాతల వద్దకు తీసుకెళ్లారు. ప్రసాద్ మాస్టారు తన మోటార్ సైకిల్ పై రాంబాబుని _”అర్తమూరు సత్తి బులిస్వామి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్, ఆలమూరు సమతా స్వచ్ఛంద సేవా సంస్థ, రావులపాలెం రాఘవేంద్ర కంటి ఆసుపత్రికి చెందిన ట్రస్ట్”_ ద్వారా కొంత నిధులను సమకూర్చి బీ.ఈడీ. పూర్తి చేయడానికి కారకులయ్యారు.* *అప్పటి నుంచి టీచర్ అవ్వటానికి రాంబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. 2008 డీఎస్సీలో తొలి ప్రయత్నం లోనే ఎంపికయ్యాడు. సర్టిఫికెట్లు పరిశీలన కూడా పూర్తయింది. నియామక ఉత్తర్వులు రావడమే ఆలస్యం. ఇంతలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో కొందరి ఉద్యోగాలు తారుమారయ్యాయి. అటువంటి దురదృష్టవంతులలో ఈ రాంబాబు ఉండటం చాలా బాధాకరం. ఉద్యోగం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది.* *ఇక 2012లో డీఎస్సీపరీక్షలకు సిద్ధమవుతుండగా తల్లి సుజనమ్మకు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రిలో తల్లిని చూసుకోవడంలో ఉండిపోయాడు. చివరకు ఆమె మరణించింది. అటువంటి పరిస్థితుల్లో ఆ పరీక్షల్లో విజయం సాధించలేకపోయారు. అంటే అతన్ని దురదృష్టం ఏవిధంగా వెంటాడుతుందో… చూడండి. 2018 డీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతుండగా తండ్రి సంగయ్యకు జరిగిన ప్రమాదంలో కాలు విరిగిపోయింది. అతని సంరక్షణ చూసుకుంటూ ఆసుపత్రిలోనే ఉండిపోవడం వల్ల ఆ పరీక్షల్లో కూడా గెలవలేకపోయారు.* *ఇతను ఎమ్‌.ఎ, బి.ఈడీ. చదవడం వల్ల పలు కాన్వెంట్లు, ప్రైవేటు స్కూళ్ళల్లో పనిచేస్తూ ఉండేవారు.* *ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా యావత్తు ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారి ఈ కుటుంబాన్ని పొట్టనపెట్టుకుంది. తండ్రి సంగయ్య, అక్క బొత్సా లక్ష్మీ, స్నేహితుడు లాంటి అన్నయ్య రమేష్ లు రెండు వారాల వ్యవధిలోనే రాంబాబు కళ్లముందే మృతి చెందారు. రాంబాబు ఒంటరి వాడైపోయాడు. అతనికి మానసిక ఒత్తిడి ఎక్కువై పోయింది. అలాంటి పరిస్థితుల్లో మరో అక్క రాజాన సుందరమ్మ ఏడిదకు వచ్చి రాంబాబుకు వండి పెడుతున్నది. ఎంత చదువు చదివినా పెళ్లి చేసుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రాని పరిస్థితి. దుర్బలమైన ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడు తున్నందున వీరిని చూసేవారెవరూ లేకుండా పోయారు. కనీసం జాలి పడేవారు కూడా ‌లేరు‌. ఇతనికి పట్టిన దరిద్రం తమకు ఎక్కడ అంటుకుంటుందో నని దూరం దూరంగా ఉండేవారు.* *ఇలాంటి పరిస్థితుల్లో ఆలమూరు మండలం చెముడులంక హై స్కూల్ పక్కన ఉన్న గుప్తా రైస్ స్టోర్ లో పనికి చేరాడు. ఇతని చదువును చూసి ఆ యాజమాన్యం బరువు పనులు చెప్పకుండా తేలికపాటి పనుల బాధ్యతలు ఇచ్చేవారు. ఎంతో నమ్మకంగా పనిచేయడంతో వారు రాంబాబును పనివాడుగా కాకుండా ఆప్యాయతగా చూసుకునేవారు. సైకిల్ పైనే ఏడిద నుంచి చెముడులంక రోజు వెళ్లి వచ్చేవారు. ఇలాంటి పరిస్థితుల్లో 2025-డీఎస్సీ.ని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో యాజమాన్యం కొంతకాలం పని మానేసి చదువుకోమని సూచించారు. అయితే కోచింగ్ సెంటర్ కు వెళ్లే ఆర్థిక పరిస్థితులు లేకపోవడం వల్ల తెలిసిన వారి వద్ద పుస్తకాలు తీసుకుని రేయింబవళ్ళు చదువుతూనే ఉన్నాడు. అంటే “కసి” అనేదానికి ఇది చివరిదశ అన్నమాట. ఆ స్థాయిలో చదివాడు. అలా చదవడం కూడా ప్రమాదమే కదా..! అదే జరిగింది. ఇంట్లోనే పడిపోతూ ఉండేవాడు. ఇదేంటని ఆసుపత్రికి తీసుకెళ్తే ఇతనికి ఎక్కువగా చదువుతూ ఉండటం వల్ల నిద్రలేక కంటికి రెట్టిగో అనే వ్యాధి సోకింది రెస్ట్ కావాలన్నారు.* *అంతే మళ్ళీ తన పని అయిపోయింది అనుకున్నాడు. అలాగే మందులు వాడుతూ ఆ చదువును కొనసాగిస్తూ వచ్చాడు. ఎక్కడా నిరుత్సాహం అనేదాన్ని తన దరిదాపుల్లోకి రానీయకుండా చూసుకున్నాడు. చివరకి అమలాపురం సమీపంలోని శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష రాయడానికి వెళ్లాడు. పరీక్షా రాస్తూనే మధ్యలో కుప్పకూలి పోయాడు. ఇన్విజిలేటర్లు ఏంటి విషయం అని ఆరా తీశారు. పరిస్థితి వివరించాడు. మందులు వేసుకుని మళ్లీ పరీక్ష రాయడం మొదలు పెట్టాడు. ఆ విధంగా సుమారు 15 నిమిషాలు పరీక్షా సమయం వృధా అయిపోయింది.* *🤔ఈ పరిస్థితుల్లో ఈ పరీక్షలో కూడా గెలవలేననే నిర్ణయానికి వచ్చేశాడు. కానీ, ఫలితాలు చూస్తే✌️ పూర్తిగా రాంబాబు వైపుకు వచ్చేశాయి. ముందుగానే చెప్పాను కదా! ఇతన్ని వెంటాడిన పేదరికం, దారిద్ర్యం వంటివన్నీ జాలిపడ్డాయి. ఇక అతన్ని ఇబ్బంది పెడితే అర్థమే ఉండదనుకున్నాయి. అందుకనే ఒకే పరీక్షలో రెండు ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు.😲😃 వాటిల్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ (ఎస్సీ కేటగిరీలో 75వ రోస్టర్ పాయింట్) ను 💪ఎంచుకున్నాడు. దీనితో పాటు టిజిటి 138 వ ర్యాంకు సాధించారు.👍* *చూశారా…… రాంబాబు జీవితంలో ఓడిపోయి, పడిపోయి మళ్లీ లేచి ఎలా నిలబడ్డారో….!!!!! యావత్తు ప్రపంచానికి చాటి చెప్పింది ఏంటంటే నిరుత్సాహాన్ని దరి చేరనీయకుండా కష్టపడి చదివితే, లక్ష్యం చేరుకోవచ్చని.💪💪* *రాంబాబుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ.. అతను భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనసారా మా యాజమాన్యం తరుపున కోరుకుంటున్నాం. °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° *_:{ఒక ఫేస్బుక్ పోస్టు ఇది… ఈ సందర్భంగా నేటి యువతీ యువకులకు మా తరుపున ఓ విన్నపం……. ఈ రాంబాబుని స్ఫూర్తిగా తీసుకుని, మొక్కవోని సంకల్పబలంతో.. సాధనచేసి, కష్టాల నుంచి బయటపడి అనుకున్నది సాధించి, ఎత్తులకు ఎదగాలి. అలాగే మరి కొంతమందికి ప్రోత్సాహం కలిగిస్తూ, సాయం చేసే స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములతో… పున్నమి దినపత్రిక

ఆంధ్రప్రదేశ్

స్పీడ్‌గా మారుతున్న ‘స్పీడ్ పోస్టు’ – కొత్త రేట్లు, కొత్త టెక్నాలజీ!

విశాఖపట్నం అక్టోబర్ 05 భారత పోస్టల్ శాఖ తన సర్వీసుల్లో భారీ అప్‌డేట్‌కి శ్రీకారం చుట్టింది. పాత పోస్టాఫీస్ ఇమేజ్ని తుడిచేస్తూ, ఆధునిక డిజిటల్ యుగానికి తగ్గట్టు స్పీడ్ పోస్టు సేవను పూర్తిగా రీడిజైన్ చేసింది. 🗓️ అక్టోబర్ 1, 2025 నుండి దేశవ్యాప్తంగా కొత్త రేట్లు, కొత్త ఫీచర్లు అమల్లోకి వస్తాయి.ఇప్పుడు పోస్టు వస్తే కేవలం ట్రాకింగ్ నంబర్ కాదు — మీ ఫోన్‌లోనే OTP ద్వారా సురక్షిత డెలివరీ కన్ఫర్మ్ అవుతుంది. ప్రతి స్టేజ్‌లో SMS అలర్ట్స్ వస్తాయి, మీరు పంపిన లేఖ లేదా పార్సిల్ ఎక్కడుందో “రియల్ టైమ్ ట్రాకింగ్” ద్వారా చెక్ చేసుకోవచ్చు. స్థానికంగా 50 గ్రాముల వరకు పంపేందుకు ₹19 నుంచి ప్రారంభం. రిజిస్టర్డ్ పోస్ట్ ఇక స్పీడ్ పోస్ట్ లోనేపోస్టల్ శాఖ రిజిస్టర్డ్ పోస్టు సేవను రద్దు చేయలేదని స్పష్టంచేసింది — దాన్ని స్పీడ్ పోస్టు వ్యవస్థలో విలీనం చేసి, మరింత వేగంగా, సురక్షితంగా, ట్రాకింగ్ సౌకర్యంతో అందుబాటులోకి తెస్తోంది. ఏపీకి సిస్టమ్ ( అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ)డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ భాగంగా, దేశవ్యాప్తంగా 1.6 లక్షల పోస్టాఫీసుల్లో కొత్త సాంకేతిక వేదిక – ఏ పి టి సిస్టమ్ అమలవుతోంది. దీని వల్ల బుకింగ్, డెలివరీ, ట్రాకింగ్, డేటా మేనేజ్‌మెంట్ అన్నీ ఒకే సిస్టమ్‌లో నిర్వహించబడతాయి.“ప్రజలకు మరింత వేగవంతమైన, సురక్షితమైన, పారదర్శకమైన సేవలు అందించడమే మా లక్ష్యం.”

కాకినాడ

జగ్గంపేటలోఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించిన జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్.

కాకినాడ జిల్లా జగ్గంపేట అక్టోబర్ 4: జగ్గంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ప్రారంభించారు. ముందుగా రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆటో డ్రైవర్లతో కలిసి జ్యోతుల నవీన్ ఆటో నడుపుతూ ఆటో ర్యాలీగా మండల ఆఫీసుకి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభకు జగ్గంపేట మండల టిడిపి అధ్యక్షులు జీనుమణి బాబు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన జ్యోతుల నవీన్ ఆటో డ్రైవర్లకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించారు. అని అన్నారు తొలి ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది డ్రైవర్లకు ఆర్థిక సాయం. జరిగిందని జగ్గంపేట నియోజకవర్గంలో 1688 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరిందని ఇంకా 139 మంది అనర్హుల జాబితాలో ఉన్నారని వారికి కూడా న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని స్పెషలాఫీసర్సత్యనారాయణకు నవీన్ తెలియజేశారు.ఆటో, క్యాబ్‌, ట్యాక్సీలను సొంతంగా కలిగి ఉండి.. వాటిని నడుపుకొంటూ కుటుంబాలను పోషించుకునే డ్రైవర్లకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందించడం జరుగుతుందని నవీన్ తెలియజేశారు. ఆటో డ్రైవర్లకు అన్ని విధాల సహాయ అందించేందుకు సహాయక కేంద్రం మండల ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. ఆటో డ్రైవర్లకు అన్ని విధాల సహాయం అందించేందుకు నేనెప్పుడూ ముందుంటానని తెలియజేశారు. నియోజకవర్గం అని ఆటో డ్రైవర్ల అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వ ద్వారా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

సైకిల్ కోసం బ్యాంకుకు వెళ్లిన చిన్నారులు, బంగారు తాకట్టు పెడతామని హామీ.

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు సైకిల్ కొనేందుకు డబ్బు కావాలని స్థానిక కెనరా బ్యాంకుకు వెళ్లి లోన్ అడగడం బ్యాంకు కస్టమర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రామానికి చెందిన చిన్నారులు దేవాన్ష్, రహస్యలు తమ తల్లి సునీతతో కలిసి బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకులో డబ్బులు ఇస్తారట అని తెలుసుకుని నేరుగా బ్యాంకు మేనేజర్ వద్దకు వెళ్లి మాకు సైకిల్ కొనేందుకు డబ్బులు కావాలి అని అడిగారు. అప్పుడే ఆశ్చర్యానికి గురైన మేనేజర్, బ్యాంకులో ఏదైనా తాకట్టు పెట్టాలి మీ దగ్గర ఏముంది అని ప్రశ్నించాడు. దానికి చిన్నారులు “మా దగ్గర భూమి ఉంది… బంగారం కూడా ఉంది అని అమాయకంగా సమాధానం ఇవ్వడంతో మేనేజర్ నవ్వుతో పాటు ఆనందానికి గురయ్యాడు. వారి అమాయకపు సమాధానం విన్న సిబ్బంది, అక్కడ ఉన్న కస్టమర్లు నవ్వులు పూయించగా.. చిన్నారులను ప్రేమగా పలకరించి ఇంటికి పంపించారు.

ఆంధ్రప్రదేశ్

5-17 ఏళ్లలోపు పిల్లలకు ఉచితంగా ఏడాదిపాటు ఆధార్ అప్డేషన్.

ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ సేవను 5 నుంచి 17 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు ఏడాదిపాటు ఉచితంగా అందించను న్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం 5 ఏళ్ల లోపు పిల్లలు ఫొటోగ్రాఫ్, పేరు, పుట్టినతేదీ, లింగం, చిరునామా, జనన ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి ఆధార్ లో పేరు నమోదుచేసుకోవచ్చు. అయిదేళ్ల వయసులో బయోమెట్రిక్స్ సరిగా ఏర్పడి ఉండవన్న కారణంతో వేలిముద్రలు, కనుపాపల గుర్తులు తీసుకోరు. పిల్లలు అయిదేళ్లు నిండిన తర్వాత ఒకసారి, 15 ఏళ్లకు చేరుకున్న తర్వాత మరోసారి తప్పనిసరిగా బయోమెట్రిక్స్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఏడాదిపాటు 5-17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలందరికీ ఈ సేవలను ఉచితంగా అందించాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత రూ.125 వసూలుచేస్తారు. బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోవడంవల్ల పాఠశాలల ప్రవేశాలు, ప్రవేశ పరీక్షల రిజిస్ట్రేషన్, స్కాలర్షిప్ ప్రయోజనాలు, వివిధ పథకాల ద్వారా అందే డీబీటీలు పొంద డానికి వీలవుతుందని పేర్కొంది. అందువల్ల తల్లిదండ్రులు వెంటనే ఈ వయసు పిల్లల బయోమెట్రిక్స్ అప్ డేషన్ చేయించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.