Friday, 1 May 2026

Blog

అనకాపల్లి అల్లూరి సీతారామరాజు ఆంధ్రప్రదేశ్ విజయనగరం  విశాఖపట్నం శ్రీకాకుళం 

ఉత్తర నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం అమలు – 2,562 లబ్ధిదారులకు రూ.3.84 కోట్ల బదిలీ

విశాఖపట్నం, అక్టోబర్ 5:పేదల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి మరో కీలక ముందడుగు వేసింది. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కారణంగా ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఆటో డ్రైవర్ల సేవలో” పథకం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోంది. ఈ పథకం కింద ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏటా రూ.15,000 ఆర్థిక సాయం అందజేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది డ్రైవర్లు అర్హులుగా గుర్తించబడి, ఈ పథకానికి సుమారు రూ.436 కోట్లు వ్యయం కానున్నాయి. అర్హులైనా లబ్ధిదారుల జాబితాలో చోటు దక్కని వారి సమస్యలను రాబోయే విడతల్లో పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో శనివారం విశాఖ ఉత్తర నియోజకవర్గం మాధవధారలోని మాధవస్వామి కళ్యాణ మండపం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో, 2,562 లబ్ధిదారులకు రూ.3,84,30,000 విలువైన నగదు బదిలీ చేయడం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే & బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పీ. విష్ణుకుమార్ రాజు పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీ సామాజిక న్యాయం వైపు ముఖ్యమైన అడుగు” అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీమతి శ్యామల దీపిక, ఎంవిఐ మునీశ, ఆర్టీవో దేవి, జోనల్ కమిషనర్ రాము, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ & స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ, కార్పొరేటర్లు ఉషాశ్రీ, సారిపల్లి గోవింద్, కంపా హనూక్, ఆళ్ల లీలావతి, కామేశ్వరి, సనపల వరప్రసాద్, ఈతలపాకు సుజాత, అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామ్ రాజు, టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. లబ్ధిదారులు పథకం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి మరియు ఎమ్మెల్యే పీ. విష్ణుకుమార్ రాజు గారికి ధన్యవాదాలు తెలిపారు.

ఖమ్మం

ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఖమ్మం జిల్లా యువతీ

ఖమ్మం అక్టోబర్ (పున్నమి ప్రతి నిధి) డిల్లీలొ ప్రదానమంత్రి నరేంద్రమోది చేతుల మీదుగా ఖమ్మం జిల్లా రూరల్‌ మండలం ఆరెంపులకు చెందిన యువతి తాళ్లూరి పల్లవి అవార్డును అందుకున్నారు. ఆర్టిపిషియల్ ఇంటలీజెన్స్‌ ప్రొగ్రామింగ్‌ అసిస్టెంట్‌ విభాగంలొ ఈ అవార్డును అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కౌశల్ దీక్షాంత్ సమరోహ్‌లో ప్రధాని యువతలో స్కిల్ డెవలప్‌మెంట్, ఉద్యోగ నైపుణ్యాల్ని పెంచేందుకు ప్రధాన మంత్రి సేతు పథకాన్ని రూ. 60,000 కోట్లతో ప్రవేశపెట్టారు. దీనిలొ బాగంగానే అత్యుత్తమ నైపుణ్యం కనపరిచిన పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్దులకు అవార్డులను ప్రదానం చేశారు. దీనిలొ బాగంగానే ఆర్టిపిషియల్ ఇంటలీజెన్స్‌ విభాగంలొ ఆల్‌ ఇండియా ట్రేడ్‌ టాపర్‌ గా ఎన్నికైన తాళ్లూరి పల్లవికి ప్రదాని చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేశారు.

ఆంధ్రప్రదేశ్

బీచ్ తీర ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దాలని జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలు

విశాఖపట్నం, అక్టోబర్ 4:మహా విశాఖ నగరంలోని బీచ్ తీర ప్రాంతాన్ని పరిశుభ్రతతో అందంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, బీచ్‌లో కాలువల ద్వారా వ్యర్థాలు కలవకుండా తక్షణమే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖ వేదికగా పార్ట్నర్షిప్ సమ్మిట్, ఐఎఫ్‌ఆర్ త్వరలో జరగనున్న నేపథ్యంలో దేశ, విదేశాల నుంచి అతిథులు, పర్యాటకులు నగరానికి రానున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం, బీచ్ తీర పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం అత్యవసరమని అన్నారు. నగరంలోని ప్రధాన కాలువల ద్వారా వ్యర్థాలు బీచ్‌లో చేరుతున్నాయని గుర్తించిన కమిషనర్, వాటిని అడ్డుకునేందుకు కాలువల వద్ద ఆధునిక వలలు, స్క్రీన్‌లు ఏర్పాటు చేయాలని ప్రధాన ఇంజనీర్ పి.వి.వి. సత్యనారాయణ రాజును ఆదేశించారు. అలాగే బీచ్ రోడ్లు, ఫుట్‌పాత్‌లు పరిశుభ్రంగా ఉంచేందుకు నిత్య పర్యవేక్షణ జరపాలని, జోనల్ కమిషనర్లు పరిశుభ్రత చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. సమీక్షా సమావేశంలో అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి, ప్రధాన వైద్యాధికారి డా. ఈ.ఎన్.వి. నరేష్ కుమార్, డీటిహెచ్‌ఎం దామోదర్ రావు, పర్యవేక్షక ఇంజనీర్లు పల్లమరాజు, శ్రీనివాసరావు, జోనల్ కమిషనర్లు కనకమహాలక్ష్మి, శివప్రసాద్, మల్లయ్య నాయుడు, కార్యనిర్వాహక ఇంజనీర్లు ఏడుకొండలు, గంగాధర్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

దుర్గాదేవి నవరాత్రి పూజ మహోత్సవంలో వైఎస్సార్సీపీ నాయకుడు పాల్గొన్నారు

విశాఖపట్నం: శనివారం పంజాబ్ హోటల్ జంక్షన్‌లో శ్రీ లక్ష్మీ గణపతి దుర్గ ఆటో స్టాండ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ దుర్గాదేవి నవరాత్రి పూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మరియు 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ ముఖ్య అతిథిగా పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి దుర్గ ఆటో స్టాండ్ కమిటీ సభ్యులు, ఆటో డ్రైవర్లు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

అంతర్జాతీయ విద్యార్థులకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఓరియంటేషన్ కార్యక్రమం

విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వివిధ దేశాల నుంచి ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం ఇంజినీరింగ్ కళాశాల గౌతమ్ బుద్ధ-బి.ఆర్.అంబేద్కర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగా ప్రవేశం పొందిన సుమారు 300 మంది అంతర్జాతీయ విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ICCR బెంగళూరు జోనల్ డైరెక్టర్ శ్రీ పరదీప్ కుమార్ మాట్లాడుతూ, భారతదేశం అనేక దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూ, నాణ్యమైన విద్యను విదేశీ విద్యార్థులకు అందించడంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి వినియోగించాలంటూ సూచించారు. అలాగే, స్కాలర్షిప్ నియమాలు మరియు ఇతర వివరాలను విద్యార్థులకు వివరించారు. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ మరియు అంతర్జాతీయ వ్యవహారాల ఇన్‌చార్జి డీన్ ప్రొఫెసర్ కె. రాంబాబు మాట్లాడుతూ, విద్యార్థులు తరగతి గదులకు మాత్రమే పరిమితం కాకుండా స్టార్టప్‌లు, ఇంక్యుబేషన్ వంటి రంగాలలో అవకాశాలను అన్వేషించాలన్నారు. శతాబ్ద చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం, నాణ్యమైన విద్యా విలువలతో ముందుకు సాగుతోందన్నారు. అంతర్జాతీయ వ్యవహారాల అసోసియేట్ డీన్ మరియు విద్యార్థి వసతి గృహాల చీఫ్ వార్డెన్ ఆచార్య ఎన్.ఎం. యుగంధర్ మాట్లాడుతూ, విద్యార్థులు స్నేహపూర్వక వాతావరణంలో కలిసిమెలిసి ఉండాలని, పరస్పర గౌరవ భావన కలిగి ఉండాలని సూచించారు. వర్సిటీ పరంగా అవసరమైన అన్ని సహకారాన్ని అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఆచార్యులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

గీతం వైద్య కళాశాలలో వైట్‌కోట్‌ ఉత్సవం

విశాఖపట్నం , అక్టోబర్ వైద్య వృత్తిలో రాణించాలంటే అంకితభావం, సామాజిక బాధ్యతతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచించారు. గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంకు అనుబంధంగా ఉన్న గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌ (జిమ్‌సర్‌) లో 2025 సంవత్సరానికి ఎంబిబిఎస్ నూతన విద్యార్థులకు వైట్‌కోట్ ధారణ ఉత్సవం శనివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్‌.టి.ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ వి. రాధిక రెడ్డి మాట్లాడుతూ, వైద్యరంగం వేగంగా మారుతున్నందున విద్యార్థులు పుస్తకాలతో పాటు రోగిని, రోగలక్షణాలను అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి అన్నారు. మానవతా విలువలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నిరంతర సాధనతో వైద్య వృత్తిలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని సూచించారు. ప్రముఖ ఆంకాలజీ నిపుణుడు డాక్టర్‌ డి. రఘునాధరావు మాట్లాడుతూ, రానున్న రోజుల్లో కృత్రిమ మేధ ( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వైద్యరంగంలో కీలక భూమిక వహించనున్నప్పటికీ, రోగులకు ధైర్యం చెప్పే మానవ సంబంధాలు, వైద్య నైపుణ్యంకి ప్రత్యామ్నాయం లేదన్నారు. గీతం ప్రో వైస్ ఛాన్స్‌లర్‌ ప్రొ. వై. గౌతమ్‌రావు మాట్లాడుతూ, ప్రతిభ స్కాలర్‌షిప్‌లతో అధిక శాతం మంది విద్యార్థులు ప్రవేశం పొందారని, వైద్య వృత్తిలో విలువలు, బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిమ్‌సర్ ప్రో వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ బి. గీతాంజలి వైద్య విద్యార్థులు తెల్లకోటు ప్రతీకాత్మక ప్రాధాన్యతను అర్థం చేసుకొని వృత్తిలో ఎదగాలని ఆకాంక్షించారు. జిమ్‌సర్ డీన్‌ డాక్టర్‌ ఎస్‌.పి. రావు మాట్లాడుతూ, ప్రస్తుత విద్యా సంవత్సరంలో దేశంలోని 22 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ప్రవేశం పొందారని తెలిపారు. నైపుణ్యాల అభివృద్ధి కోసం స్కిల్ ల్యాబ్ ప్రారంభించామని, గీతం ఆసుపత్రిలో 15 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 400 మంది వైద్యులు, 500 మంది నర్సులు నిరంతరం సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ఏటా సుమారు 4 లక్షల మంది రోగులు ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాల నుండి గీతం ఆసుపత్రి వైద్య సేవలు పొందుతున్నారని తెలిపారు. గీతం పరిధిలోని 15 వేల మంది ప్రజలను వైద్య విద్యార్థులు దత్తత తీసుకొని వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గీతం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్‌ వి.వి.ఎల్. నరసింహరావు విద్యార్థులతో వైద్య వృత్తి పట్ల నిబద్ధత, విలువలతో సేవ చేయాలనే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా నూతన ఎంబిబిఎస్ విద్యార్థులకు తెల్లకోటులు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో నూతన విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తిరుపతి

శివయ్య సేవకు విచ్చేసిన సినీ హీరో సుమన్

శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శించుకొనుటకు సినీ హీరో సుమన్ శనివారం రాత్రి శ్రీకాళహస్తికి విచ్చేశారు.వారికి మాజీ ఆర్టీసీ వైస్ చైర్మన్,మాజీ ఆప్కో డైరెక్టర్ మిద్దిల హరి స్వాగతం పలికారు.ఆదివారం ఆయన శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మునిరత్నం,కరుణాకర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

నిర్మల్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు

నిర్మల్ అక్టోబర్ 05 (పున్నమి ప్రతినిధి) నిర్మల్ జిల్లా: నిర్మల్ లోని ప్రియదర్శిని నగర్, సాగర్ కాలనీ లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ వేడుకల్లో చివరిరోజైన సద్దుల బతుకమ్మ వేడుకలు శనివారం రోజు మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా మహిళలు, యువతులు అంతా ఒక్కచోట చేరి ఆడిపాడుతూ సంబరాలు చేసుకున్నారు. మహిళలంతా తీరొక్క పువ్వులతో అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చారు. గౌరమ్మను పూజిస్తూ సంబురాలు జరుపుకొని అనంతరం బతుకమ్మను నిమజ్జనం చేశారు.

సత్యసాయి

తుమ్మల కొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రెండో శనివారం ప్రత్యేక పూజలు.

అమడగూరు మండలం,తుమ్మల గ్రామం కొత్తపేట సమీపంలోని తుమ్మల కొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక్కపొద్దుల సందర్భంగా రెండవ శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సుమారు 500 మంది భక్తులు పాల్గొని స్వామివారి దర్శనంతో కృతార్థులయ్యారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చింతా శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…ఈ ప్రాంతంలోని అనేకమంది భక్తులు తిరుమలకు వెళ్లలేని పరిస్థితుల్లో తుమ్మల కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి తమ కోరికలు తీర్చించుకుంటున్నారు.ముఖ్యంగా కల్యాణయోగం మరియు సంతానయోగం కోసం స్వామివారిని దర్శించుకుని మొక్కు చెల్లిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ఉంది.కుటుంబ సమేతంగా భక్తులు వచ్చి తలనీలాలు సమర్పించడం ఇక్కడి ప్రత్యేకత అని తెలిపారు.ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణను కొట్టు కృష్ణమూర్తి,కుట్టు వెంకటరమణ,కొట్టు వేమననారాయణ,కొట్టు అమర్నాథ్,కొట్టు రామాంజులు కుటుంబ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేశారు.స్వామివారి కృప ఫలితంగా ఇది సాధ్యమైందని కృతజ్ఞతా భావంతో అన్నప్రసాదం నిర్వహించినట్లు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ డైరెక్టర్ భూక్యా కాలే నాయక్,జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొట్టు అశ్వర్థ కుమార్,నూర్ మొహమ్మద్ తుమ్మలకొండను సందర్శించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గోపిశెట్టి శ్రీనివాసులు,బిల్లూరు మహేశ్వర్ రెడ్డి,రామనేని రామచంద్ర,సరళమ్మ,శ్రీనివాస్ రెడ్డి,ఆదిమూర్తి,రామ్మోహన్,ఈశ్వరయ్య,పూజారి రమణ,తదితరులు పాల్గొన్నారు.

సత్యసాయి

పలు ఆలయాల్లో ఘనంగా పూజలు.

అమడగూరు మండల కేంద్రంలోని పలు ఆలయాల్లో ఘనంగా పూజలు నిర్వహించారు.మండలంలోని పంచముఖ ఆంజనేయ స్వామి,అభయ ఆంజనేయ స్వామి,ఏ.కొత్తపల్లి గ్రామంలోని బొబ్బిలి కోట శ్రీ కోదండ రామాలయం,ఆంజనేయ స్వామి దేవాలయాల్లో భక్తాదులు ఘనంగా పూజలు చేపట్టారు.ముందుగా అర్చకులు స్వామివారికి అభిషేకాలు,ఆకు పూజలు,వివిధ రకాల పుష్పాలతో అర్చనలు చేశారు.అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.అలాగే కొత్తపల్లి లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో దొడ్డప్ప కుటుంబ సభ్యులు స్వామివారికి ఆకుపూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పూజించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.