Friday, 1 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

జోగేష్ కవిత్వంలో సౌందర్యదృష్టి,సామాజిక వాస్తవికత

అమలాపురం, అక్టోబర్ 4 (పున్నమి ప్రతినిధి) : స్వీయానుభూతితో, సహానుభూతితో బడుగు భాస్కర్ జోగేష్ రాసిన కవిత్వంలో సౌందర్యదృష్టికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో ప్రాపంచిక వాస్తవికత పట్ల ఎరుకతోనే ఉన్నారని కవి, రచయిత నామాడి శ్రీధర్ అన్నారు. కవి తన బాల్య, యౌవనకాలాల జ్ఞాపకాలతో పాటు సామాజిక ఘటనలు, రాజకీయ పరిణామాలను కవిత్వీకరించారని ఆయన ప్రశంసించారు. అమలాపురం బార్ అసోసియేషన్ భవనంలో శనివారం ఉదయం జరిగిన బడుగు భాస్కర్ జోగేష్ కవితాసంపుటి ‘లిదియా పూలు సలామీ అఖాతం’ ఆవిష్కరణ సభలో ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించి, సభకు అధ్యక్షత వహించారు. అమలాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు, న్యాయవాది సి.హెచ్.అజయ్ కుమార్ సభలో గౌరవ అధ్యక్షులుగా పాల్గొన్నారు. కవి మాతృమూర్తి ఈశ్వరమ్మ తొలి ప్రతి స్వీకరించారు. ప్రధాన వక్త, కవి , సాహిత్య విమర్శకులు సుంకర గోపాల్ మాట్లాడుతూ ‘లిదియా పూలు సలామీ అఖాతం’ కవిత్వ సంపుటిలో అనుభూతి భావుకత, సామాజిక పరిణామాల చిత్రీకరణ ఉంది. జీవితం పట్ల ఒక తాత్విక తార్కిక దృక్పథం ఉంది. గాడత స్పష్టత ఉన్న అరుదైన కవి జోగేష్ అని కొనిఆడారు. వయూద్వేగాల ప్రకంపనను భాషగా మార్చడంలో కవి విజయవంతం అయ్యారని వివరించారు. మరొక వక్త,కవి,రచయిత అవధానుల మణిబాబు మాట్లాడుతూ జోగేష్ ప్రతి కవితా ఆవరణలుగా విస్తరించి ఉంటుందని అన్నారు. పైకి ప్రస్ఫుటంగా కనిపించే భావం మాత్రమే కాక అంతర్లీనంగా చెప్పిన సంగతులకోసం ఏకాగ్రతతో చదవాల్సిన కవిత్వం ఇదని తెలిపారు. తనదైన శైలి,శిల్పం, శబ్దాలతో ఎంచుకున్న అంశాన్ని అద్భుత కవితగా మలచే ఇంద్రజాలం ఈ కవిలో ఉందని ప్రశంసించారు. చదివిన తర్వాత మననం చేసుకుంటే కవితలలో సన్నివేశం పాఠకులకు దృశ్యమానం అవుతుందని వివరించారు. ప్రతి కవితలో ఆయన విస్త్రృత అధ్యయనం కనిపిస్తుందని వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు, రచయితలు మధునాపంతుల సత్యనారాయణ మూర్తి, దాట్ల దేవదానం రాజు, కొండూరి రామరాజు, ఎమ్మెస్ సూర్యనారాయణ, మిరప మహేష్, మోకా రత్నరాజు తదితరులు ఆత్మీయవచనాలు చెప్పారు. కవి బడుగు భాస్కర్ జోగేష్ తన కవిత్వనేపథ్యాన్ని వివరించారు. ఈ సభలో నుంచే నాగ సత్యనారాయణ,,మధునాపంతుల చలపతి, ముక్కామల చక్రధర్,చెల్లి రవి,గౌరవ్ ,ముత్యాల శ్రీనివాస్, ప్రముఖ న్యాయవాదులు డి.బి.లోక్,ఎండి.అజామ్ అడపా ప్రసాద్, నంబూరి మూర్తి,,కుడిపూడి అశోక్,వనుము చంద్రశేఖర్, నందెపు చిన్న,నందిక శ్రీనివాస్ డి.చిరంజీవి, సుధాకర్ సాహిత్యకారులు తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మారో విప్లవాత్మక మైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం (పున్నమి ప్రతినిధి)

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మారో విప్లవాత్మక మైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం (పున్నమి ప్రతినిధి) రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మారో విప్లవాత్మక మైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ‘ అటో డ్రైవర్లు సేవలో ‘ ఆటాహసంగా ప్రారంబించిది ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ నుంచి కుర్ని కళ్యాణ మండపం వరకు జరిగిన భారీ ర్యాలీలో అటో డ్రైవర్లు మరియు కూటమి నాయకు పాల్గొనారు ఈ సందర్భంగా కుర్ని కళ్యాణ మండపం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ . సిఎం నారా చంద్రబాబు నాయుడు . మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ . యువనేత నారా లోకేష్ గార్ల చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తొలి ఏడాది 2.90.669 మంది డ్రైవర్ల ఖాతాలో 15000 చొప్పున రూ.439 కోట్లు ప్రభుత్వం జమ చేసింది ఎమ్మిగనూరు నియోజకవర్గం లో 1.206 మందికి రూ.1.81 కోట్లు జమ అయ్యాయి ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు కూటమిపాటి నాయకులు ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు

ఎలూరు

చౌక బియ్యం స్వాధీనం న్యూస్టుడే:

చాట్రాయి, సి.గుడిపాడులో నిల్వ చేసిన పీడీఎస్ బియ్యంను చనుబండ మీదుగా రవాణా చేస్తుండగా గురువారం రాత్రి దాడి చేసి 40 క్వింటాళ్ల బియ్యం, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పౌర సరఫరాల డీటీ వెంకటేశ్వరరావు, ఏఎస్ఐ గఫార్ కథనం మేరకు.. కోట సురేశ్బాబు(చాట్రాయి), దనికొండ గోపిరాజు(సి. గుడిపాడు)లు బియాన్ని లోడు చేసుకుని చను బండ మీదుగా తిరువూరు తరలిస్తుండగా చేసిన దాడి చేశారు. బియ్యం రవాణాపై 6-ఏ కేసు నమోదు చేశారు.

తూర్పు గోదావరి

దీపావళి పండుగ వస్తున్న నేపథ్యంలో బాణసంచా ప్రేలుళ్ళు జరగకుండా ముందస్తు చర్యలు.

దీపావళి పండుగ వస్తున్న నేపథ్యంలో బాణసంచా ప్రేలుళ్ళు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా అంతట దీపావళి మందు గుండు సామాగ్రి స్టోరేజ్ గోడౌన్లు మరియు అమ్మకాలు జరిగే ప్రదేశాలను జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా పోలీస్ వారు. ఆకస్మిక తనిఖీలు చేసి, ప్రభుత్వ నిబంధనల ప్రకారము భద్రత చర్యలు తీసుకుంటున్నారా? లేదా అని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భముగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దీపావళి మందుగుండు సామగ్రి తయారీ, నిల్వ కేంద్రాలు, దుకాణాల వద్ద తీసుకోవలసిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను నిర్దేశించిందని, దానికి అనుగుణంగా మందుగుండు సామగ్రి తయారీ, నిల్వ గోడౌన్లు, దుకాణ దారులు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా రహస్యముగా మందు గుండు సామాగ్రి తయారు చేస్తున్నట్లు గాని, నిల్వ ఉంచినట్లు గాని తెలిసిన యెడల, డయల్ 112 కాల్ ద్వారా జిల్లా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చిత్రకళ పోటీలో రాష్ట్రస్థాయిలో మెరిసిన చేజర్ల విద్యార్థులు

అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి) క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ 10వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన స్కూల్ లెవెల్ పోస్టల్ చిత్రకళా పోటీలో చేజర్ల జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థినిలు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారు. డ్రాయింగ్ మాస్టర్ తోట కిషోర్ కుమార్ శిక్షణలో 9వ తరగతి విద్యార్థిని డి వి. కామాక్షి మొదటి స్థానం, ఇషాని రెండవ స్థానం, 7వ తరగతి విద్యార్థిని ఎమ్ డి. షహనాజ్ ఫాతిమా మూడవ స్థానం సాధించారు. ఈ విజయాలను పురస్కరించుకొని టీచర్ కిషోర్ కుమార్‌కు “గ్రేట్ క్రియేటివ్ టీచర్ అవార్డు” లభించింది. స్కూల్ హెడ్మాస్టర్, తోటి ఉపాధ్యాయులు ఆయనను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

E-పేపర్

*కూటమి హామీల అమలతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు :-ఎమ్మెల్యే పల్లా*

*ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో ఆటో నడిపి డ్రైవర్లను ఉత్సాహపరచిన తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా* గాజువాక అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం గాజువాక శ్రీకృష్ణ దేవరాయ కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే పల్లా ఆటో కార్మికులతో కలిసి స్వయంగా ఆటో నడుపుతూ వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు,వారి కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను వివరించానని గుర్తు చేశారు.ఆ ప్రతిఫలం నేడు కనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు.ఆటో సోదరులకు ఏడాదికి 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు,డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఆటో,ట్యాక్సీ,మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లను గుర్తించి మొత్తం 2,90,234 మందికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం 435.35 కోట్ల నిధులు కేటాయించడం విశేషం అని .గత జగన్ రెడ్డి పాలనలో ఆటో డ్రైవర్లు తీవ్ర నిర్లక్ష్యానికి,అవమానానికి గురయ్యారని,ఇంధన ధరల పెరుగుదల, పన్నుల భారాలు, జరిమానాల ఒత్తిడి, పోలీసుల వేధింపులు ఇవన్నీ కలసి వారి జీవనోపాధిని సంక్షోభంలోకి నెట్టాయని ఆరోపించారు.అనంతరం ఆటో డ్రైవర్లకు చెక్కు అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు,బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు,కార్పొరేటర్లు రాజాన రామారావు,రౌతు శ్రీనివాస్,నేతలు గడసాల అప్పారావు,పుచ్చా విజయ్ కుమార్,కరణం కనకారావు, రౌతు గోవింద్,ప్రాంతీయ రవాణా శాఖ అధికారి జయప్రకాష్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సత్యం నాయుడు,సౌత్ ఏసీపీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

జాతీయ అంతర్జాతీయ

కాష్ ఆన్ డెలివరీ పై అదనపు ఛార్జీలు! కేంద్రం సీరియస్‌గా తీసుకుంది

ఆన్‌లైన్‌ షాపింగ్ పెరుగుతున్న నేపథ్యంలో చాలానే ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు కాష్‌ ఆన్ డెలివరీ (CoD) ఆప్షన్ అందిస్తున్నాయి. అయితే, కొందరు CoD మీద అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారనే వినియోగదారుల ఫిర్యాదులు చేరుతున్నాయి. దీనిని కేంద్రం సీరియస్‌గా తీసుకుని వెంటనే దర్యాప్తు ప్రారంభించింది. ముఖ్యంగా “డార్క్ ప్యాటర్న్స్” ద్వారా వినియోగదారులను మోసిపించే ప్రవర్తనలను పరిశీలిస్తున్నారు. కేంద్రం సమగ్రంగా విచారించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటుంది. దీనివల్ల వినియోగదారుల హక్కులు రక్షించబడతాయి మరియు ఆన్‌లైన్ షాపింగ్ పరిసరాలు న్యాయసహితం, పారదర్శకంగా కొనసాగుతాయి.

జాతీయ అంతర్జాతీయ

తొలి టెస్టు.. ఇన్నింగ్స్‌ తేడాతో భారత్‌ విజయం

అహ్మదాబాద్‌లో జరిగిన వెస్టిండీస్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు తమ అత్యుత్తమ ప్రదర్శనతో సత్తా చాటారు, ఫలితంగా భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయాన్ని పొందింది. టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 162 పరుగులకే ఆలౌటైనప్పటి తర్వాత, భారత్ సరిగా 448/5 పరుగులు చేసి ప్రతిస్పందన ఇచ్చింది. భారత్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ వ్యవస్థా ప్రావీణ్యం, స్థిరత్వం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా, జట్టు ఆహ్లాదకరంగా పరుగులు సంపాదించడం ద్వారా విరామ సమయంలో దృఢమైన ఆధారాన్ని ఏర్పరిచింది. రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 146 పరుగులకే ఆలౌటయి, భారత్ 140 పరుగుల తేడాతో గెలిచింది. ఈ ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ బ్యాటింగ్‌లో అలిక్ 38, జస్టిన్ 25 పరుగులు సాధించారు. భారత బౌలర్ల ప్రదర్శన అత్యద్భుతంగా ఉండి జడేజా 4, సిరాజ్ 3, కుల్‌దీప్ యాదవ్ 2, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీసారు. ముఖ్యంగా జడేజా బౌలింగ్ ఆడకలో నిరంతర ఒత్తిడి చూపించి ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌లను బలహీనత చూపించేలా చేశారు. భారత బౌలింగ్ దళం ఈ విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించింది. వేగవంతమైన బౌలింగ్, స్థిరమైన స్పిన్నింగ్, మైదానాన్ని సరిగ్గా ఉపయోగించడం ద్వారా ప్రత్యర్థి జట్టును నియంత్రించారు. ఈ ప్రదర్శనలో కొత్త బౌలర్లు మరియు సీనియర్ సభ్యుల సమన్వయం స్పష్టంగా కనపడింది. ఈ ఘన విజయం భారత జట్టు మిశ్రమత, ధైర్యం, స్థిరత్వాన్ని మరోసారి ప్రదర్శించింది. బౌలింగ్ దళం దృఢత, ప్రావీణ్యం, సమూహ ప్రయత్నాల విలువను చూపిస్తూ, వేదికపై ఆటగాళ్ల ఉత్సాహాన్ని, జట్టు సామర్థ్యాన్ని నిరూపించింది. ఈ విజయంతో భారత జట్టు సీరీస్‌లో ముందడుగు వేసింది, ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని పెంచింది.

తిరుపతి

చిత్తూరు జిల్లా దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహ దహనంపై భూమన ఆధ్వర్యంలో వైసిపి నిరసన*

*చిత్తూరు జిల్లా దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహ దహనంపై భూమన ఆధ్వర్యంలో వైసిపి నిరసన* *ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి* చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహ దహన ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహ దహనం వంటి దారుణ సంఘటనను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటూ పచ్చ పత్రికల మద్దతుతో తెలుగుదేశం పార్టీ నాయకులు దళిత సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఫైబర్ విగ్రహాన్ని కాంస్య విగ్రహంగా ప్రచారం చేయడం దురుద్దేశపూరితమని ఆయన మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేయడం దళితుల ఆత్మగౌరవంపై దాడి అని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలు సమాజంలో అలజడులు సృష్టించే ప్రయత్నమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ ఘటనపై ఎంపీ మద్దిల గురుమూర్తి జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయగా, కమిషన్ వేగంగా స్పందించి చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేసి విచారణ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఇది దళితుల ఆత్మగౌరవ రక్షణకు సానుకూల పరిణామమని ఎంపీ పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ ఘటనను నిర్లక్ష్యంగా తీసుకోవడం దురదృష్టకరమని ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహ దహనం జరిగిన మూడు రోజులు గడిచినా నిందితులను పోలీసులు గుర్తించకపోవడం ప్రజల్లో తీవ్ర అసహనం కలిగిస్తోందని పేర్కొన్నారు. దళితుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి ఘటనలను సహించబోమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, గంగాధర నెల్లూరు సమన్వయకర్త కృపాలక్ష్మి, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

“మానసిక ఆరోగ్యం శ్రేయస్సు” వారోత్సవాలు నిర్వహిస్తున్న : లయన్స్ క్లబ్

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) ప్రతి ఒక్కరు మానసిక ఆరోగ్యం పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ నెల 4 – 12 (అక్టోబర్ 4-12) వరకు “మానసిక ఆరోగ్యం శ్రేయస్సు “పై లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ వారు నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలిని ఆమె ప్రారంభించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.