Sunday, 3 May 2026

Blog

విద్య విజ్ఞానం

నేడు ఆకాశం లో అద్భుతం.

పున్నమి ప్రతి నిధి నేడు, రేపు ఆకాశం లో అద్భుతం జరగనుంది. చంద్రుడు భూమి అతి చేరువ లోకి రానుండటం తో సుపర్ మూన్ గా కనిపించబోతున్నాడు. సాధారణముగా పౌర్ణమి రోజు కంటే అతి పెద్దగా ప్రకాశవంత ముగా కనిపించ బోతున్నాడు.దీంతో 14 శాతం పెద్దగా 30శాతం ప్రకాశ వంతముగా కనిపించనున్నాడు. ఇది సంవత్సరం లో చివరి ట్రైమాసికం చివరి రోజుల్లో లో కనిపించేసూపర్ మూన్ కావడం తో హార్వెస్ట్ మూన్ అంటారు.

ఆంధ్రప్రదేశ్

మద్యం పై దశల వారీగా ఉద్యమం సిపిఎం

దేవరాపల్లి, మద్యం బెల్టుషాపుల పై దశలవారీగా ఉద్యమం చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి బిటి దోర పేర్కొన్నారు ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో సిపిఎం విస్తృత స్థాయి సమావేశం యం,ఎర్రు నాయుడు అద్యక్షతన జరిగింది అనంతరం వారు మాట్లాడారు ప్రభుత్వ నిబంధన లకు విరుద్ధంగా మద్యం వ్యాపారులు బరి తెగింపుకు పూను కుంటున్నారని తెలిపారు మండలంలోని ప్రతి గ్రామాలోను విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపులు నిర్వహణ చేస్తు పేదలు కష్టాన్ని దోసు కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు,ప్రభుత్వ కేటాయించిన లైసెన్స్ షాపులకు,అనుబంధంగా గ్రామాల్లో మద్యం దుకాల యజమానులు చిన్న చిన్న గ్రామాల్లోను కిల్లి కోట్టులోను పాన్ షాపులు దాబాల్లోను టి కోట్టుల్లో సైతం విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని ఇది అత్యంత దుర్మార్గ మన్నారు చిన్న పిల్లలు మహిళలు నిత్యం తిరుతున్న రోడ్లు పక్కన బెల్ట్ షాపులు నిర్వహించడం చట్టాన్ని విశ్మరించడ మేనని తెలిపారు గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించడం వల్ల ప్రభుత్వం కేటాయించిన యం ఆర్పి ధరల కంటే బెల్ట్ షాపులో ఒక బాటిల్ దగ్గర అదనంగా 50 నుండి 100 రూపాయలు అదనంగా వసూళ్లు చేస్తున్నారని తెలిపారు.గ్రామాల్లో మద్యం విక్రయించ డానికి అనధికారిక వేలం పాటలు లక్షల్లో నిర్వహించి బెల్టు షాపులు యజమానులు సొమ్ము చేసు కుంటున్నారని తెలిపారు అక్రమ అమ్మ కాలు జరగడంతో సామాన్యులు నిరు పేదలు కూలీలు జేబులు ఖాళీ అవు తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామాల్లో దర్జాగా మద్యం విక్రయాలు నిర్వహించడం వల్ల మద్యం పట్ల ఎక్కువ శాతం యువత మద్యానికి బానిసలు అవుతున్నారని తెలిపారు నిభందనులు ప్రకారం గ్రామానికి కనీసం 200 మీటర్లు దూరంలో మద్యం షాపులు పెట్టాలని కాని ఇది ఎక్కడ అమలు కావడం లెదన్నారు బడి గుడి ఆర్ టి సి కాంప్లెక్స్ వంటి ప్రదేశాల్లో పెట్ట రాదని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం షాపులు నిర్వహించినప్పుడు కనీసం కీలోమీటారు దూరంలో షాపులు నిర్వాహన జరిగేదని ప్రస్తుతం నిబంధనలకు పాతర వేసారని,తెలిపారు గ్రామాల్లో అయితే,తెల్లవారుజాము నుంచే మద్యం బెల్ట్ షాపులు తెరిసి ఉంచుతున్నారని తెలిపారు, బెల్ట్ షాపులు వద్ద పదుల సంఖ్యలో మందు బాబులు బార్లు తీరుతున్నారని అన్నారు.ఎంతో మంది పేద కుటుంబాలు వీటి ప్రభావంతో రోడ్డున పడు తున్నారని తెలిపారు మరి కొన్ని గ్రామాల్లో మద్యం వ్యాపారం వలన మహిళలు మైనర్ బాలికలపై హత్యచారాలు పెరిగి పోతున్నాయని దీన్ని నివారించ వలసిన ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకొకుండా నిమ్మకు నీరుత్తెనట్లు వ్యహరిస్తున్నారనివిమర్శించారు ఇప్పటికైనా అక్రమ బెల్టు షాపులపై చర్యలు తీవాలని లైసెన్సులు లేని దాబాల్లో మద్యం అమ్మకాలుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు లేదంటే దశలవారీగా పెద్ద ఎత్తున అందోన చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బి నాగేశ్వరరావు డి,శంకర్ సిహెచ్ దేముడు జె ఈశ్వరరావు వి దోంగబాబుతో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి

ఖమ్మం

ముగిసిన దసరా సెలవులు.. నేటి నుండి పునః ప్రారంభం అయినా విద్యా సంస్థలు

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దసరా సెలవులు నిన్నటి తో ముగిసాయి.దీంతో సోమవారం నుండి ఖమ్మం నగరము తో పాటుగా జిల్లా లోని అన్ని ప్రభుత్వ మరియు ప్రవేటు విద్యాసంస్థలు ప్రారంభం ఐయ్యాయి. సుమారు 15 రోజులు పాటు సెలవులు ఎంజాయ్ చేసిన విద్యార్థిని, విద్యార్థులు కాలేజీలకి, పాఠశాల లకి వెళ్లారు.

భద్రాద్రి కొత్తగూడెం

విద్యానగర్ కాలనీ ఎస్బిఐ బ్యాంక్ లో యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఏ.జి.యం. సత్యనారాయణ చేతులమీదుగా పది లక్షలు చెక్ అందించారు*

* *ప్రజలందరూ కూడా ముందు జాగ్రత్త తో ఇన్సూరెన్స్ చేయించుకోండి ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ చందూలాల్* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ ఎస్బిఐ బ్యాంక్ నందు విద్యానగర్ కాలనీ కి చెందిన దేశభోయిన శ్రీనివాస్ స్కూల్ బస్ క్లీనర్ గా పనిచేస్తున్నారు మూడు నెలల క్రిందట విద్యానగర్ కాలనీ ఎస్బిఐ బ్యాంక్ లో ఎస్బిఐ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 500రూపాయలు చేశారు (ఒక సంవత్సరం ఇన్సూరెన్స్ 500 కట్టాలి) అనుకోకుండా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది ఈ యొక్క ఇన్సూరెన్స్ కి శ్రీనివాస్ భార్య రాజకుమారి నామిని గా ఉంది,రాజకుమారి బ్యాంక్ మేనేజర్ నీ సంప్రదించగా ఇన్సూరెన్స్ కవరేజ్ ఏజియం సత్యనారాయణ చేతుల మీదిగా పది లక్షల చెక్ రాజకుమారి కి అందించారు ఈ కార్యక్రమములో ఏ.జి.యం సత్యనారాయణ బ్యాంక్ మేనేజర్ చందులాల్ మాట్లాడుతూ ఎస్బిఐ బ్యాంక్ నందు అత్యుత్తమ ఇన్సూరెన్స్ కవరేజులు అందిస్తుంది ప్రజలు ఆదరించండి ఏ టైమ్ లో ఏమి జరుగుతుంది తెలియదు ముందు జాగ్రత్త తో చేయించుకుంటే మీ కుటుంబానికి ఉపయోగపడతాయని బ్యాంక్ నందు ఇన్సూరెన్స్, పాలసీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు *ఈ కార్యక్రమములో ఫీల్డ్ ఆఫీసర్ తిరుమలేశ్,క్యాష్ ఆఫీసర్ ఇందిరా,అసోసియేట్ కోటేశ్వరి,మరియు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు*

తూర్పు గోదావరి

తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం లోని శార్వాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ప్రజాసంకల్ప వేదిక తూర్పు గోదావరి జిల్లా రివ్యూ మీటింగ్

గొపాలపురం నియోజకవర్గం పున్నమి న్యూస్✍️రెడ్డిసత్యసుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083 తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం లోని శార్వాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ప్రజాసంకల్ప వేదిక తూర్పు గోదావరి జిల్లా రివ్యూ మీటింగ్ జిల్లా ఇంఛార్జి ఎస్ ఎమ్ భాషా గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, ఈ మీటింగులో ఆర్టీఐ కార్యకర్తలు నిర్వహించవలసిన విషయాల గురించి మరియు సంస్థ ఆశయాలను ఆచరణలో పెట్టడానికి చెయ్యవలసిన కర్తవ్యాలు గురించి చర్చించడం జరిగింది, మరియు స్థానికులకు ఆర్టీఐ చట్టం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మోటివేషనల్ స్పీకర్ రాబర్ట్ రవిచంద్ర గారిని గెస్ట్ గా పిలవడం జరిగింది, ఆయన సమావేశాన్ని ఉద్దేశించి అనేక విషయాలు వివరిoచారు. ఈ కార్యక్రమానికి psv ఆర్టీఐ కమిటీ తూర్పుగోదావరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంటు కోదాటి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ యాకూబ్ గారు, వైస్ ప్రెసిడెంట్2 ముల్లా శేఖర్ గారు, మరియు జిల్లా కమిటీ అడ్వైజరు వడ్డి నరేష్ గారూ, అడ్వైజరు కార్యక్రమం నిర్వాహక కార్యదర్శి రెడ్డి సత్య సుబ్రహ్మణ్య శర్మ గారు, మరియు సంస్థ సభ్యులు, సుమారు ఇరవై అయిదు మంది సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసారు, కార్యక్రమం లో కొంతమందికి ఐడి కార్డు లు అపాయింట్ మెంట్ లెటర్స్, స్టిక్కర్లు ప్రదానం చెయ్యడం జరిగింది

తిరుపతి

ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా పేద ప్రజలకు పార్టీలకు అతీయుతంగా సహాయం చేస్తున్న ఎమ్మెల్యే బొజ్జల

శ్రీకాళహస్తి రూరల్ లో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధితో ఆర్థిక సాయం కొరకు అభ్యర్థించిన వారి అభ్యర్థనను మన్నించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపించిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ స్వయంగా లబ్ధిదారుల ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పొందిన 14 మంది కి గాను 9,04,857 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బృందమ్మ మాట్లాడుతూ సిఎంఆర్ఎఫ్ ద్వారా నిర్భాగ్యులకు సహాయం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుంటారన్నారు.ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అత్యధికంగా సహాయం చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారన్నారు.

జోగులాంబ గద్వాల

ఏఐసిసి ఇంచార్జ్ శ్రీ మీనాక్షి నటరాజని కలిసి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు

*ఏఐసిసి ఇంచార్జ్ శ్రీ మీనాక్షి నటరాజన్ గారిని నేడు మర్యాదపూర్వకంగా కలిసి* *రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో* *పార్టీ బలోపేతానికి కృషి చేసిన యువజన కాంగ్రెస్ నాయకులను గుర్తించి సీట్లను కేటాయించాలని కోరిన* *తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ జక్కిడి శివ చరణ్ రెడ్డి గారు…*

తిరుపతి

ఉన్నం వారి మంగళ స్నానం వేడుక లో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు,తొట్టంబేడు మండల ఎంపీపీ ఉన్నం నిర్మలమ్మల కుమారుడు ఉన్నం చెంచు చరణ్ సాయి పంచకట్టు వేడుక సందర్భంగా మంగళ స్నానాలు మరియు నలుగు కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి,శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి,దేవస్థాన మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై,ఉన్నం చెంచు చరణ్ సాయి ఆశీర్వదించారు.ఈ వేడుకలో పార్టీ నాయకులు,కార్యకర్తలు,కుటుంబ సభ్యులు,బంధు మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించారు.

తిరుపతి

ఘనంగా గురుదాస్ కామత్ జన్మదిన వేడుకలు

శ్రీకాళహస్తి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం స్వర్గీయ మాజీ కేంద్రమంత్రి గురుదాస్ కామత్ జి జన్మదిన వేడుకలను తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ షేక్ కరీముల్లా ఆధ్వర్యంలో ఘనముగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా,ఆల్ ఇండియా సోనియా గాంధీ విచార్ మంచ్ ఆంధ్ర రాష్ట్ర చైర్మన్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ అర్జున గురుమూర్తి,కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఓబీసీ సెక్రెటరీ భాస్కరరావు యాదవ్, తిరుపతి జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ నిత్యానందం ,తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమాశంకర్ విచ్చేశారు. అనంతరం గురుదాస్ కామత్ జీ చిత్రపటానికి పూల మాలలు,వేసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాళహస్తి నియోజకవర్గం మైనార్టీ సెల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

అంతా నేను చూసుకుంటాను అధికారులకు చైర్మన్ చిట్టిబాబు హామీ

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 05 (పున్నమి న్యూస్) తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట అన్న చందంగా మారింది కొండపల్లి మున్సిపాలిటీలోని కొంతమంది అవినీతికి పాల్పడుతున్న అధికారుల తీరు. అంతా నేను చూసుకుంటాను మీకేం భయం లేదు అంటూ మున్సిపాలిటీ చైర్మన్ హామీ ఇవ్వడంతోనే మున్సిపాలిటీ కమీషనర్ , మున్సిపాలిటీలోని రెవెన్యూ అధికారి కలిసి మున్సిపాలిటీ పరిదిలోని ఓ భహుళ అంతస్తుల భవనానికి రాకుండా తూ తూ మంత్రంగా పన్నులు వేసి, సదరు యజమానికి ఆర్ధీక లబ్ది చేకూర్చినందుకు సదరు యజమానికి చెందిన విజయవాడలోని ఓ నగల దుఖాణం నుంచి నజరానాగా బంగారు కానుకలు అందుకున్నారంటూ మనం దిన పత్రికలో వచ్చిన కథనానికి మున్సిపాలిటీలోని ఓ అధికారిణి స్పందించారు. ఆ ఘటనలో తన పాత్ర ఏమీ లేదని చెప్పారు. అయితే చైర్మన్ అంతా నేను చూసుకుంటాను అని హామీ ఇవ్వడంతోనే మున్సిపాలిటీ కమీషనర్, పన్నులు విధించే రెవెన్యూ అధికారి కలిసి ఆ పని చేశారంటూ చెప్పుకొచ్చారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే బుజాలు తడుముకున్నట్లు నగల దుఖాణం పేరును కూడా సదరు అధికారిణి మాటల మద్యలో స్పష్టం చేసి మళ్లీ నాలుక కరుచుకోవడం కొసమెరుపు. ఇదిలా ఉండగా ఇంటి పన్నుల వ్యవహారంలో తనకు ఎటువంటి సంభందం లేదని చెప్పిన అధికారిణి గురించి వాకబు చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆన్ లైన్ టెండర్ లకు సంభందించిన డిజిటల్ కీ తన దగ్గర పెట్టుకొని, కాంట్రాక్టర్ లను తానే డిసైడ్ చేస్తూ భారీ అవినీతికి తెర తీశారని సమాచారం. ఆన్ లైన్ టెండర్ ద్వారా తనకు నచ్చిన గుత్తే దారుకి టెండర్ కనిపించే విధంగా, నచ్చని వారికి టెండర్ కనిపించకుండా చేస్తూ… టెండర్ దక్కించుకున్న వారి వద్ద నుండి నజరానాగా లక్షలాది రూపాయలను కమీషన్ల రూపంలో దోచుకోవడంతో పాటు తన కుటుంబ సభ్యులకు సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తిని జగ్గయ్యపేట నుండి కొండపల్లికి గుత్తే దారుడిగా తీసుకువచ్చి, అతనికి టెండర్ పనులను దోచిపెడుతూ, టెండర్ కు సంభందించిన సమాచారం దాచి పెట్టే విదంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీ చైర్మన్, అధికారులు కలిసి మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా ఆన్ లైన్ టెండర్ డిజిటల్ కీ ని మేనేజ్ చేస్తూ, అన్నీ పనులను ఆ ఐదుగురు కాంట్రాక్టర్ లకే వచ్చేలాగా చేస్తున్నారంటే ఎంత పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా ఇబ్రహీంపట్నంకు చెందిన మరో తోక వీరున్ని కాంట్రాక్టర్ గా ప్రోత్సహిస్తూ రోజు వారీ కొనుగోళ్లను అతడి ద్వారా కొనుగోలు చేయిస్తూ, అతడితో చేతులు కలిపి అతడు రాసిందే రేటు, అతడు వేసిందే బిల్లు అనే విధంగా ఎప్పటి డబ్బులు అప్పుడు దోచుకుంటున్నారనే వాధనలు లేకపోలేదు. మరో కీలకమైన అధికారిణి రెవెన్యూ అధికారితో కలిసి కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్నులు, ప్రభుత్వం, ప్రయివేటుకు చెందిన బహుళ అంతస్థుల భవనాలకి గతేడాది కోట్లాది రూపాయల పన్నులను ఖజానాకు రాకుండా తూ తూ మంత్రంగా పన్నులు విధించి, సదరు యజమానికి ఆర్ధీక లబ్ది చేకూర్చినందుకు గాను వద్ద నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు నజరానాగా అందుకున్నారని మున్సిపాలిటీలోని ప్రజలు గుసగుస లాడుకుంటున్నారు. తూ తూ మంత్రంగా వేసిన పన్నులతో వచ్చిన కొద్ది మొత్తం నిధులను కూడా తోక వీరుడు లాంటి గుత్తేదారులతో చేతులు కలిపి ప్రజాధనాన్ని కాజేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. చైర్మన్ అండదండలతోనే అధికారిణులు అక్రమాలకు పాల్పడ్డారని అధికారులే ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం కొసమెరుపు. అయితే ఆ విధంగా వచ్చిన అవినీతి సొమ్ములో కొంత మొత్తాన్ని తమకు అనుకూలంగా వార్తలు రాసే వారికి నెలా వారి మామూళ్లుగా ఇస్తూ కొంతమంది అసత్య కథనాలు రాసే వారితో తప్పుడు కథనాలను వండి వారుస్తూ ప్రజలను తప్పు దారి పట్టిస్తూ వికటాట్టహాసం చేస్తున్నారని తెలుస్తోంది. ఇటువంటి అక్రమాలను ప్రశ్నిస్తున్న మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షుడు, వైస్ చైర్మన్ పైన అవమానకరంగా, వ్యక్తి గత హననం చేస్తూ వార్తలు రాయించడం ఎ ఇ కి వెన్నతో పెట్టిన విద్య అని స్థానికులు చెప్పుకుంటున్నారు. దీని పైన మున్సిపాలిటీ శాఖ ఉన్నతాధికారులు, ఆడిట్ అధికారులు విచారణ చేస్తే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడడంతో పాటు, ప్రజలకు మంచి చేయవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. *మూడు పార్టీలలో కర్చీపు వేసుకున్న చైర్మన్ చిట్టిబాబు* కొండపల్లి అడవి క్వారీకి సమీపంలో సర్వే నెంబర్ 143, 26/2 లలో మైనింగ్ శాఖ కళ్లు గప్పి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. తాను చైర్మన్ ను అని ఏమైనా నేను చూసుకుంటాలే అని అధికారులను మభ్య పెడుతూ విజయవాడలోని ఇళ్ల ప్లాటులకు ప్రతీ రోజు వంద నుండి 150 లారీల మట్టిని తరలిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉండగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో పటాపంచలతో కలిసి భూధేవికి ఓట్లేయాలంటూ వసంతకు వ్యతిరేకంగా ప్రచారం చేశారంటూ కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు పైన సొంత పార్టీ నేతలే విమర్శలు సందిస్తున్నారు. గ్రౌండ్ రిపోర్ట్ వసంతకు చేరడంతో పటాపంచలను వసంత దూరం పెట్టారని సమాచారం. అయితే రామచంద్ర యాదవ్ నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీలో వసంతకు వ్యతిరేకంగా టిడిపి ఓట్లు చీల్చడం ద్వారా తన సామాజిక వర్గానికి చెందిన వైసిపి అభ్యర్ధి సర్నాల తిరుపతిరావును గెలిపించేందుకు శతావిధాల శక్తి వంచన లేకుండా చిట్టి చిట్టి ప్రయత్నాలు చేశారని టిడిపి కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. అందులో బాగంగానే వైసిపి అనుకూల మీడియాతో అంటకాగుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. బివై పార్టీ కార్యాలయం ఆవిష్కరణ సభకు మనుషులను తరలించేందుకు గాను తన సొంత నిధులతో బస్సులను కూడా ఏర్పాటు చేసి అందరినీ విశ్మయానికి గురి చేశారని చెప్పుకుంటున్నారు. తాను టిడిపిలో ఉంటూ, తన అన్న కుమారుడిని వైసిపిలో ఉంచుతూ మరో భూదేవిని బివై పార్టీలోకి పంపి మూడు పార్టీలలో తన హవా నడిపిస్తున్నరని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. వీటన్నిటిని బట్టి చూస్తే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చైర్మన్ చిట్టిబాబు ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తారనే ఊహా గానాలు వినిపిస్తున్నాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.