Friday, 1 May 2026

Blog

సత్యసాయి

పలు ఆలయాల్లో ఘనంగా పూజలు.

అమడగూరు మండల కేంద్రంలోని పలు ఆలయాల్లో ఘనంగా పూజలు నిర్వహించారు.మండలంలోని పంచముఖ ఆంజనేయ స్వామి,అభయ ఆంజనేయ స్వామి,ఏ.కొత్తపల్లి గ్రామంలోని బొబ్బిలి కోట శ్రీ కోదండ రామాలయం,ఆంజనేయ స్వామి దేవాలయాల్లో భక్తాదులు ఘనంగా పూజలు చేపట్టారు.ముందుగా అర్చకులు స్వామివారికి అభిషేకాలు,ఆకు పూజలు,వివిధ రకాల పుష్పాలతో అర్చనలు చేశారు.అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.అలాగే కొత్తపల్లి లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో దొడ్డప్ప కుటుంబ సభ్యులు స్వామివారికి ఆకుపూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పూజించారు.

E-పేపర్

చిన్నారి నర్తన కోరిక: సీఎం, పవన్‌ల వద్ద ప్రదర్శనకు యార్లగడ్డ హామీ*

గన్నవరం నియోజకవర్గ ప్రతినిధి ప్రతినిధి గన్నవరం ఎమ్మెల్యే చొరవ: కూచిపూడి, భరతనాట్యం చేయాలన్నబొమ్మినేని లిఖితకల నెరవేరేనని తెలియజేశారు. గన్నవరం: కళలకు, సంస్కృతికి పెద్దపీట వేస్తోన్న నూతన కూటమి ప్రభుత్వంలో ఒక చిన్నారి కోరిక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గన్నవరం నియోజకవర్గానికి చెందిన చిన్నారి నికిత, ముఖ్యమంత్రి (సీఎం) నారా చంద్రబాబు నాయుడు వద్ద, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్ద, మంత్రి నారా లోకేష్ వద్ద తాను నేర్చుకున్న కూచిపూడి, భరతనాట్య ప్రదర్శన అందించడానికి మనస్ఫూర్తిగా కోరుకుంది. ఈ చిన్నారి తన కోరికను విన్నవించుకుంటూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పందించారు. ఆ చిన్నారి కోరికను నెరవేరుస్తానని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. “నిజంగా బొమ్మినేని లిఖిత చాలా మంచి కళాకారిణి. ఇంత చిన్న వయసులో కూచిపూడి, భరతనాట్యం నేర్చుకోవడమే కాకుండా, రాష్ట్ర పెద్దల ముందు ప్రదర్శించాలనే ఆమె ఆశను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సీఎం తాత (చంద్రబాబు నాయుడు) ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం, లోకేష్ మామ అభినందనలు నికితకు దక్కేలా చూస్తాను. ఈ చిన్నారి కళాకారిణి కలను త్వరలోనే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించి అపాయింట్‌మెంట్ తీసుకుంటాము” అని ఎమ్మెల్యే వెంకట్రావు తెలిపారు. త్వరలోనే ప్రత్యేక ప్రదర్శన ఉంటుంది అని తెలియజేశారు.

E-పేపర్

అవినీతిపై రాజీలేని పోరు : ఎమ్మెల్యే యార్లగడ్డ

* భూ ఆక్రమణలు సహించేదిలేదు గన్నవరం : నియోజకవర్గ పున్నమి ప్రతినిధి గన్నవరం నియోజకవర్గంలో అవినీతి రహితంగా పాలన సాగిస్తున్నామని, అవినీతిని ఎట్టి పరిస్థితులను సహించేది లేదని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. శనివారం ఉదయం గన్నవరంలో అభిమానులు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ అవినీతికి అక్రమాలకు ఆలవాలమైన గన్నవరంలో పరిస్థితిని పూర్తిగా మార్చి అవినీతి రహితంగా, శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు, లేఅవుట్లోని కామన్ సైట్లు సైతం ఆక్రమణల పాలయ్యాయని ఈ ఆక్రమణల నిగ్గు తేల్చేందుకు అధికారులతో కమిటీలు నియమించినట్లు చెప్పారు. రాజకీయాలకతీతంగా ఆక్రమణలను విడగొట్టి ప్రభుత్వ భూములు కాపాడతామని హామీ ఇచ్చారు. గత 11 ఏళ్లుగా గన్నవరంలో చెరువుల మట్టిని అమ్ముకొని అక్రమార్కులు కోట్లు గడించారని 11 ఏళ్ల తర్వాత మట్టిని రైతులకు, ఇళ్ళు నిర్మించుకునే వారికి ఉచితంగా ఇచ్చామని గుర్తు చేశారు. నియోజకవర్గంలో 15 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అధికారంలో ఉన్నా, లేకున్నా, ఎనిమిదేళ్లుగా గన్నవరంలోనే ఉంటున్నామని తనను ఆదరించి అక్కున చేర్చుకున్న గన్నవరం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తనని ప్రోత్సహిస్తూ, నియోజకవర్గంలో ఎస్సీజెడ్ లకు రూ.29 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఈ సందర్భంగా యార్లగడ్డ కృతజ్ఞతలు తెలిపారు. తనకి ఏ బాధ్యతలు అప్పగించినా సొంత కంపెనీల భావించి కస్టపడి పనిచేస్తానని తాను చైర్మన్ గా పనిచేసిన 13 నెలల కాలంలో కేడీసీసీ టర్నోవర్ రూ.8వేల కోట్లకు పెంచటంతో పాటు లాభాలను రూ. 15 కోట్లకు చేర్చటాన్ని ఉదహరించారు. అధికారులు, ప్రజలు అందరి సహకారంతో గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా యార్లగడ్డ పేర్కొన్నారు. తాను గన్నవరం లోనే ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహంతో ఇక్కడే రాజకీయం చేస్తానని మరోసారి స్పష్టం చేశారు.

E-పేపర్

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : యార్లగడ్డ

గన్నవరం : పున్నమి న్యూస్ ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు భరోసా ఇచ్చారు. శనివారం ఉదయం గన్నవరంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని యార్లగడ్డ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసరపల్లి గ్రామం నుంచి గన్నవరం వరకు ఆటోడ్రైవర్లు ఆటోలతో ర్యాలీ నిర్వహించగా ఎమ్మెల్యే వెంకట్రావు ఆటో నడిపి డ్రైవర్లను, కార్యకర్తలు ఉత్సాహపరిచారు. ఈసందర్బంగా గన్నవరం నియోజకవర్గంలోని ఈ పధకం లబ్ధిదారులైన 2,470 మంది ఆటోడ్రైవర్లకు రూ. 3.70 కోట్ల చెక్ ను ఎమ్మెల్యే చేతులమీదుగా అందచేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించామని ఈ పథకం వల్ల ఆటోడ్రైవర్లకు కలిగిన ఇబ్బందిని గుర్తించి వారిని ఆదుకునేందుకు సంవత్సరానికి రూ.15వేలు చొప్పున ఎకౌంట్లో జమ చేస్తున్నట్లు వివరించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2.9 లక్షల మంది లబ్ధిదారులకు రూ.436 కోట్లు డ్రైవర్ అకౌంట్లో జమ చేస్తున్నట్లు చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రజల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెంకట్రావు తెలిపారు. ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వీటికి నిధుల కోసం సంపద సృష్టిస్తూ ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ మద్దతు నివ్వాలని కోరారు. అమరావతి నిర్మాణాన్ని వేగావంతం చేయటంతోపాటు వచ్చే ఏడాది చివరికి పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నట్లు యార్లగడ్డ వివరించారు. గన్నవరం నియోజకవర్గంను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు యార్లగడ్డ ఎమ్మెల్యే వెంకట్రావు చెప్పారు. తాను చేస్తున్న ఈ ప్రయత్నానికి నియోజకవర్గ ప్రజలందరూ సహకరించాలని కోరారు.

కామారెడ్డి

ఘనంగా అష్టాదశ దుర్గామాత విగ్రహాల నిమజ్జనం

కామారెడ్డి, 04 అక్టోబర్ పున్నమి ప్రతినిధి : గాంధీ యువజన సమైక్య ఆధ్వర్యంలో 18వ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారని తెలిపా రు.కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో గాంధీ యువజన సమైక్య ఆధ్వర్యంలో వారి 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అష్టాదశ (18) శక్తి పీఠాలను ప్రతిష్ఠించి, నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవ త్సరం లాగే ఈ సంవత్సరం ఉత్సవాలు పండుగ వాతావరణాన్ని నింపాయి.ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు..11 రోజు ల పాటు జరిగిన ఈ వేడుకల్లో ప్రతిరోజు అమ్మవా రికి ప్రత్యేక అవతార అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృ తిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. హనుమాన్ చాలీసా పారాయణం, ఐదవ రోజు విశ్వహిందూ పరిషత్ రామారెడ్డి ప్రగండశాఖ వారిచే హనుమాన్ చాలీసా పారాయణం చశారు దుర్గమాత కొలుపు నేరెళ్ల వారి బృందంచే దుర్గమా త కొలుపు కార్యక్రమం నిర్వహించారు.సామూహిక కుంకుమ పూజ ఈ కార్యక్రమంలో 12 మంది దంప తులు పాల్గొన్నారు.సామూహిక దుర్గామాత యజ్ఞం ఇందులో 20 మంది దంపతులు జంటలు పాల్గొని యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు.సా మూహిక సత్యనారాయణ వ్రతాలు,12 మంది దంపతులు పాల్గొని ఈ వ్రతాలను విజయవంతం చేశారు.భజన కార్యక్రమం శ్రీ రేణుక దేవి భజన మండలి వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పూజారి దిలీప్ కుమార్ పంతులు పూజ కార్యక్రమం, ఒక్కొ క్క అవతారాన్ని గురించి సంపూర్ణంగా వివరించా రు. నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా వేలంపాట పాడి పలువురు మాత ధరించిన చీరలను దక్కిం చుకున్నారు.ఈ వేలంపాటలో మహిళలు, మాల స్వాములు, కండువా స్వాములు, బాల స్వాము లు, కంకణం స్వాములతో పాటు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. గాంధీ యువజన సమైక్య పాలకమండలి ఆధ్వ ర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి దాతలుగా ముందుకు వచ్చి సేవలను అందించిన వారికి, ఈ కార్యక్రమాలను నిర్వహించిన పాలక మండలి సభ్యులకు, గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, వారికి ప్రత్యేక బహుమతులు అందిం చారు.భక్తుల మనసులో భక్తి పారవశ్యాన్ని నింపు తూ,పండుగ వాతావరణాన్ని వెదజల్లిన అష్టాదశ దుర్గామాత విగ్రహాలను ఘనంగా నిమజ్జనం చేయడంతో ఉత్సవాలు ముగిశాయి.

విశాఖపట్నం

విశాఖపట్నంలో వేడి గంజి తాగి పిల్లలు గాయపడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.

అక్టోబర్ 4, శనివారం విశాఖపట్నంలో వేడి గంజి తాగి పిల్లలు గాయపడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉంది… వారి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు. మొత్తం 20 మంది పిల్లలను ఆసుపత్రికి తరలించారు. ఆరుగురు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి గాయాలు స్వల్పంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ వివరించారు. విశాఖపట్నంలోని సీతంపేటలోని బెల్లం గణపతి ఆలయం సమీపంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో గంజి మీద పడి పిల్లలు గాయపడిన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పిల్లల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన పిల్లలకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. దుర్గాదేవి మండపం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమంలో గంజి మీద పడి పిల్లలు గాయపడిన సంఘటనలో పిల్లలకు ఎటువంటి ప్రమాదం లేదని కలెక్టర్ తెలియజేశారు. చిన్న గాయాలైన పిల్లలను ప్రాథమిక చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు. వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పిల్లల ఆరోగ్యం స్థిరంగా ఉందని వారి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు.

తూర్పు గోదావరి

సీఈసీ సభ్యుడు రౌతుకు మజ్జి అభినందనలు.

మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి సీఈసీ సభ్యునిగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు ని నియమించడం పట్ల వైయస్సార్ పార్టీ రాజమండ్రి మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు మజ్జి అప్పారావు ఆధ్వర్యంలో శనివారం రౌతు సూర్యప్రకాశరావు నివాసంలో కార్యకర్తలు నాయకులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రైతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ నాపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో నమ్మకంతో నాకు ఈ పదవి వేయడం పట్ల వారికి అభినందనలు తెలియజేస్తున్నానని అదే విధంగా పార్టీ కార్యకర్తలకు వెన్నంటే ఉంటానని పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా మజ్జి అప్పారావు, మాజీ కార్పొరేటర్ మజ్జి నూక రత్నం, వాక్చర్ల. కృష్ణ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రౌత్ సూర్య ప్రకాష్ రావును సెంట్రల్ వైయస్సార్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నియమికం పట్ల కార్యకర్తలు అందరికీ చాలా సంతోషంగా ఉందని ఆయన కష్టానికి పార్టీ అభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ పదవి రావడం ఒక నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పల్లేడు శంకర్, కొరియర్ ప్రసాద్, రొక్కం త్రినాథ్, వై సునీల్, గాంధీ, రాంబాబు, సూర్యనారాయణ, రామ్మూర్తి, దేవుడు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

అంబేద్కర్ విగ్రహన్నీ దహనం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి-జనమాల గురవయ్య

శ్రీకాళహస్తి: చిత్తూరులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేయడం అత్యంత సిగ్గుచేటని,ఇది ఒక అమానవీయ చర్యగా సిపిఐ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం అణిచివేతకు గురైన వర్గాల నాయకుడు మాత్రమే కాదు భారత రాజ్యాంగ నిర్మాత అని గుర్తు చేశారు. ఆయన విగ్రహాన్ని దహనం చేసి అపవిత్ర చేయడం అంటే భారత గణతంత్ర ఆత్మపై దాడి చేయడమేనని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వం వెంటనే ఈ దుస్సాహసానికి పాల్పడిన నిందితులను గుర్తించి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తిరుపతి

కాగడాలతో నిరసన తెలియజేస్తున్న అంబేద్కర్ ఆర్మీ B.N.కండ్రిక మండలం*

*కాగడాలతో నిరసన తెలియజేస్తున్న అంబేద్కర్ ఆర్మీ B.N.కండ్రిక మండలం* వెదురుకుప్పం మండలం, దేవళంపేట గ్రామంలో, అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చెయ్యడం, ఇది చాలా హేయమైన చర్య అంబేద్కర్ గారి విగ్రహాన్ని చాలా దారుణంగా కులాల మధ్య వివక్షత పెట్టాలని కొందరు దేశద్రోహులు కుట్రపని ఉద్దేశిక పూర్వకంగా చాలా అవమానకరంగా దళితుల ఆత్మ గౌరవాన్ని మంట కలుపుతూ ఆత్మ గౌరవాన్ని తగ్గిస్తూ దళితులను కించపరుస్తూ ఎంతో దారుణంగా ఎంతో దుస్సహచర్యగా తన తీవ్రంగా ఖండిస్తున్నాం. నిందితుల్ని కఠినంగా శిక్షించాలి వారిని దేశ ద్రోహులుగా ప్రకటించాలని కుటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ నగర్ అంబేద్కర్ యూత్ తదితరులు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

న్యాయం చేయాలంటూ వృద్ధ దంపతులు ఆవేదన

పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ వృద్ధులు ఆవేదన అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి) పిల్లలు లేరని చెల్లెలు కొడుకును దత్తత తీసుకొని పెంచి పెద్ద చేస్తే మామ ఆస్తి పైన కన్నేసి వారిని చిత్రహింసలకు గురి చేస్తున్న సంఘటన నెల్లూరు జిల్లా చేజర్ల మండలం వావిలేరు గ్రామంలో చోటుచేసుకుంది.వావిలేరు గ్రామానికి చెందిన అమ్మినేని రమణయ్యకి పెళ్లయినా పిల్లలు లేరు.ఆయన చెల్లెలు కొడుకు పెంచలయ్యని దత్తత తీసుకొని పెద్ద వాడిని చేసి రమణయ్యే ఇంటి పక్కనే స్థలం ఇచ్చి ఇల్లు కట్టి ఇస్తే మాకు వృద్దాప్యం వచ్చిన తరువాత మా ఆస్తి మీద కన్ను వేసి మా ఇల్లు పొలం తనకు కావాలంటూ మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారని వృద్ధ దంపతులు మీడియా ముందు ఆవేదనతో విలపించారు. కనీసం బాత్ రూమ్ లోకి వెళ్లేందుకు కూడా లేకుండా తాళాలు వేశారని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని వారు వాపోయారు.స్థానిక ఎస్సైకి కంప్లైంట్ ఇచ్చి మూడు రోజులు అవుతున్నా న్యాయం చేయలేదని, ఏమని అడగడంతో మంత్రి పిఏ కమల్ అనే అతను ఫోన్ చేస్తున్నాడని వెళ్లొద్దంటున్నాడని సాకులు చెప్పి మాకు న్యాయం చేయకుండా స్థానిక ఎస్సై కాలయాపన చేస్తున్నాడు అంటూ వారు వాపోయారు.గ్రామంలో ఉన్న కొందరు అతని వైపే సపోర్టు చేస్తుండడంతో మాకు న్యాయం చేసే వారు లేకుండా పోయారన్నారు.సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆ వృద్ద దంపతులు వేడుకుంటున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.