Friday, 1 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

సైకిల్ కోసం బ్యాంకుకు వెళ్లిన చిన్నారులు, బంగారు తాకట్టు పెడతామని హామీ.

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు సైకిల్ కొనేందుకు డబ్బు కావాలని స్థానిక కెనరా బ్యాంకుకు వెళ్లి లోన్ అడగడం బ్యాంకు కస్టమర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రామానికి చెందిన చిన్నారులు దేవాన్ష్, రహస్యలు తమ తల్లి సునీతతో కలిసి బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకులో డబ్బులు ఇస్తారట అని తెలుసుకుని నేరుగా బ్యాంకు మేనేజర్ వద్దకు వెళ్లి మాకు సైకిల్ కొనేందుకు డబ్బులు కావాలి అని అడిగారు. అప్పుడే ఆశ్చర్యానికి గురైన మేనేజర్, బ్యాంకులో ఏదైనా తాకట్టు పెట్టాలి మీ దగ్గర ఏముంది అని ప్రశ్నించాడు. దానికి చిన్నారులు “మా దగ్గర భూమి ఉంది… బంగారం కూడా ఉంది అని అమాయకంగా సమాధానం ఇవ్వడంతో మేనేజర్ నవ్వుతో పాటు ఆనందానికి గురయ్యాడు. వారి అమాయకపు సమాధానం విన్న సిబ్బంది, అక్కడ ఉన్న కస్టమర్లు నవ్వులు పూయించగా.. చిన్నారులను ప్రేమగా పలకరించి ఇంటికి పంపించారు.

ఆంధ్రప్రదేశ్

5-17 ఏళ్లలోపు పిల్లలకు ఉచితంగా ఏడాదిపాటు ఆధార్ అప్డేషన్.

ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ సేవను 5 నుంచి 17 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు ఏడాదిపాటు ఉచితంగా అందించను న్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం 5 ఏళ్ల లోపు పిల్లలు ఫొటోగ్రాఫ్, పేరు, పుట్టినతేదీ, లింగం, చిరునామా, జనన ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి ఆధార్ లో పేరు నమోదుచేసుకోవచ్చు. అయిదేళ్ల వయసులో బయోమెట్రిక్స్ సరిగా ఏర్పడి ఉండవన్న కారణంతో వేలిముద్రలు, కనుపాపల గుర్తులు తీసుకోరు. పిల్లలు అయిదేళ్లు నిండిన తర్వాత ఒకసారి, 15 ఏళ్లకు చేరుకున్న తర్వాత మరోసారి తప్పనిసరిగా బయోమెట్రిక్స్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఏడాదిపాటు 5-17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలందరికీ ఈ సేవలను ఉచితంగా అందించాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత రూ.125 వసూలుచేస్తారు. బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోవడంవల్ల పాఠశాలల ప్రవేశాలు, ప్రవేశ పరీక్షల రిజిస్ట్రేషన్, స్కాలర్షిప్ ప్రయోజనాలు, వివిధ పథకాల ద్వారా అందే డీబీటీలు పొంద డానికి వీలవుతుందని పేర్కొంది. అందువల్ల తల్లిదండ్రులు వెంటనే ఈ వయసు పిల్లల బయోమెట్రిక్స్ అప్ డేషన్ చేయించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.

ఆంధ్రప్రదేశ్

విమర్శల వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు సరికాదు -సుప్రీం కోర్ట్.

ఆర్టికల్‌ 19 (1) (ఏ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయి – సుప్రీం కోర్ట్ న్యూఢిల్లీ : ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తలు రాసిన జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు పెట్టటం ఎంత మాత్రమూ సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విమర్శనాత్మక వార్తలు రాసిన సదరు జర్నలిస్టును అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణను దేశ అత్యున్నత న్యాయస్థానం మంజూరు చేసింది. తనపై ప్రభుత్వం నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన జర్నలిస్ట్‌ అభిషేక్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టితో కూడిన ధర్మాసనం విచారించి.. ‘ప్రజాస్వామ్య దేశాల్లో అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛను గౌరవిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 (1) (ఏ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయి’ అని సుప్రీంకోర్టు పేర్కొన్నది.

తూర్పు గోదావరి

బ్రెజిల్ ప్రతినిధుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా కొవ్వూరు డివిజన్ లో పర్యటన.

ప్రకృతి వ్యవసాయం, వినూత్న పద్ధతులు మరియు రైతు సాధికారతపై ప్రత్యక్ష అనుభవాలు. ప్రకృతి వ్యవసాయం, వినూత్న పద్ధతులు మరియు రైతు సాధికారతపై ప్రత్యక్ష అనుభవాల కోసం బ్రెజిల్, యు.ఏ.ఈ., మరియు శ్రీలంకకు చెందిన 30 మంది ప్రతిష్టాత్మక నిపుణుల బృందం ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించారు. ఈ పర్యటనను రైతు సాధికార సంస్థ (RySS) మరియు నౌ భాగస్వాములు (NOW – Partners) సంయుక్తంగా నిర్వహించారు. నౌ సంస్థ స్థిరమైన మరియు పునరుత్పత్తి వ్యవస్థలను సాధించడానికి కంపెనీలకు మద్దతుగా పనిచేసే వ్యాపారవేత్తల మరియు నిపుణుల గ్లోబల్ అలయన్స్. ఈ సంస్థను జర్మనీకి చెందిన అంతర్జాతీయ వ్యాపారవేత్త వాల్టర్ లింక్ స్థాపించగా, ఆయన ప్రస్తుతం స్థాపక CEOగా కొనసాగుతున్నారు. ఆయన స్వయంగా ఈ ప్రకృతి వ్యవసాయ క్షేత్ర పర్యటనల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు ప్రధాన బృంద సభ్యులు, బ్రెజిల్ మంత్రిత్వ శాఖకు చెందిన వివియన్, సాండ్రో కూడా పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా ప్రతినిధుల బృందాన్ని రెండు గ్రూపులుగా విభజించారు. ఈ బృందాలు తూర్పు గోదావరి జిల్లాలోని ముక్కమాల మరియు కాపవరం గ్రామాలను సందర్శించి, రైతు సాధికార సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న “ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (APCNF)” వినూత్న నమూనాలు మరియు సామూహిక ఆధారిత విధానాలను పరిశీలించారు. *మొదటి బృందం పెరవలి మండలం,* ముక్కమాల గ్రామంలో రైతులు అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిశీలించింది. బృంద సభ్యులు అన్నపూర్ణ నాన్ పెస్టిసైడల్ మేనేజ్మెంట్ (NPM) షాప్ వద్ద ప్రకృతి వ్యవసాయ 9 సార్వత్రిక సూత్రాల చక్రాన్ని సందర్శించారు. అనంతరం ఘన జీవామృతం, కోడిగుడ్డు–నిమ్మరసం ద్రావణం తయారీ విధానం, వినియోగం మరియు నిల్వ పద్ధతులపై అవగాహన పొందారు. అలాగే శ్రీ జి. వెంకటేశ్వర్లు నిర్వహిస్తున్న డ్రం సీడర్‌తో వరి సాగును వీక్షించి, కలుపు నియంత్రణ, కూలీ ఖర్చు తగ్గింపు మరియు సమయపాలన వంటి ప్రయోజనాలపై చర్చించారు. వేసవిలో 30 రకాల విత్తనాలతో చేసిన పీ.ఎం.డి.ఎస్ పద్ధతి ద్వారా తక్కువ నీటి వినియోగం సాధ్యమవుతుందనే విషయాన్ని తెలుసుకున్నారు. డ్రోన్ స్ప్రేయింగ్ ద్వారా ప్రకృతి ద్రావణాల సమర్థవంతమైన వినియోగం, అలాగే బ్రిక్స్ రీడింగ్ ద్వారా పంట ఆరోగ్యం కొలిచే పద్ధతులను వీక్షించారు. అనంతరం శ్రీ పి. రామకృష్ణ నిర్వహిస్తున్న పామ్ ఆయిల్, వక్క, అరటి సాగు నమూనాలను పరిశీలించి, ఉత్పత్తులకు ఉన్న మార్కెట్ డిమాండ్ గురించి తెలుసుకున్నారు. *రెండవ బృందం కొవ్వూరు మండలం,* కాపవరం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ 9 సార్వత్రిక సూత్రాల చక్రం మరియు వాటి అమలును పరిశీలించింది. రైతులు క్షేత్ర స్థాయిలో ఆ సూత్రాలను పాటించడం వల్ల వచ్చిన మార్పులు, ఫలితాలు గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. దేశీ విత్తనాల పాత్ర, గట్టు విస్తరణ ద్వారా రైతులు పంట వైవిధ్యం పెంచి అదనపు ఆదాయం పొందుతున్న విధానం ప్రతినిధులను ఆకట్టుకుంది. డ్రోన్‌లను వినియోగించి ఎకరానికి కేవలం 12 లీటర్ల ఇన్పుట్లతో రోజుకు 30–40 ఎకరాలకు స్ప్రే చేయగల సాంకేతికతను పరిశీలించారు. రైతులు ప్రధాన పంటలతో పాటు అంతర పంటలను సమీకరించి పెట్టుబడిపై మూడు రెట్లు ఆదాయం పొందుతున్న నమూనాను వారు ప్రశంసించారు. తదుపరి శ్రీ సత్యనారాయణ నిర్వహిస్తున్న 13 ఎకరాల హార్టికల్చర్ పాలీక్రాపింగ్ క్షేత్రాన్ని ప్రతినిధులు సందర్శించారు. అక్కడ ప్రకృతి వ్యవసాయ సూత్రాలను క్రమంగా అనుసరించడం, సౌరశక్తి వినియోగం ద్వారా చీడపీడల నియంత్రణలో ఆధునిక సాంకేతికతను ప్రయోగించడం, మరియు పంట వైవిధ్యంతో సస్యశ్యామలంగా కనిపిస్తున్న పొలం అడవిని తలపిస్తోందని బృందం ప్రశంసలు తెలిపింది. సైన్స్ అండ్ అకాడమీ థీమాటిక్ లీడ్ సుధాకర్ నేతృత్వంలో ప్రతినిధులు రైతు శాస్త్రవేత్తలతో పంట ఆరోగ్యం, నేల ఆరోగ్యం, చీడపీడల నియంత్రణ, పంట వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. బ్రిక్స్ మరియు రిఫ్రాక్టోమీటర్ ద్వారా మొక్కల ఆరోగ్యం, పోషకాలను తెలుసుకునే విధానాన్ని పరిశీలించారు. తదుపరి ప్రతినిధులు స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమై, ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగించడంలో వారు పోషిస్తున్న కీలక పాత్రను ప్రశంసించారు. అనంతరం ధర్మవరం గ్రామంలో పి. గోపాలకృష్ణ యొక్క “ఎనీ టైమ్ మనీ” నమూనా మరియు ఆకుల వీర మణికంఠ నిర్వహిస్తున్న డ్రం సీడర్ వరి సాగును సందర్శించారు. బ్రెజిల్ ప్రతినిధులు ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యం పునరుద్ధరణ, రైతుల సాధికారత మరియు ఆధునిక సాంకేతికతల సమన్వయంపై ప్రత్యక్ష అనుభవాలు పొందారు. ఈ నమూనాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలిగే మోడళ్లుగా బృందం అభినందించింది. ఈ పర్యటన విజయవంతం కావడానికి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సుధాకర్, జాకీర్, స్వాతి, హుమయున్, ప్రకాష్, హేమ సుందర్, మధుమోహన్ (అగ్రికల్చర్ ఆఫీసర్), నాగ ప్రమీల రాణి, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ తాతారావు, జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు, ఉప వ్యవసాయ సంచాలకుడు శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి గంగాధర్ రావు మరియు ఇతర క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

జగనన్నను మళ్లీ సీఎం ని చేయడమే మన కర్తవ్యం -మాజీ మంత్రి ముద్రగడ .

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్రగడగిరి బాబును మర్యాద పూర్వకంగా కలిసిన నేతలు మాజీ సీఎం జగనన్నను మళ్ళీ సీఎం గా చేయడమే మన అందరి కర్తవ్యమని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి అన్నారు. తనను కలవడానికి వచ్చిన నాయకులతో ముద్రగడ కాసేపు ముచ్చటించారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్రగడ గిరిబాబును మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ శాసన సభ్యులు రౌతు సూర్య ప్రకాశ రావు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు వైఎస్ఆర్సిపి ప్రచార కమిటీ మాజీ అధ్యక్షులు తోట రామకృష్ణ, ఎంపిపి దుర్గారావు, రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ఆర్సిపి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నారని, ఆయన పూర్తిస్థాయిలో కోలుకున్నారని, వైద్య నివేదికలన్నీ పరీక్షించడం జరిగిందని డాక్టర్ గూడూరి అన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం చాలా ఆనందాన్నిచ్చిందని డాక్టర్ గూడూరి అన్నారు. శనివారంశనివారం కిర్లంపూడి లో మాజీమంత్రి పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రౌతు సూర్యప్రకాష్ రావు , తూర్పుగోదావరి జిల్లా మాజీ ప్రచార కమిటీ అధ్యక్షుడు తోట రామకృష్ణ, దేవరపల్లి ఎంపీపీ కుప్పాల దుర్గారావు, పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, నిడదవోలు మరియు కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకులు గిరిజాల బాబు, రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జ్ ఇంచార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రౌతు సూర్యప్రకాష్ రావు ,తూర్పుగోదావరి జిల్లా మాజీ ప్రచార కమిటీ అధ్యక్షుడు తోట రామకృష్ణ, దేవరపల్లి ఎంపీపీ కుప్పాల దుర్గారావు, పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, నిడదవోలు మరియు కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకులు గిరిజాల బాబు, వైఎస్సార్సీపీ సెంట్రల్ వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఇంటలెక్చువల్స్ ఫోరం కార్యదర్శిన బండి అబ్బులు, కొవ్వూరు టౌన్ అధ్యక్షులు చిట్టూరి అన్నవరం, కొవ్వూరు మండల అధ్యక్షులు వెంపాటి సురేష్, రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ సెక్రెటరీ సుంకర సత్యనారాయణ, రాజమండ్రి మాజీ కార్పొరేటర్లు మానే దొరబాబు, వాకచర్ల కృష్ణ, నాయకులు సత్యనారాయణ రెడ్డి, సుంకర అంజిబాబు, వంకాయల సత్తిబాబు, పెదిరెడ్ల శ్రీను, కే ప్రసాద్, రాష్ట్ర మైనారిటీ వింగ్ సెక్రెటరీ అమానుల్లా బేక్ పట్టిసీమ ప్రెసిడెంట్ మైగాపుల దుర్గాప్రసాద్, కొవ్వూరు మాజీ ఏఎంసీ డైరెక్టర్ సుంకర రంగబాబు, తాళ్లపూడి మండలం కాపు సంఘం అధ్యక్షులు నామా ప్రకాశం తదితరులు ఉన్నారు.

తూర్పు గోదావరి

ఆటో డ్రైవర్లకు అండగా కూటమి ప్రభుత్వం జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జ్ మంత్రి, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం ఉదయం అట్టహానంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. ఆ దిశగా వేలాదిమంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో లేనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప ఆలోచనతో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ద్వారా ఆటో రిక్షా మ్యాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 15వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది ఆటో డ్రైవర్లకు రూ. 436 కోట్లు వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో అనేక ఆంక్షలు పెట్టి 2,61,000 మంది ఆటో డ్రైవర్లకి 10 వేలు చొప్పున సంవత్సరానికి రూ.260 కోట్లు ఖర్చు చేస్తే ఈనాడు 2,90,669 మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లకు 15 వేల రూపాయల చొప్పున రూ.436 కోట్లను ఖర్చు చేస్తున్నామని మంత్రి నిమ్మల తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా సుమారు 12000 మందికి సంవత్సరానికి రూ.15వేల చొప్పున రూ.18 కోట్లను వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నామని తెలిపిన మంత్రి నిమ్మల ఒకపక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిని కూడా పరుగులు పెట్టిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.15 వేలు అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుకు సహాయం అందిస్తామన్నారు. అర్హత ఉండి ఎవరికైనా లబ్ధి చేకూరకపోతే అధికారుల దృష్టికి తీసుకొస్తే సమస్య పరిష్కరించి లబ్ధి చేకూరేలా చర్యలు చేపడుతామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సహాయమందిస్తుందన్నారు. రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. రాష్ట్ర ప్రజలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అంటున్నారు. గతంలో ఆటో కార్మికులకు ఆటో ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ఇస్తే ఇప్పుడు రూ. 15 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. గతంలో సంవత్సరానికి కార్మికుల మీద 260 కోట్ల రూపాయల ఖర్చు చేస్తే ఇప్పుడు 436 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నాం. దీన్నిబట్టి కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులపై ఉంచిన నిబద్ధతను అర్ధం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం పన్నులు పెంచకుండా ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తుంది. రోడ్లు మరమ్మత్తులు చేస్తున్నాం, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగకుండా చూస్తున్నాం. ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తా ఉన్నాం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, దీపం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. మెగా డీఎస్సీను నిర్వహించాం. సంపద సృష్టించి ప్రజలందరికీ షరతులు లేని సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం అందిస్తోంది.” అని ఆదిరెడ్డి వాసు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన సిటీ ఇన్చార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కూటమి నాయకులు వర్రే శ్రీనివాస్, మజ్జి రాంబాబు, జాయింట్ కలెక్టర్ మేఘాస్వరూప్ తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మధ్యప్రదేశ్, రాజస్థాన్లో పిల్లల మృతి అనంతరం కోల్డ్ రిఫ్ దగ్గు సిరప్ను నిషేధించిన కేరళ

మధ్యప్రదేశ్, రాజస్థాన్లల్లో 11 మంది పిల్లల మృతికి, దీనికి సంబంధం ఉందనే అనుమానాలతో కోల్డ్ రిఫ్ దగ్గు సిరప్ అమ్మకాలను కేరళ ప్రభుత్వం నిషేధించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పిల్లల మృతి సంఘటనల తరువాత, కోల్డ్ రిఫ్ దగ్గు సిరప్‌పై కేరళ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ సిరప్‌లో హానికర రసాయనాలు ఉండి పిల్లల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదం కలిగించే అవకాశం ఉందని వైద్య అధికారులు గుర్తించారు. భారత ఔషధ నియంత్రణ సంస్థ కూడా ఈ సిరప్ నమూనాలను పరీక్షకు పంపింది. ఫలితాలు వచ్చే వరకు అమ్మకం, వినియోగంపై పూర్తి నిషేధం అమల్లోకి వచ్చింది. ప్రజలు ఈ సిరప్‌ను పిల్లలకు ఇవ్వకూడదని ఆరోగ్య శాఖ హెచ్చరించింది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం ‘స్టాగ్ బీటల్’, దీని ధర రూ.75 లక్షలు

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం‌గా జపాన్‌కు చెందిన ‘స్టాగ్ బీటిల్’ గుర్తించబడింది. ఈ చిన్న కానీ అరుదైన కీటకం ధర అబ్బురపరిచే విధంగా సుమారు రూ.75 లక్షల వరకు ఉంటుందని అంతర్జాతీయ వన్యప్రాణి పరిశోధకులు తెలిపారు. దీని ప్రత్యేకత దీని ఆకారం, మెరుస్తున్న నలుపు రంగు శరీరం, అలాగే తలపై ఉన్న బలమైన కొమ్ముల్లాంటి దవడలు. ఇవి ఇతర కీటకాలతో పోరాడటానికి ఉపయోగపడతాయి. జపాన్, చైనా, కొరియా వంటి దేశాల్లో ఈ స్టాగ్ బీటిల్‌ను అదృష్టం, శక్తి సూచకంగా భావిస్తారు. అనేకమంది దీన్ని సేకరణకారులుగా, పెంపుడు ప్రాణిగా కూడా ఉంచుకుంటారు. ఈ కీటకం యొక్క అరుదైన జాతులు ప్రకృతిలో చాలా కష్టంగా దొరకడం వల్ల వాటి విలువ విపరీతంగా పెరిగింది. కొందరు వ్యాపారులు ప్రత్యేకంగా వీటి పెంపకం, విక్రయాల కోసం వందలాది డాలర్ల పెట్టుబడి పెడుతున్నారు. ప్రకృతి సమతౌల్యంలో కీటకాలకున్న ప్రాముఖ్యత దృష్ట్యా ఈ బీటిల్‌పై పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. అందమైన రూపం, అరుదైన జాతి, మార్కెట్లో ఉన్న డిమాండ్ కారణంగా స్టాగ్ బీటిల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం అనే ఖ్యాతిని సంపాదించింది. ఇవి భారత్లో అసోం, సిక్కిం, అరుణాచలప్రదేశ్లలో లభిస్తాయి.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

5-17 ఏళ్లలోపు పిల్లలకు ఉచితంగా ఏడాదిపాటు ఆధార్ అప్డేషన్

దేశవ్యాప్తంగా 5 నుండి 17 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలకు ఏడాదిపాటు ఉచితంగా ఆధార్ అప్‌డేషన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఈ సౌకర్యాన్ని ప్రకటించింది. పిల్లల బయోమెట్రిక్ వివరాలు, ఫోటో, చిరునామా, మొబైల్ నంబర్ లేదా ఇతర వివరాల్లో మార్పులు అవసరమైనప్పుడు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ సేవను వినియోగించుకోవచ్చు. ఈ సదుపాయం కింద ఎటువంటి ఫీజులు లేదా సేవా ఛార్జీలు వసూలు చేయరు. పిల్లల పెరుగుదల దశలో వారి బయోమెట్రిక్ వివరాలు తరచుగా మారుతుండటంతో, ఆధార్ వివరాలు సరిగ్గా ఉండేలా ఈ ఉచిత సదుపాయాన్ని UIDAI అందిస్తోంది. తల్లిదండ్రులు సమీపంలోని ఆధార్ నమోదు లేదా అప్‌డేషన్ కేంద్రానికి వెళ్లి అవసరమైన పత్రాలతో ఈ సేవను పొందవచ్చు. అలాగే “మై ఆధార్ పోర్టల్” ద్వారా కూడా కొన్ని వివరాలను ఆన్లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ సరిగా ఉండడం వల్ల పిల్లలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, స్కాలర్‌షిప్‌లు, బ్యాంక్ సేవలు, పాఠశాల ప్రవేశాలు వంటి కార్యక్రమాల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవు. ఆధార్‌లో తప్పులు లేకుండా, తాజా వివరాలతో ఉంచడం ముఖ్యమని UIDAI సూచించింది. తల్లిదండ్రులు పిల్లల వివరాలను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సరిచూసుకోవడం ఉత్తమమని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు లబ్ధి పొందనున్నారు

ఎలూరు

ఆటోడ్రైవర్ లకు డబ్బులు శ్రమజీవుల సంక్షేమం పట్ల చంద్ర బాబు చిత్తశుద్ధికి నిదర్శనం సొసైటీ చైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు

చాట్రాయి అక్టోబర్ 4 (ఎన్ టుడే న్యూస్ రిపోర్టర్ గోళ్ళ సత్యనారాయణ) శ్రమ జీవులకు గౌరవమిస్తూ, స్వావలంబనకు ప్రోత్సాహాన్నిస్తూ “ఆటోడ్రైవర్ల సేవలో” పథకం ద్వారా ప్రతిఒక్క ఆటో, మాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ.15000-00 లు వారి బ్యాంకు ఖాతాలో కూటమి ప్రభుత్వం జమచేయడం శ్రమజీవుల సంక్షేమం పట్ల చంద్ర బాబు చిత్తశుద్ధికి నిదర్శనం అని చనుబండ సొసైటీ చైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు కొనియాడారు. శనివారం మధ్యాహ్నం చాట్రాయి మండలం, చనుబండ శివారు సూరంపాలెం గ్రామం నుండి మోరంపూడి శ్రీనివాస రావు, నక్కా రాము ఆధ్వర్యంలో ఆటోలను తీసుకుని మంత్రి కొలుసు పార్థసారథి సారథ్యంలో నూజివీడు లో జరుగు ఆటో ర్యాలీ, బహిరంగ సభకు వెళ్ళడం జరిగింది. సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీ ఇవ్వనప్పటికీ చంద్ర బాబు ఆటో డ్రైవర్లకు డబ్బులు వేయడం గొప్ప విషయం అని మోరంపూడి అన్నారు. నక్కారాము మాట్లాడుతూ ఆటో డ్రైవర్లందరూ కూటమి ప్రభుత్వం పట్ల కృతజ్ఞత తో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుడిమళ్ళ బ్రహ్మయ్య, కందుల శివయ్య, మునగంటి శ్రీను, మేడా వెంకటేశ్వర రావు, మాటూరి పాపారావు, మాటూరి వెంకటేశ్వర రావు, భూబత్తుల చెన్నారావు, ఆటో డ్రైవర్ లు కందుల నాగేశ్వర రావు, చీపు చెన్నారావు, దార్ల మన్మథ రావు, మేడా వెంకటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.