Sunday, 3 May 2026

Blog

అన్నమయ్య

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నందు పాల్గొన్న Wisdom School విద్యార్థులు

అన్నమయ్య జిల్లా, అక్టోబర్ 5( పున్నమి ప్రతినిధి అవినాష్ రెడ్డి) వరల్డ్ కరాటే మాస్టర్ అసోసియేషన్, చెన్నై వారి ఆహ్వానం మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కార్యక్రమంలో నందలూరు మండలంలోfcని విస్డం స్కూల్ కరాటే విద్యార్థులు పాల్గొనడం జరిగింది , చెన్నైలోని SIVET College, సెంబాకం నందు జరిగినది, ఈ కార్యక్రమం నాకు దేశం నలుమూలల నుంచి 1500 మంది కరాటే విద్యార్థులు పాల్గొనడం జరిగింది, విస్డం స్కూల్ నుండి వి. మనోజ్ఞ సాయి, బి. నివేదిత, ఎస్. మోక్షిత్,వి. నిర్వాన్ నందన్, ఎస్. సమీనా, ఎస్. తసీఫా, ఎస్. సాదిక్, ఎస్. మౌలా, నిత్యశ్రీ మరియు గోపీచంద్ పాల్గొన్నారు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తరుపున Mr రిషి నాథ్ Adjudicator వారి ముందు కరాటే విద్యను ప్రదర్శించడం జరిగింది. కార్యక్రమం ముగిసిన తర్వాత రిషి నాథ్ గారు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు నందు ఈవెంట్ ని నమోదు చేసి వరల్డ్ కరాటే మాస్టర్ అసోసియేషన్ వారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ ని అందజేయడం జరిగింది మరియు పాల్గొన్న విద్యార్థులకు పథకాలని మరియు సర్టిఫికెట్స్ ని అందజేయడం జరిగింది, మండలంలోని కరాటే మాస్టర్ సుధాకర్ ఈ కార్యక్రమానికి విద్యార్థిని తీసుకొని వెళ్లడం జరిగింది వారి అద్భుత ప్రదర్శన ద్వారా వారు ఈ అచీవ్మెంట్ ని సాధించడం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు మరియు విస్డం స్కూల్ కరస్పాండెంట్ వలిమి రాధ పిల్లల్ని అభినందించి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఫోటో రైట్ అప్ : మాస్టర్ వలిమి సుధాకర్. నందలూరు

తూర్పు గోదావరి

ద్విచక్ర వాహన మెకానికర్ల సంక్షేమానికి కృషి – ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.

350 మంది మెకానిక్ లకు ప్రమాద బీమా బాండ్లు అందచేత రాజమహేంద్రవరం : ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 350 మంది ద్విచక్ర మెకానికర్లకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి వారికి అందించడం జరిగింది. స్థానిక ఆర్టీసి కంప్లెక్స్ పక్కన ఉన్న శ్రీ రాజరాజేశ్వరి కల్యాణ మండపంలో ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్తిబాబు ఆధ్వర్యంలో, టిడిపి నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మాట ఇచ్చాం… నెరవేర్చమన్నారు. తమ కూటమి ప్రభుత్వం అవసరాలు తెలుసుకుని సంక్షేమ పధకాలు అమలు చేస్తోందన్నారు. సూపర్ సిక్స్ లోని దాదాపు అన్నీ పధకాలు అమలు చేయడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటో డ్రైవర్లు కాస్త ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి వారి కోసం కూటమి ప్రభుత్వం ప్రతి ఏడాది రూ. 15000 ఇస్తోందన్నారు. గత వైఎస్సార్సీపీ ఆటో కార్మికులకు రూ. 10000 వేలు ఇస్తే తాము రూ. 15000 ఇచ్చామాన్నారు. రూ. 1400 కోట్లతో రోడ్లు బాగుచేసినట్టు తెలిపారు. షరతులతో కూడిన పధకాలు వారివి… హద్దుల్లేని సంక్షేమం మాది అని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే సహకారంతో దాతలు కూడా ముందుకు వచ్చి పేదలను ఆడుకోవాలని పిలుపునిచ్చారు. తమ భవాని చారిటబుల్ ట్రస్ట్ తరపున పేద విద్యార్థులు, క్రీడాకారులకు సహకారం అందించడం, అలాగే నిరుపేదలకు వైద్యం కోసం ఆర్ధికం సహకారం అందిస్తున్నామని తెలిపారు. మెకానిక్ల సంక్షేమం కోసం ప్రమాద బీమా చేయించినట్టు తెలిపారు. అందరి సంక్షేమాన్నే తాము, తమ కూటమి ప్రభుత్వం కోరుకుంటున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్తిబాబు మాట్లాడుతూ మెకానిక్ డే రోజున ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు… ఇప్పుడు నెరవేర్చారు. భవాని చారిటబుల్ ట్రస్ట్ తరపున అనేకం చేస్తున్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అని అన్నారు. ప్రతిపక్షంలో చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పటి అధికార పార్టీ వైకాపా ప్రజా ప్రతినిధి ఇబ్బందులు పెట్టాడు, ఇప్పుడు కనిపించకుండా పోయాడు. ప్రజలకు అందుబాటులో ఉంటూ రెస్ట్ లేకుండా పని చేసే ప్రజా నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అని కొనియాడారు. నేనున్నానంటూ తోడుండే నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ అని అన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తారు ఆయన అని అన్నారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ , టిడిపి నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా మాట్లాడుతూ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఏకైనా నాయకుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. చర్చ్ లు, మసీదులు, దేవాలయాల అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారు. గత ప్రభుత్వం అందరి సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి పక్కన పెట్టేసింది. మిగిలిన నియోజకవర్గాలకు ఆదర్శంగా మన రాజమండ్రిని నిలిపేలా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ద్విచక్ర మెకానికర్లు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

గ్రూప్ 2 ఫలితాల్లో మండల పరిషత్ ఆఫీసర్ గా ఎన్నికైన :వల్లాల గ్రామ మహిళ

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూపు 2 ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకు సాధించిన వల్లాల గ్రామానికి చెందిన జాల భిక్షం,భద్రమ్మ గార్ల కూతురు అయిన జాల రజిత మండల పరిషత్ ఆఫీసర్ గా ఉద్యోగం సాధించడంతో వల్లాల గ్రామ ప్రజలు, ఉద్యోగ మిత్రులు, విద్యావంతులు, ఎక్కువగా హాజరై ఆమె ను, వారి తల్లిదండ్రులను, భర్త సైదులును సన్మానించడం జరిగింది.

కామారెడ్డి

గాంధారిలో సందడి రెడ్డి మల్లేష్ ఘనంగా జన్మదిన వేడుకలు

కామారెడ్డి,05 అక్టోబర్, పున్నమి ప్రతినిధి : హరీష్ రావు సభానంతరం.. మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నాయకుల సమక్షంలో వేడుకలు నిర్వహిం చారని రెడ్డి మల్లేష్ తెలిపారుమాజీ మంత్రి హరీష్ రావు సభతో కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం లో నెలకొన్న రాజకీయ సందడి కొనసాగింది. ఈ సభానంతరం, బి.ఆర్.ఎస్. పార్టీకి చెందిన పలువు రు కీలక నాయకులు, మాజీ ఎమ్మెల్యేల సమక్షంలో రామారెడ్డి మండలం గొల్లపల్లి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు రెడ్డి మల్లేష్ జన్మదిన వేడుకలు ఘనం గా జరుపుకున్నామన్నారు.వేముల ప్రశాంత్ రెడ్డి గ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, మాజీ ఎమ్మె ల్యే గంప గోవర్ధన్, మాజీ జుక్కల్ ఎమ్మెల్యే హను మంత్ షిండే ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు, జిల్లా అధ్యక్షులు మొజిబుద్దీన్, పడి గెల రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, నారాయణ రెడ్డి, తనజీ, శివాజీ రావు, సాయి గౌడ్, లింబాద్రి తదితరులు హాజరయ్యారు.ఉద్యమ నాయకులైన పెద్ద మల్లేష్ యాదవ్, కందుర్రి నరేష్, ఉపాధ్యక్షులు, యూత్ అధ్యక్షులు సుమన్, సీని యర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి, శ్రీధర్, ఉద్యమ నాయకులు పులి, జంగం లింగం వంటి పార్టీ కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో రెడ్డి మల్లేష్ కేక్ కట్ చేసి తన పుట్టినరోజును జరుపుకు న్నారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు, రెడ్డి మల్లేష్ సేవలను అభినందించారు. పార్టీ పట్ల ఆయన నిబద్ధత, కార్యకర్తలను సమన్వయం చేసు కునే తీరును ప్రశంసించారు. జన్మదినం సందర్భం గా నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాం క్షలు తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

భారత టీ20 జట్టు ఆస్ట్రేలియా టూర్ అక్టోబర్ 29 నుండి

భారత క్రికెట్ బోర్డు (BCCI) ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు భారత జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌ అక్టోబర్ 29, 2025 నుండి ప్రారంభమవుతుంది. 🏏 భారత టీ20 జట్టు (2025 ఆస్ట్రేలియా టూర్) కెప్టెన్: సూర్యకుమార్ యాదవ్ వైస్-కెప్టెన్: శుభ్‌మన్ గిల్ బ్యాట్స్‌మెన్: అభిషేక్ శర్మ, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, రింకు సింగ్ వికెట్ కీపర్లు: జితేష్ శర్మ, సంజు శాంసన్ ఆల్‌రౌండర్లు: ఆక్సర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ బౌలర్లు: వారుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా పేస్ బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా ఈ జట్టు అనుభవం, యువత, మరియు స్పిన్నర్లు, పేస్ బౌలర్లు వంటి విభాగాల్లో సమతుల్యతను కలిగి ఉంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ కొనసాగుతుండగా, శుభ్‌మన్ గిల్ వైస్-కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఇదే సమయంలో, శుభ్‌మన్ గిల్‌ను భారత ODI జట్టు కొత్త కెప్టెన్‌గా నియమించారు, శ్రేయస్ అయ్యర్ వైస్-కెప్టెన్‌గా నియమితులయ్యారు. రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ, టెస్ట్ మరియు టీ20 క్రికెట్ నుండి విరమించుకున్నప్పటికీ, వారు 50 ఓవర్ల ఫార్మాట్‌లో అందుబాటులో ఉంటారు మరియు ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా ODI జట్టులో చోటు పొందారు. ఈ సిరీస్ భారత క్రికెట్‌లో కొత్త నాయకత్వ మార్పుల దిశగా ఒక ముఖ్యమైన అడుగు. భారత జట్టు ఆటగాళ్ల ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది, ముఖ్యంగా యువ ఆటగాళ్లకు అవకాశం

కామారెడ్డి

“భారత్ మాతాకీ జై…. అంటూ,’ కామారెడ్డి జిల్లాలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల పాద సంచాలనం

కామారెడ్డి, 05 అక్టోబర్ పున్నమి ప్రతినిధి : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్థాపించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సంద ర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న శతాబ్ది ఉత్స వాలలో భాగంగా, మండల కేంద్రంలో ఆదివారం ఉదయం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అద్భుతమైన పాద సంచాలన (రూట్ మార్చ్) కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాత రం’ వంటి నినాదాలు మార్మోగుతుండగా, గణవేష్ (నిర్దిష్ట యూనిఫామ్) ధరించిన స్వయంసేవకులు క్రమ శిక్షణతో పట్టణ ప్రధాన వీధుల గుండా ప్రదర్శ న జరిపారు.పాద సంచాలనం అనంతరం నిర్వ హించిన సభలో ప్రధాన వక్త యాదిరెడ్డి ప్రసంగిం చారు. ఆయన సంఘ్ 100 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ, జాతీయవాదం, సమాజ సేవ, సంస్కృతి పరిరక్షణలో ఆర్ఎస్ఎస్ పోషిస్తు న్న పాత్రను వివరించారు. యాదిరెడ్డి మాట్లాడు తూ, “100 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ యాత్ర, దేశ భక్తిని, క్రమశిక్షణను ప్రతి భారతీయుడిలోనూ నింపడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని గుర్తు చేశారు.స్వయంసేవకులుగా మనం నిస్వార్థం గా దేశానికి సేవ చేయడానికి, సమాజంలో సకారా త్మక మార్పు తీసుకురావడానికి కృషి చేయాలి,” అని ఉద్బోధించారు. ఈ శతాబ్ది ఉత్సవాలు కేవ లం వేడుకలు మాత్రమే కాదని, రాబోయే తరాలకు మన సంస్కృతి, సంస్కారాల విలువను తెలియ జేసే గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. రామారెడ్డి వీధుల్లో క్రమశిక్షణతో కూడిన ప్రదర్శన రామారెడ్డి మండల కేంద్రంలోని ముఖ్య కూడళ్లు, ప్రధాన రహ దారుల గుండా సాగిన ఈ పాద సంచాలనం స్థాని కులను విశేషంగా ఆకట్టుకుంది. ఆర్ఎస్ఎస్ కార్య కర్తల పక్కా క్రమశిక్షణ, సామరస్యం వారి పట్టు దలను, సంఘటిత శక్తిని ప్రస్ఫుటం చేశాయి. ఈ కార్యక్రమం ద్వారా, ఆర్ఎస్ఎస్ తన వ్యవస్థాపక సిద్ధాంతాలను, భావజాలాన్ని విస్తృత జనంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అభి ప్రాయపడుతున్నారు. దేశ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధంగా ఉన్నదనే సందేశాన్ని ఈ శతాబ్ది ఉత్సవాలు బలంగా చాటి చెప్తున్నాయని నిర్మోహమాటంగా చెప్పారు.

ఖమ్మం

మెడికల్ అసోసియేషన్ ఏన్కూరు మండల అధ్యక్షులుగా గుడ్ల వెంకటేశ్వర్లు ఎన్నిక

ఏన్కూరు మండలం మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులుగా గుడ్ల వెంకటేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం ఏన్కూర్ లో సంఘం గౌరవ అధ్యక్షులు బస్మాంగి నాగేశ్వరరావు గారి అధ్యక్షతన ఏనుకూరు మెడికల్ అసోసియేషన్ మండల మహాసభ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులు గుడ్ల వెంకటేశ్వరావు మాట్లాడుతూ మండలంలోనీ మొత్తం మెడికల్ షాపులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని, ప్రజలకు నాణ్యమైన మందులు అందించే దానికోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని కోరారు. ఎక్కువ డిస్కౌంట్ వస్తుందని నాణ్యతలేని మందులను ప్రజలు కొనుగోలు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశం ఉందని నాణ్యమైన మందులను కస్టమర్లు అడిగి తీసుకోవాలని ఆయన అన్నారు. అదేవిధంగా మెడికల్ అసోసియేషన్ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రజలకు ఉపయోగపడే విధంగా మెడికల్ క్యాంపులు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింధని పేర్కొన్నారు. ఈ సమావేశానికి ఏన్కూర్, జన్నారం, నాచారం, బిఆర్ పురం, తిమ్మారావుపేట గ్రామాలకు చెందిన మెడికల్ షాప్ యజమానులు హాజరయ్యారు. గౌరవ అధ్యక్షులుగా బస్మాంగి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా పాలెపు పాపారావు, కోశాధికారిగా దొడ్డ శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులుగా జవ్వాజి శ్రీనివాసరావు, కోపిల రామారావు, షేక్ హుస్సేనుద్దీన్, షేక్ అన్వర్, లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి. మోహన్, బి. శ్రీనివాసరావు, వంశీకృష్ణ, షేక్ పెంటు సాహెబ్, షేక్ జానీ, తుమ్మలపల్లి మధు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి

‘రిజర్వేషన్ల ఫలాలు దక్కాలంటే.. బీసీ యువతే ముందుండాలి’: సదాశివ్ నగర్ వ్యక్తి ఆవేదన

కామారెడ్డి, 05 అక్టోబర్, పున్నమి ప్రతినిధి : కామారెడ్డి జిల్లా, సదాశివ్ నగర్ మండలం: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ, కేవ లం రిజర్వేషన్ల ప్రకటనతో సరిపెట్టుకోకుండా, ఆ రాజకీయ అధికార ఫలాలను పూర్తిగా అందుకోవా లని బీసీ యువత వర్గం నుంచి బలంగా డిమాండ్ వినిపిస్తోంది. ఈ మేరకు కామారెడ్డి జిల్లా, సదాశివ నగర్ మండలానికి చెందిన ఒక వ్యక్తి తన ఆవేదన ను, ఆకాంక్షను వ్యక్తం చేస్తూ, బీసీ యువత, సామా జిక వర్గం మేల్కొని ఐక్యత చాటాలని పిలుపు నిచ్చారు. బీసీ రిజర్వేషన్లు ఒక చారిత్రక అవకాశంస్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల శాతం పెంచ డం పట్ల ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. దశాబ్దాలుగా తమకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం దక్కడం లేదనే, బీసీల చిరకాల వాంఛను కొంత మేర నెరవేర్చిందనే చెప్పాలి. అయితే, ఈ అవకా శాన్ని కేవలం కొత్తగా చూడకుం డా, రాజకీయ సాధి కారతకు వేదికగా మలచుకోవాల్సిన అవసరం ఉందని సదాశివ నగర్ వ్యక్తి అభిప్రా యపడ్డారు.”కేవలం రిజర్వేషన్లు ప్రకటించినంత మాత్రాన మన సమస్యలు తీరవు. ఈ రిజర్వేషన్ల వల్ల సీట్లు బీసీలకు కేటాయిస్తారు. కానీ, మన సామాజిక వర్గం వారే అధిక సంఖ్యలో ఓట్లు వేసి, అత్యధిక మెజార్టీతో మన అభ్యర్థులను గెలిపించినప్పుడే ఆ రిజర్వేషన్లకు నిజమైన సార్థకత ఉంటుంది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘మెజార్టీ ఇచ్చి పదవుల్లో నిలబెట్టాలి’ బీసీ సామాజిక వర్గం సంఖ్యా పరంగా పెద్దదైనప్పటికీ, రాజకీయంగా ఐక్యత లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో అధికారంలో వాటా పొందలేకపోతున్నామని ఆయన స్పష్టం చేశారు. “ఇప్పుడు మనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బీసీ యువత, ప్రజలు మొత్తం కలిసికట్టుగా మన సామాజిక వర్గం తరపున నిలబడే అభ్యర్థులకు గరిష్ఠ సంఖ్యలో ఓట్లు వేసి, వారిని వివిధ పదవుల్లో ఉన్నత స్థానంలో నిలబెట్టాలి.అప్పుడే మన గొంతు బలంగా వినిపిస్తుందని ఆవేదన వినిపించా రు. స్థానికంగా మన సమస్యలు పరిష్కార మవుతా యని ఆయన పేర్కొన్నారు. చిరకాల ప్రజల ఆకాం క్ష సామాజిక న్యాయం వైపు అడుగు బీసీలకు రిజర్వేషన్లు పెంచడం అనేది కేవలం రాజకీయ కోణం మాత్రమే కాదని, సామాజిక న్యాయం దిశగా వేసిన కీలక అడుగు అని ఈ సందర్భంగా పలువు రు అభిప్రాయపడ్డారు. అయితే, ఆ న్యాయం ఫలవంతం కావాలంటే, బీసీ సామాజిక వర్గం తమ ఓటు హక్కును నిర్ణయాత్మక శక్తిగా మార్చుకోవాల ని వారు సూచించారు.సదాశివ నగర్ వ్యక్తి ఆవేద న ఒక్క ఈ ప్రాంతానికే పరిమితం కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్లు దక్కిన బీసీ యువతరం మనసులో మెదులుతున్న ముఖ్యమైన ప్రశ్నగా మారింది. రిజర్వేషన్ల ద్వారా లభించిన రాజ్యాంగ బద్ధమైన హక్కును, ప్రజల ఓటు ద్వారా లభించే రాజకీయ శక్తిగా మార్చు కోగలరా!! అనేదే ఇప్పుడు అందరి ముందున్న ప్రధాన సవాల్. మరి ఈ రిజర్వే షన్లను కేవలం అవకాశంగా కాకుండా, రాజకీయ అధికారాన్ని సాధించే సాధనంగా బీసీ యువత గట్టి నినాదాలు మలచుకోవాలాని పిలుపునిచ్చారు

కామారెడ్డి

భక్తజన సంద్రోహం.. రామారెడ్డిలో దుర్గామాత శోభాయాత్ర – అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

కామారెడ్డి, 05 అక్టోబర్ పున్నమి ప్రతినిధి : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో గాంధీ సమైక్య యువజన దుర్గ మండలి ఆధ్వర్యం లో దుర్గామాత శోభాయాత్రను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు, గ్రామ స్తులు తండోపతండాలుగా తరలివచ్చి, రామారెడ్డి ప్రధాన వీధులన్నీ భక్త జన సంద్రోహంతో నిండిపో యాయి.అష్టాదశ శక్తి మాతల ఊరేగింపు శోభా యాత్రలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో అష్టాదశ శక్తి మాతల (18 శక్తి స్వరూపాల) విగ్రహా లను అలంకరించి ప్రత్యేక వాహనంలో ఊరేగిం చారు. ఈ రథయాత్రను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మండలి సభ్యులు, మహిళలు, భక్తులు, గ్రామస్తులు ఈ శోభాయా త్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు శోభాయాత్రలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జగిత్యాల జయ కృష్ణ డ్యాన్స్ బృందం వారు ప్రదర్శించిన నృత్యాలు, కార్యక్రమానికి మరింత శోభను తీసుకొచ్చాయి. వారి ప్రదర్శనలను తిలకించేందుకు గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ శోభాయాత్రలో భక్తులు అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించా రు. ఈ శోభాయాత్ర విజయవంతం కావడానికి గాంధీ యువజన సమైక్యం మండలి సభ్యులు ఎంతగానో కృషి చేశారు.

హైదరాబాద్

*దసరా రిటర్న్ రష్* -హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ జాం.. – జనం పడిగాపులు

**పున్నమి స్టాప్ రిపోర్టర్: యామల రామమూర్తి** **హైదరాబాద్:** దసరా పండుగ సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్లిన నగరవాసులు తిరిగి హైదరాబాద్‌కు చేరుకోవడంతో ప్రధాన రహదారులపై, ముఖ్యంగా **హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారి (NH-65)**పై ఆదివారం తీవ్ర రద్దీ నెలకొంది. సెలవులు ముగియడం, సోమవారం కార్యాలయాలు ప్రారంభమవుతుండటంతో, అందరూ ఒకేసారి రిటర్న్ జర్నీకి బయలుదేరారు. దీంతో హైవేపై అనేక చోట్ల వాహనాలు బారులు తీరాయి. **హైవేపై కిక్కిరిసిన వాహనాలు.. టోల్ ప్లాజాల వద్ద తీవ్ర ఇబ్బందులు** * **రద్దీ తీవ్రత:** విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే రహదారిపై కార్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. వాహనాల రాకపోకలు చాలా **నిదానంగా** సాగుతున్నాయి. * **జామ్ పాయింట్స్:** ముఖ్యంగా **చిట్యాల, చౌటుప్పల్, మరియు పంతంగి టోల్ ప్లాజాల** వద్ద రద్దీ తీవ్రంగా ఉంది. టోల్ చెల్లింపుల కోసం వాహనదారులు సుదీర్ఘ సమయం వేచి ఉండాల్సి వచ్చింది. చౌటుప్పల్ వంటి కీలక పాయింట్లలో ట్రాఫిక్ దాదాపు స్తంభించిపోయింది. * **ప్రయాణికుల అవస్థలు:** ఆర్టీసీ బస్సులు మరియు ప్రైవేట్ వాహనాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌ల కారణంగా గంటల తరబడి ప్రయాణం ఆలస్యం కావడంతో, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. **బస్టాండ్లలో బస్సుల కోసం పడిగాపులు** హైవేపై రద్దీ ఒకవైపు ఉంటే, గ్రామాల్లోని బస్టాండ్‌ల వద్ద పరిస్థితి మరోలా ఉంది. * **ఎన్టీఆర్ జిల్లా నందిగామ బస్టాండ్** వంటి ప్రధాన స్టాప్‌ పాయింట్ల వద్ద ప్రయాణికులు బస్సులు, ఇతర రవాణా కోసం గంటల తరబడి **పడిగాపులు** కాస్తున్నారు. నగరానికి చేరుకునేందుకు అధిక ధరలు చెల్లించి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. * **సెలవుల ప్రభావం:** ఉద్యోగులకు దసరా సెలవులతో పాటు వీకెండ్ (శని, ఆదివారాలు) కలసి రావడంతో, అందరూ ఒక్కరోజే నగరానికి తిరిగి రావడానికి ప్రయత్నించారు. రేపు (సోమవారం) ఉదయమే ఆఫీసులకు వెళ్లాలనే ఒత్తిడితో ఈ రిటర్న్ రష్ ఏర్పడింది. **పోలీసుల పర్యవేక్షణ** పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు, చౌటుప్పల్, పంతంగి ప్రాంతాలలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. అదనపు టోల్ గేట్లను తెరిపించి, ఫాస్ట్‌ట్యాగ్ లేని వాహనాలను కూడా వేగంగా పంపించేందుకు ప్రయత్నించారు. అయితే, భారీగా వాహనాలు తరలిరావడంతో, రాత్రి వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా, దసరా పండుగ సంతోషం ముగిసినప్పటికీ, రిటర్న్ జర్నీ మాత్రం ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలను మిగిల్చింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.