Thursday, 30 April 2026

Blog

తిరుపతి

రాహుల్ గాంధీ కి మద్దతుగా ఓట్ చొర్ గద్దిచోడ్ కార్యక్రమం

AICC పిలుపు మేరకు PCC అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ఆదేశానుసారం రేణిగుంట మండలం,మామండూరు పంచాయితీ నందు ఓట్ చొర్ గద్దిచోడ్ కార్యక్రమం పై ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా DCC అధ్యక్షులు బాలగురవం బాబు విచ్చేసి భారతదేశంలో ఓట్ల పై జరుగుతున్నటువంటి అవకతవకలను ఎండగడుతూ రాహుల్ గాంధీకి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సైనికుల వలె అండగా ఉంటారని తెలియజేశారు.శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ ఓట్ చోర్ గద్దిచోడ్ కార్యక్రమం కు ప్రజలలో పూర్తి మద్దతు లభిస్తుందని, రాబోవు రోజుల్లో రాహుల్ గాంధీ తెలిపిన విధంగా ఈ ఓట్ల కుంభకోణం పై ప్రజలు సరైన రీతిలో తీర్పునిస్తారని మార్పు తథ్యం అని తెలిపారు.

తిరుపతి

శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి కి మాక్స్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ విరాళం

శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి కి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మిత్రులు మాక్స్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత BV.V.S.N రాజు 1,000,000 రూపాయల సిఎస్ ఆర్ ఫండ్స్ ద్వారా అందించడం జరిగింది.ఈ ఫండ్ అందడంతో ఆసుపత్రికి అధునాతన వైద్య పరికరాలను సమకూర్చడం శుభ పరిణామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా మాక్స్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత బి.వి.వి.ఎస్.ఎన్ రాజు కి శ్రీకాళహస్తి ప్రజల తరఫున ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

విశాఖపట్నం

**ప్రజాగ్రహ జ్వాలల సెగ తగిలిన అంబుజా సిమెంట్**

*గాజువాక లో ప్రజా పోరు… పోరాట యోధులుగా మారిన స్థానిక ప్రజలు*…. గాజువాక అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) ప్రజాభిప్రాయ సేకరణలో రాజకీయ పార్టీల నేతలు ఎక్కడ… కొన్ని ప్రజాసంఘాలు తప్ప మిగిలిన అందరూ తూ తూ మంత్రంగానే మద్దతు…. కనీసమద్దతు కూడా తెలుపని అధికార, విపక్షాలు రాజకీయాల పార్టీల అండ లేకపోయినా మరేం పరవాలేదు అంటూ , ఈ పోరాటంలో అవసరమైతే ప్రాణ త్యాగానికి కూడా సిద్ధం అంటున్న స్థానికులు…. ప్రజాభిప్రాయ సేకరణ లో గర్జించిన సామాన్యులు, ప్రజాభిప్రాయ సేకరణ సభకు అధిక సంఖ్యలో వచ్చిన26 గ్రామాల ప్రజలు, ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన ఆర్డిఓ నునిర్వాసితులు అడ్డుకున్నారు, ప్రజా వ్యతిరేకతతో అధికారులు వెనుతిరిగారు… ఇక అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మానానికి వ్యతిరేకంగా పెద్దగా నినాదాలు చేసారు, కుర్చీలు విసిరేసి మరి *గో బ్యాక్ అంబుజా* అంటూ భారీగా నినాదాలతో ప్రజాగ్రహ జ్వాలలు చవి చూపరు… దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడడంతో పోలీసులు ఆందోళనకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసి వారిని అదుపు చేశారు…

ఖమ్మం

పరిమితిని మించి క్వారీ లోతు తవ్వుతున్న కంకర్ మిల్లు నిర్వాహకులు

ఓవర్ బ్లాస్టింగ్లతో క్రాక్ ఇస్తున్న ఇల్లు నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తున్న మైనింగ్ శాఖ ఏన్కూర్ మండల పరిధిలో గల గార్ల ఒడ్డు గ్రామ సమీపంలో ఉన్నటువంటి కంకర్ మిల్లు నిర్వాహకుల తీరు పై గ్రామ ప్రజలలో తీవ్ర విమర్శలు  వెల్లువెత్తుతున్నాయి . కంకర మిల్ నిర్వాహకులు మైనింగ్ శాఖ అధికారులు ఇచ్చినటువంటి పరిమితిని మించి లోతుగా త్రోవుతున్నారు. వారు రాయి కోసం ఓవర్గా బ్లాస్టింగ్ లు చేస్తున్నారు బ్లాస్టింగ్ చేసినప్పుడు ఆ రాళ్లు పక్కనే ఉన్నటువంటి పంట పొలాల్లో పడుతున్నాయి. రైతులు తీవ్ర ఇబ్బందులుకు గురవుతున్నారు. ఈ యొక్క కంకర మిల్లు ఊరికి దగ్గరలో ఉండటం బ్లాస్టింగ్ చేసినప్పుడు చాలా ఇళ్ళు గోడలు క్రాక్ వస్తున్నాయని అలాగే ఎల్ఈడి టీవీలు సైతం కాలిపోతున్నాయి. బ్లాస్టింగ్ చేయటానికి వాడేటువంటి బాంబులో కెమికల్స్ అవి పేలిన సమయంలో గాలిలో పొల్యూట్ అవుతూ ఊరికి దగ్గరలో ఉండేటువంటి ప్రజలకి దుర్వాసన వస్తూ ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ క్వారీల చుట్టూ పచ్చని వాతావరణం ఉండటం వలన మేకలు గొర్రెల మందలు మేతకు అటుగా వెళ్ళినప్పుడు ఆ క్వారీలో జారిపడుతూ అలాగే ఆ మూగ జీవాలు క్వారీలో ఆగినటువంటి నీళ్లు తాగటానికి వెళ్లి నీటిలో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. అయినప్పటికీ వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆ క్వారీలలో రాళ్లు తీసుకొని క్రషింగ్ చేస్తూ వాటిని అమ్ముకొని సోమ్ము చేసుకుంటున్నారు. ఆ కంకర మిల్లుకు వెళ్ళేటటువంటి దారి పంట పొలాలకు ఆనుకొని ఉండటం రోజు ఆ దారిలో అధికంగా టిప్పర్లు తిరగటం వలన టిప్పర్లు వెళ్లే వేగానికి మట్టి దువ్వారం గాలికి లెస్తూ పక్కనే ఉన్నటువంటి పంట పొలాల మీద పడుతూ పంట పొలాలు వేసేటువంటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అలాగే ఆ దారికి వాహనాల తాకిడి ఎక్కువగా ఉండటం వలన దారి అంతా గుంతల మయంగా మారింది. రైతులు అదే దారిన వెళ్ళవలసి రావటం ఆ గుంటలు పడిన దారిలో వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం గురించి రైతులు ప్రజలు సంబంధిత ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోకవటం ప్రజలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నత అధికారులు కంకర మిల్ నిర్వాహకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఖమ్మం

బీజేపీ ఖమ్మం రూరల్ మండల స్థానిక సంస్థ ల ఎన్నికల సన్నాహాక సమావేశం

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం రూరల్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల సంబంధిత సమావేశం మండల అధ్యక్షుడు మధు నాయక్ అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులు గా తెలంగాణ బీజేపీ కోశాధికారి దేవకీ వాసుదేవ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ,పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థి నున్న రవికుమార్ లు హాజరై నారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ కోశాధికారి దేవకీ వాసు దేవరావ్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీకి అత్యంత ప్రాధాన్యత కలిగినవని, ప్రతి గ్రామంలో బూత్ స్థాయి వరకు బలమైన కట్టుదిట్టమైన సంఘటనా నిర్మాణం చేయాలని సూచించారు. గ్రామ స్థాయిలో ప్రతి కార్యకర్త ఓటరును వ్యక్తిగతంగా కలవాలని, కేంద్రం నుండి రాష్ట్రం వరకు బీజేపీ ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజల ప్రయోజనకర పథకాల గురించి వివరిస్తూ, పార్టీ ఆలోచనా ధోరణిని ప్రజలకు చేరవేయాలన్నారు బిజెపి ఆలోచనా ధోరణి ప్రజల అభివృద్ధి, దేశ భద్రత, యువతకు అవకాశాలు, రైతులకు మేలు, మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించాలన్నారు అదేవిధంగా చేయవలసిన కార్యక్రమాలు: బూత్ కమిటీల బలోపేతం – ప్రతి బూత్‌లో కనీసం 20 మంది క్రియాశీలక కార్యకర్తలతో బలమైన కమిటీ ఏర్పాటు చేయాలి. జడ్పిటిసి అభ్యర్థులు ప్రతి గ్రామాన్నీ పర్యటించాలి. ఎంపీటీసీ అభ్యర్థులు తమ పరిధిలోని యువజన సంఘాలు, మహిళా సంఘాలు, వివిధ సంఘాల నాయకులను నేరుగా కలవాలి. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రవి రాథోడ్ నగిరిగంటి వీరభద్రం జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లగట్టు ప్రవీణ్ మరియు మండల నాయకులు నలమసు శీను, సోనుపల్లి శీను తదితర నాయకులు పాల్గొన్నారు..

నిర్మల్

ఎడ్ బిడ్ గ్రామంలో సత్యమ్మ ఆలయ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

(పున్నమి ప్రతినిధి తేదీ 6 .10. 2025 నిర్మల్ జిల్లా)ఈ రోజు ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామంలో సత్యమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత ఎమ్మెల్యే గారు చింతకుంట గ్రామానికి చేరుకొని, ఎన్నికల హామీ ప్రకారం పురాతన హనుమాన్ ఆలయానికి వెళ్లే మార్గంలో బిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు పూర్తి చేసినందుకు, గ్రామస్థులు ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారి ప్రజా సేవా తపనను ప్రశంసించి కృతజ్ఞతలు తెలిపారు. 🙏💐

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మాదకద్రవ్యాలతో భవిష్యత్‌ నాశనం : పొదలకూరు సీ.ఐ శివరామకృష్ణారెడ్డి*

*మాదకద్రవ్యాలతో భవిష్యత్‌ నాశనం : పొదలకూరు సీ.ఐ శివరామకృష్ణారెడ్డి* _*మాద్యక ద్రవ్యాలు, ఈవ్ టీచింగ్, పై విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో అవగాహన* పొదలకూరు పున్నమి ప్రతినిధి :మాదకద్రవ్యాల అలవాటుతో భవిష్యత్‌ నాశనమ వుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి, ఎస్.ఐ హనీఫ్ అన్నారు.బుధవారం పట్టణం లోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో మాదకద్రవ్యాల నివారణ, ఈవ్ టీచింగ్- ర్యాగింగ్ పై పొదలకూరు ఎస్. ఐ హనీఫ్ తో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీ.ఐ శివరామకృష్ణ రెడ్డి ,ఎస్.ఐ హనీఫ్ మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్‌ నాశనమవుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో గొప్పవాళ్ళను చేయాలనే ఆశతో ఉంటే కొంత మంది యువత డ్రగ్స్‌కు అలవాటుపడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. డ్రగ్స్‌ సరఫరా చేసేవారి ఆట కట్టించడానికి పోలీస్‌ సిబ్బంది సిద్ధంగా ఉన్నామని 112 లేదా సమీపంలో పోలీస్‌ వారికి తెలియజేయాలని సూచించారు.ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ అనేవి నేరమని, ఎవరైనా తోటి విద్యార్థులపై ర్యాగింగ్ కు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలుంటాయని భవిష్యత్తు కోల్పోతారని తెలిపారు.సమస్యలు ఎదురైనప్పుడు యువత ధైర్యంతో ఎదుర్కొవాలే తప్ప ఆత్మహత్య అనేది సమస్యలకు పరిష్కారం కాదన్నారు. కళాశాలలు , ఆలయాలు, ప్రధాన కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిది అన్నారు.గ్రామాల్లో ప్రవేశ ద్వారం ,ఆలయాల వద్ద గ్రామాని కి వెలుపలకు వెళ్లే మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను నియంత్రించగల్గుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జూనియర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్స్ ఏ.సుబ్బారావు, జి .ఎన్ .రెడ్డి, అకడమిక్ డీన్ చల్లా వెంకటకృష్ణ, జూనియర్ కాలేజ్ , వైస్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, అధ్యాపక బృందం, పోలీసు సిబ్బంది సౌమ్య,మోహన్,రవితేజ, రసూల్ పాల్గొన్నారు.ఇది

నిర్మల్

🔸దేగాం గ్రామంలో దత్త మందిర్ హుండీ లెక్కింపు – రూ.20,025 వసూలు

(పున్నమి ప్రతినిధి తేదీ 8 .10. 2025 నిర్మల్ జిల్లా)దేగాం గ్రామంలోని శ్రీ దత్త మందిర్లో ఈరోజు బాబు మహారాజ్ సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తుల నిత్య సేవలతో కూడిన ఈ హుండీ లెక్కింపులో మొత్తం రూ.20,025 వసూలైనట్లు నిర్వాహకులు తెలిపారు. వసూలైన మొత్తాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో బాబు మహారాజ్ గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బాహురావు పటేల్ (దేగాం), ఆనందరావు పటేల్ (దేగాం), బాబురావు పటేల్ (మాంజిరి), దిగంబర్ పటేల్ (పాంగ్రి), బాలాజీ పాటిల్ (వాలేగాం) తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి భావంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

జోగులాంబ గద్వాల

తెలంగాణ సరిహద్దులో చెక్ పోస్ట్ ఏర్పాటు.

అలంపూర్ : అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి ) తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తుండడంతో జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సరిహద్దు చెక్ పోస్టు ఏర్పాటు చేసి వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఎస్సై కిరణ్ కుమార్ మరియు సిబ్బంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్న వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా నగదు, మద్యం, ఓటర్లను ప్రలోభ పెట్టి వస్తువుల తరలింపు పై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు చేస్తున్నారు. అలాగే వాహనదారులకు ఎన్నికల కమిషన్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. వాహనదారులు 50 వేల రూపాయలకు పైబడి తమ వెంట తీసుకుని వెళ్లరాదు. అధిక మొత్తంలో డబ్బులు తమ వెంట తీసుకుని వెళుతున్నట్లయితే సంబంధిత పత్రాలు ఉంచుకోవాలి. ఓటర్లలను ప్రలోభ పెట్టే సరైన ధృవ పత్రాలు లేని నగదు మద్యం వస్తువులను సీజ్ చేయడం జరుగుతుందని ఎస్సె తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావడంతో పోలీసులు అప్రమత్తంతో తనిఖీలు చేస్తున్నారు.

నిర్మల్

ఆన్లైన్ ఫ్రాడ్ పై అప్రమత్తత – డాక్టర్ M. శంకర్

(పున్నమి ప్రతినిధి తేదీ 8 .10. 2025 నిర్మల్ జిల్లా)భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆన్‌లైన్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ రంగ నిపుణుడు డాక్టర్ M. శంకర్ ప్రధాన అతిథిగా పాల్గొని, విద్యార్థులు మరియు సిబ్బందికి సైబర్ భద్రతపై విలువైన సూచనలు అందించారు. డాక్టర్ శంకర్ మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయని, పని పేరుతో మోసాలు, ట్రేడింగ్/ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లు, ఫిషింగ్, విషింగ్, సిమ్ స్వాప్, నకిలీ షాపింగ్ వెబ్‌సైట్లు వంటి పద్ధతుల ద్వారా ప్రజల నుంచి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని వివరించారు. అమాయక ప్రజల అత్యాశను, భయాన్ని వాడుకుని మోసగాళ్లు లక్ష్యాలను చేరుకుంటున్నారని చెప్పారు. “అధిక లాభాల ఆశ వద్దు, అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకండి, OTP లేదా PIN వంటి వ్యక్తిగత వివరాలను ఎవరికీ ఇవ్వవద్దు” అని సూచించారు. మోసపోయినవారు వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరూ డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించుకోవడం, సురక్షితమైన ఆన్‌లైన్ అలవాట్లు అలవరచుకోవడం అత్యవసరమని అన్నారు. చివరగా ఆయన “ప్రతి వ్యక్తి అప్రమత్తంగా ఉంటేనే సైబర్ మోసాల నుంచి రక్షించుకోగలరు — మీ అప్రమత్తతే మీ ఆస్తికి రక్ష” అని సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పవన్ పాండే, ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ యు రవికుమార్ డాక్టర్ పీజీ రెడ్డి, జి సుధాకర్, డాక్టర్ జే ఓం ప్రకాష్, సురేందర్, డాక్టర్, సంతోష్, డాక్టర్,నహీదా, దివ్య, డాక్టర్ కల్పన రాజయ్య, కిషన్ మరియు విద్యార్థులు, నాన్ టీచింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.