Thursday, 30 April 2026

Blog

తిరుపతి

ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పిద్దాం..డాక్టర్ బాలు

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ లో సవరణలు చేసిన సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీ యు పి హెచ్ సి సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలు సిబ్బందితో కలిసి గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పిద్దామని పిలుపునిచ్చారు.జీఎస్టీ సవరణలతో ఆరోగ్యానికి సంబంధించిన మెడిసిన్స్, మెడికల్ కిట్లు ధరలు తగ్గించి ప్రజలందరికి ఆరోగ్య భద్రత కల్పించడం కోసం కృషిచేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ,ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్,రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లకు ధన్యవాదాలు తెలియజేశారు.బీమా,ఆరోగ్యానికి సంబంధించి ఆపరేషన్ కిట్లను,తదితర వస్తువుల సంబంధించిన రేట్లు తగ్గించడంతో ప్రతి కుటుంబానికి ఆపరేషన్ ఖర్చులు కూడా తగ్గుతాయని కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది,ఏఎన్ఎంలు,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

*శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యురాలు కోలా విశాలాక్షి గారికి ఘన సన్మానం*.

*శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యురాలు కోలా విశాలాక్షి గారికి ఘన సన్మానం*. *ఏడం కృష్ణయ్య, తొట్టంబేడు మండల అధ్యక్షులు*. *శ్రీకాళహస్తి ధర్మ కండలి సభ్యులుగా నియమితులైన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ గారి కోలా వైశాలి గారికి బిజెపి తొట్టంబేడు మండల అధ్యక్షులు ఏడం కృష్ణయ్య ఆధ్వర్యంలో ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది* *ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కొండేటి గోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, సీనియర్లు కూనాటి నాగరాజు, మండల అధ్యక్షులు భగీర్తి వెంకటేష్, మండల ఉపాధ్యక్షులు కందాటి మునిరాజా, రాజనాల, పాపయ్య, చొక్కాని రవిచంద్ర, ఢిల్లీ బాబు, పుచ్చకాయల రమేష్ యాదవ్, కిషోర్ రెడ్డి,సజ్జా హరీష్, కుమార్, బిందు రాయల్, అనిల్ తదితరులు పాల్గొన్నారు*.

ఆంధ్రప్రదేశ్

సర్వేంద్రియానాం నయనం ప్రధానం.- కళ్లు మనకు దేవుడిచ్చిన అపురూపమైన నిధి. – లయన్ డా.పైడి.సింధూర (శ్రీకాకుళం నగరం – అక్టోబర్ పున్నమి ప్రతినిధి)

కళ్లు మనకు దేవుడిచ్చిన అపురూపమైన నిధని, వాటిని కాపాడుకోవలసిన బాధ్యతని మనదేనని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు లయన్ డా.పైడి.సింధూర అన్నారు. స్థానిక కెఎల్ నాయుడు కంటి వైద్యశాలలో, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ప్రముఖ కంటివైద్య నిపుణులు కెఎల్ నాయుడు సహకారంతో కంటి రోగులకు ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించి, అవసరమైన రోగులకు ఉచిత మందులను అందించారు. ఈ సందర్భంగా లయన్ డా.పైడి.సింధూర, వైద్యనిపుణులు కెఎల్ నాయుడు మాట్లాడుతూ కంటి సంరక్షణ జాగ్రత్తగా కాపాడుకోవడం మన విధని, మనం ప్రతీ వస్తువును చూడాలన్నా కళ్లు చాలా అవసరమని తెలిసినా, చాలా మంది కళ్ల విషయంలో చాలా అజాగ్రత్తగా ఉంటారన్నారు. కంటి నుంచి నీరు కారినప్పుడో.. తలనొప్పిగా ఉన్నప్పుడో.. మామూలు అద్దాల దుకాణానికి వెళ్లి పరీక్షలు చేయించుకోకుండానే కంటి అద్దాలు వాడుతుంటారని, కళ్లను మనం జాగ్రత్తగా చూడకపోతే భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అవగాహన కల్పించందుకు ప్రతి ఏటా అక్టోబర్‌ రెండో గురువారం నాడు ‘ప్రపంచ దృష్టి దినోత్సవం’ ను నిర్వహిస్తున్నారన్నారు. అంధత్వ సమస్యలపై ప్రజలను జాగృతం చేసి వీలున్నంత మందికి మెరుగైన కంటిచూపును అందించడమే ఈ ‘ప్రపంచ దృష్టి దినోత్సవం’ ప్రత్యేకతని, ప్రజలకు కంటి సమస్యలను దూరం చేయాలన్న సదుద్దేశంతో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు ఇవ్వడం, సర్జరీలు చేయడం, మందులు ఇవ్వడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ. రవి కుమార్, మెంటార్ నటుకుల. మోహన్ మాట్లాడుతూ కంటి చూపును మంచిగా ఉంచే ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలని, ఏ విటమిన్‌తో పాటు బీటారెరోటిన్‌ అధికంగా లభించే క్యారెట్లు నిత్యం తినేలా చూసుకోవాలని, గుడ్లు, బీన్స్, నారింజ పండ్లు, బొప్పాయి, బాదాం ఎక్కువగా తినాలని, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సాయపడే ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్‌ లభించే చేపలను ఎక్కువగా తినాలన్నారు. కళ్లు ఆరోగ్యం ఉంచడంలో నట్స్ కీలక పాత్ర పోషిస్తాయని, వాల్‌నట్స్, బాదం, పిస్తా వంటి నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-ఇ ఉంటాయి. ఇవి మీ కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం. రామ్ గోపాల్, సభ్యులు రామ్ మోహన్, పైడి. ప్రదీప్ కుమార్, సింధూర వైద్యశాల సిబ్బంది, కెఎల్ నాయుడు కంటి వైద్యశాల సిబ్బంది, కంటి వ్యాధిగ్రస్థులు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

స్థానిక సంస్థ ల ఎన్నికల్లో ప్రజల కి ఇచ్చిన హామీ లని తుంగ లో తొక్కిన అధికార కాంగ్రెస్ ని ఒడిద్దాం :సత్తుపల్లి మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య

ఖమ్మం అక్టోబర్ (పున్నమి ప్రత్యేక ప్రతినిధి) ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన అధికార కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడించాలి అని సత్తుపల్లి మాజీ శాసన సభ్యులు భారత రాష్ట్ర సమితి రాష్ట్రనాయకులు సండ్ర వెంకట వీరయ్య కార్యకర్తలకి పిలుపినిచ్చారు ఖమ్మం లో బుధవారం నాడు జిల్లా అధ్యక్షులు తాత మధు అధ్యక్షతన జరిగిన స్థానిక సంస్థ ల సన్నాహక సమావేశం లో అయన పాల్గొని మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ హయాంలో తెలంగాణ సాధకుడు కెసిఆర్ చేసిన అభివృద్ధి తప్పితే జిల్లాకి ముగ్గురు మంత్రులు చేసిందేంటో చెప్పుకోలేని పరిస్థితని అన్నారు అహర్నిశలు పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకే స్థానిక సంస్థ ఎన్నికల్లో పెద్దపీట వేస్తాం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండబెట్టడం కోసం ప్రతి కార్యకర్త నడుంబిగించి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ రూపొందించిన కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి చేరవేసే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు అమలు కానీ హామీలలతో తెలంగాణ ప్రజలను నయవంచన చేసిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పక్కా ప్రణాళికతో నాయకులు మరియు కార్యకర్తలు పనిచేయాలన్నారు జిల్లా పార్టీ కార్యాలయంలో సమన్వయం కోసం ఎన్నికల సెల్ మరియు లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు ప్రభుత్వ ఆగడాలను నిర్బంధాలను ఎదుర్కోవటం కోసం కార్యకర్తలకు జిల్లా కేంద్రం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఈ సన్నాహక ఈ సమావేశం లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు, కందాల ఉపేందర్ రెడ్డి, బానోతు చంద్రావతి మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, లకావత్ గిరిబాబు, బానోత్ మంజుల తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

జనసేన నాయకులు తీసుకువెళ్లిన గిరిజనుల సమస్యలపై స్పందించి అభినందించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు*

*జనసేన నాయకులు తీసుకువెళ్లిన గిరిజనుల సమస్యలపై స్పందించి అభినందించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు* గిరిజనుల అభివృద్ధి కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్య సాధన దిశగా జనసేన పర్యటనలో భాగంగా తొట్టంబేడు మండలం పొయ్య పంచాయతీలోని ఎస్టీ కాలనీలో సందర్శించినప్పుడు అక్కడ ఉన్న గిరిజనులు చెప్పినటువంటి సమస్యలు పై ఈరోజు ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది, మేము ఇచ్చినటువంటి సమస్యలను చూసి స్పందించి, వెంటనే అధికారులుతో మాట్లాడడం జరిగింది, స్వయంగా నేను కూడా గిరిజన కాలనీ మొత్తాన్ని పరిశీలించి అక్కడికక్కడే వాళ్ల సమస్య పరిష్కరిస్తాను అని చెప్పడం జరిగింది, మరియు అక్కడ ఉన్న పిల్లలు అందరిని కూడా బడివైపు వెళ్లే దిశగా నేను కృషి చేస్తాను అని చెప్పారు, అంతే కాకుండా మీలాంటి జనసేన యువత ఇటువంటి సమస్యలు గుర్తించి తీసుకురావడం చాలా గొప్ప విషయం అని అభినందించారు, ఎక్కడ ఏ సమస్య ఉన్న నా దృష్టికి తీసుకొని రండి ఏ సమయం అయినా పర్వాలేదు నా లక్ష్యం సమస్యలను పరిష్కరించడమే అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, తేజ, గ్రంథం శీను, ఆరిఫ్, నక్క ప్రసాద్, లక్ష్మణ్, నవీన్, దినేష్, ప్రదీప్ కుమార్, నాగరాజు, చందు, కళ్లిపూడి వెంకటేష్, మహర్షి, సాయి, రాజా, గోపి, తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రభుత్వంపై వెంకయ్య నాయుడు ఘాటు వ్యాఖ్యలు

మహిళలకు ఉచిత బస్సు వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్న విద్య, వైద్యంపై ఖర్చు చేయాలి కానీ..ఉచితాలు అలవాటు చేయకూడదు విద్యతో పేదవాడు సంపన్నుడయ్యే అవకాశాలు ఉన్నాయి వైద్యం ప్రతి మనిషికి అవసరమైంది ఆర్థిక పరిస్థితిని శ్వేతపత్రం రూపంలో ప్రజలకు తెలపాలి ఐదేళ్లలో అప్పులు ఎంత చేస్తున్నారు…ఎంత తిరిగి చెల్లిస్తున్నారన్నది ప్రకటించాలి అసెంబ్లీలో బూతుల సాంప్రదాయానికి తెర వేయాలి సభలో లేనివారి పట్ల అమర్యాదగా వ్యవహరించకూడదు. అని మాట్లాడారు

ఆంధ్రప్రదేశ్

గుడ్డ(జూట్) సంచులను వినియోగించండి

ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ..శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలిలో పర్యావరణ పరిరక్షణ కొరకు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాకుళం పురపాలక ఆరోగ్యాధికారి సుధీర్ మాట్లాడుతూ…కేంద్ర మంత్రి, రాష్ట్రమంత్రి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్, శ్రీకాకుళం మున్సిపల్ కమీషనర్ ఇచ్చిన పిలుపు మేరకు సామాజిక బాధ్యత మనందరిదని, వీలైనంతవరకు గుడ్డ (జూట్) సంచులను వినియోగించాలని అవగాహన కల్పించే బాధ్యతను ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి డా.డోల అప్పన్న మరియు సభ్యులు సమక్షంలో ఈ కార్యక్రమానికి పర్యావరణ పరిరక్షణలో బాగమవ్వటం హర్షణీయమన్నారు. ప్లాస్టిక్‌ సంచులకు ప్రత్యామ్నాయంగా గోనె (జూట్‌) సంచుల వాడకం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని, ప్రభుత్వాల పాత్ర కన్నా ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని, ఇంటి నుంచి బయలుదేరే ముందే గోనె సంచి పట్టుకోవడం రానున్న ఆరోగ్యకర సమాజానికి నాందని, మార్పు మనతోనే మొదలుపెట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ డా. డోల అప్పన్న మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచులతో పర్యావరణ కాలుష్యం వాటిల్లటమే కాకుండా, కాన్సర్ తోపాటు అనేక రోగాలకు కారకులవుతామన్నారు. అలాగే ఒక్క సారి వాడి, బయటకు పారవేసే వాటిని వాడకూడదని, వాటిని రహదారులపై పారవేయకుండా రహదారికి ఇరువైపులా మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన చెత్తకుండీలో వేసి, పర్యావరణ పరిరక్షణతోపాటు, మున్సిపల్ దిగువస్థాయి ఉద్యోగులకు సహకరించిన వారవుతారని, సుందర శ్రీకాకుళంలో మనమంతా భాగమవ్వాలన్నారు. ఇందులో భాగముగా శ్రీ సంతోషిమాతా లోన్ కన్సల్టేన్సీ అధినేత జామి.శ్రీనివాస్ బృందం పాల్గొని, ప్లాస్టిక్ పై చేసిన నినాదాలు అందరినీ ఆకట్టుకుంది. అనంతరం లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డా.పైడి.సింధూర, ఆడపిల్ల సేవా సొసైటీ మడ్డి.లావణ్య అందించిన గుడ్డ సంచులను పాత బస్ స్టాండ్ కూడలి, పెద్ద మార్కెట్, ఏడు రోడ్ల కూడలితోపాటు, పలు ముఖ్య కూడలిలో పాదచారులకు, వ్యాపారవర్తకులకు సంచులను అందించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు డోల శంకర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి డా. ప్రవీణ్ కుమార్.తిత్తి, పి.హేమ సుందర్, బి.రాజేష్, ఆకుల.మాధవ్, ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా లీగల్ అడ్వైజర్ డాక్టర్ గుండబాల. మోహన్, కార్తీక్, లీలాకృష్ణ, బొడ్డ కృష్ణ, కృష్ణ, సామాజిక ససేవకులు, ఫ్రీలన్సర్ ఉర్లం. శివతేజ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Blog

శ్రీశైలానికి ప్రధాని మోదీ రానున్న వేళ పర్యటన ఘన విజయవంతం కావాలని భవనాసి వాసు, పిలుపు

నంద్యాల జిల్లా శ్రీశైలంలోని పవిత్ర క్షేత్ర వాతావరణంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అడుగు పెట్టనున్న వేళ జనసేన నాయకులు, నిత్య అన్నదాన దాత భవనాసి (శ్రీనివాసు) వాసు, నాగి వెంకటేశ్వర్లు ప్రజలతో కలిసి పర్యటనను ఘనవిజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 16న జరగనున్న ప్రధానమంత్రి యాత్రకు సంబంధించి వారు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భవనాసి వాసు మాట్లాడుతూ—“శ్రీశైలం భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక. అటువంటి స్థలానికి ప్రధానమంత్రి రాక తెలుగు ప్రజలకు గర్వకారణం. దేశాన్ని అభివృద్ధి ప్రస్థానంలో ముందుకు నడిపిస్తున్న నరేంద్ర మోదీ ఈ యాత్ర చారిత్రాత్మకంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం” అన్నారు. నాగి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ—“భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మికత ఉజ్వలమైన మార్గదర్శకం. అటువంటి విలువలను పరిరక్షిస్తున్న ప్రధాని శ్రీశైలాన్ని దర్శించుకోవడం ప్రజల జీవితాల్లో స్ఫూర్తి నింపుతుంది. ఈ పర్యటన విశ్వాసానికి, అభివృద్ధికి, ఏకతకు చిహ్నంగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు. ప్రధాని రాక సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, భక్తులు సమన్వయంగా పనిచేసి కార్యక్రమం విజయవంతం చేయాలని ఇద్దరూ కోరారు. దేశవ్యాప్తంగా శ్రీశైలం క్షేత్రానికి మరో గుర్తింపు ఇవ్వనున్న ఈ పర్యటనలో ప్రతి తెలుగు భక్తుడూ పాల్గొని గౌరవించాలన్నారు. భవనాసి వాసు, నాగి వెంకటేశ్వర్లు నేతృత్వంలో స్థానిక జనసేన కార్యకర్తలు పర్యటన ఏర్పాట్లకు తమ వంతు సహకారం అందించేందుకు సిద్ధమయ్యారు.

తెలంగాణ

ఘనంగా కుందారం గణేష్ చారి జన్మదిన వేడుకలు. హాజరైన ప్రముఖులు.

పున్నమి సెప్టెంబర్ 09 ప్రతినిధి దూపం అంజనేయులు: రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్: బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి జన్మదిన వేడుకలు బుధవారం సైనిక్పురి లోని బీసీ కుల సంఘాల కేంద్ర కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు పోలీస్ కమిషనర్ కిరణ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి, వేములవాడ మదన్మోహన్, సుంకోజు, బాచుపల్లి రమేష్, తాటికొండ శ్రీరాములు, కృష్ణమాచారి,నాగరం భాస్కరాచారి, అశోక్ చారి బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు హాజరై గణేష్ చారి కి బర్తడే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ వాదం నినాదం గల్లీ నుండి ఢిల్లీ దాకా తీసుకెళ్లడంలో గణేష్ చారి ముఖ్యపాత్ర పోషించారని కొనియాడారు. జనాభా దామాషా ప్రకారం వాటా, రిజర్వేషన్ల కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నారని చివరికి బీసీ వాదమే ఎజెండాగా దేశవ్యాప్తంగా మారిందని తెలిపారు. దేశంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి మన్ననలు పొందారని, అలానే ఇద్దరు ప్రధానమంత్రులు, రాష్ట్రంలో పదిమంది ముఖ్యమంత్రులతో అనేక సమస్యలపై మాట్లాడిన అనుభవం ఉందన్నారు. గణేష్ చారి సేవలు బీసీ వర్గాలకు విశ్వకర్మలకు చాలా అవసరమని ఇక ముందు కూడా సామాజిక ఆర్థిక రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని అందుకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. అంతకుముందు బర్త్డే సందర్భంగా కేంద్ర కార్యాలయం వద్ద జిహెచ్ఎంసి కార్మికులకు గణేష్ చారి బట్టలు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ చారి, రమేష్, సుంకోదు రమేష్ చారి, మేడం శంకరాచారి, నరసింహ చారి, అశోక్, బ్రహ్మం, నరసింహ చారి, పడకండి శంకరాచార్య, బిక్షపతి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సత్యసాయి

ఘనంగా పోషణ మహోత్సవాలు.

అమడగూరు: మండల పరిధిలోని మహమ్మదాబాద్ గ్రామపంచాయతీ నిలువరాతిపల్లి అంగన్వాడి కేంద్రంలో బుధవారం పోషణ మహోత్సవాలు ఐసిడిఎస్ సూపర్వైజర్ గంగాదేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సూపర్వైజర్ గంగాదేవి మాట్లాడుతూ… మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లోనూ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.పోషణ మహోత్సవాల విశిష్టతను తెలియజేశారు.తల్లిపాల విశిష్టతను,అప్పుడే పుట్టిన బిడ్డకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు.అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి కొద్దికొద్దిగా మోతాదులో మొదలుపెట్టి పూర్తిగా రెండేళ్ల వయసు వచ్చేవరకు ఆహార అలవాట్లు వచ్చే విధంగా ఐసిడిఎస్ సిబ్బంది కృషి చేస్తారన్నారు.అనంతరం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం పౌష్టికాహారంతో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రదర్శించారు.అలాగే ఈనెల 10వ తేదీన కిషోర్ బాలికల దినోత్సవ సందర్భంగా సచివాలయ సిబ్బంది,ఐసిడిస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఎస్సే రైటింగ్ తోపాటు బాల్య వివాహాలు,గుడ్ టచ్,బ్యాడ్ టచ్ గురించి పోటీలు నిర్వహించారు.పోటీలలో గెలుపొందిన వారికి ఈనెల 10న బహుమతులు ప్రధానం చేయనున్నట్లు ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది,ఏఎన్ఎం త్రివేణి,అంగన్వాడి కార్యకర్తలు లక్ష్మీకాంతమ్మ,భారతి,రామలక్ష్మమ్మ, లక్ష్మీదేవమ్మ,బేబీ,ప్రమీలమ్మ,ప్రవల్లిక,ఆశ వర్కర్లు పుష్పావతమ్మ,శశికళ,కుళ్లాయమ్మ,తులసి, గర్భవతులు,బాలింతలు,తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.