Thursday, 30 April 2026

Blog

రంగారెడ్డి

ఇంజనీరింగ్ కాలేజీలో షాకింగ్ ఘటన.. భారీ దొంగతనం వెలుగులోకి

పున్నమి సెప్టెంబర్ 11 ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో దుండగులు కోటి రూపాయల నగదు ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి చెందిన ఈ కళాశాల ఆవరణలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు కళాశాల ఆఫీస్లోని అల్మారాను బద్దలు కొట్టి లోపల ఉంచిన భారీ నగదు మొత్తాన్ని దోచుకెళ్లారు. శుక్రవారం ఉదయం ఘటన బయటపడడంతో కళాశాల యాజమాన్యం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్టమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. కోటి రూపాయల నగదు కళాశాలలో ఎందుకు ఉంచారనే అంశంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

జనగాం

భారతీయ జనతా పార్టీలో చేరిన రిటైర్డ్ ఈఈ సీతా దుర్గ ప్రసాద్

భారతీయ జనతా పార్టీ లో చేరిన రిటైర్డ్ హౌసింగ్ ఈ ఈ సీతా దుర్గా ప్రసాద్ ———————————————– జనగామ, అక్టోబరు 10,పున్నమి న్యూస్: జనగామ భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో స్టేషనఘన్పూర్ నియోజకవర్గం వేలేరు మండలం నుండి రిటైర్డ్ హౌసింగ్ ఈ ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ సీతా దుర్గాప్రసాద్ ను బిజెపి జనగామ జిల్లా బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది .ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ మాట్లాడుతూ భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామాన బలోపేతం అవుతుందని చెప్పడానికి ఈ చేరికలు నిదర్శనమని మోడీ గారి సంక్షేమ పథకాలు అందని గ్రామం లేదని స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటుతామని అన్ని స్థానాల్లో బిజెపి పోటీ చేస్తుందని జనగామ జిల్లాలో పార్టీ బలోపేతానికి జడ్పిటిసి ఎంపిటిసి సర్పంచ్ ఎన్నికల విజయానికి కార్యకర్తలు సైనికుల్లాగా పని చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీతా శ్యామల డాక్టర్ గుండె రాహుల్,అరుణ్ కుమార్ సీతా దుర్గాప్రసాద్ రావు,భూపాల రమేష్, దుబ్బాల పూర్ణచందర్ ,శోభ రాణి, గుంటి కృష్ణవేణి , శ్రీనివాస్, విజయ్, రామ్ రెడ్డి ,శివకుమార్, శేఖర్ తదితరులు పార్టీలోకి రావడం జరిగింది.ఈ కార్యక్రమంలో వేలేరు మండల అధ్యక్షులు రాజు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ రెడ్డి సీనియర్ నాయకులు శశిధర్ రెడ్డి, పెద్దోజు జగదీష్, రవి రాజా తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

జీవిత భీమా-భవితకు ధీమా    

కేంద్రప్రభుత్వం,భీమాసంస్థలు ప్రజలకు రక్షణ కల్పించడంతోపాటు వారి భవితకు,ఆర్థికభద్రతకు ఎంతగానో దోహదపడుతున్నాయి.ప్రజలు ఆయా భీమా పథకాలను సద్వినియోగం చేసుకుంటే ఎన్నో ఆర్థికప్రయోజనాలు ఉంటాయి అని పల్లాం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ N.శివ మానంది పేర్కొన్నారు.శ్రీకాళహస్తి మండలం గంగలపూడి గ్రామంలో B.ధనమ్మ ఇటీవల అనారోగ్యం తో మరణించడంతో ఆ విషయం తెలుసుకున్న వీడ్స్ CFL కౌన్సిలర్ చిగురుపాటి కిరణ్ బ్రాంచ్ మేనేజర్ కు తెలియపరిచి నామినీ అయిన ఆమె కుమారుడు B.మహేష్ కు 2లక్షల రూపాయల వరకు ప్రధాన మంత్రి జీవన జ్యోతి భీమా యోజన కింద వారికి చెక్ ఇచ్చి క్లెయిమ్ చేయించడం జరిగింది.ఈకార్యక్రమంలో వీడ్స్ CFL క్లస్టర్ కో- ఆర్డినేటర్ K.చెంచయ్య,శ్రీకాళహస్తి CFL సెంటర్ కౌన్సిలర్స్ CH.కిరణ్ కుమార్,D.వినోద్కు కుమార్,A.సుప్రియ పాల్గొన్నారు.

జనగాం

జనగామ జిల్లా కేంద్రం లో కొమ్మూరి అనుచరుడు ఎం.డి.హర్షద్ అకాల మృతి

జనగామ జిల్లా కేంద్రంలో స్థానిక 29వ వార్డు అధ్యక్షులు ఎం.డి. హర్షద్ అకాల మరణం —————————————————— జనగామ, అక్టోబర్10,పున్నమి న్యూస్: జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అనుచరుడు ఎండీ హర్షద్(40) అకాల మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి హర్షద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి,ఘన నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించినారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి,జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్,జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గంగం నరసింహరెడ్డి,జనగామ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెంచారపు బుచ్చిరెడ్డి, డా.రాజమౌళి,మాజీ కౌన్సిలర్లు మేడ శ్రీనివాస్, గాదేపాక రాంచందర్,బొట్ల శ్రీనివాస్, ఎఎంసి డైరెక్టర్ నామాల శ్రీనివాస్,బొట్ల నర్సింగరావు,నర్మెట్ట, తరిగొప్పుల మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజబోయిన లక్ష్మీనారాయణ,వగలబోయిన యాదగిరి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెంచారపు కరుణాకర్ రెడ్డి,వంగాల మల్లారెడ్డి, జమల్ షరీఫ్, శివరాత్రి కుమార్, బృంగి భాస్కర్, సాదం మధుసూదన్,జగదీష్,చీకుడు వెంకటేష్, బాల్ సింగ్, వివిధ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, మచ్చ ప్రవీణ్,కడారు ప్రవీణ్, పర్వతాలు,స్టాలిన్,జనార్ధన్,గిరిబాబు, యూత్ కాంగ్రెస్ నాయకులు రఘు గౌడ్,పిడుగు రమేష్,రాజు,అరవింద్, మనన్,అజర్ తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

గన్నవరం నియోజకవర్గంలో పది క్రికెట్ బాక్సులు ఏర్పాటు : యార్లగడ్డ

గన్నవరం : పున్నమి ప్రతినిధి సురేష్ యువతకు క్రీడా సౌకర్యాలు కల్పించడంలో భాగంగా గన్నవరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో 10 క్రికెట్ బాక్సులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారి గన్నవరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రూ.13.5 లక్షల ఖర్చుతో నూతనంగా ఏర్పాటు చేసిన క్రికెట్ బాక్సును శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే వెంకట్రావ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు క్రికెట్ ఆడిన యార్లగడ్డ యువతను ఉత్సాహపరిచారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో క్రికెట్ బాక్సులు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ స్థలాలను కాపాడటం తో పాటు గ్రామపంచాయతీకి ఆదాయం సమకూరుతుందన్నారు. గన్నవరం నియోజకవర్గంలో యువతను క్రీడా రంగంలో ప్రోత్సహించేందుకు రాబోయే మూడు నెలల కాలంలో 10 గ్రామాల్లో క్రికెట్ బాక్సులు ఏర్పాటు చేస్తామని, మరి కొన్నిచోట్ల ప్రభుత్వ స్థలాల్లో వాలీబాల్, షటిల్, కబడ్డీ కోర్టులను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనే తొలిసారిగా గన్నవరం ఏర్పాటు చేసిన ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో అమలుపరిచే అవకాశం ఉందన్నారు. నామమాత్రపు ఫీజు తో ఈ క్రికెట్ బాక్సుల్లో క్రికెట్ ఆడుకునేందుకు వీలుంటుందని క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా యార్లగడ్డ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, గ్రామ సర్పంచ్ నిడమర్తి సౌజన్య, గన్నవరం, బాపులపాడు మండల టిడిపి అధ్యక్షులు వరుసగా గూడపాటి తులసి మోహన్, దయ్యాల రాజేశ్వరరావు, వైస్ ఎంపీపీ కొమ్మరాజు సుధీర్, టిడిపి నాయకులు ఆళ్ల గోపాలకృష్ణ, మేడేపల్లి రామ, బోడపాటి రవి, జాస్తి శ్రీధర్, కొండేటి వెంకటేశ్వరరావు, మద్దినేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

యార్లగడ్డ నేతృత్వంలో గన్నవరం అభివృద్ధి : వసంత

గన్నవరం : పున్నమి ప్రతినిధి సురేష్ గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై మాజీ హోం మంత్రి, అప్కాబ్ మాజీ చైర్మన్ వసంత నాగేశ్వరావు హర్షం వ్యక్తం చేశారు గురువారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన యార్లగడ్డను కలిసి పలు అంశాలపై చర్చించారు గన్నవరంలో రహదారుల అభివృద్ధి పారిశ్రామిక అభివృద్ధికి, సంక్షేమ పధకాల అమలు చేయటంలో యార్లగడ్డ చేపట్టిన ప్రత్యేక చొరపై వసంత నాగేశ్వరావు అభినందించారు. యార్లగడ్డ నేతృత్వంలో గన్నవరం దశ, దిశ మారుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ అడ్డుకోవడం తోపాటు అవినీతి రహిత పాలనందిస్తున్న యార్లగడ్డ ను ప్రత్యేకంగా అభినందించారు. యార్లగడ్డ ను ఎమ్మెల్యే గా గెలిపించుకోవడం గన్నవరం నియోజకవర్గ ప్రజల అదృష్టంగా వసంత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

E-పేపర్

ఆపదలో ఆదుకుంటున్న ముఖ్యమంత్రి సహాయ నిధి : యార్లగడ్డ

గన్నవరం : పున్నమి ప్రతినిధి సురేష్ పేద రోగులకు ఆపద కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో తోడ్పాటు అందిస్తుందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని పలువురు రోగులకు యార్లగడ్డ సిఫార్సు మేరకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను శుక్రవారం రాత్రి గన్నవరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యార్లగడ్డ చేతుల మీదుగా రోగులకు అందజేశారు. గన్నవరం మండలంలోని 5 గురికి 2.28 లక్షలు, విజయవాడ రూరల్ మండలంలోని ఇద్దరు రోగులకు రూ.1.14 లక్షలు, బాపులపాడు మండలం ఒకరికి రూ.24,400 మొత్తం 8 మందికి రూ.3.94లక్షల విలువ గల చెక్కులను పంపిణి చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావ్ మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రోగులకు ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తులను వైద్య చికిత్స పొందిన ఆరు నెలల లోపు సమర్పించాలని సూచించారు. ఆరు నెలల గడువు దాటిన దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేయటానికి సాధ్యపడదని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసయ్య, టిడిపి నాయకులు ఆళ్ల గోపాలకృష్ణ, దయ్యాల రాజేశ్వరరావు, గోడపాటి తులసి మోహన్ , మేడేపల్లి రమ, గుజ్జర్లపూడి బాబురావు, జాస్తి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Blog

ఉద్యోగుల హృదయాల్లో చిరస్మరణీయుడు మస్తాన్ ఖాన్ నంద్యాల జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరుపున సంతాప సభలో భావోద్వేగం

నంద్యాల స్థానిక తెలుగు గంగ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తూ, సహచర ఉద్యోగులకు ప్రేరణగా నిలిచిన మస్తాన్ ఖాన్ గత జూలై 5న హఠాన్మరణం చెందారు. ఆయన ఆకస్మిక మరణం జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల్లో విషాద ఛాయలు కమ్మేసింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. సభ ప్రారంభంలో నగరంలోని ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో మస్తాన్ ఖాన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమానికి జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు ఫక్రుద్దీన్, విజయలక్ష్మి, సిటీ ఉపాధ్యక్షులు ఎసురత్నం, మహిళా అధ్యక్షురాలు లక్ష్మీదేవమ్మ, సభ్యులు కోటేశ్వరరావు, కృష్ణ, బాలయోగయ్య, రమణ, సుధాకర్, ప్రీతి, పద్మావతి, ఇంతియాజ్, కలాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప, జిల్లా కోశాధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ, “మస్తాన్ ఖాన్ సాదాసీది జీవితం గడిపినా, సేవలో మాత్రం అసామాన్యుడు. ఆయన అకాల మరణం ఉద్యోగుల సమాజానికి, సహచరులకు, కుటుంబ సభ్యులకు తీరని లోటు. ప్రతి ఆర్డర్ ఫైల్, ప్రతి సూచన పత్రంలో సహచర ఉద్యోగుల ప్రయోజనాన్ని ముందుంచేవారు. మస్తాన్ ఖాన్ చిరునవ్వు, సహకార స్వభావం ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి” అన్నారు.జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప మాట్లాడుతూ, “మస్తాన్ ఖాన్ తమ విధుల్లో విశేష నిబద్ధత చూపారు. సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్నా, ఉద్యోగుల హక్కుల విషయంలో ముందుండి నడిచారు. ఆయన చూపిన దారిలోనే ఆయన కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ముందుకు సాగాలని, సంఘం ఎల్లప్పుడూ వారి అండగా ఉంటుందని” తెలిపారు. “జననం జరిగిన ప్రతి మనిషికి మరణం సహజం, కానీ మన జీవితం ఇతరులకు స్ఫూర్తిగా నిలిస్తే అది నిజమైన విజయమని మస్తాన్ ఖాన్ నిరూపించారు” అని ఆయన పేర్కొన్నారు. సభలో పలువురు ఉద్యోగులు మస్తాన్ ఖాన్‌తో గడిపిన అనుభవాలను పంచుకున్నారు. ఆయన నిజాయితి, వినయం, సహోద్యోగుల పట్ల చూపిన మమకారం అన్నీ గుర్తుచేసుకున్నప్పుడల్లా కళ్లలో నీళ్లు ఆగలేదు. ఉద్యోగులు అందరూ ‘మస్తాన్ ఖాన్ స్ఫూర్తిగా’ అనే నినాదంతో భవిష్యత్ కార్యక్రమాల్లో ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మస్తాన్ ఖాన్ కుటుంబ సభ్యులకు ఉద్యోగుల సంఘం తరఫున ధైర్యం నింపుతూ సానుభూతి తెలియజేశారు. సంఘం స్థాయిలో వారి కుటుంబానికి అవసరమైన సహాయం అందించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప సూచించారు. సభ ముగింపు సందర్భంలో మౌనవ్రతం పాటించి, మస్తాన్ ఖాన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మస్తాన్ ఖాన్ సేవలు ఉద్యోగుల బాటలో ఎల్లప్పుడూ వెలుగునిచ్చే మార్గచుక్కలుగా నిలుస్తాయని సభలో ఏకగ్రీవంగా నిర్ణయించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.