Thursday, 30 April 2026

Blog

విశాఖపట్నం

కాపుల వనభోజన మహోత్సవం డిసెంబర్ 14న

విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న కాపుల వనభోజన మహోత్సవంకు సంబంధించిన వివరాలను ఈ రోజు విశాఖ ప్రెస్ క్లబ్‌లో జరిగిన పత్రికా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు మద్ధింశెట్టి సురేష్ కుమార్, కార్యదర్శి యర్రంశెట్టి సురేష్ మాట్లాడుతూ, “పార్టీలకతీతంగా అన్ని కాపు సోదరులు ఒకే తాటిపైకి వచ్చి ఈ మహోత్సవంలో పాల్గొని ఐక్యతను చాటాలని” కోరారు. 2011 సంవత్సరం నుండి నిరంతరంగా, విజయవంతంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈసారి కూడా ముడుసర్లవా పార్క్లో ఈ మహోత్సవం భవ్యంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, “ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా కాపు సోదరులు ఐక్యంగా ముందుకు వచ్చి కార్యక్రమాన్ని ఘనవిజయం చేయాలని” కోరారు. కాపుల అభివృద్ధి, ఏకతా కోసం అందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఎన్ టి ఆర్ జిల్లా

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం. గంపలగూడెం మండలం, వినగడప-తోటమూల గ్రామాల మధ్య కట్టలేరు వాగు వద్ద ప్రజలు పడుతున్న కష్టాలు.

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం. గంపలగూడెం మండలం, వినగడప-తోటమూల గ్రామాల మధ్య కట్టలేరు వాగు వద్ద ప్రజలు పడుతున్న కష్టాలు. సమస్య: వినగడప-తోటమూల మధ్య ఉన్న కట్టలేరు వాగుపై వంతెన ధ్వంసం కావడం వలన వరద ఉధృతి వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం. ప్రజల ఇబ్బందులు: వరద ప్రవాహం ఉన్నప్పటికీ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, బండరాళ్లపైనే ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. రాకపోకల అంతరాయం: రహదారి/వంతెన ధ్వంసం కావడంతో గత నెల రోజుల నుండి రాకపోకలు నిలిచిపోయాయి. ఇది ఆ ప్రాంతంలోని సుమారు 20 గ్రామాలకు ఇబ్బందిగా మారింది. వంతెన కొట్టుకుపోవడంతో తాత్కాలిక రహదారి కూడా దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి త్వరితగతిన వంతెన ఏర్పాట్లు చేయాలని గంపలగూడెం మండలంలోని గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు…

నిర్మల్

శబరిమల మహా పాదయాత్రకు బయలుదేరిన లింబ గ్రామం తిరుపతి స్వామికి వాటోలి స్వాముల ఘన సన్మానం”.

లింబ గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి గురుస్వామి గారు తన 14వ అయ్యప్ప మాలధారణలో భాగంగా, స్వాములందరితో కలిసి బాసర నుండి శబరిమల వరకు మహా పాదయాత్రగా ఈ రోజు ఘనంగా బయలుదేరారు. 🔹 ఇందులో భాగంగా లింబ నుండి బాసర మహాపాదయాత్రగా బయలుదేరిన గురుస్వామిని, మార్గమధ్యంలో వాటోలి గురుస్వాములు —J. ఓం ప్రకాష్, వైద్యనాథ్, నగేష్, సాయినాథ్, సుభాష్, ఓంప్రసాద్ — ఘనంగా సన్మానించారు. 🔹 గ్రామ ప్రజలు, భక్తులు, స్వాములు విశేషంగా పాల్గొని గురుస్వామికి పాదాభివందనం చేశారు. 🔹 భక్తి, ఆధ్యాత్మికత నిండిన ఈ వేళ “స్వామియే శరణం అయ్యప్ప” నినాదాలతో ఊరంతా మార్మోగింది.

నిర్మల్

శబరిమల మహా పాదయాత్రకు బయలుదేరిన లింబ గ్రామం తిరుపతి స్వామికి వాటోలి స్వాముల ఘన సన్మానం”.

లింబ గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి గురుస్వామి గారు తన 14వ అయ్యప్ప మాలధారణలో భాగంగా, స్వాములందరితో కలిసి బాసర నుండి శబరిమల వరకు మహా పాదయాత్రగా ఈ రోజు ఘనంగా బయలుదేరారు. 🔹 ఇందులో భాగంగా లింబ నుండి బాసర మహాపాదయాత్రగా బయలుదేరిన గురుస్వామిని, మార్గమధ్యంలో వాటోలి గురుస్వాములు —J. ఓం ప్రకాష్, వైద్యనాథ్, నగేష్, సాయినాథ్, సుభాష్, ఓంప్రసాద్ — ఘనంగా సన్మానించారు. 🔹 గ్రామ ప్రజలు, భక్తులు, స్వాములు విశేషంగా పాల్గొని గురుస్వామికి పాదాభివందనం చేశారు. 🔹 భక్తి, ఆధ్యాత్మికత నిండిన ఈ వేళ “స్వామియే శరణం అయ్యప్ప” నినాదాలతో ఊరంతా మార్మోగింది.

ఆంధ్రప్రదేశ్

26న విశాఖపట్నం డిస్ట్రిక్ట్ వెటరన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్-2025

విశాఖ క్రీడాకారులు తమ ప్రతిభను విశ్వవ్యాప్తంగా చాటాలి! పోస్టర్ ను విడుదల చేసినఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్! విశాఖపట్నం, అక్టోబర్, 11:ఈనెల 26న పోలీస్ బేరక్స్ గ్రౌండ్స్ లో వెటరన్ అథ్లెటిక్స్ అసోసిషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘విశాఖపట్నం డిస్ట్రిక్ట్ వెటరన్ అథ్లెటికక్స్ ఛాంపియన్షిప్ – 2025″ పోటీలను “వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ విశాఖపట్నం” (VAAV) నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శివాజిపాలెంలోని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కార్యాలయంలో శనివారం గోడ పత్రిక ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ట్రస్ట్’ చైర్మన్ డాక్టర్ కమల్ బయిద్, వావ్ అధ్యక్షులు డాక్టర్ మంగ వరప్రసాద్, పీఆర్ఓ చింతలపాటి వంశీ కృష్ణ వర్మ ,కోశాధికారి ఎం. రామారావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ ప్రసంగిస్తూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులే కాకుండా 30 సం.రాల వయసు దాటిన ఔత్సాహిక క్రీడాకారులెవరైనా ఈ జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొని, పతకాలు సాధించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి విశాఖకీర్తి ప్రతిష్టలు విశ్వ వ్యాప్తంగా చాటాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ట్రస్ట్ చైర్మన్ , వావ్ చీఫ్ పేటర్న్ డా. కమల్ బయిద్ మాట్లాడుతూ ఆర్ధికంగా వెనుకబడిన ప్రతిభా క్రీడాకారులను ఆదుకోడానికి ప్రత్యేక క్రీడానిధిని ఏర్పాటు చేస్తూ వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ట్రస్ట్ ‘ స్థాపించామన్నారు. వావ్ అసోసియేషన్ అధ్యక్షులు డా. మంగ వరప్రసాద్ ప్రసంగిస్తూ 5 కి.మీ.వాకింగ్ , 100, 200, 400, 800, 1500, 5000 మీటర్ల పరుగు పందెం, ట్రిపుల్ జంప్ , లాంగ్ జంప్, షాట్ పుట్, డిస్క్ త్రో, జావెలిన్ త్రో, హేమర్ త్రో తదితర పోటీలను నిర్వహిస్తామన్నారు. 30-34 వయసు నుండి ఆ పైబడి వయస్సు గల స్త్రీ , పురుషులకు వేరు,వేరుగా పోటీలను నిర్వహించి గెలుపొందిన విజేతలకుస్వర్ణ,కాంస్య ,రజిత పతకాలను, పశంసా పత్రాలను అందించి గౌరవిస్తామన్నారు.ఈ పోటీలలో పాల్గొని ప్రధమ, ద్వితీయ స్థానాలు గెలుపొందిన క్రీడాకారులను డిసెంబర్ 13,14 తేదీలలో గుంటూరులో జరుగు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. ఈ పోటీలలో పాల్గొనే వారంతా పోలీస్ బేరక్స్ గ్రౌండ్ లో ఈనెల 26వ తేదీ నాటి ఉదయం 6గం.లకే చేరుకోవాలని, ఈ నెల 20వ తేదీ లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, క్రీడాకారులందరికీ మంచి నీరు, అల్పాహారం, భోజనాది ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. వివరములు కొరకు 9701347311, 83091 57522 ఫోన్ నెంబర్స్ ను సంప్రదించ వలసినదిగా కోరారు.

తిరుపతి

శ్రీకాళహస్తి లో ఎర్రచందనం దుంగలు స్వాధీనం

శ్రీకాళహస్తి ఏర్పేడు మండలం సదాశివకోన ప్రాంతంలో అటవీశాఖ అధికారులు భారీగా ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.ముందస్తు సమాచారం తో దాడి చేసి మొత్తం 435 కిలోల బరువున్న 51 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసున్నట్లు అటవీ శాఖ అధికారి లోకేష్ తెలిపారు.వీటి విలువ రూ.11 లక్షలు ఉంటుందని అధికారుల అంచనా.స్మగ్లర్లకు స్థానికుల సహకారం ఉందని వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు వారు తెలిపారు.

విశాఖపట్నం

లావిష్ బ్యూటీ సెంటర్‌పై టాస్క్ ఫోర్స్ దాడి — పోలీసుల అదుపులో యాజమాన్యం

గాజువాక, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి): నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గల Lavishe Hair & Beauty Center పై ముమ్మర దాడులు నిర్వహించారు.ఈ రోజు (10.10.2025) సాయంత్రం 6 గంటల సమయంలో టాస్క్ ఫోర్స్ సీఐ, ఎస్‌ఐ భరత్ కుమార్ రాజు మరియు సిబ్బంది ఈ దాడి చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సెంటర్‌లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం అందడంతో దాడులు నిర్వహించగా, అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు తేలింది. దాడి సమయంలో పోలీసులు Lavishe సెంటర్ యాజమాన్యం ముగ్గురు వ్యక్తులను, ముగ్గురు విటులను, ఒక హెల్పర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ముగ్గురు బాధిత మహిళలను సేఫ్ కస్టడీ నిమిత్తం రక్షణలోకి తీసుకున్నారు. తరువాత వారిని దువ్వాడ పోలీస్ స్టేషన్‌కు అప్పగించి, చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. అయితే ఈ స్పా నిర్వాహకులుగా కిల్లాడ ప్రవీణ్ (28) — రాజీవ్ నగర్, దువ్వాడ, విశాఖపట్నం. యెజ్జపురపు దమయంతి (38) — పార్క్ హోటల్ జంక్షన్, బీచ్ రోడ్, విశాఖపట్నం. స్వస్థలం: దుమ్మెడ గ్రామం, గరివిడి మండలం. కొసనం హైమవతి (30) — కుంచిమాంబ కాలనీ, గాజువాక. వారి గా ఉన్నట్లు, సహాయకుడుగా అమిత్ గౌతమ్ (28), రాజీవ్ నగర్, దువ్వాడ. ఉన్నట్టు తెలిపారు. నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్ మాట్లాడుతూ — “Lavishe బ్యూటీ సెంటర్ నిర్వహిస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలు, వ్యభిచారం జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇలాంటి స్పా సెంటర్లపై ముమ్మర తనిఖీలు కొనసాగుతాయి” అని పేర్కొన్నారు. అలాగే ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ : “మీ పరిసర ప్రాంతాల్లో లేదా స్పా సెంటర్లలో అనధికారిక వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు అనుమానం ఉంటే వెంటనే డయల్ 100 / 112, లేదా సీపీ గారి ఫోన్ నంబర్ 7995095799, లేదా దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కి సమాచారం ఇవ్వండి. మీ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి,” అని తెలిపారు.

హెల్త్ టిప్స్

🌿 బరువు తగ్గడం – ఆరోగ్యంగా మారే మార్గం! 🌿

🌿 బరువు తగ్గడం – ఆరోగ్యంగా మారే మార్గం! 🌿 ఇప్పుడు ప్రతి ఇంటిలో వినిపించే మాట — “బరువు తగ్గాలి!” కానీ బరువు తగ్గడం అనేది కేవలం రూపం మార్చుకోవడమే కాదు, అది ఆరోగ్యాన్ని తిరిగి పొందే ప్రయాణం. 💪 🍎 1. సరైన ఆహారం – మొదటి అడుగు బరువు తగ్గాలంటే మొదట ఆహారపు అలవాట్లలో మార్పు అవసరం. తెల్ల బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్, మిల్లెట్, రాగి, జొన్నలు వాడాలి. వేయించిన పదార్థాలు, చక్కెర, సాఫ్ట్ డ్రింక్స్‌ తగ్గించాలి. ఉదయం అల్పాహారం తప్పక తినాలి; పొట్ట కొంచెం ఆకలిగా ఉంచడం మంచిది కాదు. 🚶‍♀️ 2. వ్యాయామం – క్రమశిక్షణతో రోజుకు కనీసం 30 నిమిషాల నడక లేదా యోగా చేయడం ద్వారా శరీరంలోని ఫ్యాట్ తగ్గుతుంది. ఉదయం సూర్యోదయ సమయం అత్యుత్తమం. ఎలివేటర్‌ బదులుగా మెట్లు ఎక్కడం, వాహనం బదులుగా నడక మొదలుపెట్టండి. 💧 3. నీరు – సహజ ఔషధం రోజుకు కనీసం 3–4 లీటర్ల నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, టాక్సిన్లు బయటికి పోతాయి, ఆకలి నియంత్రణలో ఉంటుంది. 🧘‍♂️ 4. మనసు – విజయానికి కీ వెయిట్‌లాస్ అనేది కేవలం శరీర పోరాటం కాదు, మనసు యుద్ధం కూడా. సహనం, క్రమశిక్షణ, విశ్వాసం ఉంటే ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది. 🌟 🕊️ 5. చిన్న మార్పులు – పెద్ద ఫలితాలు రాత్రి భోజనం 8 గంటలకల్లా పూర్తి చేయండి. రోజుకు కనీసం 7 గంటల నిద్ర తీసుకోండి. మొబైల్ స్క్రీన్‌ ముందు ఎక్కువసేపు కూర్చోవద్దు. ✅ ముగింపు బరువు తగ్గడం అంటే ఆకలితో తల్లడిల్లడం కాదు — సరైన ఆహారం, క్రమమైన జీవనశైలి, సానుకూల ఆలోచన కలయిక. ప్రతి చిన్న మార్పు పెద్ద ఫలితాలకు దారి తీస్తుంది. ✨ “ఫిట్‌గా ఉండటం ఫ్యాషన్ కాదు — అది బాధ్యత!”

తిరుపతి

పులివెందుల ఆర్టీసీ బస్సు ప్రమాదం

పులివెందుల నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సు శనివారం ఉదయం ఒంటిమిట్ట ఆలయం వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్‌కు తీవ్ర గాయాలు కాగా, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అన్నమయ్య

మగశిశువును రాయచోటి శిశు గృహానికి అప్పగింపు

పీలేరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అవివాహిత మైనర్ బాలిక ప్రసవించిన మగశిశువును రాయచోటి శిశు గృహానికి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. మైనర్ బాలికను గర్భవతిని చేసిన ఘటనపై A1గా నరేంద్ర అలియాస్ నాని, A2గా డా. మాధవి పై కేసు నమోదు చేయబడిందని కె.వి.పల్లి ఎస్ఐ చిన్న రెడ్డెప్ప తెలిపారు. శిశు సంరక్షణ బాధ్యతను ICDS CDO రాజమ్మ మరియు సూపర్వైజర్ శంకరమ్మ స్వీకరించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.