Thursday, 16 April 2026

Blog

విశాఖపట్నం

పంచారామాల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ నుంచి విశేష స్పందన విశాఖ ద్వారకా బస్ స్టేషన్ నుంచి యాత్రకు ప్రారంభం

విశాఖపట్నం, అక్టోబర్ 25 పున్నమి ప్రతినిధి ఏపీఎస్ఆర్టీసీ, విశాఖపట్నం రీజియన్ ఆధ్వర్యంలో పంచారామాల యాత్ర బస్సు సర్వీస్‌ను విశాఖ ద్వారకా బస్ స్టేషన్ నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భక్తుల నుంచి యాత్రకు విశేష స్పందన లభిస్తోందని అధికారులు తెలిపారు. ఆసక్తి గల భక్తులు ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు ద్వారకా బస్ స్టేషన్ (9959225602) మరియు విశాఖపట్నం డిపో మేనేజర్ కార్యాలయం (9959225594) ను సంప్రదించవచ్చని సూచించారు. భక్తుల సౌకర్యార్థం శబరిమల యాత్రలకు కూడా ప్రత్యేక టూర్లు అందుబాటులో ఉన్నాయని, కావలసిన టూర్ ప్యాకేజీలను పై నెంబర్ల ద్వారా తెలుసుకొని రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపారు

E-పేపర్

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌.. ఎప్పటి నుంచంటే తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది.

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌.. ఎప్పటి నుంచంటే తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి

E-పేపర్

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న వాగ్దేవి డిగ్రీ కాలేజ్..

పున్నమి ఆలంపల్లి దుర్గయ్య 9133469506 ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న వాగ్దేవి డిగ్రీ కాలేజ్.. ఉప్పల్ ,రామంతపూర్ లో ఇందిరానగర్ లో ఉన్న వాగ్దేవి డిగ్రీ కాలేజ్ లో మాస్ కాపీయింగ్.. గత నెల సెప్టెంబర్ 11న ఉస్మానియా యూనివర్సిటీ వన్ టైం ఛాన్స్ ప్రారంభమైన డిగ్రీ ఎగ్జామ్స్ లో వాగ్దేవి డిగ్రీ కాలేజ్ యాజమాన్యం తమ చేతివాటం చూపించింది.. వాగ్దేవి డిగ్రీ కాలేజీ సెంటర్లో ఎగ్జామ్స్ రాయడానికి వచ్చిన విద్యార్థుల దగ్గర నుండి మాస్ కాఫీంగ్ పేరుతో ఒక్కో సబ్జెక్టుకు 15 వేల రూపాయల చొప్పున వసూలు చేసింది.. 15వేల రూపాయల్లోని ఒక రూపాయి తగ్గినా సరే మాస్ కాపీకి అంగీకరించని యాజమాన్యం.. ఒక్కో సబ్జెక్టుకు 15 వేల రూపాయలు చెల్లిస్తేనే మాస్ కాపీయింగ్ కి అనుమతి అంటూ విద్యార్థుల నుంచి వసూలు… ఈ మాస్ కాఫీంగ్ పేరుతో కొన్ని లక్షలు వసూలు చేసిన వాగ్దేవి డిగ్రీ కాలేజ్ యాజమాన్యం… డబ్బులు చెల్లించిన విద్యార్థులను సపరేట్ రూమ్ లో పెట్టి ఎగ్జామ్ సంబంధించిన బుక్స్ ఇచ్చి మరి ఎగ్జామ్స్ రాయి పిచ్చినా వాగ్దేవి డిగ్రీ కాలేజ్ యాజమాన్యం.. ఈ మాస్ కాపీయింగ్ సంబంధించి డిగ్రీ విద్యార్థులు NSUI(నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామిని ఆశ్రయించారు… అక్కడ జరుగుతున్న ఈ మాస్ కాపీయింగ్ సంబంధించి వివరాలన్నీ యడవల్లి వెంకటస్వామికి వివరించడంతో దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఉన్నత విద్య మండలి మరియు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎగ్జామినేషన్ కంట్రోలర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది.. ఇలాంటి వాగ్దేవి డిగ్రీ కాలేజీలు అఫిలియేషన్ రద్దు చేసి వాగ్దేవి డిగ్రీ కాలేజ్ యాజమాన్యం పై క్రిమినల్ కేసు చేయాలి అంటూ ఎడవల్లి వెంకటస్వామి డిమాండ్ చేశారు.

విశాఖపట్నం

పంచరామాలు యాత్ర మరియు స్వామి అయ్యప్ప యాత్రకు సంబంధించి గోడపత్రిక విడుదల

విశాఖపట్నం, అక్టోబర్ 25: విశాఖపట్నం ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి అప్పలనాయుడు ఆధ్వర్యంలో పంచరామాలు యాత్ర మరియు స్వామి అయ్యప్ప యాత్రకు సంబంధించి గోడపత్రిక విడుదల జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ మెకానిక్ ఇంజనీర్ ఎ. గంగాధర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ (DBSC) గంగాధర్, పర్సనల్ ఆఫీసర్ జె. తిరుపతి, విశాఖపట్నం డిపో మేనేజర్ మణి మాధురి, అసిస్టెంట్ మేనేజర్ ఉజ్వల, అసిస్టెంట్ మేనేజర్ (పర్సనల్) జి. శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ బి అప్పలనాయుడు మాట్లాడుతూ, పంచరామాలు మరియు అయ్యప్ప యాత్రలకు వెళ్లే భక్తులు తమ ప్రయాణ టిక్కెట్లను ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ముందుగానే రిజర్వ్ చేసుకొని సుఖంగా, సురక్షితంగా ప్రయాణం చేయాలని సూచించారు

విశాఖపట్నం

సి ఐ ఐ భాగస్వామ్య సదస్సు కార్యక్రమం దగ్గర పడుతోంది. నగర సుందరీకరణ, అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయండి. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ .

విశాఖపట్నం అక్టోబర్ 25: పున్నమి ప్రతినిధి: విశాఖ వేదికగా జరుగనున్న అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు కు తక్కువ కాలం ఉన్నందున సంబంధిత నగర సుందరీకరణ , సంబంధిత అభివృద్ధి పనులను త్వరతగతిన పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జోన్ 3, 4, 5, 8 లోని తెలుగుతల్లి ఫ్లై ఓవర్, తాటిచెట్లపాలెం, ఊర్వసి జంక్షన్, ఎన్ఏడి ఫ్లై ఓవర్, ఎయిర్పోర్ట్ వరకు, ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో సి ఐ ఐ భాగస్వామ్య సదస్సు ప్రధాన వేదిక ప్రాంతం, అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు కొరకు చేపడుతున్న అభివృద్ధి, నగర సుందరీకరణ పనులను జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మ, జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ గ్రీన్ అర్బన్ కార్పొరేషన్ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ నవంబర్ నెలలో విశాఖ వేదికగా జరుగనున్న అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుకు కాలం తక్కువగా ఉన్నందున నగర సుందరీకరణతో పాటు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి తెలుగు తల్లి ఫ్లై ఓవర్ కింద చేపడుతున్న సుందరీకరణ పనులతో పాటు రైల్వే న్యూ కాలనీ రోడ్డు ,తాటిచెట్లపాలెం, ఊర్వసి , ఎన్.ఎ.డి ఫ్లైఓవర్, ఎయిర్పోర్ట్ హైవే వరకు చేపడుతున్న రోడ్ డివైడర్స్, సెంటర్ మీడియన్, ఐలాండ్స్ , ఫుట్ పాతులు, రోడ్డు మరమ్మతులు, లైటింగ్,పెయింటింగ్ పనుల నాణ్యతను పరిశీలించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే సెంటర్ మీడియన్ లలో మొక్కలను యూనిఫామ్ గా ఆకర్షణీయంగా ట్రిమ్మింగ్ చేయాలని, పెద్ద చెట్లు యొక్క బ్రాంచెస్ కటింగ్ చేయడంతో పాటు సెంటర్ మీడియన్ లలో పాడుబడిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలని ఆదేశించారు. అనంతరం అంతర్జాతీయ వేదిక జరిగే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ హెలిప్యాడ్ ను పరిశీలించి అక్కడ చేపడుతున్న పెయింటింగు, సుందరీకరణ పనులను పరిశీలించి పనులలో నాణ్యతా ప్రమాణాలను తప్పకుండా పాటించి త్వరగా పూర్తిచేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ పర్యటనలో పర్యవేక్షక ఇంజనీరు కె.శ్రీనివాసరావు,కార్యనిర్వహక ఇంజనీరు తారా ప్రసన్న, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామ జైలు సందర్శన మరియు ఖైదీల పరిస్థితులను తనిఖీ

నందిగామ అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి.వందన చెప్పారు, “చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండటం చాలా ముఖ్యం.” నందిగామ జిల్లాలోని 16వ అదనపు న్యాయమూర్తి ఆదేశాల మేరకు, మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జడ్జి నందిగామ సబ్ జైల్ ను సందర్శించారు. సందర్శన సందర్భంగా, జడ్జి జైలు పరిసర ప్రాంతాలను తనిఖీ చేసి, ఖైదీలకు అందు తున్న సౌకర్యాలు, వారి వివరాలు, మరియు ఇతర పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ న్యాయవాది షేక్ ఆజాద్ మరియు జైలు సూపర్‌డెంటెంట్ సిహెచ్ సీతారామారావు కూడా పాల్గొన్నారు.

తిరుపతి

ఏర్పేడులో టిడిపి కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి అక్టోబర్ 25, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గలోని ఏర్పేడు మండలంలో కీలక ప్రధాన గ్రామమైన ఏర్పేడులో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని శనివారం నాడు శ్రీకాళహస్తి నియోజిక వర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించి మొదటగా దేవతామూర్తులకు నస్కారిచుకుని అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రుల అభిమాన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలవేసి అంజలిఘటించారు. అనంతరం ఏర్పేడు మండల తెదేపా ఉన్నత శ్రేణి నాయకులు, బొజ్జల అభిమానులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి శాలువా కప్పి, పూలమలలు వేసి ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అనకాపల్లి

అనకాపల్లి జిల్లా పోలీసులు అప్రమత్తం మంత తుఫాను నేపథ్యంలో ప్రజల భద్రతకు ప్రత్యేక చర్యలు – జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్

అనకాపల్లి, అక్టోబర్ 25 పున్నమి ప్రతినిధి : వాతావరణ శాఖ ప్రకటించిన ‘మంత’ తుఫాను హెచ్చరిక నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ కోసం అనకాపల్లి జిల్లా పోలీసులు అన్ని రకాల ముందస్తు చర్యలను ప్రారంభించారు. ప్రజల భద్రతకై జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ అధికారులు స్థానిక తహసీల్దార్లు, రెవెన్యూ, మత్స్య, పంచాయతీ అధికారులు మరియు జిల్లా యంత్రాంగంతో సమన్వయం కొనసాగిస్తూ తగిన జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. తీరప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశారు. ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా గారు ప్రజలకు మరియు పర్యాటకులకు జాగ్రత్త సూచనలు జారీ చేశారు. 1️⃣ తీరప్రాంతాలకు రేపటినుంచి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వెళ్లరాదు. 2️⃣ మత్స్యకారులు తాత్కాలికంగా వేటకు వెళ్లరాదు. 3️⃣ పోలీస్ అధికారులు జిల్లా యంత్రాంగంతో నిరంతర సమన్వయం కొనసాగించాలి. 4️⃣ అత్యవసర అవసరం లేకుండా ప్రజలు బయటకు వెళ్లరాదు. 5️⃣ స్థానిక అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, రూమర్లు లేదా తప్పుడు సమాచారం నమ్మరాదని విజ్ఞప్తి చేశారు. ఎస్పీ గారు తెలిపారు—“అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. తుఫాను సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు సమీప పోలీస్ స్టేషన్ లేదా 112 నంబర్‌ ద్వారా వెంటనే సమాచారం ఇవ్వాలి” అని సూచించారు.

విశాఖపట్నం

సీపీ శంఖబ్రత బాగ్చి రివ్యూ మీటింగ్ — నేరాల నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకోవాలి

విశాఖపట్నం, అక్టోబర్ 25 పున్నమి ప్రతినిధి: విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్, శనివారం సిటీ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏడీసీపీలు, ఇన్స్పెక్టర్లతో కలిసి నెలవారీ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పనితీరును ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సీపీ నగరంలోని ప్రతి స్టేషన్ పరిధిలో యాక్టివ్ రౌడీ షీటర్లపై నిఘా చర్యలు, NDPS కేసుల స్థితిగతులు, ట్రాఫిక్, క్రైమ్, లా & ఆర్డర్ విభాగాల పనితీరు గురించి సమీక్షించారు. నగరంలో ఎటువంటి మత్తు పదార్థాల రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లలో ఎక్కువకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని, కోర్టు తీర్పులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సీపీ గారి హెల్ప్‌లైన్ నంబర్‌కి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, సంబంధిత ఎస్‌హెచ్‌ఓలు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలో విజిబుల్ పోలీసింగ్ బలోపేతం చేయాలని, రాత్రిపూట నిఘా పెంచాలని, అవసరమైతే డికోయ్ టీమ్‌లు, పీకెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈవ్‌టీజింగ్, ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్ వంటి ఘటనలు ఎక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ క్రైమ్, ఉమెన్ సేఫ్టీ అంశాలపై ప్రత్యేకంగా చర్చించిన సీపీ గారు, ప్రజలకు మరింత అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహించాలని, కొత్త సాఫ్ట్‌వేర్‌లను వినియోగించి నిందితులను వేగంగా గుర్తించాలని సూచించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, పొక్సో కేసులు మరియు మహిళ మిస్సింగ్ కేసులను అత్యవసరంగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. సమావేశంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా ఆహ్వానించి, న్యాయ సంబంధిత అంశాలపై పరస్పరం చర్చించారు. లోక్ ఆధాలత్‌లలో మరిన్ని కేసులు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. విధులలో పారదర్శకతను పాటించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అవినీతి, అధికార దుర్వినియోగం వంటి వాటికి పాల్పడిన ఎవరిపై అయినా కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. ఈ సమావేశంలో డీసీపీ (ఎల్ & ఓ) డి. మేరీ ప్రశాంతి, ఐపీఎస్, డీసీపీ (క్రైమ్స్) లతా మాధురి, ఐపీఎస్, ఏడీసీపీలు, ఏసీపీలు, ఎస్‌హెచ్‌ఓలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజల భద్రతే మా ముఖ్య లక్ష్యం. ప్రతి స్టేషన్ సమర్థవంతమైన పోలీసింగ్ చూపాలి” — సీపీ శంఖబ్రత బాగ్చి

జనగాం

*స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోనీ చిల్పూర్ మండలంలో కడియం శ్రీహరి మార్క్*

*CM రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి,ఎంపీ కడియం కావ్య గార్ల చిత్రపటానికి పాలభిషేకం చేసిన శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పోట్లపల్లి శ్రీధర్ రావు గారు* *15 సంవత్సరాల నిరీక్షణ పొట్లపల్లి శ్రీధర్ రావు గారి కృషి వల్ల సాంక్షన్ అయిన R&B పంచాయతీరాజ్ శాఖ మరియు B.T ట్రైబల్ రోడ్లు* ఈరోజు పల్లగుట్టలోని పొట్లపల్లి శ్రీధర్ రావు గారి ఆధ్వర్యంలో వారి నివాసం నందు R&B, పంచాయతీరాజ్ శాఖ, మరియు B.T ట్రైబల్ రోడ్స్ చిల్పూర్ మండలానికి మంజూరు చేసిన సందర్భంగా cm రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య గార్ల, చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 17.60 కోట్లతో పల్లగుట్ట క్రాస్ నుండి మల్లన్న గండి వరకు పల్లగుట్ట,కృష్ణాజి గూడెం,ఫతేపూర్, గార్లగడ్డ తండ గ్రామాల మీదిగా డబల్ రోడ్డు. లింగంపల్లి నుండి అబ్దుల్ నాగరం వరకు 2.5 గోవర్ధనగిరి నుండి చిల్పూర్ వరకు14.52 చిన్న పెండ్యాల నుండి తరిగొప్పుల వరకు 46.03 రాజవరం నుండి కిమా తండ వరకు 104.34 ట్రైబల్ బిటి రోడ్స్ వాచ్య తండా 37.38 ఫకీర్ తాండ 37.32 SC,ST సబ్ ప్లాన్ 110 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కడియం శ్రీహరి గారు కృషి చేస్తున్నారని అన్నారు *సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య,ఎమ్మెల్యే కడియం శ్రీహరి గార్లకు మరియు మంత్రులకు* ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా చిల్పూర్ మండల ముఖ్య నాయకులు, దేవస్థానం డైరెక్టర్లు, మార్కెట్ డైరెక్టర్లు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపిటిసిలు,యువజన నాయకులు,కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.