Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Tirupati

పుట్టినరోజున ఆశ్రమంలో సేవా కార్యక్రమం మానవత చిట్వేలు శాఖ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ

Punnami Newsroom Published:
పుట్టినరోజున ఆశ్రమంలో సేవా కార్యక్రమం మానవత చిట్వేలు శాఖ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ

Story highlights

  • తిరుపతి జిల్లా, పెనగలూరు మండలం అత్తిగారిపల్లి గ్రామానికి చెందిన అనిమెల సుబ్బరాయుడు - కృష్ణవేణి దంపతుల కుమారుడు అనిమెల హన్సిత్ నాలుగో పుట్టినరోజు సందర్భంగా మంగళవారం సేవా కార్యక్రమం నిర్వహించారు.
  • చిట్వేలు మానవతా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ నారాయణ తపోవన ఆశ్రమం లో నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.
  • ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి నాగేశ్వరమ్మ మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలను ఆశ్రమంలో నిర్వహించడం శుభపరిణామమని పేర్కొన్నారు.

తిరుపతి జిల్లా, పెనగలూరు మండలం అత్తిగారిపల్లి గ్రామానికి చెందిన అనిమెల సుబ్బరాయుడు – కృష్ణవేణి దంపతుల కుమారుడు అనిమెల హన్సిత్ నాలుగో పుట్టినరోజు సందర్భంగా మంగళవారం సేవా కార్యక్రమం నిర్వహించారు. చిట్వేలు మానవతా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ నారాయణ తపోవన ఆశ్రమం లో నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి నాగేశ్వరమ్మ మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలను ఆశ్రమంలో నిర్వహించడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఆశ్రమ అభివృద్ధికి తోడ్పడటమే కాకుండా అక్కడి వృద్ధులకు కూడా ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు. చిట్వేలు మానవతా సంస్థ సేవలను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యకర్త చంద్ర, ఆశ్రమ పెద్దలు, చిట్వేలు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *