Thursday, 16 April 2026

Blog

ఖమ్మం

రేపు భారత ప్రధాని నరేంద్ర మోదీ మాన్ కీ బాత్

పున్నమి ప్రతి నిధి భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నాడు దేశ ప్రజలతో ముచ్చ టించే కార్యక్రమం మాన్ కీ బాత్. ఈ కార్యక్రమం ఈ నెల 26అనగా రేపు ఉదయం 11గంటలకు ప్రసారం అవుతుంది. మొదటగా హిందీ లో ప్రసారం అయి తరువాత 5నిముషాలు తరువాత తెలుగు లో ప్రసారం అవుతుంది.

విశాఖపట్నం

బ్లింకిట్ బ్యాగ్‌లో గంజాయి రవాణా – ఇద్దరు అరెస్ట్

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 25 శనివారం ఉదయం సుమారు 09:30 గంటలకు పి.ఎం. పాలెం పోలీస్ స్టేషన్‌కు చెందిన డబ్ల్యూ. ఎస్. ఐ. ఎన్‌. సునీత కి విశ్వసనీయ సమాచారం అందింది. సమాచారం ఆధారంగా సిబ్బందితో కలిసి కోమ్మాది ప్రాంతంలో ప్రత్యేక దాడి నిర్వహించగా, ఇద్దరు వ్యక్తులు బ్లింకిట్ డెలివరీ బ్యాగ్‌లో గంజాయి తీసుకెళ్తున్నట్లు గుర్తించబడినారు. వారిని వెంటాడి పట్టుకున్నారు. విచారణలో నిందితులను నల్లబిల్లి గణేష్ (వయసు 32), హోరో సంజయ్ కుమార్ (వయసు 29) లు గా గుర్తించారు. వీరి వద్ద నుండి మొత్తం 2 కిలోల గంజాయి స్వాధీనం చేసారు. కేసు క్రైమ్ నెం. 622/2025, యు/ఎస్ 20(b)(ii) ఎన్ డి పి ఎస్ యాక్ట్ 1985 ఆర్/డబ్ల్యు 187 బి ఎన్ ఎస్ ఎస్ 2023 కింద నమోదు చేయబడింది. అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపారు. ఈ కేసు దర్యాప్తు సబ్-ఇన్‌స్పెక్టర్ కే. భాస్కరరావు పర్యవేక్షణలో జరుగుతోంది. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. బాలకృష్ణ సూచనలు: నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (గంజాయి) అక్రమ రవాణా, నిల్వ, విక్రయం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాధారణ ప్రజలు తమ పరిసరాల్లో గంజాయి అక్రమ రవాణా లేదా వినియోగంపై సమాచారం ఉంటే తక్షణమే పి.ఎం. పాలెం పోలీస్ స్టేషన్ (ఫోన్: 9440796060) కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

జనగాం

బహిరంగ చర్చకు కడియం శ్రీహరి గారు సిద్ధమా??* కోరుకొప్పుల నాగేష్ గౌడ్ BJP మండల అధ్యక్షులు

👉 BJP అంటేనే ఉలిక్కి పడుతున్న రాజకీయ పండితుడు కడియం శ్రీహరి గారు 👉 BJP MLA MP ల నియోజకవర్గలలో అభివృద్ధి తో పోటీ పడలేక నిందలతో కాలం ఎల్లదిస్తున్న మాజీ ఉప ముఖ్య మంత్రివర్యులు కడియం 👉 గత పాలకులు నియోజకవర్గం కి అన్యాయం చేసారు అని కడియం శ్రీహరి గారు మాట్లాడం అయన విజ్ఞత్త కే వదిలేస్తున్నాం 👉 గత TDP పాలనలో మంత్రిగా BRS పాలనలో MP గా MLC గా ఉపముఖ్యమంత్రిగా నేటి కాంగ్రెస్ ప్రభుత్వం లో MLA గా ఉన్నది కడియం శ్రీహరి గారే 👉 అమలుకు సాధ్యం కానీ BC లకు 42% రిజర్వేషన్ అనే ఆశ చూపించి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ లో నియోజకవర్గం అభివృద్ధి అంటూ BRS నుండి కడియం శ్రీహరి గారు చేరింది వాస్తవం కదా?? 👉 స్టేషన్ ఘనుపూర్ కేంద్రం లోనే రోడ్లు సరిగా లేవు అనే విషయం మరియు రైల్ వే అండర్ బ్రిడ్జ్ కింద దారిని కనీసం మరమ్మత్ చేసి అక్కడ ఒక్క లైట్ పెట్టలేని కడియం శ్రీహరి గారికి BJP నాయకలను విమర్శించే అర్హత ఉందా?? 👉బండి సంజయ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జరిగే అభివృద్ధి పోయి చూస్తే తెలుస్తుంది 👉 జఫర్ గడ్ మండలం లోని వెంకటాపూర్ X నుండి సాగరం X వరకు జనవరి 24 వ తేదీన అంటే 11 నెలల కింద నే రోడ్డు మంజూరు అయ్యింది అన్నారు కానీ ఇప్పటికి తట్టేడు మట్టి తీసిన అనే విషయం ఎక్కడ కూడా చూడలేదు 👉 ఉప ఎన్నిక వచ్చే సూచన ఉండటం తో స్టేషన్ ఘనుపూర్ నియోజకవర్గ ప్రజలని మళ్ళీ మోసం చేసే కుట్రలో భాగమే BJP నీ తిట్టడం 👉 నిన్న ప్రకటించిన అభివృద్ధి కార్యక్రమలు రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తాం అని పెద్దలు చెప్పడం జరిగింది అప్పటికి మళ్ళీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వస్తుంది స్టేషన్ ఘనుపూర్ నియోజకవర్గం లోని ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు అనే విషయం మాజీ ఉప ముఖ్యమంత్రివర్యులు కడియం శ్రీహరి గారు గుర్తుంచుకోవాలి ఈ కార్యక్రమం లో మాజీ మండల అధ్యక్షులు ఎదులాపురం మదన్ మోహన్ స్థానిక సంస్థల మండల కన్వీనర్ మారేపల్లి రవి వడ్డెగూడెం బూత్ అధ్యక్షులు తాటికాయల హరికృష్ణ గార్లు పాల్గొనడం జరిగింది

రంగారెడ్డి

సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిక

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 25 : మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రోల్ల చంద్రయ్య ముదిరాజ్, మునగపాటి నవీన్ పద్మశాలి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన మహేశ్వరం గ్రామ పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు *పెద్దమ్మ పెంటయ్య పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి *కౌకుంట్ల శ్రీనివాస్ పద్మశాలి వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు పి.సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు దొడ్డు కృష్ణ యాదవ్, తెల్జీరి శ్రీశైలం యాదవ్, జెల్ల నాగేష్ యాదవ్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు..

రంగారెడ్డి

ఓట్ల చోరీ ప్రజాస్వామ్యానికి కరోనా లాంటి ప్రమాదకరం –ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు బాల్ నింగని జంగయ్య*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 25 : మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని ఏఐసీసీ, టీపీసీసీ, మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 15వ డివిజన్లో ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు, కాంటెస్టేడ్ కార్పొరేటర్ బాల్ నింగని జంగయ్య ఆధ్వర్యంలో* ఓట్ చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, ఉన్న ఓట్లని తీసేసి లేని ఓట్లని చేర్చే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి జనాలని తీసుకొచ్చి ఎక్కడైతే ఎన్నికలు ఉంటాయో అక్కడ దొంగ ఓట్లను చేర్చుతున్నారు అని ఎద్దేవా చేశారు. కావున ఎన్నికల సంఘం మొత్తం బిజెపి కనుసన్నల్లో పనిచేస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించినప్పటికీ నాలుగు నెలల్లోనే ఒక కోటి దొంగ ఓట్లను చేర్చిన ఘనత బిజెపి పార్టీకి దక్కిందని అని ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు బాల్నింగని జంగయ్య విమర్శించడం జరిగింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓట్ల దొంగతనం జరిగిందని లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదని రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యే వారిని అనడం జరిగింది. రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా ప్రజలందరూ ఓట్ చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ ఉద్యమంలో భాగం కావాలి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ క్యారగారి శ్రీధర్,సీనియర్ నాయకులు నిరుడు శ్రీరాములు,జనరల్ ఎస్సీ డిపార్ట్మెంట్ సెక్రెటరీ కప్పటి ఆంజనేయులు,బి.ఎమ్.సి ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ ఎర్ర సురేందర్,జనరల్ సెక్రెటరీ బోర్ర రమేష్,మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

మొంథా (Montha) తుఫాను హెచ్చరిక ల నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. కలెక్టర్ హరేందిర ప్రసాద్.

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 25 విశాఖపట్నం మంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్ హరేందిర ప్రసాద్ ఆదేశించారు.శనివారం జిల్లా, మండల,జోనల్ అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగాళాఖాతంలో అల్పపీడనం (తుఫాన్) కారణంగా రాబోయే 72 గంటలు (3 రోజులు) అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. ఆస్తి, ప్రాణ, పశు , పంట నష్టం జరగ కుండా అధికార యంత్రాంగం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా, డివిజన్, మండల ,గ్రామ స్థాయి అధికార యంత్రాంగం అంతా పనిచేసే ప్రదేశాల్లోనే (హెడ్ క్వార్టర్స్ లో) ఉండాలని, హెడ్ క్వార్టర్స్ వదలి వెళ్ళ రాదని అన్నారు.ఉద్యోగులకు ఎలాంటి సెలవులు మంజూరు చేయరాదని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలన్నారు. ఇప్పటికే ఎవరైనా సముద్రంలోకి వెళ్లి ఉంటే ఒడ్డుకు చేరుకోవడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తుఫాను వల్ల భారీ వర్షాలు , పెనుగాలులు వచ్చే అవకాశం ఉన్నందున నది ఒడ్డులో, కొండ వాలులలో, నీటిమంపుకు గురయ్యే పల్లపు ప్రాంతాల్లో ప్రాంతాల్లో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. పల్లపు ప్రాంతాల్లో నీరు చేరితే వెంటనే నీటి తొలగింపునకు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అధికారులు రిలీఫ్ సెంటర్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని. చెట్లు పడిపోతే వెంటనే తొలగించడానికి ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. త్రాగునీటికి ఇబ్బందులు రాకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని,విద్యుత్ కి అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టాలన్నారు. జనరేటర్లు, డీజిల్ అందుబాటు లో సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. పి హెచ్ సి లలో డాక్టర్లు,వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఎన్.డి.ఆర్.ఎఫ్, ఎస్.డి.ఆర్.ఎఫ్. టీమ్ లను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో 0891-2590102, 0891- 2590100 నెంబర్లతో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి, షిఫ్ట్ ల వారీగా సిబ్బందిని నియమించామని, తుఫాను సమయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీత గెలుపు ఖాయం : సంగిపేట్ నరేష్ కుమార్,

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 25 : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు ఖాయమని సంగిపేట్ నరేష్ కుమార్,అన్నారు శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్ బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతు చేశారు.ఉపఎన్నిక నేపథ్యంలో డివిజన్ పరిధిలోని బూత్‌లలో నిర్వహించిన గడపగడప ప్రచార కార్యక్రమంలో పాల్గొని జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం తిరిగి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయం అని తెలిపారు. వారి వెంట నల్ల నాగిరెడ్డి ,బిక్షపతి చారి ఉన్నారు

తిరుపతి

ఎమ్మెల్సీ ని సత్కరించి వై.సి.ఫై. టౌన్ యూత్ ప్రెసిడెంట్

శ్రీకాళహస్తి అక్టోబర్ 25, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి వై.సి.ఫై. టౌన్ యూత్ ప్రెసిడెంట్ మల్లెంబాకం మునికృష్ణారెడ్డి రష్ హాస్పిటల్ అధినేత ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యంని మర్యాదపూర్వకంగా కలిసి దుశ్యాలవతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం యువతను ఉద్దేశించిమాట్లాడుతూ….యువకులంతా ఉత్సాహంతో నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ నిర్వహించే మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం పిపిపి విధానంతో ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న మెడికల్ కళాశాల ప్రైవేటీకరం ద్వారా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఈ పి పి పి విధానాన్ని రద్దు పరచాలని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు వైఎస్ఆర్సిపి పార్టీ నియోజవర్గంలోని అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన వన్నె కుల క్షత్రియులను గుర్తించి నామినేట్ పదవులను ఇచ్చిందని ఆయన గుర్తిచేశారు. ఈ కూటమి ప్రభుత్వం వన్నె కుల క్షత్రియులను వాడుకొని నామినేట్ పదవులు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గపు వైఎస్ఆర్సిపి న్యాయ సలహాదారుడు సున్నపు లక్ష్మీపతి రెడ్డి మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మధు రెడ్డి సుధాకర్ రెడ్డి సురేష్ రెడ్డి జగదీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మా డిమాండ్ల పరిష్కారం లేకపోతే — జిల్లా వ్యాప్తంగా షాపులు మూసి వేస్తాం*

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లో మద్యం వ్యాపారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు .మద్యం పాలసీలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండిస్తూ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు 2024 – 2026 సంవత్సరాల మద్యం పాటదారులైన తమకు ప్రభుత్వం గెజిట్ ప్రకారం 20 శాతం కమిషన్ ఇవ్వాలని కోరుతూ వ్యాపారులు ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ కు విన్నప పత్రం అందజేశారు.ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న 13.5 శాతం కమిషన్‌తో షాపులు నిర్వహించటం కష్టంగా మారిందని వారు పేర్కొన్నారు.అలాగే గెజిట్‌లో లేని పర్మిట్ రూములపై వసూలు చేస్తున్న రూ.7.5 లక్షల మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లించే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను 15 రోజులలోపు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులను మూసివేయడానికైనా వెనుకాడమని హెచ్చరించారు.కోనసీమ లిక్కర్ అండ్ వైన్ డీలర్ అసోసియేషన్ తరఫున ఈ విన్నపం సమర్పించారు.తాడి నరసింహారావు, లింగోలు పెద్ద అబ్బులు,మామిడి గురవయ్య నాయుడు,నల్లమిల్లి సుబ్బారెడ్డి,పార్వతిని బాలయ్య చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఖమ్మం

రేపు ఖమ్మం కీ రానున్న బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి

పున్నమి ఖమ్మం రేపు (ఆదివారం ) ఖమ్మం జిల్లాకు బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి రానున్నారు. ఆయన ప్రధాని “మాన్ కీ బాత్” కార్యక్రమంలో పాల్గొని, పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. సాయంత్రం కార్యక్రమం ముగిసిన తర్వాత హైదరాబాద్ కి తిరిగి వెళ్తారని భాజపా ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు తెలిపారు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలి అని విజ్ఞప్తి చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.