Thursday, 16 April 2026

Blog

E-పేపర్

కష్టపడి కాదు ఇష్టపడి చదవాలి చిక్కిరి శ్రీకాంత్ పేద్దపులి నాగారం గ్రామంలో హై స్కూల్ లో సమస్యల పట్ల నాయకులు స్పందించాలి తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిక్కిరి శ్రీకాంత్* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామంలో టిఎస్ఎస్ఓ తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ చిక్కిరి శ్రీకాంత్ మాట్లాడుతూ… రాష్ట్ర

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ రంగారెడ్డి జిల్లా 9133469506 కష్టపడి కాదు…ఇష్టపడి చదవాలి.. చిక్కిరి శ్రీకాంత్* *పెద్దపులి నాగారం గ్రామంలో హై స్కూల్ లో సమస్యల పట్ల నాయకులు స్పందించాలి* *తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిక్కిరి శ్రీకాంత్* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామంలో… *టిఎస్ఎస్ఓ* తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ చిక్కిరి శ్రీకాంత్ మాట్లాడుతూ… రాష్ట్ర వ్యవస్థాపకులు లక్ష్మీ నివాస్ ఆదేశాల మేరకు.. ఉదయం ఫోన్ చేసి చెప్పిన వెంటనే స్పందించి హైస్కూల్లో ఉన్న సమస్యల పట్ల విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా.. మధ్యన భోజన పథకంలో ఎవరు భోజనం చేయడం లేదని తెలియడంతో.. పదవ తరగతి క్లాస్ రూమ్ లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడగా.. అబ్బాయిలు కొంతమంది భోజనం చేసినప్పటికీ.. అమ్మాయిలు మాత్రం ఇంటి నుండి భోజనం తెచ్చుకోవడం పట్ల ఉన్న సమస్యను అడిగి తెలుసుకోవడం జరిగింది అబ్బాయిలు మాత్రం పేపర్ ప్లేట్స్ తెచ్చుకొని తింటునట్టుగా తెలియజేశారు అమ్మాయిలు ఏకంగా ఇంటి భోజనం తెచ్చుకొని తింటున్నట్టుగా చెప్పడంతో.. వెంటనే అక్కడ ఉన్న సమస్యల పైన.. ప్రధానోపాధ్యాయులైనటువంటి వెంకటయ్య గౌడ్ నీ అడగడంతో.. విద్యార్థినీ విద్యార్థులకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వినకుండా.. అబ్బాయిలు పేపర్ ప్లేట్స్ తెచ్చుకోవడం జరుగుతుంది అమ్మాయిలు ఏకంగా ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవడం జరుగుతుంది అని స్పష్టం చేయడం జరిగింది… ఆరవ తరగతి ఏడవ తరగతి విద్యార్థిని విద్యార్థులు చక్కగా భోజనం చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది చిక్కిరి శ్రీకాంత్ విద్యార్థులతో మాట్లాడుతూ.. పదవ తరగతి పిల్లలకు ఒక ఛాలెంజ్గా తీసుకోవాలని.. తెలియజేస్తూ.. ఐదు మంది అమ్మాయిలను ఐదు మంది అబ్బాయిలను స్టేజ్ పైకి పిలిపించి.. ఒక్కొక్కరు ఒక ఐదు మంది తో.. పేపర్ ప్లేట్స్ కాకుండా.. ప్లేటు మరియు గ్లాస్ తెచ్చుకొని స్కూల్లోనే భోజనం చేసే విధంగా కమిటీని వేయడం జరిగింది.. విద్యార్థులు వెంటనే స్పందించి.. రేపటి నుండే తక్షణమే ప్లేట్స్ గ్లాస్ లు ఇంటి నుంచి తెచ్చుకొని స్కూల్లోనే భోజనం చేస్తామని తెలియజేయడం జరిగింది.. అలాగే కమిటీ ఎవరైతే పది మంది ఉన్నారో.. వంటలను ఏ విధంగా వండుతున్నారు అనే బాధ్యత కూడా మీరే తీసుకోవాలని.. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని చూడకుండా.. మన స్కూల్ మనమే బాగుపరచుకోవాలని విద్యార్థులకు తెలియజేయడంతో పాటు స్కూల్లో వంట చేస్తున్నటువంటి వాళ్లని సైతం భోజనం కరెక్ట్ గా మీరు చేసినట్లయితే పిల్లలు బయటనుంచి తెచ్చుకునే అవకాశం ఉండదు అని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఇలాంటి సమస్యలు మళ్లీ తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ వ్యవస్థకి మళ్లీ ఇలాంటి కంప్లైంట్ వస్తే మాత్రం ఏకంగా.. రాష్ట్ర స్థాయి నుంచి టిఎస్ఎస్ఓ వ్యవస్థాపకులు లక్ష్మీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజల దృష్టికి మరియు నాయకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని హెచ్చరించడం జరిగింది

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తుఫాన్ ఎఫెక్ట్ – స్కూళ్లకు సెలవులు!

తుఫాన్ ఎఫెక్ట్ – పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన అధికారులు! దక్షిణ తీరాంధ్రపై తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. భారీ గాలులు, వర్షాలు ముప్పుగా మారే అవకాశం ఉండడంతో జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కృష్ణా జిల్లాలో అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తూర్పు గోదావరి మరియు అన్నమయ్య జిల్లాల్లో 27, 28 తేదీల్లో విద్యాసంస్థలు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. చీరాల డివిజన్‌లో కూడా సోమవారం నుంచి మూడు రోజులపాటు స్కూల్ హాలిడేస్ అమల్లోకి వస్తున్నాయి. తుఫాన్ తీవ్రతను బట్టి తరువాతి నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని హెచ్చరించారు. వర్షాలు, గాలులు మరింత ఉధృతంగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు.

తిరుపతి

ముళ్ళపూడి ఎస్ టి కాలనీ వాసులకు అండగా వే ఫౌండేషన్

శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ముళ్ళ పూడి ఎస్టి కాలనీ నందు సుమారు 60 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి.గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి విస్తారమైన వర్షాల కారణంగా వారు పనులు లేక ఇబ్బంది పడుతున్నారని సిపిఐ శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య వే ఫౌండేషన్ వారికి సమాచారం అందించారు.వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ పైడి అంకయ్య వెంటనే స్పందించి 60 కుటుంబాలకు సరిపడా బియ్యము కూరగాయలు పాలు బ్రెడ్ అందించారు.ఈ సందర్భంగా పైడి అంకయ్య మాట్లాడుతూ ప్రకృతి విపత్తు ఎప్పుడు జరిగినా కూడా వే ఫౌండేషన్ దాతల సహకారంతో సహాయ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.

విశాఖపట్నం

* ఆంధ్రప్రదేశ్ కి తప్పని ముప్పు మంతా తుఫాన్

దూసుకువస్తున్న మంతా తుఫాన్ ** *ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఏదో ఒకచోట తీరం దాటే అవకాశం* *ఆంధ్రప్రదేశ్ కి రెడ్ అలెర్ట్* *అక్టోబర్ 26,27,28,29, తేదీల్లో చాలా కీలకమైన రోజులు* *28 అర్ధరాత్రి, లేదా 29 తెల్లవారుజామున సమయం లో ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటనున్న మంతా* *ఈ సంవత్సరం వచ్చే అన్ని తుఫానులలో బలమైన తుఫాన్ ఇదే* *విశాఖపట్నం-తిరుపతి వరకు దీన్ని ప్రభావం,తీవ్రమైన వర్షాలు తెలంగాణ, హైదరాబాద్ భారీ వర్షాలు.* *సముద్రం కోస్తాబాగాల్లో ఉన్నట్లు వంటి మత్యకారులను అప్రమత్తం చేయాలి ఎవ్వరు కూడా సముద్రవేటకి వెళ్ళారాదు* *దిగువున వున్నా లోతట్టు ప్రాంత లంక ప్రజలను అప్రమత్తం చేయాలి.కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి* *బలమైన గాలులు గంటకు 70-100 కిలోమీటర్లు* *ఆంధ్రప్రదేశ్ లో తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న స్కూల్స్, కాలేజీ, 28,29 తేదీల్లో సెలవు ప్రకటించవలసిందిగా వాతావరణ శాఖ అధికారులు సూచన* *దూర ప్రయాణ చేసేవాళ్ళు చెప్పిన డేట్స్ లో ప్రయాణాలు ఆపుకోవాలి* *మధ్య కోస్తాఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నం, దివిసీమ అన్ని బాగాల్లో, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తీవ్రమైన వర్షాలు చూస్తాం*

విశాఖపట్నం

* ఆంధ్రప్రదేశ్ కి తప్పని ముప్పు మంతా తుఫాన్

దూసుకువస్తున్న మంతా తుఫాన్ ** *ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఏదో ఒకచోట తీరం దాటే అవకాశం* *ఆంధ్రప్రదేశ్ కి రెడ్ అలెర్ట్* *అక్టోబర్ 26,27,28,29, తేదీల్లో చాలా కీలకమైన రోజులు* *28 అర్ధరాత్రి, లేదా 29 తెల్లవారుజామున సమయం లో ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటనున్న మంతా* *ఈ సంవత్సరం వచ్చే అన్ని తుఫానులలో బలమైన తుఫాన్ ఇదే* *విశాఖపట్నం-తిరుపతి వరకు దీన్ని ప్రభావం,తీవ్రమైన వర్షాలు తెలంగాణ, హైదరాబాద్ భారీ వర్షాలు.* *సముద్రం కోస్తాబాగాల్లో ఉన్నట్లు వంటి మత్యకారులను అప్రమత్తం చేయాలి ఎవ్వరు కూడా సముద్రవేటకి వెళ్ళారాదు* *దిగువున వున్నా లోతట్టు ప్రాంత లంక ప్రజలను అప్రమత్తం చేయాలి.కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి* *బలమైన గాలులు గంటకు 70-100 కిలోమీటర్లు* *ఆంధ్రప్రదేశ్ లో తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న స్కూల్స్, కాలేజీ, 28,29 తేదీల్లో సెలవు ప్రకటించవలసిందిగా వాతావరణ శాఖ అధికారులు సూచన* *దూర ప్రయాణ చేసేవాళ్ళు చెప్పిన డేట్స్ లో ప్రయాణాలు ఆపుకోవాలి* *మధ్య కోస్తాఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నం, దివిసీమ అన్ని బాగాల్లో, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తీవ్రమైన వర్షాలు చూస్తాం*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కాకర్ల మధుసూదన్ గారి నూతన గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..

తేది.25.10.2025 న దుత్తలూరు. 🔸కాకర్ల మధుసూదన్ గారి నూతన గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! దుత్తలూరు అక్టోబర్ 25న దుత్తలూరు మండల కేంద్రంలో కాకర్ల మధుసూదన్ గారి నూతన గృహప్రవేశ మహోత్సవం ఎంతో వైభవంగా, ఆనందోత్సాహాలతో జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, తమ సాన్నిధ్యంతో వేడుకకు మరింత అందాన్ని చేకూర్చారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మధుసూదన్ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త గృహం వారి జీవితాలలో శాంతి, సౌఖ్యం, అభివృద్ధి మరియు ఆనందాలను నింపాలని ఆకాంక్షించారు. ఆయన మాట్లాడుతూ, “ఇల్లు అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి. కృషి, పట్టుదలతో సాధించిన ప్రతి విజయాన్ని ఇలాంటి సంతోష క్షణాలు మరింత అర్థవంతం చేస్తాయి” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు బంధుమిత్రులు, స్నేహితులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

రంగారెడ్డి

ఓఆర్ఆర్‌పై బస్సు బోల్తా.. ఆరుగురికి గాయాలు పెద్ద అంబర్ పేట్ వద్ద ప్రమాదం

పున్నమి అక్టోబర్ 25 రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ట్ మండలం: కర్నూలు జిల్లాలో వి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటన మరువకముందే మరో రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇవాళ తెల్లవా రుజామున బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న జీపీ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టడం తో వాహనం ముందు భాగం ధ్వంసం అయింది. అంతలోనే పెద్ద అంబర్ పేట్ దగ్గర మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. హైద రాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ప్రయాణికులతో మియాపూ ర్ నుంచి గుంటూరు వెళ్తున్న న్యూగో ట్రావెల్స్ ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడటంతో ఆరుగురు ప్రయా ణికులకు తీవ్రగాయాలు కాగా మరో 9మంది స్వల్పంగా గాయపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి దిగుతుండగా బస్సు అదుపు తప్పి బోల్తాప డినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను అంబులెన్సులో సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ఉన్నట్టు సమాచారం. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అల్లూరి సీతారామరాజు

పోలీసు అమరవీరుల దినోత్సవం పై విద్యార్ధినిలకు వ్యాసరచన పోటీలు

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని శనివారం అరకు పోలీసులు విద్యార్ధులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను అరకులోయ మండలం, యండపల్లివలస గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జరిపారు. ఈ పోటీలతో విద్యార్ధులలో పోలీసుల త్యాగాలు మరియు దేశభక్తి పై అవగాహన పెరుగుతుందని అరకు సీఐ ఎల్ హిమగిరి, ఎస్ఐ జీ గోపాలరావు పేర్కొన్నారు. పోటీలలో మొదటి మూడు స్థానాలు పొందిన విద్యార్ధులకు బహుమతులు ప్రధానం చేశారు

తెలంగాణ

*బస్సు ప్రమాదం వెనుక మిస్టరీని ఛేదించిన పోలీసులు*

*బస్సు ప్రమాదం వెనుక మిస్టరీని ఛేదించిన పోలీస నాగర్ కర్నూల్ ప్రతినిధి/ అక్టోబర్ 25 పున్నమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలోని నిన్న జరిగిన టువంటి బస్సు ప్రమాదం పై సంచలన విషయం వెలుగులోకి వచ్చింది బస్సు ప్రమాదం వెనుక దాగివున్న అసలు మిస్టరీని పోలీసులు కనిపెట్టారు ఒక బైకు కారణంగా బస్సు ప్రమాదం జరిగి మంటలు వ్యాపించి దాదాపు 20 మందిని ఈ ఘటనలో అగ్నికి ఆహుతి అయ్యారు అయితే తాజాగా బైక్ పై ఉన్నటువంటి రవిశంకర్ అనే వ్యక్తి గురించి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలో వైరల్ అవుతున్నాయి ఆ వీడియోలలో రవిశంకర్ మద్యం మత్తులో ఉన్నట్టుగా బైకును స్పీడ్ గా నడపడం ఉంటే దృశ్యాలు కనిపించాయి అయితే అతను వెనుక ఉన్నటువంటి ఎర్రి స్వామి అనే మరో వ్యక్తిని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా కీలక విషయాలు బయటకు వచ్చాయి. రవి శంకర్ మిత్రుడు ఎర్రి స్వామి మాట్లాడుతూ… పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకొని అక్కడి నుంచి ఇద్దరు బైక్పై వెళ్తున్నాం. అలా వెళ్తున్న సందర్భంలో అనుకోకుండా బైక్ స్కిడ్ అయ్యి కుడివైపు ఉన్నటువంటి డివైడర్ను ఢీకొట్టగా ఇద్దరం ఒక్కడికక్కడే కింద పడిపోయాం అయితే ఈ సందర్భంలో రవిశంకర్ స్పాట్లోనే చనిపోయాడు నాకు చిన్న చిన్న గాయాలైన కూడా అక్కడి నుంచి భయంతో వెంటనే వెళ్లిపోయాను అని శివశంకర్ మిత్రుడు ఎర్రిస్వామి కీలక విషయాలను వెల్లడించాడు ఇక అక్కడే ఉన్నటువంటి బైకును బస్సు ఈడ్చికెళ్లడంతో ప్రమాదం జరిగిందే అని సంచలన విషయాలను తెలిపాడు దీంతో ఈ ప్రమాదంలో ఒకవైపు రవిశంకర్ ది మనవైపు నిర్లక్ష్యంగా వ్యవహరించిన బస్సు డ్రైవర్ ది కూడా తప్పుగా ఉందని పోలీసులు నిర్ధారించారు ఏది ఏమైనా కూడా ఈ బస్సు ప్రమాదంలో దాదాపు 20 మంది అగ్నికి ఆహుతిగా కాగా మరో కొంతమంది ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు కాగా ఈ బస్సు దగ్ధం ఘటన ఎవరిదీస వ్యాప్తంగా సంచలనం తీపిన విషయం అందరికీ తెలిసిందే

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రజా నాయకుడే మన కాకర్ల సురేష్..! 🟡 ప్రజల సమస్యలకు వెంటనే స్పందించే సేవా తపన గల నాయకుడు – ఎమ్మెల్యే కాకర్ల..! 🟡 ప్రజల కోసం, కార్యకర్తల కోసం నిరంతర కృషి – ప్రజానాయకత్వానికి ప్రతీక అంటున్న కాకర్ల..! వింజమూరు అక్టోబర్ 25న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను ఎంతో ఓపికగా విని పరిష్కార మార్గాలు సూచించడం ద్వారా ప్రజా నాయకుడిగా ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు గుర్తింపు పొందుతున్నారు. ప్రజల సమస్యలు చిన్నవైనా, పెద్దవైనా సమానంగా తీసుకొని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించడం ఆయన ప్రజాసేవా తపనకు నిదర్శనం.

తేది.25.10.2025 న వింజమూరు. 🟡 ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రజా నాయకుడే మన కాకర్ల సురేష్..! 🟡 ప్రజల సమస్యలకు వెంటనే స్పందించే సేవా తపన గల నాయకుడు – ఎమ్మెల్యే కాకర్ల..! 🟡 ప్రజల కోసం, కార్యకర్తల కోసం నిరంతర కృషి – ప్రజానాయకత్వానికి ప్రతీక అంటున్న కాకర్ల..! వింజమూరు అక్టోబర్ 25న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను ఎంతో ఓపికగా విని పరిష్కార మార్గాలు సూచించడం ద్వారా ప్రజా నాయకుడిగా ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు గుర్తింపు పొందుతున్నారు. ప్రజల సమస్యలు చిన్నవైనా, పెద్దవైనా సమానంగా తీసుకొని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించడం ఆయన ప్రజాసేవా తపనకు నిదర్శనం. ప్రతి ఒక్కరినీ స్నేహపూర్వకంగా, గౌరవపూర్వకంగా పలకరిస్తూ, ప్రజల మనసుల్లో విశ్వాసాన్ని కలిగించడం ద్వారా నిజమైన ప్రజా నాయకుడిగా ఆయన స్థిరమైన స్థానాన్ని సంపాదించారు. పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించి, వారికి అవసరమైన సహాయం అందించడంలో ఎల్లప్పుడూ ముందుంటారు. అలాగే పార్టీ విధానాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా చేరేలా కృషి చేస్తూ, ప్రజలతో నిత్యం సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ విధంగా సేవా తత్వంతో, ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేస్తూ ఆయన తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో ఉన్న నిజమైన ప్రజా నాయకుడిగా నిలుస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.