Tuesday, 5 May 2026

Blog

కామారెడ్డి

సర్పంచ్ లు – వార్డ్ మెంబర్లు ఆప్యాయత సన్మాన బిగ్ బాస్! గెలుపు

– సమావేశంలో ఒకరినొకరు గౌరవింపు వర్షం! కామారెడ్డి,16 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో స్థానిక సంస్థల సర్పంచ్-వార్డ్ మెంబర్ ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులు ఒక్కతాటిపై ఒక్కటిగా మారారు! గెలిచిన సర్పంచులు, వార్డ్ మెంబర్లు కలిసి ఏర్పడిన సమూహంలో ఆప్యాయ తతో ఒకరినొకరు సన్మానం చేసుకున్నారు.ఈ అ సాధారణ కార్యక్రమం మండల కేంద్రంలో ఘనంగా జరిగింది.గ్రామీణ రాజకీయాల్లో ఐక్యతకు మరో ఉదాహరణ ఎన్నికల ఫలితాల తర్వాత ఉద్ధృతం గా ఏర్పడిన ఈ విజయ సమూహం, పరస్పర గౌరవంతో సన్మానాలు పురస్కరించుకున్నారు. సర్పంచులు తమ సహచరులను, వార్డ్ మెంబర్లు తమ నాయకులను ఆప్యాయతతో అభినందిం చారు.”ఇది మా మండల ఐక్యతకు చిహ్నం!” అంటూ పాల్గొన్న నాయకులు చెప్పారు.ఈ కార్యక్ర మం గ్రామ ప్రజల్లో తీవ్ర ఆదరణ పొందింది. రామా రెడ్డి మండలంలో ఈ సన్మాన సమ్మేళనం రాజకీయ ఐక్యతకు కొత్త ఆవిష్కరణలా మారింది. భవిష్య త్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా జరిగితే, గ్రామీణ అభివృద్ధి వేగంగా జరుగుతుందని స్థానికు లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కామారెడ్డి

గెలిచిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు నాయి బ్రాహ్మణుల ఘన సన్మానం!

కామారెడ్డి,16 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో విజయోత్సవాలు నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వ ర్యంలో ఘన సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించా రు. మండల కేంద్రంలో జరిగిన ఈ ఉత్సవాత్మక కార్యక్రమం ప్రజల మనసుల్ని ఆకర్షించింది.సంఘ నాయకులు ముందుంచిన ఈ సన్మానం, గ్రామీణ ప్రజల జయకాంక్షలకు చిరస్థాయి! గెలిచిన నాయ కులు ప్రజల సమక్షంలో సంఘ నాయకుల నుంచి గౌరవపూర్వకంగాసన్మాన పత్రాలు ఆవలించుకు న్నారు. పంచాయతీ రాజకీయాల్లో కొత్త అధ్యా యం మొదలైంది అంటూ స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.నాయి బ్రాహ్మణ సంఘం ప్రతినిధు లు మాట్లాడుతూ, “ఎన్నికల విజేతలు మా సమా జానికి, గ్రామాల అభివృద్ధికి మేలుచూస్తారని నమ్ముతున్నామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మా ఐక్యతను మరింత బలపరుస్తాయి” అని తెలిపారు.రామారెడ్డి మండలం ప్రజలు ఘనంగా అభినందించారు.

E-పేపర్

అన్యమత ప్రచారాన్ని చేస్తూన్నా వారిపై కఠిన చర్యలు తీసుకోండి

రైల్వే కోడూరు మండలం స్థానిక కొత్తకోడూరు దగ్గరలోని ఎస్టీ కాలనీలో రాత్రిళ్ళు జరుగుతున్న అన్యమత ప్రచారాన్ని చేస్తూన్నా వారిపై రైల్వే కోడూరు మండల పరిధిలోని సబ్ ఇన్స్పెక్టర్ కి అలాగే స్థానిక ఎమ్మార్వో గారికి అన్యమత ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవలసినదిగా కొత్తకోడూరు కాలనీ వాసులు మరియు వివిధ హిందూ ధార్మిక సంఘాల సమక్షంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది

E-పేపర్

రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని దీక్ష లోపాల్గొన్న పుల్లంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాపెర్ల చంద్రశేఖర్ నాయుడు

రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని దీక్ష లోపాల్గొన్న పుల్లంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాపెర్ల చంద్రశేఖర్ నాయుడు రైల్వే కోడూరు మేజర్ న్యూస్ అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాక గ్రామానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి రాజంపేట పట్టణాన్ని రాజంపేట జిల్లా కేంద్రంగా చేయకుండా రాళ్ళల్లో, కొండల్లో ఎటువంటి సదుపాయాలు లేకుండా ఉన్నటువంటి రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించి పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి తుగ్లక్ పాలనసాగించి, సునకానందం పొందడమే కాకుండా,రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి,యం.పి పాపాల పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేటకు పట్టణానికి తీరని ద్రోహం చేసి రాజంపేట ప్రజలను విసిగించారని ఇప్పుడు దీనిమీద మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టిపెట్టి రాజంపేట ప్రజల మనోభావాలను దెబ్బ తినకుండా రాజంపేటను వెంటనే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కాపెర్ల చంద్రశేఖర్ నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు,మేడికొండు రవికుమార్ నాయుడు, మాజీ అధ్యక్షులు బాపనయ్య నాయుడు, ప్రముఖ డాక్టర్ నవీన్ కుమార్ చౌదరి,కోవూరు సుబ్రహ్మణ్యం నాయుడు, చెరువు ప్రెసిడెంట్ నాగినేని నాగేశ్వరరావు, సింగల్ విండో ప్రెసిడెంట్ మణి నాయుడు,దివాకర్ నాయుడు, తులసి నాగేంద్ర, రాముయాదవ్,గండికోట రామకృష్ణయ్య, కొల్లపనేని వెంకటేశ్వర్లు నాయుడు మరియుఎన్.డి. ఏ కూటమి నాయకులు రాజంపేట ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఎన్ టి ఆర్ జిల్లా

వేదాద్రి కంచల ఎత్తిపోతలకు ₹15 కోట్లు నందిగామలో రైతులతో కలిసి ఘన సంబరాలు

వేదాద్రి కంచల ఎత్తిపోతల పథకం మరమ్మత్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేయడంతో నందిగామలో రైతులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని తన కార్యాలయంలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య రైతులు, రైతు నేతలు, కూటమి నాయకులతో కలిసి బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ వేదాద్రి కంచల ఎత్తిపోతల పథకం ఈ ప్రాంత రైతులకు చిరకాల స్వప్నమని పేర్కొన్నారు. పథకం మరమ్మత్తుల కోసం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీకి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ పథకంపై నిరంతర పోరాటం చేశామని, ప్రభుత్వ ప్రమాణ స్వీకారం అనంతరం రెండవ రోజే ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశామని తెలిపారు. అలాగే విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్‌ (చిన్ని)తో కలిసి పలుమార్లు సంబంధిత అధికారులను కలిసి సమస్యను వివరించినట్లు చెప్పారు. ముప్పాళ్ల పి–4 కార్యక్రమంలోనూ రైతుల ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. గత ఐదేళ్లుగా రైతులు ఎదుర్కొన్న కష్టాలు తనను కలచివేశాయని, నేడు రైతన్న కళ్లలో ఆనందం చూడటం ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాతి ప్రభుత్వమని స్పష్టం చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని ఎత్తిపోతల పథకాల మరమ్మత్తులకు నిధులు మంజూరు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. వేదాద్రి కంచల ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 17 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో లాల్ బహదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోటా వీరబాబు, డీసీ చైర్మన్ రాటకొండ చంద్రశేఖర్, మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, నీటి సంఘాల ప్రతినిధులు, రైతు నేతలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

CMRF చెక్కును అందజేసిన జనసేన నాయకులు

అనారోగ్య కారణాలతో చికిత్స పొందిన అనంతరం సీఎం సహాయనిధి (CMRF) కోసం దరఖాస్తు చేసుకున్న వత్సవాయి మండలం, భీమవరం గ్రామానికి చెందిన వాసిపల్లి సుబ్బారెడ్డి గారికి, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారి సిఫారసు మేరకు, జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రూ. 81,000/- విలువ గల CMRF చెక్కు మంజూరైంది. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుల సూచన మేరకు ఈ చెక్కును జనసేన పార్టీ నాయకులు లబ్ధిదారునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ తుమ్మల ప్రభాకరరావు గారు, జనసేన నాయకులు శ్రీ షౌకత్ అలీ గారు, శ్రీ ఈమని కిషోర్ కుమార్ గారు, శ్రీ గొర్రెపాటి సుదర్శన్ గారు, భీమవరం గ్రామ నాయకులు శ్రీ గుండం రంగారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

బైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విజయ దివాస్

ప్రెస్ నోట్ భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు విజయ్ దివస్ ను అత్యంత ఘనంగా నిర్వహించారు. 1971 Bangladesh Liberation యుద్ధంలో భారత సాయుధ దళాలు సాధించిన చారిత్రక విజయాన్ని స్మరించుకుంటూ, దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ శ్రీ రఘునాథ్ గారు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విజయ్ దివస్ భారత దేశ గర్వకారణమని, సైనికుల అపార ధైర్యసాహసాలు, త్యాగస్ఫూర్తి ప్రతి భారతీయుడికి శాశ్వత ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. విద్యార్థులు దేశభక్తి, కర్తవ్యబద్ధత, క్రమశిక్షణ వంటి విలువలను తమ జీవితాల్లో ఆచరించాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు డా. పవన్ పాండే, డా. భీమారావు, డా. పి.జి. రెడ్డి, డా. రవి కుమార్, డా. ఎం. శంకర్ డాక్టర్ సంతోష్ కుమార్, అబ్దుల్లా, సురేందర్ ,దివ్య , రాజయ్య, మజార్, కిషన్ ,ఇర్ఫాన్ ,వాయిద్, ఉజ్మా సమరీన్ యుద్ధ ప్రాధాన్యతను వివరిస్తూ ప్రసంగించారు. వారు మాట్లాడుతూ దేశ సమగ్రత, సార్వభౌమత్వం పరిరక్షణలో భారత సైనికుల పాత్ర అమోఘమని కొనియాడారు. వీర జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకోవడం మాత్రమే కాకుండా, ఆ త్యాగాలకు తగిన పౌరులుగా మెలగడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్లు శ్రీ ఏ. రాజు, డా. ఓం ప్రకాష్ సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి నినాదాలు చేశారు. కార్యక్రమంలో భాగంగా జాతీయ గీతం ఆలపించడం, వీర జవాన్లకు రెండు నిమిషాల మౌనం పాటించడం, దేశభక్తి ప్రతిజ్ఞ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. కార్యక్రమం ముగింపులో విద్యార్థులు దేశ రక్షణకు అంకితమైన భారత సైనికుల త్యాగాలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ, దేశ సేవే పరమ ధ్యేయంగా ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ విధంగా విజయ్ దివస్ కార్యక్రమం కళాశాల ప్రాంగణంలో దేశభక్తి వాతావరణంలో ఘనంగా ముగిసింది.

నిర్మల్

బైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విజయ దివాస్

ప్రెస్ నోట్ భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు విజయ్ దివస్ ను అత్యంత ఘనంగా నిర్వహించారు. 1971 Bangladesh Liberation యుద్ధంలో భారత సాయుధ దళాలు సాధించిన చారిత్రక విజయాన్ని స్మరించుకుంటూ, దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ శ్రీ రఘునాథ్ గారు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విజయ్ దివస్ భారత దేశ గర్వకారణమని, సైనికుల అపార ధైర్యసాహసాలు, త్యాగస్ఫూర్తి ప్రతి భారతీయుడికి శాశ్వత ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. విద్యార్థులు దేశభక్తి, కర్తవ్యబద్ధత, క్రమశిక్షణ వంటి విలువలను తమ జీవితాల్లో ఆచరించాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు డా. పవన్ పాండే, డా. భీమారావు, డా. పి.జి. రెడ్డి, డా. రవి కుమార్, డా. ఎం. శంకర్ డాక్టర్ సంతోష్ కుమార్, అబ్దుల్లా, సురేందర్ ,దివ్య , రాజయ్య, మజార్, కిషన్ ,ఇర్ఫాన్ ,వాయిద్, ఉజ్మా సమరీన్ యుద్ధ ప్రాధాన్యతను వివరిస్తూ ప్రసంగించారు. వారు మాట్లాడుతూ దేశ సమగ్రత, సార్వభౌమత్వం పరిరక్షణలో భారత సైనికుల పాత్ర అమోఘమని కొనియాడారు. వీర జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకోవడం మాత్రమే కాకుండా, ఆ త్యాగాలకు తగిన పౌరులుగా మెలగడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్లు శ్రీ ఏ. రాజు, డా. ఓం ప్రకాష్ సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి నినాదాలు చేశారు. కార్యక్రమంలో భాగంగా జాతీయ గీతం ఆలపించడం, వీర జవాన్లకు రెండు నిమిషాల మౌనం పాటించడం, దేశభక్తి ప్రతిజ్ఞ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. కార్యక్రమం ముగింపులో విద్యార్థులు దేశ రక్షణకు అంకితమైన భారత సైనికుల త్యాగాలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ, దేశ సేవే పరమ ధ్యేయంగా ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ విధంగా విజయ్ దివస్ కార్యక్రమం కళాశాల ప్రాంగణంలో దేశభక్తి వాతావరణంలో ఘనంగా ముగిసింది.

అన్నమయ్య

బిసి హాస్టల్ పరిశీలించిన సిఐటియు జిల్లా నాయకులు!సమస్యల పరిష్కరించాలని డిమాండ్

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఉన్న బీసీ హాస్టల్లో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, మండల నాయకులు, కర్రతోటే హరి నారాయణ, మంగళవారం సందర్శించి, అక్కడ ఉన్న పాలిటెక్నిక్ విద్యార్థులు, హై స్కూల్ విద్యార్థులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  ఎక్కువగా దోమలు ఉన్నాయని, వాటిని తట్టుకోలేక పోతున్నామని, వాటి నివారణ కోసం చర్యలు తీసుకోవాలని కోరారు.  స్పందించిన  సిఐటియు నాయకులు, సర్పంచ్  దార్ల చంద్రశేఖర్ గారికి ఫోన్ చేసి, తక్షణం 15వ ఫైనాన్సు నిధులు కింద, దోమలు నివారణ కోసం,ప్యాగీ0గ్  చేయాలని చెప్పడం జరిగినది. మిషను చెడిపోయి ఉన్నది. ఏదో విధంగా స్ప్రే చేపిస్తానని  హామీ ఇచ్చారు. వర్షం వస్తే రూములు తడుస్తున్నాయని, చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ప్రత్యమ్న ఏర్పాటు చేయాలని, రూములు రిపేర్  చేయించాలని  వార్డెన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగినది. పెద్ద పిల్లలకు నెలకు 150 రూపాయలు కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వాల్సి ఉండగా మూడు సంవత్సరాలుగా ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బట్టలు ఉతుక్కోవాలన్నా, స్నానం చేయాలన్నా, నూనెలు, చెప్పులు, కట్టింగులకు, ఇన్ని నెలల ఇవ్వకుంటే ఎలా ఉంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, తక్షణం ప్రభుత్వం కాస్మోటిక్ చార్జీలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఎన్ టి ఆర్ జిల్లా

NCC విజయభేరి …. శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల విజయవాడ…..16/12/2025….

(విజయవాడ….లబ్బీపేట…. డాక్టర్ మంజుల గుదిమెళ్ళ పున్నమి) SDMSMK ఎన్సీసీ యూనిట్ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల (PBSCAS), విజయవాడ వారు నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకలలో భాగంగా జరిగిన **“విజయంత ట్రియోస్ ఎలాన్ – 4(A) గర్ల్స్ ఫెస్ట్”**లో చురుకుగా పాల్గొని విశేష విజయాలు సాధించింది. ఈ కార్యక్రమంలో SDMSMK నుంచి 57 మంది ఎన్సీసీ కేడెట్లు డ్రిల్, డిబేట్, ఫ్లాగ్ ఏరియా ప్రెజెంటేషన్, పోస్టర్ ప్రెజెంటేషన్, సోలో డాన్స్, గ్రూప్ సాంగ్, గ్రూప్ డాన్స్‌తో పాటు క్రీడా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. కేడెట్లు ప్రదర్శించిన క్రమశిక్షణ, జట్టు భావన మరియు అంకితభావం ఫలితంగా అనేక పోటీల్లో బహుమతులు సాధించారు. సాంస్కృతిక మరియు ఎన్సీసీ కార్యక్రమాల్లో డ్రిల్ టెస్ట్, గ్రూప్ డాన్స్, సోలో డాన్స్, ఫ్లాగ్ ఏరియాలో ప్రథమ బహుమతులు, అలాగే పోస్టర్ ప్రెజెంటేషన్, డిబేట్, సోలో సింగింగ్‌లో ద్వితీయ బహుమతులు సాధించారు. క్రీడా పోటీల్లో టగ్ ఆఫ్ వార్ మరియు రన్నింగ్ పోటీల్లో ప్రథమ బహుమతులు, త్రోబాల్‌లో ద్వితీయ బహుమతి, క్విజ్‌లో తృతీయ బహుమతి గెలుచుకున్నారు. ఈ అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా SDMSMK ఎన్సీసీ యూనిట్‌కు ఓవరాల్ ఛాంపియన్‌షిప్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ గౌరవనీయులు డాక్టర్ వివియస్ సుబ్రహ్మణ్య కుమార్ గారు, కళాశాల యాజమాన్యం మరియు ఎన్సీసీ ఆఫీసర్ బి. కోమలి గారు విజయాలు సాధించిన ఎన్సీసీ కేడెట్లను హృదయపూర్వకంగా అభినందించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.