Tuesday, 5 May 2026

Blog

ఎన్ టి ఆర్ జిల్లా

NCC విజయభేరి …. శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల విజయవాడ…..16/12/2025….

(విజయవాడ….లబ్బీపేట…. డాక్టర్ మంజుల గుదిమెళ్ళ పున్నమి) SDMSMK ఎన్సీసీ యూనిట్ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల (PBSCAS), విజయవాడ వారు నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకలలో భాగంగా జరిగిన **“విజయంత ట్రియోస్ ఎలాన్ – 4(A) గర్ల్స్ ఫెస్ట్”**లో చురుకుగా పాల్గొని విశేష విజయాలు సాధించింది. ఈ కార్యక్రమంలో SDMSMK నుంచి 57 మంది ఎన్సీసీ కేడెట్లు డ్రిల్, డిబేట్, ఫ్లాగ్ ఏరియా ప్రెజెంటేషన్, పోస్టర్ ప్రెజెంటేషన్, సోలో డాన్స్, గ్రూప్ సాంగ్, గ్రూప్ డాన్స్‌తో పాటు క్రీడా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. కేడెట్లు ప్రదర్శించిన క్రమశిక్షణ, జట్టు భావన మరియు అంకితభావం ఫలితంగా అనేక పోటీల్లో బహుమతులు సాధించారు. సాంస్కృతిక మరియు ఎన్సీసీ కార్యక్రమాల్లో డ్రిల్ టెస్ట్, గ్రూప్ డాన్స్, సోలో డాన్స్, ఫ్లాగ్ ఏరియాలో ప్రథమ బహుమతులు, అలాగే పోస్టర్ ప్రెజెంటేషన్, డిబేట్, సోలో సింగింగ్‌లో ద్వితీయ బహుమతులు సాధించారు. క్రీడా పోటీల్లో టగ్ ఆఫ్ వార్ మరియు రన్నింగ్ పోటీల్లో ప్రథమ బహుమతులు, త్రోబాల్‌లో ద్వితీయ బహుమతి, క్విజ్‌లో తృతీయ బహుమతి గెలుచుకున్నారు. ఈ అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా SDMSMK ఎన్సీసీ యూనిట్‌కు ఓవరాల్ ఛాంపియన్‌షిప్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ గౌరవనీయులు డాక్టర్ వివియస్ సుబ్రహ్మణ్య కుమార్ గారు, కళాశాల యాజమాన్యం మరియు ఎన్సీసీ ఆఫీసర్ బి. కోమలి గారు విజయాలు సాధించిన ఎన్సీసీ కేడెట్లను హృదయపూర్వకంగా అభినందించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ ప్రారంభోత్సవాలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ రాక

ఎనర్జీ కన్సర్వేషన్ వీక్ ప్రారంభోత్సవాల సందర్భంగా 15/12/25 వ తేదీన శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ APSECM సహకారంతో ఘనంగా ఎనర్జీ సంరక్షణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి మున్సిపల్ స్టేడియం వరకు సాగింది ఈ ర్యాలీలో స్టూడెంట్స్ నినాదాలు చేస్తూ ఎనర్జీ సేవ్ చేయండి…భవిష్యత్తును కాపాడండి,… విద్యుత్తు ఆదా……దేశ ప్రగతి వంటి సందేశాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు… ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ పుల్లారెడ్డి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ APCPDCL, శ్రీ జి లక్ష్మీశ ఐఏఎస్ కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, శ్రీమతి నాగలక్ష్మి. ఎస్. ఐఏఎస్.. మేనేజింగ్ డైరెక్టర్… ఏపీ జెన్కో అండ్ సీఈవో, APSECM శ్రీ కమలాకర బాబు వి.సి.అండ్ మేనేజింగ్ డైరెక్టర్, NREDCAP మరియు జి సూర్య సాయి ప్రవీణ్ చంద్ ఐఏఎస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (హెచ్ ఆర్ డి అండ్ అడ్మిన్ ) APTRANCO పాల్గొన్నారు. ఈ ర్యాలీలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొని విజయవంతం గావించారు.

కామారెడ్డి

కస్తూర్బా పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్య పరీక్ష

రామారెడ్డి,16 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : రామారెడ్డి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం లో విద్యార్థుల ఆరోగ్య పరీక్ష జరిగిందని తెలిపారు. వైద్యుడు డా. సురేష్‌కు నేతృత్వంలో 18 మంది పిల్లలకు సమగ్ర హెల్త్ చెకప్‌లు నిర్వహించారు.ఈ సందర్భంగా వైద్య అధికారులు మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యా న్ని కాపాడేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసా గుతాయని తెలిపారు.ఈ పరీక్షల్లో జ్వరం, జలుబు తద్వారా వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడు తున్న 8 మంది విద్యార్థులకు అవసరమైన మందు లు అందజేశారని చెప్పారు. అనంతరం పాఠశాల కిచెన్‌ను స్వచ్ఛత, నాణ్యతలో తనిఖీ చేశారు.ఈ కార్యక్ర మంలో కస్తూరిబా ప్రిన్సిపాల్ వనిత, ఏ ఎన్ ఎంలు రజిత, జ్యోతిప్రియ, రమాదేవి, అరుణలతో పాటు వైద్య సిబ్బంది శ్రీహరి, దోమల శ్రీధర్‌లు పాల్గొన్నా రు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కండలేరు డ్యామ్ ను నెల్లూరు జిల్లాలోని కొనసాగించాలి బిజెపి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ 15 (పున్నమి ప్రతినిధి) కండలేరు డ్యామ్‌ను తిరుపతిలో కలపాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈరోజు మనుబోలు మండలంలో ఉప తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. డ్యామ్‌ను తిరుపతిలో కలిపితే నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ రైతులు, ప్రజలు, మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, వేలాది ఎకరాల భూములు బీడుగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం మార్చకపోతే రాస్తారోకో, ధర్నా వంటి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బోలా శీను, బీజేపీ మండల ఉపాధ్యక్షులు ఇరగరాజు వెంకయ్య పట్నం ప్రతాప్, కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో డిప్యూటీ ఎంపీడీవో గా కరిముల్లా

ఉదయగిరి మండలంలోని గ్రామ వార్డు సచివాలయాలా డిప్యూటి ఎంపీడీవోగా సయ్యద్ కరిముల్లా నియామకమయ్యారు ఈయన ప్రకాశం జిల్లా కంభం ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తూ పదోన్నతి పై ఉదయగిరి గ్రామ వార్డు సచివాలయాలా డిప్యూటి ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించారు ఆయన మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలుకి అందుబాటులో ఉండాలన్నారు

తెలంగాణ

ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు అన్న : కలెక్టర్

నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్, కౌంటింగ్, ఫలితాల ప్రకటనలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

కడప

మట్కా బీటర్ అరెస్టు.. రూ. 10,150 నగదు స్వాధీనం*

*వై.ఎస్.ఆర్ కడప జిల్లా…* ప్రొద్దుటూరు టూ టౌన్ పరిధిలో పోలీసుల దాడులు.. మట్కా బీటర్ అరెస్టు.. రూ. 10,150 నగదు స్వాధీనం* ప్రొద్దుటూరు టూ టౌన్ పరిధిలోని దస్తగిరి పేట లో మట్కా నిర్వహిస్తున్న ఖురేషి మహమ్మద్ సాషా (59) అనే మట్కా బీటర్ ను అరెస్ట్ చేసినట్లు ప్రొద్దుటూరు టూ టౌన్ సి.ఐ యు. సదాశివయ్య తెలిపారు. అతని నుండి రూ. 10,150 నగదు, మట్కా స్లిప్ స్వాధీనం చేసుకున్నట్లు సి.ఐ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని టూ టౌన్ ప్రొద్దుటూరు టూ టౌన్ సి.ఐ యు. సదాశివయ్య హెచ్చరించారు. టూ టౌన్ ఎస్.ఐ రాఘవేంద్ర రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

ఎ.పి. గ్రామీణ బ్యాంక్ పానగల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 15, శ్రీకాళహస్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, పానగల్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నాడు తిరుపతి అగర్వాల్ మెడికల్ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని బ్రాంచ్ మేనేజర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా బ్రాంచ్ మేనేజర్ నరేష్ మాట్లాడుతూ.. ఈ ఉచిత కంటి వైద్య శిబిరం అవకాశాన్ని మన ఖాతాదారులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు యాజమాన్యానికి, అగర్వాల్ కంటి వైద్య హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 110 మంది ఖాతాదారులకు ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించి, అవసరమైన చికిత్సపై సూచనలు ఇచ్చారు. పలు కంటి సమస్యలను గుర్తించి ఖాతాదారులకు తగిన జాగ్రత్తలను సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది ఎం.సోము, మల్లికార్జున్, చిట్టిబాబు, ప్రసాద్ కలిసి శిబిరాన్ని విజయవంతం గా నిర్వహించారు.

తిరుపతి

భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని మజ్దూర్ సంఘ్ వినతిపత్రం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 15, శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుగంగ కాలనీలో గల కార్మిక సంఘ కార్యాలయంలో సోమవారం నాడు ఏపీ కన్స్ట్రక్షన్స్ మజ్దూర్ సంఘ్ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు ఎస్.సుకుమార్, ప్రధాన కార్యదర్శి సి. ముని కుమార్ లు కార్మిక తనిఖీ అధికారి శ్రీమన్నారాయణకు భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ఎన్నికల ముందు తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇచ్చిన హామీల మేరకు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి చెంగల్ పట్టు ముని కుమార్ మాట్లాడుతూ.. సంక్షేమ బోర్డును పునరుద్ధరించి భవన నిర్మాణ రంగానికి చెందిన అన్ని విభాగాల కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని కార్మికులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బిల్లుల సొమ్మును వెంటనే విడుదల చేయాలని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఒక డైరెక్టర్ పదవిని కార్మికులకు ఇవ్వాలని గత వైసిపి హయాంలో ఇసుక క్వారీలు ఆపేసి కార్మికులకు పనుల్లేకుండా చేశారన్నారు. భవన నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డు ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆపేస్తూ గత వైసిపి ప్రభుత్వం 1214 మెమో జారీ చేసిందని, ఫలితంగా లక్షలాది మంది నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ హామీ మేరకు కూటమి ప్రభుత్వానికి భవన నిర్మాణ కార్మికులు ఓట్లు వేసి గెలిపించారని, 16 నెలలవుతున్నా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు పునరుద్ధరించి పెండింగ్‌ క్లైములు పరిష్కరించి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి ఆచారి, కాలువ ప్రసాద్, రమేష్ ఆచారి, లక్ష్మణ్ రెడ్డి, మురళి, మణి నాయుడు, దొరబాబు, ప్రభు, సీత ముని, వాసు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ ని ఘనంగా సన్మానించిన తెదేపా బిసి విభాగ నాయకులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 15, శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా నూతనంగా పదవీ ప్రమాణం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడు రంగినేని చెంచయ్య నాయుడుని తెలుగుదేశం పార్టీ బిసి విభాగం నాయకులు సోమవారం నాడు మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో బిసిల ఆరాధ్య దైవం పూలే దంపతుల చిత్రపటాన్ని అందించి, దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా తెదేపా బిసి విభాగ నాయకులు మాట్లాడతూ…. రైతు సంతోషమే ఎన్డీయే కూటమి ప్రభుత్వ సంతోషంగా తలచిన చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అన్నదాత కుటుంబాల్లో చిరు నవ్వులు చిందించేలా ఎన్డీయే కూటమి ప్రభుత్వం రైతన్నకు తోడుగా నిలిచిందని తెలుగుదేశంపార్టీ అని మధ్యవర్తుల దోపిడీ నుండి రైతులను కాపాడి, తమ ఉత్పత్తులకు సరైన ధర వచ్చేలా చూడటం, మార్కెట్ యార్డులలో (మండిస్) బహిరంగ వేలం పాటల ద్వారా ధరలను నిర్ణయించడం వంటి రైతు అనుకూల విధానాల అమలులో పారదర్శకంగా వ్యవహరించాలని ధరల పోకడలు,మార్కెట్ పరిస్థితులపై రైతులకు సమాచారం అందించడం, e-NAM వంటి వేదికలతో అనుసంధానం చేయడానికి కృషి చేయాలని రైతుల పంట ఉత్పత్తుల నాణ్యతను కాపాడటానికి నిల్వ, గిడ్డంగుల సేవలను సులభతరం చేయటానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం మార్కెట్ యార్డులు, గిడ్డంగులు, నిల్వ సౌకర్యాలు, నాణ్యత పరీక్షా కేంద్రాలు వంటివి ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని చెంచయ్య నాయుడుని కోరుతూ… రైతులకు ఇచ్చిన మాటను నెరవేర్చే విధంగా రెండు విడతల్లో రూ.14,000 రైతుల ఖాతా లోకి కూటమి ప్రభుత్వం వేసిందని తెలిపారు. “పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం” కింద మొదటి విడతలో భాగంగా రూ.3,174 కోట్లు,రెండో విడతలో భాగంగా రూ.3,135 కోట్లు మొత్తంగా రూ.6,310 కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమ చేసి కష్టకాలంలో అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటూ నిత్యం రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, రైతును రాజును చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన 2024-25 ఆర్థిక సంవత్సర గణాంకాల ప్రకారం… ఉద్యాన రంగంలో 193 లక్షల టన్నుల పండ్ల ఉత్పత్తి చేస్తూ దేశంలో మొదటి స్థానం దక్కించుకున్న ఏపీ… 51.58 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో ఆక్వా రంగంలోనూ మొదటి స్థానంలో నిలిచింది. ఆయా రంగాలకు చంద్రబాబు గారి నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమయ్యిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి, వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, శ్రీకాళహస్తి పురపాలక సంఘం మాజీ కౌన్సిలర్ డా.నివేదిత మోరె,బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు,తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్,శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, క్లస్టర్ ఇన్‌ఛార్జి పేట బాలాజీ రెడ్డి,బిసి విభాగం శ్రీకాళహస్తి నియోజకవర్గ అధ్యక్షుడు దొరైరాజ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మునిరాజా యాదవ్,నాయీ బ్రాహ్మణ సాధికార సమితి సోషల్ మీడియా కన్వీనర్‌ కోట చంద్రశేఖర్,తిరుపతి పార్లమెంటు నాయకులు సంజాకుల మురళీకృష్ణ, కృష్ణమూర్తి,సయ్యద్ చాంద్ బాషా,భాస్కర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.