Tuesday, 5 May 2026

Blog

విశాఖపట్నం

స్కిల్ కోసం ప్రపంచం ఉత్తరాంధ్రవైపు చూసే రోజు వస్తుంది : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.*

*స్కిల్ కోసం ప్రపంచం ఉత్తరాంధ్రవైపు చూసే రోజు వస్తుంది : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.* – ఉత్తరాంధ్రలో ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటు కావడం చారిత్రాత్మక దినం – ఈ పద్ధెనిమిది నెలలు చంద్రబాబు, లోకేష్ లు ఉత్తరాంధ్ర పై ప్రత్యేక దృష్టి. – ఏవియేషన్ లో కీలక సంస్కరణకు ఆనాడు మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు బీజం వేశారు. – 30 ఏళ్ల దూర దృష్టితో చంద్రబాబు ఆలోచన.. భవిష్యత్ అవసరాలు తీర్చనున్న GMR మాన్సాస్ ఎడ్యుసిటీ. *విశాఖపట్నం డిసెంబర్ 16 పున్నమి ప్రతినిధి*: నైపుణ్యం కోసం భవిష్యత్ లో ప్రపంచం.. ఉత్తరాంధ్ర వైపు చూస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం నాడు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో జిఎంఆర్, మన్సాస్ సంస్థల మధ్య ఏవియేషన్ ఎడ్యుసిటీ నిర్మాణం కోసం ఏం.ఓ.యు మార్పిడి కార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తో కలసి.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వేదికపై నుండి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రాంతాలలో ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటు కావడం దేశంలోనే చరిత్రాత్మక రోజు అని రామ్మోహన్ నాయుడు అన్నారు. కేంద్ర మంత్రిగా ఉండటంతో పాటు.. ఓ ఉత్తరాంధ్ర వాసిగా చాలా గర్వపడుతున్నా అని అన్నారు. గడిచిన పద్ధెనిమిది నెలలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ల ప్రత్యేక దృష్టి ఉత్తరాంధ్ర పై నిలిపారని కితాబిచ్చారు. ఇన్నాళ్లు మనం చూసిన ఉత్తరాంధ్ర వేరు.. రేపటి ఉత్తరాంధ్ర వేరు అని స్పష్టం చేశారు. ప్రధానంగా ఏవియేషన్ రంగంలో ప్రపంచానికే కేంద్రంగా ఉత్తరాంధ్ర మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానిగా మోదీ మొదటి సారి బాధ్యతలు తీసుకున్నప్పుడు అందులో పౌర విమానయాన శాఖ మంత్రిగా ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు ఉండేవారని.. అనేక కీలక సంస్కరణలకు ఆనాడే ఆయన బీజం వేశారని అన్నారు. ప్రస్తుతం 12% వృద్ధి రేటుతో దూసుకుపోతున్న ఏకైక రంగం దేశ విమానయాన వ్యవస్థ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం 800 విమానాలు అందుబాటులో ఉంటే.. సమీప భవిష్యత్లో మరో 1700 విమానాలకు ఇప్పటికే ఆర్డర్లు వెళ్లాయని తెలిపారు. మిగిలిన లక్ష్యాలను పూర్తి చేసుకుని 3000 లకు పైగా విమానాలను కలిగి ప్రపంచంలోనే మేటిగా మన దేశ విమానాయన వ్యవస్థ నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక్కో విమానం నుండి సరాసరి 100 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే.. లక్షలాది మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగుల అవసరం ఉందని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. ఏవియేషన్ ఫ్యూచరిస్టిక్ సబ్జెక్ట్ గా అభివర్ణించిన రామ్మోహన్ నాయుడు.. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల అవసరం ఉన్నప్పటికీ.. అందుకు తగ్గ స్కిల్ సెంటర్లు లేవు అనే అసంతృప్తి ఉండేదని అన్నారు. తాను కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. రాష్ట్రంలో ఏవియేషన్ పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలసి ఏవియేషన్ యూనివర్సిటీ ఆలోచన పంచుకుందామని ఆలోచన చేస్తే.. నా కన్నా ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన విజన్ ను స్పష్టం చేశారని అన్నారు. 30,40 ఏళ్ల తర్వాత ప్రపంచం ఏమని ఆలోచిస్తుందో ముందే ఊహించే చంద్రబాబు నాయుడు.. ఏవియేషన్ యూనివర్సిటీ గురించి తన ఆలోచన చెప్పడం ఆశ్చర్యపోయా అని అన్నారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణం శరవేగంగా జరుగుతోందని.. ఒక నెల రోజుల్లో వ్యాలీడేషన్ ఫ్లైట్ ల్యాండ్ కానుందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. మొత్తంగా విమానాశ్రయం నిర్మాణం పూర్తి జూన్ 2026 అనుకున్నాం కానీ.. అంతకన్నా ముందే ప్రారంభించే అవకాశం కూడా ఉన్నట్టు తెలిపారు. జిఎంఆర్ మన్సాస్ ఎడ్యుసిటీ గురించి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కోసం నారా లోకేష్ తీవ్రంగా శ్రమించారని కితాబిచ్చారు. ఏవియేషన్ యూనివర్సిటీ అంటే ఒక కళాశాల కే పరిమితం అవుతుందని.. ఎడ్యుసిటీ గా మార్చడం వల్ల, అమెరికా వంటి ఇతర దేశాల్లో ఉన్న స్కిల్ కాలేజీలు కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. లోకేష్ ఆలోచన మేరకు ఏవియేషన్ యూనివర్సిటీ ను.. ఎడ్యుసిటీ గా మార్చామని తెలిపారు. దీని ద్వారా మన దేశీయ ఏవియేషన్ అవసరాలు తీరడంతో పాటు.. ప్రపంచానికి కూడా వనరులు అందిస్తామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర కు పూసపాటి కుటుంబం ఎంతో చేసిందని.. వారికి ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలు రుణపడి ఉన్నారని అన్నారు. పూసపాటి వంశీయులు మన ప్రాంతంలో ఉండటం ఉత్తరాంధ్ర చేసుకున్న అదృష్టం అని అన్నారు. ఎన్నో రాజ వంశీయుల కుటుంబాలు ఉన్నా.. విద్య పేరు చెబితే.. ధారాళంగా భూములు ఇచ్చే కుటుంబం పూసపాటి వంశం అని కితాబిచ్చారు. 136 ఎకరాలు ఇవ్వడం పై ధన్యవాదాలు తెలిపారు. GMR సంస్థ కూడా ఉత్తరాంధ్ర ప్రొడక్ట్ గా అభివర్ణించిన రామ్మోహన్ నాయుడు.. GMR.. ఉత్తరాంధ్ర ప్రాంతానికి గౌరవం తెచ్చారని అన్నారు. విలువలు, మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తూ.. మన ప్రాంతానికి శక్తిని ఇచ్చే కార్యక్రమాలు GMR సంస్థ చేస్తోందని అన్నారు. ఈ ఎడ్యుసిటీ కి సంబంధించి నారా లోకేష్.. ఎలాంటి టైమ్ లైన్ ఇచ్చినా.. పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. దీనికి ప్రతిగా పన్నెండు నెలల్లో పూర్తి చెయ్యాలని నారా లోకేష్ బదులిచ్చారు. రీసెర్చ్, ఇన్నోవేషన్.. ఈ ఎడ్యుసిటీ లో వృద్ధి చెందుతాయని.. నైపుణ్యం కలిగిన వ్యక్తులు అవసరం ఉన్న నేపథ్యంలో.. రాబోయే డిమాండ్ ను తట్టుకునేందుకు ఈ ఎడ్యుసిటీ ఉపయోగపడుతుందని అన్నారు. దీనికి అందరూ సహకరించి.. భాగస్వామ్యం అవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, అదితి గజపతి రాజు, GMR సంస్థ నుండి GBS రాజు, ఉత్తరాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు, కీలక నేతలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది*

*జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది* *ఈ రోజు ఏపీలో మీరు చూస్తున్నది ఓ చరిత్ర* *కొంతమంది విజన్ లెస్ పీపుల్ విజనరీని ఎగతాళి చేస్తారు* *ఏపీ అభివృద్ధికి మిస్సైల్స్ గా పనిచేస్తున్నాం* *ప్రపంచ సివిల్ ఏవియేషన్ వర్క్ ఫోర్స్ లో 25 శాతం తెలుగువారు ఉండాలనేది లక్ష్యం* *జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్ట్ ప్రారంభ వేడుకలో మంత్రి నారా లోకేష్* *మంత్రి నారా లోకేష్ సమక్షంలో జీఎంఆర్- మాన్సాస్ మధ్య ఎంవోయూ* *విశాఖపట్నం డిసెంబర్ 16 పున్నమి ప్రతినిధి* జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది. ఈ రోజు ఏపీలో మీరు చూస్తున్నది ఓ చరిత్ర. ప్రపంచ సివిల్ ఏవియేషన్ వర్క్ ఫోర్స్ లో 25 శాతం తెలుగువారు ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు పనిచేస్తున్నారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మాన్సాస్ ట్రస్ట్ సహకారంతో భోగాపురం సమీపం భీమిలి మండలం అన్నవరం వద్ద 136.63 ఎకరాల్లో జీఎంఆర్ సంస్థ అభివృద్ధి చేయనున్న జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్ట్ కు నేడు అంకురార్పణ జరిగింది. విశాఖ రాడిసన్ బ్లూ రిసార్ట్ లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో జీఎంఆర్- మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టుకు సంబంధించిన అవగాహన ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రాజెక్ట్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. బీహార్ లో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లినప్పుడు చాలా మంది కేంద్ర, రాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అక్కడ ఓ ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకున్నాను. 18 నెలలుగా ఏపీలో ఏదో మ్యాజిక్ జరుగుతోందని, ఆ మ్యాజిక్ వెనుక సీక్రెట్ ఏంటని ఆయన అడిగారు. ఒకటి మిస్సైల్స్, రెండోది జీపీఎస్ అని నేను సమాధానం చెప్పారు. జీపీఎస్ అంటే వేదికపై ఉన్న అయ్యన్నపాత్రుడు, అశోక్ గజపతిరాజు లాంటి పెద్దలు. మిస్సైల్స్ కూడా వేదికపై ఉన్నారు. మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కె.రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. మేం మిస్సైల్స్ గా పనిచేస్తున్నాం. జీపీఎస్ కూడా చాలా అవసరం. *ఈ రోజు ఏపీలో మీరు చూస్తున్నది ఓ చరిత్ర* ఈ రోజు ఏపీలో మీరు చూస్తున్నది ఓ చరిత్ర. మేం చరిత్ర సృష్టిస్తున్నాం. ఏపీకి ఏదో చేయాలి అని ఇక్కడున్న పెద్దలందరూ అహర్నిశలు కృషిచేస్తున్నారు. విభజనతో మనం చాలా నష్టపోయాం. దక్షిణ భారతదేశంలో ఏపీ తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉంది. దీనిని అధిమించాలని అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తులు వీరు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గెలుపు కోసం నేను ఎక్కువ కష్టపడుతున్నాను. ఎందుకంటే ఐటీ కంపెనీలు ఎక్కువగా భీమిలికే వస్తున్నాయి. *ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ జీఎంఆర్* జీఎంఆర్ ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ. ఇక్కడే మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన పదో తరగతి ఫెయిల్ అయ్యారు. తర్వాత పట్టుదలతో చదివి దేశానికే కాదు.. ప్రపంచానికే అతిపెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగారు. జీఎంఆర్ గారు శంషాబాద్ విమానాశ్రయం నిర్మించాలని భావించినప్పుడు చంద్రబాబు గారికి సందేహం ఉండేది. తర్వాత తన సామర్థ్యం నిరూపించుకున్నారు. చంద్రబాబు గారిని ఒప్పంచి ప్రపంచంలో నెం.1 ఎయిర్ పోర్ట్ నిర్మిస్తామని చెప్పారు. అనుకున్నది సాధించారు. ఈ రోజు తెలంగాణ జీడీపీలో 12 శాతం జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ అందిస్తోంది. ఎయిర్ పోర్ట్ కు 5వేల ఎకరాలు అవసరమా అని ఆనాడు ఎగతాళి చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఈ రోజు వెళ్లి చూడండి. బెంగళూరు, చెన్నైలలో రెండో ఎయిర్ పోర్ట్ నిర్మించే పరిస్థితి. చంద్రబాబు గారి విజన్ వల్ల హైదరాబాద్ కు ఆ అవసరం లేదు. వచ్చే వందేళ్లను దృష్టిలో పెట్టుకుని నిర్మించారు. *ప్రపంచ సివిల్ ఏవియేషన్ వర్క్ ఫోర్స్ లో 25 శాతం తెలుగువారు ఉండాలనేది లక్ష్యం* విజన్ అనేది చాలా అవసరం. కొంతమంది విజన్ లెస్ పీపుల్ విజనరీని ఎగతాళి చేస్తారు. చంద్రబాబు గారు రాజుగారిని కలిసిన తర్వాత ప్రపంచ సివిల్ ఏవియేషన్ వర్క్ ఫోర్స్ లో 25 శాతం తెలుగువారు ఉండాలనేది లక్ష్యమని చెప్పారు. ముఖ్యమంత్రిగా నా సహకారం ఉంటుందని చెప్పారు. దేశంలో కనీసం 70శాతం వర్క్ ఫోర్స్ తెలుగువారు ఉండాలన్నారు. చంద్రబాబు గారు తన విజన్ తో ఆదేశాలు జారీ చేశారు. ఒక వరల్డ్ క్లాస్ ఇన్ స్టిట్యూట్ తయారు చేయాలని. ఏదో ఒక యూనివర్సిటీ ఏర్పాటుచేయడం కాదు.. కామన్ ఇన్ ఫ్రాస్టక్చర్, ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలని మేమంతా భావించాం. బెస్ట్ ఇన్ క్లాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీని తీసుకువస్తేనే మన ప్రాంత రూపురేఖలు మారతాయని ఆనాడు మేం తీసుకున్న ఒక నిర్ణయం ఇది. *వేలాది ఎకరాలు ప్రజల కోసం అందించిన గొప్ప వంశీయులు పూసపాటి వారు* ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటు గురించి ఆలోచిస్తున్న సమయంలో విశాఖ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఒక మ్యాప్ తీసుకుని వచ్చారు. మాన్సాస్ ట్రస్ట్ కు ఉన్న భూముల గురించి వివరించారు. వరల్డ్ క్లాస్ ఇన్ స్టిట్యూట్ ను తీసుకువస్తే మేం ఉచితంగా భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన గొప్ప వ్యక్తి అదితి గజపతిరాజు. వేలాది ఎకరాలు ప్రజల కోసం అందించిన గొప్ప కుటుంబం వారిది. అయితే ఎంవోయూ ఫైల్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి. నేను ఫాలో అప్ చేస్తున్నప్పుడు సీఎం సెక్రటరీ గారు నాకు ఫోన్ చేసి ఉచితంగా భూమి ఇస్తున్నారని ఫైల్ లో ఉందని, ఇది సాధ్యం కాదు అన్నారు. టోకెన్ అమౌంట్ కానీ, రూపాయి అయినా కట్టాల్సి వస్తుందేమో అన్నారు. అదితి గారికి ఫోన్ చేసి చెప్పినప్పుడు రూపాయికి కూడా వారు ఒప్పుకోలేదు. గొప్ప మనసుతో వారు ఉచితంగా భూములు అందించారు. మా బ్లడ్ లోనే ఏవియేషన్ ఉంది అని, మాన్సాస్ పేరు పెడితే చాలని చెప్పారు. ఈ సభాముఖంగా అశోక్ గజపతిరాజు గారికి, అదితి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. *జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది* ఈ ఎడ్యుసిటీ కేవలం దేశానికి, రాష్టానికే కాదు.. ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలవబోతోంది. ఐఎస్ బీ సంస్థ గురించి ఏవిధంగా విన్నారో దానికంటే బెటర్ గా ఉంటుంది. ఏవియేషన్ ఎడ్యుసిటీని ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దాలని మేం అహర్నిశలు కష్టపడుతున్నాం. ఏపీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని.. అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం. క్లసర్ విధానంలో ముందుకు వెళ్తాం. వివిధ జిల్లాల్లో 20కిపైగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నాం. ఈ క్లస్టర్లలో కేవలం కంపెనీలు తీసుకురావడమే కాకుండా.. మొత్తం ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తాం. ఏవియేషన్ రంగంలో ఒక ఇంజన్ తయారు చేయాలంటే సుమారు వెయ్యి కంపెనీలు వాళ్ల కాంపోనెంట్స్ ఇస్తారు. ఇది వర్టికల్ విధానం. హారిజాంటల్ క్లస్టర్ విధానంలో ఎడ్యుకేషన్. ఏవియేషన్ ఎడ్యుకేషన్ అనేది హారిజాంటల్. *ఎడ్యుకేషన్ ను ఇండస్ట్రీని ఇంటిగ్రేడ్ చేస్తాం* ప్రపంచానికే మన టాలెంట్ అందజేయాల్సిన అవసరం ఉంది. ప్రతి క్లస్టర్ లో సిస్టమాటిక్ అప్రోచ్ తో ముందుకు వెళ్తున్నాం. ఎడ్యుకేషన్ ను ఇండస్ట్రీని ఇంటిగ్రేడ్ చేస్తాం. యువకులను జాబ్ రెడీగా తయారుచేసి అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. క్లస్టర్ బేస్ అప్రోచ్ మోడల్ ఫాలో అయ్యే ఒకే ఒక దేశం చైనా. క్లస్టర్ బేస్ అప్రోచ్ ఏపీ తీసుకుంటుంది. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే లక్ష్యం. ఇందుకోసం అహర్నిశలు కష్టపడుతున్నాం. అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చాం. ప్రజల సహకారం కూడా చాలా అవసరం. *99 పైసలకే భూములు ఇవ్వడం వల్ల టీసీఎస్, కాగ్నిజెంట్ వచ్చాయి* ఫార్చ్యూన్ 500 కంపెనీలకు 99 పైసలకే భూములు ఇస్తామంటే చాలామంది ఎగతాళి చేశారు. ఆ ఒక్క నిర్ణయం వల్ల టీసీఎస్, కాగ్నిజెంట్ వచ్చాయి. రాబోయే వంద రోజుల్లో మరో రెండు ఐటీ కంపెనీలు కూడా విశాఖకు రానున్నాయి. చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నాం. మంచి మనసుతో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు సహకరిస్తారు. ప్రకృతి సహకరిస్తుంది. ఐఎస్ బీ ఏర్పాటుచేసినప్పుడు చాలా మంది సాహసోపేత నిర్ణయం అన్నారు. చంద్రబాబు గారు వెనక్కి తిరిగి చూడలేదు. ఈ రోజు హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందిందో చూశాం. అలాంటి సాహసోపేత నిర్ణయాలు మేం తీసుకుంటాం. మిస్సైల్స్ రెడీ గా ఉన్నాయి. అద్భుతమైన జీపీఎస్ లు కూడా మాకు ఉన్నాయి. మాకు ఏదైనా గైడెన్స్ కావాలంటే టైం టూ టైం ఇస్తారు. కలిసికట్టుగా అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ను నెం.1గా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. *12 నెలల్లో ఏవియేషన్ ఎడ్యుసిటీని అభివృద్ధి చేస్తాం* నిన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసి స్టూడెంట్ మాక్ అసెంబ్లీ గురించి వివరించాను. బాలల రాజ్యాంగ పుస్తకం గురించి చెప్పాను. దేశవ్యాప్తంగా ఈ మోడల్ ను ఇంప్లిమెంట్ చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. స్పీకర్ గారి సహకారంతో ఇదంతా చేయగలిగామని చెప్పాను. మిస్సైల్, జీపీఎస్ కు ఓ ఉదాహరణ చెబుతాను. శాసనసభలోనే స్టూడెంట్ మాక్ అసెంబ్లీ నిర్వహణకు నేను విజ్ఞప్తి చేశాను. రూల్స్ అంగీకరించవని అయ్యన్నపాత్రుడు గారు చెప్పారు. అసెంబ్లీ ప్రాంగణంలోనే శాసనసభ సెట్టింగ్ వేసి నిర్వహించాలని చెప్పారు. కొంతమంది ప్రతిపక్ష నేతలకు తాము ఎక్కడ మాక్ అసెంబ్లీ నిర్వహించామో కూడా తెలియదు. మాపై ఆరోపణలు చేశారు. జీపీఎస్ గొప్పతనం ఏంటో అప్పుడు నాకు అర్థమైంది. టీడీపీలో పనిచేయడం మాలాంటి వారికి అదృష్టం. ఓ వైపు సీనియర్స్ గైడెన్స్, ప్రోత్సాహం మాకు దక్కుతోంది. మరోవైపు సీఎం గారు మమ్మల్ని పరిగెత్తిస్తున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి మరో సెక్టార్ లో యూనివర్సిటీ తీసుకురావాలని భావిస్తున్నామం, ఇందుకు సంబంధించిన గైడెన్స్ కూడా అప్పుడే ఇచ్చారు. ఎడ్యుసిటీ ఏర్పాటులో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు గారి సహకారం కూడా

విశాఖపట్నం

విశాఖ దక్షిణ నియోజకవర్గం జోన్ 4 కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్సీ నిర్వహన

*విశాఖపట్నం డిసెంబర్ 16పున్నమి ప్రతినిధి* ఉదయం 11:00 గంటలకు విశాఖ దక్షిణ నియోజకవర్గం జోన్ 4 కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్సీ నిర్వహించారు, ఈ కార్యక్రమం లో వివిధ వార్డులనుండి వచ్చిన అర్జీలను విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ గారు స్వయంగా స్వికరించి ఆయా ప్రభుత్వ శాఖలా ప్రతినిధులకు అందచేశారు, అనంతరం వివిధ రకముల అనారోగ్య సమస్యలతో బాధపడిన పేద కుటుంబములకు చెందినవారు చికిత్స అనంతరము ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా, గౌరవ ముఖ్య మంత్రి వర్యులు వారు, సదరు కుటుంబాల వారికి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తము చెక్కుల ద్వారా ఆర్ధిక సహాయము అందజేసినారు, సదరు చెక్కులను గౌరవ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు విశాఖ జనసేన పార్టీ నగర అధ్యక్షులు శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస్ గారి చేతులమీదుగా లబ్దిదారులకు చెక్యూలు పంపిణీ చేసినారు. Cmrf లబ్దిదారుల వివరాలు: 1) 29 వార్డుకు చెందిన చెన్న జీవ రత్నం గారికి రూ, 2,00,000/-, 2) 31 వార్డుకు చెందిన విరోతి రాజేష్ గారికి రూ, రూ,47,500/-, 3) 32 వార్డుకు చెందిన కమిరెడ్డి వెంకట మోహన్ రెడ్డి గారికి రూ, 1,26,868/-. ఈ కార్యక్రమం లో బాధితులతో పాటు ప్రభుత్వ అధికారులు, ఆ యా వార్డులకు చెందిన కూటమి వార్డ్ కార్పొరేటర్లు, వార్డ్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

కోటి సంతకాల ఉద్యమ ర్యాలీ సూపర్ సక్సెస్*…. * *ఉవ్వెత్తిన ఎగిసిన దక్షిణ శ్రేణుల నిరసన జ్వాల*

*కోటి సంతకాల ఉద్యమ ర్యాలీ సూపర్ సక్సెస్*…. * *ఉవ్వెత్తిన ఎగిసిన దక్షిణ శ్రేణుల నిరసన జ్వాల* * *కూటమి సర్కార్ పై మిన్నంటిన ప్రజా వ్యతిరేకత* * *పీపీపీ పేరిట లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తి ప్రైవేటుపరం* * *పేదలకు ఉచిత వైద్యం అందకుండా చేయడమే చంద్రబాబు ధ్యేయం* — *విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్* *విశాఖపట్నం డిసెంబర్ 16పున్నమి ప్రతినిధి* జిల్లా వైఎస్ఆర్సిపి నిర్వహించిన కోటి సంతకాల ప్రతుల వ్యాన్ ర్యాలీ ఉద్యమం సూపర్ సక్సెస్ అయిందని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. విజయవంతం పట్ల కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అధిక సంఖ్యలో వ్యతిరేకిస్తున్నారనడానికి చిహ్నమన్నారు. ఈ మేరకు 35 వ వార్డు అధ్యక్షులు అలుపున కనక రెడ్డి కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కోటి సంతకాల సేకరణ సక్సెస్ సమావేశంలో వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పీపీపీ పేరిట లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఉద్దేశపూర్వకంగానే నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారని ఆరోపించారు. దీంతో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైందన్నారు. ఆ వ్యతిరేకతను చూపించైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని వైఎస్ జగన్ భావించారని చెప్పారు. ఇందులో భాగంగానే కోటి సంతకాల సేకరణ ఉద్యమం ప్రారంభమైందన్నారు. ఈ సమయంలోనే తుపాను, వర్షాలు వచ్చాయని, దీంతో ఈ కార్యక్రమం ప్లాప్ అవుతుందని కూటమి సర్కార్ సంతోషించిందన్నారు కానీ, ప్రభుత్వ వ్యతిరేక ప్రజాభిప్రాయం సేకరణ ఏ దశలోనూ ఆగిపోలేదని తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనం సంతకాలు చేస్తూనే వచ్చారని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోనూ సంతకాల సేకరణ ఉధృతంగా సాగిందన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలని వైఎస్ జగన్ మోహన్రెడ్డి సంకల్పించారని, అదే సమయంలో వైద్య విద్య అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నమూ చేశారని, తాను అధికారంలో ఉండగానే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి అయితే చంద్రబాబు ప్రభుత్వం ఆ క్రెడిట్ ను నాశనం చేయాలని బలంగా నిర్ణయించిందన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు విశాఖలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైందన్నారు. సంతకాల ప్రతుల వాహనాన్ని జీవీఎంసీ నుంచి మద్దిలపాలెం వరకు భారీ ర్యాలీగా నిర్వహించడం జరిగిందన్నారు. ఇకపై కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వైసిపి ఎండ గడుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి పిలుపుతో తాము ప్రజల పక్షాన పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఇదే తరహాలో…. జగనన్న జన్మదిన వేడుకలు జరగాలి! కోటి సంతకాల ఉద్యమ ర్యాలీ సక్సెస్ తరహాలో ఈనెల 21వ తేదీన జనహృదయనేత మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు విజయవంతం చేయాలని వాసుపల్లి పిలుపునిచ్చారు. ఇచ్చిన మాట తప్పని ఏకైక లీడర్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే నని అన్నారు. అటువంటి నాయకత్వంలో రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. సంచలనాత్మక నిర్ణయాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపారన్నారు. పేద , మధ్య అన్ని తరగతుల ప్రజలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ వైసీపీ నేనని అన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలన్న ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ అకుంఠ దీక్షతో పనిచేయాలని పిలుపునిచ్చారు. వాడ వాడలా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని దక్షిణ నియోజకవర్గ పరిధిలో పలు సేవా కార్యక్రమాలతో పాటు భారీ కేక్ కటింగ్ లు సంబరాలు నిర్వహిస్తామని వాసుపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, దక్షిణ నియోజకవర్గ కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ అంకురార్పణ,ఎంవోయూ మార్పిడి*

*జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ అంకురార్పణ,ఎంవోయూ మార్పిడి* *విశాఖపట్నం డిసెంబర్ 16పున్నమి ప్రతినిధి* ​భారతదేశంలోనే మొట్ట మొదటి జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటుకు సంబంధించిన అంకురార్పణ,ఎంవోయూ మార్పిడి కార్యక్రమం విశాఖ లోని రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో అట్టహాసంగా జరిగింది ​ముఖ్య అతిథులుగా ​గోవా గవర్నర్,​మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు,​ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు,​కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు,​రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఎం.ఎస్.ఎం.ఈ.,సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్,​జీఎంఆర్ రాజు ​పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతి నిధులు మరియు అధి కారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మాన్సాస్ ట్రస్ట్, ఈ ప్రతిష్టాత్మక ఏవియేషన్ ఎడ్యుసిటీ కోసం భీమిలి మండలం అన్నవరం గ్రామం లో 136.63 ఎకరాలభూమిని కేటాయించింది. *కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఇది చరిత్రకత్మక దినం ఉత్త రాంధ్ర ఒకప్పుడు వెనుక బడ్డ ప్రాంతం వలసల ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి చెందిన విశాఖగా మార్చారు 18 నెలల్లో చంద్రబాబునాయుడు లోకేష్ పౌర విమానయానం అత్యంత ప్రాముఖ్యత కలిగిన విభాగం ఇది అత్యంత ప్రాముఖ్యత కలగడానికి ప్రధాని మోడీ కారణం ప్రతి సం.12శాతం గ్రోత్ రేట్ ఉంది అంటే అప్పటి మంత్రి ఇప్పటి గవర్నర్ అయిన అశోక్ గజపతి రాజు పేజీ కనపడు తుంది 800 ఎయిర్ క్రాఫ్ట్ లు ప్రస్తుతం ఉన్నాయి 1700 ఎయిర్ క్రాఫ్ట్ ఆర్డర్ 100 రకాలు ఉద్యోగాలు ఉంటాయి ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ కి అగ్రికల్చర్,ఇన్ఫ్రా,ఏవి యేషన్ తదితర అనేక అంశాలు పై చంద్రబాబు నాయుడుకి పూర్తి అవ గాహన ఉంటుంది రాబోయే 30,40 సం తరవాత ఏమి అవసరం అనే ఆలోచన చేస్తారు నెల రోజుల్లో ట్రయల్స్ జరుగుతాయి భోగా పురంలో జూలై లో భోగా పురం ఎయిర్పోర్ట్ ప్రారంభం వుంటుంది యూనివర్సిటీ నీ ఎదుసిటీగా మార్చాం ప్రపంచంలో ఏ యూనివర్సిటీ తో అయినా మనం దీనిలో తేవచ్చు వలసలకు మనం వెళ్ళే రోజులు నుండి మన వద్దకు ప్రపంచం వచ్చే విధంగా తీర్చి దిద్దారు చంద్రబాబు నాయుడు *నారా లోకేష్ కామెంట్స్* బీహార్ లో నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారంకి వెళ్ళాం గడిచిన 18నెలల్లో ఏపీలో ఒక మ్యాజిక్ జరుగుతుంది అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు మెసైల్స్,జి పి ఎస్ రెండు కలిసి పని చేస్తున్నాం తలసరి ఆదాయం తక్కువ ఉంది అని అహర్నిశలు కష్ట పడుతున్నాం అన్ని ఐటీ కంపెనీలు భీమిలికి వస్తున్నాయి జిఎంఆర్ 10వ తరగతి ఫెయిల్ అయ్యారు ఆ తర్వాత మాన్సాస్ లో ఇంటర్ చదివి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ పోర్ట్ లు కడుతున్నారు సెంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం టైమ్ లో కొంత మంది ఎగతాళి చేశారు ఎయిర్పోర్ట్ కి 5వేల ఎకరాలు అవసరమా అని ఇప్పడు దాని విలువ అర్థం అవు తుంది కొన్ని చోట్ల ఇప్పుడు 2వ ఎయిర్పోర్ట్ నిర్మాణం కి ట్రై చేస్తున్నారు సివిల్ ఏవియేషన్ లో ప్రపంచంలో 25శాతం మన తెలుగు వారు ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన ఒక గజం భూమి కోసం కొట్టు కుంటున్న సమాజంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇస్తున్నారు గజపతి కుటుంబం దీనికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి కనీసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు భూములు నిమిత్తం అంత గొప్ప కుటుంబం గజపతి కుటుంబం *గంటా శ్రీనివాసరావు బీమిలి ఎమ్మెల్యే కామెంట్స్* మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం పెద్దలు గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, అయ్యన్న పాత్రుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ సిఈవో శివ ప్రసాద్ రాజు,ఐటీ మంత్రి లోకేష్ కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడు ముందు ఉంటారు హైదర బాద్ నగర అభివ్రుద్ది చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది దేశ యావత్తు రాజకీయాలు ఏపీ భవన్ లో ఉండేవి శంషాబాద్ విమానా శ్రయం నిర్మాణంలో ముఖ్య భూమిక చంద్రబాబు నాయుడుది భోగాపురం ఎయిర్ పోర్ట్ ను అను సంధానం చేసుకుంటూ విశ్వ విద్యాలయం ఏర్పాటు చూస్తే చంద్రబాబు నాయుడు విజన్ అర్ధం అవుతుంది ఈ 18 నెలల్లో మొత్తం ఇకో సిస్టమ్ తీసుకొచ్చారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ముఖ్య భూమిక పోషిస్తున్న వ్యక్తి లోకేష్ ఒకప్పుడు విమానం లగ్జరీ ఇప్పుడు అవసరం అయింది 12నెలలు అంటే కుదరదు ఒకరోజు ముందే పూర్తి చేయాలి అనే అంత ఆలోచనతో లోకేష్ పని చేస్తున్నారు *గోవా గవర్నర్,​మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు కామెంట్స్* ఉత్తరాంధ్ర విద్యార్ధులకు మంచి విద్యా మా ట్రస్ట్ నుండి ఇస్తున్నాం మన ప్రాంతానికి ఒక నైపుణ్యం కలిగిన ఎడ్యు కేషన్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు దీనిపై అతి ఎక్కువ శ్రద్ధ తీసుకున్న చంద్రబాబు నాయుడు లోకేష్ లకి ప్రత్యేక ధన్యవాదములు *అయ్యన్న పాత్రుడు స్పీకర్ కామెంట్స్* 1983లో రాజకీయాలు లోకి వచ్చాను అప్పటి నుండి చూస్తున్న ఇప్పుడు ఉత్త రాంధ్రకీ మహర్దశ వచ్చింది ఉత్తరాంధ్రకీ ఎన్ టి రామా రావు ఒక గుర్తింపు తెచ్చారు ఇప్పుడు చంద్ర బాబు, లోకేష్ మమ్మల్ని నిద్ర పోవడం లేదు రాష్ట్ర అభివృద్ధి కి కూటమి ప్రభుత్వం పని చేస్తుంది ఇంతలా పని చేస్తున్న కూడా ఇంకా అడ్డంకులు సృష్టి స్తున్నారు పార్టీలు ఉంటాయి కానీ మంచి కార్యక్రమంకి ప్రోత్సాహం ఉండాలి జీఎంఆర్ మల్లికార్జున ఢిల్లీ లో ఒకమాట అన్నారు నా ప్రాంతంలో నాకు ఎయిర్పోర్ట్ కట్టే అదృష్టం కలిగింది ఏవి యేషన్ యూనివర్సిటీ కి భూములు ఇచ్చిన ఘనత అశోక్ గజపతి రాజుది ఇప్పటి రోజుల్లో 10వేలు డొనేషన్ చేసి లక్ష రూపాయల ప్రచారం చేసుకుంటున్నారు వేల కోట్లు రూపాయలు విలువ చేసే భూములు ఆస్తులు ప్రజలకి ఇచ్చేసి సామాన్య జీవితం గడుపు తున్న వ్యక్తి అశోక్ గజపతి రాజు పెద్ద పెద్ద ప్రాచీన్యత పొందిన వ్యక్తులు అనేక మంది ఈ మాన్సాస్ నుండి వచ్చినవారే

విశాఖపట్నం

సింబ‌యాసిస్ న‌రేష్ కుమార్‌కు ఏయూ డాక్ట‌రేట్‌

సింబ‌యాసిస్ న‌రేష్ కుమార్‌కు ఏయూ డాక్ట‌రేట్‌ *విశాఖ‌ప‌ట్నం,డిసెంబర్ 16పున్నమి ప్రతినిధి*: ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం కామ‌ర్స్ మేనేజ్‌మెంట్ విభాగం ప‌రిశోధ‌క విద్యార్థి, సింబ‌యాసిస్ టెక్నాల‌జీస్ సిఈఓ ఓరుగంటి న‌రేష్ కుమార్‌కు డాక్ట‌రేట్ ల‌భించింది. ఆర్ట్స్ కామ‌ర్స్ క‌ళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఏ.న‌ర‌సింహా రావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో వ‌ర్క్‌ప్లేస్ డైన‌మిక్స్ అండ్ చాలెంజెస్ ఇన్ ద ఐ.టి సెక్టార్ పోస్ట్ పేండ‌మిక్‌- ఏ కేస్ స్ట‌డీ ఆన్ వ‌ర్క్ ఫ్రం-హోం ఇన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనే అంశంపై జ‌రిపిన పరిశోధ‌న‌కు డాక్ట‌రేట్ ల‌భించింది. ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ త‌న కార్యాల‌యంలో డాక్ట‌రేట్ ఉత్త‌ర్వుల‌ను న‌రేష్ కుమార్‌కు అంద‌జేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా విభాగ ఆచార్యులు, ప‌రిశోధ‌కులు, శ్రేయోభిలాషులు న‌రేష్ కుమార్‌ను అభినందించారు. అనంతరం నరేష్ కుమార్ ను ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య నరసింహారావు తన కార్యాలయంలో అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ప‌నిచేసే కార్యాలయ గతిశీలత మరియు కోవిడ్‌ మహమ్మారి అనంతర ఐటీ రంగంలో సవాళ్లు: ఆంధ్రప్రదేశ్‌లో వర్క్-ఫ్రమ్-హోమ్ పై ఒక అధ్యయనం అనే అంశంపై న‌రేష్ కుమార్ త‌న ప‌రిశోధ‌న జ‌రిపారు. కోవిడ్ అనంత‌రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఐటి రంగంలో ఎదురైన స‌వాళ్ల‌ను త‌న ప‌రిశోధ‌న‌లో అధ్య‌య‌నం చేశారు. సుదీర్ఘ కాలంగా సాఫ్ట్‌వేర్ సంస్థ‌ను నిర్వ‌హిస్తూ, ఐటి వ్య‌వ‌స్థ‌ను, అభివృద్ధిని, స‌వాళ్ల‌ను సునిశితంగా ప‌రిశీలిస్తున్న న‌రేష్ కుమార్ ఆ రంగానికి ఎదురైన స‌వాళ్ల‌ను ప‌రిశోధ‌న అంశంగా తీసుకుని త‌న ప‌రిశోధ‌న సిద్దాంత గ్రంధాన్ని ఏయూకు స‌మ‌ర్పించి, డాక్ట‌రేట్ పొందారు. ఋషికొండ ఐటీ పార్క్ అసోసియేషన్ , వైజాగ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉపాధ్యక్షునిగా నరేష్ కుమార్ సేవలు అందిస్తున్నారు. నరేష్ కుమార్ గ‌తంలో బిఈ, ఎంబీఏ, ఎంఫిల్ డిగ్రీలను పూర్తి చేసి నేడు ఏయూ నుంచి పీ.హెచ్.డి అందుకున్నారు.

విశాఖపట్నం

పంచగ్రామాల ప్రజలను అక్రమాదారులుగా ముద్ర వేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు – ఇది హెచ్చరిక.

పంచగ్రామాల ప్రజలను అక్రమాదారులుగా ముద్ర వేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు – ఇది హెచ్చరిక. *విశాఖపట్నం డిసెంబర్ 16పున్నమి ప్రతినిధి* సింహాచలం తొలిపావంచా నుంచి పాత అడవివరం జంక్షన్ వరకు నిర్మించిన BRTS రోడ్డుకు సంబంధించి బాధితులకు TDRలు మంజూరు చేస్తూ G.O జారీ చేసిన కూటమి ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకం. ఇందుకు కూటమి ప్రభుత్వానికి పంచగ్రామాల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అయితే, అదే కూటమికి చెందిన ఒక కార్పొరేటర్ పంచగ్రామాల్లో నివసించే రైతులు, ప్రజలను చులకన చేసి అక్రమాదారులుగా చిత్రీకరించడం రాజకీయ నీచత్వానికి నిదర్శనం. అప్పటి వైసీపీ ప్రభుత్వం 273 మంది లబ్ధిదారులుగా గుర్తించి, 205 మందికే TDRలు ఇచ్చినట్టు ఇచ్చి, sale option లేకుండా చేశారు. – ఇదే వాస్తవం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు గారు, విశాఖ ఎంపీ శ్రీ భరత్ గారి నాయకత్వంలో BRTS బాధితుల సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించి, కమిటీ ఏర్పాటు చేసి, కమిటీ సిఫార్సుల మేరకు 273 మందికీ న్యాయం చేస్తూ G.O జారీ చేయడం జరిగింది. ఇంత స్పష్టమైన అంశాన్ని తణుకు TDR స్కామ్‌తో పోల్చడం అవివేకం మాత్రమే కాదు, బాధితులపై దాడి చేయడమే. కూటమిలో అంతర్గత రాజకీయాలుంటే అవి పెద్దల దగ్గర తేల్చుకోవాలి. సింహాచలం BRTS బాధితుల జోలికి వస్తే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవు. ఈ విషయాన్ని పత్రిక సోదరులకు, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు స్పష్టంగా తెలియజేస్తున్నామని అడవివరం మాజీ సర్పంచ్ – పాశర్ల ప్రసాద్ తెలిపారు.

కడప

కడప జిల్లా అధ్యక్షునిగా భూపేష్ సుబ్బరామిరెడ్డి

తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షునిగా జమ్మలమడుగు నియోజకవర్గపు ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి గారు నియమితులయ్యారు ఆయన పార్టీకి చేసిన కృషికి గాను ఈ పదవి లభించింది ఈ సందర్భంగా పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా భూపేష్ సుబ్బరామిరెడ్డి గారు మాట్లాడుతూ ఈ పదవి తనకు మరింత బాధ్యతను పెంచిందని ఇకపై మరింత క్రమశిక్షణతో పని చేస్తానని ఆయన తెలిపారు

E-పేపర్

నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు

రైల్వే కోడూరు మండలం స్థానిక టోల్గేట్ వద్ద నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో. ఎంపీటీసీ పుష్పలత గురయ్యా ,రాష్ట్ర కార్యదర్శి ఈరన్న, శీను, శేఖర్, రాము, మనీ, సూరి సుబ్బరాయుడు ,నాగార్జున, హిందూ సంఘాల నుండి సుబ్బరాయుడు, దరిశ వెంకట్ రెడ్డి, సుగవాసి మల్లికార్జున, జయరాం రెడ్డి, సాయి ఆచారి పాల్గొని సంఘీభావం తెలియజేయడం జరిగినది రాజంపేట మొద్దు అనే నిదానంతో నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో పాయిగా ర్యాలీ కూడా చేపడం జరిగిందని వారు తెలియజేశారు.

E-పేపర్

నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు

రైల్వే కోడూరు మండలం స్థానిక టోల్గేట్ వద్ద నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో. ఎంపీటీసీ పుష్పలత గురయ్యా ,రాష్ట్ర కార్యదర్శి ఈరన్న, శీను, శేఖర్, రాము, మనీ, సూరి సుబ్బరాయుడు ,నాగార్జున, హిందూ సంఘాల నుండి సుబ్బరాయుడు, దరిశ వెంకట్ రెడ్డి, సుగవాసి మల్లికార్జున, జయరాం రెడ్డి, సాయి ఆచారి పాల్గొని సంఘీభావం తెలియజేయడం జరిగినది రాజంపేట మొద్దు అనే నిదానంతో నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో పాయిగా ర్యాలీ కూడా చేపడం జరిగిందని వారు తెలియజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.