Tuesday, 5 May 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు తహశీల్దార్ కార్యాలయంలో న్యాయం జరగలేదంటూ ఓ కుటుంబ ఆవేదన

తురకపల్లి గ్రామం దుత్తలూరు మండలoలో తహశీల్దార్ కార్యాలయంలో న్యాయం జరగలేదంటూ ఓ కుటుంబం ఆవేదన 846/6 లో సర్వే నెంబర్ 50 సెంట్లు భూమి కలిగిన శ్రీకాంత్ భూమిని అదే గ్రామానికి చెందిన నేలటూరి అనే సింహాద్రి వ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించి ఉన్నారు ఈ విషయం పై 2025 ఫిబ్రవరి లో దుత్తలూరు తహశీల్దార్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది తహశీల్దార్ యనమల నాగరాజు సానుకూలంగా స్పందించారు అప్పటికి న్యాయం జరగకపోవడంతో PGRS లో కంప్లైట్ ఇచ్చిన తరువాత ఆగస్ట్ లో కావలి రెవెన్యూ డివిజన్ అధికారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది ఈ విషయం పై వెంటనే స్పందించి ఎండోస్ మెంట్ ఇచ్చారు సదరు విషయం పై దుత్తలూరు తహశీల్దార్ మీకు తగు న్యాయం చేస్తారంటూ రెవెన్యూ డివిజన్ అధికారి వెల్లడించారు అనంతరం దుత్తలూరు తహశీల్దార్ యనమల నాగరాజు ఇరువురిని పిలిపించి విచారించి నేను చెప్పేoతవరకు ఇరువురు భూమిని సాగు చేయకూడదు అని తెలిపారు వెళితే క టీన చర్యలు తప్పవనీ చెప్పారు ఐన కూడా నేలటూరి సింహాద్రి అను అతను అధికారుల మాటలు లెక్కచేయకుండా భూమిని సాగు చేసారు.

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం….. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి అవగాహన సదస్సు……

విజయవాడ…. లబ్బీపేట న్యూస్ (డాక్టర్ మంజుల గుదిమెళ్ళ..పున్నమి ) శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో 16- 12-2025 వ తేదీన ఎన్.ఎస్.ఎస్ విభాగం వారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ధ్యానం అంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి, ఏకాగ్రతను పెంచుకోవడానికి చేసే మానసిక ,శారీరక సాధన, వ్యక్తిగత ఎదుగుదలకు మెదడు పనితీరు మెరుగు పడుతుందని ధ్యానం ద్వారా మన ఆలోచనలు భావాలను అర్థం చేసుకొని మేధస్సును పెంచుతుందని తెలియజేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు జి. పద్మజ ఎన్. మాధవి, బి.వి దుర్గాభవాని విద్యార్థినులతో కొన్ని ఆసనాలు చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. వి.వి.ఎస్. కుమార్ గారు ,ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్. కె.సరళ శ్రీమతి .టీ. నాగరాణి పి. శ్రీ భారతి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

తిరుపతి

రాష్ట్ర మంత్రికి ముక్కంటి ప్రసాదాలు అందజేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 16, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి విజయవాడలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిని మర్యాదపూర్వకంగా కలిసి ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పలు సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు అనంతరం, మంత్రికి శ్రీకాళహస్తి క్షేత్ర ప్రసాదాలను, దైవ ఆశీస్సులతో కూడిన చిత్రపటాన్ని అందజేశారు.

తిరుపతి

మృతదేహా ఖననం ధరలను నీయంత్రించాలని వినతి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 16, శ్రీకాళహస్తిలోని స్మశాన వాటికలో మృత దేహాన్ని (ఖననం) పుడ్చడానికి వాటిక నిర్వాహుకులు బీద, బిక్కి అనే తేడాలేకుండా అధిక ధరలు అడుగుతూ ప్రజలను పిడిస్తున్నారని ఈ చర్యలపై నియంత్రణ తీసుకురావాలని కోరుతూ మంగళవారం నాడు పట్టణంలోని కొందమంది సమాజ శ్రేయోభిలాషులు మున్సిపల్ కమిషనర్ భవాని ప్రసాద్ ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రవి, శివకుమార్, చిరంజీవి, కోట ప్రసాద్,శివ, కిరణ్, వెంకటేశ్వరరావు, నాగరాజు, శ్రీనివాసులు, కోటేశ్వరరావు, రాజ, ఉదయ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తి నారాయణ పాఠశాలలో ఘనంగా విజయ్ దివాస్ వేడుకలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 16, పట్టణంలోని నారాయణ పాఠశాలలో విజయ్ దివాస్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఈశ్వర్ మాట్లాడుతూ, భారతదేశం–పాకిస్తాన్ మధ్య 1971లో జరిగిన యుద్ధంలో భారత్ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని స్మరించుకునే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న విజయ్ దివాస్‌ను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. 1971 డిసెంబర్ 16న పాకిస్తాన్ సైన్యం భారత్ ముందు లొంగిపోవడంతో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించిందని ఆయన వివరించారు. ఈ విజయం ద్వారా భారత సైన్యపు ధైర్యం, త్యాగం, వ్యూహాత్మక ప్రతిభ ప్రపంచానికి స్పష్టంగా తెలిసిందని పేర్కొన్నారు. విజయ్ దివాస్ దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు నివాళి అర్పించే రోజుగా, భారత సైన్యం సాధించిన అత్యంత ఘన విజయాల్లో ఒకటిగా, దేశభక్తి, జాతీయ ఐక్యతను మరింత బలపరచే సందర్భంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నదని ఈశ్వర తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చిన్నారులు భారత ఆర్మీ సైనికుల వేషధారణలో, అలాగే డాక్టర్లు, నర్సులు సహా దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావుల వేషధారణలో అలరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

తిరుపతి

గ్రామీణ బ్యాంకు ద్వార బాధితుడుకి రూ.5,00,000 ప్రమాద బీమా చెక్కు అందజేత

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 16, శ్రీకాళహస్తి మండలంలోని ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, ఎగువవీధి బ్రాంచ్ ఆధ్వర్యంలో చోళ యంస్ జనరల్ ఇన్సూరెన్సు ద్వారా పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్సు క్లెయిమ్ ను విజయవంతంగా పరిష్కరించడంజరిగింది. చుక్కలనిడిగల్లి గ్రామానికి చెందిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యురాలు పి.రాధ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో పర్సనల్ యాక్సిడెంటల్ స్కీముకు ఎన్రోల్మెంట్ జరిగినది. ఇటీవల జరిగిన యాక్సిడెంట్లో పి రాధ మరణించడంటో నామినీకి చోళ యంస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు రూ.5,00,000/- విలువైన చెక్కును ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ పి. ప్రకాష్ రత్న బాబు చేతుల మీదుగాచెక్కునుఅందజేయడం జరిగింది. ఈ చెక్కు పంపిణీ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ పి. ప్రకాష్ రత్న బాబు, చోళ యంస్ జనరల్ ఇన్సూరెన్సు మేనేజర్ యస్వంత్, బ్రాంచ్ మేనేజర్ యస్. బాల నరసింహం, ఇన్సూరెన్సు రిప్రెసెంటేటివ్స్ మరియు బ్రాంచ్ స్టాఫ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ పి. ప్రకాష్ రత్న బాబు మాట్లాడుతూ, ఈ బీమా మొత్తాన్ని చనిపోయిన పి.రాధ కుమార్తె భవిష్యత్ విద్యా మరియు కెరీర్ అభివృద్ధి కోసం వినియోగించుకోవాలని,ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, చోళ యంస్ జనరల్ ఇన్సూరెన్సు సంస్థలు వినియోగదారుల సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉన్నాయని తెలియజేశారు.

విశాఖపట్నం

నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారి ఆధ్వర్యంలో నగరంలోని వివిధ పరిశ్రమల సంస్థల ప్రతినిధులతో విశాఖపట్నం సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (VCSC) మీటింగ్ ను నగర పోలీసు కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించడం జరిగినది.

*విశాఖపట్నం డిసెంబర్ 16పున్నమి ప్రతినిధి* నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారి ఆధ్వర్యంలో నగరంలోని వివిధ పరిశ్రమల సంస్థల ప్రతినిధులతో విశాఖపట్నం సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (VCSC) మీటింగ్ ను నగర పోలీసు కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించడం జరిగినది. ఈ సమావేశం నందు విశాఖపట్నం నగరంలో భద్రత, సంక్షేమం మరియు అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని పోలీస్ కమిషనర్ గారు “సెవెన్ డ్రీమ్స్ (Seven Dreams)” అనే దూరదృష్టి గల ప్రణాళికను వెల్లడించారు. విశాఖ నగరం ముందుగా దేశంలోనే ఉత్తమ పోలీసింగ్ గల నగరంగా, ఆ తర్వాత ప్రపంచంలోనే ఆదర్శ పోలీసింగ్ నగరంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. ఇది కేవలం పోలీస్ శాఖ కల మాత్రమే కాకుండా, నగర ప్రజలందరి కలగా మారాలని ఆయన ఆకాంక్షించారు. ఈ లక్ష్య సాధనలో విశాఖపట్నం భద్రతా మండలి (Vizag Security Council) కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని పోలీసు కమిషనర్ గారు పేర్కొన్నారు. మొదటిది ట్రాఫిక్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాలని, ప్రణాళిక ప్రకారం 2026 ఏప్రిల్ 1 నుండి AI ఆధారిత ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను నగరంలో ప్రవేశపెట్టనున్నామని, ఈ వ్యవస్థ ద్వారా ట్రాఫిక్ సిగ్నల్స్ సమకాలీకరణ జరిగి, వాహనాల సగటు వేగం పెరిగి ప్రజలు తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోగలుగుతారని తెలిపారు. ఆటోమేటిక్ నంబర్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి, ఉల్లంఘనదారులకు ఇంటికి చేరకముందే చలాన జారీ అయ్యే విధంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ జరుగుతుందని చెప్పారు. ఈ విధానంతో ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బాధ్యత పూర్తిగా ఆధునిక సాంకేతికత తీసుకుంటుందని, ట్రాఫిక్ పోలీసులు, ట్రాఫిక్ నియంత్రణపై మాత్రమే దృష్టి సారిస్తారని తెలిపారు. ట్రాఫిక్ వాలంటీర్ల వ్యవస్థను బలోపేతం చేయడంలో, అలాగే ట్రాఫిక్ సమస్యలపై స్వతంత్రంగా అంచనా వేయడంలో భద్రతా మండలి సహకారం అవసరమని పేర్కొన్నారు. రెండవది మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా భర్తలు లేదా కుటుంబ సభ్యులచే హింసకు గురైన మహిళలు, అలాగే పిల్లలతో విడిచిపెట్టబడిన మహిళలకు సమాజం అండగా నిలవాలని, భద్రతా మండలిలోని దాతలు మరియు దయాగుణం కలిగిన వ్యక్తుల సహకారంతో బాధిత మహిళలకు పునరావాసం కల్పించి, వారి పిల్లలకు విద్య అందించేలా నిధులు సమకూర్చాలన్నదే తమ ఆశయమని సీపీ గారు వెల్లడించారు. మూడవది సమాజంలోని బలహీన వర్గాలకు జీవనోపాధి మరియు పునరావాసం కల్పించాలని, ఆశ్రయం లేని వారు, ట్రాన్స్‌జెండర్‌లు, జైలు నుంచి విడుదలైన మాజీ ఖైదీలు, డ్రగ్ మరియు మద్యం వ్యసనాల నుంచి కోలుకున్నవారు, నిరుద్యోగులైన పోలీస్ సిబ్బంది పిల్లలు మరియు రిటైర్డ్ హోమ్ గార్డులకు తగిన ఉపాధి కల్పిస్తే వారు తప్పుదారుల్లోకి వెళ్లే అవకాశాలు ఉండవని తెలిపారు. సమాజం అంగీకారం మరియు సహకారం లభిస్తే విశాఖపట్నం మరింత సురక్షితమైన నగరంగా మారుతుందని సీపీ గారు తెలిపారు. నాలుగవది హోమ్ గార్డుల సంక్షేమంపై కమిషనర్ ఆవేదన వ్యక్తం చేస్తూ, హోమ్ గార్డులు 60 ఏళ్ల తర్వాత ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా పదవీ విరమణ చేయాల్సి వస్తోందని, ఉద్యోగ భద్రత లేకుండా, అనారోగ్యంతో ఉన్నప్పుడు వేతనం కూడా కోల్పోయే పరిస్థితిలో ఉన్నారని, అందుకే హోమ్ గార్డ్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసి, వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా కల్పించేందుకు కృషి చేయాలనీ తెలిపారు. ఐదవది నగర భద్రతను మరింత పటిష్టం చేసే మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని, ప్రతీ ప్రాంతంలో నైట్ విజన్ సదుపాయం కలిగిన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఫుటేజ్‌ను క్లౌడ్‌లో భద్రపరచాలని, బిజీ కూడళ్లలో ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా జాతీయ లేదా రాష్ట్ర క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటాబేస్‌లలో ఉన్న నేరస్థులను గుర్తించి వెంటనే స్థానిక పోలీసులను అప్రమత్తం చేసే విధానం అమలు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న డ్రోన్‌లతో పాటు, నిఘా, నేర నిరోధం, సైరన్ మరియు పబ్లిక్ అడ్రస్ వ్యవస్థలతో కూడిన ఆధునిక డ్రోన్‌లు, అలాగే విపత్తుల సమయంలో ఆహారం మరియు మందులు సరఫరా చేసే డ్రోన్‌లు మరింత అవసరమని, ప్రతి పోలీస్ స్టేషన్‌లో కనీసం ఒక డ్రోన్ ఉండాలన్నదే లక్ష్యమని వెల్లడించారు. ఆరవది బీచ్ భద్రత మరియు ట్రాఫిక్ ఉపకరణాలపై దృష్టి సారించాలని, మునిగిపోయే అవకాశం ఉన్న ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులు, లైట్లు, లైఫ్ గార్డ్‌లు ఏర్పాటు చేయాలని, మునిగిపోతున్న వారిని రక్షించేందుకు రిమోట్ కంట్రోల్ ఇంటిగ్రేటెడ్ బోట్లు మరియు లైఫ్ జాకెట్లు అవసరమని, అలాగే మద్యం సేవించి వాహనం నడిపే వారిని గుర్తించేందుకు మరిన్ని బ్రీత్ ఎనలైజర్‌లు, అతివేగాన్ని గుర్తించేందుకు స్పీడ్ లేజర్ గన్‌లు అవసరమని పేర్కొన్నారు. ఏడవది ప్రజల్లో అవగాహన మరియు ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీపీ గారు, ప్రతి రకమైన సైబర్ నేరంపై తెలుగులో అవగాహన చిత్రాలను రూపొందించి, వాటిని వీధుల్లో మొబైల్ వాహనాల ద్వారా ప్రదర్శించాలని, వ్యసన విముక్తి కేంద్రాలు సరిపోవడం లేదని, ప్రతి డ్రగ్‌కు అనుగుణంగా ఉత్తమ చికిత్స అందించే కేంద్రం ఏర్పాటు చేయడానికి భద్రతా మండలి సహకారం అవసరమని తెలిపారు. ఆసుపత్రులకు దూరంగా ఉన్న ప్రాంతాలలో ప్రజా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని, 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు HPV టీకాలు అందించి ప్రతి బాలికకు టీకా అందిన దేశంలో తొలి నగరంగా విశాఖపట్నాన్ని నిలపాలన్న లక్ష్యాన్ని వెల్లడించారు. అలాగే టైఫాయిడ్, న్యుమోనియా, ఇన్‌ఫ్లుయెంజా వంటి ముఖ్యమైన టీకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ నేరాలు, మహిళలపై ఆన్‌లైన్ నేరాలు, ఆస్తి నేరాలు, డ్రగ్స్, మానవ అక్రమ రవాణా మరియు ఆర్థిక నేరాలపై క్రమం తప్పకుండా ప్రజలకు చేరువయ్యే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రజలు, పోలీసులు మరియు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ద్వారా అద్భుతాలు సాధించవచ్చని కమిషనర్ గారు పేర్కొన్నారు. చాలా కాలం నుండి భద్రతా మండలి నిద్రావస్థలో ఉందని, ఇకపై చురుకుగా పనిచేసే, తనను కూడా నిద్రపోనివ్వని సభ్యులు కావాలని,, పోలీస్ శాఖ తరఫున గాజువాక ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మరియు పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్‌స్పెక్టర్‌లను సమన్వయాధికారులుగా నియమించినట్లు తెలిపారు. అనంతరం విశాఖపట్నం సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ నుండి పలువురు ప్రతినిధులు విశాఖ నగర అభివృద్ధికి మరియు పలు సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయడానికి తమ కార్యా చరణ తెలియజేయడం జరుగుతుంది,తిరిగి 2026 జనవరి 07 వ తేదీన రెండవ మీటింగ్ నిర్వహించడం జరుగుతుందని తీర్మానించారు. ఈ కార్యక్రమం నందు డిసిపి-I గారు, డి.సి.పి-II గారితో పాటుగా ఏ.డి.సి.పి లు, ఏ.సి.పి లు, నగర VCSC నాయకత్వ బృందం , వీకిస్సీ సభ్యులు, పలు పరిశ్రమల ప్రతినిధులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు

విశాఖపట్నం

నగరంలో ఆపరేషన్స్ లంగ్స్ (Operation LUNGS) 2.0 లో ఆక్రమణల తొలగింపుల కొనసాగింపు * జీవీఎంసీ పరిధిలో మంగళవారం 281 ఆక్రమణల తొలగింపు.

నగరంలో ఆపరేషన్స్ లంగ్స్ (Operation LUNGS) 2.0 లో ఆక్రమణల తొలగింపుల కొనసాగింపు * జీవీఎంసీ పరిధిలో మంగళవారం 281 ఆక్రమణల తొలగింపు. * – జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ.ప్రభాకర్ రావు *విశాఖపట్నం డిసెంబర్ 16 పున్నమి ప్రతినిధి*: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో అన్ని జోన్ల లో ఆపరేషన్ లంగ్స్ 2.0 లో భాగంగా 281 ఆక్రమణలను మంగళవారం తొలగించడం జరిగిందని జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ . ప్రభాకర్ రావు మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. మహా విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు నగర పరిధిలో ప్రజలు సురక్షితంగా ఫుట్ పాతులపై నడక సాగించేందుకు, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో లో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా రోడ్లు, జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలకు అడ్డంకులు లేకుండా సురక్షిత రవాణా కోసమై జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ (Operation Lungs) 2.0 లో భాగంగా అన్ని జోన్లలో రోడ్లపై జంక్షన్లలో ఆక్రమణలు తొలగించడం జరుగుతుందని చీఫ్ సిటీ ప్లానర్ తెలిపారు. తొలగించిన ఆక్రమణలను ఈ క్రింద పొందుపరచడమైనది. 1వ జోన్ పరిధిలో మంగమారిపేట నుండి భీమిలి బీచ్ రోడ్డు వరకు 13 ఆక్రమణలు, 2 వ జోన్ పరిధిలో కార్ షెడ్ జంక్షన్ నుండి పీఎం పాలెం ఆఖరి బస్ స్టాప్ వరకు 18 ఆక్రమణలు, 3వ జోన్ పరిధిలో రామా టాకీస్ నుండి సత్యం జంక్షన్ వరకు, సత్యం జంక్షన్ నుండి ఏ ఎస్ ఆర్ విగ్రహం వరకు, ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్ రోడ్డు నుండి పోర్ట్ స్టేడియం వరకు, ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుండి గురుద్వార్ జంక్షన్ వరకు 83 ఆక్రమణలు, 4 వ జోన్ పరిధిలో అగర్వాల్ హాస్పిటల్ నుండి ఎస్టీ ఆంతోనీ స్కూల్ వరకు 33 ఆక్రమణలు, 5 వ జోన్ పరిధిలో అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్డు నుండి రైల్వే న్యూ కాలనీ వరకు 40 ఆక్రమణలు, 6 వ జోన్ పరిధిలో బీసీ రోడ్డు జంక్షన్ నుండి గంగవరం పోర్టు రోడ్డు వరకు, శ్రీనగర్ జంక్షన్ నుండి దుర్గా నగర్ రోడ్డు వరకు, అగనంపూడి జంక్షన్ నుండి విశాఖ స్టీల్ జనరల్ హాస్పిటల్ వరకు 67 ఆక్రమణలు, వెస్ట్ జోన్ పరిధిలో మల్కాపురం నుండి కోరమండల్ గేట్ వరకు 12 ఆక్రమణలు, 8వ జోన్ పరిధిలో వ్యాపకుంట జంక్షన్ నుండి చిన్న ముషిడివాడ జంక్షన్ వరకు 15 ఆక్రమణలతో కలిపి మొత్తం 281 ఆక్రమణలు తొలగించడం అయినదని ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా జోన్ల కమిషనర్లు, సహాయక ప్రణాళిక అధికారులు, ప్రణాళిక విభాగం సిబ్బంది, సచివాలయం సిబ్బంది , పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

3వ జోన్ లో డిసెంబర్ 23న బహిరంగ వేలం

3వ జోన్ లో డిసెంబర్ 23న బహిరంగ వేలం ప్రకటన *విశాఖపట్నం డిసెంబర్ 16పున్నమి ప్రతినిధి*: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ 3వ జోన్ (ఆశీలు మెట్ట) పరిధిలో ఖాళీగా వున్న షాపు రూములకు, కమ్యూనిటీ హాల్ నకు డిసెంబర్ 23న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించబడునని 3వ జోనల్ కమిషనర్ కె.శివప్రసాద్ మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. 3వ జోన్ పరిధిలో గల యం.వి.పి కాలనీ వాణిజ్య సముదాయములో షాప్ రూమ్ నెం.10,11,12,13,14,15&16 లకు, డైమండ్ పార్క్ వాణిజ్య సముదాయములో షాప్ రూమ్ నెం.09, జగ్గారావు బ్రిడ్జి వాణిజ్య సముదాయములో షాప్ రూమ్ నెం.06 మరియు బి.టి.ఆర్ కాలనీ, రెల్లివీధి లో గల కమ్యూనిటీ హాల్ కు 3 సంవత్సరముల కాలమునకు గుత్తలకు ఇచ్చుటకు గాను తేది: 23-12-2025 న ఉదయం 11 గంటలకు జీవీఎంసీ జోన్-3 ఆశీలు మెట్ట కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించబడునని, ఆసక్తి గల పాటదారులు పూర్తి వివరాలకు 3వ జోనల్ కమిషనర్ కార్యాలయం లోని పని వేళలో పర్యవేక్షకులను సంప్రదించగలరని జోనల్ కమిషనర్ తెలియజేశారు.

విశాఖపట్నం

స్కిల్ కోసం ప్రపంచం ఉత్తరాంధ్రవైపు చూసే రోజు వస్తుంది : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.*

*స్కిల్ కోసం ప్రపంచం ఉత్తరాంధ్రవైపు చూసే రోజు వస్తుంది : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.* – ఉత్తరాంధ్రలో ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటు కావడం చారిత్రాత్మక దినం – ఈ పద్ధెనిమిది నెలలు చంద్రబాబు, లోకేష్ లు ఉత్తరాంధ్ర పై ప్రత్యేక దృష్టి. – ఏవియేషన్ లో కీలక సంస్కరణకు ఆనాడు మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు బీజం వేశారు. – 30 ఏళ్ల దూర దృష్టితో చంద్రబాబు ఆలోచన.. భవిష్యత్ అవసరాలు తీర్చనున్న GMR మాన్సాస్ ఎడ్యుసిటీ. *విశాఖపట్నం డిసెంబర్ 16 పున్నమి ప్రతినిధి*: నైపుణ్యం కోసం భవిష్యత్ లో ప్రపంచం.. ఉత్తరాంధ్ర వైపు చూస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం నాడు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో జిఎంఆర్, మన్సాస్ సంస్థల మధ్య ఏవియేషన్ ఎడ్యుసిటీ నిర్మాణం కోసం ఏం.ఓ.యు మార్పిడి కార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తో కలసి.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వేదికపై నుండి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రాంతాలలో ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటు కావడం దేశంలోనే చరిత్రాత్మక రోజు అని రామ్మోహన్ నాయుడు అన్నారు. కేంద్ర మంత్రిగా ఉండటంతో పాటు.. ఓ ఉత్తరాంధ్ర వాసిగా చాలా గర్వపడుతున్నా అని అన్నారు. గడిచిన పద్ధెనిమిది నెలలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ల ప్రత్యేక దృష్టి ఉత్తరాంధ్ర పై నిలిపారని కితాబిచ్చారు. ఇన్నాళ్లు మనం చూసిన ఉత్తరాంధ్ర వేరు.. రేపటి ఉత్తరాంధ్ర వేరు అని స్పష్టం చేశారు. ప్రధానంగా ఏవియేషన్ రంగంలో ప్రపంచానికే కేంద్రంగా ఉత్తరాంధ్ర మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానిగా మోదీ మొదటి సారి బాధ్యతలు తీసుకున్నప్పుడు అందులో పౌర విమానయాన శాఖ మంత్రిగా ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు ఉండేవారని.. అనేక కీలక సంస్కరణలకు ఆనాడే ఆయన బీజం వేశారని అన్నారు. ప్రస్తుతం 12% వృద్ధి రేటుతో దూసుకుపోతున్న ఏకైక రంగం దేశ విమానయాన వ్యవస్థ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం 800 విమానాలు అందుబాటులో ఉంటే.. సమీప భవిష్యత్లో మరో 1700 విమానాలకు ఇప్పటికే ఆర్డర్లు వెళ్లాయని తెలిపారు. మిగిలిన లక్ష్యాలను పూర్తి చేసుకుని 3000 లకు పైగా విమానాలను కలిగి ప్రపంచంలోనే మేటిగా మన దేశ విమానాయన వ్యవస్థ నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక్కో విమానం నుండి సరాసరి 100 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే.. లక్షలాది మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగుల అవసరం ఉందని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. ఏవియేషన్ ఫ్యూచరిస్టిక్ సబ్జెక్ట్ గా అభివర్ణించిన రామ్మోహన్ నాయుడు.. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల అవసరం ఉన్నప్పటికీ.. అందుకు తగ్గ స్కిల్ సెంటర్లు లేవు అనే అసంతృప్తి ఉండేదని అన్నారు. తాను కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. రాష్ట్రంలో ఏవియేషన్ పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలసి ఏవియేషన్ యూనివర్సిటీ ఆలోచన పంచుకుందామని ఆలోచన చేస్తే.. నా కన్నా ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన విజన్ ను స్పష్టం చేశారని అన్నారు. 30,40 ఏళ్ల తర్వాత ప్రపంచం ఏమని ఆలోచిస్తుందో ముందే ఊహించే చంద్రబాబు నాయుడు.. ఏవియేషన్ యూనివర్సిటీ గురించి తన ఆలోచన చెప్పడం ఆశ్చర్యపోయా అని అన్నారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణం శరవేగంగా జరుగుతోందని.. ఒక నెల రోజుల్లో వ్యాలీడేషన్ ఫ్లైట్ ల్యాండ్ కానుందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. మొత్తంగా విమానాశ్రయం నిర్మాణం పూర్తి జూన్ 2026 అనుకున్నాం కానీ.. అంతకన్నా ముందే ప్రారంభించే అవకాశం కూడా ఉన్నట్టు తెలిపారు. జిఎంఆర్ మన్సాస్ ఎడ్యుసిటీ గురించి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కోసం నారా లోకేష్ తీవ్రంగా శ్రమించారని కితాబిచ్చారు. ఏవియేషన్ యూనివర్సిటీ అంటే ఒక కళాశాల కే పరిమితం అవుతుందని.. ఎడ్యుసిటీ గా మార్చడం వల్ల, అమెరికా వంటి ఇతర దేశాల్లో ఉన్న స్కిల్ కాలేజీలు కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. లోకేష్ ఆలోచన మేరకు ఏవియేషన్ యూనివర్సిటీ ను.. ఎడ్యుసిటీ గా మార్చామని తెలిపారు. దీని ద్వారా మన దేశీయ ఏవియేషన్ అవసరాలు తీరడంతో పాటు.. ప్రపంచానికి కూడా వనరులు అందిస్తామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర కు పూసపాటి కుటుంబం ఎంతో చేసిందని.. వారికి ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలు రుణపడి ఉన్నారని అన్నారు. పూసపాటి వంశీయులు మన ప్రాంతంలో ఉండటం ఉత్తరాంధ్ర చేసుకున్న అదృష్టం అని అన్నారు. ఎన్నో రాజ వంశీయుల కుటుంబాలు ఉన్నా.. విద్య పేరు చెబితే.. ధారాళంగా భూములు ఇచ్చే కుటుంబం పూసపాటి వంశం అని కితాబిచ్చారు. 136 ఎకరాలు ఇవ్వడం పై ధన్యవాదాలు తెలిపారు. GMR సంస్థ కూడా ఉత్తరాంధ్ర ప్రొడక్ట్ గా అభివర్ణించిన రామ్మోహన్ నాయుడు.. GMR.. ఉత్తరాంధ్ర ప్రాంతానికి గౌరవం తెచ్చారని అన్నారు. విలువలు, మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తూ.. మన ప్రాంతానికి శక్తిని ఇచ్చే కార్యక్రమాలు GMR సంస్థ చేస్తోందని అన్నారు. ఈ ఎడ్యుసిటీ కి సంబంధించి నారా లోకేష్.. ఎలాంటి టైమ్ లైన్ ఇచ్చినా.. పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. దీనికి ప్రతిగా పన్నెండు నెలల్లో పూర్తి చెయ్యాలని నారా లోకేష్ బదులిచ్చారు. రీసెర్చ్, ఇన్నోవేషన్.. ఈ ఎడ్యుసిటీ లో వృద్ధి చెందుతాయని.. నైపుణ్యం కలిగిన వ్యక్తులు అవసరం ఉన్న నేపథ్యంలో.. రాబోయే డిమాండ్ ను తట్టుకునేందుకు ఈ ఎడ్యుసిటీ ఉపయోగపడుతుందని అన్నారు. దీనికి అందరూ సహకరించి.. భాగస్వామ్యం అవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, అదితి గజపతి రాజు, GMR సంస్థ నుండి GBS రాజు, ఉత్తరాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు, కీలక నేతలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.