Tuesday, 5 May 2026

Blog

అన్నమయ్య

చిట్వేల్ పీహెచ్‌సీకి డెలివరీ టేబుల్ విరాళం

చిట్వేల్ మండలం మారటిపల్లి గ్రామానికి చెందిన వలసాని స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులైన వలసాని గుండాలయ్య కుమారుడు వలసాని గోపాల్ చిట్వేల్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)కు డెలివరీ టేబుల్‌ను విరాళంగా అందజేశారు. 2019 నుంచి ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరీక్షలకు వచ్చే వారికి తాగునీరు, జ్యూస్‌, అల్పాహారం అందజేస్తూ సేవాభావం చాటుకుంటున్నారు. అలాగే కరోనా కాలంలో వేల సంఖ్యలో సిరంజీలు, శానిటేషన్ సామగ్రి, మాస్కులు విరాళంగా ఇచ్చారు. ఆసుపత్రిలో రోగులు కూర్చోవడానికి సిమెంట్ బెంచీలను కూడా ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ అన్సారీ మాట్లాడుతూ, అవసరమైనప్పుడల్లా చిన్నా–పెద్దా సహాయాలు అందిస్తూ ఆసుపత్రికి అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు. వలసాని గోపాల్‌కు ఆసుపత్రి సిబ్బంది తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.

నారాయణపేట

కున్సి గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ ఘన విజయం

కున్సి గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది సర్పంచ్ పదవికి పోటీ చేసిన ఎం సురేష్ తన ప్రత్యర్థి పై 512 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే ఉప సర్పంచ్ గా ఉప్పరి రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ విజయంతో గ్రామంలో బి ఆర్ ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం వెలువిరిసింది. నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అలాగే ఎం. సురేష్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపించిన కార్యకర్తలకు యూత్ లీడర్స్కు గ్రామ ప్రజలకు మహిళలకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలుపుకోవడం జరిగింది.

విశాఖపట్నం

నగరంలో ఆపరేషన్స్ లంగ్స్ (Operation LUNGS) 2.0 లో ఆక్రమణల తొలగింపుల కొనసాగింపు * జీవీఎంసీ పరిధిలో బుధవారం 373 ఆక్రమణల తొలగింపు.

నగరంలో ఆపరేషన్స్ లంగ్స్ (Operation LUNGS) 2.0 లో ఆక్రమణల తొలగింపుల కొనసాగింపు * జీవీఎంసీ పరిధిలో బుధవారం 373 ఆక్రమణల తొలగింపు. – జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ.ప్రభాకర్ రావు *విశాఖపట్నం డిసెంబర్పు 17 పున్నమి ప్రతినిధి* మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో అన్ని జోన్ల లో ఆపరేషన్ లంగ్స్ 2.0 లో భాగంగా 373 ఆక్రమణలను బుధవారం తొలగించడం జరిగిందని జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ. ప్రభాకర్ రావు బుధవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. మహా విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు నగర పరిధిలో ప్రజలు సురక్షితంగా ఫుట్ పాతులపై నడక సాగించేందుకు, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో లో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా రోడ్లు, జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలకు అడ్డంకులు లేకుండా సురక్షిత రవాణా కోసమై జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ (Operation Lungs) 2.0 లో భాగంగా అన్ని జోన్లలో రోడ్లపై జంక్షన్లలో ఆక్రమణలు తొలగించడం జరుగుతుందని చీఫ్ సిటీ ప్లానర్ తెలిపారు. తొలగించిన ఆక్రమణలను ఈ క్రింద పొందుపరచడమైనది. 1వ జోన్ పరిధిలో తిమ్మాపురం నుండి భీమిలి వరకు 8 ఆక్రమణలు, 2వ జోన్ పరిధిలో పీఎం పాలెం ఆఖరి బస్ స్టాప్ నుండి N H-16 (కార్ షెడ్ జంక్షన్) వరకు, బోయపాలెం జంక్షన్ నుండి N H-16 వరకు 37 ఆక్రమణలు, 3వ జోన్ పరిధిలో సంపత్ వినాయక టెంపుల్ రోడ్డు, వి ఐ పి రోడ్డు నుండి రామా టాకీస్ రోడ్డు వరకు, ఆర్ టి సి కాంప్లెక్ష్ BRTS రోడ్డు నుండి మద్దిలపాలెం వరకు, మద్దిలపాలెం డిపో నుండి ఇసుకతోట హైవే వరకు 84 ఆక్రమణలు, 4వ జోన్ పరిధిలో యూనియన్ బ్యాంకు దొండబజార్ రోడ్ నుండి ఫిష్ మార్కెట్ దొండబజార్ రోడ్ వరకు, దొండబాజార్ మెయిన్ రోడ్ నుండి MVDM హై స్కూల్ దొండబాజార్ రోడ్డు వరకు 49 ఆక్రమణలు, నార్త్ జోన్ పరిధిలో 80 ఫీట్ రోడ్డు నుండి రైల్వే న్యూ కాలనీ ఆర్చ్ వరకు 32 ఆక్రమణలు, 6వ జోన్ పరిధిలో బీసీ రోడ్డు జంక్షన్ నుండి గంగవరం పోర్టు రోడ్డు వరకు, శ్రీనగర్ జంక్షన్ నుండి దుర్గా నగర్ రోడ్డు వరకు, వేపచెట్టు జంక్షన్ నుండి 60 ఫీట్ రోడ్డు వరకు, పెదగంట్యాడ జంక్షన్ నుండి న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ వరకు 114 ఆక్రమణలు, 6వ జోన్ పరిధిలో GNT రోడ్డు నుండి పెరుగు బజార్ జంక్షన్ వరకు 12 ఆక్రమణలు వెస్ట్ జోన్ పరిధిలో శ్రీ హరి పురం జంక్షన్ నుండి జవహర్ నగర్ వరకు 10 ఆక్రమణలు, 8వ జోన్ పరిధిలో కృష్ణాపురం జంక్షన్ నుండి చినముసిడివాడ వరకు 22 ఆక్రమణలతో కలిపి మొత్తం 373 ఆక్రమణలు తొలగించడం జరిగిందని ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా జోన్ల కమిషనర్లు, సహాయక ప్రణాళిక అధికారులు, ప్రణాళిక విభాగం సిబ్బంది, సచివాలయం సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అమరావతి

జనవరి 15 లోపు కేంద్ర పధకాల నిధులు పూర్తిగా వినియోగించాలని ముఖ్యమంత్రి ఆదేశం*

*జనవరి 15 లోపు కేంద్ర పధకాల నిధులు పూర్తిగా వినియోగించాలని ముఖ్యమంత్రి ఆదేశం* – PMAY అర్బన్ నిధులు ఖర్చు చేయడానికి జనవరి 15 గడువు విధించిన సీఎం; కేంద్ర మంత్రి అదనంగా ₹1,200 కోట్లు ఇస్తామని హామీ – “కేంద్ర డబ్బు ఖర్చు చేయడంలో రాజీ లేదు. ప్రతి రూపాయి ఖర్చు చేయాలి” – ముఖ్యమంత్రి – రాష్ట్రంలో 75 CSS పథకాలు అమలు జరిగింది; కేంద్రం ₹15,173 కోట్లు, రాష్ట్రం ₹9,340 కోట్లు కేటాయించింది – ₹1,268 కోట్లు అందుబాటులో ఉన్నా PMAY అర్బన్‌లో కేవలం 38% వినియోగం; తక్షణ చర్యలకు ఆదేశాలు – స్పందించని నిర్మాణ సంస్థలను బ్ల్యాక్‌లిస్ట్ చేయాలని సీఎం ఆదేశం *అమరావతి విశాఖ పున్నమి ప్రతినిధి*: కేంద్ర ప్రాయోజిత పథకాల (CSS) అమలుపై డా. డి. రొనాల్డ్ రోజ్, IAS, సెక్రటరీ, ఫైనాన్స్ (బడ్జెట్ & అంతర్గత ఆర్థిక విభాగం), బుధవారం ఇక్కడ జరిగిన 5వ కలెక్టర్ల సమావేశంలో సమగ్ర వివరణ అందించారు. 75 CSS పథకాలను అమలు చేయడంలో రాష్ట్ర పనితీరును వివరిస్తూ, భారత ప్రభుత్వం మొత్తం ₹15,173 కోట్లు కేటాయించిందని, రాష్ట్రం దీనికి అదనంగా ₹9,340 కోట్లు ఇస్తుందని తెలిపారు. కేంద్ర పధకాల అమలుకు రాష్ట్రం రెండు విధానాలను అనుసరిస్తోందని డా. రొనాల్డ్ రోజ్ వివరించారు. స్టేట్ నోడల్ ఏజెన్సీ (SNA) విధానంలో, జిల్లాలు ప్రధాన SNA ఖాతాకు అనుసంధానించబడిన జీరో-బ్యాలెన్స్ సబ్సిడియరీ ఖాతాలను నిర్వహిస్తాయి, డబ్బు అవసరమైనప్పుడు మాత్రమే విడుదల చేస్తారు. SPARSH విధానంలో, రాష్ట్ర వాటా నేరుగా అందించబడుతుంది. ప్రస్తుతం SNA పథకాలకు ₹6,910 కోట్లు విడుదల చేయబడ్డాయి మరియు SPARSH పథకాలకు ₹7,883 కోట్లు అందుబాటులో ఉన్నాయి. తక్షణ శ్రద్ధ అవసరమైన నాలుగు ప్రధాన పథకాలపై దృష్టి సారించారు, వీటికి జిల్లాలకు ₹1,000 కోట్లకు పైగా నిధులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సమగ్ర శిక్ష (₹1,363 కోట్లు, 92% వినియోగం), PMAY అర్బన్ (₹1,268 కోట్లు, 38% వినియోగం), ఆరోగ్య వ్యవస్థ బలోపేతం కోసం ఫ్లెక్సిబుల్ పూల్ (₹1,153 కోట్లు, 87% వినియోగం) మరియు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (₹1,018 కోట్లు, 55% వినియోగం) ఉన్నాయి. సమగ్ర శిక్షలో పల్నాడు, విశాఖపట్నం, శ్రీకాకుళం వంటి జిల్లాలు 99% కంటే ఎక్కువ వినియోగం సాధించాయని, అయితే చాలా జిల్లాల్లో PMAY అర్బన్‌కు తక్షణ శ్రద్ధ కావాలని ఆయన చెప్పారు. CSS నిధుల తక్కువ వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు తక్షణ చర్యలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో మాట్లాడుతూ, “ఒక వైపు డబ్బు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం, మరో వైపు కేంద్రం ఇస్తున్న డబ్బును సరిగ్గా ఖర్చు చేయలేకపోతున్నాం. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి” అని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అదనంగా ₹1,200 కోట్లు కేటాయించడానికి హామీ ఇచ్చారని, అందుబాటులో ఉన్న PMAY అర్బన్ నిధులను ఖర్చు చేయడానికి జనవరి 15 గడువు విధించారు. “రాబోయే వారాల్లో, మరో ₹1,200 కోట్లు విత్‌డ్రా చేస్తాం, ఇంకా మరిన్ని కూడా తర్వాత తీసుకోవాలి” అని ముఖ్యమంత్రి తెలిపారు, గృహనిర్మాణ శాఖ మంత్రి మరియు కలెక్టర్లందరూ ఈ పనికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. జనవరి 15 లోపు అన్ని కేంద్ర పధకాల నిధుల వినియోగం పూర్తి చేసి, తదుపరి విడత విత్‌డ్రా చేయడానికి సిద్ధం కావాలని ముఖ్యమంత్రి బలమైన ఆదేశం జారీ చేశారు. “కేంద్ర డబ్బు ఖర్చు చేయడంలో రాజీ లేదు. ప్రతి రూపాయి ఖర్చు చేయాలి” అని నొక్కి చెప్పారు. ₹30,000 కోట్ల ప్రతిష్టాత్మక లక్ష్యం నిర్ణయించి, వచ్చే ఏడాది బడ్జెట్‌ను ఖరారు చేయాలని అన్ని సెక్రటరీలను కోరారు. “అవకాశాన్ని అందిపుచ్చుకుని, తక్షణమే చర్యలు చేపట్టండి” అని కలెక్టర్లకు చెబుతూ, అందుబాటులో ఉన్న నిధులను వినియోగించడంలో చురుకుగా ఉండాలని కోరారు. ప్రభుత్వ ఖాతాల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల విషయాన్ని కూడా డా. రొనాల్డ్ రోజ్ దృష్టికి తీసుకువచ్చారు. సుమారు 10,750 ప్రభుత్వ ఖాతాల్లో 26 జిల్లాల్లో దాదాపు ₹155 కోట్లు క్లెయిమ్ చేయని డిపాజిట్లుగా ఉన్నాయని, వీటిలో ప్రకాశం జిల్లాలో అత్యధికంగా ₹10.57 కోట్లు ఉన్నాయని తెలియజేశారు. మోసపూరిత చర్యలను నివారించడానికి KYC డాక్యుమెంట్లను అప్‌డేట్ చేయాలని, పనికిరాని ఖాతాలను మూసివేయాలని, డెలివరీ కాని చెక్ బుక్‌ల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను కోరారు. చాలా కాలంగా బ్యాంక్ ఖాతాల్లో పడుకున్న ఈ మొత్తాలకు వడ్డీ ఇవ్వడానికి అవకాశం ఉందేమో అని కూడా కలెక్టర్లను పరిశీలించమని ముఖ్యమంత్రి కోరారు. నిర్మాణ సంస్థలను మరియు ఏజెన్సీలను ప్రతి పది రోజులకు ఒకసారి పిలిచి సివిల్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు ఆదేశించారు. “వారాల తరబడి స్పందించకపోతే, వాళ్లను బ్ల్యాక్‌లిస్ట్‌లో పెట్టండి” అని సూచించారు. అన్ని శాఖల అధిపతులు తమ ఆడిట్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పారు. తక్షణ చర్య తీసుకోవడానికి జిల్లా వారీ పథక వివరాలు సమావేశం తర్వాత అన్ని కలెక్టర్లకు అందచేస్తామని సెక్రటరీ తెలియజేశారు.

ఆదిలాబాదు

క్యాలెండర్లను ఆవిష్కరించిన – రీజినల్ మేనేజర్ & ఎల్డిఎం

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనీ ఎస్బిఐ రీజినల్ ఆఫీస్ నందు వాలంటరీ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ (విడ్స్) సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల 2026 నూతన క్యాలెండర్లను రీజినల్ మేనేజర్ రామచందర్ రావు, ఎల్డియం ఉత్పల్ కుమార్ ధామ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ద్వారా నిర్వహించే అవగాహన కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఐ మేనేజర్ విజయ్, పాపయ్య, మావల ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్స్ కమలాకర్, సత్యనారాయణ, భూమన్న తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పొట్టెంపాడు గిరిజన కలనీలో బొబ్బేపల్లి పర్యటన

(ముత్తుకూరు పున్నమి ప్రతినిధి, డిసెంబర్ 17):- డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ముత్తుకూరు మండలం పొట్టెంపాడు పంచాయతీ పరిధిలోని కట్టకింద గిరిజన కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమించినప్పటికీ, ఆ వ్యవస్థ పేద గిరిజనులకు ఉపయోగపడలేదని విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థను వైసీపీ నాయకులు ఏ విధంగా వినియోగించుకున్నారో వారికే తెలియాలన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో భాగంగా పేదల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి కల నెరవేర్చడంతో పాటు ఆధార్, రేషన్ కార్డులు తదితర ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. స్థానిక గిరిజన కాలనీల్లో తిరిగి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం, పేదల కోసం పనిచేసే ప్రజా ప్రభుత్వమని, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని బొబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, తెలుగుదేశం పార్టీ నాయకులు బొబ్బేపల్లి అంకయ్య, బోలా అశోక్, సందురి శ్రీహరి, పొట్లూరు సుబ్రహ్మణ్యం, దగ్గోలు సుమన్, అక్బర్, గుడి సీనయ్య తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

నర్సాపూర్ జి సర్పంచ్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం కేంద్రానికి చెందిన నర్సాపూర్ జి గ్రామపంచాయతీ సర్పంచ్ గా గెల్పొందిన ఇంద్రకరణ్ రెడ్డి గారిని మరియుఉప సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మజార్ అండ్ సభాకళిం గారు మరియునర్సాపూర్ జి మండల మైనార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు

నిర్మల్

నర్సాపూర్ జి సర్పంచ్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం కేంద్రానికి చెందిన నర్సాపూర్ జి గ్రామపంచాయతీ సర్పంచ్ గా గెల్పొందిన ఇంద్రకరణ్ రెడ్డి గారిని మరియుఉప సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మజార్ అండ్ సభాకళిం గారు మరియునర్సాపూర్ జి మండల మైనార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు

కామారెడ్డి

అడ్లూర్‌లో బంగారు తల్లి ఫౌండేషన్ మోటివేషన్ క్లాసులు.. విద్యార్థులు సంతోషం!

కామారెడ్డి,17 డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, సధాశివ నగర్ మండల కేంద్రం తో పాటు అడ్లూర్ ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆదర్శ పాఠశాల, మహాత్మా జ్యోతిబా పూలే కుప్రియాల్ పాఠశాలల్లో బంగారు తల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోటివేషన్ క్లాసులు ఘనంగా నిర్వాహించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వా సం, క్రమశిక్షణ పెంచే ఈ కార్యక్రమం సూపర్ హిట్!ఇంపాక్ట్ ట్రైనర్స్ వజ్జా నవనీత, వజ్జా మహేందర్, మర్రి సదాశివరెడ్డిలు ‘లక్ష్య నిర్ధారణ, కాల నిర్వహ ణ, వ్యక్తిత్వ వికాసం’ అంశాలపై ప్రేరణాత్మక సెషన్లు నడిపారు. విద్యార్థులు ఈ శిక్షణతో లక్ష్యాలు సాధించే మార్గం తెలుసుకుని ఉత్సాహంగా ఉన్నారు! పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ,ఇది భవిష్యత్తుకు సూపర్ బూస్ట్! ఇలాంటివి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల ని అన్నారు. ఉత్తమ విద్యార్థులకు మెమెంటోలు అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఇంపా క్ట్ క్లబ్ ఆఫ్ కామారెడ్డి అధ్యక్ష మర్రి సదాశివరెడ్డి, బంగారు తల్లి ఫౌండేషన్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ట్రైనర్స్ వజ్జా నవనీత, వజ్జా మహేందర్ ముఖ్యంగా పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

హిందూ సమ్మేళనానికి ప్రముఖులకు ఆహ్వానం

నందిగామలో నిర్వహించనున్న హిందూ సమ్మేళనం సందర్భంగా స్థానిక ప్రముఖులను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి బీఎస్పీ రాష్ట్ర నాయకులు బచ్చలకూర పుష్పరాజు, నందిగామ మున్సిపల్ కమిషనర్ లోవరాజు, నందిగామ ఎస్‌ఐ–1 సూర్యవంశీ, నందిగామమహిళా ఎస్‌ఐ–2, నందిగామ ట్రాఫిక్ ఎస్‌ఐ నరేష్ తదితరులను వారి కుటుంబ సభ్యులతో సహా పాల్గొనాలని సాదరంగా ఆహ్వానించారు.హిందూ సంప్రదాయాలు, సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే విధంగా ఈ సమ్మేళనం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి హిందూ సమాజానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనివిజయవంతం చేయాలని వారు కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.