Tuesday, 5 May 2026

Blog

ఎన్ టి ఆర్ జిల్లా

హిందూ సమ్మేళనానికి ప్రముఖులకు ఆహ్వానం

నందిగామలో నిర్వహించనున్న హిందూ సమ్మేళనం సందర్భంగా స్థానిక ప్రముఖులను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి బీఎస్పీ రాష్ట్ర నాయకులు బచ్చలకూర పుష్పరాజు, నందిగామ మున్సిపల్ కమిషనర్ లోవరాజు, నందిగామ ఎస్‌ఐ–1 సూర్యవంశీ, నందిగామమహిళా ఎస్‌ఐ–2, నందిగామ ట్రాఫిక్ ఎస్‌ఐ నరేష్ తదితరులను వారి కుటుంబ సభ్యులతో సహా పాల్గొనాలని సాదరంగా ఆహ్వానించారు.హిందూ సంప్రదాయాలు, సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే విధంగా ఈ సమ్మేళనం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి హిందూ సమాజానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనివిజయవంతం చేయాలని వారు కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎమ్మెల్యే కాకర్ల ఆదేశాలతో చెరువుల అత్యవసర పనులకు 47.60 లక్షలు మంజూరు..

ఎమ్మెల్యే కాకర్ల ఆదేశాలతో చెరువుల అత్యవసర పనులకు 47.60 లక్షలు మంజూరు.. బలహీనంగా ఉన్న చెరువుల పనులను త్వరగా పూర్తి చేయండి.. ఇరిగేషన్ శాఖ ఏఈ మహేందర్ ను కోరిన మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి.. ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాలతో వింజమూరు మండలంలోని చెరువుల అభివృద్ధి పనులకు 47.60 లక్షల రూపాయలు నిధులు మంజూరైనట్లు ఇరిగేషన్ శాఖ ఏఈ మహేందర్ తెలిపారు. ఆ పనులకు సంబంధించి నివేదికలను కోరిన మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి చెరువు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యాల చూడాలన్నారు. వింజమూరు మండలంలోని నల్లగొండ్ల బొడ్డు వాగు చెరువుకు 4.95 లక్షలు తక్కెళ్ళపాడు, చెరువుకు 4.45 లక్షలు చంద్రపడియ, చెరువుకు 4.75లక్షలు శంఖవరం, చెరువుకు 4.50 లక్షలు బుక్కాపురం, చెరువుకు4.95 లక్షలు మోటచింతలపాలెం రామలింగారెడ్డి చెరువుకు 4.50 లక్షలు ఎర్రబెల్లి పాలెం, చెరువుకు 4.85 లక్షలు ఏ కిస్తీపురం, చెరువుకు 4.85 లక్షలు వింజమూరు మలపరాజు వాగు చెరువుకు 4.95 లక్షలు బుక్కాపురం పెద్ద చెరువు 4.90 లక్షలు రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. శంఖవరం చెరువు పనులు ప్రారంభమయ్యాయి అన్నారు. బలహీనంగా ఉన్న చెరువు కట్టలు వేయడం, తూములు, అలుగులు, పనులు, సప్లై ఛానల్ పనులు, పంట కాలువల పనులు అవసరం నిమిత్తం చేయడం జరుగుతుందన్నారు.

తెలంగాణ

పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన : కలెక్టర్

నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దేవరకొండ మండలం తాటికల్ గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, ఏర్పాట్లు పరిశీలించినారు. కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రారంభించి, సాయంత్రం లోపు , ఫలితాలు ప్రకటించాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు పెంచాలని అధికారులను ఆదేశించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

అంగన్వాడీలకు 5జి స్మార్ట్ ఫోన్లు పంపిణీ

నందిగామ పట్టణం కాకాని నగర్‌లో బుధవారం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ఐసిడిఎస్) శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు 5జి స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ అంగన్వాడీ సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నదని తెలిపారు. పోషణ ట్రాకర్‌, బాల సంజీవిని యాప్‌ల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషణ వివరాలు, అందుతున్న సేవల సమాచారాన్ని అంగన్వాడీ టీచర్లు నేరుగా నమోదు చేయవచ్చని వివరించారు. అంగన్వాడీ కేంద్రాలలో జరిగే ప్రతి కార్యక్రమం డిజిటల్‌గా నమోదు కావడం వల్ల పనితీరు లో నాణ్యత పెరుగుతుందని, ప్రభుత్వానికి తక్షణ సమాచారం అందడంతో సేవల అమలులో జవాబుదారీతనం మరింత మెరుగుపడుతుందని ఆమె పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బాలల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక దృష్టితో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సీడీపీఓ లక్ష్మీ భార్గవి, ఐసిడిఎస్ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లుపాల్గొన్నారు.

కామారెడ్డి

కామారెడ్డి అటవీలో పెద్దపులి సంచరణ!

మాచారెడ్డి రేంజ్‌లో 5 మండలాల ప్రజలకు అటవీ శాఖ హెచ్చరిక.. జాగ్రత్తలు తప్పక పాటించండి! కామారెడ్డి,17 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి అటవీ రేంజ్ పరిధిలో పెద్దపులి సంచరిస్తున్నట్లు నిర్ధారణ అయింది. మాచారెడ్డి, రామారెడ్డి, దోమకొండ, బిబిపేట్, పాల్వంచ మండలాల గ్రామాల్లోని అటవీ ప్రాంతా లు, వ్యవసాయ క్షేత్రాల్లో పులి కనిపించడం గుర్తిం చిన అధికారులు ప్రజలకు జాగ్రత్తలు తెలియజే శారు.అటవీ శాఖ అధికారులు జారీ చేసిన హెచ్చ రిక ప్రకారం, గ్రామ ప్రజలు తప్పకుండా ఈ నియ మాలు పాటించాలి:అటవీ ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లకూడదు.సాయంత్రం 5 గంటల నుంచి ఉద యం 7 గంటల వరకు వ్యవసాయ భూముల్లో తిరగకూడదు.రాత్రిపూట పశువులను క్షేత్రాల్లో ఉంచకూడదు.పగలు కూడా ఒంటరిగా వ్యవసా య క్షేత్రాలకు వెళ్లకూడదు.పులి దాడి సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అటవీ అధికారులకు లేదా పోలీసులకు ఫోన్ చేయాలని సూచించారు. పశువులపై దాడి జరిగినా, పులి లేదా ఆనవాలు కనిపించినా వెంటనే సమాచారం ఇవ్వండి – తగి న నష్టపరిహారం పొందవచ్చు.కఠిన హెచ్చరిక: పులికి నష్టం కలిగించేలా కరెంటు వైర్లు, ఉచ్చులు పెట్టడం లేదా విషప్రయోగం చేయడం అటవీ చట్టం ప్రకారం శిక్షార్హులు ఇలాంటి చర్యలు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.సంప్రదించండి: అటవీ శాఖ – 8555830266, 9490411547, 7981949524 .కామారెడ్డి డివిజన్ అటవీ శాఖ, మాచారెడ్డి రేంజ్ ప్రజల సురక్షితంగా ఉండేందుకు అందరూ సహక రించాలని కోరారు. ఇలాంటి సంఘటనలపై మరి న్ని వివరాలు తెలిసినప్పుడు తాజా అప్‌డేట్స్ అందిస్తాంమన్నారు.

విశాఖపట్నం

మే లో భోగాపురానికి ఎయిర్ పోర్ట్

భోగాపురం ఎయిర్ పోర్టును అందంగా సిద్ధం చేస్తున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. వచ్చేనెలలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజయనగరం-విశాఖపట్నం జిల్లాల సరిహద్దుల్లో ఏర్పాటు చేయనున్న జీఎంఆర్- మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టు ప్రారంభ వేడుకలో ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాది జూన్కు ఎయిర్పోర్టును ప్రారంభించాలనుకున్నామని, కానీ, ఒక నెల ముందే ప్రారంభిస్తామన్నారు. ఎడ్యు సిటీ ఉంటే ఎన్నో విద్యాలయాలు, యూనివర్సిటీలు పెట్టుకోవచ్చన్నారు. ఏవియేషన్ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు ఇది ఉపకరిస్తుందని చెప్పారు.

కామారెడ్డి

గంగపుత్ర సంఘం ఆద్వార్యంలో సన్మానం!

కామారెడ్డి, 17 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : రామారెడ్డి నూతన సర్పంచ్‌కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కామారెడ్డి జిల్లా, రామారె డ్డి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బండి ప్రవీణ్ , ఉపసర్పంచ్ హనమయోల్ల నవీన్ గ్రామ పంచాయ తీ 3వ వార్డు మెంబర్ పిప్పరి లింబాద్రి లకు గంగ పుత్ర యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రాండ్ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం ఈ ఉత్సవాత్మక కార్యక్రమం రామారెడ్డి ప్రాంతంలో జరిగింది.గంగ పుత్రసంఘం సభ్యులు అందరూ సమ్మిలితమై, నూతన నాయకులకు శాలువాలు కప్పి సన్మానించారు.ఈ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం గ్రామ ప్రజలలో ఉత్సాహా న్ని రేకెత్తించింది. యువకులు అభినందాలు తెలిపుతూ, కొత్త నాయకుల భవిష్యత్ కార్యక్రమా లకు ఆదర్వాంధలు చెప్పుకున్నారు.ఈ సందర్భం గా మాట్లాడిన యువజన సంఘ నాయకులు, “ఇది మా గ్రామంలో కొత్త యుగం ప్రారంభం. సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు గ్రామాభివృద్ధికి కొత్త రంగులు తీసుకురావాలి” అని పిలుపునిచ్చారు. ప్రజలు అందరూ ఈ కార్యక్రమానికి సంతోషంగా పాల్గొని, గ్రామంలో ఐక్యతను ప్రదర్శించారు.

కామారెడ్డి

గంగపుత్ర యువజనుల సన్మానం!

కామారెడ్డి, 17 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : రామారెడ్డి నూతన సర్పంచ్‌కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కామారెడ్డి జిల్లా, రామారె డ్డి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బండి ప్రవీణ్ , ఉపసర్పంచ్ హనమయోల్ల నవీన్ గ్రామ పంచాయ తీ 3వ వార్డు మెంబర్ పిప్పరి లింబాద్రి లకు గంగ పుత్ర యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రాండ్ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం ఈ ఉత్సవాత్మక కార్యక్రమం రామారెడ్డి ప్రాంతంలో జరిగింది.యువజన సంఘ సభ్యులు అందరూ సమ్మిలితమై, నూతన నాయకులకు శాలువాలు కప్పి సన్మానించారు.ఈ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం గ్రామ ప్రజలలో ఉత్సాహా న్ని రేకెత్తించింది. యువకులు అభినందాలు తెలిపుతూ, కొత్త నాయకుల భవిష్యత్ కార్యక్రమా లకు ఆదర్వాంధలు చెప్పుకున్నారు.ఈ సందర్భం గా మాట్లాడిన యువజన సంఘ నాయకులు, “ఇది మా గ్రామంలో కొత్త యుగం ప్రారంభం. సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు గ్రామాభివృద్ధికి కొత్త రంగులు తీసుకురావాలి” అని పిలుపునిచ్చారు. ప్రజలు అందరూ ఈ కార్యక్రమానికి సంతోషంగా పాల్గొని, గ్రామంలో ఐక్యతను ప్రదర్శించారు.

ఆంధ్రప్రదేశ్

జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

కొండాపురం, పున్నమి న్యూస్, డిసెంబర్ 17,(నాగరాజు కె). తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అభిమాన పాత్రుడు బీద రవిచంద్ర నెల్లూరు పార్లమెంటు టిడిపి నూతన అధ్యక్షులుగా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందని, వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు మాజీ జిల్లా టిడిపి కార్యనిర్వాహ కార్యదర్శి చెరుకూరి వెంకటాద్రి నాయుడు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు గతంలో బీద రవిచంద్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కాలములో కొండాపురం మండల టిడిపి అధ్యక్షుడిగాను, జిల్లా టిడిపి కార్యనిర్వాహ కార్యదర్శి గాను తాను పనిచేసినట్లు చెప్పారు.జిల్లా పరిస్థితిపై పూర్తి అవగాహన ఉన్న రవిచంద్ర ని పార్టీ అధిష్టానం అధ్యక్షుడిగా నియమించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.గతంలో కొండాపురం జడ్పీటీసీగా పనిచేసిన కాలము నుండి రవిచంద్ర కుటుంబముతో మంచి సంబంధాలు ఉన్నట్లు చెప్పారు.అంతే కాకుండ రాజకీయాల్లో పరిణతీతో కూడిన నైతిక విలువలు కలిగిన నేతగా బీద రవిచంద్రను అభివర్ణించారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి రవిచంద్ర చేసిన కృషి అజరామరం అన్నారు. బీద రవిచంద్ర తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాయలసీమ జోన్ ఇంచార్జిగా, గతంలోనూ టిడిపి నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర తెలుగు యూవత అధ్యక్షులు గా విభిన్న హోదాలలో పదవులను అలంకరించి తెలుగుదేశం పార్టీకి మరింతగా వెన్ను తెచ్చిన మహా నేత అని అభిప్రాయపడ్డారు. బడుగు బలహీనవర్గాల కు చెందిన బలమైన నేతగా ఉన్న బీద రవిచంద్ర యాదవ్ ను ఆయన పార్టీకి అందించిన విశేషమైన సేవలను గుర్తిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీదర్ రవిచంద్ర ను నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులుగా నియమించడం పట్ల టిడిపి శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపినట్లుందని చెరుకూరి వెంకటాద్రినాయుడు అన్నారు

తూర్పు గోదావరి

సమాజానికి ఎంతో ఆదర్శముగానిలుస్తున్న చిడిపి గ్రామం అంగన్వాడీ ఆయా కుటుంబం.

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం లోని చిడిపి గ్రామానికి చెందిన ప్రత్తిపాటి వెంకటలక్ష్మి అంగన్వాడీ ఆయగా పని చేస్తూ తనకు వచ్చిన జీతం లో నుండి కొంత తన తల్లిదండ్రులు కీ” శే ” కొయ్య అప్పారావు మరియమ్మ ల జ్ఞాపకార్ధముగ పలు సేవ కార్యక్రమాల్లో భాగముగ, 3 వేల రూపాయలు తో చిడిపి గ్రామం అంగన్వాడీ కేంద్రానికి బాత్ రూమ్ డోర్, గడియారం, గ్రామ ప్రజలు ప్రయాణ సౌకర్యార్థం 10 వేల రూపాయలు తో సిమెంట్ బల్లలు, ఏర్పాటు చెయ్యడం జరిగింది. మరియు తన కుమారుడు ప్రత్తిపాటి నాగరాజు ద్వారా దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తముగ సమాజామే కుటుంబముగ పలు సేవాకార్యక్రమాలు చెయ్యడానికి తన కుమారుడిని నిరంతరం ప్రోత్సహిస్తూ సహాయం అందిస్తున్నారు. సమాజం మనకు ఏమి ఇచ్చింది అని కాకుండా మనం సమాజానికి ఏమి చేసాం అనే మంచి సంకల్పం తో కుటుంబ సమేతముగ సమాజానికి ఆదర్శముగ,చిడిపి గ్రామం లోని అంగన్వాడీ ఆయా ప్రత్తిపాటి వెంకటలక్ష్మి కుటుంబం నిలుస్తుంది అని అంగన్వాడీ సూపర్వైజర్ యాడంగి భాగ్యకుమారి ప్రత్తిపాటి వెంకటలక్ష్మి కి అభినందనలు తెలియజేసారు,ఈ కార్యక్రమం లో ప్రత్తిపాటి వెంకటలక్ష్మి, ఆశా కార్యకర్త కొయ్య దమయంతి ,అంగన్వాడీ టీచర్ అక్కాబత్తుల నానెమ్మ, దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి ప్రత్తిపాటి నాగరాజు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.