వృత్తి నిబద్ధత సామాజిక బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయ వర్గం
* *రోబోలకే చెమటలు పట్టించేలా ఉపాధ్యాయుల వృత్తి నిబద్ధత… సామాజిక బాధ్యత* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 18/ 12/ 2025* ఒకవైపు ప్రధాన బాధ్యత అయిన ఉపాధ్యాయ వృత్తిని పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తూ… మరోవైపు ప్రజాస్వామ్యానికి పునాది అయిన గ్రామ, పంచాయితీ ఎన్నికల విధుల్లో అలుపెరుగని సేవలు… ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందే తరువాయి – • ట్రైనింగ్‌లు • 10వ తరగతి నామినల్ రోల్స్ సిద్ధం • స్టేజ్–1 RO బాధ్యతలు • స్టేజ్–2 RO, PO & OPO శిక్షణలు ఇవన్నీ కాకుండా, • ప్రతిరోజూ పాఠశాలలో ఆన్లైన్, ఆఫ్లైన్ పనులు • విద్యాబోధన • విద్యాశాఖ నుంచి వచ్చే TSAT, FLS, FLN, LIP కార్యక్రమాల నిర్వహణ పాఠశాలల్లో పోలింగ్ బూతులు ఉంటే గ్రామపంచాయితీ సిబ్బందితో సమన్వయం ఒకవైపు ఎముకలు కొరికే చలి, కనిష్ట ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ వారం రోజుల వ్యవధిలోనే మూడు విడతల్లో ఎక్కడా తగ్గకుండా, విజయవంతంగా పోలింగ్ బాధ్యతల నిర్వహణ ఎన్నికల విధుల్లో ఉండగానే, ఎన్నికల అనంతరం కూడా • స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు • PTM నిర్వహణకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సన్నాహాలు ఈ నెల 23 లోపు FA–3 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు వచ్చే నెలలో నిర్వహించబోయే TET పరీక్షలకు సిద్ధత ఇవన్నీ మధ్యలో కుటుంబ బాధ్యతలు కూడా… కాలంతో పోటీ పడుతూ గత 20 రోజులుగా ఉపాధ్యాయులు చేస్తున్న విధి నిర్వహణను చూసి రోబోలు కూడా “ఔరా!” అనాల్సిందే *ఇక్కడితో ఆగలేదు… *రాబోయే పరిషత్ (MPTC / ZPTC) ఎన్నికలకు కూడా సిద్ధమవుతూనే ఉన్నారు. ఉపాధ్యాయుడే సమాజానికి నిజమైన శక్తి అని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎంఎన్ విజయకుమార్ తెలియజేశారు*











