Tuesday, 5 May 2026

Blog

తిరుపతి

అఖండ–2 ఘన విజయం పట్ల బొజ్జల బృందమ్మ హర్షం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 15, శ్రీకాళహస్తి నియోజికవర్గ శాసనసభసబ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ సోమవారం నాడు నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ–2ను కార్యకర్తలతో కలిసి వీక్షించారు. చిత్రాన్ని వీక్షించిన అనంతరం బొజ్జల బృందమ్మమాట్లాడుతూ….బాలకృష్ణ ఎంతో ఉత్సాహంగా, శక్తివంతంగా నటించడం అభినందనీయమని నందమూరి తారకరామారావు నట వారసుడిగా ఆయన ప్రతీ చిత్రంలో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రతి సినిమాలో సమాజానికి ఒక సందేశాన్ని అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారని అఖండ–2 చిత్రంలో బాలకృష్ణ నటనకు ప్రేక్షకులు నీరాజనం పలుకుతున్నారని, సినిమా ఘన విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని బొజ్జల బృందమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, మీనల్ రవి, రేణుక, ఖాదర్, లక్ష్మి, చందు, తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చొరవతోనే ఈ అరుదైన గౌరవం దక్కింది.. ప్రభుత్వ పాఠశాల విద్యార్దులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 15, హైదరాబాద్ పర్యటన అనంతరం శ్రీకాళహస్తికి తిరిగి వచ్చిన విద్యార్థులు తమ ఆనందాన్ని పత్రికా సమావేశంలో పంచుకున్నారు. సమావేశంలో విద్యార్దులుమాట్లాడుతూ… తమ ప్రియతమ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చొరవతోనే తాము హైదరాబాద్‌లో జరిగిన ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ ఇండియా టూర్ పర్యటనను ప్రత్యక్షంగా చూసే గొప్ప అవకాశం పొందామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ పాఠశాల పిల్లలకూ దక్కని ఈ అరుదైన గౌరవం, కేవలం ఎమ్మెల్యే చొరవ వల్లే తమకు దక్కిందన్నారు. శ్రీకాళహస్తి నుంచి హైదరాబాద్‌కు మా కోసం మంచి రైలు వసతి, అక్కడ స్టార్ హోటల్‌లో ఉంచి, ఏ లోటూ లేకుండా చూసుకున్నారని భోజనం ఏర్పాట్లలలో ఎక్కడా రాజీ పడకుండా, ప్రతి రెండు మూడు గంటలకొకసారి మాకు మంచి భోజనం ఏర్పాట్లు, తాము ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, బాగా తింటున్నామని తెలుసుకోవడానికి ఎమ్మెల్యే ప్రత్యేకంగా పీటీ మాస్టర్‌ని, ఇతర సిబ్బందిని మా వెంట పంపించి ప్రత్యేక పర్యవేక్షణ చేశారన్నారు. మెస్సీ టూర్‌తో పాటు, చారిత్రక చార్మినార్ వంటి ఎన్నో అందమైన ప్రదేశాలను కూడా చూసే అవకాశం తమకి కల్పించారని తమ ఈ చిన్న జీవితంలో ఇంతటి అపూర్వమైన గౌరవాన్ని, మధురమైన జ్ఞాపకాలను అందించినందుకు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి, వారి సతీమణికి తమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాంఅని జీవితాంతం… ఎమ్మెల్యే కల్పించిన ఈ అద్భుత అవకాశాన్ని, ఆయన గొప్ప చొరవను ఎప్పటికీ మర్చిపోమన్నారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఏ ప్రభుత్వ పాఠశాల పిల్లలకూ దక్కని ఈ అపూర్వ గౌరవాన్ని తమ పిల్లలకు కల్పించిన వారి తల్లిదండ్రులు ఎఎమ్మెల్యే శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. యువత భవిష్యత్తుకై నిబద్ధతతో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువశక్తికి దిక్సూచిగా నిలుస్తున్న మంత్రి నారా లోకేష్ కి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్, విద్యారంగంతో పాటు, క్రీడారంగాన్ని కూడా ఈ స్థాయిలో ప్రోత్సహించడం యువతకు నిరంతర స్ఫూర్తిని ఇస్తుందని కొనియాడారు. ఇలాంటి యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారం అందిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడి విజన్‌కు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాస్తు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ఒక విద్యావంతుడు, అభివృద్ధి పట్ల నిబద్ధత గల శాసనసభ్యులు ఉండటం తమ అదృష్టమని, క్రీడలు, విద్యారంగంలో, అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్తుందని తాము ఎంతో గర్వపడుతున్నామని విద్యార్దులు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి నియోజకవర్గం లోని బీఎస్పీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది

ఉదయగిరి నియోజకవర్గం లోని , కొండాపురం మండలం , తూర్పు బ్రాహ్మణ పల్లె లో బీఎస్పీ కార్యక్రమం వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలోగడప గడప గడప కు వెళ్లి, పార్టీ గురించి, పార్టీ బలోపేతం వివరించారు ఈ కార్యక్రమంలో కె ,పుష్పాంజలి ఉదయగిరి నియోజకవర్గం కన్వీనర్ ప్రకాష్ రావు మరియు గ్రామ ప్రజలు పెద్దలు పాల్గొన్నారు.

అన్నమయ్య

జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ వినతికి స్పందించిన ఆర్టీసీ – నందలూరుకు మళ్లీ ఆర్‌ఎస్ రూట్ బస్సు సౌకర్యం

నందలూరు మండలంలో గతంలో నడిచిన (ఆర్‌,ఎస్‌) రూట్ బస్సు సేవలు నిలిపివేయడంతో స్థానిక ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో నందలూరు ప్రాంత ప్రజల సమస్యలను గుర్తించిన స్థానిక బీజేపీ పార్టీ నాయకులు రాచూరి మురళి,వీరబల్లి జయ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్, హ్యూమన్ రైట్స్ ఉమ్మడి జిల్లా చైర్మన్ డాక్టర్ డేవిడ్ కళ్యాణి రాజు,జనం న్యూస్ విలేఖరి కిరణ్ కలిసి ఈ బస్సు సేవలను తిరిగి పునరుద్ధరించాలని బీజేపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ ని కోరారు. వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సాయి లోకేష్ వెంటనే ఆర్టీసీ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ వినతి పత్రాన్ని స్వీకరించిన రాజంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ మాధవి లత సమస్యపై స్పందిస్తూ, టంగుటూరు–రాజంపేట రూట్ బస్సును నందలూరు ఆర్‌ఎస్ రోడ్డు మీదుగా నడిపేలా ఆర్టీసీ అధికారులకు సూచనలు జారీ చేశారు. దీంతో ప్రజలకు, ఉద్యోగస్తులకు, ముఖ్యంగా రాజంపేటలో విద్యనభ్యసిస్తున్న కాలేజీ మరియు స్కూల్ విద్యార్థులకు ఈ బస్సు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఉదయం 8 గంటల సమయంలో నందలూరు ఆర్‌,ఎస్ రోడ్డు ఆర్,అండ్,బి బంగ్లా వద్ద ఈ బస్సు రాజంపేటకు ప్రయాణించే వారికి అందుబాటులో ఉంటుందని ఎన్డీఏ నాయకులు తెలిపారు. ఈరోజు ఉదయం 8 గంటలకు అరవపల్లి ఆర్,అండ్,బి బంగ్లా వద్ద చేరుకున్న బస్సు, బస్సు డైవరు మరియు కండక్టర్ ను ప్రజా ప్రతినిధులు మిఠాయి పంచి శాలువాతో సత్కరించారు. నందలూరు ప్రజల చిరకాల సమస్యను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ కి స్థానిక నాయకులు, ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయంతో నందలూరు మండల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్ టి ఆర్ జిల్లా

ఏపీ బాల హక్కుల కమిషన్ నియామకాలకు ఇంటర్వ్యూలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఏపీ ఎస్‌సీపీసీఆర్‌) ఛైర్‌పర్సన్‌ మరియు సభ్యుల నియామకా లకు సంబంధించిన ఇంటర్వ్యూలు అమరావతిలో గురువారంప్రారంభమయ్యాయి. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఇంటర్వ్యూ ప్రక్రియ ఈ నెల 15, 16, 19, 20, 21 తేదీల్లో కొనసాగనుంది. ఈ ఎంపిక ప్రక్రియను మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పారదర్శ కతతో పాటు అర్హతలే ప్రాతిపదికగా ఛైర్‌పర్సన్‌, సభ్యుల ఎంపిక జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఇంటర్వ్యూల నిర్వహణ కోసం ఏర్పాటైన కమిటీలో హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వి.ఎస్‌.బి.జి. పార్థసారథి, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సభ్యులుగా ఉన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు కట్టుబడి, అనుభవం కలిగిన అర్హులైన వ్యక్తిని కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా ఎంపిక చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రక్రియచేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఎన్ టి ఆర్ జిల్లా

జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్‌కు నూతన పాలకవర్గం చైర్మన్‌గా మల్లెల సీతమ్మ, వైస్ చైర్మన్‌గా అడుసుమల్లి ప్రభాకర్

జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు నూతన పాలకవర్గం ఏర్పడింది. పట్టణం విలియంపేటకు చెందిన మల్లెల సీతమ్మ (W/o మల్లెల కొండయ్య)ని చైర్మన్‌గా, మండలం బండిపాలెం గ్రామానికి చెందిన అడుసుమల్లి ప్రభాకర్ ని వైస్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం జగ్గయ్యపేటలోని నెట్టెం రఘురాం నివాసంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ రైతుల సంక్షేమమే లక్ష్యంగా మార్కెట్ యార్డులు పనిచేయాలని, రైతులకు న్యాయమైన ధరలు కల్పించడం, పారదర్శక లావాదేవీలు నిర్వహించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై నూతన పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి దళితులకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు నెట్టెం రఘురాం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు నెట్టెం శివరామ్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్‌, వైస్ చైర్మన్‌ మరియు డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మేక వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణ సొసైటీ అధ్యక్షుడు ధూళిపాళ్ల లక్ష్మణరావు, కౌన్సిలర్ మారేపల్లి సౌరి తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

స్వర్ణాంధ్ర @ 2047లో లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, ఈ–వాహనాలు పంపిణీ

జగ్గయ్యపేట మండలం ధర్మవరప్పాడు (డీపీ) తండాలోని రామ్‌కో సిమెంట్స్ ఫ్యాక్టరీ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర @ 2047 – P4 కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, ఎలక్ట్రికల్ ఆటోలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రామ్‌కో సిమెంట్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం స్పాన్సర్‌గా వ్యవహరించగా, ఫ్యాక్టరీ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, ఎలక్ట్రికల్ వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ప్రారంభించిన స్వర్ణాంధ్ర @ 2047 కార్యక్రమం రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లే మహత్తర ప్రణాళికగా అభివర్ణించారు. ఈ కార్యక్రమం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెరిగి పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయని తెలిపారు. రామ్‌కో సిమెంట్స్ ఫ్యాక్టరీ ఏర్పాటైన నాటి నుంచి సిఎస్ఆర్ నిధులతో చుట్టుపక్కల గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం, మౌలిక వసతుల కల్పనలో ముందుండటం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రశంసించారు. ముఖ్యంగా కుట్టు మిషన్లు, ఎలక్ట్రికల్ ఆటోలు అందించడం ద్వారా లబ్ధిదారుల జీవనోపాధికి తోడ్పాటు లభిస్తోందని పేర్కొంటూ ఫ్యాక్టరీ యాజమా న్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బాలకృష్ణ, రామ్‌కో సిమెంట్స్ యాజమాన్య ప్రతినిధులు ఎస్‌వీఆర్‌కే మూర్తి రావు, ఫరూక్ తదితరులుపాల్గొన్నారు.

విశాఖపట్నం

విశాఖలో వైసిపి భారీ ర్యాలీ ర్యాలీకి భారీగా తరలివచ్చిన 41 వ వార్డు కార్యకర్తలు నాయకులు

విశాఖలో వైసీపీ భారీ ర్యాలీ ర్యాలీకి తరలివచ్చిన 41వ వార్డు కార్యకర్తలు, నాయకులు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమానికి ప్రజా మద్దతు తక్షణమే కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసు కోవాలని డిమాండ్ 41వ వార్డు కార్పొరేటర్ పూర్ణిమ శ్రీధర్ విశాఖలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యం లో భారీ ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంత కాల కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన ర్యాలీలో భారీగా 41వ వార్డు కార్పొరేటర్ పూర్ణిమ,వార్డు అధ్యక్షులు శ్రీధర్ ఆద్వర్యంలో భారీగా కార్యకర్త లు,నాయకులు తరలివచ్చారు. జీవిఎంసీ నుంచి మద్దిలపాలేం తెలుగుతల్లి విగ్రహం వరకూ ర్యాలీ కొనసాగింది.ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సేకరించిన కోటి సంతకాల ప్రతుల బాక్సులను పార్టీ సెంట్రల్ కార్యా లయానికి తరలించారు.ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్ధులు నష్టపోయే ప్రమాదం ఉందని,తమ ప్రభుత్వ హయాంలో సాదించిన అభివృద్దిని కూటమి ప్రభుత్వ క్రెడిట్ లో వేసు కుంటున్నారని ఎద్దెవ చేశారు. ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

E-పేపర్

రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు*

*రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు* *వైసీపీ నుంచి దాదాపు 200 కుటుంబాలు జనసేనలోకి – ఘనంగా స్వాగతించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు* *బీసీ నాయకుడు బత్తిన గంగన్న యాదవ్ గారి తో పాటుగా 200 కుటుంబాలు..జనసేన లోకి భారీ చేరికలు..* రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం దిశగా మరో కీలక అడుగు పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ నాయకుడు బత్తిన గంగన్న యాదవ్ అనుచరులు, ఆయన వర్గానికి చెందిన దాదాపు 200 కుటుంబాలు *ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి* నాయకత్వంలో జనసేన పార్టీలో చేరారు. అనంతరం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మాజీ ఎంపీటీసీ, బీసీ నాయకుడు బత్తిన గంగన్న యాదవ్ గారికి పార్టీ కండువా కప్పి, కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు*. అదే విధంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన పలువురు నాయకులను కూడా జనసేన పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పారు. మహిళా నాయకురాళ్లకు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి పగడాల వరలక్ష్మి గారు* కండువాలు వేసి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సభను ఉద్దేశించి *ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మాట్లాడుతూ…* జనసేన పార్టీ అధ్యక్షులు *శ్రీ పవన్ కళ్యాణ్ గారి* ఆశయాలు, పేదల పట్ల ఆయన చూపే ప్రేమ, సమస్యలను పరిష్కరించే నిజాయితీ నచ్చి పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరికీ తాను అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వెనుకబడిన వర్గాలకు పవన్ కళ్యాణ్ గారు దేవుడిలాంటి నాయకుడని పేర్కొంటూ, తనను రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా నియమించడం బలహీన వర్గాల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఐకమత్యంతో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి *తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ…* రాబోయే రోజుల్లో చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు అన్నీ జనసేన పార్టీయేనని ధీమా వ్యక్తం చేస్తూ, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసి హృదయపూర్వకంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ పగడాల వరలక్ష్మి గారు,జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

E-పేపర్

రాజంపేట కేంద్రసాధన కోసం మోకాళ్ళపై కూర్చొని నిరసనకారులతో నిరసన తెలుపుతున్న ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్

రాజంపేట కేంద్రసాధన కోసం మోకాళ్ళపై కూర్చొని నిరసనకారులతో నిరసన తెలుపుతున్న ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు పట్టణం లోని రాజంపేట కేంద్ర సాధన కోసం మోకాళ్ళపై కూర్చొని నిరసనకారులతో కలిసి నిరసన తెలియజేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు ముక్కా వరలక్ష్మి. రాజంపేట కేంద్ర సాధన కోసం శాంతియుతంగా సాగిన నిరసన కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పిల్లల అన్నమయ్య వేషధారణ అన్నమయ్య వేషధారణతో నిరసన ర్యాలీ, రాజంపేట కేంద్ర డిమాండ్‌కు మద్దతునిస్తూ నిరసనలో పాల్గొన్న అరవ శ్రీధర్ , వరలక్ష్మి. అన్నమయ్య జిల్లా రాజంపేట కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో ఈనాడు నిర్వహించిన నిరసన కార్యక్రమం రైల్వే కోడూరు పట్టణంలో శాంతియుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ , రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి ముక్కా వరలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు జేఏసీ నాయకులతో, పిల్లలతో కలిసి మోకాళ్లపై కూర్చొని రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్‌కు మద్దతుగా తమ వంతు నిరసన తెలిపారు. రాజంపేటకు ఉన్న చారిత్రక, భౌగోళిక ప్రాధాన్యతను గుర్తించి జిల్లా కేంద్ర హోదా ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో అన్నమయ్య వేషధారణలో పాల్గొన్న చిన్నారులు రాజంపేట విశిష్టతను చాటిచెప్పేలా నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని రాజంపేట కేంద్ర సాధన ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నిరసన ర్యాలీలో భాగంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూల్ , కాలేజ్ విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.