Tuesday, 5 May 2026

Blog

అన్నమయ్య

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన విద్యార్థి నాయకుడు మల్లెం హేమంత్ కుమార్

చిట్వేల్, డిసెంబర్ 15 పున్నమి ప్రతినిధి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంను రాయలసీమ విద్యార్థి పరిరక్షణ సమితి జోనల్ అధ్యక్షులు మల్లెం హేమంత్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజన నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించిన హేమంత్ కుమార్, పిల్లలతో కలిసి భోజనం చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే అందిస్తున్న భోజనం ఎంతో రుచికరంగా, నాణ్యతతో ఉందని ప్రశంసించారు. ఈ పథకం ద్వారా పేద విద్యార్థులకు పోషకాహారం అందడంతో పాటు విద్యపై ఆసక్తి పెరుగుతోందని పేర్కొన్నారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల ఆరోగ్యం, హాజరు మెరుగుపడేందుకు ఎంతగానో దోహదపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

కామారెడ్డి

ఎల్లారెడ్డి సర్పంచ్ పాలకవర్గానికి సొసైటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం..

– ఓటర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు! కామారెడ్డి, 15 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, సదాశివనగర్ మండలం, ఎల్లారెడ్డి గ్రామంలో స్థానిక పంచాయతీ ఎన్నికల్లో అద్భుతం గా గెలిచిన సర్పంచ్ పాలకవర్గానికి సొసైటీ చైర్మన్ మర్రి సదాశివరెడ్డి ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్య క్రమం నిర్వహించారు. గ్రామ ప్రజల సమూహాల్లో ఉత్సాహం మార్పు తెచ్చి, సంబరాలతో కూడిన ఈ కార్యక్రమం గ్రామంలోని ప్రతి చోటూ చర్చనీయాంశ మైంది.ఈ సందర్భంగాసొసైటీ చైర్మన్ మర్రి సదాశి వరెడ్డి మాట్లాడుతూ, మా గ్రామ ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని చెప్పారు. ఎల్లవేళలా సేవలోనే మీ మన్ననలు పొందుతారని హామీ ఇస్తున్నాను. గ్రామ అభివృద్ధికి కలిసి పనిచేద్దాం’ అని ప్రజలకు పిలునిచ్ఛారు.గ్రామస్తుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించాయి.సర్పంచ్ పాలకవర్గం స్థానిక సమస్య ల పరిష్కారంలో,గ్రామ అభివృద్ధిలో ముందంజలో ఉంటూ పనిచేస్తారని చైర్మన్ తెలిపారు.ఈ సన్మా నం గ్రామంలో ఐక్యతను మరింత బలపరిచిందని, భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టాలని కోరారు. గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు అందరూ పాల్గొన్నారు.

కామారెడ్డి

ఎల్లారెడ్డి సర్పంచ్ పాలకవర్గానికి సొసైటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం..

– ఓటర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు! కామారెడ్డి, 15 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, సదాశివనగర్ మండలం, ఎల్లారెడ్డి గ్రామంలో స్థానిక పంచాయతీ ఎన్నికల్లో అద్భుతం గా గెలిచిన సర్పంచ్ పాలకవర్గానికి సొసైటీ చైర్మన్ మర్రి సదాశివరెడ్డి ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్య క్రమం నిర్వహించారు. గ్రామ ప్రజల సమూహాల్లో ఉత్సాహం మార్పు తెచ్చి, సంబరాలతో కూడిన ఈ కార్యక్రమం గ్రామంలోని ప్రతి చోటూ చర్చనీయాంశ మైంది.ఈ సందర్భంగాసొసైటీ చైర్మన్ మర్రి సదాశి వరెడ్డి మాట్లాడుతూ, మా గ్రామ ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని చెప్పారు. ఎల్లవేళలా సేవలోనే మీ మన్ననలు పొందుతారని హామీ ఇస్తున్నాను. గ్రామ అభివృద్ధికి కలిసి పనిచేద్దాం’ అని ప్రజలకు పిలునిచ్ఛారు.గ్రామస్తుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించాయి.సర్పంచ్ పాలకవర్గం స్థానిక సమస్య ల పరిష్కారంలో,గ్రామ అభివృద్ధిలో ముందంజలో ఉంటూ పనిచేస్తారని చైర్మన్ తెలిపారు.ఈ సన్మా నం గ్రామంలో ఐక్యతను మరింత బలపరిచిందని, భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టాలని కోరారు. గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు అందరూ పాల్గొన్నారు.

కామారెడ్డి

గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్‌లకు సన్మానం!

కామారెడ్డి, 15, డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో గౌడ సంఘం ఘాటుగా సన్మానం! భారీ ఓట్లతో గెలిచిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు ఎల్లమ్మ ఆలయం వద్ద సన్మాన కార్యక్రమం నిర్వహించి, గ్రామీణ నాయకుల విజయాన్ని జరుపుకున్నారు. ఈ ఉత్స వం మండలంలో హాయిగా జరిగింది. గౌడ సమా జం బలం పెరిగింది.సర్పంచ్‌లు మెంబర్లు సంఘం నాయకులతో కలిసి ఫోటోలు! గ్రామీణ అభివృద్ధికి కొత్త ఆశలు! పంచాయతీ ఎన్నికల్లో గొప్ప విజయం సాధించిన వీరులకు ధన్యవాదాలు తెలిపారు.

E-పేపర్

ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట చేసిన గ్రామ యువత

ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట చేసిన గ్రామ యువత రైల్వే కోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని గోవిందం పల్లి పంచాయతీలో ఉన్న శంకరా పురం (కుమ్మరపల్లి) గ్రామ యువత ప్రజలు కలిసి చెరువు కట్ట వద్ద ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ధనంజయ, వెంకటేష్, శివకుమార్, నాగ, వెంకటరత్నం, అందరూ పాల్గొని విగ్రహ ప్రతిష్ట చేశారు

అన్నమయ్య

వ్యవసాయ సంక్షోభం: జెట్టివారిపల్లిలో రైతు బలి

వ్యవసాయ సంక్షోభం: జెట్టివారిపల్లిలో రైతు బలి -పెట్టుబడులు నష్టపోయి, గిట్టుబాటు ధరలు లేక అప్పుల ఊబిలో చిక్కుకున్న సుబ్బరాయుడు -మండలంలో రైతుల ఆర్థిక పరిస్థితిపై ఆందోళన చిట్వేల్, డిసెంబర్ 14: పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభానికి అద్దం పడుతూ, మండలంలోని జెట్టివారిపల్లి గ్రామంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నారు. పంట నష్టం, గిట్టుబాటు ధర లేకపోవడం కారణంగా తీవ్రమైన అప్పుల బాధను తట్టుకోలేక యేదోటి సుబ్బరాయుడు (48) అనే రైతు తన జీవితాన్ని చాలించారు. ఆయన తండ్రి యేదోటి వెంకటసుబ్బయ్య. -ఆర్థిక సంక్షోభం కారణం: గ్రామంలో అంచనా ప్రకారం, సుబ్బరాయుడు ఈ సంవత్సరం సాగు చేసిన పంటల కోసం భారీగా పెట్టుబడులు పెట్టారు. కానీ, అకాల వర్షాలు/వాతావరణ మార్పుల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. పండిన స్వల్ప మొత్తానికి కూడా ప్రభుత్వ మద్దతు ధర లభించకపోవడంతో పెట్టినపెట్టుబడులు పూర్తిగా నష్టపోయారుఫలితంగా, ప్రైవేటు అప్పులు మరియు ఇతర రుణాల భారం పెరిగిపోయింది. ఈ భారాన్ని మోయలేక తీవ్ర మనస్తాపానికి లోనైన సుబ్బరాయుడు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు.సుబ్బరాయుడు మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్న కుటుంబాన్ని పోషించుకోడానికి పడిన తపన విఫలం కావడంతోనే ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని గ్రామస్థులు విచారం వ్యక్తం చేశారు.ఈ సంఘటన రైతాంగం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు తాజా ఉదాహరణ. ప్రభుత్వం తక్షణం స్పందించి, సుబ్బరాయుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని, అలాగే రైతుల పంటలకు కనీస గిట్టుబాటు ధరలను నిర్ణయించాలని స్థానిక రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

విశాఖపట్నం

విశాఖ ఫోటోగ్రాఫర్స్ ఎకగ్రీవంగా ఎన్నిక:

విశాఖ ఫోటోగ్రాఫర్స్ ఎకగ్రీవంగా ఎన్నిక: విశాఖ జిల్లా ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా శ్రీ మట్టా లోకేష్ కుమార్ , ప్రధాన కార్యదర్శిగా శ్రీ చల్ల నూకరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గా ఎన్నికైన మట్టా లోకేష్ కుమార్ మాట్లాడుతూ అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని అన్నారు. ప్రదాన కార్యదర్శి గా ఎన్నికైన చల్లా నూకరాజు మాట్లాడుతూ ఎన్నికలకు సహకరించి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎన్నికల అధికారులు గా T. V. R. M. రాజు గారు, బాబా రెడ్డి గారు, K. K. ప్రసాద్ గారు వ్యవహరించారు. అధిక సంఖ్యలో ఫోటోగ్రాఫర్స్ పాల్గొన్నారు. మన ఫోటోగ్రాఫర్లు మరియు వీడియోగ్రాఫర్లు తరఫున మీ ఇద్దరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు 🙏.

విశాఖపట్నం

నగరంలో ఆపరేషన్స్ లంగ్స్ ( Operation LUNGS) 2.0 లో ఆక్రమణలు తొలగింపుల కొనసాగింపు * జీవీఎంసీ పరిధిలో ఆదివారం 319 ఆక్రమణల తొలగింపు .

నగరంలో ఆపరేషన్స్ లంగ్స్ ( Operation LUNGS) 2.0 లో ఆక్రమణలు తొలగింపుల కొనసాగింపు * జీవీఎంసీ పరిధిలో ఆదివారం 319 ఆక్రమణల తొలగింపు . – జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ . ప్రభాకర్ రావు *విశాఖపట్నం డిసెంబర్ 14 పున్నమి ప్రతినిధి* మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో అన్ని జోన్ల లో ఆపరేషన్ లంగ్స్ 2.0 లో భాగంగా 319 ఆక్రమణలను ఆదివారం తొలగించడం జరిగిందని జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ . ప్రభాకర్ రావు ఆదివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు సురక్షితంగా ఫుట్ పాతులపై నడక సాగించేందుకు, రోడ్లు, జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలకు అడ్డంకులు లేకుండా సురక్షిత రవాణా కోసమై జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ (Operation Lungs) 2.0 లో భాగంగా అన్ని జోన్లలో రోడ్లపై జంక్షన్లలో ఆక్రమణలు తొలగించడమైనదని చీఫ్ సిటీ ప్లానర్ తెలిపారు. ప్రజా సౌకర్యార్థమై ఆక్రమణల తొలగింపు కొనసాగిస్తూ ప్రత్యేక కార్యాచరణ చేపట్టడం జరిగినదని, ఇప్పటికే నగరంలో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా రక్షణ చర్యల దిశగా ఆపరేషన్ లంగ్స్ పనిచేస్తుందన్నారు. మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న PGRS కార్యక్రమంలో ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులులో ఎక్కువగా రోడ్లు, పుట్ పాత్ ఆక్రమణలు మరియు రోడ్ల కిరువైపుల వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల రోడ్లకు అండంకు ఏర్పడడం, తరచుగా ప్రజల రాకపోకలకు, వాహనాల రవాణాకు ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందని, ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి తక్షణ చర్యలు చేపట్టే ఆవశ్యకత దృష్ట్యా జి.వి.యం.సి లో గల 8 జోన్ల పరిధిలో గల ప్రధాన రహదారులలో, జంక్షన్లలో ఉన్న ఆక్రమణలు గుర్తించి వాటిని వెంటనే పోలీసు వారి సహకారము తో శనివారం తొలగించిన 336 ఆక్రమణలతో పాటు మొత్తంగా 655 ఆక్రమణలను తొలగించడమైనదని సిసిపి తెలిపారు. తొలగించిన ఆక్రమణలను ఈ క్రింద పొందుపరచడమైనది. 1వ జోన్ లోని క్లాక్ టవర్ నుండి తగరపువలస జంక్షన్ వరకు 20 ఆక్రమణలు జోన్ 2 పరిధిలో ఎండాడ నుండి రుషికొండ 100 అడుగుల రోడ్డు వరకు 60 ఆక్రమణలు, 3వ జోన్ పరిధిలో స్పోర్ట్స్ అరీనా నుండి బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్ ఎదురు రోడ్డు వరకు, అలాగే మహాలక్ష్మి అపార్ట్మెంట్ నుండి నేషనల్ హైవే శివాజీ పార్క్ రోడ్డు వరకు 42 ఆక్రమణలు, 4 వ జోన్ పరిధిలోని లీలామహల్ జంక్షన్ నుండి సౌత్ జైలు రోడ్డు వరకు 27 ఆక్రమణలు, 5వ జోన్ పరిధిలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుండి మర్రిపాలెం జంక్షన్ వరకు 34 ఆక్రమణలు, 6వ జోన్ పరిధిలోని శ్రీనగర్ నుండి దుర్గా నగర్ రోడ్డు, బీసీ రోడ్డు జంక్షన్ నుండి గంగవరం పోర్టు రోడ్డు వరకు 53 ఆక్రమణలను, 7వ జోన్ పరిధిలో ఎన్టీఆర్ విగ్రహం నుండి చింతా వారి వీధి వరకు 18 ఆక్రమణలు, 8వ జోన్ పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురం నుండి వేపగుంట వరకు వేపగుంట జంక్షన్ నుండి గోపాలపట్నం జంక్షన్ వరకు అలాగే రైల్వే స్టేషన్ రోడ్డు వరకు 65 ఆక్రమణలు తొలగించడం జరిగిందని ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా జోన్ల కమిషనర్లు ,సహాయక ప్రణాళిక అధికారులు, ప్రణాళిక విభాగం సిబ్బంది, సచివాలయం సిబ్బంది , పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (PRSI) ఆధ్వర్యంలో “Empowering Growth, Preserving Roots – The PR Vision for 2047” అనే థీమ్‌తో ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లో డిసెంబర్ 13 నుంచి 15 వరకు నిర్వహించిన 47వ కాన్ఫరెన్స్ లో జివిఎంసి

47వ ఆల్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్‌లో జీవీఎంసీకి మూడు ప్రతిష్టాత్మక పి.ఆర్.ఎస్.ఐ – 2025 జాతీయ అవార్డులు. *విశాఖ ప్రజలు, ప్రజాప్రతినిధులు , కౌన్సిల్ సభ్యుల సంపూర్ణ సహకారంతోనే జి.వి.ఎం.సి కి ఈ ఉత్తమ జాతీయ స్థాయి అవార్డులు. *1. బెస్ట్ సి.ఎస్.ఆర్ ప్రాజెక్ట్ ఫర్ చైల్డ్ కేర్ – ప్రథమ స్థానం. 2. బెస్ట్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ ఎ కార్పొరేట్ క్యాంపెయిన్ – ప్రథమస్థానం . 3. ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ – ద్వితీయ స్థానం. కేటగిరీలలో జాతీయ అవార్డులు జి వి ఎం సి కైవసం. *విశాఖపట్నం డిసెంబర్ 14 పున్నమి ప్రతినిధి*: పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (PRSI) ఆధ్వర్యంలో “Empowering Growth, Preserving Roots – The PR Vision for 2047” అనే థీమ్‌తో ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లో డిసెంబర్ 13 నుంచి 15 వరకు నిర్వహించిన 47వ అఖిల భారత పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్ – 2025లో మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ ( జి వి ఎం సి) మూడు ప్రతిష్టాత్మక పి.ఆర్.ఎస్.ఐ – 2025 జాతీయ అవార్డులు సాధించిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. డిసెంబర్ 13వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి ప్రారంభోత్సవం చేయగా డిసెంబర్ 14వ తేదీన అవార్డుల ప్రధానోత్సవం ఉత్తరాఖండ్ శాసనసభ గౌరవనీయ స్పీకర్ శ్రీమతి రీతూ ఖండూరీ భూషణ్ , ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమేష్ పోక్రియల్ నిశాంక్ , పి.ఆర్.ఎస్.ఐ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ అజిత్ పాఠక్ చేతుల మీదుగా జి వి ఎం సి కి ఈ జాతీయ అవార్డులు అందజేయబడ్డాయని కమిషనర్ తెలిపారు. విశాఖపట్నం నగర ప్రజలు, ప్రజాప్రతినిధులు, కౌన్సిల్ సభ్యులు అందించిన నిరంతర సహకారం, భాగస్వామ్యం, ప్రోత్సాహంతో జీవీఎంసీ అమలు చేసిన ప్రజా సంక్షేమం, మహిళల సాధికారత ,అభ్యున్నతి, మహిళల ఆర్థిక బలోపేతం,సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు , ప్రజా అవగాహన,ప్రచార,సామాజిక మాధ్యమ కార్యక్రమాలు, బాల్యం విద్యా కేంద్రాలలో బాలల ఆరోగ్యం, విద్య,భద్రత, పోషణ,సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలకు గానూ జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు లభించిందని కమిషనర్ తెలిపారు. జీవీఎంసీకి లభించిన జాతీయ అవార్డుల కేటగిరీల వివరాలు. 1. బెస్ట్ సి.ఎస్.ఆర్ ప్రాజెక్ట్ ఫర్ చైల్డ్ కేర్ – ప్రథమ స్థానం. బాలల సంక్షేమం,ఆరోగ్య రక్షణ కు ఉత్తమ CSR ప్రాజెక్ట్ – విశాఖ నగరంలో జి వి ఎం సి నిర్వహిస్తున్న బాల్యం విద్యా కేంద్రాలలో బాలల ఆరోగ్యం, విద్య,భద్రత, పోషణ,సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాల అమలుకు. 2. బెస్ట్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ ఎ కార్పొరేట్ క్యాంపెయిన్ – ప్రథమస్థానం . జి వి ఎం సి కార్పొరేట్ స్థాయి ప్రచారంలో సామాజిక మాధ్యమాల ఉత్తమ వినియోగం – విశాఖ నగరంలో ప్రజలకు అందిస్తున్న నగర సేవలు, పాలన, ప్రజా అవగాహన కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా సమర్థవంతంగా ప్రజలకు చేరవేసినందుకు. 3. ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ – ద్వితీయ స్థానం. మహిళల సాధికారత,సామాజిక, ఆర్థిక అభివృద్ధి, స్వయం ఉపాధి, సామర్థ్య వృద్ధికి చేపట్టిన కార్యక్రమాలు అమలు చేసినందుకు. ఈ అవార్డులను జీవీఎంసీ తరపున జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణ మూర్తి, పౌర సంబంధాల అధికారి ఎన్. నాగేశ్వర రావు అందుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యంతో, ప్రజా అవసరాలను కేంద్రంగా చేసుకుని జీవీఎంసీ చేపడుతున్న కార్యక్రమాలకు లభించిన గౌరవంగా ఈ అవార్డులను భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ప్రజలతో బలమైన కమ్యూనికేషన్‌తో పాటు సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చేందుకు జీవీఎంసీ కట్టుబడి ఉంటుందని తెలిపారు.

Blog

ఉత్తరాంధ్ర జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో ముఖ్య సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, గౌరవ ఎమ్మెల్సీ నాగబాబు గారు*

*ఉత్తరాంధ్ర జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో ముఖ్య సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, గౌరవ ఎమ్మెల్సీ నాగబాబు గారు* *ఎచ్చెర్ల*డిసెంబర్ 14 విశాఖ పున్నమి ప్రతినిధి* ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు వద్ద జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, గౌరవ ఎమ్మెల్సీ శ్రీ కొణిదెల నాగబాబు గారి తో ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు ముఖ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ అభ్యున్నతికి మరియు ఇతర అంశాలకు సంబంధించిన విషయాలను చర్చించారు . అదేవిధంగా ఎమ్మెల్యేలు నుంచి పలు సూచనలు సలహాలను నాగబాబు గారు స్వీకరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే శ్రీ రామకృష్ణ బాబు గారు, జనసేన పార్టీ విశాఖ నగర మరియు రూరల్ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు , శ్రీ రమేష్ బాబు గారు, ఎలమంచిలి ఎమ్మెల్యే శ్రీ విజయకుమార్ గారు, నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీ మాధవి గారు, పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ గారు, భీమిలి ఇంచార్జి శ్రీ సందీప్ గారు పాల్గొన్నారు…

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.