Tuesday, 5 May 2026

Blog

విశాఖపట్నం

41వ వార్డులో రూ.2.63 కోట్ల అభివృద్ధి పనులు

41వ వార్డులో రూ.2.63 కోట్ల అభివృద్ధి పనులు కార్పొరేటర్ పూర్ణిమ–శ్రీధర్ దంపతుల కృషితో వేగం విశాఖ నగరం 5వ జోన్ పరిధిలోని 41వ వార్డులో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కార్పొరేటర్ కోడిగుడ్లు పూర్ణిమ–శ్రీధర్ దంపతుల నిరంతర కృషి ఫలితంగా సుమారు రూ.2 కోట్ల 63 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం జ్ఞానాపురం ప్రాంతంలో నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌లతో కలిసి ఈ కార్యక్రమాలు చేపట్టారు. జీవీఎంసీ నిధులతో హిందూ స్మశాన వాటిక వద్ద రక్షణ గోడ, సీసీ కాలువలు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.185.08 లక్షలు, కొండవీటి గడ్డ వీధి, పోస్ట్ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణానికి రూ.78.81 లక్షలతో పనులు ప్రారంభించారు. అలాగే జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం కాలనీలో రూ.24.85 లక్షలతో నిర్మించిన జీవీఎంసీ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ విశాఖ నగరంలోని ప్రతి వార్డును సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నామని తెలిపారు. స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులు ప్రతిపాదించడంలో కార్పొరేటర్ పూర్ణిమ కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దక్షిణ నియోజకవర్గంలోని దాదాపు అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు. త్వరలో ఎండోమెంట్‌కు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జనతా బజార్, నెహ్రూ బజార్, పూర్ణ మార్కెట్, ఎస్‌ఎల్ కెనాల్ నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్న మేయర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాము, జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు, కార్యదర్శులు, 41వ వార్డు కూటమి అధ్యక్షులు అంతోని శేఖర్, మదు, సంజీవరావు, కూటమి నేతలు సునీత, గవర రమణ, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా 41వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనుల వెనుక కార్పొరేటర్ పూర్ణిమ–శ్రీధర్ దంపతుల చొరవ, సమన్వయం కీలకంగా నిలుస్తోందని స్థానికులు పేర్కొన్నారు.

కామారెడ్డి

మూడవ వార్డు ఎన్నికల విజయం!!

కామారెడ్డి, 15 డిసెంబర్ (పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా: రామారెడ్డి మండలం కేంద్రంలో 3వ వార్డు ఎన్నికల విజయం!కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ 3వ వార్డు ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పిప్పరి లింబాద్రి రామరెడ్డి ఘన విజయం సాధించారు. 6 మంది అభ్యర్థుల పోటీలో సమీపి తోకల ప్రభాకర్‌ ను ఓడించి ప్రజాదరణ పొందారు. ప్రచారంలో గడపగడపకు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకు న్న రామారెడ్డి, మోర్ల నిర్మాణం, వీధి లైట్లు, సీసీ రోడ్లు, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పింఛయాలు.. ప్రతి సమస్యకు పరిష్కారం హామీ ఇచ్చారు. ఎప్ప టికీ అందుబాటులో ఉంటానని చెప్పి ప్రజల ఆశలకు అంగీకారం పొందారు.ఈ విజయం తో గ్రామంలో ఉత్సవ సంఘటన. కాంగ్రెస్ నాయకులు అభినందాలు తెలిపారు.

కామారెడ్డి

మూడవ వార్డు ఎన్నికల వోజయం!!

కామారెడ్డి, 15 డిసెంబర్ (పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా: రామారెడ్డి మండలం కేంద్రంలో 3వ వార్డు ఎన్నికల విజయం!కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ 3వ వార్డు ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పిప్పరి లింబాద్రి రామరెడ్డి ఘన విజయం సాధించారు. 6 మంది అభ్యర్థుల పోటీలో సమీపి తోకల ప్రభాకర్‌ ను ఓడించి ప్రజాదరణ పొందారు. ప్రచారంలో గడపగడపకు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకు న్న రామారెడ్డి, మోర్ల నిర్మాణం, వీధి లైట్లు, సీసీ రోడ్లు, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పింఛయాలు.. ప్రతి సమస్యకు పరిష్కారం హామీ ఇచ్చారు. ఎప్ప టికీ అందుబాటులో ఉంటానని చెప్పి ప్రజల ఆశలకు అంగీకారం పొందారు.ఈ విజయం తో గ్రామంలో ఉత్సవ సంఘటన. కాంగ్రెస్ నాయకులు అభినందాలు తెలిపారు.

నారాయణపేట

కున్సి గ్రామంలో ఎంఎల్ఏ శ్రీహరి భార్య ఆధ్వర్యంలో గడప గడపకు ఎన్నికల ప్రచారం

కున్సి గ్రామంలో ఎన్నికల ప్రచారం ఉత్సాహభరితంగా కొనసాగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి భార్య లలితమ్మ పాల్గొన్నారు. గడపగడప కు తిరుగుతూ ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి తమ అభ్యర్థికి మద్దతు కోరారు. సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాసులు కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది. గ్రామ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు గురించి వివరించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రచారానికి పాల్గొని స్పందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఊరిలో ఎటువంటి సమస్య వచ్చిన ముందుంటానని హామీ ఇచ్చారు ఊరి యొక్క ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది

విశాఖపట్నం

అంగన్వాడీ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొబైల్ ఫోన్లు

గాజువాక, డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయ వేదికగా అంగన్వాడీ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్లను అందజేశారు. చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ డి. నీలవేణి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, నియోజకవర్గ పరిధిలోని 113 అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు ఒక్కోటి సుమారు రూ.12,500 విలువ గల నాణ్యమైన మొబైల్ ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం అందించిందని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు తమ విధులను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఈ మొబైల్ ఫోన్లు ఉపయోగపడతాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమానికి ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, కొత్త భవనాల నిర్మాణంపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేస్తామని పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గాజువాక తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

జీతం కష్టార్జితం… వెంటనే చెల్లించాలి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుట స్టీల్ సీఐటీయూ ధర్నా

గాజువాక ఉక్కునగరం డిసెంబర్, (పున్నమి ప్రతినిధి) విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల జీతం కష్టార్జితమని, కార్మికుల హక్కుగా ఉన్న పూర్తి వేతనాన్ని తక్షణమే చెల్లించాలని స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షులు ఎం. జగ్గు నాయుడు ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. స్టీల్ సీఐటీయూ ఆధ్వర్యంలో స్టీల్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామంటూ జారీ చేసిన సర్కులర్‌ను వెంటనే రద్దు చేయాలని, హెచ్ఆర్ఏ చెల్లించాలని, ఉక్కునగరం కార్మికుల విద్యుత్ చార్జీలు తగ్గించాలని, స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ధర్నాను ఉద్దేశించి జగ్గు నాయుడు మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ దిశగా నెట్టే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. రా మెటీరియల్ నాణ్యత లోపాలపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని కోరారు. ఉత్పత్తి ఆధారిత జీతాల సర్కులర్‌ను ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్టీల్ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి జె. అయోధ్యరామ్ మాట్లాడుతూ, యాజమాన్య నిర్ణయాల వల్లే నష్టాలు వచ్చాయని, దానికి కార్మికులను బాధ్యులుగా చేయడం అన్యాయమన్నారు. కార్మికులకు చెల్లించాల్సిన హెచ్ఆర్ఏ, వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్టీల్ సీఐటీయూ నాయకులు, వివిధ విభాగాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పొట్టి శ్రీరాములు వర్ధంతి నివాళులు

గాజువాక, డిసెంబర్ (పున్నమి ప్రతినిధి): గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం సర్దార్ వల్లభాయ్ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని టిడిపి శ్రేణులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యానంతరం దేశంలోని సుమారు 500 సంస్థానాల విలీనంలో సర్దార్ పటేల్ కీలక పాత్ర పోషించారని అన్నారు. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం 52 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు. యువత వీరి త్యాగాలు, సేవలను ఆదర్శంగా తీసుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రసాదుల శ్రీనివాస్, గుర్రం నూకరాజు, స్వర్ణపుడి రాంబాయి, తమిరె శివప్రసాదరావు, డివి సత్యరావు తదితర టిడిపి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

అన్నమయ్య

ప్రభుత్వ బడిలో చదివి, అంతర్జాతీయ కొలువులు: చిట్వేలి సోదరీమణుల సంచలనం

-రైతు కుటుంబంలో పుట్టి, ఇంగ్లీషులో దారాళంగా మాట్లాడుతున్న సరస్వతీ పుత్రికలు -కష్టేఫలి నిరూపణ: సామాజిక కార్యకర్త గాడి ఇంతియాజ్ అహ్మద్ ప్రశంస చిట్వేలి, డిసెంబర్ 15 పున్నమి ప్రతినిధి ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే అంతర్జాతీయ అవకాశాలు దక్కవనే అపోహలను పటాపంచలు చేస్తూ, చిట్వేలికి చెందిన ఇద్దరు యువతులు తమ ప్రతిభతో ఏకంగా అమెరికన్ కంపెనీలో ఉద్యోగం సాధించి ఆదర్శంగా నిలిచారు. ఈ అమ్మాయిలు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడుతుంటే, వారు ఏదో ఖరీదైన ప్రైవేట్ లేదా కార్పొరేట్ సంస్థల్లో చదివి ఉంటారని అనుకుంటే, అది పొరపాటే. వీరు చదివింది చిట్వేలి జెడ్.పి.హెచ్.ఎస్. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాత్రమే. -సామాన్య కుటుంబం… అసామాన్య లక్ష్యం: చిట్వేలి బ్రాహ్మణ వీధికి చెందిన చెంజి మనోహర (తండ్రి), విజయ (తల్లి) దంపతులకు ముగ్గురు సంతానం: నవీన, భార్గవి, బాలాజీ . రైతు కుటుంబంలో పుట్టిన ఈ ముగ్గురు పిల్లల ఉన్నత విద్యకు పునాది వేసింది ప్రభుత్వ పాఠశాలే. నవీన చిన్నప్పటినుండి చదువులలో దిట్టగా ఉండి, పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చాటింది. ఆమె తన సోదరి భార్గవికి, తమ్ముడు బాలాజీకి చదువు పట్ల నిరంతరం ప్రోత్సాహం అందించేది.నవీన విద్యార్థి దశలో కరోనా విపత్తు కారణంగా రెండు సంవత్సరాల పాటు విద్యకు అంతరాయం కలిగింది. ఆ సమయంలో ఆమె కొన్నాళ్ళు వాలంటీర్ ఉద్యోగం చేస్తూనే, కరస్పాండెంట్స్ ద్వారా విద్యను కొనసాగించి ఇంటర్ పూర్తి చేసింది. ఆ తర్వాత అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కలిసి తిరుపతిలోని ఒకే కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు.ప్రస్తుతం నవీన, భార్గవి ఇద్దరూ అమెరికన్ కంపెనీలో సైబర్ విభాగంలో ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగం చేస్తూనే, ప్రైవేటుగా ఎంబీఏ కోర్సును అభ్యసిస్తున్నారు. వారి తమ్ముడు బాలాజీ మధురైలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. -తండ్రి పట్టుదలే ప్రధానం: పిల్లల విజయం వెనుక తండ్రి చెంజి మనోహర కృషి ఎంతో ఉంది. చిన్ననాటి నుండి పిల్లలకు చదువుపై ఉన్న మక్కువను చూసి, ఎంత కష్టమైనా సరే ఉన్నత విద్యలు చదివించాలని ఆయన పట్టుబట్టారు. ఎప్పటికప్పుడు మిత్రులతో చర్చించి, సలహాలు, సూచనలు తీసుకొని వాటిని కచ్చితంగా పాటించడం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని స్థానికులు చెబుతున్నారు. -ప్రశంసల వెల్లువ: ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త గాడి ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, “కష్టేఫలి. కష్టాన్ని ఇష్టంగా చేస్తే జీవితంలో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు అని ఈ చిన్నారులు నిరూపించారు. నేటి సమాజంలో ఈ సరస్వతీ పుత్రికలు ఆదర్శంగా నిలిచారు” అని ప్రశంసించారు.వీరి భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా పిల్లల భవిష్యత్తు కొరకు అహర్నిశలు కష్టపడిన తల్లిదండ్రులకు చిట్వేలి హెల్ప్ లైన్ సొసైటీ సేవా సంస్థ తరఫున మరియు చెంజి మనోహర మిత్రబృందం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రైతులు వద్దకే యూరియా దుక్కిపిండి .

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ 15 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కుడితిపల్లి గ్రామంలో అగ్రికల్చర్ రైతులకు అవసరమైన యూరియా మరియు దుక్కిపిండి పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సిహెచ్ శ్రీదేవి గారు మరియు మాజీ సర్పంచ్ వెందోటి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సిహెచ్ శ్రీదేవి గారు మాట్లాడుతూ, రైతుల సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎకరానికి ఒక బస్తా చొప్పున మొత్తం మూడు విడతల్లో యూరియా మరియు దుక్కిపిండి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సౌకర్యాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, వ్యవసాయ ఉత్పాదకత పెరగడానికి దోహదపడతాయని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎన్ టి ఆర్ జిల్లా

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయవాడ వారి ప్లాంటేషన్ ప్రోగ్రాం …… శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల….. 15/12/2025….

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో 15.12.2025వ తేదీన ఎన్ఎస్ఎస్ విభాగం వారు సెంట్రల్ బ్యాంక్ వారి సహకారంతో ప్లాంటేషన్ ప్రోగ్రాం ని నిర్వహించడం జరిగింది. 115 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెంట్రల్ బ్యాంక్ వారు మన కళాశాల ఆవరణలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తద్వారా కలుషితమైన వాతావరణాన్ని దూరం చేయవచ్చని పర్యావరణ సమతుల్యతకు మరియు మానవ మనుగడకు చాలా అవసరమని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివిఎస్ కుమార్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పి. సతీష్ బాబు గారు,రీజినల్ హెడ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎం.ఫణి మాచిరాజు గారు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెంజ్ సర్కిల్ బ్రాంచ్ విజయవాడ,తిరుమల రావు గారు సీనియర్ మేనేజర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ k. సరళ, శ్రీమతి టీ.నాగరాణి, బ్యాంక్ సిబ్బంది మరియు విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.