Wednesday, 6 May 2026

Blog

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న తాడేపల్లిగూడెం, ఉంగుటూరు ఎమ్మెల్యేలు

గురువారం​ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మరియు ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు ఈరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.వీరికి జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ఆహ్వానం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.స్వామి,అమ్మవార్ల దర్శనం అనంతరం వేద పండితులు ఎమ్మెల్యేలను ఆశీర్వదించి,స్వామి అమ్మవార్ల తీర్ధ ప్రసాదాలను అందించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులైన కుమార్,మాధవ మహేష్గరికపాటి చంద్ర,ఈర్ల చిరంజీవి, కవిత,లీలాధర్ తదితరులు పాల్గొన్నారు. ​

హైదరాబాద్

గ్రూప్ 1.రీ వాల్యూ యెషన్ తీర్పు ని స్వాగతిస్తున్నాం. బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్ర raav

పున్నమి ప్రతి నిధి గ్రూప్. 1 రీ వాల్యూ యేషన్ హై కోర్టు తీర్పు ని స్వాగతిస్తున్నాము అని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు నారప రాజు రామ చందర్ రావు అన్నారు. న్యాయం గెలించిందని, అహకారం తో కళ్ళుమూసుకొని పోయిన కాంగ్రెస్ పార్టీ కీ ఈ తీర్పు చెంప పెట్టు అని రామ చంద్రరావు అన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఉక్కు కాంట్రాక్టుల్లో స్థానికేతరులను ఉపేక్షించం : టీడీపీ

విశాఖ ఉక్కు కాంట్రాక్టు పనుల్లో స్థానికులను పక్కనపెట్టి ఇతర రాష్ట్రాల వారిని నియమిస్తే సహించబోమని టీడీపీ నేతలు హెచ్చరించారు. నిర్వాసితులు, స్థానికులకు ముందుగానే ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం, ఏజెన్సీల తీరుపై నేతలు అసహనం వ్యక్తం చేశారు.

ఖమ్మం

ఏనుకూరు SI గా సంధ్య భాద్యలు స్వీకరణ

పున్నమి ప్రతినిధి ఏనుకూరు ఖమ్మం పోలీస్ కమిషరేట్ పరిధిలో ని ఎనుకూరు SI గా నారాబోయిన సంధ్య భాద్యలు స్వీకరించారు. ఖమ్మం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సంధ్య 2020 సివిల్ బ్యాచ్ కీ చెందినవారు. నూతన si కీ పోలీస్ సిబ్బంది తో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

ప్రధాన కూడల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలి : కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షుడు చిన్న బాబు.

కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షుడు చిన్నబాబు విలేకరులతో మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ పరిధిలో ఉన్న మద్దిలపాలెం, హనుమంత వాక కూడలిలో పాదచారులు రోడ్డు దాటటానికి ఇబ్బంది పడుతున్నారని ఈ రెండు కూడల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల జీవీఎంసీ కమిషనర్ ద్రుష్టి సారించి వెంటనే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కి రెండు వైపుల ప్రకటనలకు అద్దెకు ఇచ్చిన జీవీఎంసీకి ఆదాయం వస్తుందని, జీవీఎంసీ వద్ద నిధులు లేకపోతే కాంట్రాక్టు పద్దతిలో ప్రైవేట్ కి ఇచ్చిన నిర్మించి, మెయింటైనాన్స్ చేసి ప్రకటనల ఆదాయం వారు పొందుతారని, వెంటనే అధికారులు పాదచారుల సమస్య పరిష్కరించాలని చిన్నబాబు విజ్ఞప్తి చేసారు.

ఆంధ్రప్రదేశ్

ఏపీలో శుక్రవారం నాటికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల ప్రక్రియ పూర్తి

ఏపీలో ప్రభుత్వం భారీ స్థాయిలో చేపట్టిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల ప్రక్రియ శుక్రవారం నాటికి పూర్తి కానుంది. ఇందుకు సంబంధించి మరో రెండు జీఓలు రానున్నాయి. బదిలీలకు సంబంధించినదిగా భావిస్తున్న 1665 ఖాళీ జీవోను గత రాత్రి అప్లోడ్ చేసింది.ఈ నేపధ్యంలో ఈ రోజు పెద్ద సంఖ్యలో బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 15, 16 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌, 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపధ్యంలో, బదిలీలను వెంటనే పూర్తి చేసి ప్రభుత్వ విధులు సజావుగా సాగేలా చూడాలని ప్రయత్నిస్తోంది.

ఎలూరు

చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి గిరిజన ప్రాంత ఆసుపత్రిగా గుర్తింపు

చింతలపూడి, సెప్టెంబర్ 11: స్థానిక ఎమ్మెల్యే రోషన్ కుమార్ చొరవతో స్పెషాలిటీ వైద్యుల రాకకు మార్గం సుగమం చేస్తూ, ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా చింతలపూడి కమ్యూనిటీ ఆసుపత్రి వైద్యులు, ఆస్పత్రి అభివృద్ధి సలహా సంఘం సభ్యులు ఎమ్మెల్యేని సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏమన్నారంటే: చింతలపూడి వంటి మారుమూల ప్రాంతాలకు వైద్యుల కొరతను తీర్చడానికి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. చాలాకాలంగా భర్తీ కానీ వైద్యుల పోస్టులను త్వరితగతిన భర్తీ చేయడానికి అధిక వేతనం చెల్లించే విధంగా చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రి జాబితాలో చేర్చారు. దాంతో వైద్యులు రాకకు మార్గం సులభతరం కానుంది అంతేకాకుండా ఇచ్చే మందులు ఇతర సౌకర్యాలు, రాయితీ లు లభించనున్నాయి.

ఎలూరు

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలి

పెదవేగి, సెప్టెంబర్ 11: ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, నూజివీడు డిఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాలపై పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్. రాజశేఖర్ తమ సిబ్బందితో కలిసి పెదపాడు మండలం కొత్తూరు గ్రామంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించారు. ఇన్స్ పెక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. వేగం వద్దు, ప్రాణం ముద్దు అని, ప్రపంచానికి నువ్వు ఒక్కడివే కాకపోయినా, నీ ఇంటికి నువ్వే పెద్ద దిక్కు అనే భావన ప్రతి వాహనదారులు గుర్తుంచుకోవాలని సూచించారు. వాహనదారులు సరైన ధ్రువ పత్రాలు లేని వాహనదాలపై జరిమానాలు విధించారు.

ఆంధ్రప్రదేశ్

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు వేగవంతం

విశాఖపట్నం: విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు వేగంగా కొనసాగుతోంది. హేటౌడా నుంచి బయలుదేరిన 22 మంది ఇప్పటికే భారత్ చేరుకున్నారు. సిమికోట్ నుంచి ప్రత్యేక విమానంలో 12 మందిని నేపాల్ గంజ్‌కు తరలించారు. ఖాట్మాండు విమానాశ్రయానికి ఇప్పటివరకు 133 మంది చేరుకున్నారు. మొత్తం 217 మందిని సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.

తూర్పు గోదావరి

చండీగర్ జాతీయ మహాసభలకు రాజమండ్రి కార్మికులు

రాజమండ్రి, సెప్టెంబర్ 11: సెప్టెంబర్ 21 నుండి 25 వరకు పంజాబ్ రాజధాని చండీగర్ లో జరగనున్న సీపీఐ జాతీయ మహాసభలు సందర్భంగా 21 న జరిగే ప్రజా ప్రదర్శన, బహిరంగ సభ లో పాల్గొనేందుకు తూర్పుగోదావరి జిల్లా నుండి రెండు బస్సుల్లో జట్ల లేబర్ యూనియన్ కార్మికులు గురువారం తెల్లవారుజామున చండీగర్ కు బయలుదేరారు అ బస్ లను సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మధు, జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ సిపిఐ జాతీయ మహాసభలు పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్లో ఈనెల అనగా సెప్టెంబర్ 21 తేదీన జరగనున్నందున ఛలో చండీగఢ్ పిలుపుమేరకు సిపిఐ జాతీయ మహాసభలను జయప్రదం చేసేందుకు తూర్పుగోదావరి జట్ల లేబర్ యూనియన్ సభ్యులు సుమారు 100 మంది మొదటిరోజు ప్రదర్శన లో పాల్గొనేందుకు రెండు బస్ లలో బయలుదేరి వెళ్లారని అన్నారు జట్ల సంఘ నిధులు పెద్ద ఎత్తున వెచ్చించి , పార్టీ శత వసంతాల వేడుకల తరుణంలో జరుగుతున్న జాతీయ మహాసభల సందర్భంగా జరుగు మొదటి రోజు ప్రదర్శనలో పాల్గొనేందుకు వెళ్తున్నామని అన్నారు. బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ నుండి దేశాన్ని రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అన్ని వామపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకు రావడానికి ఈ మహాసభలు దోహదపడతాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జట్ల లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సప్ప రమణ, సీపీఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి పి లావణ్య, ఏ ఐ వై ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి త్రిమూర్తులు, జట్ల సంఘం అధికార బడి సభ్యులు నల్ల రామారావు, పి దేముడు బాబు, కళ్ల అప్పలనాయుడు, వెంకటరావు బాలకృష్ణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు రెడ్డి రమణ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.