Wednesday, 6 May 2026

Blog

తిరుపతి

గడ్డివాము ట్రాక్టర్లను తొలగించండి

శ్రీకాళహస్తి పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెర్లోపల్లి గ్రామానికి వెళ్లే దారిలో హైవే నిర్మాణ పనులు జరిగి వాహన రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఏపీ టూరిజం ముందర బ్రిడ్జి నిర్మాణం కింద ఎండి గడ్డివాము ట్రాక్టర్లను నిలిపివేస్తున్నారు.దీనివల్ల తిరుపతి నుంచి కాళహస్తికి వేలాది వాహనాలు వస్తు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇక్కడ కుడివైపున టర్న్ తీసుకోవాల్సి ఉంది.అయితే ఈ గడ్డివాము ట్రాక్టర్లను ఇక్కడ నిలిపివేయడం వల్ల వాహనదారులకు ముందర వచ్చే వాహనాలు కనిపించకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా ప్రమాదాలు జరగకముందే చర్యలు తీసుకుంటే బాగుంటుందని వాహనదారులు వాపోతున్నారు.

హైదరాబాద్

సుప్రీం కోర్టు తీర్పు జర్నలిస్ట్ లకి శ్రీరామ రక్ష

పున్నమి ప్రతినిధి *జర్నలిస్టులను తిట్టిన, బెదిరించిన, 50,000 వేల జరిమానా మరియు ఐదేళ్లు కఠిన కారాగార శిక్ష.* *అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు.* దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు. పాత్రికేయులను బెదిరించిన. తిట్టిన లేదా కొట్టిన. 50, వేల జరిమానా మరియు ఐదేళ్లు కఠిన కారాగార శిక్షకు వారు అర్హులవుతారని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ తీర్పుతో పలువురు జర్నలిస్టులు. తమ వృత్తిపరంగా ఎలాంటి భయాందోళనకు గురికా కుండా నిర్భయంగా ప్రజలకు వాస్తవ సమాచారం అందించే అవకాశం ఉంటుందని పలు జర్నలిస్టు సంఘాల నేతలు. సీనియర్ జర్నలిస్టులు ఈతీర్పును ఆహ్వానించారు. అలాగే రాజకీయ నాయకుల నుండి ఒక్కింత రక్షణగా సుప్రీంకోర్టు వారి ఈతీర్పు. ఉంటుందని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మం

స్మార్ట్ టికెట్ బుకింగ్ కోసం “మీ టికెట్ యాప్ “

పున్నమి ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం మీ టికెట్ యాప్ ని అందుబాటులో కీ తీసుకోని వచ్చింది. ఈ యాప్ ద్వారా ఆలయాలు, పార్కులు, జూ పార్కులు, మ్యూజియం, జలాశయాలు, బోటింగ్ ల కీ సం భందించిన టికెట్ లను ఈ యాప్ ద్వారా సులభం గా పొందవచ్చు. ఈ యాప్ లో ప్రదేశం, తేదీ, సభ్యుల సంఖ్య ని ఎంపిక చేసి ఆన్ లైన్ పేమెంట్ చేసి టికెట్ లు పొందవచ్చు. ఇంకా ఈ యాప్ లో దగ్గర లోని ఈవి చార్జింగ్ పాయింట్ లు అలాగే దగ్గర లోని పర్యాటక కేంద్రాల వివరాలను తెలుసు కోవచ్చు

హైదరాబాద్

రాజా సింగ్ మాటలు పట్టించుకోవడం అనవసరం.. బీజేపీ చీఫ్ రామ చంద్రరావు

పున్నమి ప్రతినిధి భారతీయ జనతా పార్టీ నూతన కమిటీ నియామకం మీద బహిస్కృత బీజేపీ నేత గోషామహల్ శాసన సభ్యులు రాజా సింగ్ చేసిన వ్యాఖ్యల మీద రామ చంద్ర రావు స్పందించారు. రాజా సింగ్ వ్యాఖ్యలని పట్టించు కోవడం అనవసరం అని, ఇప్పుడు నూతనముగా వేసిన కమిటీ తోనే ఎన్నికల కి వెళ్తాము అని దీని లో ఎటువంటి మార్పు ఉండభోదని రామ చంద్ర రావు తెలిపారు. గత 33 ఎల్లగా బీజేపీ కి సేవ చేసే వారికి కమిటీ లో స్థానం కల్పించినట్లు అయన తెలియజేసారు

జాతీయ అంతర్జాతీయ

నేపాల్ జైళ్ల నుంచి 7,000 మంది ఖైదీలు పరారీ

సెప్టెంబర్ 11 పున్నమి ప్రతినిధి @ నేపాల్ నిరసనల కారణంగా దేశంలోని జైళ్ల నుంచి దాదాపు 7,000 మంది ఖైదీలు పరారయ్యారు. నౌబస్తా బాల సదనంలో భద్రతా సిబ్బందితో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు మైనర్లు మరణించారు. ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పారిపోయిన ఐదుగురు ఖైదీలను సిద్ధార్థనగర్ జిల్లాలో భారత్-నేపాల్ సరిహద్దు వద్ద ఎస్ఎస్బీ అదుపులోకి తీసుకుంది.

జాతీయ అంతర్జాతీయ

జీఎస్టీ పరిధిలోకి మద్యం.. నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే

సెప్టెంబర్ 11 పున్నమి ప్రతినిధి @ రాష్ట్రాల పరిధిలో మద్యంపై పన్ను తయారీపై ఎక్సైజ్ సుంకం, అమ్మకాలపై వ్యాట్ విధింపు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదాయ వనరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదాయ వనరుగా ఉన్న మద్యం అమ్మకాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే చర్చ చాలాకాలంగా జరుగుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో సంస్కరణలు చేపట్టి శ్లాబులను కుదించిన విషయం తెలిసిందే. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గి మధ్యతరగతి జీవులకు ఊరట లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ క్రమంలోనే మద్యంను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ పై మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. ఆ విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమేనని స్పష్టం చేశారు. మద్యాన్ని జీఎస్టీ పరిధిలోకి చేర్చాలా వద్దా అనే విషయంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఈ విషయంలో తాను స్పందించేందుకు ఏమీలేదని తేల్చిచెప్పారు. ప్రస్తుత చట్టాల ప్రకారం.. మద్యం తయారీ, అమ్మకాలపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకే ఉంది. మద్యం తయారీపై ఎక్సైజ్ సుంకం విధించడం, మద్యం అమ్మకాలపై వ్యాట్ ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతోంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే మద్యం తయారీ, అమ్మకం ప్రభుత్వాలకు కీలక ఆదాయ వనరుగా మారింది. ఈ నేపథ్యంలో మద్యంను జీఎస్టీ పరిధిలోకి చేర్చితే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆదాయానికి భారీగా గండిపడుతుంది. అందుకే ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరిస్తున్నాయి.

జాతీయ అంతర్జాతీయ

దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

సెప్టెంబర్ 11 పున్నమి ప్రతినిధి @ ఈ రోజు నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని IMD వార్నింగ్… ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ మరియు మహారాష్ట్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ…

భక్తి

గణేష్ చతుర్థితో దేశంలో రూ. 45000 కోట్ల బిజినెస్

సెప్టెంబర్ 11పున్నమి ప్రతినిధి @ గణేష్ చతుర్థితో దేశంలో రూ. 45000 కోట్ల బిజినెస్ గణేష్ చతుర్థి అంటే కేవలం భక్తి, సంతోషాల పండుగ మాత్రమే కాదు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ఓ అద్భుతమైన ఉత్సవమని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) తెలిపింది. ఈ పండుగ ద్వారా ఈ ఏడాది వేల కోట్ల వ్యాపారం జరిగినట్లు చెప్పింది. దేశంలో గణేష్ చతుర్థి అంటే రంగు రంగుల పందిళ్లు, డీజే మోతలు, భక్తితో కూడిన ఉత్సాహం గుర్తుకొస్తాయి. కానీ ఈ పండగ కేవలం భక్తి, సంస్కృతి మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊపు తెచ్చిందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ ఏడాది గణేష్ చతుర్థి సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు రూ. 45,000 కోట్ల వ్యాపారాన్ని తెచ్చిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. గత ఏడాది రూ.25,000 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలిపింది. ఈసారి పూర్తిగా స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అనేక వ్యాపార రంగాలకు మేలు జరిగిందని చెప్పింది. విగ్రహాలే రూ. 1000 కోట్ల వ్యాపారం CAIT జాతీయ అధ్యక్షుడు బీసీ భారతియా చెప్పినట్లు, గణేష్ చతుర్థి సమయంలో ఒక్క గణపతి విగ్రహాల వ్యాపారమే రూ. 1000 కోట్లకు పైగా జరిగింది. అంతేకాదు పుష్పాలు, దండలు, కొబ్బరికాయలు వంటి అవసరమైన సామగ్రి కొనుగోళ్లు మరో రూ. 500 కోట్ల బిజినెస్ అయ్యింది. ఇక మోదకాలు, ఇతర స్వీట్ల డిమాండ్ ద్వారా రూ. 2,000 కోట్లను దాటేసింది. పండగ సమయంలో కేటరింగ్, స్నాక్స్ సర్వీసులు రూ. 3,000 కోట్ల వ్యాపారాన్ని సృష్టించాయి పందిళ్లతో రూ. 10,000 కోట్ల ఖర్చు ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 20 లక్షల గణేష్ పందిళ్లు ఏర్పాటయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే 7 లక్షల పందిళ్లు, కర్ణాటకలో 5 లక్షలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లలో ఒక్కో చోట 2 లక్షల చొప్పున పందిళ్లు వెలిశాయి. ఒక్కో పందిరికి కనీసం రూ. 50,000 ఖర్చు చేసినా, అలంకరణలు, ఏర్పాట్లు, పూజల కోసం మొత్తం రూ. 10,000 కోట్లకు పైగా ఖర్చయిందని భారతియా వెల్లడించారు. టూరిజం, రిటైల్‌కు ఊపు గణేష్ చతుర్థి కేవలం పూజలు, పందిళ్లతోనే ఆగలేదు. ఈ పండగ స్థానిక టూరిజం, బస్సులు, క్యాబ్‌లు, రైళ్ల వ్యాపారాలకు రూ. 2,000 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. బట్టలు, ఆభరణాలు, హోమ్ డెకర్, గిఫ్ట్ ఐటెమ్‌ల రిటైల్ వ్యాపారం రూ. 3,000 కోట్లకు చేరింది. పెద్ద ఎత్తున ఈవెంట్‌లు నిర్వహించే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు రూ. 5,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. ఎకానమీకి గణపతి బూస్ట్ గణేష్ చతుర్థి మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చిందని CAIT సెక్రటరీ జనరల్ ఎమెరిటస్ ప్రవీణ్ ఖండేల్‌వాల్ తెలిపారు. రక్షా బంధన్‌తో మొదలైన పండగల సీజన్ గణేష్ చతుర్థి, నవరాత్రులు, దసరా, కర్వా చౌత్, దీపావళి, ఛత్ పూజ ఆ తర్వాత పెళ్లిళ్ల సీజన్‌తో భారత ఆర్థిక వ్యవస్థ ఊపందుకోనుందని CAIT అంచనా వేసింది

ఆంధ్రప్రదేశ్

నేపాల్ లో ఉన్న భారతీయుల కొరకు భారత రాయబార కార్యాలయం (ఖాట్మండు), రాష్ట్ర ప్రభుత్వాల హెల్ప్ లైన్ నెంబర్లు.

సెప్టెంబర్ 11 పున్నమి ప్రతినిధి @ నేపాల్ లో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, నేపాల్ లో ఉన్న భారతీయుల సహాయార్థం భారత రాయబార కార్యాలయం (ఖాట్మండు): +977 – 980 860 2881 / +977 – 981 032 6134 ఈ నెంబర్లకు సాధారణ కాల్స్ తో పాటు వాట్సాప్ లో కూడా సంప్రదించవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు నేపాల్ లో చిక్కుకుపోయి ఏదైనా అత్యవసర సహాయం లేదా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, ఢిల్లీలోని ఏపీ భవన్ : +91 9818395787 మరియు APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లు: 0863 2340678, వాట్సాప్: +91 8500027678, ఇమెయిల్: helpline@apnrts.com మరియు info@apnrts.com లనైనా సంప్రదించగలరు.

క్రైమ్

శంషాబాద్ విమానాశ్రయంలో 14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

సెప్టెంబర్ 11 పున్నమి ప్రతినిధి @హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం భద్రత అధికారులు బుధవారం రూ.14కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్నారు. బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 13.9 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ రిజ్వీ గా భద్రత అధికారులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ రూ.14 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసి డ్రగ్స్, గంజాయి రవాణా కట్టడికి ప్రయత్నిస్తున్నప్ప టికి రాష్ట్రంలో తరుచు గంజాయి, డగ్ర్స్ దందాలు వెలుగుచూస్తున్న తీరు సమస్య తీవ్రతను చాటుతుందంటున్నారు నిపుణులు. ఇటీవల ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్ లో రూ.12వేల కోట్ల డ్రగ్స్ పట్టుకోవడం చూస్తే రాష్ట్రంలో మరింత భద్రత పెంచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.