Wednesday, 6 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ఏపీలోని ఆటో డ్రైవర్లకు సీఎం దసరా కానుక

ఆటో డ్రైవర్లకు రూ.15000 ఆర్థిక సాయం సెప్టెంబర్ 11 పున్నమి ప్రతినిధి @ ఏపీలోని ఆటో డ్రైవర్లకు సీఎం నారా చంద్రబాబు నాయుడు దసరా కానుక ప్రకటించారు. ఆటో డ్రైవర్లకు రూ.15000 ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. వాహనమిత్ర కింద రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ప్రతి ఏటా రూ.15000 అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ ఏడాది దసరా రోజున రూ.15000 ఇస్తామని అనంతపురం సభలో ప్రకటించారు. అలాగే రూ.2.5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. ఎన్డీఏ ప్రభుత్వం అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను నిర్వహించింది. ఈ సభకు హాజరైన సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం వాహనమిత్ర కింద ఏటా రూ.15 వేలు అందిస్తామని ప్రకటించారు. మరోవైపు ఏపీలో స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఉచిత బస్సు పథకం అమలుతో ఆర్టీసీ బస్సులలో ఆక్యుపెన్సీ పెరిగింది. మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో తమ ఉపాధికి గండి పడిందని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. ఉచిత బసు పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆటోలకు గిరాకీ తగ్గిందని.. తమ కుటుంబాలను పోషించుకోవటం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు కోరుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మహాలయ అమావాస్య సెప్టెంబరు 22 నుండి దసరా సెలవులు ఇవ్వాలి… ఆప్టా

సెప్టెంబర్ 10 పున్నమి ప్రతినిధి @ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో విజయ దశమి (దసరా) ముఖ్యమైనది. ఈ పండగ కోసం గతములో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహాలయా అమావాస్య నుంచి దశమి వరకు సెలవులు ఇచ్చే అనవాయితీ ఉంది. అయితే ఈ సంవత్సరం కొత్తగా 24 వ తేదీ నుండి ఇచ్చారు. కాబట్టి దానిని మార్చి రాష్ట్రం లో అన్ని పాఠశాలాలకు మహాలయ అమావాస్య నుండి సెలవులు అనగా సెప్టెంబర్ 22 నుండి సెలవు లు ప్రకటించాలని ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) సంఘం పక్షాన మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ బాబు కి పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కి మరియు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కి లేఖ ద్వారా వ్రాత పూర్వకంగా విజ్ఞప్తిచేయడం జరిగింది.మన ప్రక్క తెలుగు రాష్ట్రం తెలంగాణ లో కూడా మహాలయ అమావాస్య నుండి పాఠశాల లకు సెలవులు ప్రకటించారని, మన రాష్ట్రం లో ఈ నెల 24 నుంచి సెలవులు ఇచ్చారని, అలా కాకుండా మహాలయ అమావాస్య నుండి అనగా నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవలు ఇచ్చి హిందువుల మనోభావాలను గౌరవించాలని ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు షబ్బీర్ హుస్సేన్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి షానవాజ్ హుస్సేన్ మాజింద్రాణి పత్రిక సమావేశంలో తెలియచేశారు.

ఆంధ్రప్రదేశ్

హిందీ లాంగ్వేజ్ సలహా కమిటీ సభ్యుడిగా సాదిక్

పున్నమి న్యూస్ (కోనసీమ) సీనియర్ జర్నలిస్ట్ రమణ: నీతి ఆయోగ్/ హోం మంత్రిత్వ శాఖ ద్వారా నామినేట్ చేయబడిన అఫిషియల్ లాంగ్వేజ్ హిందీ సలహా కమిటీ సభ్యుడు గా షంసు సాదిక్ నియమితులయ్యారు. మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గా బాధ్యత నిర్వహిస్తున్న సాదిక్ కు జాతీయ స్థాయి నామినేటెడ్ పోస్ట్ కేంద్ర హోమ్ శాఖ నుండి ఆదేశాలు అందాయి అని తెలియచేశారు. ప్రభుత్వంతో కలిసి పనిచేయటానికి అవకాశం ఇచ్చిన ప్రధాన మంత్రి మోదీ కి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి ఆంధ్ర రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ కి, రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి ప్రత్యేకం గా కృతజ్ఞతలు తెలియచేశారు. వారితో పాటు డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ కి, జాతీయ కౌన్సిల్ సభ్యులు మాజీ శాసన సభ్యులు వేమా కి, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ కి, మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇంచార్జ్ పొట్లూరి రామ్ మోహన్ రావు కి, అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ కర్రి చిట్టిబాబు కి గుంటూరు జిల్లా ఇంచార్జ్ రామకృష్ణారెడ్డి కి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం కి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్ ఇళ్ల సత్యనారాయణ కి, డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పూర్వపు అధ్యక్షులు యాళ్ళ దొరబాబు కి, జిల్లా ప్రధాన కార్యదర్శులు సలాది వీర బాబు కి,చీకురుమిల్లి శ్రీనివాస్ కి,కొప్పనాతి దత్తాత్రేయ కి మరియు రాష్ట్రం లో ఉన్న జాతీయ రాష్ట్ర జిల్లా నాయకులు కార్యకర్తలు మరియు వివిధ బాధ్యతలో ఉన్న బీజేపీ పార్టీ శ్రేణులు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను.

తెలంగాణ

నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ నాల్గవ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్న : రాష్ట్ర గవర్నర్

నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) ఈనెల 15(సెప్టెంబర్ 15)న రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నాల్గవ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్న దృశ్య అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. బుధవారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి మహాత్మ గాంధీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి రాష్ట్ర గవర్నర్ పాల్గొననున్న నాతకోత్సవ వేదికను పరిశీలించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ రాక సందర్భంగా ముందు నుండే ఎంజి యూనివర్సిటీలో పూర్తిస్థాయిలో భద్రత ఏర్పాటు చేస్తామని, తనిఖీలు ఉంటాయని, గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే ఆరోజు లోపలికి అనుమతించడం జరుగుతుందని గేటు వద్ద తనకి కోసం యూనివర్సిటీ తరఫున నలుగురు బృందం సభ్యులు ఏర్పాటు చేయాలని వైస్ ఛాన్సలర్ లను కోరారు. రాష్ట్ర గవర్నర్ కార్యక్రమానికి హాజరయ్యే అందరి పేర్ల జాబితాను ముందే సమర్పించాలని ఆయన కోరారు.

తెలంగాణ

మావోయిస్టుల సంచలన లేఖ విడుదల

మావోయిస్టు పార్టీ 21వ స్థాపన వార్షికోత్సవాలను సెప్టెంబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు దేశవ్యాప్తంగా విప్లవస్ఫూర్తితో నిర్వహించుకుందామని మావోయిస్టు పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది ఆ మేరకు బుధవారం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పేరుతో ప్రకటన విడుదలైంది. పార్టీని, పిఎల్‌జిఏని, ఐక్య సంఘటనను, విప్లవోద్యమాన్ని కాపాడుకుందామని మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. విప్లవోద్యమ వెనుకంజస్థితిని అధిగమించే సమర్థతలను పెంచుకుందామని పార్టీ పిలుపునిచ్చింది. విప్లవ ప్రతిఘాతక కగార్ యుద్దాన్ని విఫలం చేసేందుకు విశాల ప్రజారాశులను, వర్గ పోరాటంలో గెరిల్లా యుద్ధంలో సమీకరిద్దామని కోరింది. శత్రువుకు అభేద్యంగా పార్టీని తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చింది.

ఖమ్మం

బీజేపీ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో సేవ హి పక్షం కార్యశాల..

ఖమ్మం పున్నమి ప్రతినిధి భారతీయజనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆద్య క్షతన సేవ హి పక్షం కార్యశాల బుధవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయం లో జరిగింది ఈ కార్యక్రమం కి. ముఖ్యఅతిధులు గా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ గోలి మధుసూదన్ రెడ్డి , బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు లు ముఖ్యఅతిధులు గా పాల్గొని పక్షం రోజులు చేయవలసిన సేవా కార్యక్రమాలు గురించి దిశా నిర్దేశం చేశారు అనంతరం నూతన ముగా రాష్ట్ర బీజేపీ కోశాధికారి గా నియమితులు అయినా దేవకీ వాసు దేవా రావు ని సన్మానించారు. కార్యక్రమం లో నున్న రవి, పుల్లారావు యాదవ్ సుబ్బారావు గారు సేవ పక్షం ఖమ్మం జిల్లా కన్వీనర్ అల్లిక అంజయ్య కోకన్వీనర్ మంద సరస్వతి దుద్దుకూరి కార్తీక్, యార్లగడ్డ రాఘవ, N. శ్రీనివాస్, టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్, పడిగల మధు, శ్రీమతి మణి తదితరులు పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల

రాజీ మార్గం రాజమార్గం – జాతీయ లోక్ అదాలత్

అలంపూర్ : సెప్టెంబర్ 10 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, జిల్లా కోర్టులో ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎన్.ప్రేమలత తెలిపారు. గద్వాల కోర్టు మరియు అలంపూర్ కోర్టులలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ వి.శ్రీనివాస్ తో కలిసి జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు సత్వర న్యాయం పొందవచ్చని తెలిపారు. సెప్టెంబర్ 13న శనివారం గద్వాల్‌, అలంపూర్ లోని న్యాయస్థానలో లోక్‌అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాజీ ప‌ద్ద‌తిలో క్రిమిన‌ల్, సివిల్, ఆస్తి విభజన, కుటుంబపరమై, వైవాహిక జీవితం సంబంధిత, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్, రోడ్డు ప్రమాదాలు ఇతర కేసులపై సంబంధించిన కేసులను ఇరుపక్షాల సమ్మతితో రాజీతో పరిష్కారమయ్యే కేసులన్నింటినీ పరిష్కరించడం జరుగుతుందని వివరించారు. జాతీయ న్యాయ సేవా సంస్థ ప్రతిష్టాత్మకంగా ఈ లోక్ అదాలత్ ను నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో పేరుకు పోయిన పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడానికి విశేష కృషి చేస్తుందన్నారు. రాజీ మార్గం రాజమార్గమని చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని సూచించారు.గతంలో 8195 కేసులు పరిష్కరించి మన జిల్లా, రాష్ట్రంలోనే 11వ స్థానంలో నిలిచిందని తెలిపారు. జిల్లా ప్రజలంతా తమ కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకొని శాంతియుతంగా, సంతోషంగా జీవించాలని ఆమె కోరారు.

జోగులాంబ గద్వాల

పిడుగు పడి ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు.

అలంపూర్ : సెప్టెంబర్ 10 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలం భూంపురం గ్రామం బుధవారం సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో సీడిపత్తి చేస్తున్న కూలీలు వేప చెట్టు కిందికి వెళ్లారు ఆ క్షణమే పిడుగు పడింది ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు ఒక యువకుడు ఉన్నారు. పార్వతమ్మ (22) సౌభాగ్య (40), సర్వేస్ (20) మృతి చెందారు. ఇద్దరికీ తీవ్ర గాయపడిన వారిని‌ చికిత్స కోసం గద్వాల జిల్లా‌ ఆసుపత్రికి తరలించారు.‌ మృతి చెందిన వారు భూంపురం గ్రామానికి చెందినవారుగా పోలీస్ అధికారులు గుర్తించారు.

అన్నమయ్య

గరుగుపల్లెలో వినాయక స్వామి ఆలయంలో ఘనంగా మండల పూజలు

చిట్వేల్, సెప్టెంబర్ 10 ( పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం గరుగుపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ వినాయక స్వామి ఆలయంలో 39వ మండల పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నాయిని బ్రాహ్మణులు, గొల్లవారు, రజకులు కలిసి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి, శిల్పకళా వైభవంతో గుడిని అలంకరించారు. సెప్టెంబర్ 10 బుధవారం నాడు నాయిని బ్రాహ్మణ సంఘానికి చెందిన మారపురం గురవయ్య కుటుంబం ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య వేకువజాము నుండి పూజలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు అభిషేకం, అర్చనలు జరగగా, సన్నాయి, డోలు, మృదంగం, నాదస్వరాల నాదంతో గ్రామమంతా భక్తి రసమయంగా మారింది. భక్తులు వినాయకుని పాటలకు పరవశించి స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పూజల అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు, పుష్పాలు సమర్పించి, నైవేద్యంగా పళ్ళు, పలహారాలు సమర్పించారు. అనంతరం భక్తులందరికీ అన్నదాన వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని బ్రాహ్మణ సంఘానికి చెందిన సభ్యులను గురవయ్య వారు శాలువాలతో ఘనంగా సన్మానించారు.

నాగర్‌కర్నూల్

గర్భిణి కి రక్తదానం చేసిన కానిస్టేబుల్ జితేందర్

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10 నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ ఉద్యోగం అంటేనే బందోబస్తులు, కోర్టు డ్యూటీలు, ఇలా రకరకాల పనులతో బిజిగా ఉండడం అందరికి తెలిసిందే కాని ఓ కానిస్టేబుల్ మాత్రం పోలీస్ ఉద్యోగంతో పాటు మానవత్వం, తోటి వారికి సాయం కూడా చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి చెర్ల తిరుమలాపురం గ్రామానికి చెందిన యాదమ్మ అనే గర్భిణి కాన్పు కోసం వచ్చింది. కాని డెలివరీ కోసం ఆపరేషన చేయాల్సిందేనని యాదమ్మ కు రక్తం తక్కువగా ఉందని డాక్టర్లు ఆమె భర్త విష్ణుకు తెలిపారు. దీంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతుండగా రోడ్ సేప్టీ ప్రెసిడెంట్ ఎద్దుల వెంకటేష్ వారి పరిస్థితిని గమనించాడు. వెంటనే బిజినపల్లి పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న కానిస్టేబుల్ జితేందర్ ను రక్తదానం చేయాలని కోరాడు. దీనికి వెంటనే అంగీకరించిన జితేందర్ వెంటనే గర్భిణి యాదమ్మ కు కావాల్సిన రక్తాన్ని దానం చేశాడు.ఆపరేషన్ కోసం కావాల్సిన రక్తాన్ని కానిస్టేబుల్ జితేందర్ మరో వ్యక్తి తిప్పర్తి గోపాల్ ఇద్దరు ఇవ్వడంతో డాక్టర్లు ఆపరేషన్ చేసేందుకు సిద్దమయ్యారు.కానిస్టేబుల్ జితేందర్ ఇటీవల బిజ

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.