Wednesday, 6 May 2026

Blog

తిరుపతి

పి ఆర్ సి కమిటీ నియమించాలి-ఎస్టియు డిమాండ్

ఈరోజు రాష్ట్రోపాధ్యాయ సంఘం,శ్రీకాళహస్తి మండల శాఖ ఆధ్వర్యంలో సమస్యల సేకరణ,సభ్యత్వ స్వీకరణ కార్యక్రమం జరిగినది.ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,వేడం నందు ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఆలత్తూరు జగన్నాథం మాట్లాడుతూ పిఆర్సి కమిటీ వెంటనే నియమించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని,దసరా కైనా ఉపాధ్యాయ,ఉద్యోగ,కార్మికులకు కరువు భత్యాలు వెంటనే ప్రకటించాలని మరియు ఉపాధ్యాయులకు చెల్లించవలసిన పెండింగ్ బకాయిలు,రిటైర్మెంట్ ఉద్యోగస్తుల పెన్షన్ గ్రాట్యూటీ చెల్లింపులు,ఈ ఎల్,ఏపీ జిఎల్ ఐ,జడ్పిపిఎఫ్ తదితర రుణాల బకాయిలు సత్వరమే చెల్లించేలా ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు పాల్గొన్నారు.

తిరుపతి

ప్రధాన కాలువలలో చెత్త తొలగింపు.

శ్రీకాళహస్తిలో పట్టణం లో మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యం లో వివిధ ప్రాంతాలలో మున్సిపల్ సిబ్బంది చే మురికి కాలువల్లో చెత్తను తొలగించారు.రానున్న వర్గాలను దృష్టిలో ఉంచుకొని కాలువల్లోని చెత్తను తొలగించకుంటే వర్షాలు పడితే ఎక్కడికక్కడ నీరు ఆగిపోయి రోడ్లపై వచ్చే అవకాశం ఉండటం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

తిరుపతి

కళాశాల బాలికలకు ఎయిడ్స్ పై అవగాహన సదస్సు

శ్రీకాళహస్తి పట్టణం లోని గవర్నమెంట్ జూనియర్ బాలికల కళాశాల నందు విద్యార్థులకు జిల్లా వైద్య ఆరోగ్య సంస్థ ఆదేశాలు మేరకు స్టెప్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి/ ఎయిడ్స్ నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్టెప్స్ ప్రాజెక్ట్ మేనేజర్ భాస్కర్,స్టెప్స్ సిబ్బంది ఏఎన్ఎం మౌనిక,ఓ ఆర్ డబ్ల్యు ఎస్ కళావతి,సునీత,దేవేంద్ర మరియు కళాశాల సిబ్బంది పాల్గొనడం జరిగింది.

E-పేపర్

టీటీడీ కళ్యాణ మండపం

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజక వర్గంలో ఉన్న టీటీడీ కళ్యాణమండపాన్ని ఒక శ్యామ్యానా షాప్ నడిపే వ్యక్తి గోడౌన్ గా వాడుకుంటున్నాడు అని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేదు అని, దీన్ని వెంటనే ప్రభుత్వం పేద ప్రజల కోసం టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కళ్యాణ మండపాన్ని చౌకగా ప్రతి మధ్య తరగతి పేద ప్రజలు పెళ్లి చేసుకుంటే అవకాశం కల్పించే విధంగా ప్రైవేటు వ్యక్తుల కబంధహస్తాల నుంచి వెంటనే షామియాన గోడౌన్ ను ఖాళీ చేయించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ పూల భాస్కర్ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో రాజంపేట మండల అధ్యక్షుడు మహదేవయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుమంత్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

మొక్కలు నాటి సంరక్షించాలి : నల్గొండ కలెక్టర్ పిలుపు

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెదకాపర్తి గ్రామంలో ఉన్న దశమి ల్యాబ్స్ ఫార్మా సంస్థలో బుధవారం వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటుతున్నా, వాటిని సంరక్షించకపోవడం వల్ల అవి ఎండిపోతున్నాయని, అలాంటి నిర్లక్ష్యం వద్దని స్పష్టం చేశారు.నాటిన మొక్కలకు నిరంతర నీరు అందేలా చూడాలని, అవసరమైతే డ్రిప్ పద్దతి లేదా ట్యాంకర్ల ద్వారా నీరు పోయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో కంపెనీ చేస్తున్న కృషిని అభినందించిన కలెక్టర్, ప్యాక్టరి లో భద్రత నియమాలను కచ్చితంగా పాటించాలని సిబ్బందికి సూచించారు. అవసరమైతే మియావాకి పద్ధతిలో చిట్టడవులను అభివృద్ధి చేయడం కోసం ఆలోచించాలన్నారు. భవిష్యత్తులో నల్గొండ వంటి ప్రాంతాలకు పచ్చదనం ఎంతో అవసరమని అందుకు అందరూ విస్తృతంగా మొక్కలు నాటాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

హైదరాబాద్

రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

పున్నమి ప్రతినిధి గోషామహల్ఎ మ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేసారు కేంద్ర బీజేపి అధిష్ఠానం నుంచి పిలుపు వస్తే వెళ్లి కలుస్తా అని నన్ను పిలిస్తే BJPలో చేరడానికి సిద్ధంగా ఉన్నాను అని నేను MLA పదవికి రాజీనామా చేయను.. ఏం చేస్తారు అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాజీనామా చేస్తే నేనూ చేస్తాను అని ఇద్దరం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తాంఅని ఎవరు గెలుస్తారో చూద్దాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు రబ్బర్‌ స్టాంప్‌గా మారారు-రాజాసింగ్‌ విమర్శలు చేసారు BJP కొత్త కమిటీలో హైదరాబాద్‌ నేతలే ఉన్నారు అని కమిటీ రాంచందర్‌రావు వేశారా.. కిషన్‌రెడ్డి వేశారా అని అయన ప్రశ్నించారు ఈ కమిటీతో అధికారంలోకి వస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని BJPలో ఎప్పుడు తప్పులు జరిగినా నేను మాట్లాడతా అని రాజాసింగ్ అన్నారు.

తెలంగాణ

చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా జరిపిన: రజక నాయకులు

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) శాలిగౌరారం మండల కేంద్రంలో ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, రజక జాతి ముద్దుబిడ్డ చాకలి ఐలమ్మ గారి వర్ధంతిని శాలిగౌరారం మండల రజక సంఘము అధ్యక్షులు బాసాని వెంకన్న ఘనంగా నిర్వహిచారు. ఈ కార్యక్రమానికి హాజరైన శాలిగౌరారం మండల రజక సంఘం ఉపాధ్యక్షులు తాందారి సోములు, కార్యదర్శి తాందారి నాగయ్య, మాజీ అధ్యక్షులు అక్కెనపల్లి శ్రీరాములు మరియు ఇతర నాయకులు పాల్గొని ఐలమ్మకు ఘనంగా నివాళులు అర్పించారు.

ఆంధ్రప్రదేశ్

ఎయిమ్స్ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ బి. సుగుణకు దక్కిన మరో అరుదైన గౌరవం

విశాఖపట్నం సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ద్వారకా నగర్ ఫోర్త్ లైన్ లోని ఎయిమ్స్ కాలేజీ నందుకు పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా ఏర్పాటైన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యకలాపాలను ఇంస్టాగ్రామ్ మరియు పత్రికలలో తిలకించి ఆకర్షితులై ఆయనకు మీడియాపై ఉన్న అభిమానంతో సంబంధిత సిజెడబ్ల్యూ టీం తో సంప్రదింపులు జరిపారు. సుగుణకి మీడియా పట్ల ఉన్న ఆసక్తిని గౌరవించి,ఆయన గతంలో చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఎయిమ్స్ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ సుగుణ గౌరవాధ్యక్షులు పదవికి అర్హుడని సీజెడబ్ల్యు కమిటీ నిర్ణయం తీసుకొని ఎయిమ్స్ కాలేజీ ఆవరణలో ఆయన చాంబర్లో పత్రిక సముఖంగా ఆయనను గౌరవ అధ్యక్షులుగ ప్రకటిస్తూ దుశాలవతో ఆయనను సత్కరించి పుష్పగుచ్చం అందజేసిన సిజెడబ్ల్యూ అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్ ఉపాధ్యక్షులు రేగిడి రూప గుణశేఖర్ మరియు కార్యవర్గ సభ్యులు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిమ్స్ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ సుగుణ సిజెడబ్ల్యూ టీం కి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తను అందుబాటులో ఉంటానని కృతజ్ఞతలు తెలియజేశారు.

అన్నమయ్య

చిట్వేల్ మండలంలో రైతుల అవగాహన కార్యక్రమం

చిట్వేల్, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) చిట్వేల్ మండలంలోని సి.ఎం. రాచపల్లి, నేతివారిపల్లి గ్రామాల్లో మంగళవారం రైతులకు నానో ఎరువులు, జీవన ఎరువులు, ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి శ్రీ జి. సుధాకర్ మాట్లాడుతూ, రైతులు శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ సూచనలను పాటిస్తే వ్యవసాయంలో ఖర్చులు తగ్గి అధిక దిగుబడులు సాధ్యమవుతాయని తెలిపారు.భూసార పరీక్షల ఆధారంగా పంటలకు తగిన సేంద్రియ, పచ్చి రొట్ట ఎరువులు వినియోగిస్తే నేల ఆరోగ్యం కాపాడటంతో పాటు నాణ్యమైన పంటలు పండించవచ్చని ఆయన వివరించారు. నానో యూరియా, నానో డి.ఏ.పి. వాడకం ద్వారా ఎరువుల వృథా తగ్గుతుందని, జీవన ఎరువులైన రైజోబియం, అజోల్లా, అజోస్పిరిల్లుమ్ ద్వారా నత్రజని అందించి రసాయన ఎరువుల వినియోగం తగ్గించవచ్చని తెలిపారు.అలాగే ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఘన జీవామృతం, బీజామృతం వినియోగించడం ద్వారా రసాయన ఎరువుల ఖర్చు తగ్గి మంచి దిగుబడులు వస్తాయని రైతులకు వివరించారు. యూరియాను సమతుల్యం గా వినియోగించకపోతే చీడపీడలు అధికమవుతాయని హెచ్చరించారు.మండలంలో యూరియా కొరత లేదని, అవసరం మేర రైతు సేవా కేంద్రాలు మరియు ప్రైవేట్ డీలర్లకు కేటాయింపులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. రైతులు పంట నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని, అవసరానికి మించి నిల్వ చేయరాదని, అక్రమంగా నిల్వ చేసినా లేదా అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సి.ఎం. రాచపల్లి సర్పంచ్ రవికుమార్ రాజు, నీటి సంఘం అధ్యక్షులు ధర్మయ్య, సురేష్ కుమార్ రాజు, రైతు సేవా కేంద్రం ఉద్యాన సహాయకులు లక్ష్మీనారాయణ, ప్రసాద్ నాయక్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.

తిరుపతి

కట్ట పుట్టాలమ్మను దర్శించుకొన్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ దొడ్లమిట్ట గ్రామంలో వెలిసిన కట్టపుట్టాలమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది.బుధవారం తుడా చైర్మన్,టీటీడీ బోర్డు బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి జాతరలో పాల్గొని కట్టపుట్టాలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.ఆలయ కమిటీ సభ్యులు తుడా చైర్మన్ ని ఘనంగా ఆహ్వానించి అమ్మవారి దర్శన ఏర్పాట్లను చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.దర్శన అనంతరం తుడా చైర్మన్ మాట్లాడుతూ మహిమాన్వితమైన కట్ట పుట్టాలమ్మ జాతర అత్యంత వైభవంగా జరగడం సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి చల్లని దీవెనలు ప్రజలందరిపై ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.